meera
-
హీరో బర్త్‌డే.. సంతోషమే లేకుండా పోయింది!
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో బర్త్‌డే నేడు (జూలై 24). పుట్టినరోజు అనగానే ఎవరైనా హుషారుగా ఆనందంగా గడిపేస్తుంటారు. కానీ కుటుంబమే ప్రాణంగా బతికే విజయ్ ఆంటోనికి ఈసారి ఆ భాగ్యం లేకుండా పోయింది. కూతురు చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే కావడంతో మనసు నిండా విషాదం కూరుకుపోయి ఉన్నా పైకి మాత్రం జీవం లేని నవ్వుతో కనిపించాల్సి వస్తోంది.కూతుర్ని పోగొట్టుకుని..గతేడాది సెప్టెంబర్ 19న విజయ్ కూతురు మీరా చెన్నైలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్ల వయసులో ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందని గుండెలవిసేలా రోదించారు. తన బాధను తండ్రితో చెప్తే క్షణాల్లోనే ఆ విచారాన్ని తొలగించి సంతోషం నింపేవాడు. కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటినుంచి విజయ్ దంపతులు కుమిలిపోతూనే ఉన్నారు. తన రెండో కూతురి కోసం ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు. ఆ విషాదం నుంచి బయటపడని ఆంటోనిఇటీవల వచ్చిన రోమియో సినిమాలోనూ నిర్మాతగా భార్య ఫాతిమా పేరుకు బదులు చనిపోయిన కూతురు మీరా పేరును వాడారు. అక్కడే వారు గడిచిన విషాదం నుంచి బయటపడలేదని తెలుస్తోంది. కాగా విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాక్క ముక్క పాటకుగానూ కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్న తొలి సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. నాన్ మూవీతో హీరోగా మారాడు. తర్వాత సంగీతాన్ని పక్కన పెట్టి హీరోగానే ఎక్కువ సినిమాలు చేశాడు.చదవండి: పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్‌బీ కండీషన్? -
హీరోయిన్ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)
-
తెలుగు సినిమా హీరోయిన్.. ముచ్చటగా మూడో పెళ్లి
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్‌గా పెళ్లివిపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది. అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్ షూటింగ్లో లవ్..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్‌గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి -
'మీరా బంగారం..' విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ పోస్ట్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కాసేపు కనిపించకపోతేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది చిన్నవయసులోనే కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు హీరో విజయ్ ఆంటోని దంపతులు. ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మీరా బంగారం.. నవ్వుతూ తుళ్లుతూ కళ్లముందు తిరిగే కూతురు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు విజయ్, అతడి భార్య ఫాతిమా ఆంటోని. తాజాగా ఫాతిమా.. మీరాను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మీరా బంగారం.. ఎందుకింత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం నీ కోసం కాదేమో! నిన్ను కలిసేవరకు.. ఈ చావుబతుకుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ బాధ నాకు తప్పదు. అక్కడ బాగా తిని విశ్రాంతి తీసుకో అమ్మా. లారా(మీరా చెల్లెలు) కూడా నిన్ను ఎంతో మిస్ అవుతోంది..' అంటూ ఎక్స్(ట్విటర్)లో కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా బాధపడకండి మేడమ్ అంటూ నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023 చదవండి: సినీ నటితో 'యానిమల్' నటుడి వివాహం -
అజేయంగా కీర్తిక
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి బి.కీర్తిక ఐదో విజయం సాధించింది. గురువారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో కీర్తిక 44 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై గెలిచింది. ఏడో రౌండ్ తర్వాత నిహిరా కౌల్ (మహారాష్ట్ర), ఆముక్త (ఆంధ్రప్రదేశ్)లతో కలసి కీర్తిక ఆరు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. కీర్తిక ఐదు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... శ్రేయా హిప్పరాగి (మహారాష్ట్ర) 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణకే చెందిన సంహిత పుంగవనం, శివాంశిక 5.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. -
కల్లోల ఇజ్రాయెల్‌లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్‌లో హోమ్ నర్స్‌లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్‌లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్‌పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్‌లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్‌ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్‌లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉంది. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నారు. తాజాగా విజయ్ కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా తన రెండో కుమార్తె లారాను వెంటబెట్టుకుని వెళ్లారు. (ఇదీ చదవండి: ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన) విజయ్ ఆంటోనీ పలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా వారి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోంది. అలా నిత్యం వారిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. ఇప్పటికే విజయ్ నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల భాద్యతలను ఫాతిమానే దగ్గరుండి చూశారు. అలా సినిమా నిర్మాణ రంగంలో ఆమెకు మంచి అనుభవంతో పాటు గుర్తింపు ఉంది. కుమార్తె మీరా మరణం నేపథ్యంలో ఫాతిమా ఆంటోనీ తాజాగా ట్వీట్ చేశారు. మీరాను మరోసారి గుర్తుచేసుకుని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాకు మరింత దగ్గరగా ఉంచుకునే దానిని. కనీసం నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నేను దాచుకునే దాన్ని. ప్రస్తుతం నువ్వు మా మధ్య లేకపోవడంతో ఎప్పుడూ నీ ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా మేము జీవించడం కష్టంగా ఉంది. ఈ అమ్మ- నాన్న దగ్గరకి తిరిగి వచ్చేయ్ అమ్మా.. నీ కోసం నీ చెల్లెలు ఎదురుచూస్తూనే ఉంది. లవ్ యు తంగం.' అని తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. If I’d known u will live only for 16 yrs, I would have just kept u very very close to me,not even shown you to the sun and moon,am drowning and dying with ur thoughts,can’t live without you ,come back to babba and amma.laara keeps waiting for u,love u Thangam@vijayantony pic.twitter.com/7PAQ5Ji9qp — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) October 9, 2023 -
కుమార్తె మృతిపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. కన్నీరు పెట్టిస్తున్న వ్యాఖ్యలు
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్(ట్విటర్) వేదికగా తాజాగా స్పందించారు. అందులో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటు తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్) 'నా పెద్ద కుమార్తె ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి వెళ్లింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి ఆమె వెళ్లిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. ఎందుకంటే తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.' అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. మీరా మృతిపై అందరి హృదయాలను కదిలించే నోట్‌ను విజయ్ ఆంటోనీ షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా దానిని చూసి కంటతడి పెడుతున్నారు. నిర్మాత ఫాతిమాను విజయ్ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బలవన్మరణానికి పాల్పడిన పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. -
ఆ భయమే మీరాను ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? ఏం జరిగింది?
కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం. ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’. இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li — SS Music (@SSMusicTweet) September 21, 2023 இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo — Monkey Cinema (@monkey_cinema) September 21, 2023 -
విజయ్ ఆంటోని కూతురి సూసైడ్ నోట్ వైరల్?
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే ఆ బాధను జీర్ణించుకోవడం ఎవరితరమూ కాదు. కళ్ల ముందు ఆడుతూపాడుతూ తిరిగే కూతురు ఇక కనిపించదన్న వాస్తవాన్ని క్షణమైనా భరించలేరు పేరెంట్స్. అయినా సరే, భగవంతుడు కొందరికి అటువంటి శిక్షలే వేస్తాడు. భరించలేని బాధను ఇస్తాడు. హీరో విజయ్ ఆంటోని సైతం ప్రస్తుతం అదే బాధతో కుమిలిపోతున్నాడు. మిస్ యూ ఆల్ ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కదా! సెప్టెంబర్ 19న తెల్లవారుజామున ఉరి వేసుకుని మరణించింది. అయితే ఆమె గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెన్నై పోలీసులు ఆమె రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మీరా.. తన స్నేహితులను, టీచర్స్‌ను మిస్ అవుతానని రాసుకొచ్చింది. తన మరణం వల్ల కుటుంబం బాధపడుతుందని పేర్కొంది. చివర్లో.. లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసింది . ఈ లెటర్‌ను ఆమె నోట్‌బుక్‌లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? ఇక విగతజీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది ఆమె తల్లి ఫాతిమా. 'నిన్ను నా గర్భంలో మోశానమ్మా.. నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా?' అని కంటికి ధారగా ఏడ్చేసింది. కూతురితో చివరిసారిగా ఫాతిమా మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చీకటి అంటే భయమున్న మీరా ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? నిజంగానే డిప్రెషన్లో ఉందా? మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: మీరాకు కన్నీటి వీడ్కోలు.. భౌతికకాయం చూసి విద్యార్థుల కంటతడి! 3 ఇడియట్స్ నటుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య -
ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. మీరా సూసైడ్ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విజయ్ ఆంటోని కూతురు సూసైడ్.. టీనేజీ వయసులోనే డిప్రెషన్
ఈ మధ్య కాలంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయిన పీలింగ్‌తో డిప్రెషన్‌కు లోవుతున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకసారి ఒంటితనంతో బాధపడ్డవాళ్లే. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామనో, పేదరికం, ప్రేమలో విఫలమవ్వడం, ఉద్యోగం లేకపోవడం, పనిలో ఒత్తిడి.. ఇలా ఎన్నో కారణాలు డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచంలో సగటున 40 శాతం మంది ‘డిప్రెషన్’ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో జరిగిపోతుందని, తమతో ఎవరూ లేరన్న ఒంటిరి ఫీలింగ్ మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించడమే అతిపెద్ద తప్పు. మీలాగే లక్షలాది మంది ఏదో ఒక కారణంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతమాత్రాన ప్రాణం తీసుకోకూడదు. సాధారణంగా సినిమా స్టార్స్‌ని చూడగానే,వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ యటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల వాళ్లు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దీపికా పదుకొణె దగ్గర్నుంచి కాజల్ అగర్వాల్ వరకు డిప్రెషన్ నుంచి బయటపడినవాళ్లే. ఇదేం అంత పెద్ద సమస్య కాదు, అలా అని తేలిగ్గా తీసుకునే విషయం కూడా కాదు. సమస్యను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డాం అనేది ముఖ్యం. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్యహత్యతో కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురయ్యింది. టీనేజీ వయసులోనే డిప్రెషన్‌తో మీరా సూసైడ్ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. కానీ అంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మీరా డిప్రెషన్‌కు చదువల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ర్యాంకుల వెంట పడిపోయి పేరెంట్స్ పిల్లలను ప్రెజర్ చేయొద్దని సూచించారు. అలాంటిది ఈరోజు ఆయన కూతురే డిప్రెషన్‌తో చనిపోవడం తీరని విషాదాన్ని నింపుతుంది. Stay strong @vijayantony brother#VijayAntony| #Meera| #MeeraVijayAntonypic.twitter.com/01Fbf3RtvN — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 మీరా ఆ నిర్ణయం తీసుకునేముందు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేదని, చిన్న వయసులోనే మీరా కఠిన నిర్ణయం తీసుకుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్ ఆంటోని ఓ సందర్భంలో.. ఏడేళ్ల వయసులోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడని, దీంతో తన తల్లి ఎంతో కష్టపడి తనను పెంచిందని, ఆత్మహత్య సమస్యకు ఎప్పుడూ పరిష్కారం కాదని విజయ్ పేర్కొన్నారు. కానీ విధి ఎంత విచిత్రమో.. ఆరోజు తండ్రి సూసైడ్ చేసుకోగా, ఇప్పుడు కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కొన్ని సార్లు జీవితం మనల్ని పరీక్షిస్తుందో, శిక్షిస్తుందో అర్ధం కాదు, స్టే స్ట్రాంగ్ విజయ్ సార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 ఒత్తిడి.. ఎలా బయటపడాలి? ఒంటరితనం వల్ల రకరకాల ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫ్రెండ్స్, ఫ్యామిలితో సమయం గడపండి. ఏదో సాధించాలని తపన అందరిలో ఉంటుంది. కానీ దానికి టైం కూడా రావాలి. కష్టపడిన వెంటనే ఫలితం ఆశించకండి. సమయంతో పాటూ అన్నీ సర్దుకుంటాయి అని పాజిటివ్‌గా ఉండండి. ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్త హాబీని ఏర్పరుచుకోండి. సంగీతం, డ్యాన్స్, మ్యాజిక్.. ఇలా ఏదో ఒక వ్యాపకాన్ని ఇష్టంతో చేయండి. ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నించినా ఒంటరితనం, డిప్రెషన్ నుంచి బయటరాలేమనుకుంటే వెంటనే సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అప్పుడు ఆయన.. ఇప్పుడు కన్న కూతురు.. తీవ్ర విషాదంలో విజయ్!
తమిళ నటుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు మీరా(16) ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్న మీరాను ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన కుటుంబాన్నే కాదు.. మొత్తం కోలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. కాగా.. మీరా చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: కొత్త సినిమా ప్రకటించిన దర్శకధీరుడు.. డైరెక్టర్ ఎవరంటే?) అయితే ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి సంబంధించిన పాత ఇంటర్వ్యూ నెట్టింట వైరలవుతోంది. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలతో రిలేషన్‌పై పలు సూచనలు చేశారు. తాను ఎప్పుడు కూడా తన కుమార్తెను చదువు విషయంలో బలవంతం చేయలేదని అన్నారు. పిల్లల చదువుల గురించి ఇంటి దగ్గర ఎప్పుడు చర్చించలేదని తెలిపారు. కానీ పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. విజయ్ మాట్లాడుతూ..'నేను నా కూతురిని ఆమె ఇష్టం వచ్చినట్లు ఉండేలా ప్రోత్సహిస్తాను. ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పలేదు. ఏదైనా సరే తన ఇష్టానికే వదిలేశా. చదవు విషయంలో చాలా ఫ్రీడమ్ ఇస్తా. చదవాలనుకుంటే చదవచ్చు. అది తన ఇష్టం. నేను చదువు విషయంలో పిల్లలను బలవంతం చేయను.' అని అన్నారు. మనం పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని విజయ్ సూచించారు. దీనివల్ల పేరేంట్స్, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందన్నారు. (ఇది చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..! ) పిల్లల గురించి అంతలా ఆలోచించే విజయ్ ఆంటోని ఇంట్లో ఇలా జరగడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురిచేసింది. ఆయనకు లారా అనే చిన్న కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు, ఆయన అభిమానులు ధైర్యంగా ఉండాలని మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మీరా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. చికిత్స కూడా తీసుకుంటోందని ఆంటోనీ సన్నిహితులు ఒకరు వెల్లడించారు. కానీ ఆంటోనీ తండ్రి కూడా అతనికి ఏడు సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. విజయ్ తండ్రి ఆత్మహత్యపై గతంలో మాట్లాడుతూ..' జీవితంలో ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలే శరణ్యం కాదు. వారి పిల్లల గురించి తలచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపింది. అయితే అది ఎంత అనేది నాకు మాత్రమే తెలుసు. మా నాన్న పోయిన తర్వాత మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. అందుకే ఆత్మహత్యల గురించి వింటే నాకు చాలా బాధేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల గురించి నాకు తెలుసు. చాలా కష్టాలు చూశా. కానీ ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు." అని అన్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 -
తెల్లారితే పెళ్లి,అంతలోనే ఇలా.. సస్పెన్స్ డ్రామాగా 'హలో మీరా'
గార్గేయి యల్లాప్రగడ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘హలో మీరా’. శ్రీనివాసు కాకర్ల దర్శకత్వం వహించారు. జీవన్ కాకర్ల సమర్పణలో డా.లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. ‘‘తెల్లవారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన మీరా పెళ్లి వద్దనుకుని కారులో హైదరాబాద్ బయలుదేరుతుంది. ఆ తర్వాత మీరా పరిస్థితి ఏంటి? అన్నది ఆసక్తిగా ఉంటుంది. సస్పెన్స్ డ్రామా, థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. అతి త్వరలో మూవీ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్. చిన్న, కెమెరా: ప్రశాంత్ కొప్పినీడి. -
యంగ్ టాలెంట్: మధుర స్వర రాగ మీరా
ఒకవైపు హిందుస్థానీ సంగీతం మరోవైపు వెస్ట్రన్ మ్యూజిక్... వెరసి ఆమె పాటకు కొత్త చూపును ఇచ్చాయి. ‘పాట అంటే వాద్యాల ఘోష కాదు... మనల్ని మనం పుస్తకంలా చదువుకోవడం కూడా’ అంటున్న మీరా దేశాయ్ పరిచయం... అమెరికాలో పుట్టి పెరిగినా, తన సంగీత, సాహిత్యాలలో ‘భారతీయత’ ఎక్కడికీ పోలేదు. సందేహం ఉంటే...‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టు బీ లాస్ట్’ ఈపీ(ఎక్స్టెండెడ్ ప్లే)లో పాటలు వినండి చాలు. తల్లిదండ్రులు మీరాకు గుజరాతి భాష నేర్పించారు. చిన్న వయసులోనే ఎన్నో భజనలను తల్లి ద్వారా నేర్చుకుంది. అలా తన మాతృభాషపై ఆసక్తి పెరిగింది, పదిహేడు సంవత్సరాల వయసులో తొలి పాట రాసిన మీరాకు తొలిసారిగా న్యూయార్క్‌లో జరిగిన ఒక సంగీత కచేరిలో హిందుస్థానీ శాస్త్రీయసంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్ను చూసే అదృష్టం దక్కింది. ఆ క్షణమే తనకు హిందుస్థానీ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. ప్రతిరోజూ తన చెవుల్లో హిందుస్థానీ సంగీతం మారుమోగేది. ఎందరు గాయకులో, ఎన్ని ఘరానాలో! హిందుస్థానీ దగ్గరే ఆగిపోలేదు. వెస్ట్రన్ మ్యూజిక్‌లో పదిసంవత్సరాల పాటు శిక్షణ పొందింది. ఫిమేల్ జాజ్ స్టార్స్...నైనా సిమోన్, నోరా జోన్స్, పాప్ సింగర్–సాంగ్ రైటర్స్ సారా బెరిలెస్, టోరీ కెల్లీ...తాను అభిమానించే జాబితాలో చేరిపోయారు. వారి ప్రభావం తన పాటలపై కనిపిస్తుంది. తన డెబ్యూ ఈపి ‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టూ బీ లాస్ట్’ విడుదలైనప్పుడు తనదైన సొంతగొంతు వినిపించింది. రకరకాల సంగీతధోరణుల ప్రభావంతో పెరిగిన మీరాకు అది అంత తేలికైన విషయం కాదు. ‘మనదైన సొంతగొంతు వినిపించాలంటే, కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి రావాలి’ అంటుంది మీరా. పాట అంటే వాయిద్యాల ఘోష కాదు. అందులో ఎమోషన్ డెప్త్ శ్రోతలను హంట్ చేయాలి. అది మీరా పాటల్లో వినిపిస్తుంది. ‘డివైన్’ పాటలో ఇలా రాసింది మీరా... ‘నా జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చదువుకోవాలని ఉంది’ జీవితపుటలను తిరగేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్నలకు సాధికారికమైన సమాధానాలు వెదుక్కోవచ్చు. ఇక ‘డిస్టెన్స్’ పాట దగ్గరికి వస్తే...దూరం పెరగడం అనేది అన్ని విషయాల్లోనూ భారమైన విషయమేమీ కాదు. కొన్ని విషయాల్లో అది శక్తిని ఇచ్చే పని. మనల్ని మనం పునరావిష్కరించుకునే పని. ఎక్కడి వరకో ఎందుకు? మనలోని బద్దకానికి దూరంగా జరిగితే, నిర్మాణరాహిత్యానికి దూరంగా జరిగితే... అదేమీ ప్రతికూలత కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే. వెదుక్కుంటూ వెళితే మన మూలాల జాడ దొరుకుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లడం ద్వారా తన రూట్స్లోకి వెళ్లింది మీరా. ‘ఆల్ మై లైఫ్ ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సెర్చింగ్ ఫర్ సమ్‌థింగ్...’ అని తన ‘డివైన్’ లో చరణాలను పాడుకునే ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల మీరా. ఆమె వెదుకుతున్నది అక్కడ ఏమైనా కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే అది కచ్చితంగా ఆమె పాటలో వినిపిస్తుంది. వేచిచూద్దాం. -
సూపర్ కప్పు ఎవరిది?
‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప. -
ఊపిరి తీసే యువతి ఊపిరాడని బతుకు
22 ఏళ్ళ చేత్నా గృద్ధా మల్లిక్– కోల్‌కతా స్ట్రాండ్ రోడ్లో ఉండే కూలిపోతున్న ఇంట్లో, తన కుటుంబంతో పాటు ఉంటుంది. పక్కనే ‘నిమ్తలా ఘాట్’ ఉండటం వల్ల, ఇంటిముందు జరిగే శవయాత్రలను చూస్తూనే పెరుగుతుంది. ‘నేతితో తయారవుతున్న మిఠాయిల వాసనా, కాలుతున్న శవాల దుర్గంధం మిళితమై, మమ్మల్ని చుట్టు ముడతాయి’ అంటుంది. ఆమె తండ్రయిన 88 ఏళ్ళ ఫణిభూషణ్, ‘451 మందిని ఉరి తీసిన’ తలారి. ‘భారత్, భారత్ అవక ముందే– క్రీ.పూ. 420 ఏళ్ళ నుంచీ’ ఆ వృత్తి చేపట్టిన కుటుంబం వారిది. ‘తలారి కిరాయి హంతకుడు కాడు. దేశం కోసం ప్రాణం తీసే బాధ్యతగల ఆఫీసర్’ అంటాడు ఫణిభూషణ్. అయితే, దేశంలో ఉరితీతలు తగ్గిపోయినప్పుడు అతని ఆదాయమూ పోతుంది. మలయాళం నుండి ఇంగ్లిష్ లోకి అనువదించబడిన ‘హాంగ్వుమన్’ నవల్లో కనపడే సంఘటనలూ, పాత్రలూ కూడా కోల్కతావే. తనకి పడిన ఉరి శిక్షకని జతిందర్నాథ్ బెనర్జీ పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీ నిరాకరించబడ్డంతో, నవల మొదలవుతుంది. ఫణిభూషణ్ ముసలివాడైపోయినందువల్ల బెనర్జీని ఉరి తీయడానికి అతను ఇక పనికి రాడని ప్రభుత్వం నిర్ధారిస్తుంది. కుటుంబ కలహాల్లో అవిటివాడైన ఫణిభూషణ్ కొడుకు రామూ, వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోలేడు కనుక ఆ బాధ్యత చేత్నా చేపట్టాలంటూ, న్యూస్ చానల్లో పని చేసే మిత్రా– పానెల్ డిబేట్లు పెడతాడు. ‘భారతదేశానికీ, సమస్త లోకానికీ కూడా చేత్నా– స్త్రీ శక్తికీ, ఆత్మ గౌరవానికీ చిహ్నం’ అన్న ప్రచారం మొదలవుతుంది. కూతురు పొందుతున్న ఖ్యాతిని తండ్రి డబ్బు చేసుకుంటాడు. ఆమె షోలో ఏమి మాట్లాడాలో తనే నిర్ణయిస్తాడు. చేత్నాను ఉపయోగించుకుంటూ పైకి రావాలనుకున్న మిత్రా,‘చేతూ, యీ షో నాకు గౌరవం తెచ్చిపెట్టేది. ఇలాగే చెప్పాలి’ అని పోరుతాడు. చేత్నా మిత్రాతో ప్రేమలో పడి, ‘యీ ప్రేమ నా మెడ చుట్టూ– మూడవ వెన్నుపూసకీ, నాలుగవ దానికీ మధ్య బిగుసుకుంటున్న ఉచ్చు’ అనుకుంటుంది. ఒకసారి ‘రామూ దా’ ముందు, మిత్రా నవ్వుతూ నిలుచుని ఫొటోలు తీసుకుంటుండగా చూసి, అతని కెమెరాను పగలగొడుతుంది. ‘బెనర్జీని ఉరి తీస్తే అతని శరీరపు బరువు నా వేళ్ళనుండి శాశ్వతంగా వేళ్ళాడుతుంది’ అనే ఆలోచనలు చేత్నాను చుట్టుముడతాయి. కానీ, ‘ఇతరులతో మాట్లాడుతూనే, నా దుపట్టా కొసతో ఉచ్చు చుట్టానని గుర్తించగలిగేదాన్ని. దుపట్టా పాతదై, పిగిలిపోతున్నా– ఉచ్చు మాత్రం పరిపూర్ణంగా పడేది. మా కుటుంబాల్లో పుట్టిన శిశువులు కూడా నేర్చుకునే మొదటి పనే ఇది కదా!’ అన్న తన నేపథ్యం గుర్తొచ్చి, తన సహజమైన పిరికితనాన్ని వదిలించుకుంటుంది. తండ్రి దాష్టీకం, ప్రేమికుడి దోపిడీతనం జ్ఞాపకానికి తెచ్చుకుని– తన తొలి ఉరితీతను అద్భుతంగా నిర్వహిస్తుంది. భారతదేశపు మొట్టమొదటి ‘తలారిస్త్రీ’ అయి, ‘ఇన్నాళ్ళూ జీవితం, భూమిపైన ఊగుతూ ఉండేది. క్షణమాత్రంలో తాడు తెగింది. నేనూ ప్రదర్శనకి పెట్టబడ్డాను’ అంటుంది. రచయిత్రి కె.ఆర్. మీరా చూపే యీ లోకంలో ప్రస్ఫుటంగా కనబడేది కటిక దారిద్య్రం. మల్లిక్ పూర్వీకుల సాహసపు ఉరితీతలూ, సమకాలీన సంఘటనలూ ఉన్న ఈ నవల, ‘నిజమైన బాధితులు ఎవరు? నేరస్తులా లేక తరాలకొద్దీ వారిని ఉరి తీసిన మల్లిక్లా?’ అన్న సందేహాలను కలిగిస్తుంది. మరొకరి ప్రాణం తీయడం వల్ల చేత్నా ఎదగడం అన్నది కలవర పెట్టే వైరుధ్యం. జె.దేవిక ఇంగ్లిష్‌లోకి అనువదించిన యీ నవల– తమ వృత్తిని ఒక కళగా భావిస్తూ, గర్వించే తలారుల చీకటి లోకంలోకి పాఠకులను తీసికెళ్తుంది. పుస్తకంలో కనపడే స్త్రీవాదంలో కర్కశత్వం ఉండదు. ఆంగ్ల నవలను పెంగ్విన్, 2016లో ప్రచురించింది. తొలి ప్రచురణ 2012లో. వి. కృష్ణ వేణి -
వైకల్యానికి నేస్తం.. ఆమె ఆత్మవిశ్వాసం..
జూబ్లీహిల్స్: వైకల్యంతో బాధపడేవారిని చూసి కొందరు ‘అయ్యో పాపం’ అని జాలి చూపిస్తారు. మరి కొందరు తోచిన సాయం చేస్తారు. ఓ రోజు సాయం చేసినందుకే ఎంతో ఆనందపడిపోతాం.. కానీ అలాంటివారి బతుకుకు భరోసా ఇచ్చేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఈ కోవకు చెందినవారే సామాజికవేత్త, సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మీరా షెనాయ్. వికలాంగులకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఇతరుల్లా వారూ కుటుంబానికి ఆసరాగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆత్మవిశ్వాసంతో బతిలేలా జీవితాలను మారుస్తున్నారు. ఇందుకోసం మీరా సమాజంతో ఓ యుద్ధమే చేశారు. వారి జీవితాల్లో వెలుగు నింపాలని.. మన దేశంలో సుమారుగా 2 కోట్ల మంది వివిధ రకాల శారీరక వైకల్యం, అంధత్వంతో బాధపడుతున్నారని ఓ అంచనా. వారిలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. సరైన అవగాహన, ప్రోత్సాహం లేక చాలా మంది చీకట్లోనే మగ్గిపోవడం బాధాకరం. వీరిలో సాధ్యమైనంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి మేం పనిచేస్తున్నాం. మా ఈ కృషికి యాక్సిస్ బ్యాంక్ ఫౌండేషన్, నాస్కామ్ ఫౌండేషన్, కాప్ జెమినీ తదితర కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. 2020 నాటికి కనీసం లక్ష మందికి శిక్షణ, ఉద్యోగాలు లభించేలా ప్రణాళిక రూపొందించాం. – మీరా షెనాయ్, ‘యూత్ 4 జాబ్స్’ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అభిరుచి.. సంస్థల అవసరం మేరకు.. మీరా జర్నలిజం చదువుకున్నారు. కార్పొరేట్ రంగంతో సంబంధాలున్నాయి. అంతేగాక ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్‌కు సారధ్యం వహించిన అనుభవమూ ఉంది. తన అనుభవాన్ని.. పరిచయాలను వికలాంగులకు చేయూతనిచ్చేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం ‘యూత్ 4 జాబ్స్’ సంస్థను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తున్నారు. అంతేకాదు.. తనుకున్న కార్పొరేట్ పరిచయాలతో ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పైతం ఇప్పిస్తున్నారు. శారీరక వైకల్యం ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నా మీరా దారి చూపిస్తున్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి ప్రభుత్వ అ«ధికారుల సాయం సైతం తీసుకుంటున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పూర్తిచేసి 18 నుంచి 31 ఏళ్ల లోపు వయసుండి 40 శాతం శారీరక వైకల్యం, 50 శాతం మూగ, చెవుడు ఉన్నవారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి కంటే తక్కువ చదువుకున్నవారి కోసం ఇటీవల ప్రత్యేక శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభించారు. వీరికి స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై రెండు నెలలు శిక్షణ ఉంటుంది. వారికి హాస్టల్, భోజనం వసతి కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకొన్నవారికి వివిధ కంపెనీల్లో వారి అభిరుచి, అవసరం బట్టి ఉపాధి చూపుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంటర్లో శిక్షణ పొందినవారు గూగుల్, అమెజాన్, వెబైనర్, యాక్సిస్ బ్యాంక్, లైఫ్‌స్టైల్, కేఎఫ్‌సీ, వింద్యా టెక్నాలజీస్, గీతాంజలి జెమ్స్ తదితర కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి కనీస ప్రారంభ వేతనం రూ.10 వేలకు తగ్గకుండా ఉంది. సిటీలో మొదలై..ఆపై విస్తరించి.. మీరా షెనాయ్ 2012లో ‘యూత్ 4 జాబ్స్’ సంస్ధను ఏసీ గార్డ్స్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 22 శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది వికలాంగులు ఉద్యోగాలు పొందారు. ఇక్కడ సుశిక్షితులైన టీచర్లతో పాటు కార్పొరేట్ ప్రముఖులు, సామాజికవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు స్వచ్ఛందంగా తరగతులు చెబుతుంటారు. ఈ సంస్థ రాకతో వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చినట్టయింది. నా జీవితమే మారిపోయింది.. మాది వరంగల్. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాను. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ వరకే చదివాను. యూత్ 4 జాబ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. ప్రస్తుతం వింద్యా టెక్నాలజీస్‌లో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తున్నా. శిక్షణ నా జీవితాన్ని మార్చేసింది. నాలో ఆత్మవిశ్వాసం నింపింది. నాకు ఉపాధి చూపించింది. – అశ్వని, కంప్యూటర్ ఆపరేటర్, వింద్యా టెక్నాలజీస్ భవిష్యత్ పై నమ్మకం పెరిగింది.. మాది లంగర్‌హౌజ్. మాటలు రావు. కనీసం వినబడదు. డిగ్రీ వరకు చదివుకున్నా. స్నేహితుల ద్వారా ఈ సంస్థలో చేరాను. గతంలో నిరాశ నిస్పృహల్లో బతికిన నాకు శిక్షణ పూర్తి పాజిటివ్ శక్తినిచ్చింది. త్వరలో శిక్షణ పూర్తి చేసుకొని మంచి జాబ్ సాధిస్తానని పూర్తి నమ్మకంతో ఉన్నాను. (ఈ వివరాలు సైగలతో చెప్పింది) – కె.ప్రియాంక (మూగ, చెవిటి), లంగర్‌హౌజ్ ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలు ఫోర్బ్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ,స్టాన్ఫోర్డ్ సోషల్ రివ్యూ తదితర జర్నల్స్ యూత్ 4 జాబ్స్ చేస్తున్న సేవలను కొనియాడాయి. మీరా ఆలోచనతో వికలాంగుల జీవితాల్లో వచ్చిన మార్పును ప్రపంచానికి చాటిచెప్పాయి -
కూతురు చూపిన దారి
స్కూల్‌కు వెళ్లే రోజుల్లో మీరా తరచు ఈవ్–టీజింగ్‌కు గురయ్యేది. కుటుంబసభ్యుల తోడు లేకుండా బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీలో బి.కామ్ చదువుకుంటున్న మీరా ‘సేఫర్ సిటీస్ గర్ల్స్ క్లబ్’ గురించి మొదట విన్నప్పుడు పెద్దగా ఆసక్తి చూపలేదు. ‘జెండర్ ఈక్వాలిటీ’ ‘ఉమెన్ ఫ్రెండ్లీ పబ్లిక్ స్పేస్’ అంశంపై ‘సేఫర్ సిటీస్ గర్ల్స్ క్లబ్’ నిర్వహించిన ఒక సమావేశానికి హాజరైన మీరా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. ‘సేఫర్ సిటీస్ గర్ల్స్ క్లబ్’లో చేరింది. అనతి కాలంలోనే మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాలపై పనిచేయడం మొదలుపెట్టింది. స్థానిక నాయకులు, అధికారులను కూడా ఈ పనుల్లో భాగస్వాములను చేసింది. ఒకప్పుడు మీరా ఉండే ప్రాంతంలో వీధిదీపాలు ఉండేవి కాదు. ఇప్పుడు వీధిదీపాలతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటయ్యాయి. స్థానిక పాఠశాలల దగ్గర సెక్యూరిటీ గార్డ్లను ఏర్పాటు చేయడం మొదలైంది. ఇదంతా ఒక ఎత్తయితే మీరాకు తండ్రి నుంచి మద్దతు లభించడం మరో ఎత్తు. ఆటోడ్రైవర్ అయిన మీరా తండ్రి తన కూతురుతో పాటు వర్క్‌షాప్‌లలో పాల్గొనేవాడు. మహిళలకు సంబంధించిన భద్రత, మర్యాదల గురించి డ్రైవర్లకు ఈ వర్క్‌షాప్‌లో అవగాహన పరుస్తారు. మహిళల హక్కుల గురించి ప్రచారం చేసే కార్యకర్తగా మాత్రమే కాకుండా తోటి డ్రైవర్లకు మహిళా ప్రయాణికుల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు చెప్పడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు మీరా తండ్రి. సేఫర్ సిటీస్ గర్ల్స్ క్లబ్ ‘సేఫ్ స్పేస్ ఫర్ వుమెన్’ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మహిళాభద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే స్థలాలను గుర్తిస్తుంది. ‘సేఫ్ స్పేస్ ఫర్ వుమెన్’ జాబితాలో తొలి పేరుగా మీరా తండ్రికి చెందిన ఆటోరిక్షా నమోదైంది.ఇప్పుడు తండ్రితో పాటు తల్లి కూడా మీరా చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కమ్యూనిటీ స్థాయిలోని ‘చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ’లో చురుగ్గా పాల్గొంటోంది. లింగవివక్షపై ఇంటి నుంచే పోరాడాలి అని ప్రచారం చేస్తోంది.‘‘సేఫర్ సిటీస్ గర్ల్స్ క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. ఆత్మస్థైర్యం పెరిగింది’’ అంటుంది మీరా.‘ఒక్కరు కదిలితే...కుటుంబం కదులుతుంది.. సమాజం కదులుతుంది’ అనే మాటకు నిలువెత్తు ఉదాహరణ మీరా.ఇలాంటి మీరాలు మరింత మంది ముందుకు వస్తే ప్రతి నగరం... మహిళా భద్రతకు భరోసాను ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
ప్రేతసౌధం
మిస్టరీ * అది ఓ ప్రఖ్యాతి చెందిన సౌథం * అందులో అడుగడుగునా భయం * ఆ భయానికి ఏమిటి కారణం? వాషింగ్టన్ డీసీ... కిటికీ దగ్గర నిలబడి తదేకంగా బయటకు చూస్తున్నాడా వ్యక్తి. వేసవి కావడంతో వెన్నెల విరబూసింది. చీకటిని దూరంగా తరిమి కొడుతోంది. ఆకాశమంతా అందంగా పరుచుకున్న నక్షత్రాలు, వాటి మధ్యలో హుందాగా నిలబడిన చందమామ... చూడటానికే ఎంతో మనోహరంగా ఉందా దృశ్యం. అందుకే తదేకంగా చూసి పరవశిస్తున్నాడా వ్యక్తి. అంతలో పనివాడు వచ్చాడు. ‘‘సర్... స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి’’ అని వినయంగా అన్నాడు. సరే అన్నట్టు తలూపి కిటికీ దగ్గర్నుంచి ఇవతలకు వచ్చాడాయన. పనివాడు అందించిన టవల్‌ను తీసుకుని బాత్రూమ్లోకి నడిచాడు. పది నిమిషాల్లో స్నానం ముగించి బయటకు వచ్చాడు. తడి ఒంటిని మెత్తని టర్కీ టవల్‌తో తుడుచుకుని నైట్ గౌన్ వేసుకున్నాడు. ఒంటికి పౌడర్ పూసుకున్నాడు. అద్దం ముందు నిలబడి దువ్వెనతో తల దువ్వుకుంటున్నాడు. ఇంతలో వెనుక ఏదో అలికిడి అయినట్టనిపించింది. గదిలో తను తప్ప ఎవరో లేరే, మరి ఆ అలికిడి ఏమిటి అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. మంచం మీద కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. చేతిలోని దువ్వెనను డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ‘‘నమస్తే మిస్టర్ ప్రెసిడెంట్. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడు సౌమ్యంగా. అవతలి వ్యక్తి మాట్లాడలేదు. హుందాగా తల పంకించాడు. అందంగా నవ్వాడు. మరుక్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఉలిక్కిపడ్డాడాయన. ఏదో ట్రాన్స్ లోంచి బయట పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. గదంతా పరికించి చూశాడు. ఎక్కడా ఆయన లేడు. జరిగిందేమిటో అర్థమైంది. వెంటనే వెన్నులో వణుకు పుట్టింది. క్షణాల్లో ఆ వణుకు ఒళ్లంతా పాకింది. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని గబగబా బయటకు పరుగుదీశాడు. ‘‘ఏం జరిగింది సర్... ఎందుకలా కంగారు పడుతున్నారు?’’... ఎదురు వచ్చిన మేనేజర్ అడిగాడు. ఆ వ్యక్తి కాసేపు మాట్లాడలేకపోయాడు. వణుకుతూ నిలబడిపోయాడు. తర్వాత ఎప్పటికో తడారిపోయిన గొంతును సవరించుకుని అన్నాడు... ‘‘నేను ఈ గదిలో పడుకోను. వేరే గది ఏర్పాటు చేయండి.’’ మేనేజర్‌కి అర్థం కాలేదు. ‘‘ఏం సర్. ఇక్కడ ఏర్పాట్లు బాలేదా? క్షమించండి. ఇప్పుడే అన్నీ సరి చేయిస్తాను’’ బతిమాలు తున్నట్టుగా అన్నాడు. ఆయన వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ‘‘అవసరం లేదు. వేరే రూమ్ ఇవ్వండి’’ అంటూ వడివడిగా హాల్లోకి వెళ్లిపోయాడు. ఏం జరిగిందో, ఆయన ఎందుకలా వణుకుతున్నాడో ఎంతకీ అంతు పట్టలేదు మేనేజర్‌కి. కానీ గుచ్చిగుచ్చి అడగలేడు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది మామూలు వ్యక్తి కాదు... బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్. అతిగా ప్రశ్నలు వేస్తే అతిథిగా వచ్చిన ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆయన కోసం వేరే గది ఏర్పాటు చేశాడు. కానీ నిజానికి ఏం జరిగిందో అర్థమై ఉంటే అతడు కూడా అవాక్కయ్యేవాడు. భయంతో బిక్కచచ్చేవాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది? చర్చిల్ అంతగా ఎందుకు భయపడ్డారు? ఎందుకంటే... అక్కడ గదిలో, ఆయన మంచం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎవరో కాదు... అబ్రహాం లింకన్. కాదు కాదు... ఆయన ఆత్మ. లింకన్ చనిపోయి అప్పటికే చాలాకాలం అయ్యింది. కానీ ఆ విషయం చర్చిల్‌కి స్ఫురించలేదు. ఓ గొప్ప వ్యక్తిని చూసిన ఆనందంలో అనాలోచితంగా ఆయన్ని పలకరించారు. తర్వాతగానీ వాస్తవం బోధపడలేదు. లింకన్ మరణం గుర్తుకొచ్చాక ఇక కాలు నిలబడలేదు. గుండె దడ ఆగలేదు. నిజానికీ అనుభవం చర్చిల్‌కు మాత్రమే ఎదురు కాలేదు. అమెరికా అధ్యక్షుడి నివాసగృహంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైట్ హౌస్... ఎంతోమందికి భయానక అనుభవాలను రుచి చూపించింది. ఎందరో ప్రముఖులకు నిద్రలేని రాతుల్ని మిగిల్చింది. కారణం... ఆ భవంతి నిండా ఉన్న ఆత్మలు. వ్యవహారిక భాషలో చెప్పాలంటే... దెయ్యాలు! ధవళకాంతులతో, అత్యాధునిక సౌకర్యాలతో విలసిల్లుతుంది వైట్ హౌస్. అమెరికా అధ్యక్షుడు నివసించడానికని ఈ భవంతిని అత్యంత అందంగా తీర్చి దిద్దారు డిజైనర్లు. అధ్యక్షుడి హోదాలో ఇక్కడ యేళ్ల పాటు నివసించారు ఎంతో మంది ప్రముఖులు. అయితే ఎవరూ ఊహించిన విధంగా వైట్ హౌస్ కాస్తా ఘోస్ట్ హౌస్‌గా మారింది. ఆ భవంతి నిండా దెయ్యాలు తిరుగుతున్నాయంటూ పలువురు చెప్పసాగారు. చెప్పినవారు మామూలు వాళ్లయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. కానీ అతిథులుగా వచ్చిన ఇతర దేశాల నేతలు, ప్రముఖులు సైతం దెయ్యాల్ని చూసి జడుసుకున్నారు. కొందరు భయంతో వణికారు. కొందరైతే కళ్లు తిరిగి పడిపోయారు. దానికి తోడు అక్కడ నివసిస్తోన్న అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులకు కూడా తరచూ దెయ్యాలు హాయ్ చెబుతూ ఉండటంతో వైట్ హౌస్ ఘోస్ట్ హౌస్ అయ్యిందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ అక్కడ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా??? వైట్ హౌస్‌లో అత్యంత ఫేమస్ దెయ్యం... అబ్రహాం లింకన్‌ది. ఆయన ఆత్మను తొలిసారి చూసింది... అమెరికా మాజీ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ భార్య గ్రేస్. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఒకసారి అతిథిగా వచ్చిన నెదర్లాండ్స్ రాణి కూడా లింకన్ ఆత్మను చూసి హడలిపోయింది. కళ్లు తిరిగి పడిపోయింది. రూజ్వెల్ట్ భార్యకి వ్యక్తిగత పరిచారిక అయిన మేరీ ఈబన్ అయితే లింకన్ ఆత్మను చూసి జడుసుకుని మంచం పట్టింది. విన్స్టన్ చర్చిల్‌కి కూడా లింకన్ దర్శనమివ్వడంతో ఆయన ఆ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇలా ఇంతమంది తమ అనుభవాలు చెప్పడంతో... లింకన్ దెయ్యమయ్యారన్న విషయం రూఢి అయిపోయింది. అది మాత్రమే కాదు. లింకన్ మృతదేహాన్ని ఊరేగించిన రైలు కూడా దెయ్యమైందని చాలామంది అంటుంటారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం లింకన్ శవయాత్ర జరిగిన రోజున ఆ రైలు కనిపిస్తూ ఉంటుందని, అది ఆ రోజులాగే అలంకరించి ఉంటుందని, యాత్ర మధ్యలో ఆగిన ఒక స్టేషన్లో కొద్ది క్షణాలు కనిపించి మాయమైపోతూ ఉంటుందని దాన్ని చూసిన ఎంతోమంది చెప్పారు. దాంతో లింకన్ ఘోస్ట్ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. నిజానికి లింకన్ మాత్రమే కాదు... టైఫాయిడ్‌తో చనిపోయిన లింకన్ పదకొండేళ్ల కొడుకు విల్లీ కూడా దెయ్యమయ్యాడని అంటుంటారు. అతని ఆత్మ కూడా వైట్ హౌస్‌లో చాలామందికి కనిపించిందట! ఇక తర్వాతి స్థానం అబిగలీ ఆడమ్స్ది. అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ భార్య అబిగలీ. ఆమెకు తూర్పువైపున ఉన్న గది అంటే చాలా ఇష్టం. ఆ గదిలో ఇప్పటికీ ఆమె ఆత్మ ఎంతోమందికి కనిపిస్తూనే ఉంటుందట. అప్పటిలాగే తలపై క్యాప్ పెట్టుకుని, లేస్ శాలువా కప్పుకుని ఉంటారట అబిగలీ. ఆమె ఇంట్లో తిరుగుతూ ఉండటం చాలామంది అధ్యక్షులు సైతం చూశారు. అమెరికాను పాలించిన జేమ్స్ మ్యాడిసన్ భార్య డాలీ కూడా దెయ్యమై వైట్ హౌస్‌లో సంచరిస్తున్నారని ఎంతోమంది చెప్పారు. డాలీకి గులాబీలంటే చాలా ఇష్టం. దాంతో వైట్ హౌస్‌లో ఓ అందమైన గులాబీ తోటను నాటారామె. ఎక్కువగా దానిలోనే గడిపేవారు. చనిపోయాక కూడా అదే తోటలో తెల్లని గౌను వేసుకుని తిరగసాగారు. ఆమె చనిపోయిన వంద సంవత్సరాల తర్వాత నాటి అధ్యక్షుడి భార్య ఎలెన్ విల్సన్ పాడయిన గులాబీ తోటను తవ్వించేయా లని అనుకున్నారు. తీరా పనివాళ్లు తవ్వడం ప్రారంభించేసరికి డాలీ ఆత్మ అడ్డుపడింది. తోట జోలికి రావొద్దని, దాన్ని తవ్వితే ఊరుకోనని భయ పెట్టడంతో పనివాళ్లు వణికిపోయి పారిపోయారట! అలాగే అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్, లింకన్ భార్య మేరీ టాడ్, మరో అధ్యక్షుడికి అత్తగారైన మేరీ తదితరుల ఆత్మలు కూడా తరచుగా వైట్ హౌస్‌లో కనిపిస్తుంటాయని వినికిడి. ఇవన్నీ నిజమేనా అంటే నిజమే అనేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా వైట్ హౌస్‌లో దెయ్యాలను చూశారు. భయానక అనుభవాలతో బెదిరిపోయారు. అందుకే బల్ల గుద్ది చెప్తున్నారు అది నిజమేనని. కానీ ఆధునిక భావాలు కలవారు మాత్రం ఆ మాటల్ని కొట్టి పారేస్తున్నారు. ఎన్నో యేళ్ల ఘన చరిత్ర ఉన్న వైట్ హౌస్ ప్రతిష్టని దెయ్యాల పేరుతో దిగజార్చడం సబబు కాదు అని ఆగ్రహిస్తున్నారు. మరి ఈ రెండు వాదనల్లో ఏది వాస్తవం? వైట్ హౌస్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా?? అది శ్వేత సౌధమా? ప్రేతసౌధమా?? - మీరా -
నటి మీరాకు అరెస్ట్ వారెంట్
లాహోర్: ఆమె అసలు పేరు ఇర్తిజా రూబాబ్ చాలా మందికి తెలియకపోవచ్చు. మీరా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమాలు, నాటకరంగం, టీవీ.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ అభినయించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్న పాకిస్థానీ నటి మీరా ప్రస్తుతం కష్టాల్లో చిక్కుకుంది. లాహోర్ కోర్టు శుక్రవారం ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేసింది. ఇంతకూ ఆమె చేసిన నేరం ఏమంటే.. కొన్నేళ్ల కిందట కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే మీరా.. అతీఖుర్ రహమాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అయితే గత కొద్దికాలంగా వారిద్దరికీ పొసగడంలేదు. దీంతో వేరుగా ఉంటున్నారు. ఈలోపే వేరొక వ్యక్తిని రెండోపెళ్లి చేసుకుంది. మీరా నిర్ణయానికి ఖిన్నుడైన మొదటి భర్త .. తనకు విడాకుటు ఇవ్వకుండానే మీరా వేరొక వ్యక్తిరిని పెళ్లాడటం నేరమని, అందుకుగానూ ఆమెను తగినవిధంగా శిక్షించాలని కోర్టులో దావావేశాడు. పిటిషన్‌ను స్వీకరించిన లాహోర్ స్థానిక కోర్టు విచారణకు హాజరుకావలసిందిగా గత నెలలో మీరాకు నోటీసులు పంపింది. మీరా మాత్రం ఆ నోటీసులను పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి మీరాను అదుపులోకి తీసుకోవాల్సిందిగా నాన్ బెయిలబుల్ అరెస్టువారెంట్ జారీచేశారు. సెప్టెంబర్ 17లోగా తన ముందు మీరాను హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. ఈ తరం వారిలో బాలీవుడ్ లో నటించిన మొట్టమొదటి పాకిస్థానీ నటి మీరాయే కావడం విశేషం. 2005లో ఆమె నటించిన 'నజర్' సినిమా అనేక సంచలనాలు సృష్టించింది.