Shiva Jonnalagadda
-
సూపర్ కప్పు ఎవరిది?
‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప. -
పోలీస్ శక్తి
వాస్తవ ఘటనల ఆధారంగా కాల్‌మనీ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘పోలీస్ పవర్’. శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు. గుద్దేటి బసవప్ప మేరు మరో నిర్మాత. ఈ చిత్రం ఆడియో వేడుకలో వికలాంగులు, చిన్న పిల్లలకు సైకిల్స్ పంపిణీ చేశారు. ‘‘ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం’’ అని శివ జొన్నలగడ్డ అన్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: అవినాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వసంత. -
మాస్ పోలీస్
‘‘గతంలో దీక్ష, శనిదేవుడు వంటి చిత్రాలు డైరెక్ట్ చేశా. పక్కా మాస్, కమర్షియల్ సినిమా చేయాలని ‘పోలీస్ పవర్’ కథ రాసుకున్నా. కాల్‌మనీ నేపథ్యంలో సాగుతుందీ చిత్రం’’ అని శివ జొన్నలగడ్డ అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీస్ పవర్’. నందినీ కపూర్ కథానాయిక. గుద్దేటి బసవయ్య నిర్మించిన ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, టీజర్‌ను ‘లయన్’ సాయివెంకట్ విడుదల చేశారు. ‘‘గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేశా. ‘దొరతనం మాకొద్దు’, ‘శనిదేవుడు’ వంటి చిత్రాలు నిర్మించాను. శివగారు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ చిత్రం తీశా. ఈనెలలోనే పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్. కుమార్, బాపు.జి, సంగీతం: శివ జొన్నలగడ్డ. -
రైతు నాయకుడు
శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గణేష్’. ది లీడర్.. అనేది ఉప శీర్షిక. ‘‘రైతుబజార్లో రైతులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించే రైతు నాయకుడు ‘గణేష్’ కథ ఇది. పక్కా మాస్ చిత్రమిది. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అన్నారు శివ జొన్నలగడ్డ. చదలవాడ హరిబాబు, చంద్రమోహన్, కాదంబరి కిరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: బాపు. -
శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు
శనీశ్వరుని మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. జ్యోతిష పండితులు శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే పలు శనీశ్వరాలయాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అనిల్ నండూరి స్వర సారథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం. కులమత రహితంగా అందరూ చూడదగ్గ సినిమా ఇదని శివ జొన్నలగడ్డ చెప్పారు. నరసింహరాజు, తెలంగాణ శకుంతల, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, నిర్మాణం: సోని ఫిలింస్.