
స్త్రీ గొప్పతనం తెలిపే కథ
నేటి సమాజంలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ప్రేమ, త్యాగం, ధైర్యం, సహనం, సాహసం ఇవన్నీ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘లాక్’. సంతోష్, సారిక జంటగా నటిస్తున్నారు. పార్గవన్ దర్శకత్వంలో కె.లక్ష్మణమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తమిళ నిర్మాత శ్రీమతి సెల్వి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ క్లాప్ ఇచ్చారు.
వినోదంతో కూడిన చక్కని లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదని నిర్మాత అన్నారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తామనీ, వైజాగ్, అరకు, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను విడుదల చేస్తామనీ దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: రాజ్‌దొరై, మాటలు: కేశవ్ పప్పుల, సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: శ్రవణ్‌కుమార్.