మంచు మనోజ్‌పై దాడి కేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు మేనేజర్ కందుల వెంకట్ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి సమయంలో కిరణ్ కుమార్ సీసీ ఫుటేజ్ మాయం చేశారని మనోజ్ ఆరోపిస్తున్నారు.
కాగా.. రెండు రోజుల క్రితం మొదలైన ఫ్యామిలీ గొడవ మరింత ముదిరింది. మంచు మనోజ్‌ను జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత మనోజ్ గేట్ బద్దలు కొట్టుకుని ఇంటిలోపలికి వెళ్లారు. ఈ గొడవ మరింత ముదరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచు విష్ణు, మోహన్ బాబు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(ఇది చదవండి: హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!)
మోహన్ బాబుకు ఊరట..
మరోవైపు హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది.
మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment