ప్రేమలో పడ్డప్పుడు గాల్లో తేలుతుంటారు. అదే బ్రేకప్ అయ్యాక ఈ ప్రేమాగీమా జోలికే వెళ్లొద్దని బలంగా ఫిక్సవుతుంటారు. కానీ కొన్నాళ్లకు మళ్లీ లవ్‌లో పడటం.. చివరకూ అదీ బ్రేకప్ అవడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్న శృతి హాసన్(Shruti Haasan) ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన్ డిలీట్ చేయడంతో ఇది నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. అంతే కాదు పెళ్లిపై ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది.
ప్రేమ ఓకే, పెళ్లే వద్దు!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. 'రిలేషన్‌షిప్స్ అంటే నాకిష్టం. ఆ ప్రేమ, అనుబంధాలన్నీ నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా' ఉంది అని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కమల్ హాసన్ (Kamal Haasan)- సారిక(Sarika) గురించి మాట్లాడుతూ.. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. మా అమ్మానాన్న ఈ ప్రపంచంలోనే ఉత్తమ జంట అని భావించాను.
విడిపోతేనే హ్యాపీ అంటే..
ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు. కలిసే సెట్స్‌కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లం. కానీ ఎప్పుడైతే వాళ్లిద్దరూ విడిపోయారో అంతా మారిపోయింది. మా కుటుంబమంతా బాధపడ్డాం. కలిసుండటానికి ప్రయత్నించారు, కానీ కుదర్లేదు. అయినా బలవంతంగా కలిసుండటం కన్నా విడిపోతేనే సంతోషంగా ఉంటామనుకుంటే అది మాక్కూడా మంచిదే! అని చెప్పుకొచ్చింది.
సినిమా..
ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ కూలీ సినిమాలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ 2లోనూ భాగం కానుంది. కాగా కమల్- సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2004లో కమల్- సారిక విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment