ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి | Suresh Kondeti's new dubbing film titled 'Preminchali' | Sakshi
Sakshi News home page

ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి

Published Sat, Sep 28 2013 12:08 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి - Sakshi

ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి

‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై  తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. 
 
ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. కాఫీస్ సినిమా సమన్యరెడ్డి సహనిర్మాత. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించారు. ఈ చిత్రానికి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సురేష్, సమన్యరెడ్డి మాట్లాడుతూ -‘‘తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 
 
కథా కథనాలు ప్రధాన బలం. సుశీంద్రన్ దర్శకత్వ పనితీరు అద్భుతం. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement