భార్య వేధింపులు తాళలేక సింగర్‌ ఆత్మహత్య | Odia Rapper Abhinav Singh Ends His Life Due To Issues With His Wife In Bengaluru Apartment, Read Full Story | Sakshi
Sakshi News home page

విషం తాగి ప్రాణాలు తీసుకున్న సింగర్‌.. భార్య వేధింపుల వల్లే..!

Published Thu, Feb 13 2025 3:12 PM | Last Updated on Thu, Feb 13 2025 5:52 PM

Odia Rapper Abhinav Singh Ends His Life Due To Issues With His Wife In Bengaluru

భార్య మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పినా ఎవరూ పట్టించుకోని దుస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, నరక కుంపటి నుంచి బయటపడే ఆలోచనలో ఆత్మాహుతి చేసుకుంటున్న భార్యాబాధితులెందరో! ఈ మధ్య అతుల్‌ సుభాష్‌ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కర్ణాకటలో కానిస్టేబుల్‌ తిప్పన్న, రాజస్తాన్‌లో డాక్టర్‌ అజయ్‌కుమార్‌, ఢిల్లీలో పునీత్‌ ఖురానా.. ఇలా రోజుకో ఉదంతం బయటకు వచ్చింది. 

విషం తాగి..
తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సింగర్‌, ర్యాపర్‌ (Odia Rapper) అభినవ్‌ సింగ్‌ (Abhinav Singh) చేరినట్లు తెలుస్తోంది.. ఒడిశాకు చెందిన ర్యాపర్‌ అభినవ్‌ సింగ్‌ (32) బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్‌ తండ్రి బిజయ్‌ నందా సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

భార్య వేధింపుల వల్లే?
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి అభినవ్‌.. భార్య వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడా? వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. కాగా అభినవ్‌ ఒడియా ర్యాప్‌ సాంగ్స్‌తో ఫేమస్‌ అయ్యాడు. కథక్‌ ఆంథెమ్‌ సాంగ్‌తో మరింత పాపులర్‌ అయ్యాడు. ఇతడు అర్బన్‌ లోఫర్‌ అనే మొదటి హిప్‌ హాప్‌ లేబుల్‌ను స్థాపించాడు.

చదవండి: డిజాస్టర్‌ దిశగా అజిత్‌ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement