
మాస్ పోలీస్
‘‘గతంలో దీక్ష, శనిదేవుడు వంటి చిత్రాలు డైరెక్ట్ చేశా. పక్కా మాస్, కమర్షియల్ సినిమా చేయాలని ‘పోలీస్ పవర్’ కథ రాసుకున్నా. కాల్‌మనీ నేపథ్యంలో సాగుతుందీ చిత్రం’’ అని శివ జొన్నలగడ్డ అన్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీస్ పవర్’. నందినీ కపూర్ కథానాయిక. గుద్దేటి బసవయ్య నిర్మించిన ఈ చిత్రం బ్యానర్, టైటిల్ లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, టీజర్‌ను ‘లయన్’ సాయివెంకట్ విడుదల చేశారు. ‘‘గతంలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేశా. ‘దొరతనం మాకొద్దు’, ‘శనిదేవుడు’ వంటి చిత్రాలు నిర్మించాను. శివగారు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ చిత్రం తీశా. ఈనెలలోనే పాటలు, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్. కుమార్, బాపు.జి, సంగీతం: శివ జొన్నలగడ్డ.