Sarika
-
ప్రేమించిన వ్యక్తి కోసం సారిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది: నటుడు
మిసెస్ సినిమా (Mrs Movie)లో తన నటనతో ప్రశంసలు అందుకుంటున్నాడు సీనియర్ నటుడు కన్వల్జిత్ సింగ్ (Kanwaljit Singh). తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడు గతంలో జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు. కన్వల్జిత్ మాట్లాడుతూ.. 1985లో ఛప్టే ఛప్టే సీరియల్ చేశాను. సారిక (Sarika) నాతో జోడీ కట్టింది. కానీ అప్పుడు తను మద్రాస్‌లో ఉన్న ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. మళ్లీ సెట్‌కు రానేలేదు.ఆమె వెళ్లిపోవడం వల్ల..దానివల్ల ఒకరకంగా మంచే జరిగిందనుకుంటాను. సారిక స్థానంలో నటి అనురాధ పటేల్‌ను తీసుకున్నారు. అనురాధ నాకు జంటగా నటించింది. సీరియల్ షూటింగ్ సమయంలో మేము బాగా క్లోజ్ అయ్యాం. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ (Kamal Haasan) కోసమే సారిక సీరియల్ వదిలేసుకుని మరీ వెళ్లిపోయింది. అప్పటికే కమల్‌కు వాణి గణపతితో పెళ్లవగా.. 1984లో ఆమెకు విడాకులిచ్చేశాడు. కమల్ రిలేషన్స్..1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2004లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కమల్.. నటి గౌతమిని ప్రేమించాడు. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. అలా 2005-2016 వరకు కలిసున్నారు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు.చదవండి: ‘హాలీవుడ్ రిపోర్టర్’పై అల్లు అర్జున్.. అరుదైన ఘనత -
రిలేషన్షిప్ ఓకే.. పెళ్లంటేనే భయంగా ఉంది: శృతి హాసన్
ప్రేమలో పడ్డప్పుడు గాల్లో తేలుతుంటారు. అదే బ్రేకప్ అయ్యాక ఈ ప్రేమాగీమా జోలికే వెళ్లొద్దని బలంగా ఫిక్సవుతుంటారు. కానీ కొన్నాళ్లకు మళ్లీ లవ్‌లో పడటం.. చివరకూ అదీ బ్రేకప్ అవడం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్న శృతి హాసన్(Shruti Haasan) ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను హీరోయిన్ డిలీట్ చేయడంతో ఇది నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. అంతే కాదు పెళ్లిపై ఆసక్తి కూడా లేదని తేల్చి చెప్పింది.ప్రేమ ఓకే, పెళ్లే వద్దు!తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి వివాహం గురించి మాట్లాడింది. 'రిలేషన్షిప్స్ అంటే నాకిష్టం. ఆ ప్రేమ, అనుబంధాలన్నీ నచ్చుతాయి. ప్రేమలో మునగడం ఇష్టమే కానీ పెళ్లి చేసుకుని ఒకరితో ఎక్కువ అటాచ్ అవ్వాలంటేనే భయంగా' ఉంది అని చెప్పుకొచ్చింది. తన పేరెంట్స్ కమల్ హాసన్ (Kamal Haasan)- సారిక(Sarika) గురించి మాట్లాడుతూ.. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. మా అమ్మానాన్న ఈ ప్రపంచంలోనే ఉత్తమ జంట అని భావించాను. విడిపోతేనే హ్యాపీ అంటే..ఇద్దరూ కలిసి పని చేసుకునేవారు. కలిసే సెట్స్‌కు వెళ్లేవారు. అమ్మ కాస్ట్యూమ్ డిజైన్స్ చేసేది. సంతోషంగా, సరదాగా ఉండేవాళ్లం. కానీ ఎప్పుడైతే వాళ్లిద్దరూ విడిపోయారో అంతా మారిపోయింది. మా కుటుంబమంతా బాధపడ్డాం. కలిసుండటానికి ప్రయత్నించారు, కానీ కుదర్లేదు. అయినా బలవంతంగా కలిసుండటం కన్నా విడిపోతేనే సంతోషంగా ఉంటామనుకుంటే అది మాక్కూడా మంచిదే! అని చెప్పుకొచ్చింది.సినిమా..ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ కూలీ సినిమాలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ సలార్ 2లోనూ భాగం కానుంది. కాగా కమల్- సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2004లో కమల్- సారిక విడాకులు తీసుకున్నారు.చదవండి: షాకింగ్.. యూట్యూబ్ నుంచి పుష్ప 2 సాంగ్ డిలీట్ -
బస్తీ ప్రేమకథ
‘బందూక్, శేఖరంగారి అబ్బాయి’ చిత్రాల ఫేమ్ అనురూప్ రెడ్డి హీరోగా నటించిన మూడో చిత్రం ‘ప్రేమించొద్దు’. దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. శిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో 5 భాషల్లో నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న విడుదలకానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తెలుగులో జూన్ 7న విడుదల చేస్తాం.ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘తల్లిదండ్రులు, పిల్లలు చూసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు సూపర్ వైజింగ్ ప్రోడ్యూసర్ నిఖిలేష్ తొగరి. ‘‘ఈ సినిమా ఎంతో వాస్తవంగా ఉంటుంది’’ అన్నారు అనురూప్ రెడ్డి. నటీమణులు సంతోషి, సోనాలీ గర్జె, మానస మాట్లాడారు. -
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణం లో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షిక తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నాం’అన్నారు. -
ఈ ఫోటోలోని వ్యక్తి స్టార్ హీరోయిన్ మదర్.. ఎవరో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గతేడాది రిలీజైన సలార్‌తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. అయితే గతంలో ఆమె సింగర్‌గా కూడా సుపరిచితమే. ప్రస్తుతం జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు పాట పాడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన తల్లిదండ్రుల ఫోటోలతో వీడియోను రూపొందించింది. నాకు అమ్మా, నాన్న అంటే చాలా ఇష్టం.. వారిద్దరు నా జీవితంలో అద్భుతమైన. ప్రత్యేక వ్యక్తులని తెలిపింది. వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టమని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మొదట వాణి గణపతిని పెళ్లాడిన కమల్ హాసన్.. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత సారికను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అక్షర హాసన్, శృతి హాసన్ జన్మించారు. కాని అనివార్య కారణాలతో 1988లో పెళ్లి చేసుకున్న కమల్, సారిక 2004లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
రెండు సార్లు విడాకులు.. మూడోసారి లివ్ ఇన్ రిలేషన్ షిప్.. స్టార్ హీరో లైఫ్ ఇదే!
నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్.. ఇటీవలే నటుడిగా 64 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఆరు భాషల్లోని చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 960లో ‘కలత్తూరు కన్నమ్మ’ సినిమాలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమల్.. ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్.. తన వైవాహిక జీవితంలో మాత్రం గెలవలేకపోయారు. రెండు సార్లు పెళ్లి చేసుకున్న కమల్ హాసన్ ఇద్దరికీ విడాకులు ఇచ్చి.. నటి గౌతమితో దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. బాలనటుడిగా నటించి సినీ రంగ ప్రవేశం చేసిన కమల్‌హాసన్ .. తమిళ సినిమాకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, రచయితగా పేరుపొందారు. కమల్ హాసన్ తమిళంతో పాటు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. అలా సినీ జీవితంలో ఎన్నో విజయాలను చవిచూసిన కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో ఓడిపోయారు. శ్రీవిద్యతో పరిచయం కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసిన నటించిన అపూర్వ రాగంగల్ సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే కొన్నేళ్లకే వీరిద్దరి బంధం ముగిసింది. ఆ తర్వాత శ్రీవిద్య మలయాళ చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న జార్జ్ థామస్‌ను పెళ్లాడింది. 2006లో శ్రీవిద్య ఆసుపత్రిలో ఉండగా పరామర్శించడానికి వెళ్లిన కమల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వాణి గణపతితో మొదటి పెళ్లి వాణి గణపతిని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకున్నారు కమల్ హాసన్. వాణీ గణపతి శాస్త్రీయ నృత్య కళాకారిణి. అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నారు. సారికను రెండో పెళ్లి చేసుకున్న కమల్ అదే ఏడాల్లోనే కమల్ హాసన్ సారికను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. కమల్ హాసన్ తన రెండో భార్యతో అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే సిమ్రాన్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో సారిక ఆత్మహత్యాయత్నం చేసిందని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. 2002లో వాణితో విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. 2004లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. దీంతో 16 ఏళ్ల వివాహాబంధానికి తెరపడింది. ప్రముఖ తమిళ నటి, సిమ్రాన్ బగ్గా సూపర్‌హిట్ చిత్రం పంచతంత్రంతో సహా పలు సినిమాల్లో కమల్ హాసన్‌తో నటించింది. కమల్ వయసులో ఆమె కంటే 22 ఏళ్లు పెద్దవాడు కావడంతో వారిబంధం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. గౌతమితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ సిమ్రాన్‌కు పెళ్లి కావడంతో ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమితో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. కాగా.. గౌతమికి అప్పటికే పెళ్లయి ఒక కూతురు ఉంది. గౌతమి కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. రెండుసార్లు వైవాహిక జీవితంలో విఫలమైన కమల్ హాసన్ మూడోసారి పెళ్లి చేసుకోలేదు. దీంతో లివ్-ఇన్ రిలేషన్షిప్ కొనసాగించారు. ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరూ దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2017లో తమ బంధానికు గుడ్ బై చెప్పారు. కాగా.. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహ నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. -
రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య
Kamal Haasan Ex Wife Sarika About Her Financial Status: ఒకప్పుడు ఆమె స్టార్ హీరో భార్య, ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ తల్లి.. అయినా ఆమెకు మహమ్మారి కాలంలో ఆర్థిక సమస్యలు తప్పలేదు. లాక్డౌన్ సమయంలో కేవలం 3వేల కోసం ఆమె థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశానని చెప్పడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. ఆమె మరెవరో కాదు లెజెండరి నటుడు, హీరో కమల్ హాసన్ మాజీ భార్య, శుృతి హాసన్ తల్లి సారిక. సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్. కానీ కమల్ హాసన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. ఇక ఆయనతో విడాకుల అనంతరం తిరిగి ముంబైకి వచ్చిన ఆమె మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెజాన్ ప్రైం ‘మోడ్రన్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోని ‘మై బ్యూటీఫుల్ రింకిల్స్’ అనే పార్ట్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు గాను ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కరోనా కాలంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలపై నొరు విప్పింది సారిక. ‘కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చాయి. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్ చేయడం ప్రారంభించాను. అలా ఓ రోజు చూస్తే లైఫ్ రోటీన్‌గా అనిపించింది. చదవండి: బిగ్‌బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్? ఉదయం లేవడం వర్క్‌కు వెళ్లడం.. మళ్లీ రాత్రికి పడుకోవడం. కొత్తగా ఏం అనిపించడం లేదు. దీంతో ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్డౌన్లు వచ్చాయి. దీంతో అయిదేళ్లు ఈజీగా గడిచిపోయాయి. ఈ పాండమిక్ సమయంలో నా దగ్గర ఉన్న సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశా. కానీ వారు కేవలం 2000 నుంచి 2700 వరకు మాత్రమే చెల్లించేవారు. దీంతో తిరిగి సినిమాల్లో నటించడమే మంచిదని నిర్ణయించుకున్నా’ అంటూ సారిక చెప్పుకొచ్చింది. చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఓ స్టార్ హీరోయిన్ తల్లి అయ్యిండి కూడా ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కమల్-సారికలు కొంతకాలం రిలేషన్లో ఉన్న అనంతరం 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లు జన్మించారు. ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న కమల్-సారికలు 2004లో విడాకులు తీసుకున్నారు. -
సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ
ఇద్దరు సెలబ్రిటీలు కలిస్తే భలే ముచ్చటగా ఉంటుంది.. అందునా భిన్నరంగాలకు చెందిన ఇద్దరు. అలా కలసిన వాళ్లే క్రికెట్ స్టార్.. హర్యానా హరికేన్ కపిల్‌దేవ్.., ఫిల్మ్‌స్టార్.. బాలీవుడ్ బ్యూటీ సారిక. వీళ్లిద్దరూ ములాఖాత్ అయ్యేలా చేసింది వెటరన్ స్టార్ మనోజ్ కుమార్ భార్య. ఒక పార్టీలో సారికను కపిల్‌దేవ్‌కు పరిచయం చేసింది. అలా మొదలైంది ఆ ఇద్దరి మధ్య స్నేహం. విరామ సమయాల్లో కలుసుకోవడమూ స్టార్ట్ చేశారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. బంధంగా ఇమిడేందుకూ సిద్ధపడింది. ఆ టైమ్‌లో వీళ్ల లవ్ స్టోరీ హల్చల్ కూడా చేసింది. సారిక ముందే రోమీతో ప్రేమాయణం కపిల్‌దేవ్, సారిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలనూ మోసింది మీడియా. నిజమే అన్నట్టుగా సారికను తన ఊరికి తీసుకెళ్లాడు కపిల్. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. ఇంకేం.. ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంతగా కుతూహలం రేగింది ఇరువురి అభిమానుల్లో. కానీ.. కపిల్ బ్రేక్ చేసుకున్నాడు ఆ బంధాన్ని. కారణం.. సారికకు అతనికి స్పర్థలు రావడం కాదు. రోమీతో స్పర్థలు సర్దుకోవడం. అవును..సారిక.. కపిల్ జీవితంలోకి రాకముందే రోమీతో అతనికి ప్రేమాయణం ఉంది. రోమీ భాటియాను కపిల్‌కు పరిచయం చేసింది అతని అత్యంత ఆప్తమిత్రుడు సునీల్ భాటియా. సారికకు సారీ చెప్పీ రోమీతో లవ్ తొలి చూపులోనే రోమీతో ప్రేమలో పడిపోయాడు కపిల్. ఆమె చురుకుదనం అతన్ని కట్టిపడేసింది. ఆ ప్రేమ అలా సాగుతుండగా.. స్పర్థలు వచ్చాయి. దానికి కారణం.. సారికతో పరిచయం సన్నిహితంగా మెలిగేంత స్నేహంగా మారడమే అంటుంది హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం. అందువల్లే రోమీ మనసు నొచ్చుకొని సైలెంట్‌గా ..కపిల్‌కు దూరంగా ఉండిపోయిందనీ అంటారు కపిల్, రోమీ దోస్తులు కూడా. కాదు.. కపిల్ ప్రపోజ్ చేస్తే ఏమీ చెప్పకుండా మిన్నకుండిపోయింది. ఆ మౌనాన్ని కపిల్ అపార్థం చేసుకుని సారికకు దగ్గరయ్యాడనీ చెప్తారు కపిల్ మిత్రులు. సారికతో కపిల్ పెళ్లి అనే వార్తలు వినే రోమీ మళ్లీ కపిల్‌ను చేరుకుందనీ అంటారు. రోమీని మరచిపోలేని కపిల్ అందుకే వెంటనే సారికకు సారీ చెప్పేసి రోమీ చేయి అందుకున్నాడు.. అని వివరణ ఇస్తారు. కమల్ హాసన్‌తో ప్రేమలో పడ్డ సారిక ఏమైనా ఈ మొత్తం వ్యవహారం సారికను షాక్‌కి గురిచేసింది. జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. కమల్ హాసన్ స్నేహంతో త్వరగానే అందులోంచి బయటపడింది. అదే సమయంలో కమల్‌తో ప్రేమలోనూ పడింది సారిక. మళ్లీ రోమీ, కపిల్ ప్రేమ కథకు వస్తే.. పెళ్లి ప్రపోజల్‌ను ఈసారి కొంచెం సినిమా స్టయిల్లో రోమీ ముందు ఉంచాడట కపిల్. ఎలాగంటే.. ఒకసారి ఇద్దరూ కలసి రైల్లో ప్రయాణిస్తున్నారు (బహుశా ముంబై నుంచి కావచ్చు). సినిమా స్టైల్లో లవ్ ప్రపోజ్ చేసిన కపిల్‌దేవ్ రైలు ఒక అందమైన ప్రదేశానికి రాగానే.. కపిల్ వెంటనే సీట్లోంచి లేచి.. రోమీ ముందు మోకాళ్ల మీద వంగి.. కిటికీలోంచి ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ‘ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌ను ఫొటో తీయగలవా డియర్.. భవిష్యత్‌లో మన పిల్లలకు ఈ ఫొటోస్ చూపిస్తూ మన ఈ ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా వాళ్లతో పంచుకోవచ్చు!’ అంటూ! ఆ మాట విన్న రోమీ సిగ్గు పడిపోయిందట.. పెళ్లికి ఓకే చెప్పేసిందట. అలా కపిల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రోమీ భాటియాను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. పెళ్లి కాకముందు తండ్రి వ్యాపారాలు చూసుకున్న రోమీ పెళ్లయ్యాక కపిల్దేవ్కున్న హోటల్ వ్యాపారాలనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం ఇండియన్ సెలబ్రిటీస్‌లోనే అన్యోన్యమైన జంటగా పేరు కపిల్, రోమీ దంపతులకు. - ఎస్సార్ -
అమ్మానాన్న విడిపోవడం సంతోషమే: శృతీ హాసన్
కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతీ హాసన్. కానీ తనదైన నటతో, ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సింగర్, నటి, డ్యాన్సర్, సంగీత దర్శకురాలిగా.. ఇలా ఎన్నో కళల్లో ఆరితేరిన శృతీ ఏదైనా సూటిగా సుత్తి లేకుండా ముఖం మీదే చెప్పేస్తుంది. తాజాగా ఆమె తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి స్పందించింది. శృతీ హాసన్ బాల్యంలోనే తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోయారు. దీని గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వారు విడిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారికి ఇష్టం లేకపోయినా ఏవేవో కారణాలు చెప్పి బలవంతంగా కలిసుండేలా చేయడం కరెక్ట్ కాదు. వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. నా చిన్నవయసులోనే వారు ఒకరికొకరు దూరమయ్యారు. అదంతా చాలా ఈజీగా జరిగిపోయింది. అయినా కలిసి ఉన్నప్పటికంటే కూడా విడిపోయాకే వారు హ్యాపీగా ఉంటున్నారు' అని చెప్పుకొచ్చింది. ఇక తను ఎక్కువగా తండ్రి కమల్‌కు క్లోజ్ అని చెప్పింది. కమల్ సారికను ప్రేమించి 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 1986లో శృతీ హాసన్ జన్మించింది. 1991లో అక్షర పుట్టింది. అంతలోనే కమల్, సారిక మధ్య మనస్పర్థలు తొంగి చూశాయి. అవి కాస్తా పెద్దది కావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. ఇక అక్షర హాసన్ 2015లో 'షమితాబ్' సినిమాలో తళుక్కున మెరవగా శృతీ హాసన్ తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో రాణిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె 'సలార్'లో జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. చదవండి: నెటిజన్ అడగ్గానే వాట్సాప్ నెంబర్ చెప్పేసిన హీరోయిన్ -
అనుక్షణం ఉత్కంఠ
ప్రముఖ నిర్మాత శోభారాణి తనయుడు రమణ హీరోగా షఫీ, సిమ్రాన్, సారిక, అర్చన, శివణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘పాయిజన్’ (వర్కింగ్ టైటిల్). సీఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె.శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి చక్కని కథతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. తప్పకుండా ఫీల్‌గుడ్ మూవీని అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతోమంది నటీనటుల్ని ఆడిషన్ చేసి, ఎంచుకోవటం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కు హీరో రమణ పర్ఫెక్ట్ చాయిస్’’ అన్నారు. రమణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కర్నీ ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే కథ ఇది. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నేహల్ డి.జె. -
అమ్మా, నాన్న విడిపోవడం సంతోషమే
సినిమా: అమ్మా, నాన్న విడిపోతే ఎవరైనా బాధ పడతారు. అలాంటిది నటి శ్రుతీహాసన్ మాత్రం తనకు సంతోషమే అంటోంది. కమలహాసన్, సారికలు విడిపోయి చాలా కాలం అయింది. కమలహాసన్ చెన్నైలో నివాసం ఉంటుంటే, సారిక ముంబాయిలో ఉంటున్నారు. వారి కూతుళ్లు అయిన శ్రుతీహాసన్, అక్షరహాసన్‌లు అటు తల్లితోనూ, ఇటు తండ్రితోనూ అనుబంధాలను పెనవేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. అయితే తన తల్లిదండ్రులు విడిపోవడం గురించి కూతుళ్లిద్దరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల తన తండ్రి కమలహాసన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఈమె ఒక భేటీలో పేర్కొంటూ ఆ విషయంపై తనదైన తీరుతో స్పందించింది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ.. తన జీవితంలో ముఖ్యమైన భాగం నాన్న కమలహాసన్, అమ్మ సారికలదేనని అంది. సాధారణంగా అమ్మానాన్న విడిపోతే ఇతరులకు వార్త అవుతుందేమో, మా కుటుంబంలో మాత్రం అది బాధాకరమైనదే అవుతుంది. అయితే తన వరకూ అమ్మా, నాన్న విడిపోవడం సంతోషకరమేనంది. ఎందుకంటే తన తల్లీ,తండ్రి ఇద్దరూ ఆర్టిస్టులే. ఇద్దరూ ఒకరిపై ఒకరు గొడవ పడుతూ మనశాంతి లేకుండా జీవించడం కంటే విడిపోయి వారి వారి జీవితాలను సంతోషంగా గడపడమే ఉత్తమం అంది. అమ్మానాన్న విడిపోవడం కష్టంగా ఉన్నా, కలిసి జీవించినప్పుడు పలు సమస్యలు వచ్చేవని అంది. అమ్మా,నాన్నలను ఒకటిగా కలపాలని తానూ భావించానని, అయితే వారు మళ్లీ కలిస్తే ఒకరిపై ఒకరు గొడవలు పడి మనశాంతికి దూరం అవుతారంది. అందుకే తానా ప్రయత్నం చేయలేదని నటి శ్రుతీహాసన్ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం చిత్రంలో నటిస్తోంది. త్వరలో తెలుగులో రవితేజతో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదే విధంగా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించడానికి రెడీ అవుతోంది. -
పెళ్లికి ముందే తల్లవుతా!
లవ్‌లో పడితే లవ్ మ్యారేజ్.. పడకపోతే అమ్మానాన్న చూసిన అబ్బాయితో మ్యారేజ్ అంటుంటారు శ్రుతీహాసన్. ఇంతకీ పెళ్లెప్పుడు? అంటే ‘అది మాత్రం నా చేతుల్లో లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే’ అంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో శ్రుతి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారమవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ‘‘ఇప్పుడైతే పెళ్లి గురించి ఆలోచించడంలేదు. అదే సరైన అబ్బాయి దొరికితే పెళ్లికి ముందే తల్లవడానికి నాకభ్యంతరం లేదు’’ అన్నారట. సూటిగా సుత్తి లేకుండా శ్రుతి చేసిన ఈ వ్యాఖ్యల గురించి చిలవలు పలవలుగా మాట్లాడుకుంటున్నారు. మరీ ఇంత ఓపెన్‌గా మాట్లాడేస్తే ఎలా? అని కొందరు అంటుంటే.. స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా మాట్లాడితే తప్పేంటి? అని మరికొందరు అంటున్నారు. అన్నట్లు కమల్‌హాసన్, సారికలు కూడా శ్రుతీహాసన్ పుట్టిన తర్వాతే పెళ్లాడారు. సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? -
వెంకన్న కుటుంబానికి ఆర్థిక సహాయం
- రూ.10 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించిన చిరెక్ స్కూల్ యాజమాన్యం - సిరిపూర్ ఎమ్మెల్యే కోనప్ప రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.2 లక్షలు - ఇద్దరి కూతుళ్లకు ఉద్యోగాలు గచ్చిబౌలి(హైదరాబాద్‌సిటీ) స్కూల్ బస్సు ఢీకొట్టి మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అంగీకరించింది. సిరిపూర్ ఎమ్మెల్యే కోనప్ప రూ.2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం మరో రెండు లక్షలు ఇవ్వనుందని ఎమ్మెల్యేలు తెలిపారు. సోమవారం ఉదయం పెద్ద ముప్పారం వరంగల్‌కు చెందిన గంగినేని వెంకన్న(49) మాదాపూర్‌లో కూతురును ఇంటర్వ్యూకు బైక్‌పై వదిలి తిరిగి వెళుతూ చిరెక్ స్కూల్ బస్సు ఢీ కొని మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడంలో జాప్యం జరగడంతో సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మంగళవారం సాయంత్రం చిరెక్ స్కూల్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిందని వారు చెప్పారు. చర్చల అనంతరం వెంకన్న కూతురు సారిక మా నాన్న ఇక తిరిగిరాడని విలిపించడం అక్కడి వారిని కలిచివేసింది. -
ఆ నలుగురి మధ్య..
ముగ్గురు యువకులు, ఓ యువతి మధ్య ప్రేమకథ -‘నిన్నే కోరుకుంటా’. సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక ముఖ్య తారలు. గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రామ సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజయ్యకు నిరాశ
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ పై గురువారం రెండవ అదనపు జిల్లా కోర్టు లో న్యాయమూర్తి రేణుక విచారణ చేపట్టారు. గత నెల 4న సారిక, ఆమె ముగ్గురు కుమారుల మతి ఘటనపై సుబేదారీ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్, రాజయ్య దంపతులు, సనా ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నసంగతి తెలిసిందే. బెయిల్ కోసం రాజయ్య, ఆయన భార్య గతంలోనే వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ప్రధాన నిందితుడు అనిల్‌కుమార్ మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, రాజయ్య దంపతులు రెండోసారి బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ రెండు పిటిషన్లను విచారించిన కోర్టు తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. -
డిసెంబర్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు సారిక (నటి), కిన్నెర (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరమంతా వీరు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశాలకు వెళ్లాలనే కోరిక తీరుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వేదపండితులు, జ్యోతిష్యులకు, వైద్యవిద్యార్థులకు, వైద్యులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమిని, ఇంటిని అమ్మే ప్రయత్నాన్ని విరమించు కోవడం మంచిది. మీరు పుట్టిన తేదీ 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల జన్మతః మంచి తె లివితేటలు, సమయస్ఫూర్తి ఉంటాయి. పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , గ్రీన్, పర్పుల్, బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, బుథ, శుక్రవారాలు. సూచనలు: కేతు జపం చేయించుకోవడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను, ఆనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఒంటరి పోరాటమే సారికను బలిగొందా?
మహిళల మీద దాడులు నిత్యం జరుగుతున్న సందర్భంలో కొన్ని దారుణాలు మినహాయింపు లేకుండా అందరినీ కదిలించేవిగా, నేరస్థులకు కూడా అదే శిక్ష వేయాలనేంత తీవ్రంగా ఉంటాయి. ఇటీవల మాజీ పార్లమెంట్ సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యురాలైన సారిక ఆమె ముగ్గురు పిల్లల దారుణ మరణంపై కూడా సభ్య సమాజం ఇంతే తీవ్రంగా స్పందించింది. పురుషుడు తన భార్యను, పిల్లలను బానిసల వలే కొట్టడం, తిట్టడ ం, చంపేయడం వంటి అధికారాలను మన వ్యవస్థే దఖలు పరిచింది. ఈ వర్గనీతి అటు అగ్రకులాల్లో, ఇటు వెనుకబడిన కులాల్లో కూడా నేటికీ కొనసాగుతోందని సారిక ఉదంతం చాటి చెబుతోంది. ఉన్నత చదువులు చదివిన సారిక తన కుటుంబ సభ్యులను ఎదిరించి రాజయ్య కుమారుడిని 2002లో కులాంతర వివాహం చేసుకుంది. కానీ కుటుంబ హింసను భరించలేక 2009 నుంచి న్యాయపోరాటం చేస్తూవచ్చింది. ఆమెది సున్నిత మనస్తత్వం. చావైనా, బతుకైనా భర్త కుటుంబంతోటే అనే భూస్వామ్య భావజాలం గల మనస్తత్వం. చాలా మంది మహిళల వలే కాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను ఎదిరించింది. 498ఏ కేసు ద్వారా న్యాయం దొరుకుతుందని ఆశించింది. కోర్టును నమ్ముకుని అత్తింట్లో పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చింది. అత్తింట్లో తనకు, పిల్లలకు కనీసం ఆస్తి హక్కయినా దక్కుతుందని పోరాటం చేస్తే చివరికి జీవించే హక్కునే హరించి వేశారు. అరుపులు కూడా లేకుండా నలుగురూ మంటలకు ఆహుతైపోయారు. సారిక మరణం ముమ్మాటికీ హత్యేనని మహిళలు నినదిస్తూ, ఏకపక్ష విచారణ జరుగుతున్నదని అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు అనుమానించి నట్లే సారికది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకోవైపు సమస్యను పక్కదారి పట్టించడానికి సైకియాట్రిస్టు చేత ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల స్వభావాలపై చర్చ లేవదీస్తూ, పిల్లలను చంపిన నేరస్థురాలిగా సారికను చిత్రీకరిస్తున్నారు. కోర్టు సాక్ష్యాల మీదే ఆధారపడకుండా సారిక కుటుంబ సభ్యుల చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. ఫోరెన్సిక్ రిపోర్టు, పోలీసు విచారణలన్నీ దీనిని ఆత్మహత్యగా నివేదించినా ఈ ఘటనను హత్యగా భావిస్తేనే సారిక కేసుకు న్యాయం జరుగుతుంది. వాస్తవానికి బీటెక్ చదివిన సారికకు ఈ వ్యవస్థను రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. సారిక దళితుడిని వివాహమాడటంతో తల్లి దండ్రుల పూర్తి మద్దతు లేక అత్తింట్లో కూడా వెలివేయబడి ఒంటరి పోరాటం చేసింది. సరైన మార్గదర్శకులు ఎదురై ఉంటే ఆమె ఒంటరి పోరాటం సంఘటిత పోరాటంగా రూపుదిద్దుకునేది. తన కుటుంబం కూడా పితృస్వామ్య రాజ్య వ్యవస్థలో భాగమనే జ్ఞానాన్ని పొందేది. సంఘటిత పోరాటం ద్వారా ప్రచారం చేస్తేనే తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతానని ఆమె గ్రహించలేక పోయింది. ఆమె కుటుంబానికి శిక్ష పడకుంటే ప్రభుత్వం తన వర్గ స్వభావాన్ని నిరూపించుకున్నట్లే. కాబట్టి సారికకు న్యాయం చేయవలసిందిగా ప్రజలే ప్రభుత్వంపై సంఘటిత పోరాటం చేయాలి అనిత రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, చైతన్య మహిళా సంఘం -
సారిక కేసులో సనా అరెస్టు
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు సాక్షి, హన్మకొండ: మాజీ ఎంపీ రాజయ్య కోడ లు, ముగ్గురు మనవళ్ల సజీవ దహనం కేసులో నాలుగో నిందితురాలు సనను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమయ్యారు. ఈ కేసులో సారిక భర్త అనిల్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలు నిందితులుగా ఉన్నారు. అనిల్ రెండో భార్య సనా ఏ-4 నిందితురాలు. ఘటన జరిగిన రోజు నుంచి ఆమె పరారీలో ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మధ్యవర్తి ద్వారా చంటిపిల్లాడితో సన(26) లొంగిపోయినట్లు హన్మకొండ ఏసీపీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయంత్రం ఆమెను వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజి స్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు సనకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అంతకుముందు సనకు ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సన మధ్యవర్తి ద్వారా లొంగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నప్పటికీ.. 7న ఖమ్మం జిల్లాలోని ఏ న్కూరులో ఆమెను పోలీసులు అదుపులోకి తీ సుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి శుక్రవారం కోర్టులో హాజరుపరిచేవరకు కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఎఫ్ నివాస సముదాయాల్లో ఆమెను విచారించినట్లు తెలుస్తోంది. మిస్డ్ కాల్‌తో పరిచయం కాజీపేటలోని ఫాతిమానగర్‌లో సన బ్యాంగిల్స్టోర్ను నిర్వహించేది. మిస్డ్‌కాల్ ద్వారా ఆమె కు అనిల్‌తో పరిచయమైంది. దీంతో అనిల్ సనను రెండో వివాహం చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టాడు. తొలిసారి కాన్పు అయ్యే వరకు అనిల్ మాజీ ఎంపీ రాజయ్య కొడుకని, అతనికి అప్పటికే సారికతో వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయం సనకు తెలి యదు. నిజం తెలిసినప్పటి నుంచి అనిల్, సన ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆఖరికి అనిల్‌తో విడిపోయేందుకు సనకు రూ. 10 లక్షలు ఇచ్చేందుకు రాజయ్య కుటుంబం అంగీ కరించింది. సన తరఫున బంధువు చనిపోవడంతో ఈ చెల్లింపులో జాప్యం జరిగింది. ఇం తలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. అనిల్‌ను కస్టడీకి ఇవ్వండి కోర్టులో పోలీసుల పిటిషన్ వరంగల్ లీగల్: మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు మనువళ్లు సజీవ దహనమైన కేసులో ప్రధాన నిందితుడైన సారిక భర్త సిరిసిల్ల అనిల్‌కుమార్‌ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సుబేదారి పోలీసులు కోరారు. నగరంలోని నాల్గవ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈమేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులైన అనిల్‌కుమార్, మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవిలను అరెస్టు చేయగా, జైలులో ఉన్నారని, నాలుగో ముద్దాయి సనను శుక్రవారం అరె స్టు చేశామని పిటిషన్లో పేర్కొన్నారు. నలుగురు ముద్దాయిలు మాట్లాడిన మాటలను మృతురాలి సెల్ఫోన్లో రికార్డు అయి ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, మరింత సమాచారం సేకరించడానికి అనిల్‌కుమార్‌ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. నిందితుడి నుంచి మరిన్ని దస్తావేజులు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, విస్త్రృత ప్రజాప్రయోజన దృష్ట్యా కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. -
సారికది ఆత్మహత్యే కానీ..
♦ నిందితుల వేధింపుల వల్లే అఘాయిత్యానికి పాల్పడింది ♦ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు ♦ అనుమానాస్పద మృతిగా పేర్కొనే సెక్షన్ 174 తొలగింపు ♦ బెయిల్ కోసం రాజయ్య పిటిషన్.. 12కు వాయిదా పడ్డ విచారణ వరంగల్ లీగల్/సాక్షి, హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో పోలీసులు కోర్టుకు శనివారం రిమాండ్ రిపోర్టు సమర్పించారు. సారికది ఆత్మహత్యగానే భావిస్తున్నామని, అయితే భర్త అనిల్, మామ రాజయ్య, అత్త మాధవి, అనిల్ రెండో భార్య సనా వేధింపుల వల్లే జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేక సారిక తన బెడ్రూమ్లోకి గ్యాస్ సిలిండర్లు, పిల్లలను తీసుకువెళ్లిందని, లోపలి నుంచి గడియ పెట్టుకొని గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకుందని తెలిపారు. ఘటన వెలుగుచూసిన తర్వాత పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 498 ఏ(వరకట్న వేధింపులు), 306(ఆత్మహత్యకు ప్రేరేపించడం), సీఆర్పీసీ సెక్షన్ 174(అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. కానీ తాజాగా కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో మాత్రం సెక్షన్ 174ను చేర్చకపోవడం గమనార్హం. సారిక తల్లి లలిత, సోదరి అర్చనతో సహా చుట్టుపక్కల నివసించే ముగ్గురు వ్యక్తులు, రాజయ్య కారు డ్రైవర్లు ముగ్గురు, వివిధ గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులను కలిపి మొత్తం 24 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. అనిల్, రాజయ్య, మాధవి.. సారికను ఒంటరిని చేసి వేధించారని వివరించారు. అనిల్ సనా అనే మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. రాజయ్య బెయిల్ పిటిషన్ రాజయ్య, ఆయన భార్య మాధవి శనివారం జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం కేసును రెండో అదనపు జిల్లా కోర్టుకు కేటాయించారు. పోలీసులు పేర్కొన్న విధంగా సారికపై తామెలాంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు... ఘటన జరిగిన ఇంట్లో తాము ఉండటం లేదని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఈ నెల 3న సాయంత్రం ఇంట్లోకి వచ్చామని, వేధింపులకు గురిచేసే అవకాశం గానీ, ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం గానీ లేదని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. సనాను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం సంఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా కేసులో కీలక నిందితురాలైన అనిల్ రెండో భార్య సనాను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రత్యేక పోలీసు బృందాలతో ఆమె కోసం గాలిస్తున్నామని చెబుతున్నా.. పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫోరెన్సిక్, క్లూస్‌టీమ్‌కు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఇవేవీ రాకుండానే సారికది ఆత్మహత్య అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆత్మహత్య చేసుకోవాలని సారికను ఒత్తిడి చేశారు!
-
సారిక డైరీ
-
బతుకు పోరాటం సాగించిన సారిక
కోర్టుకు హాజరైన మరుసటి రోజే మృతి అడుగడుగునా ఇబ్బంది పెట్టిన భర్త అనిల్ వరంగల్ లీగల్ : వైవాహిక జీవితంలో అవమానాలు, మానసిక, శారీరక హింస ఎదుర్కొన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారిక.. ఆమెతో పాటు పిల్లలు బతకడానికి జీవనభృతి సాధిం చేందుకు కడదాక పోరాడింది. అయితే, ఈ న్యాయ పోరాటంలో ఆమెకు భర్త అని ల్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిం చాడు. చివరకు కేసు వాయిదా కోసం ఈనెల 2న సారిక, అనిల్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యా రు. ఆ మరుసటి మరుసటి రోజే ఆమె పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. భర్త అనిల్, అత్తమామలు మాధవి, రాజయ్య మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని, పిల్లలకు సైతం భోజనం, విద్య, వైద్య వంటి కనీస అవసరాలుకల్పించకుండా వేధిస్తున్నారని సారిక ఫిర్యాదు మేరకు గృహహింస చట్టం కింద 2014 జూన్ 14న నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు లో కేసు నెంబర్ 6/2014 నమోదైంది. తనను వేధించకుండా చూడడంతో పా టు రెవెన్యూకాలనీలోని ఇంటి నుంచి పం పించకుండా చూడాలని, తన నుంచి అత్తమామలు తీసుకున్న 20 తులాల బంగా రం, 10 లక్షల నగదు ఇప్పించడంతో పా టు రూ.50లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె ఈ కేసు వేసింది. ఈ క్రమంలోనే 2015 జనవరి 13న సారికకు నెలకు రూ.6వేలు, పిల్లలు ముగ్గురికి రూ.3వేల చొప్పున మొత్తం రూ.15వేలు పోషణ నిమిత్తం అనిల్ చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దీనిపై తనకు ఆదాయ వనరులు లేవంటూ అనిల్ జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా.. ఆ అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. తండ్రి రాజయ్య మాజీ ఎంపీ, తల్లి మాధవి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నందున రూ.15వేలు చెల్లించడం సాధ్యమేనని జడ్జి రేణుక ఆ తీర్పులో పేర్కొన్నారు. అయినా జనవరి నుంచి జూలై 2015వరకు అనిల్ డబ్బు ఇవ్వకపోగా సారిక మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఏడు నెలల డబ్బులో రూ. 45వేలు చెల్లించాడు. అయితే, తనకు భృతి చెల్లించకుండా వేధిస్తున్న భర్త అని ల్ను అరెస్టు చేయాలని కోర్టుకు విన్న విం చిన సారిక విచారణ నిమిత్తం సోమవా రం కోర్టుకు హాజరైంది. మరుసటి రోజు మంగళవారం అర్ధరాత్రి బుధవారం తెల్లవారుజామున అనుమానస్పద స్థితిలో పిల్లలతో సహా మృతి చెందింది. ఇలా తన హక్కుల సాధనకు నిరంతరం నిర్భయంగా నిలబడి న్యాయపోరాటం సాగిం చిన సారిక మరణం హత్యా? ఆత్మహ త్యా? అనేది మాత్రం తేలాల్సి ఉంది. -
ఆ మృతదేహాలపై గాయాలు?
వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారుల సజీవదహనం ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి చేస్తున్న దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే సారిక ఛాతీ భాగంలో ఓ ఎముక విరిగినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారని సమాచారం. ఇద్దరు చిన్నారులు కాళ్లు సైతం విరిగినట్లు తెలుస్తోంది. అయితే వారు కాలిపోతుండగా ఎముకలు విరుగుతాయని కొందరు వైద్యులు అంటుండగా, బతికుండగానే ఆమెను ఎవరైనా గాయపరిచి ఉండొచ్చని మరికొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆనంతరమే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయన్న విషయం తెలిసిందే. -
అనుబంధాల ‘సారిక’
అందరితో ఆప్యాయంగా మాట్లాడేది.. ఆమె పలకరిస్తే అత్త తిట్టేది.. అభినవ్ స్కూల్లో ఆక్టివ్‌గా ఉండేవాడు.. జ్ఞాపకాలు చెబుతూ విలపించిన స్థానికులు హన్మకొండ చౌరస్తా : పిన్ని, ఆంటీ, అక్క, వదినా ఇలా ప్రతి ఒక్కరినీ వరుసలతో పలకరిస్తూ అనుబంధాలు పెనవేసుకుంటూ మాట్లాడేది.. రోజు సాయంత్రం ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని గల్లీలో వాకింగ్ చేస్తూ ఎదురుపడే వారిని ఆప్యాయంగా పలకరించేది.. ఇవి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారికతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు చెప్పిన మాటలు. సారికతో పాటు ముక్కు పచ్చలారని ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతి కాగా.. ఆ ఘట నను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ తమకు కనిపించేవారు లేరన్న విషయాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ రెవెన్యూ కాలనీలో సారిక, ఆమె కుమారులు సజీవ దహనమైన గృహం వద్ద చుట్టు పక్కల వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు చెప్పుకొచ్చారు. సారిక అత్త రాక్షసి.. వాడలో అందరితో కలివిడిగా ఉంటే సారిక ఎవరితోనైనా మాట్లాడినట్లుగా కనిపిస్తే చాలు ఆమె అత్త(మాజీ ఎంపీ రాజయ్య భార్య) మాధవి బూతులు తిట్టేదని స్థానికులు చె ప్పారు. ఈ వాడలో ఎవరితో సఖ్యతతో ఉండడం తెలియని ఆమె రాక్షసిలా వ్యవహరించేదని పేర్కొన్నారు. గత ఏడాది సారిక ఆత్మహత్యకు యత్నించిన పదిహేను రోజుల తర్వాత ఇంటి బయట కనిపిస్తే పలకరించినందుకు వాడలో అందరిని కలిపి బూతులు తిట్టిందన్నారు. అప్పటి నుంచి సారిక అత్త ఇంట్లో ఉందటే చాలు ఆ ఇంటి ముఖం కూడా చూడకపోయేవారమన్నారు. సారిక అత్త చదువుకున్నా సం స్కారంలేని ఆడది అని ఛీత్కరించుకున్నారు. రెండో పెళ్లి చేసిందే అత్త.. రాజయ్య కొడుకు అనిల్‌కు రెండో పెళ్లి చేసిందే సారిక అత్త అని స్థానికులు చెబుతున్నారు. సారికకు పెద్ద కొడుకు పుట్టగానే కాజీపేటకు చెందిన ముస్లిం యువతితో దగ్గరుండి పెళ్లి చేసిందన్నారు. రెండో భార్యకు కూడా ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. సెంటిమెంట్‌తో అభినవ్‌కు పిలుపు.. వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన రాజయ్య ఆ రోజు తన మనవడు అభినవ్‌ను పిలిపించుకున్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. అభినవ్ అంటే రాజయ్యకు ఇష్టమని, గతంలో ఎంపీగా గెలిచినప్పడు కూడా అభినవ్ చేతిత నామినేషన్ తీసుకువెళ్లినందున అదే సెంటిమెంట్‌తో ఈసారీ పిలిపించినట్లు సమాచారం. పీఎఫ్ డబ్బులతో కిరాణ సరుకులు కొనుగోలు.. సారిక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసినప్పుడు పీఎఫ్‌గా వచ్చిన డబ్బుతోనే కిరాణ సరుకులు, బియ్యం కొనుగోలు చేసుకునేదని సమాచారం. మూడు నెలల క్రితం ఆ డబ్బు అయిపోవడంతో పాత మిత్రుల సహకారంతో కాలం వెళ్లదీ స్తున్నట్లు తెలిసింది. సాధారణ కుటుంబ మహిళగానే వ్యవహరించేదని స్థానిక కిరాణ దుకాణ సిబ్బంది తెలిపారు. అభినవ్.. ఏ ప్లస్.. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా పిల్లలకు అవి తెలియకుండా సారిక వ్యవహరించేది. రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్న అభినవ్ చాలా ఆక్టివ్‌గా ఉండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. అనిల్, సారిక కలిసి 2013లో అభినవ్ యూకేజీలో ఉన్నప్పుడు తమ పాఠశాలలో చేర్పించారని మాంటిస్సోరి స్కూల్ ఇన్చార్జి అశోక్‌రెడ్డి చెప్పారు. అభినవ్ ఇటీవల జరిగిన పరీక్షల్లో ఏ ప్లస్ మార్కులు రావడం విశేషం. -
రాజయ్య కుటుంబాన్ని సంపేయండి
నా బిడ్డను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు సారిక తల్లి లలిత పోచమ్మమైదాన్ : సారికతో పాటు ఆమె కుమారుల మృతదేహాలకు వరంగల్ ఎంజీఎంలో గురువారం పోస్టుమార్టం జరిగింది. ఈ సందర్భంగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సారిక తల్లి లలిత పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు.... రాజయ్య కుటుంబ సభ్యులే చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. రెండు కాన్పులు నేనే వెళ్లదీశాను. ఇద్దరు కవలలు కడుపులో ఉన్న సమయంలో నా బిడ్డకు సరిగా అన్నం కూడా పెట్టలే... మా బిడ్డ అత్త మాధవి వంట గదికి తాళం వేసుకుని వెళ్లేది. దీంతో బిడ్డ పస్తులు ఉండడం చూడలేక పక్కింటోళ్లే అన్నం పెట్టేటోళ్లు.. నా బిడ్డ లండన్‌లో ఉన్నప్పుడు, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన సమయంలో అత్త, మామలకే మొత్తం డబ్బులు ఇచ్చేది. నా మొగుడు బాగుంటే చాలు అమ్మా... నాకు డబ్బులు ఎందుకు అని చెప్పేది. రాజ య్య ఎంపీగా ఉండి సైతం నా బిడ్డను పట్టించుకోలే... నా బిడ్డను అనిల్, మాధవి చిత్రహింసలు పెడుతుంటే పట్టించుకునే వారు కాదు.. రాజయ్య కు టుంబంను సంపేయండి... వారిని కఠినంగా శిక్షంచాలి. నా బిడ్డ పడ్డ క్షోభ మరే బిడ్డ పడవద్దు... ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే... ఇంక ఎక్కడ జరగవు. నా ఇంటి నుంచే బియ్యం, పప్పులు, ఉప్పులు పంపేదాన్ని... బతుకమ్మ పండగకు వచ్చింది.... దస రా అయ్యాక వెళ్లింది.. ఏమైనా బాధ ఉంటే చెప్పమ్మా అంటే.. నా హక్కులు నేనే సాధిస్తా అని చెప్పింది. ఇం టిని మరో రెండు నెలల్లో ఇస్తారు కావచ్చు అని చెప్పింది నా బిడ్డ.... మళ్లీ ఎన్నికలు వచ్చాయి కదా ఎట్ల ఉంటదో... ఇస్తానంటాడో ఇవ్వనంటారో తెలి యదు.... పిల్లలకు ఫీజులు సైతం కట్టలేని పరిస్థితి ఉందని చెప్పడంతో నాది పేద కుటుంబమే అయినా బిడ్డ ఇబ్బంది పడొద్దని రూ.5వేలు ఇచ్చి పంపాను. నా భర్త లేవలేని స్థితిలో ఉన్నారు. నా మనువళ్లు ఎంతో ముద్దుగా ఉండేవారు... పండగకు వచ్చినప్పుడు అమ్మమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ అడుకున్నారు. నాకు అందరు ఆడపిల్లలే.... మనుమలనే కొడుకుల్లా భావించి అల్లాడుముద్దుగా చూసుకునేదాన్ని.. ఇప్పుడు మంటలు మాడిపోయారు..’ అం టూ లలిత రోదిస్తూ వెల్లడించింది. ‘సారికను చిత్రహింసలకు గురిచేశారు’ ఎంజీఎం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యులు సారికను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా హత్య చేశారని మహిళా సంఘాల నేతలు సదాలక్ష్మి, ఇంద్ర, సారమ్మ ఆరోపించారు. సారిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన సమయంలో రూ.20 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని రాజయ్య కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆమె ఉద్యోగం చేస్తూ డబ్బు తెచ్చిన సమయంలో ఓ విధంగా, డబ్బులు ఇవ్వకుండా మరో విధంగా చూస్తూ చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు రాజయ్య కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. -
వరంగల్ జైలుకు రాజయ్య
-
రోదనలతో మిన్నంటిన మార్చురీ
అంతటా అలుముకున్న విషాదం కంట తడి పెట్టిన మహిళలు పోచమ్మమైదాన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీ గురువారం రోదనలతో మిన్నం టింది. గురువారం ఉదయం 11గంటలకు మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనుమలు అభినవ్, అయాన్, శ్రీయాన్ మృతుదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు ప్రకటిం చడంతో ఉదయం 10గంటల సమయానికే మహిళా, కుల సంఘాల బాధ్యులతో పాటు నగర ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో మా ర్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దుఃఖసాగరంలో మునిగిపోయిన సారిక తల్లి లలిత, ఆమె సోదరి, బంధువులను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. అయ్యా.. నాబిడ్డ, నా మనుమలు పాయే, అందరూ నా బిడ్డల లాంటి వారే... అందరి ఆడోళ్లకు న్యా యం చేయండి.. అంటూ లలిత రోదిస్తున్న తీరి పలువురు మహిళలు ఆమెను ఓదార్చేందు కు యత్నించారు. అలాగే, సారిక, ఆమె కుమారుల మృతదేహాలు బొగ్గు ముద్దల్లా మార్చురీలో ఉం డడాన్ని చూసి... కన్నుమూసిన సమయంలో ఎంత వేదన అనుభవించారోనంటూ కన్నీరు మున్నీరయ్యారు. అలాగే, మరికొందరు రాజ య్యతో పాటు ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజయ్య కుటుంబానికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. -
మంటల వెనుక మిస్టరీ
సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనుమానాలు గ్యాస్ లీక్, మంటల వ్యాప్తికి కారకులెవరు? ఫోరెన్సిక్ నివేదికే కీలకం పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించిన పోలీసులు ఎంజీఎం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(3), శ్రీయోన్(3) సజీవదహనం ఘటన దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకంగా మారనుంది. నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను సారిక తల్లి, ఆమె తరఫు బంధువులకు అప్పగించారు. శ్వాసనాళాల్లో పొగ.. రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనువళ్లు సజీవ దహనం కాగా, ఘటన జరిగిన గదిలో వంటగ్యాస్ సిలిండర్ లీక్ కావడమే మంటలు చెలరేగడానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సారిక గ్యాస్ లీక్ చేసిందా? మరెవరైనా నిప్పంటించి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తొలుత సారిక పెద్దకుమారుడు అభినవ్‌తో పాటు ఆమెకు మంటలు వ్యాపించాయని, ఆ తర్వాత శ్రీయోన్, అయోన్కు మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో వ్యాపించిన పొగ కారణంగా ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లను వైద్యులు కనుగొన్నట్లు సమాచారం. అలాగే, ప్రమాదం జరిగిన గదిలో గంట పాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిలిండర్లు పేలకపోవడంపై అనుమానాలు.. సారిక గదిలో ఉన్న సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడం, ఆపై అగ్నిప్రమాదం జరిగినట్లు తె లుస్తున్నా.. సిలిండర్ పేలకపోవడంపై అనమానాలు వెల్లువెత్తుతున్నాయి. మంటల కారణంగా ఒకటే సిలిండర్ కాలినట్లు ఉండగా.. మరొకటి మాములుగానే ఉండడం చర్చనీ యాంశంగా మారింది. గ్యాస్‌లీక్‌తో మంట లు వస్తే పెద్దఎత్తున పేలుడు జరిగిఉండాలి. అలా జరగకపోవడం ఏమిటనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇక సారిక, ఆమె కుమారుల సజీ వ దహనం తర్వాత గదిలో సిలిండర్లు ప్రత్యక్షమైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికే ఆధారం.. సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది. సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంజీఎంలో 26 గంటలు.. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎంజీఎం మార్చురీకి తీసుకురాగా, గురువారం సాయంత్రం ఐదు గంటలకు.. అంటే 26 గంటల తర్వాత పోస్టుమార్టం పూర్తయింది. కాగా, సుమారు రెండున్నర గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించగా మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. సజీవ దహనమైన నలుగురు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబీకులు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే అంశాన్ని ఛేదించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అక్కడి నిపుణులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. -
వరంగల్ జైలుకు రాజయ్య
సాక్షి, హన్మకొండ: కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌కు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గురువారం 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వీరిని వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకుముందు వారిని పోలీసులు మామూనూరు పోలీసు స్టేషన్లో ఏసీపీ మహేందర్, హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 10.30 సమయంలో వరంగల్ ఆరో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అజేశ్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు. కోర్టుకు తీసుకువచ్చే ముందు ఈ ముగ్గురికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సారిక, ముగ్గురు పిల్లల మృతి కేసులో ఆమె భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్య, అనిల్ రెండో భార్య సనాను నిందితులుగా పేర్కొన్నారు. వారిపై సుబేదారి పోలీసు స్టేషన్లో ఐపీసీ 306, 498ఏ, 174 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. కాగా అనిల్ రెండో భార్యను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వీడియోలో పోస్టుమార్టం చిత్రీకరణ సారిక, ముగ్గురు పిల్లల మృతదేహాలకు గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోస్టుమార్టం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. మృతదేహాలను తీసుకునేందుకు సారిక తల్లి, బంధువులు నిరాకరించారు. రాజయ్య కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే నచ్చచెప్పడంతో మృతదేహాలను సాయంత్రం 4:40 గంటలకు తీసుకున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు రాలేదు. భోజనంలో మత్తు పదార్థాలు కలిశాయా? ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. పోస్టుమార్టం సమయంలో మృతదేహాలకు సంబంధించిన ఆవయవాలను హైదరాబాద్‌లోని ఫోర్స్న్సిక్ ల్యాబ్ పంపించారు. ఈ నివేదిక వెల్లడైతే తప్ప ఇది హత్యా లేదా ఆత్మహత్య అనేది తేలుతుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తిన్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా? అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మంటల కారణంగా వ్యాపించిన పొగలో సారిక ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లు వైద్యులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన గదిలో గంటపాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంటల వ్యాప్తిలో ఒకే సిలిండర్ కాలిపోయినట్లు కానరావడం.. మరో సిలిండర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
అత్తింట్లో నరకం
తన లాయర్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక గోడు * అత్తామామ, భర్త కలసి తీవ్రంగా వేధించారు * అడుగడుగునా అవమానాలే.. * భర్త బలాదూర్‌గా తిరిగాడు.. నా డబ్బులన్నీ వాడుకున్నాడు * వివాహేతర సంబంధంపై ప్రశ్నిస్తే కొట్టేవాడు * పిల్లల్ని ఏనాడూ పట్టించుకోలేదు.. పాల డబ్బాలు కొనాలన్నా ఇబ్బందే * వంటగదికి తాళం వేసేవారు.. పస్తులు అలవాటైపోయాయి * భర్త కోసం త్యాగాలు చేయాలని రాజయ్య అనేవారు * ఆయన మాటలకు చచ్చిపోవాలనిపించేది సాక్షి, హన్మకొండ: ప్రేమ పేరుతో సారిక జీవితంలోకి ప్రవేశించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్ అనుక్షణం ఆమెకు నరకాన్ని చూపించాడు. భర్తగా కష్టసుఖాల్లో తోడుండాల్సిన వ్యక్తి బాధ్యతలను గాలికొదిలి బలాదూర్‌గా తిరిగాడు. సారిక కష్టార్జితాన్ని ఇష్టారీతిగా వాడుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. తప్పు దారిలో వెళ్తున్న కొడుకును మందలించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. సూటిపోటి మాటలు, భౌతిక దాడులతో సారికకు అనుక్షణం నరకం చూపించారు. భర్త, అత్తమామాలు పెడుతున్న ఇబ్బందులను తన తరఫున న్యాయవాదికి, షాహిన్స్ ఉమెన్ ఆర్గనైజేషన్‌కు పంపిన ఫిర్యాదు లేఖలో సారిక పూసగుచ్చినట్టు వివరించింది. ఆ వివరాలివీ.. నా కొడుకును పెళ్లి చేసుకో.. అనిల్, నేను ఉద్యోగాలు తెచ్చుకుంటే మా వాళ్లను, అనిల్ కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా. పెళ్లికి ముందు మా అత్తగారు మాధవి నన్ను తన కాలేజీకి (కేయూలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో) తీసుకెళ్లి మాయ మాటలు చెప్పింది. నన్ను మా అమ్మవాళ్ల ఇంట్లోంచి బయటకొచ్చి, వాళ్ల అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. చదువుకున్న వ్యక్తి, లెక్చరర్, మంచీచెడు అన్ని తెలిసిన పెద్దావిడ అని తల్లిలా భావించాను. ఆమె చెప్పినట్లే ఇంట్లోంచి వచ్చేసి అనిల్‌ను పెళ్లి చేసుకున్నా. ఆవిడ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. ఘోరమైన తప్పుడు స్టెప్ వేశాను. ఒక తప్పుడు నిర్ణయంతో జీవితం ఎలా నాశనం చేసుకుంటామన్నదానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా భర్త ఇంట్లో ప్రతీ క్షణం నన్ను అవమానించాడు. నా కష్టార్జితాన్ని వాడుకున్నారు. నన్ను, నా పిల్లలను పట్టించుకోలేదు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆస్పత్రికి వెళ్లడం నాకో పెద్ద పరీక్ష. ఇంట్లో మూడు కార్లు ఉన్నా.. ఒక్కటీ తీసేవారు కాదు. చివరికి పాల డబ్బాలు, మందులు కొనడం కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో వంటగదికి తాళం వేసేవారు. వండిన వంటలో అడుగుకు మిగిలినవే నాకు నా బిడ్డలకు దక్కేవి. రెండోసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఇంట్లో అన్ని గదులకు తాళం వేసి నన్ను హాల్లోనే ఉంచేవారు. బాత్రూమ్కి వెళ్లడం కష్టంగా ఉండేది. బట్టలుతికే స్థలంలో స్నానం చేయాల్సి వచ్చేది. పెద్ద పొట్టతో హాల్లో నేను ఇబ్బంది పడుతుంటే ఇంట్లోకి వచ్చిన అత్తామామలు.. పెద్దవాళ్లు వచ్చినప్పుడు లేచి నిలబడాలని తెలియదా? అంటూ తిట్టేవాళ్లు. ఇద్దరు కవల పిల్లలు పుట్టాక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. పాలు, సెరిలాక్ డబ్బా కొనడానికి కూడా నేను ఇబ్బంది పడాల్సి వచ్చేది. పస్తులు కామన్ అయ్యాయి.. అనిల్‌తో 2006లో జరిగిన పెళ్లితో నా నరకప్రాయమైన జీవితం మొదలైంది. ఇంట్లో ఎవరూ నన్ను తిన్నావా? అని అడిగేవారు కాదు. అన్నానికి కూడా పిలిచేవారు కాదు. పస్తులు ఉండటం కామన్ అయిపోయింది. నా డబ్బులు రూ.20 లక్షలు, 10 తులాల బంగారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. మా అమ్మ వాళ్లతో మాట్లాడేప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనేవాడు. కాల్‌లాగ్ చెక్ చేసేవాడు. మీ చెల్లెలితో మాట్లాడావా.. అంతసేపు ఏం మాట్లాడావు? అంటూ ఆరా తీసేవాడు. ఇదీ అని చెబితే, నాకు చెప్పింది 5 నిమిషాలే కదా.. మిగతా 25 నిమిషాలు ఏమి మాట్లాడావని అడిగేవాడు. ఇలాంటివెన్నో భరించాను. ఎక్కడా ఎప్పుడు ఎవరితో చెప్పుకునేదాన్ని కాదు. మా అమ్మవాళ్లతో కూడా ఏమీ చెప్పలేదు. పెళ్లైనప్పట్నుంచీ అనిల్ ఇంతవరకు ఒక్క పని చేయలేదు. జాబ్ చేయమని ఎంతో నచ్చ చెప్పేదాన్ని. రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం, ఇంటర్వ్యూ తేదీలు ఇలా ఏ టూ జడ్ పనులు చేసినా ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉండేవాడు. మా అత్తమామలు తలచుకుంటే ఏదైనా మంచి బిజినెస్, జాబ్ పెట్టించి ఉండొచ్చు. కానీ ఏదీ చేయలేదు. 2007 నుంచి 2010 వరకు కలకత్తా, ముంబై, పుణేలో మూడేళ్లు జాబ్ చేశాను. ఆ సమయంలో ఏటీఎం అనిల్ దగ్గరే ఉండేది. సేవ్సింగ్స్ లేకుండా డబ్బులన్నీ వాడుకున్నాడు. 2010లో పుణేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని. ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నాడు. తప్పులను ప్రశ్నిస్తే చాలు.. నాపై చేయి చేసుకునేవాడు, ఒకసారి నా జుట్టు పట్టుకుని నన్ను విసిరేస్తే, మంచం చివర తగిలి పెద్ద గాయమైంది. అత్తామామకు ఈ విషయం చెబితే పట్టించుకోలేదు సరికదా అనిల్‌కే మద్దతుగా నిలిచారు. అత్త పచ్చి బూతులు తిట్టేది అత్త మాధవి ఈసడింపు మాటలు, బూతులు, చిన్నదానికీ పెద్ద దానికీ వంకలు పెడుతూ తిట్టేది. చీటికీమాటికీ ‘నా మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నావు. బయటకు పంపేస్తాను. గేట్ బయట నించోని మాట్లాడు. పచ్చి బూతులు తిట్టేది. మా మామయ్య, నా భర్త ఏనాడూ ఆవిడను అడ్డుకునేవారు కాదు. ఒకసారి మా అమ్మ నాకు చీర పెట్టింది. ఆ చీర చూసి, నానా రభస చేసి ‘ఎవడేమీ ఇచ్చినా ఇలాగే తీసుకో’ అంటూ ద్వంద్వార్థాలతో మాట్లాడింది. ‘ఇప్పటికిప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అంటూ నాపైకి వచ్చేసి, వస్తువులు మీదకు విసిరేసి, చేయి చేసుకుని ఇంట్లోంచి గెంటేసింది. నాలుగు జతల బట్టలు తీసుకుని వెక్కివెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. అనిల్ కూడా వాళ్లమ్మకే వంత పాడేవాడు. త్యాగం చేయాలన్న మామ కుటుంబ పెద్దగా మామయ్య సిరిసిల్ల రాజయ్య ఏనాడూ నాకు అండగా నిలవలేదు. ‘‘ఎంతో మంది మహిళలు భర్త కోసం, భర్త కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారు. నువ్వు కూడా త్యాగం చేయాలి’’ అని అనేవాడు. పనివాళ్లు, పార్టీ కార్యకర్తల ముందే ఇష్టం వచ్చినట్టుగా గట్టిగా తిట్టేవాడు. దీంతో పైప్రాణం పైనే పోయేది. ఆ మాటలకు ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది. మామయ్య నా పేరు మీద నా అకౌంట్లో రూ.8 లక్షలతో కార్ లోను తీసుకున్నాడు. చేతిఖర్చులకు నా డబ్బులు వాడుకునేవాడు. -
రాజయ్య, కుటుంబ సభ్యులకు 14 రోజుల రిమాండ్
వరంగల్: కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులను పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాజయ్య సహా భార్య, కుమారుడు అనిల్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించిన అనంతరం వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు జరిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారని సీపీ చెప్పారు. అగ్నిప్రమాదం వల్లే సారిక, పిల్లలు మరణించారని, అయితే అది ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న విషయం విచారణలో మాత్రమే తేలుతుందని చెప్పారు. -
'వారు తలుపువద్దే ఎందుకు పడి ఉన్నారు?'
-
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
-
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక... తన తరఫు న్యాయవాది రెహానాకు 22 పేజీల ఈ మెయిల్ పంపింది. తనను మానసికంగా, శారీరకంగా హింసలను భరిస్తున్నానంటూ ఆమె ఈ మెయిల్లో పేర్కొంది. భర్త అనిల్ వ్యవహారాన్ని సారిక పూసగుచ్చినట్లు మెయిల్లో వివరించింది. ఈ మెయిల్ సారాంశం..ఇదే... 'ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే అత్త, భర్త వేధించేవారు. తిట్లు అరుపులు, కేకలతో రోజు అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు. కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు..భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా...అత్తమామలు పట్టించుకునే వాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా అనిల్ తెచ్చేవాడు కాదు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు. నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలతో మాట్లాడేందుకు అనిల్ ఒప్పుకునేవాడు కాదు. నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామా? అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు. జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలామంది మహిళలు... భర్తలు, అత్తమామల కోసం జీవితాలను త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ఇప్పటితో ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేది.' అని సారిక పేర్కొంది. -
ఆత్మహత్య కాదు...కచ్చితంగా హత్యే: రెహానా
హైదరాబాద్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆమె తరఫు న్యాయవాది రెహానా అన్నారు. భర్త అనిల్, అత్తమామలపై ఆమె 2014లో గృహహింస చట్టం కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే. సారిక తరఫున న్యాయవాది రెహానా వాదిస్తున్నారు. సారిక అనుమానాస్పద మృతిపై రెహానా గురువారమిక్కడ మాట్లాడుతూ 'పనిమనిషిగా చూస్తున్నారని సారిక నాకు చాలాసార్లు చెప్పింది. కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని నా దగ్గర చాలాసార్లు ఏడ్చింది. అనిల్-సనా అక్రమ సంబంధం గురించి చెప్తూ బాధపడింది. నెల రోజుల క్రితం సారిక నాతో ఫోన్లో మాట్లాడింది. 15 రోజుల క్రితం వచ్చి వ్యక్తిగతంగా కలిసింది. చివరిసారి కలిసినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగైనా న్యాయం చేయాలని విలపించింది. కోడలి సంపాదనను కూడా రాజయ్య ఇన్‌కంట్యాక్స్‌లో చూపించారు' అని తెలిపారు. -
సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
-
'ఆత్మహత్య కాదు..కచ్చితంగా హత్యే'
-
సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్
-
సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు సజీవ దహనం కేసులో మరో కొత్త కోణం బయటపడింది. రాజయ్య నివాసంలో ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. సారిక, పిల్లలు తిన్న అన్నంలో మత్తుమందు కలిపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్రూమ్కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్రూమ్కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారు తిన్న ఆహారంలో ఎవరైనా మత్తుమందు కలిపారా? అందుకే గ్యాస్ లీక్ అయినా ఆ వాసనను కూడా గుర్తించలేకపోయారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు వారు తిన్న ఆహారాన్ని సేకరించి ...పరీక్షలకు పంపారు. ఇక మాజీ ఎంపీ రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్... మామూనూరు పోలీసులు అదుపులో ఉన్నారు. సారిక, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాజయ్య కుటుంబసభ్యులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ నిమిత్తం హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి మామూనూరుకు తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రెండో వివాహం చేసుకున్న సనా అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా విచారణ నిమిత్తం మామునూరు పోలీస్ స్టేషన్ నుంచి వారిని మరోచోటుకు తరలించే అవకాశం ఉంది. -
సాక్షి టీవీ చేతికి సారిక ఈ మెయిల్
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక..న్యాయవాదికి పంపిన ఈ మెయిల్స్ 'సాక్షి' టీవీ సంపాదించింది. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. 2014 ఏప్రిల్ 25న బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. భర్త, అత్తమామలపై ఫిర్యాదుకు ముందు సారిక తన కష్టాలను ఈ మెయిల్లో న్యాయవాదికి వివరించింది. న్యాయం కోసం తుదివరకూ పోరాడిన ఆమె బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె...ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
ప్రేమతో మొదలు.. విషాదంతో ముగింపు
బీటెక్‌లో అనిల్‌తో పరిచయం 2002లో కులాంతర వివాహం మూడేళ్ల పాటు లండన్‌లో ఉద్యోగం చేసిన సారిక హన్మకొండ : ఇంజనీరింగ్ కాలేజీలో అనిల్, సారిక మధ్య మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకున ఈ జంట చివరికి వివాదాలతో సావాసం చేశారు. ఆఖరికి ఉన్నత విద్యావంతురాలైన సారిక ప్రేమ పెళ్లి విషాదంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరి గ్రామానికి చెందిన శ్రీనివాసాచారి, లలిత దంపతుల రెండో కూతురు సారిక హుజురాబాద్‌లోని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1998వ సంవత్సరంలో ఇంజనీరింగ్‌లో చేరారు. అదే కాలేజీలో చదువుతున్న మాజీ ఎంపీ రాజయ్య, మాధవి కుమారుడు అనిల్ పరిచమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఎదిరించి 2002 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 వరకు మూడేళ్లపాటు లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసింది. వీరికి అభినవ్ (7)తో పాటు కవలపిల్లలు శ్రీయాన్(3), అయాన్(3) సంతానం. సారిక రెండో సారి గర్భిణీగా ఉన్న సమయంలో అనిల్ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. అనిల్ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో సారిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముగ్గురు చంటి పిల్లలతో రాజయ్య ఇంటి ముందు ధర్నా చేసింది. న్యాయస్థానం, పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయితే రాజయ్యకు ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా సరైన న్యాయం జరగట్లేదని సారిక ఆవేదన చెందేది. ఆఖరికి ఇంటి ఖర్చులకు సైతం డబ్బులు సమకూర్చకపోవడంతో ఇబ్బందులు పడేది. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజయ్యను పోటీలో నిలపొద్దంటూ ఏఐసీసీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు సారిక ఈ మెయిల్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీని విషయమై కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే రాజయ్య ఇంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సారిక, ఆమె ముగ్గురు కుమారులు మరణించారు. -
సారికను తీవ్రంగా వేధించారు
-
సారికను తీవ్రంగా వేధించారు
దర్యాప్తులో తేల్చిన బేగంపేట మహిళా పోలీసులు భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సారికను ఇంట్లోకి రానీయకుండా విడిగా ఉంచారు 2014లో కోర్టు ఆదేశం మేరకు కేసు నమోదు అత్తింటి వేధింపులపై కింద టేడాది రాజయ్య కోడలు ఫిర్యాదు హైదరాబాద్: మాజీ ఎంపీ రాజయ్య కుమారుడు అనిల్, వారి కుటుంబసభ్యులు సారికను తీవ్రంగా వేధించారని హైదరాబాద్‌లోని బేగంపేట మహిళా పోలీసుస్టేషన్ అధికారులు నిర్ధారించారు. ఆమె భర్త సనా అనే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ సారికను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని తేల్చారు. 2014 ఏప్రిల్‌లో సారిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనిల్‌పై సెక్షన్ 498 (వేధింపులు), సెక్షన్ 494 (వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు) కింద అభియోగాలు నమోదుచేశారు. అప్పట్లో న్యాయస్థానం ద్వారా వస్తే తప్ప సారిక ఫిర్యాదు కేసుగా మారలేదు. తనను వేధించిన వారిలో భర్తతోపాటు మామ రాజయ్య, అత్త మాధవి, సనా కూడా ఉన్నారని సారిక తన ఫిర్యాదులో ఆరోపించింది. వీరు తనను పనిమనిషి కంటే హీనంగా చూస్తున్నారని తెలిపింది. దర్యాప్తులో రాజయ్య ప్రమేయం వెలుగులోకి రాకపోవడంతో మిగతా ముగ్గురిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. సారికను ఇంటి పైఅంతస్తులో విడిగా ఉంచిన రాజయ్య కుటుంబం నెలవారి ఖర్చులకూ డబ్బు ఇవ్వకుండా వేధించిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఆమెతో సహా పిల్లల్నీ ఇంట్లోకి రానీయలేదని, పిల్లల చదువులకు అవసరమైన డబ్బులూ అందించకుండా నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని అభియోగాలు మోపారు. ఇన్స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లయిన తర్వాత కొన్నేళ్లు బాగానే ఉన్నప్పటికీ సనా అనే యువతితో అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్నుంచి వారి ఇంటి పైఅంతస్తులో సారికను విడిగా ఉంచారు. వీటిని తాళలేక సారిక కోర్టును ఆశ్రయించింది. వరంగల్‌లో రాజయ్య తన రాజకీయ పలుకుబడితో కేసును నీరుగారుస్తారని, ఈ కేసును తాను వివాహం చేసుకున్న మారేడ్‌పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంతానికి సిఫారసు చేయాలని సారిక అప్పీలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే వివాహం జరిగిన ప్రాంతం ఆధారంగా కోర్టు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసును అప్పగించింది. అనంతరం పలుమార్లు అనిల్, సారికలకు పోలీసులు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ అనిల్‌లో మార్పు రాలేదని తనకు, పిల్లలకు న్యాయం చేయాలంటూ సారిక మళ్లీమళ్లీ పోలీసుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో జరిగిన విచారణలో భాగంగా భర్త అనిల్, అత్త మాధవితో పాటు సనాపైనా చార్జీషీటు దాఖలు చేశారు. -
హత్యా? ఆత్మహత్యా?
సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనేక అనుమానాలు వరంగల్: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యా? ఆత్మహత్యా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సారికను హత్య చేసేందుకే గ్యాస్ లీక్ చేసి అగ్నిప్రమాదం సృష్టించారని ఆమె కుటుంబీకులు, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్యాస్ లీక్ చేసుకుని సారికే ఆత్మహత్యకు పాల్పడిందని రాజయ్య కుటుంబీకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు స్థానిక ఫోరెన్సిక్ నిపుణులతోపాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. అనుమానాలు రేకెతిస్తున్న అంశాలివే.. అగ్ని ప్రమాదానికి కారణమైన రెండు గ్యాస్ సిలిండర్లు వంటగదిలో కాకుండా బెడ్రూంలో ఎందుకు ఉంటాయనేది ప్రధాన అనుమానం. సిలిండర్లోని గ్యాస్‌ను లీక్ చేయాలంటే రెగ్యులేటర్ ఉంటేనే సాధ్యపడుతుంది. కానీ రెగ్యులేటర్లు వంట గదిలోనే ఉన్నాయి. బెడ్రూంకు తీసుకొచ్చిన సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేయాలంటే ఎంతో బలం ఉపయోగించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సారిక చనిపోయిన గదిలో లైట్, స్విచ్చ్ దగ్గర కాలిపోయినట్లు నల్ల మరకలు ఉండడం కూడా అనుమానం కలిగిస్తోంది. గ్యాస్‌ను ఎవరైనా బయట నుంచి గది లోపలికి వదిలితే.. వాసన వచ్చి లైటు వేయగా ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నిక ఉన్నందున రాజయ్య కుటుంబం ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండదని ఆయన అనుచరులు చెబతున్నారు. వీటన్నింటికీ ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ద్వారానే ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. పిల్లల స్కూలు ఫీజులు కూడా చెల్లించలేని స్థితి! రాజయ్య ఇంట్లో మంగళవారం రాత్రి సారిక, ఆమె భర్త అనిల్ మధ్య గొడవ జరిగినట్లు స్థానిక మహిళలు తెలిపారు. ‘రేపు మీ సంగతి తేలుస్తా..’ అని సారిక రాత్రి సమయంలో అన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలే ఘటనకు దారి తీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవనభృతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా అనిల్ పట్టించుకోలేదని, సారిక తరచుగా తమతో బాధలు చెప్పుకునేదని స్థానికులు తెలిపారు. ఫీజులు కూడా చెల్లించకపోవడంతో స్కూల్ నుంచి పిల్లల్ని పంపించారని ఇటీవల ఆమె వాపోయినట్లు పేర్కొన్నారు. -
బతుకమ్మకు పుట్టింటికి వచ్చి..
కుటుంబీకులతో సంతోషంగా గడిపిన సారిక మృతితో తల్లడిల్లిన తల్లిదండ్రులు అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాద ఛాయలు సదాశివనగర్: బతుకమ్మ, దసరా పండుగకు నిజామాబాద్ జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని తన పుట్టింటికి వచ్చిన సారిక... తల్లిదండ్రులు, బంధువులతో సంతోషంగా గడిపింది. పుట్టింటి నుంచి వెళ్లిన కొద్దిరోజులకే తన కూతురు పిల్లలతో సహా సజీవ దహనమైందన్న సంగతి తెలిసి తల్లి హృదయం తల్లడిల్లింది. అనారోగ్యంతో ఉన్న తండ్రికి విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. వంగల శ్రీనివాస్‌చారి, లలిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అర్చన, సారిక, దీపిక. సారిక రెండో కూతురు. బుధవారంనాటి ఘటన తెలియగానే అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో విషాదం అలుముకుంది. ముగ్గురు పిల్లలు కూడా సజీవ దహనం కావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతు న్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అంటున్నారు. అత్తింటి వారే చంపారు.. తమ కూతురు సజీవదహనం కావడానికి భర్త అనిల్, అత్త మాధవి, మామ రాజయ్యలే కారణమని సారిక తల్లి లలిత, సోదరి అర్చన ఆరోపించారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘మా కూతురు ముగ్గురు కుమారులను చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కావాలనే కక్షతోనే చంపేశారు. సారిక భర్త, అత్త, మామలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని లలిత అన్నారు. అర్చనతో కలిసి బుధవారం సాయంత్రం లలిత వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. ‘నా బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఆమె విలపించారు. పిల్లల స్కూల్ ఫీజులు సైతం చెల్లించకుండా సారికను ఇబ్బంది పెట్టారని అర్చన తెలిపారు. -
మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోరం..!
కోడలు, ముగ్గురు మనవళ్లు అగ్నికి ఆహుతి తెల్లవారుజామున గ్యాస్ లీకేజీతో ప్రమాదం! మూడేళ్లుగా కుటుంబ తగాదాలు.. మరో వివాహం చేసుకున్న రాజయ్య కొడుకు అనిల్ 2014లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోడలు అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారంటూ కేసు సారిక మృతిపై అనేక అనుమానాలు.. వంటింట్లో ఉండాల్సిన సిలిండర్లు బెడ్రూంలోకి ఎలా వచ్చాయి? ఎవరూ ఊహించని పరిణామం.. వరంగల్ ఉప ఎన్నికల ముంగిట పెద్ద షాక్.. అందరినీ నిశ్చేష్టులను చేసే దిగ్భ్రాంతికర ఘటన.. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు! బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటు చేశారు. రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల్లో విచారణ నివేదిక రానుంది. కాగా వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి రాజయ్య తప్పుకున్నారు. సాక్షి, హన్మకొండ: రాజయ్య నివాసంలో తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకే గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. సారికతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు పడక గది తలుపు వద్ద నేలపై, మరో బాలుడి మృతదేహం బెడ్‌పై పడి ఉన్నాయి. ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాదం జరిగినట్లు రాజయ్య ఇంటి నుంచి ఐదు గంటల సమయంలో ఫోన్‌కాల్ వచ్చింది. మేం వచ్చి చూసేసరికి ఇంటి మొదటి అంతస్తులో కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. ఈ మరణాలపై శాస్త్రీయంగా విచారణ జరిపిస్తాం.’’ అని తెలిపారు. ఘటన చోటుచేసుకున్న గది వద్దకు పోలీసులు.. మీడియాతో పాటు ఇతరులెవరినీ అనుమతించలేదు. రాజయ్య ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మూడేళ్లుగా గొడవలే.. రాజయ్య, మాధవి దంపతులకు అనిల్ ఒక్కడే సంతా నం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అనిల్‌కు నిజామాబాద్ జిల్లా అడ్లూరుకు చెందిన సారికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్మేట్స్. కాలేజీ హాస్టల్లోనే ఉండేవారు. ఆ సమయంలోనే ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా 2002లో హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. 2003లో చదువుల నిమిత్తం అనిల్ లండన్ వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సారిక కూడా లండన్‌కు వెళ్లింది. 2005లో తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహ విషయం తెలుసుకున్న రాజయ్య కుటుంబీకులు అందరి సమక్షంలో యాదగిరిగుట్టలో పెళ్లి చేశారు. కొన్నాళ్లపాటు బాగానే ఉన్న వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనిల్.. సనా అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. దీంతో గత మూడేళ్లుగా రాజయ్య కుటుంబ సభ్యులు, సారిక మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసింది. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. సొంతింటికి రావడంతో: గొడవల కారణంగా రాజయ్య హన్మకొండ రెవెన్యూ కాలనీలోని తన సొంత ఇంటిని కోడలికి ఇచ్చి కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఓ అపార్టుమెంట్లో కొంతకాలంగా ఉంటున్నారు. రాజయ్య భార్య మాధవి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజయ్యతోపాటే ఉంటున్నారు. భర్త అనిల్ సారిక ఇంటికి రావడం మానేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చేవారు కాదని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సమయంలో అనిల్, సారికకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ రావడంతో మూడ్రోజుల క్రితమే రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో అపార్టుమెంట్ కంటే సొంత ఇళ్లు బాగుంటుందని భావించిన ఆయన... ఇటీవలే రెవెన్యూ కాలనీలోని తన సొంతింటికి మారా రు. కింది పోర్షన్లో రాజయ్య దంపతులు, ఒకటో అంతస్తులో సారిక కుటుంబం ఉంటోంది. రెండో అంతస్తులోని పెంట్‌హౌస్‌కు అనిల్ వచ్చి వెళ్తుంటారని తెలిసింది. అందరూ ఒకేచోట చేరడంతో రెండ్రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం. బెడ్రూంలోకి సిలిండర్లు ఎలా వచ్చాయి? సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్రూమ్కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్రూమ్కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తన కూతురు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. రాజయ్య కుటుంబీకులే తన కూతురి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. నాలుగు మృతదేహాలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సారిక తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. సమయం మించిపోవడంతో పోస్టుమార్టంను వైద్యులు గురువారానికి వాయిదా వేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నా: రాజయ్య వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కోడలు, ముగ్గురు మనవళ్లు సజీవ దహనమైన సంగతి తెలియగానే పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రాజయ్య నివాసానికి తరలివచ్చాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీలు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ‘‘ఉప ఎన్నికల్లో నేను నిలబడను.. పోటీ నుంచి విరమించుకుంటాను’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా నేతలు పీసీసీ అధ్యక్షుడికి వివరించడంతో మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సంప్రదింపులు జరిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఘటనాస్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. దర్యాప్తు తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. -
'డబ్బు ఆశతోనే నా బిడ్డను చంపిన్రు'
వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్యకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ అని సారిక తల్లి తెలిపారు. తన కూతురు చాలా ధైర్యవంతురాలు అని, తాను బతికుండగానే ఎన్నో కష్టాలను స్వయంగా భరించిందని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వివరించారు. తన కూతురు జాబ్ చేసిన పైసలన్నీ రాజయ్య కుటుంబానికే ఇచ్చిందని, ఒక్క పైస కూడా తన వద్ద ఉంచుకునేది కాదని తెలిపారు. ప్రేమ వివాహం కారణంగా కట్నం లేదని వారు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తారో అని నిత్యం కష్టపడి వారికి ప్రతి రూపాయి ఇచ్చిందని పేర్కొన్నారు. 'నేనుండగానే ఎన్నో బాధలు పడ్డది నా బిడ్డ. ఆమె చాలా ధైర్యవంతురాలు. మొన్నే ఫోన్ చేసింది. మంచిగానే ఉన్నా.. ఏమైనా గొడవైతే నేనే చూసుకుంటాను. మీరు రాకండి అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నాయన ఆరోగ్యం కూడా మంచిగ లేదు అని చెప్పింది. నా బిడ్డను వీళ్లే చంపిన్రు.. నా మనవళ్లను కూడా వీళ్లే హత్య చేసిర్రు. నా బిడ్డనాకే ధైర్యం చెప్పేది. నేను అన్ని సరుకులు పంపించినా. ఆమెకు ఎలాంటి అవసరాలు ఉన్నా అందించినా. నా బిడ్డకు వాళ్లు ఏనాడు సరిగా సహాయపడలేదు.. సరిగా చూసుకోలేదు. వాళ్ల అత్తమామకు(రాజయ్య ఆయన భార్య) డబ్బు ఆశ ఎక్కువ. వాళ్లే చంపేశారు' అంటూ ఆమె తీవ్రంగా రోధించింది. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. -
'సారికను చంపిన వాళ్లను అలాగే చంపాలి'
-
అసలు రాజయ్య ఇంట్లో ఏం జరిగింది ?
-
'సారికను చంపినవాళ్లను అలాగే చంపాలి'
వరంగల్: తన కూతురు సారికను, తన మనవళ్లను చంపినవాళ్లను అలాగే చంపాలని సారిక తల్లి అన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చెప్పారు. బుధవారం తెల్లవారుజామున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆయన ముగ్గురు మనవళ్లు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కూతుర్ని, మనవళ్లను చిత్ర హింసలు పెట్టి హత్య చేశారని సారిక తల్లి ఆరోపించారు. రాజయ్య కొడుకు అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడని.. తన కూతురు, మనవళ్లను వైదొలగించుకోవడానికి వారి ప్రాణాలు తీశాడని సారిక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. నిజామాబాద్ జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన సారికను రాజయ్య కుమారుడు అనిల్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. సారిక, ఆమె కొడుకుల మరణవార్త తెలుసుకున్న సారిక పుట్టింటివారు వరంగల్ వచ్చారు. -
’హత్యా..ఆత్మహత్యా అనేది విచారణలో తెలుస్తుంది’
-
పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబసభ్యులు
-
పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబసభ్యులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజయ్య తదితరులను తరలించే సమయంలో పలువురు మహిళలు పోలీసు వాహనాలకు అడ్డు రాగా, వారిని తోసేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారని సీపీ చెప్పారు. అగ్నిప్రమాదం వల్లే సారిక, పిల్లలు మరణించారని, అయితే అది ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం అప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా అన్న విషయం విచారణలో మాత్రమే తేలుతుందని చెప్పారు. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
పోలీసుల అదుపులో రాజయ్య కుటుంబసభ్యులు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సారిక, ఆమె ముగ్గురు కుమారుల అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, వారి కుమారుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి ఇంటివద్దే విచారణ సాగించిన తర్వాత.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాజయ్యపై ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు పెట్టారు. సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజయ్య తదితరులను తరలించే సమయంలో పలువురు మహిళలు పోలీసు వాహనాలకు అడ్డు రాగా, వారిని తోసేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఘటన జరిగినప్పుడు రాజయ్య, ఆయన భార్య, అనిల్ ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారని, డ్రైవర్లు కూడా అక్కడే ఉన్నారని సీపీ వివరించారు. ఈ కేసు అనుమానాస్పద మృతిగా తేలడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. విచారణను శాస్త్రీయంగా సాగిస్తామని, వైద్యులు ఇచ్చే నివేదికలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు
-
రాజయ్య కోడలు మరణం; అన్ని కోణాల్లో దర్యాప్తు
వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు మరణించిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటన ఎలా జరిగిందో చెప్పలేమన్నారు. డీఐజీ మల్లారెడ్డితో కలిసి రాజయ్య ఇంటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగిందని, 5 గంటలకు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు మృతి చెందారని చెప్పారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు వివరాలు సేకరించారని చెప్పారు. రాజయ్య కోడలు, మనవళ్లు మృతి చెందిన గదిలో గ్యాస్ సిలెండర్ మాత్రమే ఉందన్నారు. ఘటన జరిగినప్పుడు సారిక భర్త అనిల్ ఎక్కడున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు నవీన్ చంద్ తెలిపారు. -
నా సోదరిని వాళ్లే చంపేశారు...
-
నా సోదరిని వాళ్లే చంపేశారు...
వరంగల్ : సారిక మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని సారిక సోదరి అర్చన ఆరోపించారు. గతంలోనూ సారికను చాలాసార్లు వేధించారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. సారిక స్వస్థలం నిజామాబాద్ జిల్లా అడ్డూరు ఎల్లారెడ్డి. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్త మామ, భర్తే సారికను హతమార్చారని సోదరి అర్చన వ్యాఖ్యానించారు. రాజయ్య కుటుంబ సభ్యులను వదలొద్దని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా కూతురితో పాటు మనవళ్లు అగ్నికి ఆహుతి అవటంతో సారిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అత్త, మామ, భర్త...తన బిడ్డను మొదట్నించి వేధిస్తున్నారని మృతురాలు సారిక తల్లి లలిత కంటతడి పెట్టారు. దసరా పండుగకు తమ ఇంటికి వచ్చి వెళ్లిన బిడ్డ...ఇప్పుడు విగత జీవిగా మారిందంటూ విలపించారు. -
నలుగురు పూర్తిగా కాలిపోయారు..
-
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు
-
విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి: సీపీ
వరంగల్ : కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మరణంపై పోలీసుల విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ... ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ దుర్ఘటనపై ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని సీపీ అన్నారు. ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు పూర్తిగా కాలిపోయారని, గ్యాస్ ఎలా లీక్ అయిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సారిక మృతికి సంబంధించి వివరాలను ఆమె ...అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా సారిక భర్త అనిల్ నిన్ననే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు సమాచారం. గత రాత్రి రాజయ్య కుటుంబ సభ్యులకు, సారిక మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. -
హత్యా? ఆత్మహత్యా?
-
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై మళ్లీ కసరత్తు
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు మరణంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో పోటీకి రాజయ్య విముఖత చూపడటంతో మరో నేతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో స్థానిక అభ్యర్థుల వివరాలను సేకరించే పనిలో పడింది. మరో అభ్యర్థి ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని పలువురు నేతలకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజయ్య కోడలి మరణంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసింది. రాజయ్య ఇంట్లో ఘటన చాలా విషాదకరమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరో గంటలో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ప్రకటన చేస్తామన్నారు. అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ పెద్దలతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నారు. -
కోడలితో రాజయ్య కుటుంబానికి గొడవలు
-
'సారిక పిరికిది కాదు'
-
కోడలితో రాజయ్య కుటుంబానికి గొడవలు
వరంగల్ : ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్-సారికలది ప్రేమ వివాహం. 2006లో పెద్దవాళ్లకు తెలియకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లిచేసుకున్న వీరు... అమెరికా వెళ్లిపోయారు. అక్కడ సారిక ఉద్యోగం చేసేది. ఆమె సంపాదనతోనే భర్త అనిల్ జల్సాలు చేసేవాడని సమాచారం. కొన్నాళ్ల తర్వాత ఇండియా వచ్చిన వీరు... తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో రాజయ్య కుటుంబం... సారికను ఇంట్లో నుంచి గెంటేశారు. కొద్దిరోజుల తర్వాత రాజీ కుదిరి యాదగిరిగుట్టలో పెద్దలంతా కలిసి మళ్లీ అనిల్-సారికల పెళ్లి చేశారు. ఆ తర్వాత సారిక-అనిల్‌ను చిలకలగూడలో ఓ ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టారు. అయితే అనిల్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడంతో.... విసుగు చెందిన సారిక భర్తతోపాటు వరంగల్‌లోని అత్తింటికి వచ్చేసింది. ఆ తర్వాత చిలకలగూడలోని ఫ్లాట్‌లో... అనిల్ మరో అమ్మాయితో వుంటున్నాడని తెలుసుకున్న సారిక... అతనితో గొడవపడింది. అనిల్ తల్లిదండ్రులు కూడా కొడుకునే సపోర్ట్ చేయడంతో సారిక పోలీసులను ఆశ్రయించింది. ఇల్లు వదిలి వెళ్తే పరువు పోతుందని... ఇంట్లో ఉంటూనే భర్త, అత్తమామలపై చాలాసార్లు కేసు పెట్టింది. 2002 సంవత్సరంలో రాజయ్య కొడుకు అనిల్‌తో సారికకు పరిచయం ఏర్పడింది. 2006లో అనిల్, సారిక ప్రేమ వివాహం జరిగింది. రాజయ్య కోడలు సారికది నిజామాబాద్ జిల్లా. తనను, తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, గతంలో అనేక సార్లు సారిక నిరసనకు దిగింది. కోర్టులో కేసు వేయగా అది విచారణలో ఉంది. కొద్దిరోజుల కిందట రాజయ్య ఇంటిముందు ధర్నాకు దిగారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై సారిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము వచ్చేంతవరకు మృతదేహాలను కదిలించవద్దని పోలీసులను అభ్యర్థించినట్లు సమాచారం. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నందున అగ్నిప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీద్ బాబు స్వయంగా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజయ్య కోడలు, మనవళ్ల మృతితో వారు నివసిస్తున్న ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. -
'సారిక పిరికిది కాదు'
వరంగల్: కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె పిల్లల సజీవ దహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్న నేపథ్యంలో సారిక, ఆమె పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రాజయ్య కుమారుడు అనిల్, కోడలు సారిక మధ్య కొన్నేళ్లుగా సఖ్యత లేదని స్థానికులు తెలిపారు. ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని, ఏడాది నుంచి పిల్లలతో ఇంట్లో కోడలు మాత్రమే ఉంటోందని చెప్పారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు. పిల్లలకు చిన్నదెబ్బ తగిలిన ఆమె తట్టుకోలేకపోయేదని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ పేలితే పెద్ద శబ్దం వచ్చేది కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా వడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన సారికను రాజయ్య కుమారుడు అనిల్ 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో రాజయ్య కుటుంబంపై ఆమె 498 కేసు పెట్టింది. -
ప్రయోగాలకు డాడీ భయపడరు..
ముంబై: 'డాడీ ఎవ్వరికీ భయపడరు. ప్రయోగాలు చేయడానికి ఆయన అస్సలు వెనక్కి తగ్గరు. ఏదైనా సరికొత్తగా ట్రై చేయడమంటే డాడీకి చాలా ఇష్టం. పప్పా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి' అంటూ తన తండ్రిని తలుచుకొని మురిసిపోతున్నది మరెవ్వరో కాదు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రుతిహాసన్. ఆమె నటించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్' (మే 1) విడుదలైన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమె... తల్లిదండ్రులు సారిక, కమల్ హసన్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. అమ్మ సారిక చాలా దృఢంగా, స్వాతంత్ర్యంగా ఉంటారనీ... నాన్నకు సంబంధించినంతవరకు ఒక నటుడిగా ఆయన ఎవ్వరికీ భయపడరని తెలిపింది. అమ్మ స్పాంటేనియస్‌గా నటిస్తే.. నాన్న కమల్ చాలా సహజంగా నటిస్తారని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తన సోదరి, షమితాబ్ సినిమా హీరోయిన్ అక్షర హాసన్‌పై పొగడ్తలు గుప్పించింది శ్రుతి. ఆమె తన సోదరి కావడం గర్వంగా ఉందని మురిసిపోయింది. కాగా క్రిష్ దర్శకత్వంలో అక్షయ కుమార్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో కరీనా కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
స్త్రీ గొప్పతనం తెలిపే కథ
నేటి సమాజంలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ప్రేమ, త్యాగం, ధైర్యం, సహనం, సాహసం ఇవన్నీ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘లాక్’. సంతోష్, సారిక జంటగా నటిస్తున్నారు. పార్గవన్ దర్శకత్వంలో కె.లక్ష్మణమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తమిళ నిర్మాత శ్రీమతి సెల్వి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ క్లాప్ ఇచ్చారు. వినోదంతో కూడిన చక్కని లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదని నిర్మాత అన్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, వైజాగ్, అరకు, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను విడుదల చేస్తామనీ దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: రాజ్దొరై, మాటలు: కేశవ్ పప్పుల, సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: శ్రవణ్‌కుమార్. -
ఎంపీ రాజయ్యకు బెయిల్ మంజూరు
బెయిల్ రద్దు చేయించి, అతని కుమారుడ్ని అరెస్టు చేయండి హైదరాబాద్: వరకట్న వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న వరంగల్ ఎంపీ రాజయ్య దంపతులకు బెయిల్ లభించింది. బెయిల్ షూరిటీ కాపీలను వారు శుక్రవారం బేగంపేట మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ ధనలక్ష్మికి అందజేశారు. ఇదిలాఉండగా, బెయిల్‌ను రద్దు చేయించి, కేసులో ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేయాలని రాజయ్య కోడలు సారిక డిమాండ్ చేసింది. తనను అత్తమామలు, భర్త అనిల్ వేధిస్తున్నారని రాజయ్య కోడలు సారిక చేసిన పిర్యాదు మేరకు రాజయ్యతో పాటు కుటుం బ సభ్యులపై బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజయ్య కుటుంబం ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కేసులో రెండవ నిందితుడిగా ఉన్న రాజయ్య, మూడవ నిందితులుగా ఉన్న ఆయన బార్య మాధవిలకు బెయిల్ మంజూరయింది. ప్రధాన నిందితుడిగా ఉన్న రాజయ్య కుమారుడు అనిల్‌కుమార్‌కు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో శుక్రవారం సాయంత్రం రాజ య్య దంపతులు మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ధనలక్ష్మి వద్ద లొంగిపోయారు. అధికారులకు బెయిల్ పత్రాలు సమర్పించి వారు వెళ్లిపోయారు. రాజయ్య కుమారుడు అనిల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. పిల్లలను ఆదుకోండి: సారిక ఇదిలా ఉండగా, తన భర్త అనిల్‌కు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు సిద్ధమయ్యారని సారిక ఆరోపించారు. అనిల్‌ను అరెస్టు చేసి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తన అత్తమామకు లభించిన బెయిల్‌ను కూడా రద్దు చేయించేందుకు పోలీసు అధికారులు సహకరించాలని ఆమె కోరారు. తన ముగ్గురు పిల్లలను హీనంగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీసం తిండి, పాలు కూడా లేవని, వారి పోషణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆమె ‘న్యూస్‌లైన్’తో వేడుకున్నారు. -
అమితాబ్, సారిక జోడీగా!
అమితాబ్ బచ్చన్, సారిక జంటగా నటిస్తున్నారా? బాలీవుడ్ వార్తల ప్రకారం ఔననే చెప్పాలి. అయితే, ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నది వెండితెర కోసం కాదు. బుల్లితెరపై ఈ జోడీ కనిపించనుంది. 30, 35 ఎపిసోడ్స్‌గా సాగే ఓ ధారావాహికలో ఈ ఇద్దరూ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌కు ఇద్దరు భార్యలు ఉంటారట. మొదటి భార్యకు దూరమైనప్పటికీ, ఆ తర్వాత తమ కుమార్తె ద్వారా దగ్గరవుతారట అమితాబ్. ఆ మొదటి భార్య పాత్రను సారిక చేస్తున్నారు. ఈ ధారావాహికకు అమితాబ్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ధారావాహిక ప్రసారం కానుందని సమాచారం. -
విషాదం
అప్పటివరకు ఆ ఇంట సందడి వాతావరణం. ఇంతలోనే గ్రామదేవతను చూసేందుకు చిన్నారిని తీసుకుని ఇద్దరు మహిళలు బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకునే ముందు కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఏడాది వయస్సున్న చిన్నారి ఆచూకీ లభించలేదు. ఈ విషాదకర సంఘటన రేణిగుంట మండలం అల్లిమిట్ట వేమాలమ్మ గుడి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రేణిగుంట, న్యూస్‌లైన్: అల్లిమిట్టకు చెందిన రంగనాథం కుమా ర్తె సరళ(20)ను తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె వాసి రాజాకు ఇచ్చి వివాహం చేశా రు. ఆదివారం కావడంతో సరళ తన భర్త రాజా, ఇద్దరు కుమార్తెలు దీప్తి(3), సారిక(1) లతో అల్లిమిట్టకు వచ్చింది. బిడ్డ ఇంటికి రావడంతో రంగనాథం ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరళ తన చిన్నకుమార్తె సారిక, పెదనాన్న కుమార్తె చిట్టె మ్మ అలియాస్ కృష్ణకుమారి(18)తో కలిసి సమీపంలోని వేమాలమ్మ ఆలయానికి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరింది. కాళ్లు కడుక్కునేందుకు ఆలయ సమీపంలోని బావి వద్దకు చేరుకున్నారు. నీరు నిండుగా ఉండడంతో పాచి పట్టి ఉండడాన్ని గుర్తించలేదు. చిన్నారి సహా సరళ, కృష్ణకుమారి బావిలో పడిపోయారు. వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆలయం వద్దకు చేరుకున్నారు. సమీప పొలాల వద్దనున్న రైతులను వివరాలు అడిగారు. ఇద్దరు మహిళలు బిడ్డను తీసుకుని బావి వద్దకు వెళుతుండగా చూశామని వారు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. సరళ, కృష్ణకుమారి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. ఎంతకీ సారిక ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలా న్ని పోలీసులు పరిశీ లించారు. బాధిత కుటుం బాలను సర్పంచ్ పేరూరు మునిరెడ్డి భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకుడు పేరూరు పురుషోత్తంరెడ్డి, మునిరత్నం పరామర్శించారు. -
శృతి నాతో ఉండదు
శృతి నాతో కలసి ఉండదు. అలా కలిసుండాలని కోరుకోవడం కూడా సరికాదు అంటున్నారు ఆమె తల్లి, నటి సారిక. నటుడు కమలహాసన్‌తో మనస్పర్థల కారణంగా విడిపోయి సారిక ముంబయిలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇద్దరు కూతుళ్లు ముంబయిలోనే ఉంటున్నారు. పెద్ద కూతురు శృతిహాసన్ వేరుగా జీవిస్తున్నారు. చిన్న కూతురు అక్షర మాత్రం సారికతోనే ఉంటున్నారు. ఇటీవల ముంబయిలో ఒక దుండగుడు శృతి ఇంటిలో చొరబడడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. పోలీసులు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటన తరువాత శృతి మీతో కలసి నివసిస్తారా? అన్న ప్రశ్నకు సారిక బదులిస్తూ శృతి ఇంటిలో జరిగిన సంఘటన తనను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. సెలబ్రిటీలకే కాదు సాధారణ ప్రజలు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి దస్సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో శృతికి తెలుసన్నారు. ఇకపోతే శృతి తనతో కలిసుంటుందా? అని అడుగుతున్నారని, శృతి బిజీ హీరోయిన్ అని ఆమె షూటింగ్‌ల కోసం పలు ప్రాంతాలకు వెళ్లవలసి వుంటుందని అన్నారు.ఆమెకు వృత్తి ముఖ్యం అని పేర్కొన్నారు. అదే విధంగా పిల్లలు పెరిగిన తరువాత స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారని అలాంటి వారిని మన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించరాదని సారిక అన్నారు. -
పెళ్లి అనేది పాత కాన్సెప్ట్!
కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయడానికి ఆరాటపడే కమల్‌హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివాహ బంధం గురించి మాట్లాడుతూ.. ‘అది చాలా పాత కాన్సెప్ట్’ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఆయన మాజీ భార్య సారిక ఈ మధ్య ‘పెళ్లనేది ఓ అందమైన కాన్సెప్ట్’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కమల్ దగ్గర ప్రస్తావించినప్పుడు -‘‘నా దృష్టిలో పెళ్లి అందమైన కాన్సెప్ట్ కాదు. అదొక చట్టపరమైన షరతులాంటిది. ఒక్కరితోనే జీవితం పంచుకుని తీరాలని ఆ షరతు ఒత్తిడి చేస్తుంది. అందుకే చెబుతున్నా.. ఒకవేళ ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే.. ఆ ప్రేమకు షరతులతో, ఒప్పంద పత్రాలతో సంబంధం లేదు. అవేవీ లేకపోయినా ప్రేమగా ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు మూడు రోజుల క్రితం శ్రుతిహాసన్ ఇంట్లోకి ఓ అపరిచితుడు చొరబడటానికి ప్రయత్నం చేసిన విషయం గురించి కమల్ని అడిగితే - ‘‘కన్నబిడ్డకు ఇలాంటిది జరిగితే ఏ తండ్రయినా ఆందోళన చెందుతాడు. ఈ వార్త విన్నప్పుడు కంగారుపడ్డాను. సేఫ్‌గా ఉండమని శ్రుతికి చెప్పాను. తను చాలా ధైర్యవంతురాలు. తల్లిదండ్రులు విడిపోవడం చూసిన అమ్మాయి. ఆ సంఘటనను డీల్ చేయడం అంత సులువు కాదు. అయితే మంచికో చెడుకో తనకు మాత్రం ఆ సంఘటన చాలా నేర్పించింది’’ అని తెలిపారు. -
జీవిత చరిత్రకు ‘నో’
ఓ విజయవంతమైన సినిమాలో ఉండే మలుపులు, మెరుపులు, మసాలాలు, ఇంకా ఎన్నెన్నో విలాపాలూ విలాసాలూ వివాదాలూ కమల్‌హాసన్ జీవితంలో కూడా ఉంటాయి. అందుకే కమల్‌హాసన్ జీవిత విశేషాలతో ఓ పుస్తకం వస్తే అది కచ్చితంగా హాట్ కేక్ అవుతుంది. ఎందుకంటే, ఆయన వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం.. రెండూ పసందుగానే ఉంటాయి. పైగా, కమల్‌తో కొన్నేళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న ఆయన మాజీ భార్య సారిక స్వయంగా తన మాజీ భర్త జీవిత చరిత్ర రాస్తే... ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఆ పుస్తకాన్ని ప్రచు రించడానికి బోలెడంతమంది పోటీపడతారు. ప్రస్తుతం కమల్ జీవిత చరిత్ర రాసే పని మీద ఉన్నారట సారిక. ఇది కమల్‌కి ఏమాత్రం రుచించడంలేదట. దీని గురించి తెలిసిన కమల్.. ‘‘నా లైఫ్ కాంట్రవర్షియల్. నా అంగీకారం లేకుండా రాసే రాతలు నా పిల్లలను బాధించకూడదనుకుంటున్నాను’’ అని తన ఫ్రెండ్ దగ్గర పేర్కొన్నారట. ఏదేమైనా తన జీవిత చరిత్రను సారిక రాయడం కమల్‌కి ఇష్టం లేదని అర్థమవుతోంది. ఈ మాటలు ఆ నోటా ఈ నోటా సారికకు చేరే ఉంటాయి. మరి... కమల్ జీవిత చరిత్ర రాయాలనే తన నిర్ణయాన్ని సారిక మార్చుకుంటారో లేక అన్ని విషయాలనూ బయటపెడతారో కాలమే జవాబు చెప్పాలి.