‘ప్రేమిస్తే’ అంత గొప్పగా...
‘ప్రేమిస్తే’ అంత గొప్పగా...
Published Tue, Dec 17 2013 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
‘సుశీంద్రన్ సినిమాను తెలుగులోకి అనువదించాలనే నా కోరిక ఈ సినిమాతో తీరింది’’ అని నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. సంతోష్, మనీషా యాదవ్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సేవియర్’ను సురేష్ కొండేటి ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి అనువ దించారు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని హైదరాబాద్‌లో మంత్రి గంటా శ్రీనివా సరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని అంజలి, సందీప్‌కిషన్‌లకు అందించారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘నా కెరీర్‌లో ‘ప్రేమిస్తే’ మరచిపోలేని సినిమా. ఆ సినిమాలాగే ‘ప్రేమించాలి’ కూడా గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులోని కై్లమాక్స్ పాటను సిరివెన్నెలగారితో రాయించాలనుకున్నాను. కానీ భాస్కరభట్లతో రాయించాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే గొప్పగా రాశాడు తను’’ అని చెప్పారు.
తమిళంలో విజయం సాధించిన తన చిత్రం ఎస్.కె.పిక్చర్స్ ద్వారా తెలుగులో విడుదల కానుండటం ఆనందంగా ఉందని సుశీంద్రన్ చెప్పారు. ‘ప్రేమించాలి’ లాంటి మంచి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని భాస్కరభట్ల అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతోపాటు ఎమ్మెల్ కుమార్ చౌదరి, ఏడిద రాజా, విజయ్‌కుమార్ కొండా, నవీన్‌చంద్ర, శ్రీవిష్ణు, శ్రీరామచంద్ర, బాలాదిత్య, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement