![Kolkata Jaya Bachchan Pushes Away A Man For Trying To Take Selfie - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/9/55.jpg.webp?itok=MZuRy7pi)
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ముక్కిసూటి మనిషి. ఆమె మాటలు, చేష్టలు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. చూసేవారు ఏం అనుకుంటారో అని ఆలోచించరు. ఇలాంటి ప్రవర్తనతో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు జయా బచ్చన్. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి పట్ల జయా బచ్చన్ కఠినంగా ప్రవరించారు. ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొగరుగా ప్రవర్తించడం సరికాదు అంటున్నారు.
ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జయా బచ్చన్ టీఎంసీకి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం జయా బచ్చన్ టీఎంసీ అధినేత్రి మమతకు మద్దతుగా కోల్‌కతాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. వారందరికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు జయా బచ్చన్. ఈ క్రమంలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన జయా బచ్చన్.. అతడిని పక్కకు తోసి ర్యాలీని కొనసాగించారు.
తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జయా అతడిని నెట్టేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరీ ఇంత కోపంగా, కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫోటోలు తీయోద్దు అని చెప్తే సరిపోయేది కదా అంటున్నారు నెటిజనులు.
చదవండి: జయ బచ్చన్ వల్లే బాలీవుడ్‌లో ఎన్నో మార్పులు, చరిత్ర చేర్పులు
Comments
Please login to add a commentAdd a comment