బిచ్చగాడు సినిమాతో తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో బర్త్‌డే నేడు (జూలై 24). పుట్టినరోజు అనగానే ఎవరైనా హుషారుగా ఆనందంగా గడిపేస్తుంటారు. కానీ కుటుంబమే ప్రాణంగా బతికే విజయ్ ఆంటోనికి ఈసారి ఆ భాగ్యం లేకుండా పోయింది. కూతురు చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే కావడంతో మనసు నిండా విషాదం కూరుకుపోయి ఉన్నా పైకి మాత్రం జీవం లేని నవ్వుతో కనిపించాల్సి వస్తోంది.
కూతుర్ని పోగొట్టుకుని..
గతేడాది సెప్టెంబర్ 19న విజయ్ కూతురు మీరా చెన్నైలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్ల వయసులో ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందని గుండెలవిసేలా రోదించారు. తన బాధను తండ్రితో చెప్తే క్షణాల్లోనే ఆ విచారాన్ని తొలగించి సంతోషం నింపేవాడు. కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటినుంచి విజయ్ దంపతులు కుమిలిపోతూనే ఉన్నారు. తన రెండో కూతురి కోసం ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు.
ఆ విషాదం నుంచి బయటపడని ఆంటోని
ఇటీవల వచ్చిన రోమియో సినిమాలోనూ నిర్మాతగా భార్య ఫాతిమా పేరుకు బదులు చనిపోయిన కూతురు మీరా పేరును వాడారు. అక్కడే వారు గడిచిన విషాదం నుంచి బయటపడలేదని తెలుస్తోంది. కాగా విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాక్క ముక్క పాటకుగానూ కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్న తొలి సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. నాన్ మూవీతో హీరోగా మారాడు. తర్వాత సంగీతాన్ని పక్కన పెట్టి హీరోగానే ఎక్కువ సినిమాలు చేశాడు.
చదవండి: పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్‌బీ కండీషన్?
Comments
Please login to add a commentAdd a comment