Santosh
-
ఆస్కార్ నామినేషన్.. ఇండియాలో రిలీజ్‌కు నోచుకోని చిత్రం
యూకే నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమా సంతోష్ (Santosh Movie). బ్రిటీష్ ఇండియన్ ఫిలిం మేకర్ సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ మూవీ భారత్‌లో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. కొన్ని సన్నివేశాలను తీసేయమని కోరిందని, అది ఇష్టం లేకపోవడం వల్లే భారత్‌లో దీన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది.ఎంతో ప్రయత్నించా..దీని గురించి సంధ్యా సూరి (Sandhya Suri) మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన సమస్యలు భారత్‌కు కొత్తేమీ కాదు. వీటి గురించి గతంలోనూ ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. అయినప్పటికీ మా సినిమా రిలీజ్‌కు ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం నచ్చట్లేదేమో! ఈ మూవీని భారత్‌లో రిలీజ్ చేయడం నాకెంతో అవసరం. దీనికోసం అన్నిరకాలుగా ప్రయత్నించాను. కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. మా చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించమని సీబీఎఫ్సీ కోరింది. వారు చెప్పినట్లు చేస్తే కథ తీవ్రత తగ్గిపోతుంది. సినిమాను దెబ్బతీయడం ఇష్టం లేక రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది అని పేర్కొంది.ఆస్కార్ నామినేషన్చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళ కథ ఇది. వితంతువు పోలీసుగా మారి.. దళిత అమ్మాయి హత్య కేసును ఎలా ఛేదిస్తుందన్నది సినిమాలో చూపించారు. కుల వివక్ష, అంటరానితనం, అధికారుల క్రూరత్వం, లైంగిక వేధింపులను ప్రస్తావించారు. ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అలాగే యూకే నుంచి అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన శెహానా గోస్వామి ఉత్తమ నటిగా ఏషియన్ ఫిలిం అవార్డు గెలుచుకుంది.చదవండి: మలయాళంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ఎల్ ఎంపురాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? -
ఓ ప్రేమ... ప్రేమ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా. -
Artiste: చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్"(Artiste Movie). ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "ఆర్టిస్ట్" మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'చూస్తు చూస్తు..' పాటను విడుదల చేశారు.'చూస్తు చూస్తు..' పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల క్యాచీ లిరిక్స్ అందించారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. చూస్తు చూస్తు పాట ఎలా ఉందో చూస్తే...'చూస్తు చూస్తు చూస్తు నిన్నే చూస్తుండిపోయా, చూస్తు చూస్తు నేనే నీవై పోయా, చూస్తు చూస్తు నువ్వే చేశావే మాయ...చూస్తు గుండెల్లోనే దాచా చెలియా..' అంటూ హీరో హీరోయిన్స్ మధ్య సాగే అందమైన ఈ పాటను హోలీ పండుగ నేపథ్యంలో కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. -
భార్య ముందే వేరే యువతులతో భర్త అశ్లీల పనులు..
రాయచూరు రూరల్: ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా చేసుకున్న వైవాహిక బంధం కొందరి వల్ల నవ్వుల పాలవుతోంది. దంపతుల్లో ఎవరో ఒకరు పర వ్యామోహానికి గురై కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆపై చట్టానికి చిక్కి ఊచలు లెక్కించే ఘటనలు ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. బెళగావి నగరంలోనూ అదే జరిగింది.చంపి, కళ్లను దానం చేసివివరాలు.. ఈ నెల 9వ తేదీన బెళగావి మహంతేష్ నగరలో నివాసమున్న పారిశ్రామికవేత్త సంతోష్ పద్మణ్ణవర్ (47) గుండెపోటుతో చనిపోయాడని ఆయన భార్య ఉమ పద్మణ్ణవర్ అందరికీ చెప్పి అంత్యక్రియలు జరిపించింది. పైగా భర్త కళ్లను దానం చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న వారి కుమార్తె సంజన ఇంటికి వచ్చాక ఏదో జరిగిందని గ్రహించి 3 రోజుల కిందట స్థానిక మాళమారుతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే సంగతులు వెలుగు చూశాయి. సంతోష్ నిరంతరం యువతులను ఇంటికి తెచ్చుకుని వారితో గడిపేవాడు. ఇంట్లో భార్య ముందే వారితో నగ్నంగా సంచరించేవాడు. ఇంటి సీసీ కెమెరాల 13 హార్డ్ డిస్కులను, రికార్డర్లను తనిఖీ చేయగా అవే దృశ్యాలు కనిపించడంతో కంగుతిన్నారు.విరక్తి పుట్టి..భర్త వైఖరిని చూసి భార్య ఉమకు విరక్తి పుట్టింది. ఫేస్బుక్ స్నేహితులైన ఇద్దరు యువకులు శోభిత్ గౌడ (31), పవన్ (35)కు విషయం తెలిపింది. ప్లాన్ ప్రకారం సంతోష్‌కు నిద్రమాత్రలు మింగించారు. నిద్రలోకి జారుకోగానే దిండుతో ఊపిరాడకుండా హత్యచేశారు. పోలీసులు ఉమ ను విచారించగా భర్త ప్రవర్తనను ఏకరువు పెట్టింది. తమ పిల్లల ముందు కూడా నగ్నంగా తిరిగేవాడని, ఇది తట్టుకోలేక తాను ఫేస్బుక్ మిత్రులతో కలసి భర్తను హత్య చేశామని నేరం అంగీకరించింది. ఆ కుటుంబం కథ విని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె శోభిత్ గౌడతో సన్నిహితంగా ఉండేదని గుర్తించారు.హార్డ్ డిస్కుల నిండా అవేబనశంకరి: సంతోష్ ఇంటిలో సీజ్ చేసిన హార్డ్ డిస్కుల్లో హతుడు సంతోష్ యువతులు, మహిళలతో ఉన్న ప్రైవేటు వీడియోలు అనేకం ఉన్నాయి. మహిళలతో గడుపుతూ మొబైల్‌తో వీడియోలు తీసుకునేవాడు. తరువాత వాటిని కంప్యూటర్లో భద్రపరిచేవాడు. నిందితులను జైలుకు తరలించారు. -
లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు!
వరంగల్: ఆ అన్నదమ్ములు.. ఉన్నత ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. దీనికి ఓ లక్ష్యం విధించుకున్నారు. ఈ మార్గంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని ప్రణాళిక ప్రకారం చదివి గమ్యం చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ గిరిపుత్రులు. వారే నర్సంపేట పట్టణానికి చెందిన ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతుల కుమారులు సంతోశ్, ఆనంద్. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో సంతోశ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్, ఆనంద్ కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసూ్తనే మరో ఉద్యోగానికి అదీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు సన్నద్ధమై సాధించడం గొప్ప విశేషం.విద్యాభ్యాసం..సంతోశ్, ఆనంద్ ఇద్దరూ ప్రాథమిక విద్యను నర్సంపేటలో పూర్తి చేశారు. సంతోశ్ పదో తరగతి హనుమకొండ, ఇంటర్ హైదరాబాద్, కర్ణాటక ఎన్ఐటీలో ఇంజనీరింగ్, జైపూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అల్ట్రాటెక్ సిమెట్స్ (ఆదిత్య బిర్లా)లో ఇంజనీర్‌గా, కొంత కాలం పేటీఎం సంస్థలో, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేసూ్తనే.. మరోపక్క ఖాళీ సమయంలో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో ఇంజనీర్ కొలువు సాధించారు. ఆనంద్ పదో తరగతి బిట్స్ స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్, వరంగల్ ఎన్ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టీసీఎస్‌లో స్టాఫ్‌వేర్, ఆ తర్వాత చెన్నై పెట్రోలియం సంస్థలో హెచ్ఆర్ అధికారిగా పని చేసూ్తనే యూపీఎస్సీ ద్వారా కార్మిక శాఖలో ఉద్యోగం సాధించాడు.తల్లిదండ్రులు భద్రయ్య–అరుణతో ఆనంద్, సంతోశ్ (ఫైల్)ప్రణాళిక ప్రకారం చదివి.. లక్ష్యం చేరుకుని..ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడిన తమ బాబాయ్‌లు, తల్లిదండ్రులను సంతోశ్, ఆనంద్ ఆదర్శంగా తీసుకున్నారు. యూపీఎస్సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యం విధించుకున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్ రెండు దఫాలు( గ్రూప్–ఏ) ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు వెళ్లారు. అయితే ఆ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో (గ్రూప్–బీ) గమ్యం చేరుకున్నాడు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్ కొలువు సాధించాడు. ఇక ఆనంద్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఈ అన్నదమ్ములు సుమారు సంవత్సరం కాలం పుస్తకాలతో దోస్తీ పట్టారు. ఎప్పుడూ చదువు ధ్యాసే. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకున్నారు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.కుటుంబ నేపథ్యం..సంతోశ్, ఆనంద్ తల్లిదండ్రులు ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం భోజెర్వు గ్రామం జగ్గుతండా. భద్రయ్య తల్లిదండ్రులు ఆంగోత్ చీమా–మల్కమ్మ. ఈ దంపతులకు నలుగురు కుమారులు భద్రయ్య, తారాసింగ్, మోహన్, విజేందర్ ఉన్నారు. భద్రయ్య టీచర్‌గా, తారాసింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా, మోహన్ పిల్లల వైద్య నిపుణుడిగా, విజేందర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తప్ప అందరూ డాక్టరేట్‌లుగా ఉన్న తమ బాబాయ్‌లను స్ఫూర్తిగా తీసుకున్న సంతోశ్, ఆనంద్.. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం నర్సంపేటలో స్థిరపడింది. సంతోశ్, ఆనంద్ తల్లి అరుణ వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్–1 అధికారి, తండ్రి భద్రయ్య చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. -
చీరాలలో యువకుడి హత్య
చీరాలటౌన్: చీరాలలో ఆదివారం దారుణహత్య జరిగింది. పండ్ల వ్యాపారి వద్ద పనిచేసే యువకుడు చిన్న కారణానికే కత్తితో పొడిచి క్యాటరింగ్ షాప్ నిర్వాహకుడు కంచర్ల సంతోష్ (36)ను హత్యచేశాడు. పట్టణ సీఐ పి.శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు.. కంచర్ల సంతోష్ (36) సంగం థియేటర్ సమీపంలో (ఖానాఖజానాలో) అయ్యప్ప క్యాటరర్స్ నిర్వహిస్తూ కర్రీ పాయింట్ కూడా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ రోడ్డు మీద పండ్ల వ్యాపారాలు జరుగుతుంటాయి. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పండ్ల వ్యాపారి చిన్న వద్ద పనిచేసే ఉమామహేశ్వరరావు తాగునీటి క్యాన్‌ను నీటితో కడిగాడు. ఆ నీరు ఎదురుగా ఉన్న అయ్యప్ప క్యాటరర్స్ ఖానాఖజానా దుకాణం వద్దకు చేరాయి. ఈ విషయమై కర్రీ పాయింట్లో పనిచేసే మహిళలు ఉమామహేశ్వరరావును ప్రశి్నంచారు. దీంతో అతడు వారిపై వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ మహిళలు తమ యజమాని సంతో‹Ùకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన సంతోష్ ఈ విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఉమామహేశ్వరరావు పండ్లు కోసే కత్తితో సంతోష్‌ని పొడిచాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన సంతోష్‌ను స్థానికులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మృతిచెందాడు. మృతునికి భార్య, తల్లి ఉన్నారు. ఘటనాస్థలాన్ని, సంతోష్ మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉమామహేశ్వరరావును, పండ్ల వ్యాపారి చిన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. -
ప్రజ్ఞానంద, విదిత్ విజయం
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఆరో రౌండ్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతీ విజయాలు అందుకోగా... దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’ నమోదు చేశాడు. నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరిగిన గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 45 ఎత్తుల్లో... అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌లో మహారాష్ట్రకు చెందిన విదిత్ 40 ఎత్తుల్లో గెలుపొందారు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ నాలుగు పాయింట్లతో నిపోమ్‌నిషితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. మహిళల విభాగం ఆరో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి ఓటమి పాలయ్యారు. హంపి 48 ఎత్తుల్లో లె టింగ్జీ (చైనా) చేతిలో... వైశాలి 29 ఎత్తుల్లో కాటరీనా లాగ్నో (రష్యా) చేతిలో ఓడిపోయారు. -
ముగిసిన అన్నె సంతోష్ అంత్యక్రియలు
కాటారం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ జీపీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలు సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు అన్నె సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు విప్లవ గీతాలు, నినాదాలతో అంకుషాపూర్ నుంచి దస్తగిరిపల్లిలోని తన ఇంటి వరకు సంతోష్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకువచ్చారు. 23 ఏళ్ల తర్వాత సంతోష్ విగతజీవిగా రావడం చూసి గ్రామస్తులు బోరున విలపించారు. కాగా, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క, సత్యవతి, విరసం నాయకులు బలసాని రాజయ్య, మహేందర్, శంకర్, ప్రగతిశీల నాట్యమండలి కళాకారులు నవత, పౌరహక్కుల సంఘం నాయకుడు వినోద్, ప్రజాఫ్రంట్ నాయకులు కొంరయ్య, రవి, తదితరులు.. సంతోష్‌కు నివాళులర్పించారు. సాయంత్రం స్వగ్రామం చేరుకున్న సంతోష్ మృతదేహం.. కర్రెగుట్ట అడవుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందినట్లు బీజాపూర్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సాయంత్రం అధికారికంగా నిర్ధారించారు. సంతోష్ మృతదేహాన్ని గుర్తించడానికి ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రజాప్రతినిధి ద్వారా తల్లిదండ్రులు అన్నె ఐలయ్య, సమ్మక్కను బీజాపూర్‌కు పంపించారు. వారు ఉదయం అక్కడికి చేరుకునే లోగా సంతోష్‌గా భావించే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రుల గుర్తింపు కోసం ఉంచారు. వారు తమ కుమారుడే అని గుర్తించడంతో మృతదేహాన్ని అప్పగించారు. దీంతో సంతోష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి సాయంత్రమైంది. కొనసాగిన పోలీసుల నిఘా.. సంతోష్ అంత్యక్రియల సమయంలో అడుగడుగునా పోలీసులా నిఘా కొనసాగింది. ఇంటెలిజెన్స్, సివిల్ పోలీసులు మఫ్టీలో సంతోష్ అంత్యక్రియలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నిఘా పెట్టారు. -
ముగిసిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ప్రస్థానం
హన్మకొండ: విప్లవ గీతాలకు ఆకర్షితుడై, నమ్మిన సిద్ధాంతం కోసం 23 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందాడు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులతో పాటు కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి.. సంతోష్ మృతిని నిర్ధారించారు. 18 ఏళ్ల వయసులో అడవి బాట.. కాటారం మండలం అంకుషాపూర్‌కు చెందిన అన్నె సమ్మక్క, ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. వారిలో మొదటి కుమారుడు సంతోష్ కాగా, ఇద్దరు కవలలు రామ్ లక్ష్మణ్, కుమార్తె హైమావతి. సంతోష్ బాల్యం తన అమ్మమ్మ ఇంటి వద్ద మహాముత్తారం మండలం దుంపిళ్లపల్లిలో కొనసాగగా 7వ తరగతి వరకు అంకుషాపూర్‌లో చదువుకున్నాడు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్లోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివాడు. పలు కారణాలతో చదువు మానేసిన సంతోష్.. డ్రైవింగ్ నేర్చుకుని జీప్, కారు డ్రైవింగ్‌కు వెళ్తుండేవాడు. తన 18వ ఏట దుంపిళ్లపల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి పీపుల్స్‌వార్ విప్లవ రచనలు, గీతాలకు ఆకర్షితుడై వివాహం జరిగి ఆరు నెలలు గడవక ముందే 2001లో అడవి బాట పట్టాడు. గ్రామ పరిసరాల్లోకి అన్నలు వచ్చారనే సమాచారం తెలుసుకున్న సంతోష్.. అక్కడికి వెళ్లి వారితో పాటు వెళ్లిపోయాడు. విషయం తెలియని తల్లిదండ్రులు డ్రైవింగ్‌కు వెళ్లాడని అనుకోగా ఆ సమయంలో కాటారం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సదానందం గ్రామంలోకి వచ్చి మావోలతో వెళ్లినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. 23 ఏళ్లుగా పలు బాధ్యతల్లో.. 2001లో మావోయిస్టుల్లో చేరిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ 23 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. మొదట దళసభ్యుడిగా, కొన్ని ఏళ్ల తర్వాత అసిస్టెంట్ దళ కమాండర్‌గా, డివిజనల్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సంతోష్ కమిట్మెంట్ను గుర్తించిన మావోయిస్టు అగ్రనాయకత్వం.. ఇటీవల దండకారణ్య తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌తో పాటు సెకెండ్ సీఆర్సీ కమాండర్‌గా బాధ్యతలు అప్పగించింది. 23 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు పోలీసులకు చిక్కని సంతోష్ శనివారం జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశాడు. కాగా, ఎన్కౌంటర్లో సంతోష్ మృతి చెందాడనే వార్త ఉదయమే గ్రామంలో విస్తరించింది. బీజాపూర్ పోలీసులు సంతోష్‌గా నిర్ధారించి స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు. సంతోష్ మృతి విషయం గ్రామంలో చక్కెర్లు కొట్టినా తల్లిదండ్రులు మాత్రం ఇందులో చనిపోయింది తమ కొడుకు కాదని ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా వారు ఐనవోలు జాతరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. సంతోష్ ఫైల్ ఫొటో చూపించినా వారు గుర్తుపట్టలేదు. దీంతో సాయంత్రం వరకు పోలీసులు సైతం సంతోష్ మృతిని నిర్ధారించలేకపోయారు. చివరకు మావోయిస్టులు లేఖ విడుదల చేయడంతో సంతోష్ మృతిని అధికారికంగా నిర్ధారించారు. పేదరికంలో తల్లిదండ్రులు.. వృద్ధులైన సంతోష్ తల్లిదండ్రులు సమ్మక్క, ఐలయ్య పేదరికంలో కాలం వెల్లదీస్తున్నారు. సరైన ఇళ్లు కూడా లేకపోవడంతో గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. చేతికి వచ్చిన కొడుకు 18 ఏళ్లలో అడవి బాట పట్టగా.. రెండో కొడుకు కొంత కాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్న కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. దీంతో వారు కూలీ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. పోలీసుల సహకారం.. పేదరికంలో కొనసాగుతున్న సంతోష్ తల్లిదండ్రులకు కాటారం పోలీసులు పలుమార్లు సాకారం అందిస్తూ వస్తున్నారు. నిత్యం వారి బాగోగోలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుంటారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కోసమైన సంతోష్ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు అనేకమార్లు సందేశమందించారు. 22 ఏళ్ల క్రితం చూసినం.. మా కొడుకు అన్నల్లోకి పోయి 23 ఏళ్లు అవుతుంది. 18 ఏళ్లు ఉన్నప్పుడు అన్నల్లోకి పోయిండు. ఏడాది అయినాక ఓ రోజు రాత్రి అన్నలతోని గ్రామంలోకి వచ్చాడు. అప్పుడు చీకట్లో చూసినం. ఇది వరకు ఏ రోజు కూడా మా కొడుకు మొఖం తెల్వదు, మాట తెల్వదు. ఏదో కానరాని అడువుల్లో ఉంటాండు అని వాళ్లు, వీళ్లు చెబుతుంటే విన్నం. ఎప్పుడైన ఇటు దిక్కు వస్తే కాళ్లు పట్టుకొని ఇంటికాడనే ఉంచుకుందామని చూసినం. కానీ ఆ దేవుడు ఒక్కసారి కూడా కనికరించలే. ఏడేళ్ల కిందట పక్క రాష్ట్రంల ఎన్కౌంటర్ జరిగితే పోలీసోళ్లు మమల్ని ఠాణాకు తీసుకుపోయి మీ కొడుకేనా అని ఫొటోలు చూపించిండ్రు. మా కొడుకు కాదని వచ్చినం. ఇప్పుడు కూడా ఫొటోలో గుర్తుపట్టలేం. మా కడుపు గట్టిది అయితే మా కొడుకు బతికి ఉంటడు. లేకపోతే ఆ దేవుడి దగ్గరికి పోతడు. – అన్నె ఐలయ్య, సమ్మక్క -
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
ఎంపీ సంతోష్‌పై కబ్జా కేసు
బంజారాహిల్స్ (హైదరాబాద్): బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఈ కేసు రిజిస్టర్ కాగా... విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని సర్వే నెంబర్ 129/54, ప్లాట్ నంబర్–4లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు (ఎన్‌ఈసీఎల్) 1350 గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2010లో కరణ్ దూబే అనే వ్యక్తి నుంచి ఎన్‌ఈసీఎల్ కొనుగోలు చేసింది. 2023 నవంబర్ 2 వరకు ఈ స్థలం ఎన్‌ఈసీఎల్‌కు చెందినదిగానే రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల్లో ఉండటంతో పాటు ఈ మేరకు ఈసీ కూడా జారీ అయింది. 2023 వరకు ఈ స్థలం ఎన్‌ఈసీఎల్‌కు చెందినదే అని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఇతర పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ స్థలంలో రెండు రూమ్‌లు నిర్మించినట్లుగా గుర్తించిన ఎన్‌ఈసీఎల్ ప్రతినిధి చింతా మాధవ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము జీహెచ్ఎంసీలో విచారించగా ఈ స్థలాన్ని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లుగా తెలిసిందన్నారు. సంతోష్ కుమార్‌తో పాటు లింగారెడ్డి శ్రీధర్ అనే వ్యక్తి కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీ, బోగస్ ఇంటి నంబర్లను తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే తాము బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారించామని, ఈ నేపథ్యంలోనే జోగినపల్లి సంతోష్‌కుమార్, లింగారెడ్డి శ్రీధర్‌లు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తేలిందని చింతా మాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా అందులోకి అక్రమంగా ప్రవేశించి రెండు గదులు నిర్మించడం, జీహెచ్ఎంసీలో ఫోర్జరీ డాక్యుమెంట్లు దాఖలు చేసి బోగస్ ఇంటి నెంబర్లను తీసుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్, లింగారెడ్డి శ్రీధర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు వీరిపై క్రిమినల్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
నాకు ఓటేయకుంటే తిండి మానండి
ముంబై: తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే రెండు రోజులపాటు అన్నం మానేయాలంటూ మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతోష్ బంగార్ చిన్నారులకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించుకోరాదంటూ ఎన్నికల కమిషన్ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. బంగార్ ఇటీవల ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పదేళ్లలోపు చిన్నారులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరేమీ తినకుండా ఉంటే ఏమైందని అమ్మానాన్న అడుగుతారు. బంగార్కే ఓటేయండి. అప్పుడే తింటాం అని చెప్పండి’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటేయాలని తల్లిదండ్రులకు చెబుతామంటూ పిల్లలతో వల్లె వేయించారాయన. దీనిపై విపక్షాలన్నీ మండిపడ్డాయి. -
పాజిటివ్‌గా చెబితే.. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు.. అందుకే ఇలా..
సాక్షి, కరీంనగర్/మంచిర్యాల: ఓటు హక్కు వినియోగంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డుకు చెందిన అందె సంతోశ్‌బాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ‘‘నా ఓటును అమ్ముకుంటాను.. నాకు సిగ్గులేదు, ఉద్యోగాలు, ఉపాధి అవసరం లేదు, మద్యానికి బిర్యాని, డబ్బులకు అమ్ముడుపోతాను, నాకు సిగ్గులేదు’’ అని ఓ బోర్డును తయారు చేసి తన ద్విచక్ర వాహనం వెనుకాల అమర్చాడు. వాహనంపైనే పట్టణంలో పర్యటిస్తున్నాడు. ప్రజలు పాజిటివ్‌గా చెబితే అర్థం చేసుకోవడం లేదని, ఇలా నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నట్లు సంతోశ్‌బాబు చెప్పాడు. జాతీయ దారిద్య్ర రేఖ దిగువ ప్రజల హక్కుల పోరాట సమితిని ఇటీవల స్థాపించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. ఇవి చదవండి: మావోయిస్ట్ కరపత్రాల కలకలం.. వాటిలో ఏం రాసుందో తెలిస్తే షాక్..! -
కడుపు నొప్పి భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దకొడప్గల్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రమైసని సంతోష్(25) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రెండో వారంలో ‘బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా’
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల రెండో వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాబోయే రెండు నెలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ పాల్గొన్న పాలమూరు సభకు విశేషమైన ప్రజాదరణ లభించిందన్నారు. ఈ నెల 10 వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. నవంబర్ మొదటి వారంలోగా 30సభలు రాష్ట్రంలో నవంబర్ మొదటి వారంలోపు 30 సభలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా అక్టోబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఉంటాయని... 5వ తేదీన జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్‌లు, రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉంటుందని, 6వ తేదీ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కనీ్వనర్లు, ఇంచార్జ్‌లతో కలిపి మొత్తం 800మంది ఈ సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 5 తేదీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, 6వ తేదీ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దిశానిర్దేశం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ సభను రైతులు జయప్రదం చేయాలి నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డును మంజూరు చేసినందుకు ప్రధానికి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను సాకారం చేసిన ప్రధానికి రైతులంతా సంఘీభావం పలకాలని కోరారు. మంగళవారం నిజామాబాద్‌లో మోదీ పాల్గొనే బహిరంగ సభను పసుపు రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పదాధికారుల భేటీకి బీఎల్ సంతోష్ ఈ నెల 5న నిర్వహించే రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. ఈ నెల 10న అమిత్ షా పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి(మంచిర్యాల)లో భారీ బహిరంగసభకు హాజరు కానున్నారు. -
‘షాక్’ ఇస్తే సర్వీసులెలా పెరిగాయి?.. ఈనాడు కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో గత రెండున్నరేళ్లలో చేనేత విద్యుత్ సర్వి సులు పెరిగాయని సంస్థ సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. ‘నేతన్నలకు కరెంట్ షాక్’ అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై గురువారం ఆయన స్పందించారు. నేతన్నలకు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 2021–22 వరకూ 9,912 విద్యుత్ సర్వీసులు వుండగా, 2022–23 నాటికి ఆ సర్వి సుల సంఖ్య 10,125కు పెరిగిందని.. 2023–24 జూలై నాటికి మొత్తం 10,157 సర్వి సులున్నాయన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పవర్ లూమ్స్ విద్యుత్ సర్వి సుల సంఖ్య తగ్గినట్లు ఈనాడు కథనంలో రాయడం అవాస్తవమన్నారు. షాక్ ఇస్తే సర్వి సులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇంధన చార్జీల్లో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. అలాగే, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, నేతన్నల అభ్యర్థన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్) బిల్లింగ్ విధానానికి అనుమతించిందని తెలిపారు. ఈ ఉత్తర్వులవల్ల మగ్గాలకు సంబంధించిన సర్వీసుల విద్యుత్ బిల్లు కొంతమేరకు తగ్గినట్లు సీఎండీ వెల్లడించారు. -
అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అందరితో చర్చించాకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులపై అధిష్టానానికి నివేదిక అందించారు. పొత్తుల గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని, ఎన్నికలకు ముందు పొత్తుల గురించి నిర్ణయం ఉంటుందని పురందేశ్వరి భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ను కలిసి ఏపీ ఆర్ధిక పరిస్థితులను వివరించానని పురందేశ్వరి తెలిపారు. ‘నేనేం తప్పులు చెప్పలేదు’ ఇటీవల మీడియా సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి తాను తప్పులు చెప్పలేదని.. 2023 జూలై నాటికి ఏపీకి రూ.10,77,006 కోట్ల అప్పు ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్రంలో చిన్న సన్నకారు కాంట్రాక్టర్లకు రూ.71 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. 15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను అనధికారికంగా వాడటంపై సర్పంచ్‌లకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. నిధులు దారి మళ్లించి అప్పులు తీసుకువచ్చి ఆ భారాన్ని ప్రజలపై రద్దుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదని.. అప్పులు మాత్రమే ఉన్నాయని పురందేశ్వరి విమర్శించారు. -
‘సెమీఫైనల్’ వ్యూహాలకు పదును!.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సారత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెడుతున్నారు. ఈ ఏడాది చివరన ఎన్నికలు జరిగే తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలకు కార్యాచరణను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ భవనంలో సోమవారం అర్ధరాత్రి వరకు, తిరిగి మంగళవారం ఉదయం దాదాపు పది గంటలపాటు కీలక చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీకున్న బలాబలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని వాటిని అధిగమించే అంశంపై మేథోమథనం జరిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా ఉండటం, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, రాజస్తాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 29, ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలు కలిపి మొత్తంగా 82 స్థానాలు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితేనే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులోభాగంగా కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను, ఇంచార్జీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఏం చేయాలి? తెలంగాణలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఉన్న అసమ్మతిని తమవైపు తిప్పుకునే అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటే కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో సహా ఇతర కమిటీల నియామకాలను పూర్తి చేస్తూనే, సంస్థాగత నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు ముఖ్యమైన బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి.. నేతల మధ్య ఐక్యత చెడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ ప్రచార కార్యక్రమాలు, ఈ నెలలో తెలంగాణలో జరిపే పర్యటనలపైనా చర్చించారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, అధికార పక్షం లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అసమ్మతి నేతలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు అవకాశాలపైనా సమాలోచనలు చేశారు. అలాంటివి సాధ్యంకాని చోట ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ముచేసుకునే అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే ఇటీవల జరిపిన భేటీలో తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ముందుంచిన ప్రతిపాదనలపైనా ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఆయా అంశాలపై ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ ఇంచార్జి సునీల్ బన్సల్ అభిప్రాయాలను కూడా ముగ్గురు అగ్రనేతలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చదవండి: పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి -
ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతల్లేవని, వినియోగదారులకు నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ కె. సంతోషరావు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీజీఎం వి. విజయలలిత స్పష్టంచేశారు. ఈనాడు దినపత్రికలో శుక్రవారం ‘ఎడాపెడా విద్యుత్ కోతలు’.. ‘కరెంటు కోతతో రోగుల కన్నీరు’.. ‘రొయ్యకు కరెంట్ షాక్’.. శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై వారు స్పందించారు. కేవలం సాంకేతిక సమస్యలతోనే అక్కడక్కడా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయే తప్ప, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలను అమలుచేయడంలేదని వారు వెల్లడించారు. వారు పేర్కొన్న అంశాలివీ.. ♦ తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో విద్యుత్ కోతలులేవు. గ్రామ పరిధిలోని ఓ వినియోగదారుడు చెట్ల కొమ్మలను తొలగిస్తున్నప్పుడు కొమ్మలు విద్యుత్ లైనుపై పడడంతో సంబంధిత ట్రాన్స్ఫార్మర్ పరిధిలో మాత్రమే గురువారం ఉ.8 నుంచి 10 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా నాయుడుపేటలో కండక్టర్ తెగిపోయిన కారణంగా బుధవారం రాత్రి అరగంట పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ ఫీడరు ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. అయితే, లైన్ మరమ్మతు పూర్తయిన తర్వాత ఫీడర్‌ను మార్చేందుకు మరోమారు పది నిమిషాలపాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ♦ ఏలూరు జిల్లా, దెందులూరులో విద్యుత్ కోతలులేవు. కానీ, గత శుక్ర, శనివారాలలో రాత్రి వేళల్లో భీమడోలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలులు, వర్షాల కారణంగా, 33కేవీ లైనులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటి మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎండల తీవ్రతకు, అధిక లోడు వలన 220 కేవీ నుంచి ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌లో మూడో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ కారణంగా దానిని మార్చడానికి లైన్ క్లియర్ తీసుకున్నారు. దీంతో గణపవరం, నిడమర్రు, ఉండి, భీమవరం, పాలకోడేరు, కాళ్ళ, ఆకివీడు మండలాల్లో ఆక్వా రైతులకు కొంతమేర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ విజయనగరం జిల్లాలో గురువారం ఉ.11.02 నుండి 11.08 వరకు, బుడతనాపల్లి గ్రామంలో ఎల్టి సర్విసు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏబీ స్విచ్ ఆపడంవల్ల అంతరాయం కలిగింది. గురువారం 11 కేవీ ఉడా ఫీడర్పై 14.42 గంటలకు యూకలిప్టస్ చెట్టు కొమ్మలు పడటంవల్ల అదే ఫీడర్పై ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కార్యాలయానికి విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే సిబ్బంది చెట్లు, కొమ్మలు తొలగించి 15.48 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ♦ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం 50 పడకల ఆసుపత్రి, ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రికి ఎలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడలేదు. టెక్కలి గవర్నమెంట్ ఆస్పత్రికి గురువారం 12 నిమిషాల పాటు, పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి గంట 40 నిమిషాలు పాటు ఈదురుగాలులు వేస్తున్న సమయంలో మాత్రమే అంతరాయం ఏర్పడింది. ♦వేసవిలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా వున్నందున విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది. సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినప్పటికీ డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీల వినియోగం పెరగడంవల్ల లోడ్ ఎక్కువైనపుడు కొన్ని ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లలో ఫ్యూజులు పోతున్నాయి. గత కొన్నిరోజులుగా బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎండలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. ఇక ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోటాను అందిస్తోంది. రోజూవారీ వినియోగం 255 మిలియన్ యూనిట్లు ఉన్నప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తోంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది ఎండలు, వర్షాన్ని లెక్కచేయకుండా త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతలు విధించడంలేదు. అదేవిధంగా రాత్రి సమయాల్లో విధుల నిర్వహణకు టీమ్‌లను ఏర్పాటుచేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది సత్వరం స్పందించి సరఫరాను పునరుద్ధ రించేందుకు చర్యలు చేపడుతున్నారు. కార్పొరేట్ ఆఫీస్ నుంచే కాకుండా సర్కిల్ స్థాయి, డివిజన్ స్థాయిల్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయాల పర్యవేక్షణకు లోడ్ మానిటరింగ్ సెల్లు 24గంటలూ పనిచేస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్‌చేసి పరిష్కారం పొందవచ్చు. -
యువకుడితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువుగా ఉంటోందని..
సాక్షి, శ్రీకాకుళం: వరుసకు వదినయ్యే మహిళతో అవివాహిత యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు మరో యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన భాస్కరరావుతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కాగా, వరుసకు మరిదయ్యే ముద్దాడ రామారావు (30) అనే అవివాహిత యువకుడు ఎర్రమ్మతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మరొకరితో చనువుగా ఉంటోందని.. ఇదిలావుండగా.. ఎర్రమ్మ అదే గ్రామానికి చెందిన ముద్దాడ సంతోష్ (26)తో కొంతకాలంగా చనువుగా ఉంటోంది. ఎర్రమ్మ తనతోపాటు సంతోష్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రగిలిపోతున్న ముద్దాడ రామారావు వారిద్దరిపైనా కక్ష పెంచుకున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓవైపు డైవర్స్ రూమర్స్? ఆ హీరోతో కలిసి నిహారిక ఇలా..
-
పారిజాత పర్వం.. అమ్మాయికి ముసుగు వేసి కుర్చీలో బంధించి..
సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఖరారు చేశారు మేకర్స్. ఓ అమ్మాయికి ముసుగు వేసి కుర్చీలో బంధించినట్లు టైటిల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రం ‘పారిజాత పర్వం’. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనంత సాయి, కెమెరా: బాల సరస్వతి, సంగీతం: రీ. -
నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు
-
పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు
సాక్షి, హైదరాబాద్: తాను పుట్టిన పేట్లబురుజు ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్. ఈ మేరకు రూ.కోటి మొత్తాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్‌ను మంత్రి అభినందిస్తూ.. ఈ నిధులతో పేట్లబురుజు ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన వారు ఎంపీ స్ఫూర్తితో.. వాటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హరీశ్ విజ్ఞప్తి చేశారు. -
నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్‌పై సంతోష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్‌లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్ కుమార్ అడ్డుకున్నాడు. సంతోష్ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్ పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (కాలేజీ బస్సు డ్రైవర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..) -
కాంట్రాక్టర్ ఆత్మహత్యపై స్పందించిన మంత్రి..‘ రాజీనామా చేసే ప్రసక్తే లేదు’
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్‌ను తను ఇప్పటి వరకు కలవలేదని కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మరణానికి తను బాధ్యుడిని కాదని అన్నారు. కాగా బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి ఈశ్వరప్ప కమీషన్లు అడిగారని కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. తాజాగా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. నేను ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ను చూడలేదు, కలవలేదు. కేంద్రానికి రాసిన ఆ లేఖను మా శాఖకు పంపించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సమాధానమిచ్చారు. అయితే పాటిల్‌కు సివిల్ పనులు అప్పగించినట్లు ఎలాంటి రికార్డ్ లేదు. అలాగే పేమెంట్ గురించి కూడా చర్చించలేదు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా తెలియజేశారు. నాపై వచ్చిన ఆరోపణలపై నిస్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రిని కోరాను’ అని ఈశ్వరప్ప తెలిపారు. సంబంధిత వార్త: సూసైడ్ కలకలం: మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు.. రంగంలోకి సీఎం కాగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ లాడ్జీలో మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణానికి ముందు తన చావుకు ఈశ్వరప్పే కారణమని, అతనికి శిక్ష పడాలని.. స్నేహితులకు వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు పంపారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కోరారు. సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు ఊపందుకున్నాయి. దీంతో ఈశ్వరప్ప రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు. తను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ ఆరోపణలపై పరువు నష్టం కేసు కూడా వేసినట్లు తెలిపారు. -
యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?
మైసూరు (కర్ణాటక): మైసూరులోని సాతగళ్లి లేఔట్లో నివాసం ఉంటున్న సంతోష్(26), భవ్య(22) అనే యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బుధవారం స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అన్నంలో పురుగుల మందు కలిపి తిన్నట్లు తేలింది. అప్పుల బాధతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) -
ప్రాణదాత, విజయ ప్రదాత జమ్మి వృక్షం
శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!! తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. ఈ వృక్షాన్ని ప్రపంచ అద్భుతంగా చెప్పుకోవచ్చు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టు ఎంతో ప్రాధాన్యం గలది. తెలంగాణలో దసరా పండుగ నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. ఆ రోజు సాయంత్రం పక్షులను చూడటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళతారు. ఇదే సందర్భంలో జమ్మి పూజ చేస్తారు. ‘‘శమీ శమయతే పాపమ్ శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ!!’’ అని చదువుతూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత బంధు మిత్రులకు జమ్మి ఆకులు చేతిలో పెట్టి నమస్కరిస్తుంటారు. కొందరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. ఒకరినొకరు పలుకరించుకోని వారు కూడా దసరానాడు ఈ పచ్చని ఆకులను చేతిలో పెట్టి నమస్కరించుకొని విభేదాలు మరిచి పోతారు. జమ్మి తెలంగాణ ప్రజల్లో వెల్లివిరిసే సౌహార్ద్రతకు ప్రతీక. రాముడు లంకపై యుద్ధానికి వెళ్ళే ముందు శమీ వృక్షాన్ని పూజించాడని చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి పెడతారు. తమకు విజయం సిద్ధించాలని జమ్మి చెట్టును పూజించే సంప్రదాయం ఉన్నది. పలు రాష్ట్రాలలో జమ్మిని దసరానాడు పూజిస్తుంటారు. జమ్మిని పూజిస్తే శని పీడ విరగడవుతుందనే నమ్మకం కూడా ఉన్నది. నిప్పును పుట్టించడానికి శ్రేష్టమైనది కనుక దీనిని అగ్నిగర్భ అని కూడా అనేవారు. జమ్మి చెట్టు భారత ఉపఖండంలో, పశ్చిమాసియాలో పెరుగుతుంది. ఎంతటి కరువు కాలంలో అయినా తట్టుకొని నిలువడం ఈ చెట్టు ప్రత్యేకత. అందువల్ల ఈ చెట్లు ఉంటే కరువు కాలంలో కనీస హామీ ఉన్నట్టుగా భావిస్తారు. దుర్భిక్షంలో నెలకొన్నప్పుడు పశువులకే కాకుండా, మనుషులకూ ఆహారంగా ఉపయోగపడుతుంది. జమ్మి నుంచి వివిధ రకాల ఔషధాలు తయారు చేస్తారు. ఈ చెట్టు నీడన గిరిజన పెద్దలు సమావేశాలు జరుపుకునే అలవాటు కొన్ని ప్రాంతాలలో ఉన్నది. జమ్మి చెట్టు సగటు ఆయుర్దాయం 120 ఏండ్లు. వేర్లు ముప్ఫై మీటర్ల లోతు వరకు పోతాయి. ఏ మాత్రం తేమ లేని ఎడారి ప్రాంతాలలో కూడా ఈ చెట్టు తట్టుకుని నిలుస్తుంది. ఎడారుల్లో పెనుగాలులను నిలువరిస్తుంది. అరేబియా ఎడారిలో ఏ మాత్రం తేమ లేని నేలలో ఇది వేళ్ళూనుకొని పెరగడమే పెద్ద వింత. చుట్టూరా ఒక నీటి చుక్క ఉండదు, ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. అయినా ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ చెట్టుకు నీరు ఎలా లభిస్తున్నదనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం. జమ్మిచెట్టు విశిష్టతకు ఈ జీవ వృక్షమే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికిన ఘనత జమ్మి చెట్టుకు ఉన్నది. 1730లో మార్వాడ (రాజ స్తాన్) రాజు తన రాజభవనం నిర్మాణంలో రాళ్ళ మధ్య బంక వాడటం కోసం చెట్లు కొట్టుకు రమ్మని ఆదేశించారు. ఎడారిలో దట్టంగా ఉన్న జమ్మి చెట్లు ఉన్న ఖేజాడ్లీ గ్రామం దగ్గరికి రాజభటులు వచ్చారు. ఇక్కడి బిష్ణోయి తెగ వారు చెట్లను నరకడాన్ని, జంతువులను చంపడాన్ని వ్యతిరేకిస్తారు. రాజభటులు చెట్లు నరుకుతున్నారని తెలిసిన అమృతాదేవి అనే మహిళ అక్కడకు వెళ్ళి అడ్డుకున్నది. జమ్మి చెట్టును కావలించుకొని ‘సర్ సాంటే రుఖ్ రహో తో భీ సస్తో జాణ్’ (చెట్టును కాపాడటానికి తలనైనా పణంగా పెట్టవచ్చు) అని నినదించింది. రాజభటుల గొడ్డలి దెబ్బకు ఆమె తల తెగిపడింది. ఆమె ముగ్గురు బిడ్డలు ఆసు, రత్ని, భాగుబాయి కూడా చెట్లను అలుముకున్నారు. వారి ముగ్గురి తలలు తెగిపడ్డాయి. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాలలోని బిష్ణోయి తెగవారంతా దండులా కదిలివచ్చారు. జమ్మి చెట్ల రక్షణకు పూనుకున్నారు. వృద్ధులు, మహిళలు, నవ దంపతులు, పిల్లలు అనే తేడా లేకుండా చెట్లను హత్తుకున్నారు. 363 తలలు తెగిపడ్డాయి. కర్కశ రాజభటుల హృదయం చలించింది. వారికి ఇక తలలు నరకడానికి చేతులాడలేదు. వెనుదిరిగిపోయి రాజుకు వివరించారు. వెంటనే రాజు చెట్లను నరకడాన్ని నిలిపివేయించాడు. పర్యావరణ పరిరక్షణ బిష్ణోయి సంప్రదాయం జంతువులను, మొక్కలను పరిరక్షించే బిష్ణోయి తెగ గురించి తరచు వార్తలలో చూస్తుంటాం. వైష్ణవ సంప్రదాయానికి చెందిన గురు జంభేశ్వర్ (1451– 1536) ఈ బోధనల మేరకు ఈ బిష్ణోయి శాఖ ఏర్పడింది. రాజస్తాన్‌లో 1485లో తీవ్ర కరువు ఏర్పడిన నేపథ్యంలో గురు జంభేశ్వర్ పర్యావరణ హితమైన జీవన విధానాన్ని నిర్దేశించారు. అతడు బోధించిన ఈ 29 సూత్రాలలో ఎనిమిది పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు తోడ్పడేవి కూడా ఉన్నాయి. ప్రకృతితో సహజీవనానికి వీలుగా వృక్ష జంతుజాలాన్ని కాపాడాలని ఆయన బోధించారు. బిష్ణోయి తెగవారు జమ్మిచెట్టును పవిత్రమైనదిగా పూజిస్తారు. చిప్కో అంటే హత్తుకోవడం. చెట్లను హత్తుకోవడమనే ఈ ఉద్యమం 1973లో ఉత్తరాఖండ్‌లో సాగింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో మహిళలే ప్రధాన పాత్ర వహించారు. ఈ ఉద్యమం ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైంది. ఇప్పటికీ రాజ స్తాన్‌లో జమ్మి చెట్టుకు ప్రాధాన్యం ఉన్నది. జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జమ్మిని రాష్ట్ర వృక్షంగా ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలని కేసీఆర్ బోధిస్తున్నారు. ఈ మేరకు ఉద్యమ స్ఫూర్తితో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ.. హరిత తెలంగాణగా మారుతోంది. కేసీఆర్ పిలుపునందుకుని పర్యావరణ ఉద్యమంలో మనం భాగస్వాములం అవుదాం. మొక్కలను నాటుదాం. మన పిల్లలకు నివాసయోగ్యమైన భూగోళాన్ని వారసత్వంగా అందిద్దాం. జోగినపల్లి సంతోష్ కుమార్ వ్యాసకర్త ఎంపీ, రాజ్యసభ (దసరా పండుగ సందర్భంగా) -
షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
-
వాళ్లవి రహస్య ఒప్పందాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్ స్కీం, పోతిరెడ్డిపాడు విస్తరణపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశాలకు గైర్హాజరై, టెండర్లు పిలిచి ఒప్పందాలు చేసినప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన సీఎం కేసీఆర్, తాజాగా నాగార్జునసాగర్ పర్యటనలో కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోందని పేర్కొనడం విస్మయం కలిగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్తో కలసి ఆయన మీడియా భేటీలో మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఏడేళ్లలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, సీతారామసాగర్, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి ఉంటే, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశమే వచ్చేది కాదని రేవంత్ అన్నారు. రహస్య భేటీ ఎజెండా బహిర్గతపరచాలి.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్.. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని రేవంత్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఇతర ఎంపీలు కూడా మోదీని కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కలిస్తే ఫొటోలను ఎందుకు బహిర్గతపరచలేదని ప్రశ్నించారు. అసలు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో కోవర్ట్ ఆపరేషన్‌లో నిష్ణాతులైన కౌశిక్‌రెడ్డి లాంటి వారికే ఎమ్మెల్సీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒత్తిడితోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఈనెల 9 నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ, ప్రగతి భవన్లో జరుగుతున్న రాజకీయ ఒప్పందాలు బహిర్గతమయ్యాయని, టీఆర్ఎస్లో బీజేపీకి సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నాయో లేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంజయ్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ కొట్లాట... ఢిల్లీలో సఖ్యత.. తెలంగాణలో ఉద్యోగాల రాక 3 నెలల్లో 14 మంది యువకులు మరణించారని మధుయాష్కీ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రస్తావనతో యువకుల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఆయన అన్నారు. ప్రాణత్యాగాలతో తెచ్చుకొన్న తెలంగాణలో అణిచివేత, ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మాటల యుద్ధం చేసే టీఆర్ఎస్, బీజేపీ.. తర్వాత ఢిల్లీలో ఎంతో సఖ్యతతో ఉంటాయని పేర్కొన్నారు. గతంలో కేటీఆర్, కవిత, హరీశ్‌లకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. -
అమ్మ తోడు...మోజ్ వీరుడు
విభిన్న రకాల వీడియో ఆధారిత యాప్స్‌కు ఊపునిచ్చిన టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక మరికొన్ని అచ్చమైన భారతీయ వీడియో వేదికలు తెరమీదకి వచ్చాయి. అప్పుడే వాటిని అందిపుచ్చేసుకున్న టాలెంటెడ్ యూత్ తమదైన శైలిలో సందడి చేస్తోంది. ఈ తరహా వినోదాన్ని పండించే వారిలో వ్యక్తిగతంగా లేదా స్నేహ బృందాలతో కలిసి సందడి చేసేవారే ఎక్కువ. అయితే తమ మాతృమూర్తితో కలిసి వీక్షకులను ఉర్రూతలూగించేవారు తక్కువ. అలాంటి యువకుడే హైదరాబాద్‌కి చెందిన సంతోష్ కాసర్ల... ఇటీవలే టిక్‌టాక్ ప్లేస్‌లో అందుబాటులోకి వచ్చిన వీడియో ఆధారిత ప్లాట్‌ఫామ్ మోజ్లో ఈ కుర్రాడు తన సత్తా చాటుతున్నాడు. అమ్మతో ఈ కుర్రాడు చేసిన వీడియోలకు ఎంత క్రేజ్ వచ్చిందంటే.. వీరిద్దరినీ పెట్టి ఒక సంస్థ అమ్మ ప్రేమ అనే షార్ట్ ఫిలిం కూడా రూపొందించింది. అతి తక్కువ వ్యవధిలో దాదాపు 10లక్షల మంది ఫాలోయర్లను దక్కించుకుని మోజ్‌పై క్రేజీగా మారాడు. ఈ సందర్భంగా సంతోష్ ‘సాక్షి’తో ముచ్చటించాడు. నటన కోసం నేను... నా కోసం అమ్మ... మాది వరంగల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉంటున్నా. ఈస్ట్ మారేడ్ పల్లిలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేస్తున్నా. చిన్న వయసు నుంచీ కూడా నేనెప్పుడూ ఒక మంచి నటుడిని కావాలని కోరుకున్నా. అయితే అది లాంగ్ జర్నీ అని తెలుసు. అయినా ఏదోలా ప్రపంచానికి నా అభినయ ప్రతిభ పరిచయం కావాలనుకున్నా. చిన్న చిన్న వీడియోల ద్వారా నా యాక్టింగ్ టాలెంట్‌ని చూపిస్తూ వచ్చా యూజర్స్ బాగా రెస్పాండ్ అయ్యారు. అయితే అందరూ చేస్తున్నట్టు కాకుండా విభిన్నమైన రీతిలో ఏమైనా చేయాలని అనిపించింది. అదే సమయంలో అమ్మతో టీనేజ్ కొడుకుకున్న అనుబంధం ప్రతిబింబిస్తూ.. నేచురల్‌గా ఏ ఇంట్లో అయినా తల్లీ కొడుకుల మధ్య జరిగే కొన్ని సరదా సన్నివేశాలతో చేద్దామని అనిపించింది. నిజానికి అమ్మకి అలాంటివి అప్పటిదాకా పరిచయం లేదు. అయినా నా ఇంట్రెస్ట్‌ని తగ్గించడం ఇష్టం లేక... సరే అంది. అమ్మ చదువుకోలేదు. నటించడం ఎలా రా? అని అడిగితే..‘‘ నటించడం ఏమీ వద్దు అమ్మా... నువ్వు నాతో ఎలా రెగ్యులర్‌గా ఇంట్లో ఉంటావో అలాగే ఉండు’’ అని చెప్పా. అలాగే చేస్తోంది. మామ్ అండ్ మీ... అప్పటి నుంచి అమ్మతో కలిసి వీడియోస్ చేయడం మొదలుపెట్టా. ఇది వ్యూయర్స్‌ని బాగా ఆకట్టుకుంది. మరిన్ని ఇవే తరహాలో పోస్ట్ చేయమని ఎంకరేజ్ చేశారు. అంతకు ముందు మరికొన్నింటిలో కూడా చేశా కానీ... ఇంత రెస్పాన్స్ రాలేదు. కేవలం సినిమా కామెడీ బిట్స్ మాత్రమే కాకుండా ఓరిజనల్ కంటెంట్, కాన్సెప్ట్స్‌తో కూడా వీడియోలు తీస్తుండడం తో నాకు పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు వచ్చారు. అలాగే వీడియోస్‌కి వ్యూస్కూడా బాగా పెరిగాయి. దాంతో పలు సంస్థలకు ప్రమోషన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం థోనీ చేస్తున్న ఖాతా బుక్ యాడ్ కమర్షియల్‌కు కూడా చేశా. ఫాలోయర్స్ తో పాటు మన వీడియోస్‌కి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి? ఎంత లైక్ చేస్తున్నారు? అనేది చూసి ఈ యాడ్స్ వస్తుంటాయి. ఈ ఇన్కమ్ కూడా నాకు ఇంట్లో అవసరాలకు కొంత యూజ్ అవుతోంది. దీనికి తోడుగా బయట కూడా చాలా మంది నన్ను గుర్తు పడుతున్నారు. సెల్ఫీలు అడుగుతున్నారు. షార్ట్ ఫిలింస్ లో కూడా బాగానే ఛాన్సెస్ వస్తున్నాయి. ఏదేమైనా.. ఈ వేదిక ఆధారంగా నా సినిమా కలల్ని సాకారం చేసుకోగలననే అనుకుంటున్నా. -
కల్నల్ సంతోష్ బాబు భార్యకు పోస్టింగ్
సాక్షి యాదాద్రి: భారత్–చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు భార్య సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. సోమవారం ఆమె కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిశారు. జూన్ 21న ప్రభుత్వం ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన విషయం విదితమే. ఉద్యోగ విధి విధానాలపై ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మూడు నెలల శిక్షణ పొందిన సంతోషికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించారు. 2021 జనవరి 24 వరకు ఇక్కడ కలెక్టరేట్‌తో పాటు క్షేత్రస్థాయిలో విధులపై శిక్షణ పొందనున్నారు. (చదవండి: సయోధ్య దిశగా...) -
మద్రాసి క్రైమ్ డ్రామా
సంతోష్, రంగజిను ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘మద్రాసి గ్యాంగ్’. మనోజ్‌తో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో పద్మజ ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎస్.ఎన్. రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13న ప్రారంభమవుతుంది’’ అన్నారు. ఈ చిత్ర నిర్మాత ఎస్.ఎన్. రెడ్డి. న టుడు సంపూర్ణేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎన్.ఎస్. ప్రసు, కెమెరా: వి.కె. రామరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.వి.వి. సత్యనారాయణ. -
బాధ్యతలు స్వీకరించిన సంతోష్ బాబు భార్య
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా నేడు బాధ్యతలు చేపట్టారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి శనివారం ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. దీంతోపాటు సంతోష్‌బాబు కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాగా, గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది సైనికులు అమరులయ్యారు. (హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం) -
సంతోష్ బాబు కుటుంబంతో కేసీఆర్ భోజనం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం, రూ. 5 కోట్ల నగదు.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రగతి భవన్లో సంతోషికి అందించారు. ఆమెకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలానే ఇంటి స్థలానికి సంబంధించి షేక్పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన ప్లేస్‌ను కోరుకోవాలని కేసీఆర్ గతంలోనే వారికి సూచించారు. ఈ క్రమంలో సంతోష్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారికి బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలం కేటాయించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఉదయం ఈ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి జగదీష్ రెడ్డి చేతులు మీదుగా స్థలం కాగితాలను సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపికా యుగంధర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోకి ఎవరూ చొరబడలేదన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ స్పందించారు. చైనాతో సరిహద్దు విషయమై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. సరిహద్దు రక్షణ కోసం సైనికుల త్యాగాలు వృథా కాకూడదని అన్నారు. కల్నల్ సంతోష్ బాబు సహా జవాన్ల త్యాగాలకు న్యాయం జరగాలని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. లేకుంటే ప్రజలకు చారిత్రాత్మక మోసం జరిగినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రాదేశిక సమగ్రతలో రాజీ పడొద్దని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి: ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్) గల్వాన్ వ్యాలీ, ప్యాగ్యాంగ్ లేక్ వద్ద చైనా చొరబాట్లుకు పాల్పడుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రకటనల పట్ల జాగ్రత్త వహించాలని మన్మోహన్ సూచించారు. ప్రధాని మోదీ ప్రకటనలు వ్యూహాత్మక ప్రాదేశిక ప్రయోజనాలతో పాటు దేశ రక్షణపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సంక్షోభం ఎదుర్కొనేందుకు, ఉద్రిక్తలు తగ్గించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపై పని చేయాలని ఆయన సూచించారు. దౌత్య, లేదా నిర్ణయాత్మక నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రత్యామ్నాయం కాదని మన్మోహన్ అన్నారు. (చదవండి: కరోనాపై యోగాస్త్రం) -
రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..
న్యూఢిల్లీ: దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్ ఎలా ముందుకు సాగారంటే.... ఇండియన్ ఆర్మీ 16 బిహార్ బెటాలియన్‌కు సంతోష్ బాబు కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్ బాబు, చైనా కమాండింగ్ ఆఫీసర్‌తో ఫోన్లో మాట్లాడారు. చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్ స్వయంగా గల్వాన్ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్ సంతోష్ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి. చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు. -
జవాన్ల త్యాగాలు వృథా పోవు: కిషన్‌రెడ్డి
సాక్షి, సూర్యాపేట: దేశ రక్షణలో వీర మరణం పొందిన అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్‌బాబు త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయసులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోవడం కుటుంబానికే కాకుండా దేశానికి, సైన్యానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.కష్టకాలంలో ప్రతి ఒక్కరు సంతోష్ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించాలని కోరారు. (రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్) చైనా దొంగ దెబ్బ తీసింది.. ‘‘భారత భూ భాగాన్ని, సైనికుల ప్రాణాలను రక్షించడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. పరిణామాలను ఎదుర్కోవడానికి షరతులు లేకుండా వ్యవహరించాలని సైన్యానికి ఆదేశాలిచ్చాం. సంప్రదింపులు జరుపుతూనే చైనా దొంగ దెబ్బ తీసిందని’’ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలా వ్యవహరించాలని అఖిలపక్షం సమావేశం నిర్వహించామని, ఇతర దేశాధినేతలతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. జవాన్ల త్యాగాలు వృధాపోవని, ఏ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ లక్ష్య సాధన కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కల్పించామని తెలిపారు. ప్రతీకార జ్వాలతో ఉన్న ప్రజల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరుగుతుందన్నారు. చైనా వస్తువులను వాడకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. (ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం) కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచదర్‌రావు,బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌రావు తదితరులు ఉన్నారు. అంతకు ముందు రోడ్లు,భవనాల శాఖ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
సోమవారం సూర్యాపేటకు కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు రానున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శనివారం సంతోష్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంతోష్ బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు హైదరాబాద్‌లో 600 గజాల ఇంటిస్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం.. అది కూడా ఆమెకు నచ్చిన ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయంపై కేసీఆర్ వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని కలిసి చెప్పమన్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సాయాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. తమతో పాటు... దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడాన్ని వారు అభినందించారన్నారు. కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని చెప్పడం వారి గొప్పతనానికి నిదర్శనమని జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం స్వయంగా సూర్యాపేటలోని వారి నివాసానికి వస్తారన్నారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సీఎమ్ రాకపైన సమాచారం ఇచ్చామని జగదీశ్ రెడ్డి తెలిపారు. (నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా..) -
టీఎస్ పోలీస్ వెల్ఫేర్ ఇన్చార్జిగా సంతోష్‌మెహ్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ విభాగం ఇన్‌ఛార్జి ఏడీజీగా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏడీజీ వెల్ఫేర్‌గా ఉన్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సౌమ్యా మిశ్రాకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్లో భాగంగా సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లేందుకు కేంద్రం (డీఓపీటీ ) ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారు. దీంతో తాత్కాలికంగా వెల్ఫేర్ విభాగం బాధ్యతలను సంతోష్ మెహ్రాకు అప్పగించారు. గతంలో ఆయన తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. -
డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా
‘‘సక్సెస్, ఫెయిల్యూర్ గురించి నేను ఆలోచించను. కొన్ని సినిమాలు ఆడతాయి.. మరికొన్ని ఆడవు. మంచి సినిమా చేశామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీలో నా ఏజ్ ఉన్నవాళ్లలో కొందరు ఇప్పటికీ సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను’’ అని అదిత్ అరుణ్ అన్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధానపాత్రల్లో నటించారు. బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదిత్ అరుణ్ మాట్లాడుతూ– ‘‘ఓ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుని అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హారర్ కామెడీ స్టోరీకి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, కామెడీ ఉంటాయే కానీ, ఫిజికల్‌గా అసభ్యకరంగా ఉండదు. ‘డబ్బుల కోసం ఈ సినిమా చేశావా?’ అని చాలామంది అడుగుతున్నారు. డబ్బు కోసం కాదు.. కథ బాగా నచ్చి చేశా. ప్రస్తుతం ‘డ్యూడ్’ అనే సినిమా చేస్తున్నా. మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేశాను’’ అన్నారు. -
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం : ఈషా
సుమంత్, ఈషారెబ్బ జంటగా సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ బ్యానర్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడి పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘దర్శకుడు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్ ల నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. రెండు పాత్రల అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయి కి మద్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.సుమంత్ నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది. నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. -
విమానం ఎక్కాలన్న ముచ్చట తీరింది..
గన్నవరం: బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడు విమానం ఎక్కాలన్న కోరికను విజయవాడకు చెందిన ‘యువర్ విష్ అవర్ డ్రీమ్’ అనే స్వచ్ఛంద సంస్థ నెరవేర్చింది. కృష్ణా జిల్లా కంకి పాడుకు చెందిన సంతోష్(8) కేన్సర్‌తో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమానం ఎక్కాలనే ఆ బాలుడి కోరికను వైద్యులు ద్వారా తెలుసుకున్న యువర్ విష్ అవర్ డ్రీమ్ సంస్థ ప్రతినిధులు గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్‌లు బాలుడిని విమానం ఎక్కించేందుకు అంగీకరించారు. దీంతో సంస్థ అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరి, ఉపాధ్యక్షులు శనివారం బాలుడిని కొద్దిసేపు విమానం ఎక్కించారు. -
‘వర్సిటీ’ పేరిట వంచన
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడిసిన్ సీట్లు ఇస్తానంటూ అనేక మంది వైద్యులను నిండా ముంచిన సూడో డాక్టర్ సంతోష్ రాయ్ కేసు దర్యాప్తులో కొత్త విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఇతనితో పాటు సహచరుడైన మనోజ్‌కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. దాదాపు 16 ఏళ్లుగా మోసాలు చేస్తున్న సంతోష్ వ్యవ హారాలకు నాంది ఢిల్లీలోనే పడింది. 2002లో ఎస్ఆర్ఎం వర్సిటీని ఏర్పాటు చేసి పలు కోర్సుల పేర అడ్మిషన్లంటూ మోసాలకు తెరలేపాడు. కొన్ని వైద్య సంబంధ కోర్సుల్నీ ప్రవేశపెట్టాడు. అప్పట్లో 30 మంది నుంచి రూ.9 కోట్ల వరకు వసూలు చేసి జైలుకెళ్లాడు. అయినా మోసాలు కొనసాగిస్తూ ముఠాల ఏర్పాటుతో వ్యవస్థీకృత పంథాలోకి మారాడు. ఇటీవల సంతోష్‌పై 2 కేసుల్ని సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. నగరానికి చెం దిన డాక్టర్ ఫాతిమా కుమార్తెకు పీజీ మెడిసిన్ సీటు పేరుతో రూ.81 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు సిటీలో ఉండగా, ఢిల్లీలో రాజేంద్రనగర్‌కు చెందిన మరో వ్యక్తి నుంచి రూ.68 లక్షలు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించాడు. ఇతని అరెస్టుని మీడియా ద్వారా తెలుసుకున్న ఇద్దరు బాధితులు సోమవారం బయటకు వచ్చారు. వైజాగ్ కి చెందిన ఓ డాక్టర్ తన నుంచి రూ.65 లక్షలు తీసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపడంతో అక్క డి ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు. బెంగళూరు నుంచి వచ్చి సిటీలో ఉద్యోగం చేస్తున్న మరో వైద్యుడు సైతం సైబర్ క్రైమ్ ఠాణాను సంప్రదించాడు. సంతోష్ అండ్ గ్యాంగ్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకున్నట్లు వాపోయాడు. దీనిపై బెంగళూరులో కేసు నమోదు కానుంది. ఈ రెండు కేసుల్లో అక్కడి పోలీసులు సంతోష్ తదితరుల్ని పీటీ వారంట్‌పై అక్కడకు తరలించే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీగానే... ఈ గ్యాంగ్ ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. సాధారణంగా ఇంతటి భారీ మొత్తాలను మోసగాళ్లు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడమో, ట్రాన్స్ఫర్ చేయించడమో చేస్తుంటారు. కానీ వీరు బ్యాంక్ ఖాతాల జోలికిపోలేదు. వాటిని వాడితే పోలీసులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో నగదు మాత్రమే తీసుకునేవారు. ఇతన్ని అరెస్టు చేసిన పోలీసులు 11 బ్యాంకు ఖాతా లను గుర్తించి ఫ్రీజ్ చేశారు. వీటిలో ఒక్క ఖాతాలోనే రూ.3 లక్షలు ఉన్నట్లు తేలింది. బాలీవుడ్ నిర్మాత అయిన సంతోష్ ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఉం టాడన్న కోణంలోనూ అధికారులు దృష్టి పెట్టారు. ఈ సూడో గ్యాంగ్ కొన్ని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈడీ సహా ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తు న్న ఆర్థిక నేరాల వివరాలు సంతోష్‌కు తెలిసేవి. అందులోని నిందితులతో సంప్రదింపులు జరిపి ఆయా కేసుల్ని సెటిల్ చేయిస్తానని లేకుంటే త్వరలో కఠిన చర్యలు తప్పవని బెదిరించేవాడు. ఈ కోవకు చెందిన బాధితుల్లో సిటీకి చెందిన వారూ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ప్రాధాన్యత, పరిధి దృష్ట్యా లోతుగా విచారించడానికి సంతోష్‌ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
సూడో డాక్టర్ సూపర్ నెట్వర్క్!
సాక్షి, హైదరాబాద్: ఎంట్రన్స్‌లు అవసరం లేకుండా మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామం టూ బల్క్ ఎస్సెమ్మెస్‌లు ఇచ్చి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఘరానా గ్యాంగ్‌కు సంతోష్ కుమార్ రాయ్ సూత్రధారి అని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గురువారం పోలీసులు అరెస్టు చేసిన ఇరువురిలో ఇతడూ ఉన్నాడు. పదిహేనేళ్లుగా సంతోష్ ఇదే దందాలో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అతడు పలువురిని బ్లాక్మెయిల్ కూడా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారించేందుకుగాను వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి లభిస్తే సంతోష్‌ను ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్లి దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఈ గ్యాంగ్ ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసిం ది. బ్యాంక్ ఖాతాల్లో వేయించుకుంటే పోలీ సులకు ఆధారాలు లభిస్తాయనే ఉద్దేశంతో కేవలం నగదు మాత్రమే తీసుకుంటుంది. దీనికోసం సంతోష్ తన అనుచరుల్ని ఏ ప్రాంతా నికి కావాలంటే ఆ ప్రాంతానికి పంపిస్తుంటాడు. కొన్నిసార్లు టార్గెట్‌నే ముంబైకి పిలి పించుకుని వసూలు చేశాడు. మెడిసిన్ పీజీ సీట్లు ఆశించేవారికి నమ్మకం కలగడానికి సం తోష్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తోపాటు వివిధ యూనివర్సిటీల పేర్లతో కొన్ని డీడీలను సైతం కట్టిస్తాడు. సిటీ కి చెం దిన బాధితురాలు డాక్టర్ ఫాతిమా రజ్వీతో నూ రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.16,700 డీడీలు కట్టించాడు. నగదుతోపాటు వీటిని కలెక్ట్ చేసుకునే ఈ గ్యాంగ్ ఎక్కడా ఎన్‌క్యాష్ చేయదు. ఈ గ్యాంగ్ సూడో డాక్టర్ల రూపంలో ఢిల్లీలో ఓ ఆస్పత్రిని నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని సీజ్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ‘ఏరియా’కు ఓ పని అప్పగింత పోలీసులు దాడి చేసినా ముఠా మొత్తం చిక్కకుండా సంతోష్ జాగ్రత్తలు తీసుకున్నాడు. వెబ్సైట్లు హ్యాకింగ్ చేయడం, అవసరమైతే నకిలీ వెబ్సైట్లు సృష్టించడం, స్పూఫింగ్‌కు పాల్పడటం తదితర ‘సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ’ బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఏర్పాటు చేసుకున్నాడు. నగదు కలెక్ట్ చేసుకునే ఏజెంట్లను ఢిల్లీ నుంచి పంపిస్తాడు. బల్క్ ఎస్సెమ్మె స్లు పంపే వారు వారణాసి కేం ద్రంగా పనిచేస్తారు. సంతోష్ తన అనుచరుల్లో కొందరికి జీతాలు, మరికొందరికి కమీషన్లు ఇస్తుంటాడు. వివాదాస్పద నిర్మాతగా... హిందుత్వవాదిగా పేరున్న సం తోష్ రాయ్ అఖిల భారతీయ హిం దూ మహాసభ సీనియర్ లీడర్ హోదాలో అనేక జాతీయ చానళ్లలో చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాడు. బ్రహ్మర్షి ఫిలింస్ పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేసి కొన్ని బాలీవుడ్ చిత్రాలనూ నిర్మించాడు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే చరిత్రను 2011లో ‘గాడ్సే’ పేరుతో తెరకెక్కించాడు. ఠాకూర్ ప్రజ్ఞాసింగ్ సాధ్వీ తదితరుల అరెస్టుతో తెరపైకి వచ్చిన హిం దూ ఉగ్రవాదంపై బాలీ వుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని గతేడాది భావిం చారు. అలాం టి ప్రయత్నాలు చేస్తే బాలీవుడ్లో చిత్ర నిర్మాణం ఆగిపోతుందంటూ హెచ్చరించి వివాదాస్పదుడయ్యాడు. అతడు బ్రహ్మర్షి ఫిలింస్‌తోపాటు పలు సంస్థలు నెలకొల్పాడు. ఇతడి ‘మెడిసిన్’మోసాలపై ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలతోపాటు పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ల్లోనూ కేసులు నమోదయ్యాయి. అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌లతోపాటు మరికొందరు ప్రముఖుల్నీ బ్లాక్మెయిల్ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. -
ఔడదం చిత్ర ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఔడదం చిత్రం గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు పేరరసు ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు నితిలన్ అందుకున్నారు. రెడ్‌చిల్లీ బ్లాక్ పేపర్ సినిమాస్ పతాకంపై నేతాజీ కథ రాసి, నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఔడదం. ఢిల్లీకి చెందిన సమీరా కథానాయకిగా, సంతోష్ రెండవ కథానాయకుడిగానూ నటించిన ఈ చిత్రానికి కథనం, దర్శకత్వం బాధ్యతలను రమణి నిర్వహించారు. దర్శి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత రచయిత పట్టుకోట్టై కల్యాణసుందరం అన్న కొడుకు షణ్ముగసుందరం గీత రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయనతో పాటు సింగపూర్ కల్వైందన్, తమిళ్ ముదన్, చో.శివకుమార్, విజయ్‌కృష్ణన్ ఈ చిత్రానికి పాటలు రాశారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది మెడికల్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే మందులను తయారు చేసి అధికారులు, రాజకీయనాయకుల సహకారంతో వాటిని మార్కెటింగ్ చేసే సంఘద్రోహుల గురించిన చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందన్నారు. చెన్నైకి చెందిన ఇక మధుమేహ వైద్యుడు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మందులను నిషేధించేలా చేసి మళ్లీ అవి అమల్లోకి వచ్చే 10 రోజుల్లో జరిగే మెడికల్ థ్రిల్లర్ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని కమర్శియల్ అంశాలతో పాటు ప్రజలకు మంచి సంధేశానిచ్చే చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందని తెలిపారు. జాగ్వుర్‌తంగం, శ్రీరామ్, కేవీ.గుణశేఖర్ పాల్గొన్నారు. -
రోజూ చంపేస్తున్నారు
♦ రోజా మృతి కేసులో రోజూ బెదిరింపులే ♦ ప్రేమిస్తున్నానని వెంటపడి.. పెళ్లంటే కుదరదన్న సంతోష్ ♦ మరో యువకుడిని వివాహమాడినా వదలని వైనం ♦ ఊరందరి ముందే ఆమెను వెంటాడి వేధించిన ప్రబుద్ధుడు ♦ ఆనక హత్యాచారం చేశారంటున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ♦ నిందితులకు టీడీపీ నేత, భీమిలి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అండ ♦ దారుణ ఘటనపై కనీస మాత్రంగా స్పందించని రెవెన్యూ, పోలీసు అధికారులు ♦ పైగా ఆత్మహత్యగా కేసు నమోదు.. సాక్ష్యాలు తారుమారు ♦ అదేమని రోజా తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీకు పిచ్చెక్కిందంటన్న గబ్బర్ సింగ్ సీఐ ♦ రోజా అక్క చెల్లెళ్లకు నిత్యం బెదిరింపులు ♦ మంత్రి గంటా ఇలాకాలో రెండు నెలలుగా దాష్టీకం ప్రేమించానని వెంటపడ్డాడు.. పెళ్లి మాటెత్తేసరికి కులం సాకు చూపి జారుకున్నాడు.. ఛీకొట్టిన ఆ యువతి తల్లిదండ్రులు చూసిన యువకుడితో మూడుముళ్లు వేయించుకుని వెళ్లిపోయింది.. ఆషాడమాసంలో పుట్టింటికొచ్చిన ఆమెను మళ్లీ వెంటపడ్డాడు. ఊరందరి ముందే వేధించాడు.. అడ్డుకోబోయిన ఆమెనూ కొట్టాడు.. అంతే.. ఆ రాత్రే అదృశ్యమైన ఆ యువతి.. మరునాడు ఊరి చివర బావిలో నిలువెల్లా గాయాలతో విగతజీవిగా కనిపించింది.. ఆ అమాయకురాలి మానప్రాణాలను ప్రేమ పేరుతో వేధించిన యువకుడు, అతగాడి మిత్రబృందమే బలిగొందని ఊరు ఊరంతా ఘోషించింది.. ఆందోళన బాట పట్టింది.. న్యాయం కోసం డిమాండ్ చేసింది. ఇంతలో అధికార టీడీపీ నేత రంగ్రప్రవేశం చేశాడు.. పెద్దమనిషి ముసుగులో నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు.. అంతే పోలీసులూ ఆయనకు వంతపాడారు.. మృతురాలిది ఆత్మహత్యగా తేల్చేశారు.. యువకుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించనట్లు కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్నవారిని ఆ ప్రాంత పోలీసు అధికారి పిచ్చివాళ్ల కింద జమకడుతున్నాడు.. మరోవైపు ఆందోళన చేపట్టిన మృతురాలి అక్కాచెల్లెళ్లను, బంధువులను టీడీపీ నేత అనుచరులు బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు..మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఈ దమనకాండపై సాక్షి ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్... నిందితులకు టీడీపీ నేత గొర్రెపాటి అండ? అనంతవరానికి చెందిన తెలుగుదేశం నాయకుడు, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి పెద ఎర్రినాయుడు నిందితుల తరఫున రంగంలోకి దిగి కేసు నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జూలై 11న ఘటనాస్థలికి వచ్చిన ఎర్రినాయుడు విచారణ చేపట్టిన పోలీసులతో అక్కడే మంతనాలు జరిపాడని రోజా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటివరకు మీకు న్యాయం చేస్తామని చెప్పుకొచ్చిన పోలీసుల తీరు ఆ తర్వాతే మారిపోయిందని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సరిగ్గా పదేళ్ల కిందట రాష్ట్రాన్ని ఓ కుదిపేసిన ఆయేషా మీరా హత్య కేసును తలపిస్తున్న రోజా అనుమానాస్పద మృతి కేసుపై అధికారుల విచారణ తీరు కూడా అనుమానాలకే తావిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువతిని అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేశారని తల్లిదండ్రులు ఘోషిస్తున్నా ఏ మాత్రం లెక్క చేయని అధికారుల నిర్వాకం, తిరిగి బాధితులపైనే బెదిరింపులకు దిగుతున్న వైనం వివాదాస్పదమవుతోంది . అసలేం జరిగిందంటే.. పద్మనాభం మండలం అనంతవరం గ్రామానికి చెందిన కొండమాని శివన్నారాయణ, అచ్చియ్యమ్మలకు ముగ్గురు కుమార్తెలు. గీత కార్మికుడైన శివన్నారాయణ రోజూ కూలి పనికి వెళ్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. అతని రెండో కుమార్తె రోజాను అదే గ్రామానికి చెందిన ముత్తుపాటి సంతోష్ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లిచేసుకోమనే సరికి మీది మా కంటే తక్కువ స్థాయి... కుదరదన్నాడు. కావాలంటే వివాహేతర సంబంధంతో కొనసాగిద్దామన్నాడు. హతాశురాలైన ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన యువకుడితో వివాహం చేసుకుంది. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన బాడితబోని ఈశ్వరరావుతో జూన్ 3న పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో కూడా సంతోష్ వచ్చి నానాయాగీ చేయడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామపెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గొడవ అప్పటికి సద్దుమణిగింది. ఆషాఢ మాసం కావడంతో జూన్ 16న రోజా కన్నవారింటికి వచ్చింది. దాంతో సంతోష్ మళ్లీ ఆమె వెంటపడ్డాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఆమెను అడ్డుకుని ‘నీతో మాట్లాడాలి.. తనతో రమ్మంటూ’ వేధించేవాడు. ‘నాకు పెళ్లయింది.. నన్ను వదిలేయ్’.. అంటూ ఓసారి గట్టిగా మాట్లాడిన రోజాపై అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న గ్రామస్తురాలు కొప్పు నాగమణి అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జూలై 9న సాయంత్రం 4 గంటలకు రోజా చేయిపట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్లిపోతుంటే ఆమె కేకలు వేసింది. దీంతో దగ్గరలో ఉన్న ఆమె చెల్లెలు కృష్ణమ్మ పరిగెత్తుకొని వచ్చి సంతోష్‌ను విసురుగా తోసివేసి రోజాను తీసుకొని వెళ్లింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి మాయమైన రోజా 11వ తేదీన ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారకొండ అటవీ ప్రాంతంలోని నేలబావిలో శవమై తేలింది. సంతోషే చంపేశాడని ఊరంతా గగ్గోలు పెట్టింది. కన్నవారి కడుపుకోత, అయినవాళ్ల రోదనలు రెవెన్యూ, పోలీసు అధికారులకు తప్ప అందరి గుండెల్ని తాకాయి. తమ బిడ్డను ఘోరంగా హత్య చేశారని ముక్తకంఠంతో ఘోషిస్తున్నా విచారణ కొచ్చిన తహసీల్దార్ సుమతీబాయి మాత్రం రోజాది ఆత్మహత్యేనని పంచనామాలో రాసి వెళ్లి పోయారు. ఇక పోలీసులు.. పోస్టుమార్టం తంతు ముగించి మృతదేహాన్ని ఇచ్చి మీ అమ్మాయి తనంతట తానే నుయ్యిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ఎవరి ప్రమేయం లేదని తేల్చేశారు. రోజా తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రగతిశీల మహిళా సంఘం, కల్లుగీత కార్మిక సమాఖ్య, దళిత విముక్తి, ప్రజాసంఘాలు రోజులతరబడి నిరవధిక ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు ఆత్మహత్యాప్రేరేపిత నేరంగా మార్చి సంతోష్‌పై కేసు నమోదు చేశారు. మా అమ్మాయిని రేప్ చేసి.. చంపేశారు 9వ తేదీ రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న రోజాను సంతోష్, అతని స్నేహితులు బలవంతంగా ఎత్తుకెళ్లి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అత్యాచారానికి పాల్పడ్డారు. ముత్తుపాటి సంతోష్‌తో పాటు అదే గ్రామానికి చెందిన వంక సంతోష్, వంగలి దుర్గ, రాలి ఉమామహేశ్వర్, కశిరెడ్డి కిరణ్, చొప్పమురళి, తమరాడ వెంకటరావులు ఈ దారుణానికి పాల్పడ్డారని రోజా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.. కానీ రోజా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సంతోష్ మోసం చేశాడని గ్రహించి మేం కుదిర్చిన పెళ్లి చేసుకుంది.. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకుంటే అప్పడే చెప్పేది..పెళ్లయిన తర్వాత ఎందుకు బలవంతంగా ప్రాణం తీసుకుంటుంది.. అది కూడా అర్ధరాత్రి ఇంటి నుంచి ఒంటరిగా అడవికి వెళ్లి నుయ్యులో దూకి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందన్న వారి ప్రశ్నలకు మాత్రం అధికారులు సమాధానం చెప్పడం లేదు. అవి సాక్ష్యాలే కావంటున్న ఖాకీలు ఇక పోలీసుల తీరు కూడా అలాగే ఉంది. రోజా శవమై తేలిన నేలనుయ్యికి దగ్గర్లో మందు బాటిళ్లు, చికెన్ మసాలా ప్యాకెట్లు కనిపించాయి. రోజా హత్యకు గురైన జూలై 9 రాత్రి సంతోష్ చికెన్ పట్టుకొని వెళ్లాడు.. నా టూవీలర్ బండి ఇచ్చానని అక్కడ చికెన్ షాపులో పనిచేసే యువకుడు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం వాటిని సీజ్ చేయలేదు. ఇటీవల తరచూ కురిసిన వర్షాలకు సాక్ష్యాలు వాటంతట అవే మాయమై పోయేవరకు ఎదురుచూశారు. అలాగే గుండు చేయించుకున్న సంతోష్ తలపై పెట్టుకునే టోపీ అదే బావిలో దొరికినా.. అబ్బే... అది సాక్ష్యమే కాదని ఖాకీలు కొట్టిపారేశారంటే విచారణ ఏరీతిన చేపట్టారో అర్ధమవుతుంది. పైగా పోలీసులు ఏం చెబుతున్నారంటే... సంతోష్‌ను పెళ్లి చేసుకోమని రోజా ఒత్తిడి చేసింది.. అతను నిరాకరించడంతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పుకొస్తున్నారు. కుటుంబసభ్యులకు రోజూ బెదిరింపులే రోజా మృతిపై విచారణ చేపట్టాలని పీవోడబ్ల్యూతో సహా ప్రజాసంఘాలు ఉద్యమం ఉధృతం చేసిన నేపథ్యంలో రోజా అక్క భారతి, చెల్లెలు కృష్ణమ్మలకు ఊళ్లో వేధింపులు ఎక్కువయ్యాయి. రెండురోజుల కిందట సోమవారం గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి విశాఖలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో సోమవారం సాయంత్రం కూరగాయల షాపునకు వెళ్లిన భారతిని నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకున్న కసిరెడ్డి అప్పారావు అలియాస్ చందర్రావు అప్పారావు బెదిరించాడు. మీరంతా కలిసి ఏమీ చేయలేరు.. కొన్నాళ్లు ఆగండి మా దొడ్లలో ఎలా తిరుగుతారో చూస్తాం.. మీ సంగతి తేలుస్తామని గద్దించాడు. ఇక వారం కిందట వంకా అప్పలరాజు అనే అతను రోజా చెల్లెలు కృష్ణమ్మపై ఏకంగా కత్తి పెట్టి బెదిరించాడు. దీనిపై వెంటనే సీఐ కృష్ణమోహన్ అలి యాస్ గబ్బర్‌సింగ్ దృష్టికి తీసుకువెళ్తే.. మీరే నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలమ్మా అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇప్పటివరకు స్పందించని మంత్రి గంటా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో ఇంత దారుణం జరిగినా.. సుమారు 55రోజులుగా బాధితులు నిత్యం ఆందోళనలు చేస్తున్నా ఆ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంతవరకు స్పందించకపోవడం విమర్శల పాలవుతోంది. పైగా టీడీపీ నేత, భీమిలి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గొర్రిపాటి ఎర్రినాయుడు నిందితులకు అండగా ఉన్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నా మంత్రి పట్టించుకోకపోవడం చర్చాంశనీయంగా మారింది. విచారణలో అన్నీ అవకతవకలే... నెలన్నరగా సెలవులోనే తహసీల్దార్ తమ కుమార్తెను పాశవికంగా అత్యాచారం చేసి హత్యచేశారని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కనీసం ఆ దిశగా విచారణ చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. శవపంచనామా విషయంలో తహసీల్దార్ సుమతీబాయి తీరు విమర్శల పాలైంది. పంచనామాదారులను ఎంపిక చేయకుండానే, వారికి మృతదేహం చూపించి గాయాలున్నాయా? లేదా అన్నదాననికి వారి అభిప్రాయాలు నమోదు చేయకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం అయ్యింది. మీ అమ్మాయి మృతదేహం ఇస్తాం.. ఐదుగురు సంతకాలు చేయండి అని రోజా బంధువులతో పంచనామాదార్ల సంతకాలుగా నమోదు చేసేశారు. వారంతా ఉమ్మడిగా ఆత్మహత్య అని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తహసీల్దార్ నివేదిక ఇచ్చేశారు. ఓ మహిళా అధికారి అయి ఉండి కూడా తహసీల్దార్ అలా ఎందుకు నివేదిక ఇచ్చారన్నది ఇప్పటికీ అంతుబట్టకుండా ఉంది. పైగా ఈ ఘటన జరిగిన తర్వాత రోజు నుంచి తహసీల్దార్ సెలవులో వెళ్లిపోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. ఆ తర్వాత ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రీ పోస్టుమార్టంకు ఆదేశాలిచ్చినా అప్పటికే సాక్ష్యాలు తారుమారయ్యాయన్న వాదనలకు బలం చేకూరుతోంది. జుడీషియల్ విచారణ జరిపించాలి : పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి రోజా మృతి ఘటనపై జుడీషియల్ విచారణ చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి డిమాండ్ చేశారు. ఆమెను అత్యంత పాశవికంగా బలత్కారం చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. నిందితుల తరఫున టీడీపీ నేత, మార్కెట్ యార్డు చైర్మన్ ఎర్రినాయుడు రంగంలోకి దిగడంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు కేసును నిర్వీర్యం చేసేందుకు ఇప్పటికే సాక్ష్యాలను తారుమారు చేసేశారని అన్నారు. అందుకే జుడీషియల్ విచారణ చేపడితేగానీ అసలు దోషు అరెస్టు కారని అన్నారు. పోలీసులు మమ్మల్నే బెదిరిస్తున్నారు: రోజా సోదరి కృష్ణమ్మ తన సోదరి రోజాను ముత్తంపాటి సంతోష్‌తో సహా అతని అనుచరులు ఏడుగురు కలిపి అత్యాచారం చేసి హత్య చేసి నూతిలో పడేశారు. సంతోష్ ను మాత్రమే అరెస్టు చేశారు. మిగతా ఆరుగురుని అరెస్టు చేయలేదు. గొర్రెపాటి పెద ఎర్రినాయుడు వీరికి కొమ్ము కాసి అరెస్టు చేయనివ్వకుండా చేస్తున్నారు. తాము చెప్పింది పోలీసులు వినడం లేదు.. పైగా మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారని కొండమాని కృష్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సమాధానం లేని ప్రశ్నలు ♦ రోజా ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. కానీ నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే అర్ధరాత్రి 2గంటల సమయంలో ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అడవికి వెళ్లి ఎందుకు అఘాయిత్యం చేసుకుంటుంది? ♦ నీళ్లతో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడికతే తలపై రక్త గాయాలు ఎందుకున్నాయి.. తాళి బొట్టుకి రక్తం అంటుకుని ఎలా ఉంది.. 40గంటలకు పైగా మృతదేహం బావిలో ఉన్నా... ఆమె ఒంటిపై ముద్దలు ముద్దలుగా రక్తం ఎలా అంటుకుని ఉంది.? బాధితులపైనే గబ్బర్‌సింగ్ క్రౌర్యం ఇక కేసు విచారణలో ఖాకీలు విమర్శలు ఎదుర్కొంటుండగా, పద్మనాభం సీఐ వై కృష్ణకిషోర్ కుమార్ అలియాస్ గబ్బర్‌సింగ్ వ్యవహారశైలి మరింత వివాదాస్పదమవుతోంది. తన పేరుతో కంటే గబ్బర్‌సింగ్‌గా పిలవాలని అందరినీ కోరుకునే సదరు సీఐ బాధితులనే బెదిరిస్తున్న వైనం ఏవగింపు కలిగిస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఎంతో మర్యాదగా వ్యవహరిస్తుంటే ఈ గబ్బర్‌సింగ్ మాత్రం తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో బాధితుల మీదే ఇష్టమొచ్చినట్టు మాట్లాడటడం చర్చాంశనీయంగా మారింది. ఈ కేసు విషయమై ఏం జరిగిందని అడిగితే.. మీకు పిచ్చెక్కింది.. వాడు పెళ్లిచేసుకోనంటే మీ అమ్మాయే సూసైడ్ చేసుకుని చచ్చింది.. అని సీఐ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని రోజూ తల్లి చెప్పుకొచ్చారు. న్యాయం చేయాల్సిన సీఐ బెదిరింపులకు దిగితే.. తమకు ఏం న్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
‘ఏపీలో సీఎంను నిర్ణయించేది మనమే’
– కేంద్రంలో మళ్లీ అధికారం మనదే – ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ కూడా మనదే.. – భారతీయ జనతా పార్టీ నేతలు కదిరి: ‘ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉండాలి?.. ఎవరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి అని నిర్ణయించేది మనమే.. బీజేపీ ఓట్లే 2019 ఎన్నికల్లో కీలకం కానున్నాయి’ అని బీజేపీ జాతీయ సహప్రధాన కార్యదర్శి సంతోష్, యువమోర్చ రాష్ట్ర అద్యక్షులు విష్ణువర్దన్‌రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సరస్వతి విద్యామందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ కదిరి నియోజకవర్గ పోలింగ్‌బూత్ కార్యకర్తల సమ్మేళన సభలో వారు ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ సర్కారు ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని వారు గుర్తు చేశారు. అయితే వాటన్నింటినీ రాష్ట్రసర్కారు తమ పథకాలుగా చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలోని ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నారని, రైతులు ఇప్పుడు అందుకుంటున్న ఇన్పుట్ సబ్సిడీ కూడా కేంద్రం ఇచ్చిందేనని వారు గర్వంగా చెప్పారు. మోడీ సర్కారు పేదల ప్రభుత్వమని వారు చెప్పుకొచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు 100 నుండి 150 రోజుల పనిదినాలుగా పెంచిన ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేశారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ..అని అభివర్ణించారు. గతంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు ఎన్నో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. కానీ నరేంద్రమోడీ మచ్చలేని పాలనను అందిస్తున్నారని ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్త గర్వంగా చెప్పవచ్చన్నారు. -
హైదరాబాద్‌లో తొలి బయో డీజిల్ ప్లాంట్
-
పిచ్చి ప్రేమికుడు
► అమ్మాయి కోసం కొట్టుకున్న యువకులు ► నిశ్చితార్థం చేసుకున్న యువకుడిని అడ్డగించి దాడిచేసిన పిచ్చి ప్రేమికుడు ► తల్లీ,కూతురికి బెదిరింపులు ► బాధితుడిపైనే కేసు నమోదుచేసిన పోలీసులు బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరుగుతుందని ఆ యువకుడిపై దాడి చేశాడు. కిరాయి రౌడీలతో కలిసి దాడిచేసిన సంఘటన తాలూకాలోని హణబె గ్రామంలో చోటుచేసుకుంది. పార్వతమ్మ గ్రామంలో నివాసం ముంటోంది, ఈమె తన కూతురు రమ్యతో(19) కలిసి జీవిస్తోంది. రమ్య 5 ఏళ్ల నుండి పక్క గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. మధు అనే తన దూరపు బంధువుల యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. రమ్య తనతో చనువుగా ఉంటుందని మధు పార్వతమ్మ ను రమ్య ను తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. మధు మంచివాడు కాకపోవడంతో పార్వతమ్మ రమ్య ప్రేమించిన సంతోష్ కి ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేసింది. మధు తనను తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకున్న పార్వతమ్మ ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. మధు సంతోష్ ఎలాగైనా హత మార్చాలని సంతోష్ పై రౌడీలతో దాడి చేశాడు. దాడిలో సంతోష్ ఆత్మరక్షణకు మధుపై దాడి చేశాడు. మధుకు ఆదాడిలో స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. మధు సంతోష్ యే నాపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. సంతోష్ మధు పై కేసు నమోదు చెయ్యడానికి వెళితే ముందే మధు నిపైనా కేసు నమోదు చేశాడని పోలీసులు తెలిపారు. సంతోష్ పార్వతమ్మలు పోలీసులు మధుకు రాజకీయ అండ ఉండటం కారణంగానే ఇలా కేసును తప్పుదోవ పెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పై దొడ్డబెళవంగల ఎసై రాఘవేంద్ర మాట్లాడుతూ ఇరువైపుల వారి ఫిర్యాదులూ స్వీకరిస్తామని,తమపై ఈ ఘటనకు సంబంధించి ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసారు. -
ఈ పెళ్లి ఆహ్వాన వీడియో చూస్తే..
ముంబై: అంగరంగ వైభోగం.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట.. బహుశా ఈ మాటలు కూడా చిన్నబోయేంత వైభవంగా జరిగిన ఓ బీజేపీ నేత కుమారుని వివాహ వేడుక ఇపుడు హాట్టాపిగ్గా నిలిచింది. భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు రావ్‌సాహెబ్ పాటిల్ దన్వే కుమారుడు, భోకార్దన్ ఎంఎల్ఏ సంతోష్ పాటిల్ వివాహం గురువారం అత్యంగా వైభవంగా జరిగింది. అయితే ఏంటి అనుకుంటున్నారా...అయితే దీని ప్రత్యేకత ఏంటో చెప్పాల్సిందే....వీడియో ఆహ్వానాలు, డిజైనర్ సెట్లు, డ్రోన్ కెమెరాలతో , పోలీసు నిఘాలో నిర్వహించిన పెళ్లితో రావ్ సాహెబ్ అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఈ పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను నూతన వరుడు సంతోష్ శుక్రవారం తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. సినిమా స్టయిల్ ను మించి రూపొందించిన ఈ వీడియో వైరల్ అయింది. పెళ్లి కూతురితో కలిసి పెళ్లికొడుకు సైకిల్ తొక్కుతూ, పార్క్‌లో డ్యాన్స్ వేస్తూ ఉన్న ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సుమారు 45 వేలకు పైగా లైక్స్‌ను, వందల షేర్లను సాధించింది. దాదాపు 30,000 మంది అతిథులు హాజరైన ఈ పెళ్లి వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా మొత్తం క్యాబినెట్ విచ్చేయడం మరో విశేషంగా నిలిచింది. సంతోష్ 2014 ఎన్నికల్లో భోకార్దన్ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ నియోజకవర్గంలో భారీ ఖర్చుతో, అత్యంత వైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించడం వార్తల్లో నిలిచింది. -
వరదలో చిక్కుకున్న జాలర్లు క్షేమం
-
వరదలో చిక్కుకున్న జాలర్లు క్షేమం
గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు జాలర్లు క్షేమంగా ఉన్నారని, వారిని మరికొంతసేపట్లో రక్షించి ఒడ్డుకు తీసుకువస్తామని అధికారులు చెబుతున్నారు. వివరాలివీ.. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ధర్మాజీ రాజేష్(28), కూనారపు సంతోష్(30) మరికొందరితో కలసి గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం వరకు మిగతా వారంతా తిరుగుముఖం పట్టగా.. వీరిద్దరూ ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. ఒడ్డుకు చేరేందుకు వీలుకాక రాత్రంతా నీటిలోనే గడిపారు. సోమవారం ఉదయం తోటి వారితో కలిసి సమీప గ్రామస్థులు రక్షించేందుకు యత్నించినా వీలుకాలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. రామగుండం ఏఎస్పీ విష్ణు వారియర్, కలెక్టర్ జగన్మోహన్, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల సాయంతో ఎన్టీఆర్ ఎఫ్‌ను అప్రమత్తం చేశారు. కొద్దిసేపట్లోనే ఎన్టీఆర్ఎఫ్ దళాలు అక్కడికి చేరుకుని బోటు ద్వారా వారిని రక్షిస్తాయని అధికారులు చెప్పారు. -
సెంచరీతో చెలరేగిన సంతోష్
ఎడ్డీ ఐబారా వన్డే టోర్నీ సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో సంతోష్ (80 బంతుల్లో 132; 14ఫోర్లు, 4 సిక్సర్లు), వినయ్ (99), బౌలింగ్‌లో అంకిత్ (5/6) చెలరేగడంతో భవన్స్ జూనియర్ కాలేజ్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. హెచ్‌సీఏ ఎడ్డీ ఐబారా అండర్-19 టోర్నమెంట్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీగాయత్రి జట్టుపై 303 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భవన్స జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. వినయ్, సంతోష్‌తో పాటు సిద్ధార్థ్ నాయుడు (43) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీగాయత్రి జట్టు అంకిత్ సింగ్ ధాటికి 25.4 ఓవర్లలో 36 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు హెచ్‌పీఎస్: 36 (అనికేత్ రెడ్డి 5/12); వెస్లీ బాయ్స్ కాలేజ్: 37 (7.4 ఓవర్లలో) కాల్ పబ్లిక్ స్కూల్: 284/8 (హర్షవర్ధన్ 55, సూర్యతేజ 119, సుధీంద్ర 37; తరుణ్ 4/42); లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్: 218 (మీర్ విజారత్ అలీ 94, హర్షవర్ధన్ 3/50). కంబైన్డ డిస్ట్రిక్ట్: 189 (రఘు 47; సారుు కోమల్ 4/44); సీడీఆర్ జూనియర్ కాలేజ్ : 187 (సారుు కోమల్ 72; వంశీ 5/24). -
భర్తను హత్య చేసిన భార్య
రెబ్బన మండలం వరదలగూడెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేనవేణి సంతోష్(28) అనే వ్యక్తిని భార్య, మామ, అత్త కలిసి ఉరివేసి చంపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏడుగురు పేకాటరాయుళ్లకు రిమాండ్
పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులపై మేడిపల్లి పోలీసు లు కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పీర్జాదిగూడలో టి. సంతోష్ (29), షేక్ మనుసూర్(35), షేక్ నసీర్ హుస్సేన్(35), షేక్ హమాన్ బాషా(30), షేక్ అబ్దుల్ రహమాన్(38), బానోతు రమేష్(35), పానుగంటి మశ్చేందర్‌గౌడ్(38)లు పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ 1,00,720 నగదు, ఏడు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
షార్ప్ షూటర్స్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో షార్ప్ షూటర్స్, సనత్‌నగర్ బాస్కెట్‌బాల్ క్లబ్ జట్లు గెలుపొందాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ బాస్కెట్‌బాల్ క్లబ్లో గురువారం జరిగిన మ్యాచ్‌లో షార్ప్ షూటర్స్ 75-56తో రైజింగ్ స్టార్స్‌పై గెలిచింది. షూటర్స్ జట్టులో సంతోష్ 20, రోజ్ ఖాన్ 16 పాయింట్లు చేశారు. రైజింగ్ జట్టు తరఫున రాహుల్ (17), కిరణ్ రెడ్డి (14) రాణించారు. సనత్‌నగర్ జట్టు 68-63 స్కోరుతో నేషనల్ పోలీస్ అకాడమీ జట్టును ఓడించింది. సనత్‌నగర్ జట్టులో బసంత్ (21), పృథ్వి (16) ఆకట్టుకున్నారు. ఎన్పీఏ జట్టులో రవి 20, మనోజ్ 8 పాయింట్లు చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో వైఎంసీఏ సికింద్రాబాద్ 62-28 స్కోరుతో వీజేఐటీపై, గెవిన్ బాస్కెట్‌బాల్ అకాడమీ 48-28తో బెల్లి బాయ్స్ జట్టుపై, యంగ్మెన్స్ గిల్డ్ 68-42తో ఫిబా క్లబ్‌పై గెలుపొందాయి. -
ఓవరాల్ విజేత సంతోష్
హైదరాబాద్: డెలాయిట్ మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో ఆర్బీ సంతోష్ ఓవరాల్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం ఈ పోటీలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో మొత్తం 9 క్లబ్‌లను చెందిన సెయిలర్లు పాల్గొన్నారు. ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ముంబై విజేతగా నిలవగా, ఎలాంటి అనర్హతకు గురి కాకుండా చిత్రేశ్ మరో విన్నర్ ట్రోఫీని అందుకున్నాడు. మహిళల విభాగంలో హర్షిత తోమర్ ఉత్తమ సెయిలర్‌గా నిలిచింది. వర్ధమాన సెయిలర్లలో అరహంత్ వీరారెడ్డి, పి.సాకేత్ (అండర్-10)కు ప్రత్యేక పురస్కారాలు లభించాయి. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో డెలాయిట్ చైర్మన్ పీఆర్ రమేశ్ విజేతలకు బహుమతులు అందజేశారు. -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా మేదరమెట్ల మండలం తిమ్మనపాళెం గ్రామ శివారులో ద్విచక్రవాహనం ఢీకొని ఎం. సంతోష్(25) అనే క్లీనర్ మృతిచెందాడు. రోడ్డుపక్కన ఆగిఉన్న లారీకి పోసేందుకు నీళ్లు తీసుకెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. -
కాలేజీకి వెళ్లి .. తిరిగి రాలేదు..
విద్యార్థి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.....ఆర్.కె.హెచ్. కాలనీ వీధి నంబర్ 5లో నివాసముండే గోపయ్య కుమారుడు సంతోష్ (17) విద్యార్ధి. మంగళవారం కళాశాలకు వెలుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సంతోష్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో బుధవారం తండ్రి గోపయ్య నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మదొంగా!
పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న గజదొంగ సంతోష్ మారానంటూ నమ్మించి మళ్లీ నేరాలు మైనర్లను వినియోగించి భారీ చోరీలు ముమ్మరంగా గాలిస్తున్న నారాయణగూడ పోలీసులు హిమాయత్‌నగర్: ఇతడి పేరు సంతోష్... జంట కమిషనరేట్ల పరిధిలో అనేక చోరీలు చేశాడు... ఓ దశలో మారానంటూ పోలీసుల్ని నమ్మించి వారి సాయంతోనే ఆటో ఖరీదు చేశాడు... మళ్లీ పాత పంథాలోకే వెళ్లి భారీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇతడిని అరెస్టు చేయడానికి నారాయణగూడ పోలీసులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంతోష్‌నాయక్‌పై జంట కమిషనరేట్ల పరిధిలోని అనేక పోలీసుస్టేషన్లలో కేసులున్నాయి. గతేడాది సరూర్‌నగర్ ఠాణా పరిధిలో రెండు భారీ చోరీలు చేశాడు. ఆకస్మిక తనిఖీల్లో పట్టుకున్న ఆ ఠాణా పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన సంతోష్ చిక్కడపల్లితో పాటు అదే సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీలు చేశాడు. దీంతో సరూర్‌నగర్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఆటోడ్రైవర్‌గా మారి... సంతోష్‌ను సరూర్‌నగర్ పోలీసులు రెండోసారి అరెస్టు చేసినప్పుడు కొత్త డ్రామాకు తెరలేపాడు. తాను పూర్తిగా మారానని, జీవనోపాధి చూపిస్తే భార్య, పిల్లలతో కలిసి జీవిస్తానని నమ్మబలికాడు. ఇతడి మాటలు విశ్వసించిన పోలీసులు ఓ ఆటో ఖరీదు చేసుకోవడానికి సహకరించారు. ఆటోడ్రైవర్‌గా బతుకుతూనే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలని స్పష్టం చేశా రు. కొంతకాలం అలానే చేసి న సంతోష్‌పై పోలీసులకూ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్బెడ్రూమ్ ఇళ్లల్లో అతడికీ ఒకటి ఇప్పించాలని నిర్ణయిం చిన అధికారులు అందుకు సన్నాహాలు ప్రారంభించా రు. ఓపక్క పోలీసులు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే సంతోష్ మళ్లీ ‘దారి తప్పాడు’. నారాయణగూడ ఠాణా పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డాడు. మైనర్లను పావులుగా వాడి... ఈసారి సంతోష్ నాయక్ అత్యంత తెలివిగా వ్యవహరించాడు. తన ఉనికి బయటపడకూదనే ఉద్దేశంతో సమీప బంధువులైన ఇద్దరు మైనర్లను ఎంపిక చేసుకున్నాడు. వీరిని పావులుగా వాడి మార్చి 20, 25 తేదీల మధ్య నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డాడు. వారం రోజుల ముందు నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని నిర్థారించుకున్న తర్వాత ఇద్దరు మైనర్లను పంపి అర్ధరాత్రి చోరీ చేయించాడు. రూ.5 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారం తస్కరించాడు. పోలీసుల్నే ‘తినేస్తున్న’ సంబంధీకులు... ఈ చోరీ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. కొన్ని రోజుల క్రితం చోరీ చేసిన ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. వీరి ద్వా రా అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సంతోష్ కోసం తిరగని ప్రదేశం లేదు. సిటీలోని మరికొన్ని కేసుల్లోనూ వాంటెడ్‌గా ఉన్న సంతోష్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలనే ఉద్దేశంతో అతడి సంబంధీకుల్ని సంప్రదిస్తున్నారు. గజ దొంగ ఆచూకీ చెప్తామంటూ వారు పోలీసుల నుంచి డబ్బు పిండుతున్నట్లు సమాచారం. ఈ రూపంలో అధికారులు ఇప్పటికే వేలకు వే లు ఖర్చు చేశారు కూడా. సంతోష్‌ను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం దక్షిణాది వ్యాప్తంగా గాలిస్తోంది. -
అడవి పంది దాడిలో గొర్రెలకాపరికి గాయాలు
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామశివారులో సంతోష్ నాయక్(22) అనే గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామశివారులో ఉన్న గుట్టలపై బుధవారం ఉదయం గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
నాన్ అవళై సందిత్త పోదు
పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందన్నది సామెత. అయితే కోలీవుడ్‌లో పాత నీరు నిలకడగా, నిండుగా ఉన్నా, కొత్త నీరు ప్రవహిస్తూనే ఉంది. ఇక యువ తారలు నిలదొక్కుకుంటూనే ఉన్నారు. అలా కథై తిరైక్కథై వచనం ఇయక్కమ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంతోష్ కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటున్నారు. తాజాగా నటించనున్న చిత్రం నాన్ అవళై సందిత్త పోదు. ఇందులో అతనికి జంటగా సిద్ధూ+2, అంబు, నయాపుడై తదితర చిత్రాల నాయకి చాందిని నటించనుంది. దీనిని సినీ ప్లాట్‌ఫాం పతాకంపై వీటీ.రితీష్‌కుమార్ నిర్మించనున్నారు. దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఎల్జీ.రవిచంద్రన్ నిర్వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు మాసాణి, ఐందామ్ తలైమురై సిద్ధ వైద్ది శిఖామణి చిత్రాలను తరకెక్కించారన్నది గమనార్హం. నాన్ అవళై సందిత్త పోదు చిత్రం వైవిధ్య ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
కుమారుడి చేతిలో తండ్రి హతం
ఆలేరు మండలం మందనపల్లిలో సోమవారం అర్ధరాత్రి సమయంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుమారుడి చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. మందనపల్లి గ్రామానికి చెందిన సంతోష్ తన తండ్రి దగిడి ఇఫ్తారీ(60)ని సోమవారం అర్ధరాత్రి సమయంలో రోకలిబండతో మోదాడు. తీవ్రగాయాలపాలైన ఇఫ్తారీని చికిత్స హైదరాబాద్- ఉప్పల్‌లోని ఆదిత్య ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నాం మృతిచెందాడు. సంతోష్ మానసిక స్థితి 6 నెలలుగా సరిగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్ధి ఆత్మహత్యాయత్నం
స్కూల్‌కి వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలంలోని ఇసుకమీదికి గ్రామంలో మంగళవారం జరిగింది. బయ్యారంలో ఒక పాఠశాలలో సంతోష్ 9వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా స్కూల్‌కి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాంప చెందిన విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతడిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. -
మీ జీవితంలో ఉప్పు ఉందా?
ఆత్మబంధువు ‘‘హాయ్ అక్కా’’ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సంతోష్. ఎవరా అని చూసింది రేఖ. తమ్ముడు సంతోష్. ఆనందం... ఆశ్చర్యం! ‘‘ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. రారా’’ అంటూ ఆహ్వానించింది. ‘‘ఈ అక్కను చూడ్డానికి కూడా టైమ్ దొరకడం లేదా నీకు’’ అంటూ చిరుకోపం ప్రదర్శించింది. ‘‘సారీ అక్కా. వద్దామని ఉన్నా కుదరట్లేదు. అయినా నువ్వు కూడా ఇలా తిడితే నేనేం చేయగలను?’’ ‘‘సర్లేరా. అయినా నేను కాక ఇంకా తిట్టేవాళ్లున్నారా నిన్ను?’’ ‘‘ఉందిగా... మీ మరదలు.’’ ‘‘అదేంట్రా... ఇద్దరూ బాగానే ఉంటారుగా?’’ ‘‘ఉంటారు కాదు... ఉండేవాళ్లం. ఇప్పుడు రోజూ చిరాకులు పరాకులు.’’ ‘‘రోజూనా?’’ ‘‘రోజూ అంటే రోజూ కాదు. తరచుగా.’’ ఇంతలో ఆఫీసు నుంచి ఆనంద్ వచ్చేశాడు. ‘‘హల్లో సంతోష్... ఎలా ఉన్నావ్’’ అంటూ కూర్చున్నాడు. ‘‘సరే.. బావా మరుదులు మాట్లాడు కుంటూ ఉండండి. నేను వంట చేస్తా’’ అంటూ లేచింది రేఖ. ‘‘వంట అయిపోయింది. రండి’’ పిలిచింది రేఖ. ‘‘వద్దు అక్కా... నేను వెళ్తాను’’ అన్నాడు సంతోష్. ‘‘నేను కీర్తికి ఫోన్ చేసి చెప్పాలే. నువ్ భోంచేసి వెళ్లు.’’ తప్పదన్నట్లుగా కూర్చున్నాడు. రేఖ భోజనం వడ్డించింది. ‘‘ఏంటోయ్ ఈ కూరలో ఉప్పేలేదు’’ అన్నాడు ఆనంద్. ‘‘ఔనా... మర్చిపోయుంటాను.’’ ‘‘ఔనౌను.. తమ్ముడు వచ్చాడన్న ఆనందంలో మర్చిపోయుంటావ్.’’ ‘‘అంత లేదులెండి.’’ అంటూ కూరలో కాస్త ఉప్పు కలిపి, మళ్లీ వడ్డించింది రేఖ. ‘‘అబ్బబ్బ... ఇప్పుడు ఉప్పు ఎక్కువైందోయ్’’.. అరిచాడు ఆనంద్. ‘‘అబ్బబ్బ... తక్కువైతే తక్కువైందంటారు. ఎక్కువైతే ఎక్కువైందని అరుస్తారు. ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా?’’ ‘‘రోజూ అవుతూనే ఉన్నాంలే.’’ ‘‘ఇదిగో ఇదిరా మీ బావగారి వరస. పేరు ఆనందే కానీ, దుర్వాసుడి టైపు.’’ ‘‘నేను దుర్వాసుడి టైపయితే నీ పని బానే ఉండేది’’ అన్నాడు ఆనంద్. ‘‘బావుందనేగా చెప్తున్నా’’ అంది కొంటెగా రేఖ. అక్కాబావల గొడవ ముచ్చటగా అనిపించింది సంతోష్‌కి. అదే విషయం చెప్పాడు అక్కతో భోజనాల తర్వాత. ‘‘కూరలో ఉప్పు లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో సంసారంలో చిన్న చిన్న గొడవలు లేకపోయినా అలాగే ఉంటుందిరా’’ అంది రేఖ. ‘‘చిన్న చిన్నవైతే పర్లేదక్కా. మావి పెద్ద పెద్ద గొడవలు. అంటే మా కూరలో ఉప్పు ఎక్కువైందన్నమాట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ఫీలవకురా. ఆ ఉప్పు బ్యాలెన్స చేయడానికి ఓ చిట్కా చెప్పనా?’’ అంది. ‘‘నీ దగ్గరకు వచ్చిందే అందుక్కదా.’’ ‘‘సరే... ఈసారి మీ ఆవిడ అరిచేటప్పుడు కొంచె నీళ్లు తాగు.’’ ‘‘కోపం వచ్చినవాళ్లు కదా వాటర్ తాగాలి?’’ సందేహం వ్యక్తం చేశాడు. ‘‘నేను చెప్పింది చెయ్యరా. కొంచెం వాటర్ తాగి, మీ ఆవిడ అరుపులు తగ్గేంత వరకూ నోట్లో అలాగే ఉంచుకో. అలా రెండు వారాలు చేసి చూడు.’’ ‘‘ఓకే. ఐ విల్ ట్రై’’ అనేసి సెలవు తీసుకున్నాడు సంతోష్. రెండు వారాల తర్వాత ఫోన్ చేశాడు సంతోష్. ‘‘నువ్వు చెప్పిన చిట్కా బాగా పని చేసిందక్కా. ఇప్పుడు తను అరవడం లేదు’’ అన్నాడు సంతోషంగా. ‘‘వెరీగుడ్... ఇక హ్యాపీగా ఉండు’’ అంది రేఖ తృప్తిగా. ‘‘అలాగే అక్కా. కానీ నాదో డౌట్. జస్ట్ గుక్కెడు నీళ్లు నా సమస్యని ఎలా పరిష్కరించాయంటావ్?’’ నవ్వింది రేఖ.‘‘నీ సమస్యను పరిష్కరించింది నీళ్లు కాదురా... నువ్వే.’’ ‘‘నేనా? అర్థం కాలేదు’’ అన్నాడు అయోమయంగా. ‘‘నోట్లో నీళ్లు ఉంటే నువ్వు మాట్లాడ లేవు కదా! అందుకే నీ భార్య అరిచే టప్పుడు నువ్వు ఎదురు మాట్లాడి ఉండవు. ఎప్పుడైనా రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఇద్దరి మధ్య మాటా మాటా సమానంగా పెరిగితేనే సమస్యలు. ఒకరికి కోపం వచ్చినప్పుడు రెండోవాళ్లు మౌనంగా ఉంటే కొట్లాట అన్నదే రాదు.’’ ‘‘వామ్మో... ఎన్ని తెలివి తేటలక్కా నీకు’’ అన్నాడు అక్క తెలివికి మురిసిపోతూ. ‘‘ఏడ్చావ్‌లే. జాగ్రత్తగా ఉండు’’... నవ్వి ఫోన్ పెట్టేసింది రేఖ. - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్ -
మొహంపై సలసల కాగిన నూనె పోశాడు..
మీరట్: మద్యం మానివేయమని భార్య చెప్పిన మాటలు ఆ భర్తకు ఆగ్రహం తెప్పించింది. దాంతో తన ఇద్దరి స్నేహితులతో కలసి భర్త విజయ్‌పాల్ భార్య సంతోష్ మొహంపై సలసల కాగిన నూనె పోశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ మీరట్ ఉత్తమ్‌నగర్‌లోని గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విజయ్ పాల్ ఇంటికి చేరుకుని... సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తమ్‌నగర్‌లో నివసిస్తున్న విజయ్‌పాల్, సంతోష్ భార్యభర్తలు. విజయ్‌పాల్ తాగుడు అలవాటు అయింది. ఆ క్రమంలో రోజు తప్ప తాగి ఇంటికి వస్తున్న భర్తపై ఆమె ఆగ్రహించింది. తాగుడు మానివేయాలని అతడిని కోరింది. ఎప్పటిలాగే గురువారం విజయ్‌పాల్ తప్పతాగి అతడి ఇద్దరు స్నేహితులు కృష్ణాపాల్, అశోక్‌తో ఇంటి వచ్చాడు. దీంతో సంతోష్‌తోపాటు అతడి స్నేహితులతో ఆమె వాగ్వివాదానికి దిగింది. దాంతో ఆగ్రహించిన విజయ్ పాల్ అతడి స్నేహితుల కలసి సంతోష్ ముఖంపై వేడివేడి నూనె పోశాడు. అయితే ఈ ఘటనలో భర్త విజయ్‌పాల్, కృష్ణాపాల్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
యూపీలో మరో దారుణం
పాత్రికేయుడి తల్లికి నిప్పంటించిన పోలీసులు బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం! జితేంద్రసింగ్ అనే పాత్రికేయుడిని పోలీసులు సజీవదహనం చేసిన ఉదంతం మరువకముందే అలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను విడిపించుకునేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఓ పాత్రికే యుడి తల్లికి పోలీసులు నిప్పంటించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. బారాబంకీ జిల్లా కోథీ పోలీసు స్టేషన్ పోలీసులు స్థానిక హిందీ దినపత్రిక జర్నలిస్టు సంతోష్ తండ్రి అయిన రామ్ నారాయణ్‌ను ఈవ్‌టీజింగ్ కేసులో విచారించాలంటూ శనివారం తీసుకె ళ్లారు. భర్తను విడిపించుకునేందుకు స్టేషన్‌కు వచ్చిన నీతూను పోలీసులు రూ. లక్ష డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమెను అవమానించి, దుర్భాషలాడి గెంటేశారు. తర్వాత పెట్రోల్ చల్లి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన బాధితురాలు లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసు స్టేషన్ ఇన్చార్జి రామ్ సాహెబ్ సింగ్ యాదవ్, ఎస్ఐ అఖిలేశ్ రాయ్‌లే తన కు నిప్పంటించారని బాధితురాలు మేజిస్ట్రేట్, మీడియా ముందు వాంగ్మూలం ఇచ్చింది. ‘అందరూ చోద్యం చూస్తున్నారు. నాకెవరూ సాయం చేయలేదు. నాపై పెట్రోల్ చల్లి, అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారు’ అని చెప్పింది. అయితే, బాధితురాలే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. తన తల్లికి పోలీసులే నిప్పంటించారని సంతోష్ చెప్పారు. పోలీసులపై మోపిన అభియోగాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తన తండ్రిని అక్రమంగా 24 గంటలు నిర్బంధంలో ఉంచుకున్నారన్న కారణంతోనే ఇద్దరు పోలీసు అధికారులనూ సస్పెండ్ చేశారన్నారు. వారిపై హత్య కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఈ ఉదంతంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించామని సీఎం అఖిలేశ్ వెల్లడించారు. -
ఉన్మాదం
ప్రేమించమంటూ యువతికి వేధింపులు శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని కెలమంగలం : తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేధించడమే కాక తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని యువతిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... ఇంజినీరింగ్ చదివిన ధర్మపురి జిల్లా పాలక్కొడుకు చెందిన ఓ యువతి(24)కి ఎనిమిది నెలల క్రితం జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికింది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఆమెను ప్రేమించాలని నాడసంబట్టి గ్రామానికి చెందిన రామలింగం కొడుకు సంతోష్(24) వెంటపడేవాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఆ యువతి తెలిపింది. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఆమె అతని ప్రేమను తిరస్కరించింది. బుధవారం ఉదయం తన గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన యువతిని సంతోష్ వెంబడించాడు. కెలమంగలం బస్టాండులో బస్సు దిగగానే ఆమె వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించాలని పట్టుపట్టాడు. ఆ సమయంలో అతని చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులతోనూ అతను వాదనకు దిగాడు. అనంతరం తన కార్యాలయానికి వెళుతున్న యువతిని వెంబడిస్తూ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేశాడు. యువతిని అడ్డగించి తను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్‌ను తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం తనను చుట్టుముట్టిన మంటలతో యువతిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రభుతాస్పత్రికి బాధితులను తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంతోష్‌ను హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కెలమంగలం ఇన్స్పెక్టర్ జయశంకర్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. -
నిరుద్యోగుల ప్రేమ కథ
చదువుకుని పని పాటా లేక ఊరు చుట్టూ తిరిగే కుర్రాళ్లు ఇంటికొక్కరైనా ఉంటారు. అలాంటివాళ్ల ప్రేమ పాట్లే అడంగాద పసంగ చిత్రం అంటున్నారు చిత్ర దర్శక, నిర్మాత సెల్వనాథన్. ఈయన కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవ నటులు గౌతమ్, పావేందర్, సురేష్‌బాబు, సంతోష్, కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. సత్యశ్రీ నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అదిప్ విలన్‌గాను, వర్ష సింధు, నగీనా, లక్ష్మి, కనక ప్రియ, పైల్వాన్ రంగనాథన్, సెల్వనాథన్, మాస్టర్ అరుణ్, మాస్టర్ ఆల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ తరం యువత జీవన విధానాన్ని ఆవిష్కరించే ఇతివృత్తంగా అడంగాద ససంగ చిత్రం ఉంటుందన్నారు. ప్రేమ కారణంగా కలిగే అవమానాలు, సమస్యలను కాస్త వినోదాన్ని జోడించి చూపించామన్నారు. అంతేకాకుండా ప్రేమ మాత్రమే కాకుండా యువకుల్లో మంచి మానవత్వం, ఇతరులకు సాయపడే మనస్థ్వత్వం కూడా ఉంటాయని చెప్పే చిత్రంగా ఈ అడంగాద పసంగ చిత్రం ఉంటుందన్నారు. అదే విధంగా చిత్రంలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు, ద్వంద్వార్థ సంభాషణలు, పొగపీల్చడం, మద్యం సేవించడం లాంటి సన్నివేశాలుండవని దర్శక, నిర్మాత వెల్లడించారు. తిరుపత్తూర్, తిరువణ్ణామలై, జోలార్‌పేట, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆల్రిన్ - మనీష్ ద్వయం సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని సెన్సార్ బోర్డు సభ్యుడు, నటుడు ఎస్ వి శేఖర్‌కు అందించారు. -
కట్టుకున్నోడే.. కడతేర్చాడు..
తాళి కట్టిన చేతులతోనే ఊపిరి తీసిన భర్త కరెంట్‌షాక్‌తో చనిపోరుుందని నమ్మించబోరుున నిందితుడు పెళ్లయిన తొమ్మిది నెలలకే దారుణం కేసముద్రం : కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యూడు. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసి, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త తాళికట్టిన చేతులతోనే గొంతు నులిమి భార్యను కడతేర్చాడు. ఈ ఘటన మండలంలోని కల్వల గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై రంజిత్‌రావు తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన చిదిరాల సంతోష్‌కు మానుకోట మండలం నడివాడకు చెందిన అతడి సొంత అక్క విజయ కూతురు మౌనిక(18)తో 9 నెలల క్రితం వివాహమైంది. సంతోష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అతడు పెళ్లరుున నెలకే హైదరాబాద్‌కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయూడు. దీంతో మౌనిక అప్పట్లోనే పుట్టింటికి వచ్చింది. కూతురి పరిస్థితి చూడలేక ఆమె తండ్రి నాగన్న మనోవేదనకు గురయ్యూడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. బావ మరణవార్త తెలుసుకున్న సంతోష్ నడివాడ కు చేరుకున్నాడు. అక్కడ బంధువులంతా అతడిని మందలించడంతో తాను ఇక నుంచి మౌనికను మంచిగానే చూసుకుంటానని చెప్పాడు. పెద్దమనుషులు సంతోష్ పేరిట ఉన్న ఆస్తిని మౌనిక పేరున రాసివ్వాలని నిబంధన పెట్టడంతో సరేనని తనకున్న ఆస్తిని రాసిచ్చాడు. ఆ తర్వాత భార్యను కల్వల గ్రామానికి తీసుకెళ్లిన సంతోష్ అయిష్టంతోనే సంసార జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘నాతో సరిగ్గా ఉండడం లేదు.. నువ్వు మళ్లీ మరో మహిళతో సంబంధాన్ని సాగిస్తున్నావా’ అని మౌనిక ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన సంతోష్ ఆమె గొంతు నులుముతూ గోడకు నెట్టాడు. గొంతును గట్టిగా నులిమి హతమార్చాడు. తనపై కేసవుతుందనే భయంతో కరెంటు షాక్‌తో చనిపోయినట్లుగా ట్యూబ్‌లైట్ పగులగొట్టి, తర్వాత విద్యుత్ తీగలు వేలాడదీసి ప్రమాదంగా చిత్రించాడు. తర్వాత బయటికి వచ్చి అతడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారంతా ఆమెను మానుకోటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే మృతిచెందిన విషయం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం మృతురాలి తల్లి, సోదరుడు మునీందర్తోపాటు బంధువులు చేరుకుని సంతోష్‌ను నిలదీయగా పారిపోయూడు. ఎస్సై రంజిత్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భార్యను గొంతు పిసికి హత్యచేసిన సంతోష్‌ను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన అనసూర్య డిమాండ్ చేశారు. -
రైలు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
బషీరాబాద్: రైల్లోంచి పడి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రెల్వే పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సేడం ప్రాంతానికి చెందిన సంతోష్ రైలులో వెళ్తుండగా బషీరాబాద్ మండల కేంద్రంలోని నవాంద్గి రైల్వే స్టేషన్ సమీపంలో కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన రెండు చేతులు విరిగిపోయాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆయనను తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరో సంఘటనలో.. వికారాబాద్ మండల పరిధిలోని కొత్తగడి గ్రామానికి చెందిన అనిల్(18) కుటుంబ సభ్యులతో కలిసి తాండూరుకు రైలులో వస్తున్నాడు. డోర్ పక్కన నిలబడ్డ అనిల్ రుక్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు రైలులోనుంచి కిందపడ్డాడు. కుటుంబీకులు గమనించి చైన్ లాగి రైలును నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను 108లో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులిద్దరిని హైదరాబాద్‌కు రిఫర్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. -
గోపాల్‌పేటలో దొంగల హల్చల్
నాగిరెడ్డిపేట : మండలంలోని గోపాల్‌పేటలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు ఎనిమిది ఇళ్ల తాళాలు పగులగొట్టి కలకలం సృష్టించారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్‌పేటలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కంచరి భూపాల్‌తో పాటు మండలంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ గోపాల్‌పేటలో అద్దెకుంటున్న సంతోష్, రమేష్, శ్రీహరి ఇళ్ల తాళాలను దొంగలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరితో పాటు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న పరమల్ల రాములు, ఇదే గ్రామంలో అద్దెకుంటున్న ట్రాన్స్‌కో సబ్‌ఇంజినీర్ సత్యనారాయణగౌడ్, చాకలి రాజు ఇంటి తాళాలను పగులగొట్టి చోరీకి దిగారు. నాగిరెడ్డిపేటలోని జయంత్‌రెడ్డి ఇంటి తాళాలను సైతం ధ్వంసం చేసి ఇంట్లోని ఇత్తడి సామాగ్రిని ఎత్తుకెళ్లారు. గోపాల్‌పేటలో జరిగిన చోరీలో సంతోష్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు, రమేష్ ఇంట్లో రూ.2వేల నగదు, రాములుకు చెందిన 4 తులాల వెండి, అరతులం బంగారంతో పాటు రూ.వెయ్యి నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. దీంతో పాటు సంతోష్ ఇంట్లో నుంచి ఎల్ఈడీ టీవీనీ అపహరించేందుకు ప్రయత్నించి కుదరకపోయే సరికి పక్కనే ఉన్న కుర్చీలో పెట్టి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఏఎస్సై కిష్టయ్య తెలిపారు. రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ.. మండలంలోని గోపాల్‌పేటలో శనివారం పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గోలిలింగాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ గోపాల్‌పేటలో అద్దెకుంటున్న సంతోష్ తన ఇంటికి శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో తాళంవేసి రామాయంపేటలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు మధ్యాహ్నం సమయంలోనే ఇంటి తాళాలు పగులగొట్టి పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన పక్కింటివారు మరో తాళం వేశారు. విషయం తెలుసుకున్న సంతోష్ శనివారం మధ్యాహ్నమే తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తిం చారు. దీంతోపాటు సమీపంలోనే ఉన్న ట్రాన్స్ కో సబ్‌ఇంజినీర్ సత్యనారాయణగౌడ్ గది తాళాలను సైతం శనివారం మధ్యాహ్నమే పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించి వస్తువులను చిందరవందరగా చేసి వెళ్లిపోయారు. విధుల నుంచి తిరిగి వచ్చిన సత్యనారాయణ తన గది తాళాలు పగులగొట్టి ఉండడాన్ని చూసి నివ్వెరపోయారు. ఇంట్లోకి వెళ్లి చూడగా విలువైన వస్తువు లు అపహరణకు గురవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా రు. కాగా పట్టపగలే మండలకేంద్రంలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు కలవరపడుతున్నారు. -
మఫ్టీ తెచ్చిన తంటా
ముంబై పోలీసుల అదుపులో కర్ణాటక పోలీసులు ఉన్నతాధికారి జోక్యంతో కథ సుఖాంతం బెంగళూరు : నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి మఫ్టీలో ముంబై వెళ్లిన కర్ణాటక పోలీసులను.. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ముంబైకు చెందిన డాక్టర్ సంతోష్ రై తనకు ధార్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినిమా నటీనటులతో పాటు దేశంలోని వివిధ వైద్య విద్యా కళాశాల డెరైక్టర్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. అందరినీ నమ్మించడానికి వీలుగా అప్పుడప్పుడు యాగాలు, రాజకీయ నాయకులతో కలిసి ధర్నాలు చేయడంతో పాటు చిన్న చిన్న సినిమా, టీవీ సీరియల్స్ ప్రారంభోత్సవాలు, పాటల విడుదల కార్యక్రమాల్లో పాల్గొని హడావుడి చేసేవారు. అంతేకాకుండా హెల్త్ అండ్ హెల్త్ సొసైటీ ఆఫ్ ఇండియా, బ్రహ్మశ్రీ హెల్త్ కేర్ అండ్ రీసర్చ్ తదితర సంస్థలకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిగా తనను తాను పేర్కొనేవాడు. ఈ మేరకు వెబ్సైట్లను సృష్టించి సోషియల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే వాడు. ఇతని మాయలో పడిన అనేక మంది ఉత్తర భారత దేశానికి చెందిన విద్యార్థులు లక్షలాది రూపాయాలను మెడికల్ సీట్ల కోసం పోగొట్టుకున్నారు. ఈ విషయమై ముంబైతో పాటు ఢిల్లీ, హర్యానా తదితర నగరాల్లో ఇతనిపై ఇప్పటికే అనేక చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఈ విద్యా ఏడాది ప్రారంభంలో తన మకాంను బెంగళూరుకు మార్చి కర్ణాటకలోని కిమ్స్, అంబేద్కర్ మెడికల్ కళాశాల, బెంగళూరు మెడికల్ కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెబుతూ 12 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ.1.20 కోట్లను వసూలు చేసి ముంబైకు వెళ్లిపోయాడు. ఈ విషయమై నగరంలోని తిలక్ నగర్‌తో పాటు మరో రెండు మూడు పోలీస్స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. సంతోష్రై వాడుతున్న సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి అతను ముంబైలో ఉన్నట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఆదివారం నలుగురు పోలీసులు ముంబైకు వెళ్లారు. యూనిఫాంతో వెళితే తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉందని భావించి వారు మఫ్టీలో సంతోష్ రై ప్రాంతాన్ని చేరుకుని అతని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వీరు పోలీసు వాహనాన్ని కాక కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా కారును తమతో తీసుకువెళ్లారు. సంతోష్రైను అదుపులోకి తీసుకొన్న తర్వాత అతని మొబైల్ నుంచి అవుట్గోయింగ్ కాల్స్‌ను కట్ చేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత తన కుటుంబ సభ్యులకు విషయం చెబుతానని లేదంటే భయపడుతారని సంతోష్ రై విజ్ఞప్తి చేశాడు. మానవీయతా దృష్టితో పోలీసులు అతనికి అవకాశం కల్పించగానే ‘నలుగురు దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో నన్ను బెంగళూరుకు తీసుకువెళుతున్నారు. పోలీసులకు తెలియజేసి నన్ను రక్షించండి’ అని మరాఠిలో తెలిపారు. వెళ్లిన పోలీసులెవరికీ మరాఠి రాకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. వెంటనే సదరు కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో ముంబైకు ఐదు కిలోమీటర్ల దూరంలో వాహనాన్ని ఆపి నలుగురు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎంత చెప్పినా మహారాష్ట్ర పోలీసులు వినిపించుకోలేదు. ఐడీ కార్డులు చూపించినా అవి నకిలీవని కొట్టిపారేసి అందరినీ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. తర్వాత చాలా బతిమాలితే మఫ్టిలోవెళ్లిన పోలీసులకు కర్ణాటక ఉన్నతాధికారులతో మాట్లాడటానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హేమంత్ నిబాల్కర్ విషయం తెలుసుకుని మరాఠిలో ముంబై పోలీసులతో మాట్లాడి అవసరమైన రుజువులు చూపించి పరిస్థితిని కొలిక్కితెచ్చారు. దీంతో ఆ పోలీసులు నిందితుడు సంతోష్ రైతో పాటు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నగర ఆగ్నేయ విభాగం డీసీపీ రోహిణికటోచ్ ధ్రువీకరించారు. సంతోష్ రై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి. -
స్త్రీ గొప్పతనం తెలిపే కథ
నేటి సమాజంలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ప్రేమ, త్యాగం, ధైర్యం, సహనం, సాహసం ఇవన్నీ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘లాక్’. సంతోష్, సారిక జంటగా నటిస్తున్నారు. పార్గవన్ దర్శకత్వంలో కె.లక్ష్మణమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తమిళ నిర్మాత శ్రీమతి సెల్వి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ క్లాప్ ఇచ్చారు. వినోదంతో కూడిన చక్కని లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదని నిర్మాత అన్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, వైజాగ్, అరకు, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను విడుదల చేస్తామనీ దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: రాజ్దొరై, మాటలు: కేశవ్ పప్పుల, సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: శ్రవణ్‌కుమార్. -
‘సర్పంచ్ గ్రామ బహిష్కరణ’పై విచారణ
జక్రాన్‌పల్లి : చింతలూర్ సర్పంచ్ శోభతోపాటు ఆమె భర్త సంతోష్‌లను గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) సభ్యులు గ్రామ బహిష్కరణ చేశారన్న ఆరోపణలపై మంగళవారం నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ గ్రామంలో విచారణ జరిపారు. సర్పంచ్ శోభ, ఆమె భర్త సంతోష్‌లకు లక్ష రూపాయల జరిమానా విధించారని సాయమ్మ అనే మహిళ తెలిపింది. సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు మైక్ ద్వారా దండోరా వేయిం చారని పేర్కొంది. సర్పంచ్‌కు దుకాణాల్లో ఎలాంటి వస్తువులు ఇవ్వరాదని, సర్పంచ్‌కు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తెచ్చుకోరాదని హెచ్చరించారని పోశన్న అనే వ్యక్తి తెలిపారు. వీడీసీ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటునుంచే నీళ్లు తెచ్చుకోవాల ని, కలిగోట్‌లో ఉన్న సర్పంచ్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకోకూడదని మాత్రమే మైక్‌లో చెప్పించామన్నా రు. ఇసుక విషయంలో సర్పంచ్ భర్త సంతోష్ అధికారులకు ఫిర్యాదు చేశారని పెద్దోళ్ల గంగారాం తెలిపారు. గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాడన్న కారణంతో అతడికి లక్ష రూపాయల జరిమానా విధించామని పేర్కొన్నారు. కానీ సంతోష్ ఆ జరిమానా చెల్లించలేదన్నారు. అదే సమయంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు పెద్దగా నినాదాలు చేశారు. గ్రామ బహిష్కరణ విధిం చిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ వారిని సముదాయించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్య ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించరాదని వీడీసీ సభ్యులకు సూచించారు. డీఎస్పీ వెంట డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సాయినాథ్ ఉన్నారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి చింతలూర్ సర్పంచ్‌ను గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఏఐకేఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన చింతలూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గ్రామ సర్పంచ్‌ను బహిష్కరించడం ఆటవిక చర్యన్నారు. వీడీసీ పేరుతో దళితులపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వీడీసీ సభ్యులను వెంటనే అరెస్టు చేయకపోతే గురువారం ఆర్మూర్‌లో నిర్వహించే సీఎం సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాం, దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షుడు సంకెపల్లి బుచ్చన్న, వాడి ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ తదితరలు పాల్గొన్నారు. -
ఎడ్లబండికి బ్రేకులొచ్చాయి !
ప్రయోగం బైకు మోడల్లో సంతోష్ ఎద్దుల బండికి బ్రేకు కనిపెట్టాడు. బండి తోలే వ్యక్తి కూర్చునే దగ్గరే ఆ బ్రేకు ఉంటుంది. ఇది ఎద్దుకు, మనిషికి సులువుగా ఆపడానికే కాకుండా కాస్త ఏటవాలుగా ఉన్నచోట కూడా బండిని వెనక్కు రాకుండా ఆపుచేయడానికీ తోడ్పడుతుంది. వైఫల్యాలు ఉన్నాయంటే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థం. ఏదో ఒక ప్రయత్నం చేసేవారు ఆశాజీవులు. పని చేసి సాధించేవారు సమర్థులు. అందరికోసం కష్టపడి, తనతో పాటు అందరికీ పని సులువు చేసేవారు మార్గదర్శి. అవసరమే అన్నింటినీ నేర్పిస్తుందంటారు. ఆ మాటను నిజం చేసిన కుర్రాడు సంతోష్. ఊళ్లలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సైకిలు తొక్కాం, బైకుల్లో తిరిగాం.... కార్లు కూడా తెచ్చుకున్నాం. కానీ ఇంతకాలం... ‘అరె వీటన్నింటికీ ఉన్న బ్రేకులు అదే చక్రాల మీద నడిచే ఎద్దుల బండికి ఎందుకు లేవు’ అని ఎవరైనా ఆలోచించారా? లేదు... కానీ కర్ణాటకలోని బెల్గాంకు చెందిన సంతోష్ ఆలోచించాడు. ఉత్తినే ఆలోచించి కూర్చోలేదు, ఆలోచనకు రూపం తెచ్చి సక్సెస్ అయ్యాడు. ఇపుడు ఎద్దుల బండికీ బ్రేకులొచ్చాయి. చిత్రమేంటంటే సంతోష్ శాస్త్రవేత్త కాదు, ఓ చిన్న కుర్రాడు. అతి సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడు. ప్రతి పల్లెలో చిరు రైతు కుటుంబంలో పిల్లలకు చదువుతో పాటు పనిచేయడం తప్పదు. పైగా ఇష్టమైన కోర్సులు చదువుకునే అవకాశం కూడా ఉండదు. అంతెందుకు బస్సుకు టిక్కెట్లు లేక నడుచుకుంటూ వెళ్లి చదవుకునే వాళ్లింకా అక్కడక్కడా ఉన్నారు. సంతోష్ కూడా దాదాపు అలాంటి పరిస్థితిలో ఉన్న వాడే. ఉంటే బడిలో, లేకుంటే పొలంలో. రెండింటిపైన ఆసక్తి ఉంది. అందుకే దేనికీ తప్పేవాడు కాదు. కానీ, ఊరికే పొట్టకూటి కోసం మాత్రమే సంతోష్ పనిచేయకుండా కాస్త సునిశితంగా ఆలోచిస్తూ వచ్చాడు. వ్యవసాయ కుటుంబాల్లో చిన్న రైతులు పడే ఇబ్బందులు చూస్తూ పెరిగాడు. వాటికి ఒక్కోదానికి అతను పరిష్కారాలు కనుక్కుంటూ వచ్చాడు. ఎద్దుల బండిని ఆపాలంటే బండిని లాగే ఎద్దుల ముక్కులకు కట్టిన తాడును గట్టిగా లాగితే అవి నొప్పి కలిగి ఆగిపోతాయి. ఇది తోలే రైతుకు, లాగే ఎద్దుకు ఇద్దరికీ కష్టమే. బైకు మోడల్లో సంతోష్ దీనికి బ్రేకు కనిపెట్టాడు. బండి తోలే వ్యక్తి కూర్చునే దగ్గరే ఆ బ్రేకు ఉంటుంది. ఇది ఎద్దుకు, మనిషికి సులువుగా ఆపడానికే కాకుండా కాస్త ఏటవాలుగా ఉన్నచోట కూడా బండిని వెనక్కు రాకుండా ఆపుచేయడానికీ తోడ్పడుతుంది. అలాగే సరుకు నింపుతున్నపుడు, మిట్టలు ఎక్కుతున్నపుడు రకరకాలుగా ఉపయోగపడుతుంది. సంతోష్ మరో ఇన్వెన్షన్ క్యారెట్ క్లీనింగ్ మెషీన్. క్యారెట్ నేలలో పండే దుంప. దానికి మట్టి ఉంటుంది. అది క్లీన్ చేసే అమ్మాలి. క్వింటాలు క్యారెట్ శుభ్రం చేయాలంటే పన్నెండు మందికి గంట పడుతుంది. సంతోష్ కనిపెట్టిన యంత్రం వల్ల ఆ పనిని పది నిమిషాల్లో ఇద్దరు చేసేయొచ్చు. దీనికి కరెంటు అవసరం లేదు. ఖరీదు కూడా తక్కువే. దీనిని ఇప్పటికే బెల్గాం చుట్టుపక్కల రైతులు పెద్ద సంఖ్యలో కొన్నారు. వీటితో పాటు గ్యాసును వృథా చేయకుండా నీళ్లు వేడిచేసే విధానం కనిపెట్టాడు సంతోష్. అంటే గ్యాసు స్టౌతో వంట చేసుకుంటూనే అదే వేడిని నీటిని కాచడానికి కూడా వాడేస్తున్నాడు. దీనిని బెల్గాం హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఒకప్పుడు సంతోష్ అంటే ఎవరికీ తెలియదు, ఇపుడు బెల్గాం పరిసరాల్లో సంతోష్ అంటే తెలియని వారే లేరు. అతను నమ్మేది ఒకటే విషయం... సమస్య ఎప్పుడూ మనలోని శక్తిసామర్థ్యాలను వెలికితీయడానికే వస్తుంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటానంటాడు సంతోష్. ఇబ్బందులను మెట్లుగా మలచుకునే సంతోష్‌ను..భేష్ అని మెచ్చుకోవాల్సిందే. -
అందంగా లేదని భార్యను చంపిన భర్త
కట్టుకున్నవాడే కాలయముడై కడతేర్చాడు. భార్య అందంగా లేదంటూ చిత్రహింసలకు గురిచేశాడు. పెళ్లయిన ఏడాదికే చున్నీతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. ఈ సంఘటన కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు.. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోటపల్లి : మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా పరిధి రంగయ్యపల్లికి చెందిన ఏదండ్ల ఈశ్వ రి, స్వామి దంపతుల కుమార్తె లలిత(23) వివాహం రొయ్యలపల్లికి చెందిన సల్పాల సంతోష్‌తో గతేడాది మే 13న జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రూ.3 లక్షలు, ఇతర లాంఛనాలను లలిత తల్లిదండ్రులు సంతోష్‌కు అందజేశారు. ఐదు నెలల పాటు సంతోష్, లలితల కాపురం సాఫీగా సాగింది. అనంతరం అందంగా లేవంటూ సంతోష్ నిత్యం భార్యను వేధించేవాడు. శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ విషయాన్ని లలిత తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు సంతోష్‌ను మందలించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఆగ్రహించిన సంతోష్ చున్నీతో లలిత గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. గురువారం వేకువజామున విషయం ఇరుగుపొరుగువారికి తెలియడంతో అతడు పారి పోయాడు. సీఐ చంద్రబాను, ఎసై కిరణ్‌కుమార్, తహశీల్దార్ మధునయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పెళ్లయిన ఏడాదికే లలిత హత్యకు గురవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నం టాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ప్రాబబుల్స్‌లో రాహుల్, సంతోషి
కామన్వెల్త్, ఆసియా క్రీడలకు వెయిట్‌లిఫ్టింగ్ జట్లు న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న మూడు మెగా ఈవెంట్ల కోసం భారత సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట రాహుల్, మత్స్య సంతోషి ఎంపికయ్యారు. వీరితో పాటు మరో తెలుగుతేజం కోరాడ రమణకు కూడా చోటు దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ (గ్లాస్గో), ఆసియా గేమ్స్ (ఇంచియాన్), ప్రపంచ చాంపియన్‌షిప్‌ల కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య బుధవారం 26 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. పురుషుల 56 కేజీ కేటగిరీలో రమణ, 77 కేజీ విభాగంలో వెంకట రాహుల్ చోటు దక్కించుకోగా, మహిళల 53 కేజీ కేటగిరీలో మత్స్య సంతోషి ఎంపికైంది. -
'ప్రేమించాలి' ప్రెస్ మీట్
-
యువతకు సందేశం
‘ప్రేమిస్తే’ లాంటి ప్రేమకథా చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి, ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై ఆయన అందిస్తున్న పదవచిత్రం ‘ప్రేమించాలి’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు వీధులపాలవుతున్న సంఘటనలను వింటున్నాం.. చూస్తున్నాం. అసలు పిల్లలు అలా వీధులపాలవడానికి కారణం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హృదయానికి హత్తుకునే ఈ ప్రేమకథకు సెన్సార్ బోర్డ్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమా అనీ ప్రేక్షకుల కంట తడిపెట్టించే సినిమా అని భాస్కరభట్ల తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని సురేష్‌తో కలిసి ‘పిజ్జా’ చిత్రాన్ని విడుదల చేసిన సమన్యరెడ్డి అన్నారు. -
ప్రేమించాలి మూవి స్టిల్స్
-
సురేష్ చేస్తున్న పదో ప్రయత్నం ‘ప్రేమించాలి!'
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని సురేష్ కొండేటి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్ తో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇందులో కొత్తవాళ్ళయిన సంతోష్, మనీషా జంటగా నటించగా, ఈ చిత్రానికి సమన్యరెడ్డి సహనిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కథా కథనాలు ప్రధాన బలం. . . ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు. -
ముఖ్యమంత్రి నివాసం ముట్టడి భగ్నం
= లాడ్‌ను బర్తరఫ్ చేయాల్సిందే.. : బీజేపీ = అంతవరకూ ఆందోళన = త్వరలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోనూ ఆందోళనలు = ముఖ్యమంత్రికి మతి మరుపు = వారి పార్టీ నేతల అవినీతిని మరిచిపోయారా? = లాడ్‌ను తొలగించకుంటే.. సీఎం కూడా ఇంటికే = సంతోష్‌ను రక్షించేందుకు డబ్బు తీసుకున్నారేమో? సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. తొలుత ఫ్రీడం పార్కు నుంచి బయలుదేరిన నాయకులను జేడీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు సాగడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ సహా పలువురు ఎమ్మెల్యేలు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకు ముందు ఫ్రీడం పార్కులో కార్యకర్తలనుద్దేశించి ప్రహ్లాద జోషి ప్రసంగిస్తూ, సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించేంత వరకు తమ పార్టీ ఆందోళనలు చేస్తూనే ఉంటుందని తెలిపారు. మున్ముందు తాలూకా, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మతి మరుపు వ్యాధితో బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి, బదిలీల్లో జరిగిన అవకతవకలను ఆయన మరిచి పోయినట్లున్నారని అన్నారు. కనుక ఆయన ‘మతి మరుపు భాగ్య యోజన’ను అమలు చేయాలని దెప్పి పొడిచారు. లాడ్‌ను తొలగించక పోతే, ముఖ్యమంత్రే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప మాట్లాడుతూ సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరలు లాడ్ వద్ద డబ్బులు తీసుకుని ఆయనను రక్షిస్తున్నారనే అనుమానాలు రాష్ర్ట ప్రజల్లో ఉన్నాయని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిజానికి ఎవర్ని ప్రేమించాలి?
అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించాలి. అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించాలి. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా అబ్బాయిలూ అమ్మాయిలూ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అప్పుడే వారి ప్రేమకు నిజమైన దీవెనలు లభిస్తాయి. ఇలాంటి సందేశంతో తమిళంలో రూపొందిన ప్రేమకథ ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట ఓ సంచలనం. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత సురేష్ కొండేటి. గతంలో ఆయన అందించిన ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ, నాన్న, పిజ్జా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వాటి వరుసలోనే ఈ సినిమా కూడా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు సురేష్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -‘‘మా సంస్థలో వచ్చిన ‘ప్రేమిస్తే’ చిత్రం నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో... అంతకు పదింతలు పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది. ‘ప్రేమిస్తే’ని మరిపించేలా దర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. వచ్చే వారంలో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
వలసజీవి దారుణ హత్య
జైనథ్, న్యూస్‌లైన్ : మహారాష్ట్రలోని యూవత్‌మాడ్ జిల్లా పూసద్‌లోని కాసోడ గ్రామానికి చెందిన రెవారే సంతోష్(45) నాలుగేళ్లుగా జైనథ్ మండలం కోరట గ్రామంలో వ్యవసాయకూలీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామం నుంచే నిత్యం వచ్చిపోయేవాడు. నాలుగు నెలల క్రి తం గ్రామానికి చెందిన రైతు గోస్కుల నర్సింగ్ చేన్లో పనికి కుదిరాడు. రైతుకు చెందిన రేకుల కొట్టంలోనే భార్య సునందాబాయి, కొడుకు నగేశ్ కలిసి ఉంటున్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. దీంతో సంతోష్ నిత్యం తాగి వచ్చేవాడు. ఈ క్రమం లో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సంతోష్ కనిపిం చలేదు. మంగళవారం ఉదయం సునందాబా రుు కొడుకును తీసుకుని ఎటో వెళ్లిపోరుుంది. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గది తెరిచి చూడగా దుప్పట్లో చుట్టి, మీద తడకలు వేసి బట్టలు ఆరేసి ఉన్న మూట కనిపించింది. విప్పి చూడగా సంతోష్ మృతదేహం ఉంది. తలపై బలమైన గాయూలు కావడంతో రక్తస్రావం జరిగి చనిపోరుునట్లు సంఘటన స్థలాన్ని సందర్శించిన బోథ్ సీఐ రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఇది పథకంప్రకారం చేసిన హత్యలా ఉందని తెలిపారు. సునందాబారుు ఇల్లు విడిచి వెళ్లడం ఇందుకు బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, సంతోష్ నిద్రించి ఉన్న సమయంలో అతడి తలపై కొట్టి చంపి, ఆపై మృతదేహాన్ని దాచి సునందాబారుు వెళ్లిపోరుునట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. కాఫీస్ సినిమా సమన్యరెడ్డి సహనిర్మాత. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించారు. ఈ చిత్రానికి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సురేష్, సమన్యరెడ్డి మాట్లాడుతూ -‘‘తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కథా కథనాలు ప్రధాన బలం. సుశీంద్రన్ దర్శకత్వ పనితీరు అద్భుతం. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.