Suresh Kondeti
-
‘అభిమాని’ కోసం రంగంలోకి మణిశర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "అభిమాని". ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో "అభిమాని" సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ - అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ కలిగిన అభిమాని( Abhimani) మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది . ఇందులో ఉన్న అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన సురేష్ కొండేటి బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ దోమకొండ రాంబాబు అనుకున్న కంటెంట్ ని అదే స్థాయిలో ప్రజెంట్ చేశారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అభిమాని మూవీని మీరంతా సూపర్ హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ సురేష్, అండ్ అభిమాని టీమ్. అన్నారు.అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ..'అభిమాని' మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రీ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. మూవీలోని విజువల్స్ మణిశర్మ గారి నేపథ్య సంగీతం కలిసి ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమాకి ప్రాణం అయిన చివరి 20 నిమిషాలుకు మణిశర్మ గారు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు. మా సినిమాకు సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం’ అన్నార. సురేష్ కొండేటి(Suresh Kondeti) మాట్లాడుతూ - లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు నేను ప్రధాన పాత్ర పోషించిన అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఈ సంక్రాంతిని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఈసారి మా ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మణిశర్మ అనేది పేరు కాదు, ఓ బ్రాండ్. ఆయన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్లో తన సినిమాలతో రఫ్పాడించారు. నేను యంగ్ గా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అలాంటిది ఇప్పుడు అంతటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం తో సంతోషంగా ఉంది. మణిశర్మ గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది. మణిశర్మ గారి మా టీమ్ కు తోడయ్యక అభిమాని సినిమా లెవెల్ పెరిగింది. రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. ఇప్పటిదాకా నన్ను సినీ జర్నలిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు. -
నిర్మాత సురేష్ కొండేటి, అక్సాఖాన్ సినిమా గ్లింప్స్ విడుదల
నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే 'దేవినేని' అనే సినిమాతో కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన 'అభిమాని' అనే మరో కొత్త సినిమాను ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ డైరెక్టర్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‌లైన్ తో సినిమా తెరకెక్కింది. ఇందులో సురేష్ కొండేటి సరసన అక్సాఖాన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్కే రహ్మాన్, మరియు కంద సాంబశివరావు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.గ్లింప్స్ విడుదల సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. 'అభిమాని సినిమా గ్లింప్స్ చాలా బాగుంది. టైటిల్ సెలక్షన్‌తోనే సినిమా సగం విజయం సాధించింది. అభిమాని అంటే కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి సినిమా చూసి కాగితాలు ఎగరవేయడమే కాదు, తన అభిమాన హీరో చేసే మంచి కార్యక్రమాలు, వారిలో ఉన్న మంచి లక్షణాలు, వారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుకుని, తాను పాటిస్తూ పదిమందికి చెప్పాలి. అదే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం.' అని ఆయన చెప్పారు. -
లడ్డూ దక్కించుకున్న సినీ నిర్మాత కొండేటి సురేష్
ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం అధినేత కొండేటి సురేష్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఫిలింనగర్ దైవసన్నిదానంలో శనివారం నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన ’ 19 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూ తనకు దక్కడం సంతోషంగా ఉందని, ప్రతియేటా తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ కోశాధికారి కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సురేశ్ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ!
తెలుగు సినిమాల్లో అమ్మ, అమ్మమ్మ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అన్నపూర్ణమ్మ. సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు ఈమె అమ్మగా నటించి మెప్పించింది. తమిళ సినిమాల్లోనూ అన్నపూర్ణమ్మకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఏదో ఒక మూవీలో కనిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. ఇప్పుడు ఈమె.. నటుడిగా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తోంది. సురేష్ కొండేటి ప్రస్తుతం 'అభిమాని' అనే వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులోనే వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్‌లో వస్తున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) -
గోవాలో ఘనంగా సంతోషం అవార్డ్స్ వేడుక (ఫొటోలు)
-
కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారు: సురేశ్ కొండేటి
గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గత 21 ఏళ్లుగా ఇస్తున్న సినీ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి స్పందించారు. ఈ అవార్డులు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. సురేశ్ కొండేటి ట్వీట్లో రాస్తూ..' అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను . ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నా. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే . అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నా. గోవా ఈవెంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కు రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్. ఇది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి' అంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/zlLhjNx8UM — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే ..… — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 -
అతడు ఫెయిలయ్యాడు, మాకు పీఆర్వో కాదు.. అల్లు అరవింద్ సీరియస్
ఈ మధ్య సినిమా ప్రమోషన్స్‌లో విలేఖరి సురేశ్ కొండేటి పేరు మారుమోగుతోంది. సెలబ్రిటీలను చిత్రవిచిత్ర ప్రశ్నలడుగుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఈయన చాలాకాలం నుంచి సంతోషం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా గోవాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దక్షిణాది నుంచి పలువురు సెలబ్రిటీలను ఈవెంట్‌కు తీసుకెళ్లాడు. కానీ ఈ ఫంక్షన్ రసాభాసగా జరగడంతో టాలీవుడ్ పరువుపోయే పరిస్థితికి వచ్చింది. కన్నడ సెలబ్రిటీలకు ఇబ్బందులు ఈవెంట్ నిర్వహణలో కన్నడ సెలబ్రిటీలకు చేదు అనుభవం ఎదురైందట. స్టేజీపై కన్నడ నటులకు అవార్డులు ఇస్తున్న సమయంలో సడన్‌గా లైట్స్ ఆర్పేసి వారిని అవమానించారని, హోటల్ సిబ్బందితోనూ ఇబ్బందులు ఎదురయ్యాయంటూ.. కన్నడ ప్రతినిధులు సంతోషం అవార్డు వేడుకల మీద విమర్శలు చేస్తూ టాలీవుడ్‌ను తప్పుపడుతున్నారు. వేడుక మధ్యలో నుంచే యాంకర్ వెళ్లిపోయిందని, తమకు సరైన ఏర్పాట్లు చేయకుండా దారుణంగా అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు. ఒక వ్యక్తి చేసిన పొరపాటు 'ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్నాడు. ఈసారి గోవాలో చేద్దామనుకున్నాడు, కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఫెయిలయ్యాడు, చేయలేకపోయాడు. ఆ ఫంక్షన్‌కు వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అందులో ఇతర భాషల వారు కూడా ఉన్నారు. వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీని నిందిస్తున్నారు. అది సరైనది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటును ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అలాగే మీడియా.. అతడిని మా కుటుంబానికి చెందిన వ్యక్తికి పీఆర్వో అని రాస్తున్నారు. ఆయన ఎవరికీ పీఆర్వో కాదు. మా ఫ్యామిలీకి చెందిన పీఆర్వో అసలే కాదు. తను సొంతంగా ఏదో కార్యక్రమం చేయాలనుకుని ఫెయిలయ్యాడు.. అంతే!' అని పేర్కొన్నాడు. .#Kannada celebrities face humilation at #SanthoshamSouthIndian Film awards #Goa It is with deep concern and disappointment that we need to address the distressing events that transpired at the #Santhosham #South #Indian Film Awards 2023 The award function that is organised by… pic.twitter.com/s0kXAKPmh1 — A Sharadhaa (@sharadasrinidhi) December 3, 2023 చదవండి: జపాన్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అప్పుడే స్ట్రీమింగ్ -
25 ఏళ్లుగా ‘సంతోషం’.. మరో మూడేళ్లు గ్యారెంటీ: సురేశ్ కొండేటి
‘చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్ర హీరోల ప్రోత్సాహంతో గత 25 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులను అందిస్తున్నాను. మరో మూడేళ్లు కూడా కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి’అని ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి అన్నారు. డిసెంబర్ 2న గోవాలో ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సురేశ్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18న హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్‌ని, డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఫంక్షన్ నిర్వహణకు గోవా ప్రభుత్వ అధికారులు చేసిన సహాయం మర్చిపోలేనిదన్నారు. -
గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్.. వీడియో రిలీజ్ చేసిన శ్రీలీల
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక డిసెంబరు 2న గోవాలో జరగనుంది. సంతోషం 22వ ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నట్లు, జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హీరోయిన్ శ్రీలీల ఓ వీడియోలో వెల్లడించారు. ఇక గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు నిర్వాహకుడు, ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి పేర్కొన్నారు. Exciting news for all the film enthusiasts! 🎥 The Goa Santosham South Indian Film Awards 2023 is just 50 days away, and it's happening on December 2nd at Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium, Goa. Can't wait to see what our favorite stars bring to the stage. Mark your… pic.twitter.com/zpvcBrr7aF — Suresh Kondeti (@santoshamsuresh) October 13, 2023 -
సురేశ్ కొండేటికి సిద్ధార్థ్ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్. ఈ చిత్రంలో జెనీలియా అతనికి జంటగా నటించింది. ప్రస్తుతం ఆయన చిత్తా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాగా.. తెలుగు ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌కు ఆయన హాజరయ్యారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? ) అయితే ఈ ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సినిమా ఈవెంట్స్‌లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి కూడా హాజరయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్.. అతనిపై సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'కొండేటి సురేశ్‌కు ఒక వార్నింగ్. మొత్త ఇంటర్నెట్ నీకు వార్నింగ్ ఇవ్వమంది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేశ్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పా' అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) Sariponu....... pic.twitter.com/DBYIHOGOAl — Arehoo_official (@tweetsbyaravind) October 3, 2023 -
చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్
విజయ్ దేవరకొండ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమా జులై 14న విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకుడు కాగ ఎస్కేఎన్ నిర్మాతగా ఉన్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. ఇందులో హీరోయిన్ పాత్ర డీగ్లామర్ రోల్లో ఉంటుంది. దీంట్లో ఆమెను బేబమ్మ అని పిలుస్తారట. (ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 నుంచి పిలుపొచ్చిందన్న నచ్చావులే హీరోయిన్) ట్రైలర్‌ను చూసిన వారు నలుపు, తెలుపు శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన ‘బేబీ’ లాంటి సినిమాలను ఇంకా చూడాలా అంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ఫెయిర్ అండ్ లవ్లీ కూడా తన పేరును గ్లో అండ్ లవ్లీగా మార్చుకుంది. అలాంటిది ఈ సినిమా కథ ఏమిటంటూ పలు కామెంట్లు వచ్చాయి. దీనికి హీరో ఆనంద్ కూడా రియాక్ట్ అయి సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందామన్నాడు. అంతలా సినిమా విడుదలకు ముందే కొంతమేరకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఈ సినిమా తాజాగా చిత్ర యూనిట్‌తో ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో భాగంగా 'బేబీ' సినిమా హీరోయిన్‌తో.. 'వైష్ణవి.. ముద్దు పెట్టుకుంటా' అని కొంచెం డిఫరెంట్‌గా అడుగుతాడు. దీంతో వైష్ణవికి ఫీజులు ఎగిరిపోయినంత పని అయింది. చివరకు ఏమనాలో తెలియకుండా కొద్దిసేపు అలాగే ఉండిపోతుంది. వెంటనే ఆ రిపోర్టర్ కలుగచేసుకుని ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న ఇదే కదా.. 'సినిమాలో హీరో ముద్దు పెట్టుకుంటా అన్నాడు కదా..' దానికి మీ రియాక్షన్ ఏంటి..? ' అంటూ తనదైన స్టైల్లో మార్చేస్తాడు. అప్పుడు వైష్ణవి కూడా ఓహ్... టీజర్లో ఉన్న సీన్ గురించా అంటూ.. గుర్తుతెచ్చుకుని 'చెప్పు తెగుద్ది అంటాను' అని అంటుంది. 'ఓహో చెప్పు తెగుద్దా' అంటూ వేరే టాపిక్‌లోకి వెళ్తాడు ఆ రిపోర్టర్. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) బహాశా ఇది సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉంటారో... అనుకోకుండా నిజంగానే జరిగిందో మాత్రం తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఆ రిపోర్టర్‌ను మాత్రం విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియో కింద కామెంట్లు చేయడమే కాకుండా ఆయనకు ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో 2018 మూవీ ప్రెస్ మీట్లో కూడా ఇలాంటి వైరల్ కామెంట్లే చేశాడు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆదే రిపోర్టర్‌పై మండిపడ్డారు. ఇలా ఎన్నో సంఘటనలు ఆయన ఖాతాలో ఉన్నాయి. -
డిసెంబర్లో ‘సంతోషం’
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందచేస్తూ వస్తున్న అనేక అవార్డులలో ‘సంతోషం’ అవార్డ్సు ఒకటి. ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్’కి తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 26న హైదరాబాద్‌లో ‘21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022’ వేడుకలు జరగనున్నాయి. సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు ‘‘తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలకు అవార్డులు అందించనున్నాం. ఈ వేడుకలో భాగంగా 12 గంటలపాటు నాన్‌స్టాప్ వినోదం ఉంటుంది’’ అని సంతోషం పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. -
‘మీ4 టిక్ టిక్’ యాప్ లాంచ్.. టిక్ టాక్‌ను మరిపిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు. ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు. -
జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’
‘‘ఇంజనీరో, డాక్టరో అవుతామని పిల్లలు చెప్పిన మాటలను వారి తల్లిదండ్రులు నమ్ముతారు. అలాగే యాక్టరో, ఫిల్మ్ మేకరో అవుతామని చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ మేకింగ్ కూడా బాధ్యతతో, గౌరవంతో కూడిన ఉద్యోగం’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటించిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘నా ‘ఛలో’ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన మల్లి సినిమాకు నేను అతిథిగా రావడం హ్యాపీగా ఉంది. మల్లి చాలా నిజాయితీగా ఈ సినిమా తీసి ఉంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’’ అన్నారు మల్లికార్జున్. ‘‘ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా... ఇలా 15 సినిమాలను రిలీజ్ చేశాను. నిర్మాతగా నాకు మంచి పేరు తీసుకువచ్చే మరో సినిమా ‘జైత్ర’ సుభాష్ గారి ద్వారా వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి. ‘‘రాయలసీమ యాసతో కూడిన మట్టిమనుషుల కథే ఈ చిత్రం’’ అన్నారు సుభాష్. -
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సురేశ్ కొండేటి
50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని, జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. నారాయణరెడ్డి ఎం.డి. అబ్దుల్, ట్రెజరర్ పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా.. తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జయ గార్ల గౌరవార్థం వారి కుమారుడు బి.ఏ. శివకుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్ గా.. అలాగే కమిటీ ఆమోదంతో ఈసీ మెంబర్ గా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘రెండోసారి నన్ను ప్రెసిడెంట్ ని చేయడం అనేది చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. గతంలో నేను ఎలాగైతే సంస్థ అభివృదికి.. సభ్యులకు సంక్షేమానికి కృషి చేశానో.. ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి పనులు చేయాలని.. చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి మెంబర్ కి ఉపయోగపడేలా నిర్ణయాలు.. కమిటీ సభ్యుల ఆమోదంతో తీసుకోవడం జరుగుతుంది. సినిమా జర్నలిస్టుల అసోసియేషన్‌లో కీలకమైంది మాత్రం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అని నేను ఖచ్చితంగా చెప్పగలుతాను ’అన్నారు -
వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ‘రియల్ దండుపాళ్యం’
రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా రామ్ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ...``దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూశాక అర్థమైంది. రాగిణి ద్వివేది అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరించింది. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాల్మీకి ఈ చిత్రంతో సినిమా రంగంలో కూడా సక్సెస్ సాధించి మరెన్నో చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నా`` అన్నారు. రామ్ ధన్ మీడియా వర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ...``తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటినీ మించేలా `రియల్ దండుపాళ్యం ఉండబోతుంది`. సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’.అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’అన్నారు. -
రాజీవ్ కనకాలతో షూటింగ్లో పాల్గొన్న సురేష్ కొండేటి
Suresh Kondeti Shares Picture With Rajeev Kanakala In Shooting: తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సురేష్ కొండేటి. 1996లో రాంబంటు సినిమాలో తొలిసారి నటుడిగా కనిపించిన ఆయన తనను నటుడిగా పరిచయం చేసిన డైరెక్టర్ బాపు జయంతి రోజున ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.నటుడు రాజీవ్ కనకాలతో కలిసి షూట్లో పాల్గొన్నారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇక రాంబంటు సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయన ఇటీవలె దేవినేని సినిమాలో చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాసరి గారు తనకు స్ఫూర్తి అని చెప్పే సురేష్ కొండేటి.. దాసరిలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ముద్రవేయాలనేది తన కోరిక అని చెబుతూ ఉంటారు. -
ఒక్కసారైనా హీరోగా చేస్తా: సురేష్ కొండేటి
‘‘దివంగత దర్శకులు దాసరి నారాయణరావుగారే నాకు స్ఫూర్తి. ఆయనలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, డిస్ట్రిబ్యూటర్.. ఇలా అన్ని రంగాల్లో ఎదగాలన్నది నా కోరిక. నటుడిగా మంచి పాత్రలు చేస్తూనే, దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది’’ అని నటుడు, నిర్మాత, ‘సంతోషం’ సినీ వారప్రతిక అధినేత సురేష్ కొండేటి అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మంగళవారం సురేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నటుడిగా ఎదగాలని 1992లో హైదరాబాద్ వచ్చాను. అయితే నాలో నటుడికి కావాల్సిన లక్షణాలు అప్పటికి లేవని తెలుసుకున్నాను. ఆ తర్వాత కృష్ణా పత్రికలో చేరాను. అక్కడ్నుంచి మరో దినపత్రికలో సినిమా జర్నలిస్ట్‌గా చే రాను. (చదవండి: ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్ క్రిష్) రాజేంద్రప్రసాద్‌గారి ‘రాంబంటు’ (1995)లో మొదటిసారి నటుడిగా కనిపించాను. రాజమౌళి ‘స్టూడెంట్ నం. 1’ డిస్ట్రిబ్యూటర్‌గా నా తొలి సినిమా.. ఇప్పటివరకూ 75 చిత్రాలు పంపిణీ చేశాను. ‘ప్రేమిస్తే’తో విజయవంతమైన నిర్మాతగా మారాను. ఆ తర్వాత ‘పిజ్జా’ వంటి హిట్ మూవీతో పాటు దాదాపు 15 చిత్రాలు అందించాను. నటుడిగా ఇటీవల ‘దేవినేని’ సినిమాలో సెకండ్ లీడ్ హీరో చేశాను. ఆ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో ఒక్క సినిమాలో అయినా హీరోగా చేయాలనే కోరిక ఉంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘ఎర్రచీర’ చిత్రాల్లో నటించాను. నేను నిర్మిస్తున్న ఓ సినిమాలోనూ నటిస్తున్నాను. డైరెక్షన్.. యాక్షన్.. ఈ రెంటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నవంబర్ 14న ‘సంతోషం’ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం’’ అన్నారు. -
డాక్టర్ సాబ్ టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్లో శోభన్ హీరోగా డీఎస్బీ దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమాకు సమర్ఫిస్తుండటం విశేషం. కాగా శుక్రవారం ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్‌లో ఒకరు శోభన్. అయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ మూవీ లోగోని నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ ఈ సినిమాను సమర్పిస్తుండం సినిమాపై అంచనాలను పెంచుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మూవీ యూనిట్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన నా మిత్రుడు సురేష్‌కు ధన్యవాదాలు. తన శిష్యులైనా శోభన్, సురేష్‌లు ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రాశాన్నారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆయన అన్నారు. అలాగే దర్శకుడు డీఎస్బీ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. తనను నమ్మి ఈ సినిమాని తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ కృతజ్ఞతలు తెలిపారు. మా కోరికను మన్నించి ఈ సినిమా టైటిట్‌ను ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందన్నారు. హీరో శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే హీరోగా చేయాలనిపించిందని అన్నాడు. ఈ సినిమా చేయడానికి కారణం విక్కీ మాస్టర్ అని, అయన సినిమాకు మొదటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నాడు. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉందని, సినిమా బాగా చేశాడని తెలిపాడు. అలాగే తమ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. -
సూపర్ కప్పు ఎవరిది?
‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప. -
సైకో థ్రిల్లర్
అనిల్, జాస్మిన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శ్రీ శ్రీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై టీఎమ్ఎస్ ఆచార్య నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆధ్యాత్మిక గురువు హరిప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎమ్ఎస్ ఆచార్య మాట్లాడుతూ– ‘‘ఆసక్తికర కథతో గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నిర్మాతగా ఇది మా మొదటి ప్రయత్నం’’ అన్నారు. ‘‘ఆసక్తికరమైన మలుపులతో సాగే సైకో థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు గోపాల్ రెడ్డి కాచిడి. ‘‘నాకు హీరోగా అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థ్యాంక్స్’’ అన్నారు అనిల్. ‘‘తెలుగులో ఇది నా రెండో సినిమా’’ అన్నారు సబీనా జాస్మిన్. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: సీతా రామాంజనేయులు ఉప్పతల. -
111 జీవో నేపథ్యంలో....
ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జీవో 111 నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘111’. వీఆర్ దర్శకత్వం వహించనున్నారు. సురేష్ కొండేటి సమర్పణలో వై. రఘునాథరెడ్డి, స్నేహలత ఈ సినిమాని నిర్మించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాజకీయ రాక్షస క్రీడలో రైతులు బలవుతున్నారు. మెతుకునిచ్చి బతుకులు పండించే పచ్చని పల్లెలు కాంక్రీట్ సౌధాలకు సమాధులవుతున్నాయి. జీవోలను అడ్డుపెట్టుకుని నాయకులు, వారి తొత్తులు చేసే దురాగతాలపై ఓ యువకుని తిరుగుబాటు ఫలితమే ఈ ‘111’. హైదరాబాద్ శివారులో జీవో 111 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రభుత్వ జీవోలు ప్రజల మెరుగైన జీవన విధానానికి బలమైన ఆయుధాలవ్వాలని చెప్పే చిత్రమిది. మంచి మేకింగ్ విలువలు, మంచి నటులు, విప్లవాత్మక కథతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: లెండర్ లీ మార్టి. -
సంతోషం ఆగదు
‘‘సంతోషం’ సినీ వారపత్రిక నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పత్రికాధినేత సురేష్ కొండేటి ప్రతి ఏటా ‘సంతోషం’ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేడుక గురించి సురేష్ మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు అనేది ప్రతి ఏటా ఆగస్టు 2న ప్రకటించడం, అదే రోజు కర్టెన్‌రైజర్ ఫంక్షన్ కూడా చేయడం తెలిసిందే. కరోనా వల్ల ఈసారి ఈ ఫంక్షన్ కాస్త ఆలస్యం అవుతుంది. అంతేకానీ సంతోషం వేడుక ఆగదు. కచ్చితంగా ఉంటుంది. సామాజిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పుడు? ఎక్కడ? అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది ఈ ఫంక్షన్లో పేద కళాకారులకు సహాయం చేస్తున్నాం. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న చిత్ర పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసేలా ఈ ఏడాది ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
సినిమా జర్నలిస్ట్‌లకు ఎఫ్సీఏ సాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరిMీ ఐదు వేల రూపాయలు చొప్పున ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (ఎఫ్సీఏ) ఆర్థిక సాయం చేసింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మొత్తం 87 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా సోమవారం ఐదు వేల నగదును బదిలీ చేశారు. ‘‘ఎఫ్సీఏ’ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావుగారి సలహాల మేరకు, హెల్త్ కమిటీ చైర్మన్ రెడ్డి హనుమంతురావు, మురళి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. -
ప్రతి సీన్లో నవ్వు
‘ఏడు చేపల కథ’ ఫేమ్ అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా ‘అంతం’ ఫేమ్ జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫై’. లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్పికే స్టూడియోస్ పతాకంపై జి. చరితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు వీరభద్రం, నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేశారు. అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏడు చేపల కథ’ నటుడిగా నాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘వైఫై’ ఎవర్నీ నిరాశ పర్చదు. ప్రతీ సీన్లో నవ్వించే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ‘‘సమయం కూడా తెలియకుండా సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు’’ అన్నారు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్. ‘‘ఇలాంటి కథలు ఈ జనరేషన్లో రావాలి.. అందరూ చూడాలి’’ అన్నారు చరితారెడ్డి.