తమిళ నటుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు మీరా(16) ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్న మీరాను ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన కుటుంబాన్నే కాదు.. మొత్తం కోలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. కాగా.. మీరా చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: కొత్త సినిమా ప్రకటించిన దర్శకధీరుడు.. డైరెక్టర్ ఎవరంటే?)
అయితే ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి సంబంధించిన పాత ఇంటర్వ్యూ నెట్టింట వైరలవుతోంది. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలతో రిలేషన్‌పై పలు సూచనలు చేశారు. తాను ఎప్పుడు కూడా తన కుమార్తెను చదువు విషయంలో బలవంతం చేయలేదని అన్నారు. పిల్లల చదువుల గురించి ఇంటి దగ్గర ఎప్పుడు చర్చించలేదని తెలిపారు. కానీ పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు.
విజయ్ మాట్లాడుతూ..'నేను నా కూతురిని ఆమె ఇష్టం వచ్చినట్లు ఉండేలా ప్రోత్సహిస్తాను. ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పలేదు. ఏదైనా సరే తన ఇష్టానికే వదిలేశా. చదవు విషయంలో చాలా ఫ్రీడమ్ ఇస్తా. చదవాలనుకుంటే చదవచ్చు. అది తన ఇష్టం. నేను చదువు విషయంలో పిల్లలను బలవంతం చేయను.' అని అన్నారు. మనం పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని విజయ్ సూచించారు. దీనివల్ల పేరేంట్స్, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందన్నారు.
(ఇది చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..! )
పిల్లల గురించి అంతలా ఆలోచించే విజయ్ ఆంటోని ఇంట్లో ఇలా జరగడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురిచేసింది. ఆయనకు లారా అనే చిన్న కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు, ఆయన అభిమానులు ధైర్యంగా ఉండాలని మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మీరా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. చికిత్స కూడా తీసుకుంటోందని ఆంటోనీ సన్నిహితులు ఒకరు వెల్లడించారు. కానీ ఆంటోనీ తండ్రి కూడా అతనికి ఏడు సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
విజయ్ తండ్రి ఆత్మహత్యపై గతంలో మాట్లాడుతూ..' జీవితంలో ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలే శరణ్యం కాదు. వారి పిల్లల గురించి తలచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపింది. అయితే అది ఎంత అనేది నాకు మాత్రమే తెలుసు. మా నాన్న పోయిన తర్వాత మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. అందుకే ఆత్మహత్యల గురించి వింటే నాకు చాలా బాధేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల గురించి నాకు తెలుసు. చాలా కష్టాలు చూశా. కానీ ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు." అని అన్నారు.
#VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta
— SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023
Comments
Please login to add a commentAdd a comment