కన్నడ బుల్లితెర దర్శకుడు వినోద్ దొండే మరణవార్త టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. జూలై 20న ఆయన తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తున్న ఆయన అశోక్ బ్లేడ్ అనే సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సినిమా షూటింగ్ 90 శాతం వరకు పూర్తయింది. కానీ అంతలోనే ఆయన ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలవరపరిచింది.
పెరిగిపోయిన బడ్జెట్
తొలి సినిమా కోసం చేసిన అప్పులే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ నిర్మాత వర్ధన్ హరి వెల్లడించాడు. వర్ధన్ మాట్లాడుతూ.. '1970 బ్యాక్‌డ్రాప్‌లో అశోక బ్లేడ్ సినిమా తీస్తున్నాం. సతీశ్ నినాశం హీరోగా నటిస్తున్నాడు. ఇది వినోద్ డ్రీమ్ ప్రాజెక్ట్. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభించాం. నిజానికి 45 రోజులే అనుకున్నాం. కానీ 87 రోజుల వరకు షూటింగ్ జరిగింది. రూ.1.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. అది కూడా పెరుగుతూనే వస్తోంది. మళ్లీ ఇప్పుడు కొన్ని సన్నివేశాలను, ఓ పాటను, ఫైట్ సీన్‌ను రీషూట్ చేయాలనుకున్నాం.
రూ.3 కోట్ల అప్పు
ఇదంతా చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. దాని గురించి వినోద్ ఎక్కువగా కంగారుపడ్డాడు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాం.. ఇప్పుడెలా అని తనలో తానే మథనపడ్డాడు. మేము ఇంకో నిర్మాతను కలిసి సాయం కోరగా ఆయన సానుకూలంగా స్పందించాడు. అలా దీనికి పరిష్కారం కనుగొన్నాం. ఆ మీటింగ్ తర్వాత జూలై 19న రాత్రి వినోద్‌ను ఇంటి దగ్గర దిగబెట్టాను. కానీ తర్వాతిరోజే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం కోసం వివేక్ రూ.3 కోట్ల అప్పు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment