హైకోర్టులో మంచు మోహన్‌బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్‌బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది.
మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబు
అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment