‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప.
Comments
Please login to add a commentAdd a comment