Jaya Bachchan
-
మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే.. -
వాళ్లు గొప్ప నటులు!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలది నటనేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆరోపించారు. వారి నటనా పటిమకు అన్ని అవార్డులూ ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాం«దీ, ఇతర కాంగ్రెస్, విపక్షాల ఎంపీల తోపులాటలో గాయపడ్డట్టు బీజేపీ సభ్యులు ప్రతాప్‌చంద్ర సారంగీ, ముకేశ్ రాజ్‌పుత్ చెప్పడం తెలిసిందే. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ ఆరోపించారు.శుక్రవారం విపక్షాల ఆందోళన సందర్భంగా జయ మీడియాతో మాట్లాడుతూ వారి తీరును తీవ్రంగా ఆక్షేపించారు. వాళ్లకంటే మెరుగైన నటులను తన కెరీర్లోనే చూడలేదంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘రాజ్‌పుత్‌కు తొలుత చిన్న బ్యాండేజీ వేశారు. తర్వాత దాని సైజు పెరిగింది. చివరికి చూస్తే ఐసీయూలో తేలారు. ఎంత అద్భుతమైన నటనో!’’ అంటూ దుయ్యబట్టారు. జయ విమర్శలపై బీజేపీ మండిపడింది. ‘‘బాధితులను వదిలి నిందితుని పక్షం వహించడమా? సమాజ్‌వాదీ పార్టీ సంస్కృతికి, విపక్ష ఇండియా కూటమి సంస్కృతికి ఇది మరో నిదర్శనం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. -
జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై రూమర్స్
సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాడురి(94) అనారోగ్యంతో కన్నుమూశారంటూ వార్తలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె భోపాల్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం! ఈ వ్యవహారంపై బచ్చన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉందికాగా ఇందిరా భాడురి.. భోపాల్‌లోని శ్యామల హిల్స్ ఏరియా అన్సల్ అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త, జర్నలిస్ట్ తరుణ్ భాడురి 1996లో కన్నుమూశారు. ఈ దంపతులకు జయ, రీతా, నీతా అని ముగ్గురు సంతానం.చదవండి: సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్ -
వంకర బుద్ధుల పెద్దలు
ఏం చదివితే ఏమి? ఏ పదవిలో కూర్చుంటే ఏమి? పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకున్నప్పుడు ప్రతి ఒక్కడూ ఒక మనువే అవుతాడు. ఇందుకు రాజ్యసభలో జయాబచ్చన్ పట్ల చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహారశైలే ఒక ఉదాహరణ.ప్రజలందరి స్వేచ్ఛా సమానత్వాలను కాపాడటానికి కృషి చేసే చట్టసభల్లో మహిళా సభ్యులు అవమానాలకు, వివక్షలకు గురి కావడం భారతదేశంలో చాలా సహజంగా మారిపోయింది, చర్చించవలసిన విషయం కాకుండా పోయింది. ఇందిరాగాంధీ, జయ లలిత, సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీతో సహా రాష్ట్రాల మహిళా శాసనసభ్యులు అనేకమంది ఇలాంటి వాటిని ఎదుర్కొన్నవారే. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, రెండు దశాబ్దాలుగా భారత పార్లమెంటేరియన్; ఆస్తులు, హోదాలు, కుటుంబపు దన్ను, సామాజిక ఆధిపత్య స్థానంలో ఉన్న జయాబచ్చన్ కూడా రాజ్యసభలో తన పేరును వ్యంగ్యంగా కాక గౌరవంగా పిలవడం కోసం పోరాటం చేస్తోంది. ‘తోటి సభ్యురాలి పేరుకి విలువ ఇవ్వనివారు, మా హక్కులను ఎలా కాపాడతారని’ ప్రజలు ప్రశ్నిస్తే చట్టసభలు ఏమని సమాధానం ఇస్తాయి? మొన్నటి రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తను మాట్లాడ టానికి అవకాశం ఇమ్మని కోరిన జయను ఉద్దేశించి– ‘ఇపుడు జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారని’ ధన్‌ఖడ్ అన్నారు. ‘అమితాబ్’ పేరుని ఒత్తి పిలవడంతో, అందులోని వ్యంగ్యాన్ని జయ గుర్తించి అందుకు అభ్యంతరం చెప్పింది. అప్పటికి అది నాలుగోసారి జయ పేరుని ధన్‌ఖడ్ ఆ తీరులో పలకడం! తనని జయాబచ్చన్ అని మాత్రమే పిలవమని ప్రతిసారీ ఆయనకు చెబుతూనే ఉంది. తను భర్త చాటు భార్యను కాననీ, స్త్రీగా తన ఉనికిని గుర్తించాలని స్పష్టంగా చెప్పింది. ఒక స్త్రీ, అందునా ప్రతిపక్షంలో ఉన్న స్త్రీ కచ్చితంగా చెప్పడం ఎంతటి ఉదారులకైనా నచ్చు తుందా! ఎన్నికల అఫిడవిట్లో జయ పేరు ‘జయా అమితాబ్ బచ్చన్’ అని ఉంటుంది. అందుకే అలా పిలిచానని ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యుల పేర్లన్నీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే పిలవడం లేదు కదా! దీన్ని బట్టి చూస్తే జయని రెచ్చగొట్టడానికే పదేపదే అలా పిలిచారు. అయితే పేరు పిలవడం కేవలం సాంకేతిక విషయం కాదు. పైకి మామూలుగా కనిపించే మాటకు మనం అద్దే స్వరం ద్వారా ఉద్దేశించిన అర్థం మారి పోవచ్చు. తనొక కళాకారిణిననీ, ఎదుటివారి హావభావాలు తనకి ఇట్టే తెలిసిపోతాయనీ, ‘పిలిచిపుడు మీ టోన్ బాలేద’నీ చెప్పింది జయ. చట్టసభల్లో సభాధ్యక్షులు ఎలా వ్యవహరించాలి అన్నదానికి మనకి కొన్ని సంప్ర దాయాలు ఉన్నాయి. చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నిక అయినా సరే సభలో ఉన్న అన్ని పార్టీలు, సభ్యుల పట్ల తటస్థ వైఖరితో వ్యవహరించాలి. కానీ జగదీప్ ధన్‌ఖడ్ సభా నిర్వహణ చాలా స్పష్టంగా ఒక పక్షం వైపు పనిచేస్తూనే ఉంది. ఆయన ముందుగానే ప్రతిపక్ష సభ్యులతో వాదం వేసుకుని అధికారపార్టీ సభ్యుల పని సులువు చేస్తారు. దేశ ప్రజలందరికీ ఆదర్శమైన వ్యక్తిత్వంతో ఉండాల్సిన మనిషి, పరుషమైన భాష, వ్యంగ్యపు హావభావాలు, కటుత్వం, ఆధిపత్యపు మొగ్గు, సభా సంప్రదాయాలను పట్టించుకోకపోవడం ద్వారా ప్రతిపక్ష సభ్యుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. తను కళాకారిణిని కాబట్టి హావభావాలు గ్రహించానని చెప్పడం, ‘మనం కొలీగ్స్ కదా’ అని జయ అనడంతో ధన్‌ఖడ్ ద్వంద్వానికి గురయ్యారు. ‘మీరు సెలబ్రెటీ అయితే ఏమిటి, సభలో అందరూ ఒక్కటే’ అన్న మరుక్షణమే ‘మనం ఒకటి ఎలా అవుతాం! అధ్యక్ష స్థానానికి విలువ ఇవ్వరా!’ అంటూ ధన్‌ఖడ్ పెద్దస్వరంతో మాట్లాడడం రాజ్యసభ ప్రసారాలు చూసినవారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. జయకి సోనియాగాంధీ మద్దతుగా నిలబడింది. ధన్‌ఖడ్ స్వభావం గురించి చెబుతూ సభ్యులను తరచుగా ‘శూన్యబుద్ధి’ అంటారని, మాట్లాడుతుంటే ‘న్యూసెన్స్’ అంటారని జయ చెప్పింది. ఈ సందర్భంలో జయ ప్రస్తావించిన ‘మాటల్లో ధ్వని’ గురించి మాట్లాడుకోవాలి. ‘ఇప్పుడు ఆడవాళ్ళని ఒక మాటని బతకగలమా!’ అన్నది తరచూ వింటున్న మాట. స్త్రీలమీద జరిగే రకరకాల వేధింపులు, దాడులను అరికట్టడానికి కొన్ని చట్టాలు వచ్చాక నిస్సంకోచంగా స్త్రీలను అవమానించడం కొంతమేరకు తగ్గి ఉండవచ్చు. కానీ ఆ మేరకు కొత్త సాధనాలను పితృస్వామ్యం సమకూర్చుకుంటుంది. అందులో ఒకటి ధ్వని గర్భితంగా మాట్లాడటం! తాము వాడే ప్రతీ పదం రాజకీయంగా తప్పులేకుండా చూసుకుని– స్వరంలోని హెచ్చుతగ్గులు, తమకి అవసరమైన పదాలను ఒత్తి పలకడం, హావభావాల ద్వారా వివక్షను చూపడం! రాజ్యసభలో ఈ తెలివైన వివక్షకే జయ గురయింది. దీని వెనుక ఉన్న కారణం ఒక్కటే. ఇప్పటికీ స్త్రీలు రెండవతరగతి పౌరులు! అటువంటివారు చట్టసభల్లోకి వచ్చి మౌనంగా కూర్చోకుండా సవాళ్ళు విసురుతారు, గట్టి గొంతుతో మాట్లాడతారు.అందుకే జేపీ నడ్డా లాంటి వారికి జయలో సభా మర్యాదలు, ప్రజాస్వామిక విలువలు పాటించడం తెలియని గర్వపోతు కనపడింది. స్త్రీలు ఎంతటి స్థానానికి ఎదిగినా వారు సమాజం కళ్ళకు స్త్రీలుగానే కనపడతారు. అందుకే సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోవాలని ఆశిస్తారు. సునీత రెండో పెళ్లి చేసుకోవద్దని డిమాండ్ చేస్తారు. తులసి చందు తన యూట్యూబ్ ఛానెల్ ఆపేయాలని బెదిరిస్తారు. దేశంలోని మామూలు మనుషులంతా ఆ కుస్తీపిల్లని గుండెల్లో పెట్టుకుంటే మతతత్వ వాదులు ఆమె ఒంటి మీది దుస్తులను విప్పాలని చూస్తారు. జయను ఎలా పిలవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
‘జయా అమితాబ్ బచ్చన్’ వివాదం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: ‘జయా అమితాబ్ బచ్చన్’ ప్రస్తావన రాజ్యసభలో మరోసారి గందరగోళాన్ని సృష్టించింది. సమాజ్‌వాదీ ఎంపీ అయిన జయా బచ్చన్‌ను రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జయా అమితాబ్ బచ్చన్‌గా సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే జయా బచ్చన్నుఇప్పటికే రెండు సార్లు ఆ పేరుతో పిలవడం వల్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి ఇదే తంతు పునరావృతం కావడంతో జయా బచ్చన్ అసహనానికి గురయ్యారు. మరోసారి అలా పిలవొద్దని అన్నారు. దీనిపై దన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నాకు పాఠాలు బోధించవద్దు’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా వాకౌట్ చేశాయి. జయా బచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ తర్వాత జయా బచ్చన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అవమానకరమైన అనుభవమని తెలిపారు. అధికార బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. ‘ చైర్మన్ ఏదీ మాట్లాడిన చెల్లుతుందా? ఆయన కూడా మనలంటి ఎంపీనే. ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు.ప్రతిపక్ష నేత (కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే) మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించింది. మైక్ కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం వాడుతుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. ఐదోసారి నేను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు తెలీదా ఏం మాట్లాడాలో..? ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడిన తీరు మహిళలకు అగౌరపరిచేలా ఉంది. దీనిపై క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉన్నారు.కాగా ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనిపై జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అంటూ చెప్పగా.. ‘మహిళలను వారి భర్త పేరుతోనే పిలస్తారా, వారికంటూ స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ మండిపడ్డారు. అనంతరం గత సోమవారం కూడా జయా అమితాబ్ బచ్చన్ అని సంభోధించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. జయా బచ్చన్ అని సంబోధిస్తే సరిపోతుందని అన్నారు.పార్లమెంట్ నిరవధిక వాయిదాపార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్‌వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
భర్త పేరుతో పిలవటంపై ఎంపీ జయా బచ్చన్ అసహనం
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్ నటీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్తతో పేరుతో కాకుండా జయా బచ్చన్ అని పిలిస్తే చాలని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌తో అన్నారు. సోమవారం రాజ్యసభలో ఎస్పీ రాజ్యసభ సభ్యురాలైన ఆమెను మాట్లాడావల్సిందిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్.. ‘శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ, ప్లీజ్’ అని కోరుతారు. అయితే స్పీకర్ పూర్తి పేరుతో పిలవడంపై జయా బచ్చన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని ఆమె స్పీకర్‌కు బదులు ఇచ్చారు. అయితే దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ.. మీపేరు పార్లమెంట్ రికార్డుల్లో అధికారికంగా జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని తెలిపారు. పార్లమెంట్ రికార్డుల్లో ఎలా రాసిఉందో.. అలాగే తాను పిలిచినట్లు డిప్యూటీ స్పీకర్ అన్నారు. అయినప్పటికీ జయా బచ్చన్ అభ్యంతం తెలిపారు. ‘‘ఇది చాలా కొత్తగా ఉంది. మహిళలను వారి భర్తలపేరుతో గుర్తించటం. భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంతం ఉనికి, సాధించిన విజయాలు ఉండవా?’’ అని ఆమె అన్నారు.Watch: "It's a very painful incident and we should not bring politics into the matter," says Samajwadi Party MP Jaya Bachchan on the death of the UPSC student in Old Rajinder Nagar pic.twitter.com/4928QcZoNS— IANS (@ians_india) July 29, 2024అనంతరం ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరదనీరు పోటెత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై మాట్లాడారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో రాజకీయలను తీసుకురాము’ అని జయా బచ్చన్ అన్నారు. -
పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్‌బీ కండీషన్?
పెళ్లయ్యాక భార్య ఇంటిపట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని ఆంక్షలు పెట్టేవారు చాలామంది! అందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడట! ఈ విషయాన్ని ఆయన సతీమణి, నటి జయా బచ్చన్ వెల్లడించింది. అలాగే తన పెళ్లి ముచ్చట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మేము అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలన్నాం. అదే నెల ఎందుకు ఎంచుకున్నామంటే అప్పటికి నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిపోతాయని! ప్రతిరోజూ షూటింగ్స్‌కి వద్దుఅమితాబ్ నాతో ఏమన్నాడంటే.. ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు పని చేసే భార్య నాకొద్దు. అలా అని నిన్ను సినిమాలు మానేయమని చెప్పడం లేదు. కానీ ప్రతిరోజు షూటింగ్స్‌కే సమయం కేటాయించొద్దని అంటున్నాను. నీకు కరెక్ట్ అనిపించిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకో, నచ్చినవాళ్లతోనే సినిమాలు చేయు అని సలహా ఇచ్చాడు.ఒప్పుకోలేదని జూన్‌లో పెళ్లిఅక్టోబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్న మేము జూన్‌లోనే వివాహంతో ఒక్కటయ్యాం. అందుకు ఓ కారణముంది. మేమిద్దం జంటగా నటించిన జంజీర్ సినిమా సక్సెస్‌ను ఆనందిస్తూ ఓ ట్రిప్‌కు వెళ్లాలుకున్నాం. అయితే జంటగా వెళ్లేందుకు అమితాబ్ కుటుంబం ఒప్పుకోలేదు. మనం పెళ్లి చేసుకుంటేగానీ హాలీడేకు కలిసి వెళ్లనిచ్చేలా లేరన్నాడు. అలాగైతే అక్టోబర్‌దాకా ఆగడమెందుకు? ఈ జూన్‌లోనే పెళ్లి చేసుకుందామన్నాను. దానికంటే ముందు మా పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్పాను. నాన్నకు ఇష్టం లేదుఅలా మా నాన్నను కలిసి విషయం చెప్పాడు. కానీ ఆయనకు మేము పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తర్వాత ఎలాగోలా మా పెళ్లి జరిగిపోయింది అని జయ తెలిపింది. తన మనవరాలు నవ్య నంద నిర్వహించే 'వాట్ ద హెల్ నవ్య' అనే పాడ్‌కాస్ట్‌లో ఈ సంగతులను చెప్పుకొచ్చింది. అయితే దశాబ్దం క్రితం ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్నది జయ నిర్ణయమేనని తెలిపాడు. సినిమాకు బదులు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.గొప్ప స్టార్‌గా..కాగా పెళ్లి తర్వాత బిగ్ బీ ఎవరూ ఊహించనంత గొప్ప స్టార్ అయ్యాడు. జయ తన కుటుంబానికే సమయం కేటాయించి గృహిణిగా మిగిలిపోయింది. కుమారుడు అభిషేక్, కూతురు శ్వేతకు కావాల్సినవి సమకూరుస్తూ అమ్మ బాధ్యతను నిర్వహించింది.చదవండి: కోట్ల అప్పు వల్లే ప్రాణాలు తీసుకున్న దర్శకుడు? -
మెగాస్టార్ ఇష్టసఖి..హీరో తల్లి.. హీరోయిన్ అత్త..ఎవరీమె?
-
జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే!
రాజకీయనాయకురాలు, బాలీవుడ్ నటి జయబచ్చన్ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. నటిగానూ అభిమానుల చేత పలు ప్రశంసలు అందుకున్నారు. రాజకీయ నాయకురాలిగా ఆమె ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఏడు పదుల వయసుకు చేరువైనా ఆమె జుట్టు అంతగా మెరవలేదని చెప్పొచ్చు. తనతోటి నటులు జుట్టు రాలిపోయి, ముగ్గబుట్టయ్యే పోయినా.. ఆమె మాత్రం నలభై, యాభైల వయసు మాదిరిగా ఉన్న శిరోజాలను మెయింటైయిన్ చేస్తారు. ఆమె తన శిరోజాలు నెరవకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే చిట్కాను వాట్ ది హెల నవ్య అనే పోడోకాస్ట్ ప్రోగ్రాంలో షేర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రా మూడు తరాలకు చెందిన మహిళల వారి ఆలోచనలను షేర్ చేసుకునే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆమె కూతురు శ్వేతాబచ్చన్, మనవరాలు నవ్వ నందాతో కలసి జయబచ్చన్ తన శిరోజాల సీక్రేట్ని గురించి షేర్ చేసుకున్నారు. తాను జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహజసిద్ధమైన కొబ్బరినూనెని ఉపయోగిస్తానని చెప్పుకొచ్చారు. తమ అమమ్మల కాలం నుంచి ఆకొబ్బరి నూనెతో తయారు చేసే ఆ ఆయిల్నినే వాడతామని అన్నారు. అందువల్లే తన శిరోజాలు ఇంతలా ఆరోగ్యంగా ఉన్నాయని, ఇప్పుడిప్పుడే నెరుస్తుందని చెప్పుకొచ్చారామె. అంతేగాదు ఆ నూనెని ఎలా తయారు చేయాలో కూడా వివరంగా చెప్పారు. ఈ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె కొద్దిగా కరివేపాకులు మెంతులు ఓ కుండ తయారీ విధానం: ఒక కుండలో కొబ్బరి నూనె, కరివేపాకులు, మెంతులు వేసి సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ తర్వాత చల్లారాక వడకట్టి పొడి డబ్బాలో వేసి ఉపయోగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్లో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుని డ్రై అవ్వకుండా తేమగా ఉండేలా చేస్తుంది. పైగా చివర్ల చిట్లిపోకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో ఉపయోగిచే కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. డ్యామేజ్ అయ్యిన జుట్టుని రిపేర్ చేయడంలో సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ఈ మెంతి గింజల్లో ప్రోటీన్లు, నికోటిన్ యాసిడ్లు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. జయబచ్చన్ చెప్పిన ఈ హోం మేడ్ హెయిర్ ఆయిల్ మీ జుట్టు సంరక్షణకు తప్పకు తోడ్పడుతుంది. తప్పక ట్రై చేసి చూడండి. View this post on Instagram A post shared by Mithi Ki Rasoi (@mithi_ki_rasoi) (చదవండి: రక్తంతో జుట్టు రాలు సమస్యకు చెక్!) -
ఆస్తుల వివరాలు వెల్లడించిన జయా బచ్చన్
అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్.. బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ జంట. ఇద్దరిదీ సినిమా బ్యాక్‌గ్రౌండే.. కాకపోతే బిగ్‌బీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్‌గా కొనసాగుతుండగా జయా బచ్చన్ మాత్రం పాలిటిక్స్‌లో రాణిస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈమె ఈ మధ్యే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్ వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022 - 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది. ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్‌బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్ ప్రకటించారు. చదవండి: Valentine's Day 2024: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! -
ఎంపీ జయా బచ్చన్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయబచ్చన్ రాజ్యసభలో శుక్రవారం వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పారు. అమె ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఒక సందర్భంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయితే ఆ విషయాన్ని జయా బచ్చన్ రాజ్యసభ వీడ్కోలు సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ రోజు తాను ప్రవర్తించిన తీరుకు రాజ్య సభ చైర్మన్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాని తెలిపారు. ‘మీరు ఎందుకు ఆవేశపడతారని నన్ను చాలా మంది అడుగుతారు. అది నా తత్వం. నేను సహజమైన ప్రవర్తనను మార్చుకోను. నాకు కొన్ని విషయాలు నచ్చకపోతే లేదా అంగీకరించలేకపోతే వెంటనే కొంత శాంతాన్ని కోల్పోతాను. నా ప్రవర్తన, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నా మాటలను వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారికి నా క్షమాపణలు. నాది క్షణికమైన ఆవేశం తప్పితే.. నాకు ఎవరిని నొప్పించాలని ఉండదు’ అని అన్నారామె. Samajwadi Party MP Jaya Bachchan apologised to the fellow members of the Rajya Sabha during her farewell speech. Watch for more🎥#JayaBachchan #SamajwadiParty #RajyaSabha pic.twitter.com/7AeNPQjDwg — Moneycontrol (@moneycontrolcom) February 9, 2024 వీడియో క్రెడిట్స్: moneycontrol ఇక.. పెద్దల సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల సహకారం, ప్రేమను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేసుకున్నారు. పెద్దల సభలో సదరు సభ్యుల ద్వారా పంచుకున్న జ్ఞానాన్ని తాను ఇక నుంచి మిస్ అవుతానని అన్నారు. రిటైర్ అవుతున్న సభ్యుల వల్ల సభలో కొంత శూన్యత కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. మంగళవారంనాడు సభలో కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నను దాటేవేసే క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్.. జయా బచ్చన్ నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. దీంతో ధన్‌ఖడ్.. సభ్యులకు సమస్యను చెబితే వారు అర్థం చేసుకోగలరని వారేం చిన్న పిల్లలు కాదని అన్నారు. దీంతో జయా.. ఎంపీలను సభలో గౌరవంగా చూడాలని అన్నారు. సభలోని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడాని దాటివేసిన ప్రశ్నను మళ్లీ అడగాలని ధన్‌ఖడ్ అనుమతి ఇచ్చారు. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్!
న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్ జారీ అయ్యింది. ఆప్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్‌కుమార్ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్డీఎఫ్ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. ►తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ►ఇక ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్ 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3, ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్ 2, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్‌గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్భాయ్ రత్వా ఉన్నారు. ►గుజరాత్‌కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది. ►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు. ►పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాసిష్ చక్రవర్తి, మహమ్మద్ నడిముల్ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు. ►బీహార్‌లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ►ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నుంచి అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్‌పాయ్, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్దీప్ రాజ్‌భర్, జీవీఎల్ నరసింహారావు, విజయ్ పాల్ సింగ్ తోమర్, సుధాంషు త్రివేది, హరనాథ్ సింగ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్ పదవీ విరమణ చేస్తున్నారు. ►చత్తీస్‌గఢ్, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేయనున్నారు. ►జార్ఖండ్‌లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు. ►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు. ►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. -
కూతురుతో సహా భర్త ఇంటి నుంచి బయటకొచ్చేసిన ఐశ్వర్య రాయ్
బాలీవుడ్లో అందరూ ఇష్టపడే జంటలలో ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్లు ముందు వరసలో ఉంటారు. 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ ప్రస్తుతం తమ వివాహ విషయంలో చాలా కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ విడిపోతున్నారని పలుమార్లు పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ, వారు దానిపై ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి బాలీవుడ్ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. అవి నిజమేనంటూ బలంగా చెబుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ను తీసుకుని తన భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు కథనాలు వస్తున్నాయి. భర్తతో చాలా కాలంగా విభేదాలు ఉండటంతో అవి ఇక భరించలేనని ఆమె తన అమ్మగారి ఇంటికి చేరుకుందట. అత్తగారి ఇంట్లో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను తల్లి చెప్పుకుందట. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తన అత్తగారు అయిన జయా బచ్చన్‌తో చాలా ఏళ్లుగా కనీసం మాటలు కూడా లేవని ఐశ్వర్య చెప్పినట్లు సమాచారం. ఇదే క్రమంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కూడా విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చిందట. ఇలాంటి గొడవల మధ్య తన కూతురును పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని భావించే ఐశ్వర్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ ఇప్పట్లో విడాకుల వరకు మాత్రం వెళ్లే పరిస్థితి లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక తన వెబ్సైట్లో పేర్కొంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొద్దిరోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తన 50వ పుట్టినరోజు వేడుక జరిగింది. ఆమె తన తల్లి, కుమార్తెతో కలిసి ఈ వేడుకను జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అత్తమామలు ఎవరూ కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అభిషేక్ కూడా చాలా సింపుల్‌గా రెండు ముక్కల్లో ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే కాకుండా ఎంతో ఇష్టంగా ఐశ్వర్య ఇచ్చిన ఉంగరాన్ని కూడా ప్రస్తుతం తను ధరించడం లేదని తెలిసింది. దీంతో వారి అభిమానుల్లో కొంతమేరకు ఆందోళన మొదలైంది. -
ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.. ఏం చేయాలో అర్థం కాలేదు: జయా బచ్చన్
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ పరిచయం అక్కర్లేని పేరు. బీటౌన్‌లో బిగ్ బీగా పేరు సంపాదించుకున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన భార్య జయా బచ్చన్ తమ జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో వచ్చిన కూలీ సినిమా సెట్స్‌లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని తలుచుకుని ఎమోషనలయ్యారు. ఆ క్షణాలు ఇప్పటికీ తన కళ్లముందు కదులుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో దేవున్ని ప్రార్థించడం తప్ప తనకేలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ఇవాళ జయ- అమితాబ్ 50వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) దేవుడిని ప్రార్థించమన్నారు: జయా బచ్చన్ జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'నేను ఆసుపత్రికి వెళ్లగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పాడు. దీంతో నేను ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాం.' అని జయా బచ్చన్ ఆనాటి సంఘటనను వివరించారు. కాగా.. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె శ్వేతా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ జన్మించారు. అసలేం జరిగిందంటే... అమితాబ్ బచ్చన్ 1982 ఆగస్టు 2న కూలీ సెట్స్‌లో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ క్యాంపస్‌లో నటుడు పునీత్ ఇస్సార్‌తో ఫైట్ సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగింది. పొత్తికడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. ఆ సమయంలో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. పలుమార్లు శస్త్రచికిత్సలు చేసినా చికిత్సకు స్పందించలేదు. వెంటిలేటర్‌పై ఉంచేముందు ఆయన కోసం దేవున్ని ప్రార్థించడమే తప్ప ఏం చేయలేమని డాక్టర్ చెప్పారని ఆ రోజు భయానక పరిస్థితిని జయా బచ్చన్ గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి) -
అభ్యంతరకర సీన్.. టచ్ చేసినందుకు విలన్‌ను చితకబాదిన జయ
జయా బచ్చన్.. ఒకప్పుడు హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. అందాల ఆరబోతకు ఓ అడుగు దూరంగా ఉండే ఆమె తన సహజసిద్ధ నటనతో ఎంతోమంది మనసులు గెలుచుకుంది. 1971లో గుడ్డి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. నేడు (ఏప్రిల్ 9) ఆమె పుట్టినరోజు. ఈ రోజు ఆమె 75వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జయా బచ్చన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలను ఆమె మాటల్లోనే.. '1972లో బీఆర్ ఇషారా డైరెక్షన్లో ఏక్ నజర్ సినిమా చేశాను. ఇందులో అమితాబ్ హీరో. ఈ మూవీలో సుధీర్ అనే వ్యక్తి నాపై అత్యాచారం చేయాల్సి ఉంటుంది. నా బట్టలు చింపుకోమన్నారు. నేనేమో కుదరదు, అందుకు అంగీకరించనని తెగేసి చెప్పాను. చాలాసేవు వాదనలు జరిగాయి. నేను ఒప్పుకోకపోతే సినిమా ఆపేస్తానని డైరెక్టర్ హెచ్చరించాడు. నీకు నచ్చింది చేసుకోపో అన్నాను. అదే కనక జరిగితే ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తానని నిర్మాత బెదిరించాడు. ఏదైనా చేసుకో అన్నాను, కానీ అస్సలు తగ్గలేదు. కాదూ, కూడదని బలవంతంగా నాతో ఆ సీన్ చేయిస్తే దాన్ని ఎలా నాశనం చేస్తానో మీరే చూస్తారని వార్నింగ్ ఇచ్చాను. అలా ఆరోజు షూటింగ్ క్యాన్సల్ చేశారు. రెండు రోజులదాకా షూట్ ఊసే ఎత్తలేదు. దీంతో అమితాబ్ జోక్యం చేసుకుని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇది నీ రోల్.. అక్కడేం చెప్తే అది చేయాల్సిందే! చేయనని ఎలా ఎదురుతిరుగుతావు? అన్నాడు. నాకు బట్టలు చింపుకోవడం ఇష్టం లేదు. నేనలా చిరిగిన బట్టలతో స్క్రీన్‌పై కనిపించాలనుకోవడం లేదని బదులిచ్చాను. మొత్తానికి ఎలాగోలా నేనే కొంత వెనక్కు తగ్గాను. అత్యాచార సన్నివేశంలో చాలా సహజంగా నటించమన్నారు. పాపం ఆ విలన్ నా దగ్గరకు రాగానే ఇష్టమొచ్చినట్లు కొట్టాను. దీంతో అతడు నేను ఈ రేప్ సీన్ చేయను అని ఏడుపుముఖం పెట్టాడు' అంటూ నవ్వుతూ ఆనాటి సంఘటనను షేర్ చేసుకుంది జయా బచ్చన్. -
మాధురి దీక్షిత్‌పై అసభ్య పదజాలం.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జయాబచ్చన్
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ షోలో మాధురి దీక్షిత్‌పై చేసిన కామెంట్స్‌పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్ ఐశ్యర్యారాయ్‌తో పోలుస్తూ మాధురీ దీక్షిత్‌ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్‌ను పోలుస్తూ కునాల్ నయ్యర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు అయితే ఈ ఎపిసోడ్‌ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్‌ఫ్లిక్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌పై కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని.. పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. -
తొలిసారి నెగటివ్ రోల్లో ఒకరు.. ఎమోషనల్ కేరెక్టర్లో మరొకరు.. ఇంకా
ఒకరు నెగటివ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదు. ఇంకొకరు కన్నీళ్లు తెప్పించే పాత్రతో వచ్చారు.. అలాంటి పాత్రతో వచ్చినందుకు ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయారామె. మరొకరు కథానాయికగా కనుమరుగై.. చెల్లెలిగా రిటర్న్ అవుతున్నారు. నటనకు ఒక్కసారి బ్రేక్ ఇచ్చాక మళ్లీ నటించాలంటే ఆ క్యారెక్టర్ ఎంతో బలమైనది అయ్యుంటేనే ఆ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవితలకు అలాంటి పాత్రలే దొరికాయి. అందుకే బ్రేక్‌లు తీశారు.. నటిగా మేకప్ వేసుకున్నారు. ఒక్కప్పటి ఈ స్టార్స్ రిటర్న్ కావడం అభిమానులకు ఆనందమే కదా. ఇక ఈ ముగ్గురి చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నెగటివ్‌గా... జయా బచ్చన్ కెరీర్ దాదాపు 60 ఏళ్లు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్లో నటిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశారామె. కెరీర్ ఆరంభంలో ‘గుడ్డి’ (1971)లో చేసిన పాత్రతో ‘గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇమేజ్ తెచ్చుకున్న జయ ఆ తర్వాత ‘జవానీ దివానీ’లో గ్లామరస్ రోల్లో మెప్పించారు. అలాగే అనామిక (1973)లో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి, భేష్ అనిపించుకున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో జయ పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో లేడీ విలన్‌గా కనిపించనున్నారామె. దాదాపు ఏడేళ్ల తర్వాత జయా బచ్చన్ ఒప్పుకున్న చిత్రం ఇది. కరణ్ జోహార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయా బచ్చన్‌తో కరణ్ నెగటివ్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ‘‘నేనా? నన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు?’ అని ఆమె అడిగారు... ‘మీరే చేయాలి’ అంటూ జయాని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కరణ్. ఫైనల్‌గా ‘ఓకే’ అన్నారామె. అయితే ఈ పాత్రని అర్థం చేసుకుని, ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా నటించడానికి జయ కొన్నాళ్లు ఇబ్బందిపడ్డారట. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రలోకి లీనం కాగలిగారని, నెగటివ్ క్యారెక్టర్ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా రూపొందిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. పుష్కర కాలం తర్వాత... పుష్కర కాలం తర్వాత షర్మిలా ఠాగూర్ ఓ సినిమా చేశారు. ఈ నెల 3న విడుదలైన ‘గుల్మోహార్’లో ఆమె ఇంటి పెద్దగా లీడ్ రోల్ చేశారు. గుల్ మోహార్ అనే తమ ఇంటిని అమ్మేసి, తాను వేరే రాష్ట్రానికి వెళతానని ఇంటి పెద్ద కుసుమ్ బాత్రా (షర్మిలా ఠాగూర్ పాత్ర) చెబుతారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ‘బ్రేక్ కే బాద్’ (2010) సినిమా తర్వాత మళ్లీ మంచి పాత్రలు వచ్చేంతవరకూ బ్రేక్ తీసుకోవాలనుకున్నారు షర్మిలా. ‘గుల్మోహార్’లో తన పాత్ర కీలకం కావడంతో పాటు మంచి ఎమోషన్స్ కనబరిచే చాన్స్ ఉన్నందున ఆమె అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, షర్మిలా ఏడుపు ఆపుకోలేకపోయారు. ‘‘పన్నెండేళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో తెరపై కనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఈ సినిమాని మూడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ ఏడ్చాను. అంతగా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యాను’’ అని షర్మిలా పేర్కొన్నారు. చెల్లెలిగా... కథానాయికగా గర్ల్ నెక్ట్స్ డోర్ అనదగ్గ పాత్రల్లో కనిపించారు జీవిత. ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి నటి అనిపించుకున్నారామె. ‘మగాడు’ (1990) తర్వాత నటిగా వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’లో నటించడానికి జీవిత ఒప్పుకున్నారు. ఇందులో ఆమెది రజనీ చెల్లెలి పాత్ర. ‘‘నా కెరీర్లో రజనీ సార్‌తో సినిమా చేయలేదు. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాను. ‘మీరు స్క్రీన్‌పై కనిపించి చాలా రోజులైంది కాబట్టి.. చేస్తే బాగుంటుంది’ అని ఐశ్వర్య అనడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు జీవిత. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె కనిపించనున్న చిత్రం ఇది. కాగా నటిగా ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా ‘గడ్డం గ్యాంగ్, దెయ్యం’ వంటి చిత్రాలను నిర్మించారు. గత ఏడాది ‘శేఖర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు జీవిత. -
సీరియస్ విషయాలే కాస్త సరదాగా!
పాడ్‌కాస్ట్‌లో కడుపుబ్బా నవ్వించే జోక్స్ వినవచ్చు. కమ్మని సంగీతం వినొచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! అయితే మహిళల ఆధ్వర్యంలోని కొన్ని పాడ్‌కాస్ట్‌లు మాత్రం ఎన్నో విషయాలను నీళ్లు నమలకుండా చర్చిస్తున్నాయి. మన గురించి, సమాజం గురించి ఆలోచించడానికి అవసరమైన ప్రేరణ ఇస్తున్నాయి... సీరియస్ విషయాలను సీరియస్‌గానే మాట్లాడుకోవాలనే నిబంధన ఏమీ లేదు. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా కూడా మాట్లాడవచ్చు. ఈ పాయింట్ దగ్గరే విజయం సాధించింది నవ్య నవేలీ నందా. నవ్య పాడ్‌కాస్ట్ ‘వాట్ ది హెల్ నవ్య’ శ్రోతలకు దగ్గర కావడానికి కారణం ‘సీరియస్ విషయాలైనా సరే కాస్త సరదాగా మాట్లాడుకుందాం’ అనే కాన్సెప్ట్. ఈ పాడ్‌కాస్ట్‌కి సంబంధించిన ఒక కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన నవ్య నందా, శ్వేతా నందా, జయబచ్చన్లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడారు. అయితే వారేమీ ఉపదేశం ఇచ్చినట్లు, ఉపన్యాసాలు ఇచ్చినట్లు ఉండదు. సరదాగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ఇరుగుపొరుగుతో సహజంగా సంభాషిస్తున్నట్లుగానే ఉంటుంది. ‘నేను నవ్య అమ్మను మాట్లాడుతున్నాను. ఒక సరదా విషయం మీకు చెప్పుకోవాలని ఉంది’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది శ్వేతా నందా. ‘నేను నవ్య నానీని. మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది’ అని ఊరిస్తుంది జయబచ్చన్. ‘త్రీ లేడీస్’ ‘త్రీ జెనరేషన్స్’ ‘త్రీ పర్స్పెక్టివ్స్’ అంటూ వచ్చిన ప్రోమో ఆకట్టుకొని ఆసక్తి పెంచింది. వ్యాపారం అనేది అనుకున్నంత సులువు కాదు. ఎంత దిగ్గజ వ్యాపారికైనా అడుగడుగునా పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిలో ఏ మేరకు ఉత్తీర్ణత సాధించారనేదానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ‘నో సుగర్ కోట్’ పాడ్‌కాస్ట్ ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోరాటస్ఫూర్తి, అనుసరించాల్సిన వ్యూహాలు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తుంది పూజా దింగ్రా. ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్లతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునేవారిని ఆకట్టుకుంటున్న పాడ్‌కాస్ట్ ఇది. చెఫ్‌గా మంచి పేరు తెచ్చుకున్న పూజా సీజన్వన్లో ఎంతో మంది సక్సెస్ఫుల్ చెఫ్‌లు, ఫుడ్రైటర్స్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నల్లేరుపై నడక అనేది వాస్తవం కాదు. భ్రమ. ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే’ అంటోంది పూజా. మానసిక ఆరోగ్యంలాంటి సీరియస్ విషయాలతో పాటు బ్యాచ్‌లర్ పార్టీలాంటి తేలికపాటి విషయాల గురించి మాట్లాడటానికి ‘రియల్ టాక్ విత్ స్మృతి నొటాని’ పాడ్‌కాస్ట్ వేదిక అవుతుంది. స్మృతి మాట్లాడుతుంటే అప్పుడే పరిచయమైన ఫ్రెండ్ గలగలమని మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సోషల్ మీడియా ధోరణుల గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటుంది స్మృతి. ‘ఫ్యాట్.సో?’ ....పేరు ద్వారానే తన పాడ్‌కాస్ట్ లక్ష్యం ఏమిటో తెలియజేశారు పల్లవినాథ్, అమేయ నాగరాజ్. స్థూలకాయం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు, ఆత్మన్యూనతకు గురయ్యే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపిస్తుంది ఈ పాడ్‌కాస్ట్. ‘మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం దగ్గరవుతుంది. అదొక ఆయుధం అవుతుంది. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇంధనం అవుతుంది’....ఇలాంటి మాటలు ఎన్నో ‘ఫ్యాట్.సో’లో వినిపిస్తాయి. -
పెళ్లి కాకుండా తల్లయినా ఎలాంటి అభ్యంతరం లేదు.. ఆమెపై జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వాట్ ది హెల్ నవ్య పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్న ఆమె ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలపై స్పందించారు. ఈ సందర్భంగా తన మనవరాలికి ఓ అదిరిపోయే సలహా కూడా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడల ప్రకారం తన మనవరాలు నవ్య నవేలి నందా పెళ్లి కాకుండా తల్లయినా ఫర్వాలేదని.. తనకేలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'ఈ తరానికి నేను ఇచ్చే సూచన ఏమిటంటే... నేను చాలా వైద్యపరమైన మార్పులు చాలా చూశాను. ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే రొమాన్స్ చేసుకుంటున్నారు. నవ్య మీరు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. నీకు మంచి స్నేహితుడు ఉండి.. నిన్ను ఇష్టపడి బిడ్డను కలిగి ఉండాలనుకుంటే.. ఈ సమాజంతో పనిలేదు. పెళ్లి కాకుండానే బిడ్డ ఉంటే నాకు ఎలాంటి సమస్య లేదు.' అంటూ మనవరాలు నవ్య నవేలి నందకు సలహా ఇచ్చింది. ఈ ఎపిసోడ్లో అమితాబ్ బచ్చన్‌తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని జయా బచ్చన్ పంచుకున్నారు. మేం మొదట అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే జంజీర్ సక్సెస్ తర్వాత వెకేషన్‌కు వెళ్లే ముందు పెళ్లి చేసుకోవాలని వారి తల్లిదండ్రులు సూచించారని ఆమె చెప్పారు. అందుకే జూన్‌లో పెళ్లి జరిగిందని తెలిపారు. -
జయా బచ్చన్‌కి కరోనా.. నిలిచిపోయిన షూటింగ్
Jaya Bachchan Tests Positive For Covid-19: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి, ప్రముఖ నటి జయా బచ్చన్ కోవిడ్ బారిన పడ్డారు. గతేడాది అమితాబ్, అభిషేక్‌లతో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలు అందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాత్తూ జయాబచ్చన్ మాత్రం తప్పించుకోగలిగారు. అయితే తాజాగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో మాత్రం ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా బీఎంసీ అధికారి దృవీకరించారు.ప్రస్తుతం ఆమె ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం జయా బచ్చన్‌కు కరోనా అని తెలియగానే ఆమె నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’చిత్రం షూటింగ్‌ను ఆపేశారు. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రీతిజింటా, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలె షబానా ఆజ్మీ సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా జయా బచ్చన్‌కి కూడా కోవిడ్ సోకడంతో షూటింగ్ నిలిచిపోయింది. -
వ్యక్తిగత విమర్శలు.. శాపనార్థాలు పెట్టిన జయా బచ్చన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగతున్నాయి. పలు కీలక అంశాలపై విపక్షాలు.. అధికార పార్టీని.. ఇరుకున పెడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ వేదికగా శాపనార్థాలు పెట్టారు. ఓ ఎంపీ జయా బచ్చన్‌ను ఉద్దేశించి.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో.. సహనం కోల్పోయిన జయా బచ్చన్.. సదరు ఎంపీని శపించారు. ఆ వివరాలు.. మాదక ద్రవ్యాల కట్టడికి సంబంధించిన బిల్లుపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సమయంలో జయా బచ్చన్ ఎవరిని టార్గెట్ చేసి.. విమర్శించలేదు కానీ.. ట్రెజరీ బెంచీలపై ఆరోపణలు చేశారు. అంతేకాక అధికారంలో ఉన్న వారు విపక్షాల వాదనలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ) ఈ సందర్భంగా భువనేశ్వర్ కల్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మీరు న్యాయంగా ఉండాలి. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. మీ నుంచి మేం ఏం ఆశిస్తాం.. సభలో ఏం జరుగుతుందో చూస్తున్నారా.. మనం చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఓ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. దానిలో ఉన్న లోటుపాట్లను మనం చర్చించి.. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి’’ అంటూ జయా బచ్చన్ ప్రసంగించసాగారు. (చదవండి: మీ తీరు మారకపోతే.. మార్చాల్సి ఉంటుంది: మోదీ) జయా బచ్చన్ ఇలా మాట్లాడుతుండగా.. బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా.. ఆమె కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించి.. ఆరోపణలు చేశారు. పనామా పేపర్స్ వ్యవహారంలో జయా బచ్చన్ కోడలు.. ఐశ్వర్య రాయ్ ఈడీ విచారణకు హాజరైన సంఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జయా బచ్చన్.. ‘‘త్వరలోనే మీ జీవితంలోకి దుర్దినాలు రాబోతున్నాయి. మీకిదే నా శాపం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. చదవండి: సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి -
KBC: అమితాబ్‌పై జయా బచ్చన్ ఫిర్యాదు!
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో ప్రస్తుతం 13వ సీజన్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సిజన్లో కేబీసీ ఓ 1000వ ఎపిసోడ్ మైలురాయిని చేరుకుంది. అయితే ఈ సందర్భంగా హాట్ సీట్లో కూర్చొని క్విజ్‌లో పాల్గొనడానికి తన కూతురు స్వేతా బచ్చన్, మనవరాలు నవ్వా నవేలీ నందాలను అమిత్ ఆహ్వానించారు. దీంతో పాటు అమితాబ్ భార్య జయా బచ్చన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షోకి గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను ‘సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గతంలో విడుదల చేసిన ప్రోమోల్లో అమితాబ్, జయా అనుబంధం చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అమిత్‌పై జయా.. ఫిర్యాదు చేసింది. ‘ఫోన్ చేస్తే.. అస్సలు లిఫ్ట్ చేయరు’ అని కంప్లైంట్ చేశారు. ‘ఇంటర్నెట్ వస్తూపోతూ ఉంటే నేను ఏం చేయను?’ అంటూ అమితాబ్ ఫన్నీగా తనను తాను సమర్థించుకున్నారు. స్వేతా బచ్చన్ జోక్యం చేసుకొని జయా పక్షాన మాట్లూడుతూ.. ‘సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం, ట్వీట్లు పెట్టడం చేస్తారు’ అని గుర్తుచేస్తుంది. టాపిక్ మారుస్తూ.. అమితాబ్ ‘జయా నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అంటారు. వెంటనే స్పందిన జయా.. ‘మీరు అబద్దాలు చెప్పేటప్పుడు బాగుండరు’ అని సరదగా బదులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక 1000వ ఎపిసోడ్ డిసెంబర్ 3 రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారం కానుంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
అమితాబ్-రేఖల లవ్ ట్రాక్: జయా బచ్చన్ ఏమన్నారంటే
బాలీవుడ్లో హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ ఎఫైర్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అమితాబ్ బచ్చన్-రేఖ. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది వీరి ప్రేమ కథ. ‘దో అన్జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. కానీ అప్పటికే రేఖ అమితాబ్ కంటే సీనియర్. అంతకు ముందు వరకు రేఖకు, అమితాబ్ బచ్చన్ అంటే దీదీబాయి (జయా బచ్చన్) భర్తగానే తెలుసు. ‘దో అన్జానే’సెట్స్ మీదే అమితాబ్ బచ్చన్‌గా పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చింది. దాంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమాల సంఖ్య పెరిగింది. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటపడింది అంటే 1978లో ‘గంగా కీ సౌగంద్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్‌లే హీరోహీరోయిన్లు. ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించసాగాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు అతను. పైగా రేఖ నిస్సహాయతను అలుసుగా తీసుకోసాగాడు. ఇదంతా గమనిస్తున్న అమితాబ్ ఇక ఊరికే ఉండలేకపోయాడు. ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్ రియాక్షన్‌కి అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మేడం పట్ల సార్‌కు ఈ స్పెషల్ కేర్ ఏంటి అని గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఈ వార్తలు కాస్త జయా బచ్చన్ చెవిన పడ్డాయి. ‘సిల్సిలా’ సినిమా విడుదల వరకు ఇదే కొనసాగింది. ఆ తర్వాత రేఖ-అమితాబ్‌ల మధ్య ఉన్న బంధం బలహీనపడుతూ వచ్చింది. గతంలో పీపుల్ మ్యాగ్జైన్కిచ్చిన ఇంటర్వ్యూలో జయా బచ్చన్.. అమితాబ్-రేఖల లవ్ ఎఫైర్‌పై స్పందించారు. ఇన్ని పుకార్ల మధ్య ఎలా తన వివాహ బంధాన్ని నిలబెట్టుకున్నారో వెల్లడించారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘వీటి గురించి తెలిసినప్పుడు నేను బిగ్ బీని ఎలాంటి ప్రశ్నలు వేసేదాన్ని కాదు. ఆయనను ఒంటరిగా వదిలేసేదాన్ని. ఆలోచించుకునే అవకాశం ఇచ్చేదాన్ని. ఇక మా వివాహబంధంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఎంతో మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నాను. బంధాలకు విలువిచ్చే ఇంటికి కోడలిగా వెళ్లాను’’ అన్నారు. ‘‘ఇక సినిమా ఇండస్ట్రీలాంటి రంగుల ప్రపంచంలో అన్ని సవ్యంగా సాగవు. నాకే సొంతం.. అంటూ కట్టుబాట్లు విధించడం కూడా క్షేమం కాదు. ఇక్కడ మీరు ఆర్టిస్టిలను పిచ్చివాళ్లు చేయవచ్చు.. లేదా వారి ఎదుగుదలకు సాయం చేయవచ్చు. ఎవరిని బలవంతంగా కట్టి పడేయలేం’’ అన్నారు. బిగ్ బీ ఎఫైర్స్కు సంబంధించిన వార్తలు విన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటనే ప్రశ్నకు జయా బచ్చన్ బదులిస్తూ.. ‘‘నేను మనిషినే.. తప్పక స్పందించాలి. చెడు వార్తలు, మంచి వార్తలు అన్నింటిపై స్పందించాలి. మన మాట, స్పందన, చూపు ద్వారా తనకు నమ్మకం కలిగించాలి. ఇక బిగ్ బీతో నటించిన ప్రతి హీరోయిన్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు మీడియా రాసుకొచ్చేది. వాటన్నింటిని మనసులోకి తీసుకుంటే నా జీవితం నరకం అయ్యేది. ఏళ్లు గడుస్తున్న కొద్ది మా బంధం మరింత బలపడింది’’ అంటూ చెప్పుకొచ్చారు జయా బచ్చన్. చదవండి: ‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్ -
సెల్ఫీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన సీనియర్ నటి
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ముక్కిసూటి మనిషి. ఆమె మాటలు, చేష్టలు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. చూసేవారు ఏం అనుకుంటారో అని ఆలోచించరు. ఇలాంటి ప్రవర్తనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్ల జయా బచ్చన్ కఠినంగా ప్రవరించారు. ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొగరుగా ప్రవర్తించడం సరికాదు అంటున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయా బచ్చన్ టీఎంసీకి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయా బచ్చన్ టీఎంసీ అధినేత్రి మమతకు మద్దతుగా కోల్‌కతాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు జయా బచ్చన్. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జయా బచ్చన్.. అతడిని పక్కకు తోసి ర్యాలీని కొనసాగించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జయా అతడిని నెట్టేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరీ ఇంత కోపంగా, కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫోటోలు తీయోద్దు అని చెప్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజనులు. చదవండి: జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు -
జయ బచ్చన్ వల్లే బాలీవుడ్లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు
అమితాబ్‌ను ఆమె హీరో చేసింది. అమితాబ్ కోసం తాను హీరోయిన్గా మానుకుని ఉండిపోయింది. గొప్ప నటి. చేసిన నాలుగు పాత్రలతోనే నేటికీ కోట్లాది అభిమానులను మూటగట్టుకుని ఉంది. చాలామందికి ఆమె గాడ్ మదర్. కొందరికి ఫ్రెండ్. కొందరికి ఇన్స్పిరేషన్. జయభాదురి ప్రమేయం బాలీవుడ్లో ఎన్నో మార్పులకు చరిత్ర చేర్పులకి కారణమైంది. 73 ఏళ్లు నిండి 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెపై స్పెషల్ కామెంట్... ‘అభిమాన్’ సినిమాలో అమితాబ్, జయభాదురి భార్యాభర్తలు. అమితాబ్ గాయకుడు. జయభాదురి కూడా గాయని అవుతుంది. జయ భాదురిని అమితాబ్ ప్రోత్సహిస్తుంటే ఒక పెద్దమనిషి గమనించి ‘ఇతను ఈ పని ఎందుకు చేస్తున్నాడు. ఆమె అతని కంటే మంచి గాయని. ఈ కాపురం నిలువదు. ఇగో వచ్చేస్తుంది’ అంటాడు. అలాగే జరుగుతుంది. గాయనిగా జయ భాదురికి వచ్చే పేరు చూసి అమితాబ్ తట్టుకోలేకపోతాడు. నిజ జీవితంలో ఈ ప్రమాదంలో ఇరువురూ పడలేదు. కాకుంటే జయ భాదురి ఎంత సమర్థురాలైన నటో అమితాబ్ కూడా అంతే సమర్థుడైన నటుడు. వారి కెరీర్లకు సంబంధించి టాలెంట్ పరంగా ఇగో వచ్చే అవకాశం లేదు కాని ఆమె కూడా అతనంత బిజీగా ఉండి ఉండేది. అయితే పెళ్లయ్యాక జయ ఇంటి కోసం ఉండిపోతే అమితాబ్ ఆమె ఉందన్న ధైర్యంతో ముందుకు పోయాడు. అమితాబ్‌ను తయారు చేసింది జయ అని అంటారు. సినిమాల్లో ‘లంబు’గా అందరి వెక్కిరింతను మొదటగా ఎదుర్కొన్న అమితాబ్ అదిలో అన్నీ ఫ్లాప్స్ చూశాడు. అప్పటికే అతని తో ప్రేమలో ఉన్న జయ ‘జంజీర్’ సినిమాకు అమితాబ్‌ను రికమండ్ చేసింది. ఆ సినిమా చాలామంది హీరోలు కాదనుకోవడం వల్ల అమితాబ్‌కు దక్కింది. ‘జంజీర్’ నాటికి జయ సూపర్‌స్టార్. అయినా సరే అమితాబ్ పక్కన చేసి అతణ్ణి నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అమితాబ్‌ను అమితాబ్ ఎంత నమ్ముకున్నాడో తెలియదు కాని జయ బాగా నమ్మింది. పెద్ద స్టార్ అవుతాడని అనుకుంది. ‘షోలే’లో అతనికి ఆ పాత్ర దక్కడానికి ఆమె కూడా తన వంతు కృషి చేసింది. జయ అమితాబ్ సమర్థత తో పాటు స్టార్‌డమ్‌ను కూడా భరించింది. అతని ఆకర్షణలు, స్త్రీలతో పరిచయాలు, న్యూస్‌లో నలిగిన అమితాబ్–రేఖల కథ ఇవన్నీ తట్టుకుని ఇల్లు కాపాడుకుని అమితాబ్‌ను తనని కాపాడుకునేలా చేసింది. జయ భాదురి సంజీవ్ కుమార్‌తో మంచి సినిమాలు చేసింది. ‘కోషిష్’, ‘అనామిక’ వాటి లో ముఖ్యమైనవి. హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం లో తొలి సినిమా ‘గుడ్డీ’తో మొదలు ‘బావర్చీ’, ‘అభిమాన్’, ‘చుప్కే చుప్కే’... అన్నీ సూపర్‌హిట్స్. జయ హిందీలో సహజమైన నటనను తీసుకు వచ్చిందని అంటారు. ఆమె క్షణాల్లో గంభీరమైన నటిగా మారగలదు. అంతే వేగంగా అల్లరి పిల్లగా కూడా మారగలదు. ‘అభిమాన్’లో ‘తేరి నిందియారే’ పాడేటప్పుడు జయా, ‘అనామికా’లో ‘బాహోంమే చలే ఆవో’ పాడే జయా... ఇరువురూ ఒక్కరే. కాని ఎంత తేడా ఆ నటనలో. జయ రణ్‌ధీర్ కపూర్‌తో ‘జవానీ దివానీ’ చేసి తాను గ్లామరస్ రోల్స్ కూడా చేయగలనని నిరూపించింది. అందులోని ‘జానే జా ఢూండ్తా ఫిర్ రహా’ పాట పెద్ద హిట్. ‘పియా కా ఘర్’, ‘పరిచయ్’, ‘అన్నదాత’, ‘మిలి’.. ఇవన్నీ జయ నటనకు పతాకలు. యశ్‌చోప్రా ‘సిల్ సిలా’ చేయమంటే రేఖా ఉన్నప్పటికీ చేసింది. ఇదొక అరుదైన విషయమే. సినిమాల నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఆమె చేసిన ‘హజార్ చౌరాసి కి మా’ అంతే పెద్ద స్థాయిలో ఆమెకు పేరు తెచ్చి పెట్టింది. వజ్రం కిరీటంలో ఉన్నా వస్త్రంలో చుట్టి పెట్టినా వజ్రమే కదా. జయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడు విలన్ డేనీ ఆమె క్లాస్మేట్. అతని నిజం పేరు పొడుగ్గా ఉందని జయా బచ్చనే ‘డేనీ’ అని పెట్టింది. అదే అతనికి స్క్రీన్ నేమ్ అయ్యింది. రాజీవ్ గాంధీ కుటుంబం నుంచి విడిపోవాల్సి వచ్చాక అమితాబ్ సమాజ్‌వాదీ పార్టీలో అమర్ సింగ్ సపోర్ట్‌తో నిలదొక్కుకోవాల్సి వచ్చినప్పుడు జయ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీలో కొనసాగింది. జయ భాదురి, అమితాబ్ ల సరదా నటనను మీరు ‘చుప్కే చుప్కే’లో చూడొచ్చు. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ఆ సినిమాను ప్లే చేయండి. – సాక్షి ఫ్యామిలీ -
బెదిరింపులకు బెంగాలీలెప్పుడూ తల వంచరు: జయా బచ్చన్
కోల్‌కతా: ‘భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు. బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు..’ అంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీనేత జయా బచ్చన్ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆమె బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేఎంఎం వంటి పార్టీలు సైతం టీఎంసీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. మమతా అనుకున్నది సాధిస్తారు.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి జయా బచ్చన్ మాట్లాడారు. మమతా అనుకున్నది సాధిస్తారని ఆమె చెప్పారు. ‘మమతా బెనర్జీ మీద నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా ఆమె ఒక్కరే పోరాడుతున్నారు. తల పగిలినా, కాలు విరిగినా.. ఆమె గుండె ధైర్యం, మనో నిబ్బరం మాత్రం సడలడంలేదు’ అని వ్యాఖ్యానించారు. ఆమె నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మమతా తిరిగి గెలుస్తారని అన్నారు. నా మూలాలు బెంగాల్లో.. రాష్ట్రానికి వెలుపల జన్మించినప్పటికీ, తాను బెంగాలీనేనని జయా బచ్చన్ తెలిపారు. పెళ్లికి ముందు వరకూ తన ఇంటి పేరు భాదురి అని చెప్పారు. బెంగాల్ ప్రజాస్వామ్య హక్కుల కోసం మమతా పోరాడుతున్నారని అన్నారు. రవీంధ్రనాధ్ ఠాగూర్ సైతం బెంగాలీలంతా అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లని చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రస్తుతం మహిళలకు సురక్షితంగా ఉందన్నారు. మమతాను అసభ్యపదజాలంతో దూషించిన వారి పై స్పందిస్తూ.. సిగ్గు సిగ్గు.. అని వ్యాఖ్యానించారు. -
సినిమాల్లోకి జయా బచ్చన్ రీ ఎంట్రీ!
బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ ఎంపీ జయా బచ్చన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఆమె కబీ కుషి కబీ ఘమ్, కల్ హోనా హో, లాగా చునారీ మేన్ దాగ్ వంటి పలు సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె ఏడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఇది ఆమె తొలి మరాఠీ చిత్రమని అంటున్నారు. దీనికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇతడు మరాఠీలో సుమారు 50కి పైగా చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ఇక ఈ వార్తలపై డైరెక్టర్ గజేంద్ర స్పందిస్తూ "మేమింకా ఏ నిర్ణయానికి రాలేదు. అప్పుడే బోలెడన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కటైతే నిజం. ఈ సినిమాలో జయాబచ్చన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదే మాట ఆమెతో చెప్పాను కూడా! మరి ఏమని సమాధానమిస్తుందో చూడాలి. ఈ సినిమా ద్వారా జయ రీ ఎంట్రీ ఇస్తుందని ఆశిస్తున్నా. కానీ ఇప్పటివరకైతే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. కనీసం ఏ భాషలో తీస్తున్నామనేది కూడా డిసైడ్ కాలేదు" అని చెప్పుకొచ్చాడు. జయ సినిమాల్లోకి వస్తానంటే ఆమె భర్త అమితాబ్ బచ్చన్ కూడా సంతోషిస్తాడు. మరి డైరెక్టర్ అభ్యర్థనను జయా బచ్చన్ అంగీకరిస్తుందా? ఆమె నిజంగానే రీఎంట్రీ ఇస్తుందా? అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్! నీ కన్ను నీలి సముద్రం.. చిందేసిన హీరోహీరోయిన్లు -
‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక షోని రక్తికట్టించడంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్ సీటులో కూర్చున్న వారిని నవ్విస్తూ.. టెన్షన్ పెడుతూ.. వారి జీవితం గురించి తెలుసుకుంటూ.. తన ప్రయాణం గురించి వారికి చెప్తూ షోపై ఆసక్తి పెంచుతారు. ఇక తాజా ఎపిసోడ్లో మహారాష్ట్రకు చెందిన రైతు యోగేష్ పాండే ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో గెలిచి హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కేబీసీ టీం యోగేష్‌కు సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్‌ని ప్రసారం చేసింది. ఇక యోగేష్, బిగ్ బీల మధ్య జరిగిన సంభాషణ హాట్ సీటును కాస్త కూల్‌గా మార్చేసింది. ఇక గేమ్‌లో ముందుకు వెళ్తున్న కొద్ది యోగేష్ తనకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తనకు నిశ్చితార్థం అయ్యిందని తెలిపాడు యోగేష్. అయితే కరోనా వ్యాప్తితో వివాహం పోస్ట్ పోన్ అయ్యిందని.. కానీ తామిద్దరూ ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని.. వీడియో కాల్ చేసుకుంటామని తెలిపాడు. ఈ విషయాలేవి ఇంట్లో వారికి తెలియదన్నాడు యోగేష్. ఇక ఈ లవ్ స్టోరిని అర్థం చేసుకోవడానికి బిగ్ బీ, యోగేష్ లవర్‌గా మారి పోయారు. కంటెస్టెంట్‌కి కాల్ చేసి అతడి లవర్‌గా మాట్లాడి సెట్లో నవ్వులు పూయించారు. (మళ్లీ వివాదం: అమితాబ్‌పై కేసు) ఇక ఎలాంటి లైఫ్లైన్ల సాయం లేకుండానే యోగేష్ గేమ్‌లో ముందుకు వెళ్లాడు. ఇక వివాహ జీవితం గురించి తనకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా యోగేష్, బిగ్ బీని కోరాడు. అలానే అమితాబ్ లవ్ స్టోరిని చెప్పమని అడగడమే కాక భార్య జయా బచ్చన్‌కి ఏవైనా లవ్ లెటర్స్ రాశారా అని ప్రశ్నిస్తాడు యోగేష్. దాంతో అమితాబ్ మరోసారి తన లవ్ స్టోరిని ప్రేక్షకులకు తెలిపారు. అంతేకాక ఇప్పటికి తన భార్య జయా బచ్చన్‌కి లవ్ లటర్స్ రాస్తానని తెలిపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక బిగ్‌బీ తన లవ్ స్టోరిని గుర్తు చేసుకుంటూ.. ‘1973లో విడుదలైన జంజీర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దాంతో స్నేహితులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్లాలని భావించాను. నాతో పాటు జయా బచ్చన్‌ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాను. మా నాన్న హరివంశరాయ్ బచ్చన్ అనుమతి కోరాను. దానికి ఆయన ముందు మీరిద్దరు వివాహం చేసుకొండి.. ఆ తర్వాత వెళ్లండి అన్నారు. దాంతో ఆ మరుసటి రోజే జయా బచ్చన్‌ని వివాహం చేసుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ షోటో యోగేష్ పాండే 12.50 లక్షల రూపాయల ప్రశ్నకి తప్పు సమాధానం చెప్పి.. 3,20,000 రూపాయలతో ఇంటికి వెళ్లాడు. -
విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు
‘బాలీవుడ్ డ్రగ్స్ మత్తులో ఉంది’ అని నటుడు, యంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలు ఓ కొత్త వివాదానికి దారి తీసిన విషయం, ఆయన మాటల్ని నటి, యంపీ జయా బచ్చన్ ఖండించిన విషయం తెలిసిందే. జయ మాటలకు ఇండస్ట్రీ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆమె మాటలు కరెక్ట్ అని చాలామంది అన్నారు. కొందరు కొట్టిపారేశారు. కంగనా రనౌత్ అయితే అస్సలు ఏకీభవించలేదు. జయ కామెంట్స్‌ను తిప్పి కొట్టారు. అయితే కంగనా మాట్లాడిన విషయాన్ని ఊర్మిళ తప్పుబట్టారు. ఇదంతా బుధవారం వరకూ జరిగిన మాటల యుద్ధం. జయా బచ్చన్ వ్యాఖ్యలకు గురువారం వ్యంగ్యంగా బదులిచ్చారు నటుడు రణ్వీర్ షోరే. తన మీద ఊర్మిళ చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు కంగనా రనౌత్. ఈ విషయాల గురించి జయప్రద, పూజా భట్ మాట్లాడారు. క్యూట్ గాళ్ నిధీ అగర్వాల్ కూడా ‘నెపోటిజమ్’ గురించి మాట్లాడారు. ఆ విశేషాలు. ఊర్మిళ కేవలం శృంగార తార! – కంగనా ‘డ్రగ్స్ హిమాచల్ ప్రదేశ్‌లోనే మొదలయ్యాయి. ముందు నీ ప్రాంతాన్ని శుభ్రం చేసుకో’ అని కంగనా రనౌత్‌కు కౌంటర్ ఇచ్చారు నటి ఊర్మిళ. ఈ కౌంటర్‌కి ఘాటుగా సమాధానం ఇచ్చారు కంగనా. ‘ఊర్మిళగారి ఇంటర్వ్యూ చూశాను. నా గురించి, నా ప్రయాణం గురించి తక్కువ చేస్తూ మాట్లాడారామె. ఇదంతా నేను రాజకీయాల్లో సీట్ కోసం చేస్తున్నాను అని అంటున్నారామె. ఊర్మిళ సాఫ్ట్ పోర్న్ స్టార్ (శృంగార తార). ఆమె యాక్టింగ్‌కి ఆమె పాపులర్ అవ్వలేదు. మరి దేనికి పాపులరయ్యారు? అంటే... సాఫ్ట్ పోర్న్ చేయడం వల్లే కదా. ఆమెకే టికెట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు?’ అని కౌంటర్ ఇచ్చారు కంగనా. అయితే కంగనా చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్లో పలువురు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్ చేశారు. మా దగ్గర ఉన్న ప్రతిదీ మా కష్టార్జితమే! – రణ్వీర్ షోరే ‘ఇండస్ట్రీలో పని చేస్తూ ఇండస్ట్రీనే తప్పుపట్టడమంటే అన్నం పెట్టిన చేతినే నరకడం వంటిది’ అన్నారు జయా బచ్చన్. ఈ కామెంట్‌ను కంగనా తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు రణ్వీర్ షోరే కూడా స్పందించారు. ‘ఖరీదైన ప్లేట్లలో మీ పిల్లలకు మీరు భోజనం సమకూరుస్తారు. మాకు మాత్రం చివాట్లు. మా భోజనాన్ని మేమే తయారుచేసుకుని బాక్స్ కట్టుకొని పనికి వెళ్తాం. మాకు ఎవ్వరూ ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు. మా దగ్గర ఏముందో అది మాదే. దాన్ని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఒకవేళ తీసుకునే వీలుంటే దాన్ని కూడా వాళ్ల పిల్లలకే పెడతారు’ అని ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్ (బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు/బయటినుంచి వచ్చినవాళ్లు) టాపిక్‌ను చెప్పకనే చెబుతూ ట్వీట్ చేశారు రణ్వీర్ షోరే. వాళ్ల గురించీ ఆలోచించండి – పూజా భట్ ప్రస్తుతం డ్రగ్స్ పై జరుగుతున్న చర్చ గురించి నటి, దర్శక–నిర్మాత పూజా భట్ కూడా మాట్లాడారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారామె. ‘‘ప్రస్తుతం అందరూ బాలీవుడ్లో డ్రగ్స్ ఉన్నాయి. బాలీవుడ్లోనే ఉన్నాయి.. వాటిని తొలగించాలి అని అంటున్నారు. కన్న కలల్ని సాధించలేక, ఆశలన్నీ కూలిపోయి జీవితాన్ని భారంగా గడుపుతూ కలల వెనక పరిగెత్తేవాళ్లు కూడా మత్తు పదార్థాల వెనక పరిగెడుతున్నారు. దారిద్య్రంలో ఉంటూ జీవించడమే భారంగా అనిపించి, మత్తులో తేలుతూ ఈ భారాన్నంతా తేలిక చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఆలోచించండి. వాళ్లను మామూలు మనుషుల్లా మార్చే ప్రయత్నాలు చేయండి’’ అన్నారు పూజా భట్. నెపోటిజమ్ నా ప్రయాణాన్ని ఆపలేదు – నిధీ అగర్వాల్ ‘అవును.. బాలీవుడ్లో నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అవుట్‌సైడర్‌గా నా ప్రయాణం ఆగిపోదు’ అన్నారు ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధీ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు వ్యాపారవేత్త. నేను సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని వచ్చాను. ఒకవేళ నేనూ మా నాన్నగారి వ్యాపారంలో ఉంటే ఆయన వారసురాలిగా నన్నే సీఈఓని చేస్తారు. అలానే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. వాళ్లను గైడ్ చేసేవాళ్లు ఉంటారు. ఎలాంటి నిర్ణయాలు శ్రేయస్కరమో సూచిస్తుంటారు. దీనివల్ల నేను (అవుట్‌సైడర్) స్టార్‌ని అవ్వలేనని కాదు. కొంచెం సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా స్టార్‌ని అవుతాను. కష్టపడితే, ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా ఎవ్వరైనా ఇండస్ట్రీలో ఎదగగలరు’’ అన్నారు నిధీ అగర్వాల్. జయా జీ రాజకీయం చేస్తున్నారు – జయప్రద డ్రగ్స్ వివాదం గురించి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద మాట్లాడుతూ – ‘‘రవికిష¯Œ గారు మాట్లాడిన పాయింట్‌తో నేను ఏకీభవిస్తాను. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయం మీద మనందరం పోరాటం చేయాలి. జయా బచ్చన్‌గారు మా అందరికంటే పెద్దావిడ.. ఆమె మీద మా అందరికీ గౌరవం ఉంది. కానీ ఆమె ఈ విషయాన్ని (డ్రగ్స్) రాజకీయం చేస్తున్నారనిపించింది’’ అన్నారు. -
బచ్చన్ భవంతులకు భద్రత పెంపు
ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన భార్య, సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్‌కు ముంబైలో ఉన్న బంగళాలకు పోలీసుల రక్షణ పెంచారు. సినీ పరిశ్రమపై బురద చల్లవద్దంటూ జయాబచ్చన్ పార్లమెంట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో కంగన, రవికిషన్ను జయాబచ్చన్ పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమితాబ్ ఎక్స్ కేటగిరీ భద్రత పొందుతున్నారని, జయాబచ్చన్ ప్రసంగానంతరం జుహులో వారి భవంతుల బయట భద్రతను, పెట్రోలింగ్‌ను పెంచామని పోలీసు అధికారులు చెప్పారు. జుహులో బచ్చన్ కుటుంబానికి జల్సా, జనక్, ప్రతీక్ష పేరిట మూడు బంగ్లాలున్నాయి. వీటిలో జల్సా, ప్రతీక్షల్లో అమితాబ్ కుటుంబం నివశిస్తోంది. -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’
ముంబై : యువ హీరో సుశాంత్ రాజ్‌పుత్ కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వాడకంపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ కేసును డ్రగ్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్లతోపాటు డ్రగ్స్‌ను సరాఫరా చేసే కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. అదే క్రమంలో ఈ విషయంపై కంగనా రనౌత్‌కు.. ముంబై ప్రభుత్వం, .బీటౌన్ సెలబ్రిటీలకు మధ్య రచ్చ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్లో మారుతున్న పరిణామాలపై స్పందించిన తాప్సీ పన్ను.. రియా, కంగనా, జయా బచ్చన్ గురించి మాట్లాడారు. కాగా గతంలో తాప్సీ, రియా చక్రవర్తికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తాప్సీ చర్చించారు. (సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు) ‘రియా చక్రవర్తి ఎవరో నాకు నిజంగా తెలియదు. నేను కేవలం రియాకు జరుగుతున్న అన్యాయానికి, ఆమెపై ఇచ్చిన తీర్పును గురించే మాట్లాడుతున్నాను. ఇది కేవలం కొత్తది కాదు. ఇంతకముందు ఇతర పరిశ్రమల నుంచి అనేక తప్పులు జరిగాయి. మా పరిశ్రమలో(సినీ పరిశ్రమ)కూడా కొంత మంది పెద్ద స్టార్లు తప్పులు చేశారు. కానీ ఎవరిని రియా మాదిరి శారీరకంగా, మానసికంగా హింసిస్తూ చిత్రీకరించి చూపించలేదు. ఇది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అందుకే ఆమె గురించి నాకు ఏమి తెలియకుండానే మాట్లాడాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. అలాగే కోర్టు, దర్యాప్తు సంస్థలు తమ తీర్పును ఇవ్వక ముందే తమకు ఇష్టం వచ్చినట్లు రాసే వ్యక్తులు ఉన్నారు. వారు తమ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరిపై ప్రభావితం చేసేలా బలవంతం చేయాలనుకుంటున్నారు. అది తప్పు అని నేను అనుకుంటున్నాను. రియా చక్రవర్తి జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా లేదా నేరస్థులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకుంటున్నారా..’ అని ప్రశ్నించారు. (రియాకు మంచు లక్ష్మి, తాప్సీ మద్దతు) అలాగే రాజ్యసభ్యలో జయా బచ్చన్ ఇచ్చిన ప్రసంగాన్ని తాప్సి ప్రశంసించారు. ఆమె ప్రతి విషయాన్నా చాలా ఖచ్చితంగా చెప్పారని, ఈ రోజు తను చెప్పబోయే అనేక విషయాలు ఇప్పటికే జయా బచ్చన్ చెప్పేసారని అన్నారు. ఇక కంగనా రనౌత్ గురించి మట్లాడుతూ..కంగనా వ్యాఖ్యలు ఎప్పటి నుంచో తనపై ప్రభావం చూపడం ఆగిపోయిందన్నారు. ‘ఓకే వ్యక్తి తరచూ ఒకేలా మాట్లాడితే కొన్ని రోజులకు వారి మాటలు ఎవరిపై ప్రభావం చూపించలేవు. అలాగే కంగన మాటలు కూడా న్ను ఏ విధంగానే కదిలించలేవు’ అని తాప్సీ అన్నారు. (డ్రగ్ కేసు: త్వరలో సారా, రకుల్‌కు సమన్లు) -
బచ్చన్ ఫ్యామిలీకి మరింత భద్రత
ముంబై: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రవికిషన్ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్ రాజ్యసభలో ప్రస్తావించిన అనంతరం ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బచ్చన్ల ఇంటికి సెక్యూరిటీ మరింత పెంచారు. జుహూలోని బచ్చన్స్ ఐకానిక్ బంగ్లా అయిన జల్సా వెలుపల అదనపు భద్రత కల్పించారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌పై వస్తోన్న ఆరోపణలపై జయాబచ్చన్ మంగళవారం రాజ్యసభలో ప్రసంగించించారు. ఆమె ప్రసంగంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా ట్రోల్స్ వచ్చిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. దీనికి జయా బచ్చన్ స్పందిస్తూ.. కొంతమంది వ్యక్తుల కారణంగా బాలీవుడ్ ప్రతిష్టను కించపర్చడం సరి కాదు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు' అంటూ జయాబచ్చన్ మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం పార్లమెంటులో జయాబచ్చన్ తీసుకున్న వైఖరికి శివసేన మద్దతుగా ముందుకు వచ్చింది. రవికిషన్ ఆరోపణలపై శివసేన అనుబంధ పత్రిక సామ్నా సంపాదకీయంలో 'అలాంటి వాదనలు చేసేవారు కపటవాదులని.. వారి ప్రకటనలు ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉంటాయని పేర్కొంది. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
జయాజీ... కొంచెం దయ చూపించండి
బాలీవుడ్లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కలకం మొదలయింది. ఇటీవలే నటుడు, యంపీ రవి కిషన్ ‘డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి. దోషుల్ని పట్టుకొని విచారణ జరపాలి’ అని ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని పార్లమెంట్లో వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశిస్తూ సీనియర్ నటి, యంపీ జయాబచ్చన్ మాట్లాడారు. ‘‘కొంతమంది అన్నం పెట్టిన చేతినే కరవాలనుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి అండగా ప్రభుత్వం నిలబడాలి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఇండస్ట్రీ తన వంతు సహాయం చేసింది. కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ తప్పు అనే ఇమేజ్ తీసుకురావడం కరెక్ట్ కాదు’’ అని జయ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు జయ మాట్లాడిన విషయాన్ని కొనియాడారు. కంగనా రనౌత్ మాత్రం జయతో ఏకీభవించలేదు. ‘‘జయాజీ, మీ అమ్మాయి శ్వేతా బచ్చన్ కూడా టీనేజ్‌లో డ్రగ్స్‌కి బానిసయి, లైంగిక వేధింపులకు గురైతే ఇలానే మాట్లాడతారా? మీ అబ్బాయి అభిషేక్ కూడా అదే పనిగా హెరాస్మెంట్ ఎదుర్కొని, ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి స్టాండే తీసుకోగలరా? కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. కొంచెం దయ చూపించండి’’ అని జయా బచ్చన్ వీడియోను ఉద్దేశించి ట్వీట్ చేశారు కంగనా. -
జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్లో మొదలైన విమర్శల ప్రకంపనలు తాజాగా పార్లమెంట్‌ను తాకాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్పై ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజ్యసభలో జయా మంగళవారం చేసిన ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ.. మీ కుమారుడు అభిషేక్ బచ్చక్ కూడా సుశాంత్‌లా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా అంటూ నిలదీశారు. ఈ మేరకు కంగనా ఓ ట్వీట్ చేశారు. ’రాజ్యసభలో జయాబచ్చన్ మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు మాదిరిగా మీ కుమార్తె స్వేతా బచ్చన్ కుడా టీనేజ్‌లో వేధింపులు గురైతే ఇలానే స్పందిస్తారా. కొందరు వ్యక్తుల మూలంగా మానసిక ఒత్తిడి గురై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్ కూడా ఆత్మహత్యకు పాల్పడితే ఇలానే మాట్లాడుతారా. మాపైన కాస్త జాలి చూపండి’ అని మండిపడ్డారు. (కొడుకు కోసమే కక్షసాధింపు) కాగా చిత్రపరిశ్రమపై ఎంపీలు రవికిషన్ మాట్లాడిన తీరుపై జయా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఉంటూ డ్రగ్స్ మాఫీయా అంటూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జయా బచ్చన్ రాజ్యసభలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై కౌంటర్‌గా కంగనా ట్వీట్ చేశారు. రాజ్యసభలో జీవో అవర్ సందర్భంగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశాన్ని లేవనెత్తారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్. డ్రగ్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని... సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు కూడా బాలీవుడ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పూరి నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంట్ సమావేశాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా మండి పడ్డారు. కొందరి కోసం అందరిని విమర్శించడం తగదన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘కొంతమంది వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చడం సరి కాదు. నిన్న లోక్‌సభలో పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడంతో నేను ఎంతో సిగ్గు పడ్డాను. ఆయన వ్యాఖ్యలు చూస్తే.. అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది’ అంటూ తీవ్రంగా మండి పడ్డారు జయా బచ్చన్. (చదవండి: డ్రగ్స్ కేసు: నాకేం బాధ లేదు ) బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని రవి కిషన్ అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవి కిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆలోచనలో మార్పు రావాలి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూరమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని అరికట్టడానికి చేయాల్సిన సూచనలపై చర్చను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకరం. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన అమానవీయం. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి ఘటనలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. యావద్భారతంలో మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార ఘటనలను చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చేయాలనేదానిపై చర్చించాలి. శిక్షలు విధించినప్పుడు కూడా అప్పీలు, క్షమాభిక్ష అంటూ ఏళ్ల తరబడి ప్రక్రియ నడుస్తోంది. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై క్షమాభిక్ష అంశం అనేది ఎవరైనా ఊహించుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేసు తమ పరిధిలో లేదంటూ పోలీసులు చెప్పిన కారణాలు సహేతుకం కాదు. పలు సందర్భాల్లో తప్పుచేసిన వారు జువైనల్ అని అంటున్నారు, హేయమైన నేరాలు చేయగలిగే వారికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది. ఈ అంశంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చట్టం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పురావాలని వెంకయ్య సూచించారు. దోషులను బహిరంగంగా శిక్షించాలి జయాబచ్చన్, ఎంపీ దిశ అత్యాచారం, హత్య లాంటి ఘటనల్లో దోషులను బహిరంగంగా కొట్టి చంపాలి. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేనే కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. అయినా అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపడమే సరైంది. ఈ తరహా ఘటనలపై ఎన్నోసార్లు మాట్లాడా. నిర్భయ, కథువా, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలపై ప్రజలు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నా. రక్షణ కల్పించడంలో విఫలమైన అధికారులను దేశం ముందు తలదించుకునేలా చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల ఓ అత్యాచార ఘటనలో కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. అప్పీల్‌కు వెళ్లిన దోషులు జీవితఖైదు పొందారని, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు రూపొందించాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. హత్యాచార ఘటన జరిగిన 15–20 రోజుల్లోనే విచారించి దోషులను శిక్షించాలని ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి సూచించారు. టీఎంసీ ఎంపీ డా.సంతను సేన్, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్నిక్, అన్నాడీఎంకే ఎంపీ విజలా సత్యనాథ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే ఎంపీ పి. విల్సన్, కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ మాట్లాడారు. ఏకతాటిపైకి రావాలి గులాం నబీ ఆజాద్ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు యావత్ దేశం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అత్యాచారం, హత్య ఘటనల నిరోధానికి చట్టాలు చేసినా, వాటి ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితిని కనిపించడం లేదు. మహిళలపై ఇలాంటి దాడులను ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కోరుకోరన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలన్నారు. -
‘లాక్కొచ్చి.. పబ్లిక్‌గా చంపేయాలి’
న్యూఢిల్లీ : దిశ అత్యాచారం, హత్య ఘటన కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ అన్నారు. ఈ ఘటన జరిగిన సమీప ప్రాంతంలోనే మరో ఘటన కూడా జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వాలే కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై రాజ్యసభ చర్చ జరిగింది. ఈ క్రమంలో చర్చ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతూ... ఈ కేసులోని నిందితులను ప్రజల్లోకి తీసుకువచ్చి.. మూకదాడి చేసి చంపేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నేరస్తులకు విదేశాల్లో ప్రజలే శిక్ష వేస్తారు అని పేర్కొన్నారు. ‘నిర్భయ, కథువా, హైదరాబాద్ వంటి ఘటనల్లో ప్రభుత్వాలు ఎలా విచారణ జరిపాయి. బాధితులకు ఏం న్యాయం చేశాయో చెప్పాలి. ఇక హైదరాబాద్‌లో దిశ ఘటనకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అధికారులు ఏం చేస్తున్నారు. నిందితులతో పాటు వైఫల్యం చెందిన అధికారుల పేర్లు బహిర్గతం చేయాలి. పరువు తీయాలి. ఈ ఘటనతో అధికారుల పరువు పోయింది’ అని దుయ్యబట్టారు. కాగా తెలంగాణలో సంచలనం సృష్టించిన దిశ హత్య కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ-2 జొల్లు శివ (20), ఏ-3 జొల్లు నవీన్ (20), ఏ-4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దిశను లాక్కెళ్లి, లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం అంతా 28 నిమిషాల్లోనే జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను ఉరి తీయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
అక్కడ నవ్వడమా? సిగ్గుచేటు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉనావ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగిన నిరసన ప్రదర్శనలో జయా బచ్చన్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నిరసన ప్రదర్శనలో ఆమె నవ్వులు చిందిస్తూ.. సరదాగా తోటి ఎంపీలతో మాట్లాడుతూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉన్న ఉనావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో జయాబచ్చన్‌తోపాటు, ఎస్పీ సీనియర్ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ తోటి ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ..నవ్వులు చిందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జయా బచ్చన్ ఇలా వ్యవహరించడం సముచితం కాదని నెటిజన్లు అంటున్నారు. ఎంపీల నవ్వుల్లోనే వారి నిబద్ధత, చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని తప్పుబడుతున్నారు. నెలకు జీతం, ప్రభుత్వ సౌకర్యాలు అందితే చాలు.. ప్రజలు ఏమైతే ఏంటి అన్నట్టుగా ఎంపీల తీరు ఉందని, ఇది సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు. -
‘గార్డియనే గడబిడ చేస్తున్నాడు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశాన్ని కాపాడాల్సిన గార్డియనే గడబిడ చేస్తున్నాడని ప్రధాని నరేంద్ర మోదీపై ఎస్పీ నేత, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న ప్రధాని మోదీ స్వయంగా ఆయనే దేశంలో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. లక్నో బరిలో ఎస్పీ అభ్యర్ధిగా నిలిచిన పూనం సిన్హాను ఆదరించాలని ఆమె కోరారు. ఎస్పీలోకి కొత్తగా వచ్చిన వారిని సమాదరించడం మన సంప్రదాయమని, వారు ఎక్కడి వారైనా వారిని గెలిపించుకుని, గౌరవించడం తమ విధానమనని జయాబచ్చన్ చెప్పుకొచ్చారు. మీరంతా ఆమె విజయానికి సహకరిస్తామని తనకు హామీ ఇవ్వాలని లేకుంటే పూనం తనను ముంబైలో అడుగుపెట్టనీయరని చయత్కరించారు. లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో భాగంగా మే 6న లక్నోలో పోలింగ్ జరగనుంది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను వెల్లడిస్తారు. -
భార్యకు ప్రేమతో...బిగ్‌బీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆలోచనల్ని, తన అనుభూతిని రాతరూపంలో ఎంత చక్కగా వివరిస్తాడో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తన సతీమణి జయాబచ్చన్ పుట్టినరోజు సందర్భంగా అందమైన లేఖ రాశారు. ప్రియమైన భార్య గుర్తుచేసుకుంటూ పలు విషయాలు తెలిపారు. ‘అర్థరాత్రి 12 కాగానే శుభాకాంక్షలు తెలుపడానికి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. స్వీటు తినిపించి తనను 70వ వసంతంలోకి ఆహ్వానించాను. ఆమె భార్యగా, తల్లిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తోంది. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన లేఖలు, కురిపించిన ప్రేమ..ఒక్కసారిగా ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఈ రోజు నాకు ప్రత్యేకం’ అని అమితాబ్ లేఖలో పేర్కొన్నారు. 1973 జూన్ 3న అమితాబ్, జయా బచ్చన్ వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు అభిషేక్, శ్వేత. బాలీవుడ్లో అన్యోన్యమైన జంటగా బిగ్ బీ, జయ పేరు గడించారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ప్రముఖ నటిగా 1992లో జయాబచ్చన్‌కు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. 2004లో జయాబచ్చన్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం అమితాబ్ తెలుగులో చిరంజీవి హిరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. -
దేశంలో ధనిక ఎంపీ ‘కింగ్’ మహేంద్ర!
సాక్షి, పాట్నా : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటిస్తున్న నేపథ్యంలో అత్యంత సంపన్న నేతగా జేడీయూ (బిహార్)కు చెందిన మహేంద్ర ప్రసాద్ నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న జయా బచ్చన్ రూ.1000 కోట్ల ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించి ధనిక ఎంపీగా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్స్ పరిశీలన పూర్తికాగా రూ.4,039 కోట్ల ఆస్తులతో జేడీయూ అభ్యర్థి, ఎంపీ మహేంద్ర అగ్రస్థానంలో నిలిచారు. దాంతో సంపన్న ఎంపీల జాబితాలో జయా బచ్చన్ రెండో స్థానానికి పడిపోయారు. 58 స్థానాల కోసం మార్చి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. జేడీయూ తరఫున మూడోసారి రాజ్యసభకు వెళ్లనున్న మహేంద్ర ప్రసాద్ ఓవరాల్‌గా ఏడోసారి ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. కింగ్ మహేంద్రగా పేరు గాంచిన మహేంద్ర ప్రసాద్.. తన అఫిడవిట్లో రూ.4,010.21 కోట్ల చరాస్తులు, రూ. 29 కోట్ల స్థిరాస్తులు కలిగిఉన్నట్లు వెల్లడించారు. మాప్రా లాబోరేటరిస్ ప్రైవేట్ లిమిటెడ్, అరిస్టో ఫార్మాసూటికల్స్ కు అధిపతిగా ఉన్నారు. సొంత వాహనమే లేని ధనిక ఎంపీ నాలుగు వేల కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న ఎంపీగా ఉన్న మహేంద్రకు ఒక్క వాహనం కూడా లేదని తెలిపారు. తన పేరుతో ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తొలిసారి 1980లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టిన మహేంద్ర ప్రసాద్.. తాజాగా ఏడోసారి రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. జేడీయూ నుంచి బరిలో నిలిచారు. 211 దేశాల్లో పర్యటించిన ఏకైక ఎంపీగా ఆయనదే రికార్డ్. -
బిగ్ బీ అస్వస్థతకు కారణం ఇదే...
న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్లో మంగళవారం అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. బిగ్ బీ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతుండగా ఆయన భార్య జయాబచ్చన్ మాట్లాడుతూ ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ‘ఈ సినిమాలో పాత్ర కోసం అమితాబ్ కోసం ప్రత్యేక దుస్తులు రూపొందించారు. అవి చాలా బరువుగా ఉన్నాయి. ఈ దుస్తులను ధరించడం వల్లే అమిత్‌జీకి వెన్ను నొప్పి, మెడనొప్పి వచ్చాయి, తప్ప ఆయనకు వేరే ఆరోగ్య సమస్యలు ఏమి లేవు’ అని జయాబచ్చన్ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన అమితాబ్‌కు చికిత్స చేసేందుకు ముంబాయి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం జోథ్‌పూర్ వచ్చింది. కాగా బిగ్ బీ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విట్ చేశారు. బిగ్ బీ ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తో పాటు ‘102 నాట్ అవుట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు రిషికపూర్ కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘102 నాట్ అవుట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా మాటలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా..
-
నేను ఆ మాటలు అనకుండా ఉండాల్సింది..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యురాలు, సమాజ్‌వాది పార్టీ నేత జయా బచ్చన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నరేశ్ అగర్వాల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో బాధపెట్టినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సినిమాల్లో డ్యాన్స్‌లు చేసే వారితో తనకు పోలికా అంటూ జయా బచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మాటలు బీజేపీని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు సమాజ్ వాది పార్టీలో ఉన్న నరేశ్ అగర్వాల్ తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ తనను సినిమా వాళ్లతో, డ్యాన్సులు చేసేవారితో పోల్చేస్థాయికి సమాజ్ వాది పార్టీ తనను దిగజార్చిందని అన్నారు. జయా వల్లనే తనకు ఎస్పీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ మాటలకు తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి కూడా ఆయన వ్యాఖ్యలు ఖండించిన నేపథ్యంలో 'నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను' అని ఆయన అన్నారు. అయితే, మీరు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లే అని తాము అనుకోవచ్చా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రిగ్రీట్ అంటే ఏమిటో నీకు అర్ధమవుతుందా అంటూ ఎదురు ప్రశ్నించారు. -
దేశంలోనే ధనిక ఎంపీ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థులంతా విధిగా తమ ఆస్తులను ప్రకటించారు. 58 స్థానాల కోసం మార్చి 23న జరుగనున్న ఎన్నికకు సంబంధించి.. సోమవారంతో నామినేషన్ల గడువు పూర్తైంది. మంగళవారం(13న) నామినేషన్ల పరిశీలన చేపడతారు. వీటిలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవం కాబోతుండటం తెలిసిందే. కాగా, ఈ సందర్భంలోనే.. ‘దేశంలోనే ధనిక ఎంపీ’ కిరీటం తలమారుతుండటం గమనార్హం. ఇన్నాళ్లూ రవీంద్ర కిశోర్ సిన్హాకు దక్కిన ఆ ప్రత్యేకత ఇకపై జయా బచ్చన్ సొంతంకానుంది. అవును. ఎన్నికల అఫిడవిట్లో రూ.1000కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన ఆమె దేశంలోనే ధనిక ఎంపీగా నిలవబోతున్నారు. జయా బచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇందుకోసం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనతోపాటు భర్త అమితాబ్‌వి కలిపి రూ.1000 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. అదే 2012లో ఆమె తన ఆస్తిని రూ.460 కోట్లుగా చెప్పుకున్నారు. అంటే, గడిచిన ఐదేళ్లలో బచ్చన్ దంపతుల ఆస్తి కళ్లుచెదిరేరీతిలో రెట్టింపైందన్నమాట! బిహార్‌కు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా.. 2014 రాజ్యసభ ఎన్నికలో రూ.800 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ ఆయనే ‘రిచెస్ట్ ఎంపీ’గా కొనసాగారు. ఇప్పుడు జయ రూ.1000కోట్ల ప్రకటనతో కిశోర్ రెండో స్థానానికి పడిపోయారు. ఆయనకు ఒక ట్రాక్టర్, నానో కారు కూడా: బచ్చన్ దంపతుల మొత్తం సంపదలో స్థిరాస్థి విలువ రూ.460 కోట్లుకాగా, చరాస్తుల విలువ రూ.540 కోట్లు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర రూ.36కోట్ల విలువచేసే ఆభరణాలున్నాయట. అదే జయ ఆభరణాల విలువ రూ.26 కోట్లు. దంపతులిద్దరికీ రోల్స్‌రాయిస్, మెర్సిడెజ్, రేంజ్ రోవర్ తదితర బ్రాడ్ల కారు మొత్తం 12 ఉన్నాయి. కాగా, అమితాబ్ పేరుమీద ఒక ట్రాక్టర్, నానో కారు కూడా ఉన్నట్లు చెప్పుకున్నారు. ఇక దంపతులిద్దరి దగ్గరా రూ.5 కోట్ల విలువైన చేతి గడియారాలున్నాయి. బిగ్ బీ దగ్గరున్న రూ.9 లక్షల పెన్నును కూడా అఫిడవిట్లో పొందుపర్చారు. వీరికి ఫ్రాన్స్‌లోని బ్రిగ్‌నోగన్‌లో 3,175 చదరపు మీటర్ల నివాస స్థలం ఉంది. భారత్‌లోనైతే నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్, ముంబై, లక్నోల్లో స్థలాలున్నాయి. -
డాన్సులు చేసే వారితో నాకు పోలికా?
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన రాజ్యసభ సభ్యుడు నరేశ్ అగర్వాల్ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సినీ నటి, రాజకీయ నేత జయా బచ్చన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన సందర్భంగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..‘సినిమాల్లో నటించే వారితో, డ్యాన్స్ చేసే వారితో పోలుస్తూ ఆ స్థాయికి నన్ను సమాజ్‌వాదీ పార్టీ దిగజార్చింది..నాకు పార్టీ టికెట్ నిరాకరించటం సబబు కాదు’ అని జయాబచ్చన్పై, సమాజ్ వాదీ పార్టీపై మండిపడ్డారు. జయ కారణంగా తనకు రాజ్యసభ అవకాశం చేజారిందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ స్పష్టంచేసింది. -
జయపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు..!
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా బీజేపీలో చేరిన ఎస్పీ కురువృద్ధుడు నరేశ్ అగర్వాల్.. బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్‌ను ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తనను కాదని ఒక బాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చిందని జయాబచ్చన్‌ను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఎస్పీ తనను అవమానించిందని పేర్కొన్నారు. పదవులు ఆశించి బీజేపీలోకి రాలేదని, ఏ బాధ్యత అప్పగించినా తాను నెరవేరుస్తానని నరేశ్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఆయన సోమవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కమలం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ‘బాలీవుడ్లో డ్యాన్ చేసే వ్యక్తి’కి టికెట్ ఇచ్చారని నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. నరేశ్ అగర్వాల్ సొంత పార్టీ బీజేపీలో చేరినప్పటికీ.. ఆయన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేశ్ అగర్వాల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ.. జయపై ఆయన వ్యాఖ్యలు అనుచితమని, ఆయన వ్యాఖ్యలను ఎంతమాత్రం ఆమోదనీయం కాదని ఆమె తేల్చిచెప్పారు. -
జయ వైపే మొగ్గుచూపుతున్న మమత
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థి విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నటి, ఎంపీ జయా బచ్చన్‌ను తమ పార్టీ తరపున పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. టీఎంసీ సీనియర్ నేత ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘జయ ఓ సమర్థవంతమైన నాయకురాలు. పైగా ఆమెకు బెంగాలీ మూలాలు ఉన్నాయి. అందుకే ఆమెను మా పార్టీ తరపున రాజ్యసభకు పంపాలని నిర్ణయించాం’ అని ఆయన వెల్లడించారు. టీఎంసీ తరపున నలుగురు ఎంపీల పదవీకాలం ముగుస్తుండగా.. ఈసారి రెండే సీట్లే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(యూపీ నుంచి) తరపున రాజ్యసభకు జయ బచ్చన్ ఇప్పటికే మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఏప్రిల్ 3న ఎంపీగా ఆమె కాలపరిమితి ముగియనుంది. మార్చి 18న మమత స్వయంగా అభ్యర్థిగా జయా బచ్చన్ పేరును ప్రకటించే అవకాశం ఉందని టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏప్రిల్‌లో రాజ్యసభలో 58 మంది ఎంపీల కాలపరిమితి ముగుస్తోంది. వీటిలో ఉత్తర ప్రదేశ్ నుంచే 10 సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్ఠంగా 312 సీట్లు కైవసం చేసుకోవటంతో ఈ దఫా వారికే రాజ్యసభలో ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీకి ఒకే సీటు దక్కే అవకాశం ఉండటంతో మమతను సంప్రదించినట్లు తెలుస్తోంది. మమతకు మద్ధతుగా అప్పట్లో... కొన్నాళ్ల క్రితం బీర్భూమ్ నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆంక్షలు విధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేవైఎం నేత యోగేష్ వర్ష్నే మమతపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఆమెను ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ’మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి’ అని ఆమె బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ఆవులను కాపాడతారు గానీ ఆడాళ్లను కాపాడరా?
-
ఆవులను కాపాడతారు గానీ ఆడాళ్లను కాపాడరా?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ బీజేపీ యువనేత చేసిన ప్రకటన పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ’మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి’ అని ఆమె ప్రశ్నించారు. బీజేవైఎం నేత యోగేష్ వర్ష్నే ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీర్భూమ్ నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి ఆంక్షలు విధించడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై లాఠీ చార్జి చేయించారని చెబుతూ మమతా బెనర్జీని దెయ్యం అని అభివర్ణించారు. ఈ విషయమై పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రకటనలను తాను కూడా ఖండిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. అయితే జయాబచ్చన్ మాత్రం ఆయన సమాధానంతో సంతృప్తి చెందలేదు. మహిళల గురించి ఎవరైనా అలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. దేశంలో మహిళలను రక్షించే తీరు ఇదేనా అని నిలదీశారు. మహిళలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని ఈ పరిస్థితిని ఎప్పటికి సరిచేస్తారని అన్నారు. అయితే దీనికి బీజేపీ సభ్యురాలు రూపా గంగూలీ దీటుగా సమాధానమిచ్చారు. తాను కూడా మహిళనేనని, తనను పోలీసుల ఎదురుగానే కొంతమంది కొట్టారని, దీనికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాధానం ఇస్తారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని దెయ్యం అంటున్నారని, రాష్ట్రంలో మతం పేరుతో అరాచకం కొనసాగుతోందని, దీన్ని అందరూ ఖండించాలని పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ అన్నారు. -
‘అమితాబ్, జయ వేర్వేరుగా ఉంటున్నారు’
ముంబై: సమాజ్ వాదీ పార్టీలో పరివార్ సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మరో బాంబు పేల్చారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. అంతేకాదు వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని తెలిపారు. అత్తాకోడళ్లు జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ కు పడడంలేదని అమర్ సింగ్ చెప్పినట్టు ‘ఏబీపీ మజ్హా’ వార్తా సంస్థ పేర్కొంది. ప్రతి విషయంలో గొడవలకు తానే కారణం అన్నట్టుగా మీడియా చూపుతుందని ఆయన వాపోతూ... ‘నేను అమితాబ్, జయబచ్చన్ లను కలిసే నాటికి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఒకరు ప్రతీక్షలో ఉంటే, మరొకరు జానక్ లో నివసిస్తున్నారు. జయ, ఐశ్వర్యరాయ్ మధ్య కూడా విభేదాలు వచ్చినట్టు ఊహాగానాలు వచ్చాయి. దీనికి నేను బాద్యుడిని కాద’ని అన్నారు. సమాజ్ వాదీ పార్టీలో చేరొద్దని జయను అమితాబ్ హెచ్చరించారని గతంలో అమర్ సింగ్ చెప్పారు. మొదట్లో అమర్ సింగ్ తో సన్నిహితంగా మెలగిన అమితాబ్ తర్వాత ఆయనను దూరం పెట్టారు. అమర్ సింగ్ వ్యాఖ్యలపై బచ్చన్ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
అత్తాకోడళ్లపై వాట్సాప్ లో జోకులు
ముంబై: నరేంద్ర మోదీ సర్కారు పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలకు నోట్ల రద్దు సెగ తాకిందని సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా నోట్ల కష్టాలు పడుతోందని వాట్సాప్ లో జోకులు షేర్ చేస్తున్నారు. ఒకే చీరను అమితాబ్ భార్య జయబచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ రాయ్ బచ్చన్ వివిధ సందర్భాల్లో కట్టుకున్న ఫొటోలు అత్తాకోడళ్లకు నోట్ల కష్టాలు అంటూ కామెంట్లు పెట్టారు. ఒకే డిజైన్ తో ఉన్న ఎరుపు రంగు చీరను అత్తాకోడళ్లను పలు సందర్భాల్లో ధరించారు. గత సెప్టెంబర్ లోనే ఈ ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. నోట్ల కష్టాల నేపథ్యంలో నెటిజన్లు మరోసారి వీటిని వెలుగులోకి తెచ్చి తమ హాస్యచతురత ప్రదర్శించారు. అయితే ఈ ప్రచారంపై బచ్చన్ కుటుంబం స్పందించలేదు. -
ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి!
ఈ ఆదివారం దీపాల పండగ. బట్టలు, మిఠాయిలు, టపాసులు కొనుక్కుంటూ చాలామంది బిజీ బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ పనులతో పాటు మరో పనితో బిజీగా ఉన్నారు. పండగ సందర్భంగా ఈ కుటుంబం బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇస్తుంటుంది. ఐదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఎవర్నెవర్ని ఆహ్వానించాలో లిస్టు తయారు చేసుకున్నారు. ‘బీ రెడీ’ అంటూ పిలుపులు కూడా అయిపోయాయ్. దీపావళి పండగ రాత్రి ఈ పార్టీ జరగనుంది. పార్టీలో పాల్గొనబోతున్న వారిలో కపూర్లూ, ఖాన్లూ కంపల్సరీ. ప్రతి ఏడాదీ వీళ్లు చేసే సందడికి కొదవ ఉండదట. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. విందులో వడ్డించ బోయేవన్నీ సంప్రదాయబద్ధమైన వంటకాలట. భారతీయ మిఠాయిలనే తయారు చేయిస్తున్నారు. నో.. మంచూరియాస్.. నో ఫ్రెంచ్ ఫ్రైస్. ఓన్లీ ఇండియన్ ఫుడ్. వంటకాలన్నీ రుచిగా ఉండేట్లు బచ్చన్ ఇంటి మహరాణులు జయాబచ్చన్, ఐశ్వర్యా రాయ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
'సినిమావాళ్లు బరితెగించారు'
ముంబై: 'సినిమాలు చూడాలంటేనే భయమేస్తోంది. మానవత్వం, సున్నితత్వం మచ్చుకైనా కనపడవు. తెరనిండా పాశ్చాత్య పోకడలు.. పొట్టపొట్టి దుస్తులు! పాత్రల్లో భారతీయత ఎక్కడుంది? సినిమాల వల్ల జనం కూడా కఠినంగా మారిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమావాళ్లు దారుణంగా బరితెగించారు. ఫిలింమేకింగ్ పచ్చి బిజినెస్ అయిందిప్పుడు. మాట్లాడితే 100 కోట్ల కలెక్షన్లు, లేదంటే తొలివారం రికార్డులు. బాబోయ్.. ఇవన్నీ నాకు ఎప్పటికీ అర్థంకాని విషయాలు. అందుకే అలాంటి చోట నేను ఉండలేను' అని బాలీవుడ్ సీనియర్ నటి, మెగాస్టార్ అమితాబ్ బచ్చన సతీమణి జయ బచ్చన్ అన్నారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్(మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా దిగ్గజ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమలో జయ బచ్చన్ మాట్లాడారు. 50వ, 60 దశకాల్లో వచ్చిన సినిమాల్లో భారతీయ జీవం ఉట్టిపడేదని, రానురాను సినిమాల్లో పాశ్చాత్య అనుకరణ ఎక్కువైపోయిందని ఆమె అన్నారు. అయితే భారతీయుల ఆలోచనా విధానం ప్రగతిశీలంగానే ఉందని పేర్కొన్నారు. జనజీవితాలను ప్రతిబించించే కొన్ని సినిమాలు మాత్రం అద్భుతంగా అనిపిస్తాయని, మసాన్, అలీగఢ్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని, అలాంటివాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని జయ చెప్పారు. -
జయ @ హౌస్ అండ్ హోమ్
జయాబచ్చన్ (68), ఎం.పి., బాలీవుడ్ నటి పూర్తి పేరు : జయ భాదురీ బచ్చన్ జననం : 9 ఏప్రిల్ 1948 జన్మస్థలం : జబల్పూర్, మధ్యప్రదేశ్ తల్లిదండ్రులు : ఇందిర, తరూణ్ కుమార్ భర్త : అమితాబ్ (శ్రీవాత్సవ్) బచ్చన్ (వివాహం : 3 జూన్ 1973) అత్తమామలు : తే జీ, హరివంశ్ రాయ్ సంతానం : శ్వేత, అభిషేక్ అల్లుడు, కోడలు : నిఖిల్ నంద, ఐశ్వర్యా రాయ్ మనవలు, మనవరాళ్లు : నవ్య, ఆగస్త్య; ఆరాధ్య బాలీవుడ్లో ‘గుడ్డీ’... జయభాదురి మొదటి సినిమా. అందర్నీ ఆకట్టుకుంది. దాంట్లో ఎన్నో సన్నివేశాల్లో మహిళకు ఉండే శక్తిని, గొప్పదనాన్ని దర్శకుడు హృషికేశ్ ఒడిసిపట్టుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు జయభాదురి అలాగే జీవించారు. ఇంట్లో కష్టం, సమాజంలోని కష్టం రెండిటినీ ప్రశ్నించారు. ఎట్ హోమ్ అండ్... ఎట్ ది పార్లమెంట్ హౌస్. ఇంటి గెలిచి, రచ్చ గెలవమని నానుడి. జయభాదురికి హోమ్‌లో, హౌస్‌లో రెండు చోట్లా జయాలే. వయసులో అమితాబ్ కన్నా జయ ఆరేళ్లు చిన్న. ఆయన 1942. ఆమె 1948. సినిమాల్లో అమితాబ్ జయ కన్నా ఆరేళ్లు చిన్న. ఆమె ఎంట్రీ 1963. ఆయన 1969. ఈక్వల్ ఈక్వల్. ఎత్తులోనే అమితాబ్ ఒక అడుగు ఎక్కువ. ఆయన 6.2. ఆమె 5.2. ఇదేం ఈక్వాలిటీని దెబ్బతీసే లెక్క కాదు! ‘ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ కింగులాంటి సీనుగాడు... ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ సుబ్బలక్ష్మికి పడిపోవడం’ సీనుగాడి గొప్పతనమైతే కాదుగా! కానీ లైఫ్‌లో ఎక్కడా గొప్పగా ఫీల్ అవలేదు జయాబచ్చన్! స్టార్‌గా, స్టార్ భార్యగా, స్టార్ తల్లిగా, స్టార్ అత్తగారిగా... కనీసం నార్మల్ అత్తగారిగా కూడా జయ తనేమిటో ఎప్పుడూ చూపించుకోలేదు. ఆ దర్పం ఆమెలో వ్యక్తం కాదు. రాజకీయ దర్జా కూడా కనిపించదు! సినిమాల్లో పోషించిన పాత్రకు న్యాయం చేకూర్చినట్లే... నిజ జీవితంలోనూ బాధ్యతగా, నిబద్ధతగా గడిపారు. గడుపుతున్నారు. మనిషి గానీ, కుటుంబం గానీ, సమాజం గానీ క్రమశిక్షణతో లేకపోతే జయకు కోపం వస్తుంది. అక్కడికక్కడే అడిగేస్తారు. అవసరమైతే కడిగేస్తారు. రాజ్యసభలోనూ అంతే. సమస్యల్ని ఎత్తి చూపించడంలో ఆమె చాలా నిక్కచ్చిగా ఉంటారు. మొన్నటి వర్షాకాల సమావేశాల వరకు జయాబచ్చన్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నల సంఖ్య 343. తక్కిన సెలబ్రిటీ ఎంపీలతో (మిథున్, రేఖ, సచిన్ తదితరులు) పోల్చుకుంటే ప్రశ్నలు అడగడంలో అందరికన్నా జయే ఫస్ట్. పార్లమెంటుకు హాజరవడంలో కూడా కిరణ్ ఖేర్ (84 శాతం) తర్వాతి స్థానం జయదే (79 శాతం). అయితే ప్రశ్నలు అడగడంలో ఖేర్ కంటే కూడా జయ ముందున్నారు. ఖేర్ అడిగింది 109 ప్రశ్నలే. ఇటీవల ఓ రోజు... ముంబై నర్సీ మాంజీ కాలేజ్‌లో ఫెస్టివల్ జరుగుతోంది. జయాబచ్చన్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్టేజి మీద ప్రముఖ జర్నలిస్టు భావనా సొమాయాతో డిబేట్ నడుపుతున్నారు జయ. ఆమె మాట్లాడుతున్నది చాలా సీరియస్ విషయం. సామాజిక ధోరణులు-భావి తరాలు లాంటి ముఖ్యమైన చర్చ. మధ్యలో ఫొటోగ్రాఫర్లు తమ పనిలో తాము ఉన్నారు. వాళ్లకు విద్యార్థులు తోడయ్యారు. ఆపకుండా జయను ఫొటోలు తీస్తూనే ఉన్నారు. లైట్ కళ్లలో పడడంతో ఇబ్బంది పడిపోతున్నారు జయ. ఆపుతారేమోనని చూశారు. ఎవరూ ఆపట్లేదు. క్లిక్ కొడుతూనే ఉన్నారు. జయకు కోపం వచ్చింది. ‘‘మేనర్స్ లేదా మీకు?’’ అని పెద్దగా అరిచారు. ‘‘మీకు ఫొటోలే ముఖ్యమైతే ముందు ఫొటోలు తీసుకోండి. ఆ తర్వాతే మాట్లాడతాను’’ అన్నారు. ‘‘అసలు ఒక మనిషి పర్మిషన్ లేకుండా మీరెలా ఫొటోలు తీసుకుంటారు’’ అని మందలించారు. సభ్యత తెలియకుండా పెరిగిన పిల్లలు సమాజానికి చికాకుగా మారతారు అని ఆ తర్వాత తన ప్రసంగంలో హెచ్చరించారు ఆమె. అంతకుముందోసారి... ప్రెస్ మీట్. అత్తాకోడళ్లు ఒకచోట ఉన్నారు. మీడియా ప్రతినిధులు ‘ఐష్.. ఐష్’ అని గుక్కతిప్పుకోకుండా ఫొటోల కోసం, ప్రశ్నల కోసం ఐశ్వర్యను ఇబ్బంది పెడుతున్నారు. జయ సహనం సన్నగిల్లింది. ‘‘ఐష్ ఏమిటి.. ఐష్! తనేమైనా మీ క్లాస్మేటా? గౌరవంగా సంబోధించడం తెలియదా?’’అని విరుచుకుపడ్డారు. జయకు మొహమాటాలు ఉండవు. మీడియా అయినా, తోటి సెలబ్రిటీలైనా.. రాజకీయ సహచరులైనా ఒక్కటే. ఐశ్వర్య, సల్మాన్‌ఖాన్‌ల గొడవ గురించి షారుక్ ఖాన్ ఏదో తప్పుగా మాట్లాడాడని తెలిసినప్పుడూ ఆమె తన కోపాన్ని దాచుకోలేదు. ‘‘షారుక్ అలా అనకుండా ఉండాల్సింది. అదే మా ఇంట్లో ఉన్నప్పుడు అని ఉంటే అతడి చెంప పగలగొట్టి ఉండేదాన్ని’’ అని అన్నారు. షారుక్‌ని ఆమె కొడుకులా చూసుకున్నారు. అందుకే అభిషేక్‌ని కోప్పడినట్లే అతడినీ కోప్పడగలనని చెప్పడానికి ఆ మాట అన్నారు. ఫ్యామిలీని డిస్టర్బ్ కానివ్వరు సినిమాల్లో, రాజకీయాల్లో జయాబచ్చన్ వేర్వేరు పాత్రల్ని పోషిస్తూ ఉండి ఉండొచ్చు. కానీ వ్యక్తిగా ఆమె ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కూతురు పుట్టాక సినిమాలకు దూరంగా ఆమె కొన్నేళ్ల పాటు గృహిణిగానే ఉండిపోయారు. తనకై తానుగా తీసుకున్న నిర్ణయం అది. తన భర్తకి, నటి రేఖకు సంబంధం ఉందని వచ్చిన వార్తల విషయంలో కూడా ఆమె ఎంతో హూందాగా వ్యవహరించారు. ‘‘కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి రావడం మామూలే. అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇల్లు నరకమైపోయుండేది’’ అని నవ్వుతూ అంటారు. ఎంట్రీ... బ్రేక్... రీ ఎంట్రీ... జయ సంప్రదాయ బెంగాలీ కుటుంబపు ఆడపిల్ల. తండ్రి జర్నలిస్ట్. రంగస్థల నటుడు. జయ పుట్టింది మధ్యప్రదేశ్. ఉంటున్నది మహారాష్ట్ర. రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉత్తర ప్రదేశ్. భూపాల్‌లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు జయ. 1966 రిపబ్లిక్ డే ఉత్సవాల్లో బెస్ట్ ఆలిండియా ఎన్.సి.సి. క్యాడెట్ అవార్డు అందుకున్నారు. తర్వాత పుణెలోని ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో శిక్షణ. 1971లో ‘గుడ్డి’ నుంచి, 1973లో అమితాబ్‌తో పెళ్లయ్యే వరకు జయ దాదాపు 20 చిత్రాల్లో నటించారు. కాబోయే భర్త అమితాబ్‌తో జయ నటించిన తొలి సినిమా ‘బన్సీ బిర్జూ’. పెళ్లయ్యాక మరో 13 చిత్రాల్లో నటించి ‘సిల్సిలా’ (1981)తో బ్రేక్ తీసుకున్నారు. తిరిగి 17 ఏళ్ల తర్వాత 1998లో ‘హజార్ చౌరాసీ కీ మా’తో రీ ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో చిన్న చిన్న చిత్రాలు అంతే. ఈ విరామ కాలంలో పిల్లల పెంపకంతోటే సరిపోయింది జయకు. గుట్టుగా ఉండే అమ్మాయి కారణాలు ఏవైనా... అమ్మాయిలు గుంభనంగా ఉండిపోతారు. అబ్బాయిలు అలాక్కాదు. ఇంతుంటే అంత! ‘అభిమాన్’ చిత్రానికి, జయాబచ్చన్‌ల పెళ్లికి ఒకటే వయసు. 1973 జూలై 27న అభిమాన్ రిలీజ్. సరిగ్గా వారం రోజులకు జయాబచ్చన్‌ల పెళ్లి. ప్రేమను గుట్టుగా ఉంచినట్టే, పెళ్లి విషయాన్నీ ఆఖరి నిమిషం వరకు ప్రచారం కానివ్వకుండా జాగ్రత్త పడదాం అని చెప్పారు జయ. అమితాబ్ సరే అన్నారు. కార్డులు ప్రింట్ అయ్యాయి. జయ గాడ్ ఫాదర్ హృషికేశ్. గుడ్డి, అభిమాన్.. ఇంకా జయ నటించిన చాలా సినిమాలు ఆయన దర్శకత్వం వహించినవే. కార్డు ఇచ్చి ‘‘మీరు తప్పకుండా రావాలి’’ అన్నారు జయ. ‘‘సారీ.. రాలేనమ్మా... వేరే పెళ్లికి వెళుతున్నా’’ అన్నారు హృషికేశ్. జయ హతాశురాలయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.‘‘మీరు లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది?’’ అని ఆవేశంగా ఊగిపోతూ అడిగారు. హృషికేశ్ పెద్దగా నవ్వారు. ‘‘అరె పగ్లీ.. అమిత్ నె ముఝే పెహ్లీ హై ఇన్వైట్ కియా హై. ఇస్లీయే అబ్ మై అమిత్ కె తరఫ్ సె తెరీ షాదీ మే ఆవూంగా’’ అన్నారు. ఆమె కన్నీళ్లు తడిచారు. వాత్సల్యంగా హత్తుకున్నారు. అమితాబ్ చేసిన ‘ద్రోహం’ జయకు అర్థమైపోయింది. తనకన్నా ముందే వెళ్లి పిలిచాడన్నమాట! అమ్మకు ప్రేమతో... మొన్న మదర్స్ డే కి కూతురు శ్వేత తల్లిపై రాసిన ఒక కాలమ్‌ని అమితాబ్ బచ్చన్ తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు. ‘‘మై మదర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఉమన్, ఎ బ్యూటిఫుల్ ఉమన్, ఎ ఫెమినైన్ ఉమన్, ఎ ట్రెడిషనల్ ఉమన్, ఎ కెరియర్ ఉమన్’’ అని.. అందులో తల్లి గురించి రాశారు శ్వేత. అవన్నీ కలిసిందే... జయ బయోగ్రఫీ. ‘కూలీ’ చిత్రం షూటింగ్లో అమితాబ్ తీవ్రంగా గాయపడి కొన్ని నెలల పాటు ఇంచుమించు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అమితాబ్ సొంత కంపెనీ ‘ఎ.బి.సి.ఎల్. నష్టాల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు; మీడియాను అమితాబ్, అమితాబ్‌ను మీడియా వెలివేసినప్పుడు.. ఈ మూడు గడ్డు దశల్లో కుటుంబానికి జయ ఒక ధైర్యంగా నిలబడడం అన్నది ఆ బయోగ్రఫీలో ఒక స్ఫూర్తివంతమైన అధ్యాయం. సినిమాలు - రాజకీయాలు ►1963లో తన 15వ యేట సినిమాల్లోకి, 2004లో తన 56వ యేట రాజకీయాల్లోకి వచ్చారు జయాబచ్చన్ ►నేటికీ సినిమాల్లో, రాజకీయాల్లో ఆమె క్రియాశీలంగా ఉన్నారు. ► జయ ఇప్పటివరకు చిన్నవి, పెద్దవి కలిపి 50కి పైగా చిత్రాల్లో నటించారు. ►ఆమె నటిస్తున్న తాజా చిత్రం హెరా ఫెరీ-3. ►ఇది 2017లో విడుదల అవుతుంది. ►సమాజ్‌వాదీపార్టీ తరఫున 2004లో జయ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ►పూర్తికాలం 2010 వరకు కొనసాగి, రెండేళ్ల విరామం తర్వాత, తిరిగి 2012లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ►2018 ఏప్రిల్ 2 వరకు ఆమె ఆ పదవిలో ఉంటారు. మరికొన్ని విశేషాలు ► పుణెలోని ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో జయ గోల్డ్ మెడల్ విద్యార్థిని. ►బాలీవుడ్ ఆణిముత్యం ‘షహెన్షా’ (1988) చిత్రానికి కథను అందించింది జయా బచ్చనే! ►‘షోలే’ చిత్రంలో నటించేనాటికి జయ గ ర్భిణి. ►షోలేలో అమితాబ్ మనసు దోచుకున్న అమ్మాయి రాధగా జయ నటించారు. జయ 1974 మార్చి 17న తొలి సంతానం శ్వేతకు జన్మనిచ్చారు. షోలే 1975 ఆగస్టు 15న విడుదలైంది. జయా అమితాబ్‌ల పెళ్లి జరిగింది కూడా షోలే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కావడం విశేషం. జయ నటించిన చివరి బెంగాలీ సినిమా ‘సన్‌గ్లాస్’ (2013) జయకు 1992లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. -
'ఛోటీ బీవీ'ని గుర్తుచేసుకున్న బిగ్ బీ!
'జిస్కీ బీవీ ఛోటీ, ఉస్కా భీ బడా నాం హై .. గోద్మే బైఠాలో.. బచ్చేకా క్యా కామ్ హై'.. దాదాపు 35 ఏళ్ల కిందట వచ్చిన 'లావారిస్' సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాడిన పాట ఇది. మూడున్నర దశాబ్దాలు గడిచిపోయినా భాషలకు అతీతంగా భారతీయులందరినీ ఈ పాట ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. 'మేరే అంగ్నేమే తుమ్హారా క్యాం కామ్ హై' అంటూ సాగే ఈ పాట అప్పట్లో చాలా సూపర్ హిట్ అయింది. ఈ పాటను అమితాబ్ పాడిన స్టైల్ ఎంతో ఆకట్టుకుంది కూడా. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాల్లోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ జారుకున్నారు. 'మేరే అంగ్నేమే' పాటను పాడుతూ.. 'జిస్కీ బీవీ ఛోటీ, ఉస్కా భీ బడా నాం హై' అన్న చరణం వద్ద తన భార్య జయాబచ్చన్‌ను ఎత్తుకునే దృశ్యాన్ని ఆయన నెమరువేసుకున్నారు. అదే సమయంలో న్యూయార్క్‌లో లతా మంగేష్కర్ సంగీత కచెరీ సందర్భంగా ఆమె కోరిక మేరకు వేదికపై తాను ఈ పాట పాడానని, దాంతో శ్రోతల నుంచి ఊహించిన ప్రతిస్పందన వచ్చిందని, ప్రేక్షకులంతా ముందుకు వచ్చి తనతోపాటు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారని, దీంతో వారిని నియంత్రించడం న్యూయార్క్ పోలీసులు చాలా సమయమే పట్టిందని ఆయన వివరించారు. -
అమితాబ్ నన్ను అప్పుడే హెచ్చరించాడు!
ముంబై: పనామా ప్రకంపనల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అజయ్ దేవగణ్ చిక్కడం హిందీ సినీ పరిశ్రమను కుదిపేసింది. పన్ను ఎగవేతకు స్వర్గధామల్లాంటి దేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచి.. అక్రమంగా డబ్బు దాచుకునేందుకు పనామాలోని 'మోసాక్ ఫొన్సెకా' అనే లా కంపెనీ సేవలు వీరు వాడుకున్నారన్నది ప్రధాన అభియోగం. అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తన పేరును దుర్వినియోగం చేసి విదేశాల్లో బోగస్ కంపెనీలు తెరిచినట్టు కనిపిస్తున్నదని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై ఇటీవల ఒకప్పటి బిగ్ బీ సన్నిహితుడు, యూపీ రాజకీయ నేత అమర్‌సింగ్ ఒకింత ఆగ్రహంగా స్పందించారు. అమితాబ్ పనామా పత్రాల వివాదంలో చిక్కుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా.. 'రెండురోజుల కిందటే నేను పబ్లిగ్గా చెప్పాను. ఐశ్వర్య గానీ, అభిషేక్గానీ నా పట్ల అమితమైన గౌరవం చూపుతారు. అమితాబ్ తోనూ నాకెలాంటి గొడవ లేదు. నిజానికి ఆయనే నన్ను ఓసారి హెచ్చరించాడు. జయాబచ్చన్‌కు స్థిరచిత్తం ఉండదని, ఆమెను మీ రాజకీయాల్లోకి (పార్టీలోకి) తీసుకోవద్దని సూచించాడు. కానీ, నేను ఆయన ఉదాత్తమైన సలహాను వినలేదు. జయ అలవాట్లు, అస్థిరమైన ధోరణి కారణంగా ఆమె నుంచి ఎలాంటి కచ్చితత్వాన్ని ఆశించవద్దని అమితాబ్ నన్ను హెచ్చరించాడు. ఆమె తరఫున నాకు ఆయన క్షమాపణలు చెప్పాడు కూడా. అక్కడితో ఈ విషయం ముగిసిపోయింది. కానీ ఆ తర్వాత అనిల్ అంబానీ నివాసంలో డిన్నర్ సందర్భంగా జయాబచ్చన్ వల్ల ఓ గొడవ జరిగింది. ఈ వివాదంలో బచ్చన్ కూడా తలదూర్చారు. కాబట్టి (పనామా వివాదంపై) ప్రశ్నలను అరుణ్ జైట్లీని అడగండి. లేదా ఈ వివాదాన్ని దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీలను అడగండి. అదీ కుదరకపోతే అమితాబ్‌నే నేరుగా అడగండి. నన్ను వదిలేయండి. అమితాబ్ ప్రసక్తి లేకుండా శాంతియుతంగా ఉండనివ్వండి' అని అమర్ చెప్పుకొచ్చారు. -
'మరోసారి దేశ విభజన తప్పదేమో!'
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి దేశ విభజన తప్పదేమోనని బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. వలస కార్మికులు లక్ష్యంగా దాడులు జరుగుతుండటాన్ని ఆమె సభలో ప్రస్తావించారు. 'మన దేశం మరోసారి చీలిపోవచ్చు. అయితే ఈసారి విదేశీయుల వల్ల కాదు స్వదేశీయుల వల్ల ఇది జరుగుతుంది. మతం, కులం, భాష ఆధారంగా విభజన ఏర్పడుతున్నది' అని ఎస్పీ ఎంపీ అయిన ఆమె బుధవారం రాజ్యసభలో పేర్కొన్నారు. 'ఉపాధి, ఉద్యోగాల కోసం ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడి భాష మాట్లాడనందుకు వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. అంతేకాకుండా వారిని బెదిరిస్తున్నారు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో మరాఠేతరులకు ఆటోరిక్షా పర్మిట్లు ఇస్తే.. ఆ ఆటోలను తగలబెడతామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే బెదిరించిన నేపథ్యంలో జయాబచ్చన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'
ముంబయి: దాదాపు 40 ఏళ్ల తరువాత.. అలనాటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'షోలే' తారాగణమంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. వారందరినీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకం చేసింది. హేమమాలిని తొలి సంగీత ఆల్బమ్ 'డ్రీమ్ గర్ల్' ఆవిష్కరణ వారంతా ఒక వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ తదితరులు హాజరయ్యారు. '40 ఏళ్ల తరువాత హేమామాలిని మ్యూజిక్ ఆల్బమ్ షోలే చిత్ర సభ్యులను ఒకే చట్రంలోకి తీసుకొచ్చింది' అని అమితాబ్ మంగళవారం తన బ్లాగులో పోస్ట్ చేశారు. 'మా జట్టులోని సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ మన మధ్యలో లేరు. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ ఆ ఎదురుచూపులను గుర్తిస్తుంది. ధర్మేంద్ర, హేమమాలిని మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. కానీ మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది' అని అమితాబ్ అన్నారు. ఈ ఆల్బమ్‌లోని 'అజీ సునియే జరా' అనే పాటను సంగీత దర్శకుడు బాబుల్ సుప్రియోతో కలిసి హేమమాలిని పాడింది. ఈ పాటలోని బిగ్ బిసే లేకే పాజి అనే పదాలు అమితాబ్, ధర్మేంద్రలను సూచిస్తాయి. 'కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను పరీక్షించుకోలేదు. ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నాను. గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను' అని హేమమాలిని అన్నారు. 1973లో కిశోర్ కుమార్‌ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ఔను... వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు!
అది ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న అవార్డుల వేడుక. అలనాటి స్టార్స్ రిషీ కపూర్, అమితాబ్ బచ్చన్ల నుంచి ఈ తరం స్టార్స్ రణ్వీర్ సింగ్, వరుణ్ ధావన్, దీపికా పదుకొనే, సోనమ్‌కపూర్ వరకు ఎంతో మంది తారలు ఈ వేడుకకు హాజరై, ఓ ప్రత్యేకతను తీసుకొచ్చారు. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయింది. అవార్డులూ, ఆటపాటలనూ ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీల దృష్టంతా హఠాత్తుగా ముందు వరుసపై పడింది. అక్కడ అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆ వేడుకకు వచ్చిన నటి రేఖ ఆమె పక్కకు వచ్చారు. ఇప్పుడు వీళ్లిద్దరూ పలకరింపుగా నవ్వుకుంటారా? ఎప్పటిలానే పళ్లు పటపటలాడిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్ చేస్తే.. జయ, రేఖ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జయాబచ్చన్ పక్కనే కూర్చొన్నారు రేఖ. నిన్న మొన్నటివరకూ కనీసం హాయ్ కూడా చెప్పుకోవడానికి ఇష్టపడని ఆ ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. ఇది అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమితాబ్ బచ్చన్-రేఖల మధ్య ఎఫైర్ ఉందని కొన్ని దశాబ్దాలుగా హిందీ పరిశ్రమలో ఓ టాక్. జయాబచ్చన్‌ని పెళ్లి చేసుకున్నాక రేఖతో అమితాబ్ కలిసి నటించకపోవడానికి కారణం కూడా అదే అంటారు. చివరికి జయ-రేఖ మాట్లాడటం కూడా మానేశారు. ఎక్కడైనా ఎదురుపడితే చురుగ్గా చూసుకోవడం తప్ప పలకరింపుగా నవ్వుకున్న దాఖలాలు లేవు. అలా ఏళ్ల తరబడి ఉన్న వైరాన్ని పక్కనపెట్టి ఇలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం టాపిక్ అయ్యింది. -
కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా జయా బచ్చన్
హైదరాబాద్: కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా తార జయా బచ్చన్ వ్యవహరించనున్నారు. ఆమె భర్త అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అనేక రకాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే భారతీయ మహిళకు జయా బచ్చన్ ప్రతిరూపమని, ఆమెతో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని కల్యాణ్ జ్యువెలర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణ రామన్ చెప్పారు. తమ జాతీయ బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్, కొత్త బ్రాండ్ అంబాసిడర్ జయా బచ్చన్లపై కొత్తగా టీవీ కమర్షియల్(టీవీసీ)ను తీశామని తెలిపారు. దీన్లో తమ తాజా ఉత్పత్తి-ముద్ర కలెక్షన్ గురించి ఉంటుందన్నారు. -
చెరగని చిరునవ్వు
వండర్ జెండర్ రేపు (మార్చి 8) మహిళా దినోత్సవం. పూర్తిగా ‘లేడీస్ ఓన్లీ’ ఈవెంట్. ఇందులోక్కూడా మగాళ్లు దూరేసి, మహిళల గొప్పదనం గురించి మాట్లాడ్డం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ‘ఇందులో ఇబ్బందేముందీ, వాళ్ల వైపే కదా మాట్లాడబోతాం’ అని మనం అనుకోవచ్చు. లేడీస్ వాష్ రూమ్‌ని లేడీసే క్లీన్ చెయ్యాలి. ‘క్లీన్ చెయ్యడం మీ కోసమే కదా’ అని చీపురుకట్ట, బకెట్ పట్టుకుని మగాళ్లు వచ్చేస్తే స్త్రీలు ఇబ్బంది పడడంలో అసహజత్వం ఏముంటుంది? మేల్ ఫెమినిస్టుల్లా మగాళ్లు మాట్లాడడమూ ఇలాంటిదే. పైగా మగవాడి అహంకారంలో, ఆధిక్యంలో ఉండే సహజత్వం... అతడిలోని ‘స్త్రీ సానుకూల ధోరణి’లో కనిపించదు. ఏడ్చే మగాణ్ణయినా నమ్ముతుంది కానీ, యావత్ మహిళాలోకం తరఫున ఏడ్చే సగటు మగాణ్ణి స్త్రీ అస్సలు నమ్మదు. మరేం చేద్దాం? చాలా చెయ్యొచ్చు... ప్రశంసా పత్రాలు ఇవ్వడం కాకుండా! ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌కి రంగురంగుల కాగితాలు కట్టి రావచ్చు. పింక్ కలర్ బెలూన్లు ఊది ఇవ్వొచ్చు. మహిళలు కట్ చేయబోతున్నది ప్రపంచ పటమంత భారీ కేక్ అయితే కనుక దాన్ని మోయడానికి చొక్కా చేతులు పైకి మడిచి వెళ్లొచ్చు. ఏదైనా కాస్త దూరం నుంచే చేయాలి. ఏం చేసినా సహాయం చేస్తున్నట్టుగా కాకుండా చెయ్యాలి. ఎందుకింతగా ఒళ్లు దగ్గరపెట్టుకోవడం? ఎందుకంటే, మగాళ్లకి ఏమంత మంచి పేరు లేదు. అయినా మగాళ్ల మంచితనం గురించి మాట్లాడుకోడానికి మహిళా దినోత్సవమే దొరికిందా మనకి?! ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. అబ్బే... ఈ ఇడియమ్ మనకి సెట్ అయ్యేలా లేదు. మేల్ ఛావనిస్ట్ పిగ్ లము కదా. ఈ రకం పిగ్గులకేమైనా డేస్ ఉన్నాయేమో వెతుక్కోవాలి. మహిళల ప్రయత్నాలను ప్రశంసిస్తూ, అభినందిస్తూ, వాళ్ల ప్రతిభను చూసి అబ్బురపడుతూ, నివ్వెరపోతూ... ఎన్ని విధాలుగా మనం మన శౌర్య వినమ్రతను (షివల్రీ) ప్రదర్శించినా పట్టించుకునే తీరిక, ముంద సలు మన మాటలపై వారికొక సదభిప్రాయం ఉండవని చెప్పి ఎంతసేపని మౌనంగా ఉండిపోగలం చెప్పండి? నిజం మాట్లాడుకుని తీరాలి. విమెన్ ఆర్ రియల్లీ వండర్ఫుల్... మన మాటకు వారి దృష్టిలో విలువున్నా, లేకున్నా! ప్రపంచమంతా మార్చి 8న మహిళా దినోత్సవం అంటోంది కానీ, ప్రతి రోజునూ మహిళ ఒక దినోత్సవంగా నెట్టుకొస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఉత్సవాన్ని ఎవరైనా సంతోషంగా జరుపుకుంటారు. ఈ ‘నెట్టుకురావడం’ ఏమిటి? నెట్టుకురావలసిన పరిస్థితులనే స్త్రీ ఎప్పటికప్పుడు ఒక ఉత్సవంగా మలచుకుంటూ ఉంటుందని! ఇదిగో ఇందుకే నమ్మరు మహిళలు మన మగాళ్లను. ఉబ్బేయడానికీ ఒక హద్దూపద్దూ ఉండొద్దా అని వారి ఉద్దేశం కావచ్చు. కానీ కొన్ని నిజాలనైనా వాళ్లు గొప్ప సహానుభూతితో అంగీకరించాలి. ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ నిశ్చలమైనవి, నిర్జీవమైనవీ! మరి అద్భుతాలు ఎలా అయ్యాయి? మనిషిలోని జీవం వల్ల, చలనశీలత వల్ల. నిజానికి ఆ ఏడు అద్భుతాలను మించిన అద్భుతం... మహిళ! వాటిలా ఆమెది నిశ్చలమైన, నిర్జీవమైన స్వభావం కాదు కనుక. మరి ఎందుకని ఆమె అద్భుతం కాకుండా పోయింది? ఆమె పట్ల మగవాళ్ల నిశ్చలత్వం వల్ల, జీవరాహిత్యం వల్ల. స్త్రీలోని అద్భుతం ఆమె క్రియాశీలత లో కనిపిస్తుంది. పడిపోతున్నా, పైకి లేవడానికి ఆమె చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఆమెలోని అద్భుతాలు లెక్కలేనన్ని. ప్రపంచంలో జరుగుతున్న పనిలో 66 శాతం ఆమెదే. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 50 శాతం ఆమె చేస్తున్నదే. కానీ ఆమె పొందుతున్న ప్రతిఫలం 10 శాతం మాత్రమే. ఆమె పేరున ఉన్న సంపద 1 శాతం మాత్రమే. ఇలాంటి శాతాలు చాలానే ఉన్నాయి. శ్రమ ఎక్కువ. గుర్తింపు తక్కువ. అయినా నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లోనూ మహిళ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అదీ అద్భుతం! సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా నెలకు లక్ష రూపాయల జీతాన్ని తెచ్చుకునే హడావుడిలో కూడా ఇంట్లో పూలకుండీకి నీళ్లు పోయందే క్యాబ్ ఎక్కని అద్భుతం మిహ ళ! తరగని ఇంటిపనిలో చెరగని చిరునవ్వుతో ‘గృహిణి’గా జీవితాంతం పనిచేసే అన్ పెయిడ్ అద్భుతం మహిళ! ఎందుకు అంత అద్భుతం అంటే... మగాళ్లం మనం అలా చేయలేం. ఎందుకని చేయలేం అంటే ఏమో చెప్పలేం. ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అని చెప్పడమంత తేలిక కాదేమో... మనకు మనం ఒక క్యారెక్టరైజేషన్‌ను ఇచ్చుకోవడం. -
జయ బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన అభిషేక్
ముంబై: హ్యపీ న్యూ ఇయర్ చిత్రంపై తన తల్లి జయబచ్చన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తొలిసారి పెదవి విప్పారు. తన తల్లి జయబచ్చన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అభిషేక్ తెలిపారు. షారుక్ నిర్మించిన ఈ చిత్రంపై చెత్త చిత్రమంటూ జయబచ్చన్ వ్యాఖ్యలు చేసినట్టు ఓ కథనం మీడియాలో వచ్చింది. ఆతర్వాత అమితాబ్ బచ్చన్, షారుక్ లు వార్తను ఖండించారు. జయబచ్చన్ మాట్లాడిన సమయంలో ఉన్న వారికి వాస్తవం తెలుసు. ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని రుజువైంది. ఆ వార్తను ప్రచురించిన వాళ్లే తెల్ల ముఖం వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మీడియా సెన్సేషనల్ వార్తల కోసం ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. సంచలన వార్తల కోసం ప్రయత్నించకుండా వాస్తవాలు రాయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని అభిషేక్ అన్నారు. వివాదస్పద వ్యాఖ్యలు మీడియాలో రావడం చాలా దురదృష్టకరమైన సంఘటన అని అభిషేక్ అన్నారు. హ్యాపీ న్యూఇయర్ చిత్రంలో ఓ ప్రధాన పాత్రను అభిషేక్ బచ్చన్ పోషించిన సంగతి తెలిసిందే. -
జయా బచ్చన్ కు షారుక్ కౌంటర్
‘‘ఇలాంటి చిత్రాల్లో నటించాల్సి వస్తుందనే భయంతోనే నేనీ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఈ మధ్యకాలంలో వచ్చిన అర్థరహితమైన చిత్రమంటే ఇదే. ఈ విషయాన్ని ఆ చిత్రబృందానికి చెందిన ఒకరిద్దరితో నేరుగానే చెప్పాను’’ అని నటి, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ అన్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం గురించి ఇటీవల ఆమె అలా ఘాటుగా స్పందించారు. షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనె తదితర భారీ తారాగణంతో ఫరా ఖాన్ దర్శకత్వంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కుమారుడు అభిషేక్ నటించాడన్న పక్షపాతం చూపించకుండా జయా బచ్చన్ ఈ చిత్రంపై విమర్శల వర్షం కురిపించడం ఆమె ముక్కుసూటితనానికి నిదర్శనమని హిందీ రంగంలో చాలామంది ఆమెను అభినందిస్తున్నారు. కానీ, ఈ మాటలు అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యారాయ్లను షాక్‌కి గురి చేశాయి. షారుక్ ఏమైనా అనుకుంటారేమోనని అమితాబ్ స్వయంగా ‘సారీ’ అంటూ మెసేజ్ పెట్టారట. ఇక... అభి, ఐష్ క్షమాపణలు చెప్పడానికి ఏకంగా షారుక్ ఇంటికే వెళ్లిపోయారట. కానీ, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరని భోగట్టా. ఒకపక్క జయ చేసిన వ్యాఖ్యల గురించి బాలీవుడ్లో వాడిగా వేడిగా చర్చ జరుగుతుంటే, మరోపక్క షారుక్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేశారట. ‘‘మీ భర్త నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం కూడా అర్థరహితంగా ఉండేదని అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, అదే చిత్రాన్ని ఇప్పుడు క్లాసిక్ అంటున్నారు’’ అని జయాబచ్చన్ తోనే ఆయన కూల్‌గా అన్నారట. ఏది ఏమైనా జయ ముక్కుసూటితనంఅమితాబ్ బచ్చన్, ఖాన్ కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైందనీ, షారుక్ అంత సులువుగా జయ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారనీ సమాచారం. -
'అంత పనికిమాలిన సినిమా చూడలేదు'
హ్యాపీ న్యూ ఇయర్.. షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా. ఇది బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టి.. ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించిందని అభిషేక్ తండ్రి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం ప్రశంసించారు. కానీ.. అభిషేక్ తల్లి, అలనాటి హీరోయిన్ జయాబచ్చన్‌కు మాత్రం ఈ సినిమా ఎందుకో అస్సలు నచ్చలేదు. ఇటీవలి కాలంలో తాను చూసిన అత్యంత పనికిమాలిన (నాన్సెన్సికల్) సినిమా ఇదేనని ఆమె చెప్పారు. ''కేవలం అభిషేక్ అందులో ఉన్నాడు కాబట్టే ఆ సినిమా చూశాను. కెమెరా ఎదురుగా అంత చెత్తగా కూడా నటించావంటే నువ్వు చాలా గొప్ప నటుడివని కూడా వాడికి చెప్పాను'' అని జయాబచ్చన్ మండిపడ్డారు. ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టే తాను నటించడం కూడా మానుకున్నట్లు ఆమె చెప్పారు. ఇదివరకు సినిమా అంటే కాస్త కళాదృష్టి కూడా ఉండేదని, ఇప్పుడు దాన్ని కేవలం వ్యాపారంగానే భావిస్తుండటం వల్లే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చెప్పారు. -
‘మెగా’ ఫెస్టివల్...
దీపావళి అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తన ఇంట అంతలా అదిరిపోయే సెలబ్రేషన్స్‌తో ఊపేస్తాడు బిగ్ బీ. ముఖ్యంగా ఆయన సతీమణి జయాబచ్చన్ అయితే మరీను! గెస్ట్ లిస్ట్ నుంచి డెకరేషన్ వరకు అన్నీ తానే అయిపోతుంది. ఈసారి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులే వాడాలని నిర్ణయించారట. సంప్రదాయబద్ధంగా జరిపే ఈ సంబరాల గెస్ట్ లిస్ట్‌లో అనిల్ కపూర్, షారూఖ్‌ల ఫ్యామిలీలు, దీపికా పడుకొనే, కంగనా రనౌత్, జావేద్ అక్తర్, షబనా ఆజ్మీ, జోయా అక్తర్, హనీ ఇరానీ తదితర ప్రముఖులున్నారట. -
ఆ రేడియో జాకీలపై చర్యలు తీసుకోండి:ఎంపీలు
న్యూఢిల్లీ:పార్లమెంటరీయన్లను అదే పనిగా విమర్శిస్తూ జోక్ లు వేస్తున్న రేడియో జాకీలపై చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో రేడియో జాకీలుగా పనిచేస్తున్న వారు ఎంపీలనే లక్ష్యంగా పెట్టుకుని మిమిక్రీ చేస్తున్నారని జయ బచ్చాన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. అటువంటి రేడియో స్టేషన్లపై, ఆ తరహా మిమిక్రీ చేసే రేడియో జాకీలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 'రాజ్యసభలో ఏ చర్చ జరుగుతున్నా ఆక్షేపణలకు గురౌతుంది. ప్రస్తుత కాలంలో కొన్ని స్టేషన్లు వార్తల కోసం పార్లమెంట్ ను ఎంచుకుంటున్నాయి. చాలా మంది ఎంపీలపై కామిడీ చేస్తూ ఆ స్టేషన్లు తప్పుదోవలో పనిచేస్తున్నాయి. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని జయ పేర్కొన్నారు. కాగా, ఆమె డిమాండ్ కు పలువురు ఎంపీల నుంచి మద్దతు లభించింది. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్, బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్రాలు అండగా నిలిచారు. రాను రాను ఈ సంప్రదాయం మరీ ఘోరంగా మారిపోతుందని వారు జయకు మద్దతు తెలిపారు. అయితే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. -
వీళ్లు సీతారాములు...అతను హనుమంతుడు!
అమితాబ్ బచ్చన్ తన దగ్గర పనిచేసేవాళ్లని ఎంతో బాగా చూసుకుంటారట. పండగలకు, ఇతర విశేష సందర్భాలకు భారీగా బహుమతిలివ్వడంతో పాటు వారు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారట. తన సిబ్బంది గురించి అంత ఆలోచిస్తారు కాబట్టే, నలభై ఏళ్లుగా తన దగ్గరే మేకప్‌మేన్‌గా చేస్తున్న దీపక్ సావంత్ నిర్మించిన నాలుగు చిత్రాల్లో నటించారు అమితాబ్. తాజాగా దీపక్ సావంత్ తీసిన మరో సినిమాలోనూ నటించారు. అమితాబ్ సతీమణి జయాబచ్చన్ కూడా ఇందులో నటించారు. దీపక్ ఆరేళ్ల క్రితం నిర్మాతగా రంగప్రవేశం చేసి, ఇప్పటివరకు భోజ్‌పురి భాషలో గంగాదేవి, గంగా, గంగోత్రి, మరాఠీలో అక్కా పేరుతో సినిమాలు తీశారు. ఈ నాలుగు చిత్రాల్లోనూ అమితాబ్ నటించారు. ఇటీవల ‘లీడర్’ పేరుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు దీపక్ సావంత్. టైటిల్ రోల్‌ని అమితాబ్, ఆయనకు జోడీగా జయాబచ్చన్ నటిస్తే బాగుంటుందని భావించారు దీపక్. ఈ విషయం చెప్పగానే బచ్చన్ దంపతులు మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని అమితాబ్ ముంబయ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు దీపక్ నిర్మించిన చిత్రాల్లానే ఈ ‘లీడర్’ కూడ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని భోజ్‌పురిలో చేశాం. హిందీలో కూడా రూపొందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అభిషేక్ చద్దా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నీతీ, నిజాయితీకి మారు పేరైన ఓ వ్యక్తి సమాజంలోని చెడుని ఏరిపారేయడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో కామన్ మేన్‌కి అతను ఎలా లీడర్ అయ్యాడు? అనేది ఈ చిత్రం కథాంశమని, లీడర్‌గా అమితాబ్ చేసిన పాత్ర అద్భుతంగా ఉంటుందని దీపక్ సావంత్ పేర్కొన్నారు. అమితాబ్, జయాబచ్చన్‌లు తనకు రాముడు, సీతలాంటివారని, తను హనుమంతుడిలాంటివాణ్ణి అని దీపక్ ఉద్వేగంగా పేర్కొన్నారు. -
ఆయనకు ఆయనే సాటి...మా ఆయన బంగారం:జయాబచ్చన్
ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. వెండితెర మీదే కాదు నిజజీవితంలోనూ ఆయన హీరోనే. నిగర్వమే ఆయన విజయ రహస్యం. తాను ఎంచుకునే నిర్ణయాలలో వేలెత్తి చూపే తప్పేమీ కనబడదు. తనకు నచ్చిన పని మాత్రమే చేస్తారు. ‘నేను అమితాబ్‌బచ్చన్’ అని ఆయన ఎప్పుడూ తనకు తాను గర్వంగా చెప్పుకోరు. సామాన్యుడిలా ఆలోచిస్తారు. ప్రవర్తిస్తారు. విజయం అనేది ఎప్పుడూ ఆయనను ప్రభావితం చేయలేదు. జయాపజయాల్లో ఒకేవిధంగా ఉంటారు. తాను చెప్పినదాన్ని నిజాయితీగా నమ్ముతారు. చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు...ఒక పని చేస్తున్నారంటే శ్రద్ధతో కష్టపడి చేస్తారు. చాలామంది యువ దర్శకులు అమిత్‌కు కథలు చెబుతుంటారు. వద్దనడానికి ఆయనకు మొహమాటం. వేరే ఎవరైనా అయితే ‘‘ఇది నా స్థాయికి తగిన పాత్ర కాదు’’ ‘‘ఈ పాత్ర నాకు చెడ్డ పేరు తెస్తుంది’’ ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. ఆయన మాత్రం ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకసారి ఈ విషయం గురించి అడిగితే- ‘‘పాపం ఆ డెరైక్టర్ కుర్రాడు... పూర్తిగా నా మీదే ఆధారపడినట్లున్నాడు’’ అన్నారు. ఇక ఓపిక విషయంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. - జయాబచ్చన్ -
అమర్ సింగ్ కు వ్యతిరేకంగా జయబచ్చన్ ప్రచారం
ఆగ్రా: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. అమర్ సింగ్, బచ్చన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవి. అయితే ములాయం సింగ్ యాదవ్ తో విబేధించి సమాజ్ వాదీ పార్టీకి గుడ్ బై చెప్పాక అమర్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీ తరపున ఫతేపూర్ సిక్రి నియోజకవర్గం నుంచి అమర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 24 తేదిన జరిగే ఎన్నికల్లో అమర్ సింగ్ కు వ్యతిరేకంగా సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్ ప్రచారం చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలిసి జయ బచ్చన్ ఫతేబాద్, ఎత్మద్ పూర్, ఫతేపుర్ సిక్రి ప్రచారం చేపట్టనున్నారు. ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జయప్రద, శ్రీదేవి, బోని కపూర్, రాజా మురాద్, అస్రానీ తదితర బాలీవుడ్ ప్రముఖులతో ఇటీవల అమర్ సింగ్ ర్యాలీలు నిర్వహించారు. -
అమితాబ్ చేతుల మీదుగా కొచ్చడయాన్ హిందీ ట్రైలర్ లాంచ్
-
భర్త మోడీతో, భార్య ములాయంతో'
రాజకీయాలు ఎన్నెన్నో వింత కాంబినేషన్లకు దారితీస్తూంటాయి. భార్య భర్తపై, తండ్రి కొడుకుపై, అన్న తమ్ముడిపై పోటీచేయడం ఎన్నికల వేళ జరుగుతూంటాయి. ఇప్పుడు బిగ్ బి కుటుంబంలోనూ ఇలాంటి విచిత్రం కనిపిస్తోంది. బిగ్ బి అమితాబ్ నరేంద్ర మోడీకి సన్నిహితుడు. ఆయన గుజరాత్ టూరిజంకి బ్రాండ్ ఎంబాసిడర్ కూడా. కానీ ఆయన భార్య జయా బచ్చన్ మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. అయితే అమితాబ్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. పార్టీ తీర్థం పుచ్చుకోలేదు. 1984 లో కొన్నాళ్లు ఎంపీగా ఉన్నాక ఆయన తనకు రాజకీయాలు పడవని గుర్తించి, తప్పుకున్నారు. అప్పట్నుంచీ ఆయన రాజకీయులతో సన్నిహితంగా ఉన్నా కండువాలు మాత్రం వేసుకోలేదు. జయా బచ్చన్ మాత్రం సమాజ్ వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఒకప్పటి బిగ్ బి కుటుంబ మిత్రుడు, రాజకీయ నేత అమర్ సింగ్ దీన్నే ఎత్తి చూపి, భర్త మోడీతో, భార్య ములాయంతో. వాహ్... క్యా ఫామిలీ హై' అని ఎద్దేవా చేస్తున్నారు. -
'అమితాబ్, జయబచ్చన్ అవకాశావాదులు'
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దంపతులపై రాష్ట్రీయ లోక దళ్ నేత అమర్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బచ్చన్ కుటుంబం సభ్యులు అవకాశవాదులని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. గుజరాత్ అభివృద్ధిపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అనుకూలంగా అమితాబ్ బచ్చన్ టెలివిజన్ లో ప్రకటనలు ఇవ్వడాన్ని అమర్ సింగ్ తప్పుపట్టారు. సమాజ్ వాదీ పార్టీ తరపున రాజసభ్యురాలిగా జయాబచ్చన్ ఉన్నారని.. అయితే గుజరాత్ అభివృద్దికి కారణం మోడీ అంటూ అమితాబ్ కీర్తించడం సమంజసమా అని ప్రశ్నించారు. జయ, అమితాబ్ లు అవకాశవాదులని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలని ఆయన అన్నారు. భార్త అమితాబ్ మోడితో.. భార్య సమాజ్ వాదీ పార్టీలో ఉంటూ అవకాశ రాజకీయాలు నడుపుతున్నారని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాక సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత మోడీతో పొత్తు పెట్టుకోవడానికి బచ్చన్ కుటుంబాన్ని ములాయం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, ములాయంల మధ్య సయోధ్య కుదర్చడానికి బచ్చన్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అమర్ సింగ్ విమర్శించారు. గతంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడిగా ఉన్న అమర్ సింగ్ ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతే పూర్ సిక్రి నుంచి రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ టికెట్ బరిలోకి దిగారు. -
నిశ్శబ్ద యుద్ధం ముగిసిందా..?
సినిమా పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఈ మాటలను చాలామంది నిజం చేశారు కూడా. తాజాగా, అమితాబ్, ఆయన సతీమణి జయాబచ్చన్, రేఖ కూడా ఆ లిస్ట్‌లో చేశారు. 1970- 80 మధ్య కాలంలో ఆన్‌స్క్రీన్ పరంగా హిట్ పెయిర్ అనిపించుకున్న అమితాబ్, రేఖల మధ్య ఆఫ్ స్క్రీన్ ఎఫైర్ ఉండేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్’ ఉందనే కారణంగానో ఏమో! రేఖతో జయాబచ్చన్ మాట్లాడటానికి ఇష్టడేవారు కాదు. రేఖ కూడా అంతే. ఫైనల్‌గా అమితాబ్, రేఖ కలిసి నటించడం కూడా మానేశారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన చివరి చిత్రం ‘సిల్సిలా’ విడుదలై 33 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ఎన్నో వేడుకల్లో జయ, రేఖ తారసపడ్డారు కానీ, చూసీ చూడనట్లుగా ఉండిపోయేవారు. చివరికి రాజ్యసభలో రేఖ అడుగుపెట్టగానే జయాబచ్చన్ తన సీటుని మార్పించుకున్నారు కూడా. ఈ సంఘటనతో ఇక వీరి మధ్య ఎప్పటికీ మాటలు కలవవని చాలామంది ఫిక్సయ్యారు. అమితాబ్, రేఖల మధ్య కూడా మాటామంతీ ఉండేవి కావు. ఇన్నేళ్లుగా ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధానికి ఈ సంక్రాంతి నాడు తెరపడింది. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ వేడుకలో అమితాబ్, జయ, రేఖ పాల్గొన్నారు. రేఖని చూసిన అమితాబ్ చేతులు జోడించి నమస్తే చెబితే... రేఖ కూడా ప్రతి నమస్కారం చేశారు. అలాగే, జయా, రేఖ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, స్నేహంగా నవ్వుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఫొటో జర్నలిస్ట్లైతే ఈ అరుదైన దృశ్యాన్ని కెమెరాల్లో బంధించడానికి పోటీపడ్డారు. మరి, మూడు దశాబ్దాలుగా ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం అన్నట్లుగా ఉన్న వీరి మధ్య హఠాత్తుగా స్నేహం కుదరడానికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇది మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామమే! -
సిసలైన బెంగాలీ అనిపించుకుంటా: షారూఖ్
కోల్‌కతా: తాను సిసలైన బెంగాలీ అనిపించుకుంటానని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అన్నారు. జయా బచ్చన్ నుంచి బెంగాలీ నేర్చుకుంటానని తెలిపారు. 19వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(కేఐఎఫ్ఎఫ్) ప్రారంభోత్సవానికి షారూఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఆదరించినందుకు బెంగాలీ వాసులకు ధన్యావాదాలు తెలిపారు. 'నన్ను మీ వాడిగా అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా కేఐఎఫ్ఎఫ్కు హాజరవుతున్నాను. మరోసారి మీ ముందు వచ్చేటప్పకి తప్పకుండా బెంగాలీలో మాట్లాడతాను. జయా బచ్చన్ దగ్గర బెంగాలీ నేర్చుకుని సిసలైన బెంగాలీ పౌరుడిగా మీ ముందు ఉంటా' అని షారూఖ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు షారూఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. జయా బచ్చన్ అంతకుముందు ప్రారంభోపన్యాసం చేస్తూ తన భర్త అమితాబ్, షారూఖ్, కమల్ హాసన్‌లను సిసలైన బెంగాలీలు కాదని పేర్కొన్నారు.