ఆస్తుల వివరాలు వెల్లడించిన జయా బచ్చన్‌ | Jaya Bachchan All Set For 5th Rajya Sabha Term, Reveals Joint Net Worth With Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

Jaya Bachchan: ధనిక ఎంపీగా జయా.. ఎంత ఆస్తి ఉందో తెలుసా?

Published Wed, Feb 14 2024 8:42 PM | Last Updated on Wed, Feb 14 2024 8:52 PM

Jaya Bachchan All Set For 5th Rajya Sabha Term, Reveals Joint Net Worth With Amitabh Bachchan - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌- జయా బచ్చన్‌.. బీటౌన్‌లో మోస్ట్‌ పాపులర్‌ అండ్‌ సీనియర్‌ జంట. ఇద్దరిదీ సినిమా బ్యాక్‌గ్రౌండే.. కాకపోతే బిగ్‌బీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్‌గా కొనసాగుతుండగా జయా బచ్చన్‌ మాత్రం పాలిటిక్స్‌లో రాణిస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈమె ఈ మధ్యే రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్‌ వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సమాజ్‌ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022 - 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్‌ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది.

ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్‌ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్‌బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్‌ ప్రకటించారు.

చదవండి: Valentine's Day 2024: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement