విజయ్ సేతుపతికి జంటగా మనీషా యూదవ్ | Manisha Yadav bags film opposite Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతికి జంటగా మనీషా యూదవ్

Published Wed, Feb 26 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

విజయ్ సేతుపతికి జంటగా మనీషా యూదవ్

విజయ్ సేతుపతికి జంటగా మనీషా యూదవ్

యువ నటి మనీషా యాదవ్ సక్సెస్‌ఫుల్ హీరో విజయ్ సేతుపతితో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. వళక్కు ఎన్ 18/9 చిత్ర ఫేమ్ మనీషా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం చిత్రాల సక్సెస్ ఈ బ్యూటీ కెరీర్‌కు బాగానే ఉపయోగపడిందనే చెప్పాలి. అయితే వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని మిస్ అయిన ఈ భామకు తాజాగా విజయ్ సేతుపతితో జతకట్టే అవకాశం లభించింది. దర్శకుడు లింగుసామి సంస్థ తిరుపతి బ్రదర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో మరో హీరోగా విష్ణు విశాల్ నటిస్తున్నారు. 
 
 జాతీయ అవార్డు గ్రహీత శ్రీనురామసామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం కొందరు నటీమణులకు అడిషన్ చేశామన్నారు. వారిలో మనీషా అడిషన్ చూడగానే వెంటనే ఆమెను ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో ఆమె కొండ ప్రాంత యువతిగా నటించనున్నారని తెలిపారు. ఇతర ప్రాంతం నుంచి అక్కడికి చేరే వ్యక్తిగా హీరో విజయ్ సేతుపతి నటించనున్నారని చెప్పారు. విష్ణు విశాల్‌కు జంటగా నటించే హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉందని చిత్ర షూటింగ్ మార్చిలో కొడెకైనాల్‌లో ప్రారంభం కానుందని దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement