
పెళ్లయ్యాక భార్య ఇంటిపట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని ఆంక్షలు పెట్టేవారు చాలామంది! అందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడట! ఈ విషయాన్ని ఆయన సతీమణి, నటి జయా బచ్చన్ వెల్లడించింది. అలాగే తన పెళ్లి ముచ్చట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మేము అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలన్నాం. అదే నెల ఎందుకు ఎంచుకున్నామంటే అప్పటికి నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిపోతాయని!

ప్రతిరోజూ షూటింగ్స్‌కి వద్దు
అమితాబ్ నాతో ఏమన్నాడంటే.. ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు పని చేసే భార్య నాకొద్దు. అలా అని నిన్ను సినిమాలు మానేయమని చెప్పడం లేదు. కానీ ప్రతిరోజు షూటింగ్స్‌కే సమయం కేటాయించొద్దని అంటున్నాను. నీకు కరెక్ట్ అనిపించిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకో, నచ్చినవాళ్లతోనే సినిమాలు చేయు అని సలహా ఇచ్చాడు.

ఒప్పుకోలేదని జూన్‌లో పెళ్లి
అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్న మేము జూన్‌లోనే వివాహంతో ఒక్కటయ్యాం. అందుకు ఓ కారణముంది. మేమిద్దం జంటగా నటించిన జంజీర్ సినిమా సక్సెస్‌ను ఆనందిస్తూ ఓ ట్రిప్‌కు వెళ్లాలుకున్నాం. అయితే జంటగా వెళ్లేందుకు అమితాబ్ కుటుంబం ఒప్పుకోలేదు. మనం పెళ్లి చేసుకుంటేగానీ హాలీడేకు కలిసి వెళ్లనిచ్చేలా లేరన్నాడు. అలాగైతే అక్టోబర్‌దాకా ఆగడమెందుకు? ఈ జూన్‌లోనే పెళ్లి చేసుకుందామన్నాను. దానికంటే ముందు మా పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్పాను.
నాన్నకు ఇష్టం లేదు
అలా మా నాన్నను కలిసి విషయం చెప్పాడు. కానీ ఆయనకు మేము పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తర్వాత ఎలాగోలా మా పెళ్లి జరిగిపోయింది అని జయ తెలిపింది. తన మనవరాలు నవ్య నంద నిర్వహించే 'వాట్ ద హెల్ నవ్య' అనే పాడ్‌కాస్ట్‌లో ఈ సంగతులను చెప్పుకొచ్చింది. అయితే దశాబ్దం క్రితం ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్నది జయ నిర్ణయమేనని తెలిపాడు. సినిమాకు బదులు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.
గొప్ప స్టార్‌గా..
కాగా పెళ్లి తర్వాత బిగ్ బీ ఎవరూ ఊహించనంత గొప్ప స్టార్ అయ్యాడు. జయ తన కుటుంబానికే సమయం కేటాయించి గృహిణిగా మిగిలిపోయింది. కుమారుడు అభిషేక్, కూతురు శ్వేతకు కావాల్సినవి సమకూరుస్తూ అమ్మ బాధ్యతను నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment