Manisha Yadav
-
నాతో సన్నిహితంగా ఉండాలని చూశాడు.. అందుకే: హీరోయిన్
వివాదస్పద నటిగా ముద్ర వేసుకున్న నటి మనీషా యాదవ్. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అలా ఒరు కుప్పం కాదల్‌తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు శీను రామసామి దర్శకత్వంలో ఇదమ్ పొరుల్ యావళ్ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశాక.. ఊహించని విధంగా మూవీ నుంచి తొలగించారు. దీనికి ప్రధాన కారణం ఆమె సహకరించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేశారన్నది డైరెక్టర్ ఆరోపించారు. లైంగిక ఆరోపణలు.. అయితే 'ఇదం పొరుల్ యావల్' సినిమా సమయంలో నటి మనీషా యాదవ్‌పై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని దర్శకుడు శీను రామసామిపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె స్థానంలో నందితా శ్వేత ఈ చిత్రంలో నటించారు. అయితే ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అయితే ఇటీవలే ఆమె మరోసారి రామస్వామి చిత్రంలో నటించనుందంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మనీషా యాదవ్ స్పందించింది. అలాంటి వారితో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇటీవలే ఓ పాత్ర కోసం మనీషాను సంప్రదించారన్న ప్రశ్నకు కాస్తా ఘాటుగానే బదులిచ్చింది. మనీషా మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం శీను రామస్వామి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన కొత్త సినిమాలో నటిస్తావా అని అడిగారు. తాను ఆ చిత్రంలో నటించనని మొహం మీదే చెప్పేశా. కానీ'ఇదం పొరుల్ యేవల్' మూవీ సమయంలో అతను ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉంది. తప్పుడు ఉద్దేశ్యంతో చాలాసార్లు సన్నిహితంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ నేను అతని కోరికలను అంగీకరించలేదు. అందుకే నన్ను సినిమా నుంచి తప్పించాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు. నాకు నటించడం తెలియదని సినీ పరిశ్రమలో దుష్ప్రచారం చేశాడని' తెలిపింది తాను పెద్ద దర్శకులతోనే చాలా చిత్రాలు చేశానని.. అయితే ప్రతిభ ఉన్నా.. ఇలాంటి మానవత్వం లేని దర్శకుల చిత్రాలలో నటించాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. 'ఒరు కుప్ప కథై' ఆడియో లాంఛ్ కార్యక్రమంలో అందరిలాగే మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించింది. అంతే కానీ ఆయన సినిమాలో నటించడం జరగదన్నారు. తనకు మంచి భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని నటి మనీషా యాదవ్ పేర్కొంది. నాలాంటి కొత్త హీరోయిన్లకు ఇలాంటి చెడు అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాకూడదని అన్నారు. அனைவருக்கும் இனிய தீபாவளி வாழ்த்துக்கள்.. ✨🪔 pic.twitter.com/QleYnFArIm — Manisha Yadav (@ManishaYadavS) November 13, 2023 -
మొన్న త్రిష ఇష్యూ..హీరోయిన్ పై డైరెక్టర్ లైంగిక వేధింపులు
-
హిందీ టీవీ పరిశ్రమకు మరో షాక్.. జోధా అక్బర్ నటి హఠాన్మరణం
బిగ్‌బాస్ విన్నర్, బాలిక వధు సీరియల్ ఫేం సిద్ధార్థ్ శుక్లా గత నెలలో మరణించిన విషయం తెలిసిందే. దాని గురించి ఎవరూ మర్చిపోకముందే హిందీ టీవీ పరిశ్రమలో మరో యాక్టర్ మరణం సంభవించింది. జీ టీవీ షో ‘జోధా అక్బర్’లో సలీమా బేగం పాత్రను పోషించిన టెలివిజన్ నటి మనీషా యాదవ్ శుక్రవారం మరణించింది. ఆమె మరణానికి కారణం మెదడులో రక్తస్రావం జరగడం అని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఆమె కో యాక్ట్రెస్ పరిధి శర్మ తన బాధని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నటి మరణం గురించి ఓ ఇంటర్వూలో పరిధి మాట్లాడుతూ.. ‘జోధా అక్బర్ షో ముగిసిన తర్వాత ఆమెతో అంతగా టచ్‌లో లేను. షోలో బేగమ్‌గా నటించిన అందరం కలిసి మొఘల్స్ అనే పేరు ఉన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందులో షేర్ చేసుకుంటాం. శనివారం మనీషా మరణం గురించి గ్రూప్‌లో చూసి షాక్ గురయ్యాను’ అని తెలిపింది. మనీషాకి ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడని, ఆ బాబు పరిస్థితి గురించి ఆలోచిస్తేనే ఎంతో ఆందోళనగా ఉందని బాధని వ్యక్తం చేసింది. మనీషా ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన పరిధి ‘ఈ వార్త చాలా హృదయ విదారకంగా ఉంది. నీ ఆత్మకు శాంతి కలగాలి మనీషా’ అని రాసుకొచ్చింది. చదవండి: సిద్ధార్ధ్‌కు నివాళి తెలుపనంటున్న షెహనాజ్ సోదరుడు -
మనీషాకు మరో చాన్స్..!
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్. ఆయన నటుడు ధనుష్‌తో కలిసి నిర్మించిన విచారణై, కాక్కాముట్టై వంటి చిత్రాలు సామాజిక సమస్యలపై తెరకెక్కి మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. తాజాగా యువ దర్శకుడు రామ్‌నాథ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు వెట్రిమారన్. రామ్‌నాథ్ ఇంతకు ముందు జీవా, నయనతార జంటగా నటించిన తిరునాళ్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజాగా ఇన్వెస్టిగేటివ్ కథాంశాన్ని తీసుకుని వెట్రిమారన్ గ్రాస్‌రూట్ సంస్థలో చిత్రం చేయనున్నారు. ఇందులో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించనుంది. మోడ్రన్ పాత్రలకైనా, గ్రామీణ యువతిగానైనా నటించి మెప్పించగల నటి మనీషాయాదవ్. తొలి చిత్రం వళక్కు ఎన్ 18/9 చిత్రంతోనే తనదైన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, త్రిషా ఇల్లన్నా నయనతార వంటి చిత్రాల్లో నటించింది. త్రిషా ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా చూపించారని ఆ చిత్ర దర్శకుడిపై ఆరోపణలు గుప్పించి సంచలన సృషించిన ఈ అమ్మడు నటనకు కొంత కాలం దూరమైంది. అలా అనడం కంటే ఈ జాణను చిత్ర పరిశ్రమ దూరంగా పెట్టిందనే చెప్పాలి. ఇటీవల ఒరు కుప్పెకథై చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఈ అమ్మడికి నిర్మాత వెట్రిమారన్ అవకాశం ఇచ్చారు. ఇందులో మనీషా యాదవ్ గ్రామీణ యువతి పాత్రలో నటించనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్ నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో మనీషా యాదవ్ పాత్ర చాలా బలంగా ఉంటుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. దీనితో పాటు మరో చిత్రం మనిషాను వరించింది. కొత్త దర్శకుడు మిల్కా సెల్వకుమార్ చిత్రంలోనూ నటించడానికి మనీషాయాదవ్ పచ్చజెండా ఊపింది. ఇది హర్రర్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. -
ఆ మూడు సినిమా అంటే ఏంటో నేర్పించాయి
తమిళసినిమా: ఆ మూడు నాకు సినిమా అంటే నేర్పించాయి అని చెప్పింది నటి మనీషాయాదవ్. ఈ బ్యూటీలో మంచి నటి ఉందన్న విషయాన్ని తొలి చిత్రంతోనే నిరూపించుకుంది. అయితే రాజీ పడని మనస్తత్వం, నిర్ణయానికి కట్టుబడే వ్యక్తిత్వం మనీషా యాదవ్ ఎదుగుదలకు అవరోధాలయ్యాయని చెప్పవచ్చు. లేకపోతే బాలాజీ శక్తివేల్ అనే మంచి దర్శకుడి స్కూల్ నుంచి వచ్చిన మనీషాయాదవ్ తొలి చిత్రం వళక్కు ఎన్ 18/9తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వరుసగా ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన మనీషా యాదవ్ ఇటీవల ఒరు కుప్పై చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తూ ఒప్పుకున్న కథా పాత్రలను అంకితభావంతో నటించి న్యాయం చేయడానికి శ్రాయశక్తులా ప్రయత్నిస్తోందట. అలా నటిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ తన అనుభవాలను పంచుకుంటూ దర్శకులు బాలాజి శక్తివేల్, సుశీంద్రన్, కరు.పళనీయప్పన్ ముగ్గురు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో వరుసగా నటించాను. అలా నటించడం నిజంగా నాకు దక్కిన అదృష్టంగానే భావిస్తాను. వళక్కు ఎన్ 18/9 చిత్రంలో నటిస్తున్న సమయంలోనే ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే విధంగా జన్నల్ ఓరం చిత్రం అవకాశం వచ్చింది. ఆ మూడు చిత్రాలు నాకు సినిమాను పూర్తిగా నేర్పించాయి. ఆ అనుభవంతోనే ఒరు కుప్పైకథ చిత్రంలో నటించాను నేను కోలీవుడ్‌కు పరిచయం అయ్యి ఐదేళ్లు అయ్యింది. ఈ ఐదేళ్లలో నటననే కాకుండా తమిళ భాషనూ నేర్చుకున్నాను. ఇంతకు ముందు కొంచెం కొంచెం తమిళంలో మాట్లాడే నేను ఇప్పుడు చాలా సరళంగా మాట్లాడగలుగుతున్నాను. నా మనసుకు సంతృప్తి కలిగించిన పాత్రల్లో నటించడం ఇష్టం లేదు. అదే విధంగా ఒట్టి బొమ్మలా కనిపించి పోయే పాత్రల్లోనూ నటించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. ఇలాంటి నిర్ణయంతో చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను. అయినా పర్వాలేదు నాకు కథ, కథా పాత్ర చాలా ముఖ్యం అని అంటున్న మనీషాయాదవ్ త్వరలో ఒక ప్రముఖ హీరోతో నటించే చిత్రం గురించి చర్చల్లో ఉందని త్వరలోనే ఆ వివరాలు చెబుతానని అంది. అదే విధంగా మరి కొన్ని చిత్రాల అవకాశాలు చర్చల దశలో ఉన్నట్లు తెలిపింది. -
స్పెషల్ సాంగ్ అని.. ఐటమ్ సాంగ్ చేశారు..!
సాక్షి, చెన్నై: దర్శకుడు బాలాజీ శక్తివేల్ వళక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా మనీషాయాదవ్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ డైరెక్టర్ అలా చెప్పి ఉండాల్సింది కాదు. నన్ను ఆయన మోసం చేశారని నటి మనీషాయాదవ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మధ్య చెన్నై-28 సీక్వెల్లో ఐటమ్ సాంగ్‌కు చిందులేసింది. సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత డైరెక్టర్ వెంకట్ ప్రభుపై ఆరోపణలు గుప్పించింది. ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట్‌ప్రభు నన్ను మోసం చేశారు. చెన్నై-28 చిత్ర సీక్వెల్లో నాకు ఒక పాటతో పాటు చిత్రాన్ని మలు తిప్పే కీలక సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ముందుగా స్వప్నసుందరి పాటను చిత్రీకరించారు. అదీ స్పెషల్ సాంగ్ అని చెప్పారు. తీరా చిత్రం విడుదలైన తర్వాత చూస్తే అది ఐటమ్ సాంగ్ అని తెలిసింది. అందరూ స్వప్నసుందరి అని పిలుస్తున్నారు. దర్శకుడు ఆ పాటను స్పెషల్ అని చెప్పి ఉండకూడదు. అలా నన్ను వెంకట్ ప్రభు మోసం చేశారు. ఐటమ్ సాంగ్ గర్ల్ అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని ఒక ఇంటార్య్వూలో పేర్కొంది. ఈ అమ్మడు మొదట్లో త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనతో అసభ్య సంభాషణలు చెప్పించారని, గ్లామరస్‌గా చూపించారని ఈ అమ్మడు ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్‌పై ఫైర్ అయ్యి కలకలం సృష్టించింది. ఆ సినిమాకు ఆమె దాదాపుగా దూరం అయ్యింది. అయినా సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయిన తరువాత ఎప్పుడో మోసం చేశారని ఇప్పుడు గగ్గోలు పెట్టడంలో ప్రయోజనం ఏముంటుందో మనీషాయాదవ్‌నే చెప్పాలి. -
ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు
సాక్షి, సినిమా : సుమంత్ అశ్విన్ డెబ్యూ మూవీ తూనీగ తూనీగతో తెలుగులో నటించింది మనీషా యాదవ్. అయితే ఆ తర్వాతే ఆమె వరుసగా తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది. కానీ, కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని.. ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావటం లేదు. అందుకు దర్శకుడు వెంకట్ ప్రభు కారణమని ఆమె ఆరోపిస్తోంది. విషయం ఏంటంటే.. చెన్నై 600028(తెలుగులో కొడితే కొట్టాలిరా) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చెన్నై 600028-2 లో మనీషా యాదవ్ ‘సొప్పన సుందరి’ అనే ఓ పాత్రలో మెరిసింది. అంతేకాదు ఐటెం సాంగ్‌తో కూడా చిందులేసింది. అయితే అది మరీ దారుణంగా ఉండటంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఆమె చేసిన పాత్రను(డబుల్ మీనింగ్ డైలాగులకు) ప్రేక్షకులు చీదరించుకున్నారు. దీంతో మొత్తానికి ఆమె కెరీర్ మసకబారిపోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అది ఐటెం సాంగ్ కాదని.. సినిమాకు ఎంతో కీలకంగా మారుతుందని దర్శకుడు వెంకట్ ప్రభు నాతో చెప్పాడు. కానీ, నా పాత్రను చాలా దారుణంగా చిత్రీకరించారు. నేను ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా. కానీ, ఆయన వమ్ము చేశారు. ఇకపై కొత్త చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, సరోజా, గోవా, గాంబ్లర్, రాక్షసుడు చిత్రాలతో వెంకట్ ప్రభు తెలుగువారికి కూడా సుపరిచితుడే. -
కొత్త వారికి కొంచెం కష్టమే
కొత్త వారికి సినిమా కొంచెం కష్టమేనంటోంది నటి మనీషా యాదవ్. ఇటీవల యువ నటుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌కు ముద్దుల వర్షం కురిపించి కలకలం సృష్టించిన ఈ ఉత్తరాది బ్యూటీ వళక్కు ఎన్ 18/9. చిత్రంతో కోలీవుడ్లోకి కాలు పెట్టింది. తొలి చిత్రంతోనే విజయానికి పలువురి ప్రశంసలను మూటకట్టుకున్న ఈ భామ త్రిష ఇల్లన్న నయనతార చిత్రంతో జి.వి. ప్రకాష్‌కుమార్‌కు ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముద్దుల సన్నివేశాలు గురించి కాకుండా మరే విషయం గురించి అయి నా అడగవచ్చునన్న మనీషా యాదవ్‌తో చిన్న భేటీ... ప్రశ్న: వళక్కు ఎన్ 18/9 చిత్రం తరువాత మీ హవా సాగు తుందనుకుంటే అలా జరగలేదే? జవాబు: నాకు చిత్రాల సంఖ్య ముఖ్యం కాదు. చాలా సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదు. సినిమా నాకు ఫ్యాషన్. నాకు సౌకర్యంగా, శ్రమలేని పాత్రలనే ఒప్పుకుంటున్నాను. ప్రశ్న: ఎంతవరకు చదివారు? జవాబు: ఏడాది క్రితమే బీకామ్ పూర్తి చేశాను. చేతిలో డిగ్రీ కూడా ఉంది. ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవాలనే కోరిక ఉంది. ఖాళీ సమయాల్లో ఏదైనా డ్రస్ డిజైన్ చేస్తుంటాను. ప్రశ్న: త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో మీ పాత్ర? జవాబు: నా పాత్ర పేరు అతిథి. ఇది చాలా జాలీగా సాగే కథే. జీవిని ప్రేమించే ఇద్దరు హీరోయిన్లలో నేను ఒకరిని. నా పాత్ర యువతకు బాగా నచ్చుతుంది. ప్రశ్న: ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడారట? జవాబు: అవును. ఒక ఐటమ్ సాంగ్‌కు నటించా. ఇందులో డాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆండ్రియా పాడిన ఓ కాల్టీ అనే పాట కుర్రకారుకు గిలిగింతలు పెట్టి, ఉర్రూతలూగిస్తుంది. ప్రశ్న: గ్లామరస్‌గా నటించడానికి ఉబలాటపడుతున్నారట? జవాబు: అలా అని కాదు. నాకు నప్పే కథా పాత్రలనే చేస్తున్నాను. మరో విషయం ఏమిటంటే నేను సినిమా కుటుంబం నుంచి రాలేదు. అందువలన నాకు సినిమా కొత్త. అందుకే జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక గ్లామర్ అంటారా? అది ఎంత వరకు అవసరం అన్నది ఆలోచిస్తాను. కథకు అవసరం అయితే ఆ పరిధిల్లో నటిస్తాను. ప్రశ్న: స్టార్ హీరోలతో నటించాలని ఆశ లేదా? జవాబు: అలాంటి ఆశ లేని వారెవరైనా ఉంటారా? అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. అయితే కాలం కలిసి రావాలి. అదృష్టం తలుపు తట్టాలి. ప్రశ్న: ఎలాంటి పాత్రలు నటించాలని ఆశ పడుతున్నారు? జవాబు: హీరోయిన్లకు యాక్షన్ కథా పాత్రలు లభించడం అరుదైన విషయం. అలాంటి పాత్ర నాకు ఒరు కుప్పై కతై చిత్రంలో లభించింది. ఆ పాత్రల్లో నటించడానికి ముందు ఉత్సాహపడ్డ దెబ్బలు బాగానే తగిలాయి. హీరోల కష్టాలేమిటో ఇప్పుడు అర్థం అవుతోంది. సినిమాలో అన్నీ నేర్చుకోవడం అవసరం అనుకుంటున్నాను. ప్రశ్న: నూతన తారలు రాణించకపోవడానికి కారణం ఏమిటంటారు? జవాబు: టాప్ లెవల్‌కు చేరుకోవాలని అందరికీ ఉంటుంది. నంబర్‌వన్ స్థానాన్ని అందుకోవాలని ఆశపడతారు. త్రిష, నయనతార, హన్సిక ప్రముఖ హీరోయిన్లుగా వెలుగొందుతున్నట్లే ఏదో ఒక చిత్రం విజయంతో తన లాంటి వారు ప్రముఖ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటాం. ఏదైనా నూతన తారలకు సినిమా కొంచెం కష్టమే. -
నటి సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం: మనీషా యాదవ్
తమిళ సినిమా : నటి సిమ్రాన్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనని ఆమెకు తీవ్ర అభిమానినని అంటోంది నటి మనీషా యాదవ్. వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా తమిళ తెరపై ప్రత్యక్షమైన ఈ ఉత్తరాది భామ, ఆ తరువాత కాదల్ చెయ్వీర్ తదితర విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య చిన్న వివాదంలో చిక్కుకుని కోలీవుడ్‌కు దూరమైన మనీషా తాజాగా జి.వి.ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. టైటిల్‌తోనే బోలెడు ప్రచారం పొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే కయల్ చిత్రం ఫేమ్ ఆనంది ఒక నాయికగా నటి స్తోంది. అలాగే మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తోంది. కాగా ఇప్పుడు నటి మనీషా యాదవ్ మరో హీరోయిన్గా ఎంపికయ్యింది. ఈ చిత్రంలో చోటు సంపాదించుకోవడం గురించి మనీషా మాట్లాడుతూ, ‘త్రిష ఇల్లన్న నయనతార’ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇందులో తనది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రని చెప్పింది. జి.వి.ప్రకాశ్ కుమార్ మంచి సంగీత దర్శకుడే కాక, నటనలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారన్న విషయాన్ని మూడు రోజుల షూటింగ్‌లోనే తాను గ్రహించానని పేర్కొంది. దర్శకుడు ఆదిక్ సన్నివేశాలను అర్థవంతంగా వివరిస్తూ ఆర్టిస్టుల నుంచి తనకు కావలసిన అభినయాన్ని రాబట్టుకుంటున్నారని అంది. ఇకపోతే తాను నటి సిమ్రాన్‌కు తీవ్ర అభిమానినని పేర్కొంది. ఆమె నటిస్తున్న చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. సిమ్రాన్లా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ తాను ఆమెను కలుసుకోలేదని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో కలుసుకునే అవకాశం రాబోతుందన్న ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నానని మనీషా అంది. కాగా ఈ చిత్రాన్ని కామియో ఫిల్మ్స్ పతాకంపై సీజె. కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
మనీషాకు మరో అవకాశం
వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి మనీషా యాదవ్. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వరించాయి. జన్నల్ ఓరం, ఆదరాల్ కాదల్ సెయ్‌వీర్ వంటి విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మనీషా, దర్శకుడు శ్రీనురామస్వామి చిత్రం ఇవళ్ ఇదం పొరుళ్ చిత్రంలో ఎంపికయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె నటన సంతృప్తి కలిగించలేదంటూ దర్శకుడు చిత్రం నుంచి తొలగించారు. కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన మనీషా కెరీర్‌కు కొంచెం నష్టం కలిగించిందనే చెప్పాలి. ఆ తర్వాత అవకాశాలు కూడా ఆమెకు దూరం అయ్యాయి. తాజాగా మనీషాకు మరో అవకాశం వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత దినేష్ హీరోగా అవతారమెత్తనున్నారు. ఆయనతో మనీషా రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ జంట నటించే చిత్రానికి ‘ఒరు కుప్పై కథై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాళి రంగస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మరో యువ దర్శకుడు అస్లామ్ నిర్మించనుండడం విశేషం. మరో ముఖ్య అంశం ఏమిటంటే కాదల్ చిత్రం ఫేమ్ జాష్వా శ్రీధర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడం. ఈయన కొంత కాలంగా తమిళ చిత్రాలకు పని చేయడం లేదు. ఒరు కుప్పై కైథైవైవిద్య భరిత కుటుంబ కథ చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి తెలిపారు. దినేష్ చిత్రంలో చెన్నైకు చెందిన ఒక నిస్సహాయకుడైన యువకుడిగా నటిస్తున్నారని, మనీషా పల్లెటూరి పడుచుగా నటిస్తున్నారని చెప్పారు. -
మనీషాకు బదులు నందిత
కథ మారింది కల చెదిరింది అనే పాటను వర్ధమాన నటి మనీషా యాదవ్ పాడుకునే పరిస్థితి ఎదురైంది. ఈ బ్యూటీ మంచి నటే. ఆమె నటించిన వళక్కు ఎన్ 18/9. ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయినా ఒక్కోసారి ఊహించని సంఘటనలు జరుగుతాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి దర్శకుడు శ్రీను రామసామి రూపంలో సడన్‌గా బ్రేక్ పడింది. అంతేకాదు ఇది ఆమె కెరీర్‌కు డ్రాబ్యాక్ అనే చెప్పాలి. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత శీను రామసామి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇదం పొరుళ్ అవళ్. విజయ్ సేతుపతి, విష్ణు విశాల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మనిషాను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా మని షాకు చిత్రంలో గ్రామీణ యువతి పాత్రకు ఆమె నటన సంతృప్తికరంగా లేదంటూ దర్శకుడు ఆమెను మరో హీరోయిన్ పాత్రలో విష్ణు విశాల్‌కు జంటగా నటించమని అడిగారట. దీనికామె నిరాకరించడంతో ఇప్పుడా పాత్రకు నటి నందిత ఎంపికయ్యారు. ఈమెను ఇంతకు ముందు విష్ణు విశాల్‌కు జంటగా ఇదే చిత్రానికి ఎంపిక చేశారన్నది గమనార్హం. ఇప్పుడు విష్ణు విశాల్ సరసన నటించే నటి కోసం అన్వేషిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. ఏదోమయినా నటి మనిషా యాదవ్‌కు ఈ సంఘటన పెద్ద దెబ్బేనని చెప్పాలి. -
మనీషా నటన నచ్చలేదా?
వర్ధమాన హీరోయిన్ మనీషాయాదవ్కు చేదు అనుభవం ఎదురైందా? జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు శీను రామస్వామికి ఆమె నటన నచ్చలేదా? అలాంటప్పుడు ముందుగానే మూడు సార్లు అడిషన్లు జరిపి మనీషాను ఇదం పొరుల్ ఇవళ్ చిత్రానికి హీరోయిన్గా ఎందుకు ఎంపిక చేశారు? షూటింగ్ ప్రారంభం అయిన తరువాత ఆమెనెందుకు తొలగించాల్సి వచ్చింది? ఈ పరిణామంతో మనసు గాయపడిన నటి మనీషా యాదవ్ న్యాయం కోసం నటీనటుల సంఘాన్ని ఆశ్రయించనుందా? లాంటి పలు ఆసక్తికరమైన అంశాలు కోడంబాక్కంలో హల్చల్ చేస్తున్నాయి. తెన్మేర్కు పరువకాత్తు చిత్రంలో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు నందుకున్న దర్శకుడు శీనురామసామి. నీర్పరవై చిత్రం తరువాత తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదం పొరుల్ ఇవళ్. విజయ్ సేతుపతి, విష్ణువిశాల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత లింగుసామి తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. మనీషా నే పర్ఫెక్ట్ విజయ్ సేతుపతికి జంటగా వర్ధమాన నటి మనీషా యాదవ్‌ను ఎంపిక చేశారు. ఆమె ఇందులో కొండ ప్రాంతపు వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్ర పోషించనున్నట్లు, ఇంతకు ముందు మనీషా యాదవ్ నటించిన వళక్కు ఎన్ 18/9, ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్ చిత్రాల్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని, తన చిత్రంలో హీరోయిన్ పాత్రకు మనీషా యాదవ్‌నే పర్ఫెక్ట్గా సరిపోతుందని దర్శకుడు శీను రామసామి చిత్ర ప్రారంభానికి ముందు వెల్లడించారు. అభినయం నచ్చలేదు ఇదం పొరుల్ ఇవళ్ చిత్ర షూటింగ్ ఈ నెల మూడో తేదీన దిండుగల్‌లో ప్రారంభమైంది. ప్రారంభ దశలోనే నటి మనీషా యాదవ్ నటన దర్శకుడిని సంతృప్తి పరచలేదని ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాముఖ్యత ఉంటుందని, అలాంటి మనీషా యాదవ్ అభినయం, షార్ట్ సంభాషణల ఉచ్ఛరణ దర్శకుడు శీనురామస్వామికి నచ్చలేదని అందుకే ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. అమర్యాదగా తొలగించారు ఈ వ్యవహారం గురించి నటి మనీషా తల్లి యమునా సురేష్‌ను స్పందించాలని అడగ్గా ఇదం పొరుల్ ఇవళ్ చిత్రం విషయంలో సమస్య ఉత్పన్నమైన సంగతి నిజమేనన్నారు. అయితే ఇందులో మనీషా యాదవ్ తప్పు ఏమీ లేదని పేర్కొన్నారు. ఆమెను అమర్యాదగా చిత్రం నుంచి తొలగించారని ఆరోపించారు. మనీషా యాదవ్ సరిగ్గా నటించలేదన్నది నిజం కాదన్నారు. ఈ చిత్రానికి ఎంపిక చేసే విషయంలో దర్శకుడు శీను రామసామి, మనీషాను మూడు దశలుగా ఆడిషన్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు దర్శకుడికి తెలియదా? ఆ పాత్రకు ఆమె నప్పుతారా? లేదా? అన్నది అని ప్రశ్నించారు. నిజానికి తాము మూడు రోజుల క్రితమే చిత్ర షూటింగ్లో పాల్గొన్నామని వెల్లడించారు. ఆ రోజు కూడా షూటింగ్ సక్సెస్ అయ్యే ముందు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు మనీషా సన్నివేశాలను చిత్రీకరించారని తెలిపారు. అరగంట షూటింగ్‌లోనే ఆమె అభినయం గురించి దర్శకుడు జడ్జ్ చేయగలరా? అంటూ ప్రశ్నించారు. మరుసటి రోజునే ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ చేత బెంగళూరుకు టికెట్ పంపించడం నిరాధారంగా చిత్రం నుంచి తొలగించడం బాధాకరం అన్నారు. -
'ప్రేమించాలి' ప్రెస్ మీట్
-
విజయ్ సేతుపతికి జంటగా మనీషా యూదవ్
యువ నటి మనీషా యాదవ్ సక్సెస్ఫుల్ హీరో విజయ్ సేతుపతితో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. వళక్కు ఎన్ 18/9 చిత్ర ఫేమ్ మనీషా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం చిత్రాల సక్సెస్ ఈ బ్యూటీ కెరీర్‌కు బాగానే ఉపయోగపడిందనే చెప్పాలి. అయితే వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని మిస్ అయిన ఈ భామకు తాజాగా విజయ్ సేతుపతితో జతకట్టే అవకాశం లభించింది. దర్శకుడు లింగుసామి సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో మరో హీరోగా విష్ణు విశాల్ నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీనురామసామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కొందరు నటీమణులకు అడిషన్ చేశామన్నారు. వారిలో మనీషా అడిషన్ చూడగానే వెంటనే ఆమెను ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో ఆమె కొండ ప్రాంత యువతిగా నటించనున్నారని తెలిపారు. ఇతర ప్రాంతం నుంచి అక్కడికి చేరే వ్యక్తిగా హీరో విజయ్ సేతుపతి నటించనున్నారని చెప్పారు. విష్ణు విశాల్‌కు జంటగా నటించే హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉందని చిత్ర షూటింగ్ మార్చిలో కొడెకైనాల్లో ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు. -
‘ప్రేమిస్తే’ అంత గొప్పగా...
‘సుశీంద్రన్ సినిమాను తెలుగులోకి అనువదించాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది’’ అని నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సేవియర్’ను సురేష్ కొండేటి ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి అనువ దించారు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో మంత్రి గంటా శ్రీనివా సరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని అంజలి, సందీప్కిషన్లకు అందించారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘నా కెరీర్లో ‘ప్రేమిస్తే’ మరచిపోలేని సినిమా. ఆ సినిమాలాగే ‘ప్రేమించాలి’ కూడా గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని కై్లమాక్స్ పాటను సిరివెన్నెలగారితో రాయించాలనుకున్నాను. కానీ భాస్కరభట్లతో రాయించాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే గొప్పగా రాశాడు తను’’ అని చెప్పారు. తమిళంలో విజయం సాధించిన తన చిత్రం ఎస్.కె.పిక్చర్స్ ద్వారా తెలుగులో విడుదల కానుండటం ఆనందంగా ఉందని సుశీంద్రన్ చెప్పారు. ‘ప్రేమించాలి’ లాంటి మంచి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని భాస్కరభట్ల అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతోపాటు ఎమ్మెల్ కుమార్ చౌదరి, ఏడిద రాజా, విజయ్‌కుమార్ కొండా, నవీన్‌చంద్ర, శ్రీవిష్ణు, శ్రీరామచంద్ర, బాలాదిత్య, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి?
ప్రేమలో పడనివాళ్లు... వానలో తడవని వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధంలేదు. ఇక్కడ మనసే ప్రధానం. అయితే అన్ని ప్రేమలూ ఒకలా ఉండవు. అసలు ప్రేమ అనేది సముద్రమంత సబ్జెక్ట్. ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే ‘ప్రేమించాలి’ సినిమా చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటున్నారు నిర్మాత సురేష్ కొండేటి. ఆయన నిర్మించిన పదో అనువాద చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఓ పాట పాడించారు. ‘లాలిజో... అమ్మ ఒడి లేదు అని ఏడవకు...’ అనే ఆ పాటను భాస్కరభట్ల రచించారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘నా అభిమాన గాయకుడు బాలుగారితో పాట పాడించాలన్న నా కల ఇన్నేళ్లకు నెరవేరింది. ఆయన పాడటంతో ఈ సినిమాకే ఒక పరిపూర్ణత వచ్చింది. ఈ పాట లిరిక్స్ చదివి బాలుగారు నన్నూ భాస్కరభట్లనూ అభినందించారు. ‘నీ సినిమాలు చాలా బాగుంటాయి సురేష్’ అని బాలూగారు అన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. దాదాపు 1300 పాటలు రాసిన భాస్కరభట్ల కెరీర్లో టాప్ టెన్‌లో నిలిచే పాట ఇది. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులను కూడా తప్పక ఆకట్టుకుంటుందని నా నమ్మకం. యువతరంలో మార్పును తెచ్చే సినిమా ఇది. హీరో సంతోష్ తొలి సినిమా అయినా చాలా బాగా చేశాడు. హీరోయిన్ మనీషా యాదవ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది’’ అన్నారు. -
నిజానికి ఎవర్ని ప్రేమించాలి?
అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించాలి. అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించాలి. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా అబ్బాయిలూ అమ్మాయిలూ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అప్పుడే వారి ప్రేమకు నిజమైన దీవెనలు లభిస్తాయి. ఇలాంటి సందేశంతో తమిళంలో రూపొందిన ప్రేమకథ ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట ఓ సంచలనం. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత సురేష్ కొండేటి. గతంలో ఆయన అందించిన ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ, నాన్న, పిజ్జా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వాటి వరుసలోనే ఈ సినిమా కూడా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు సురేష్. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ -‘‘మా సంస్థలో వచ్చిన ‘ప్రేమిస్తే’ చిత్రం నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో... అంతకు పదింతలు పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది. ‘ప్రేమిస్తే’ని మరిపించేలా దర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని మలిచారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. వచ్చే వారంలో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
ఆకర్షణతో ప్రేమిస్తే..? : సురేష్ కొండేటి
‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. మాస్ మసాలా చిత్రాల హవా నడుస్తున్నా, కామెడీ చిత్రాలు వీరవిహారం చేస్తున్నా ప్రేమకథా చిత్రాలకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే, ఓ క్యూట్ లవ్‌స్టోరీని ప్రేక్షకులకు ఇవ్వాలనుకున్నాం’’ అంటున్నారు సురేష్ కొండేటి. ఇప్పటివరకు ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై తొమ్మిది చిత్రాలను అందించి, విజయవంతమైన చిత్రాల నిర్మాత అనిపించుకున్నారు సురేష్. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పదో సినిమాగా తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. కాఫీస్ సినిమా సమన్యరెడ్డి సహనిర్మాత. సుశీంద్రన్ దర్శకత్వంలో సంతోష్, మనీషా యాదవ్ జంటగా నటించారు. ఈ చిత్రానికి ‘ప్రేమించాలి!’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సురేష్, సమన్యరెడ్డి మాట్లాడుతూ -‘‘తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కథా కథనాలు ప్రధాన బలం. సుశీంద్రన్ దర్శకత్వ పనితీరు అద్భుతం. యువన్ శంకర్‌రాజా స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆకర్షణతో ప్రేమలో పడిన ఓ అమ్మాయి, అబ్బాయి జీవితాల్లో ఏర్పడిన పరిణామాల సమాహారమే ఈ సినిమా. తమిళంలో సాధించినట్లుగానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.