భార్య వేధింపులు.. భార్య కుటుంబం బ్లాక్‌మెయిలింగ్.. కొడుకును కళ్లారా చూసుకోలేని దుస్థితి, న్యాయం చెప్పాల్సిన కోర్టు కూడా భార్యకే మద్దతు.. ఈ పరిస్థితుల మధ్య అతుల్ సుభాష్ నలిగిపోయాడు, కుమిలిపోయాడు. మగవారికి న్యాయం దొరకదన్న నిరాశ నిస్పృహలోకి వెళ్లిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో మరణమే శరణమని వేడుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ విషాద ఘటనపై హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు.
99 శాతం మగవారిదే తప్పు: కంగనా
కంగనా మాట్లాడుతూ.. యావత్ దేశం షాక్‌లో ఉంది. అతుల్ చివరి వీడియో చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. స్త్రీవాదం పేరుతో ఎంతకైనా తెగించడం హీనమైన చర్య. అతడి ఆర్థిక పరిస్థితికి మించి తన దగ్గరి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడికి వల్ల అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ ఒక్క సంఘటన వల్ల మహిళలందర్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవారిదే తప్పుంటుంది. అందుకే ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..
అసలేం జరిగింది?
బెంగళూరుకు చెందిన ఏఐ ఇంజనీర్ అతుల్ సుభాష్ భార్య నితిక సింఘానియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ముందు 24 పేజీల సూసైడ్ నోట్‌తో పాటు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. తప్పుడు కేసుల వల్ల ఎంతోమంది భర్తలు చనిపోతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని తన డెత్ నోట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment