
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) ప్రస్తుతం ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ యావత్‌దేశం అతడిని దుమ్మెత్తిపోసింది. అది నోరా? డ్రైనేజీనా? అంటూ తిట్లదండకం అందుకుంది. ఇతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి.
ఫోన్ స్విచ్ఛాఫ్?
అయితే అల్హాబాదియా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడని, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని రూమర్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నేను, నా టీమ్ పోలీసులకు సహకరిస్తున్నాం. వారికి నేను అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది.
నా తల్లి క్లినిక్‌పై దాడి
చాలామంది నన్ను చంపుతానని బెదిరిపిస్తున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరిస్తున్నారు. కొందరైతే రోగులుగా నటిస్తూ మా అమ్మగారి క్లినిక్‌కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులపై, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని రణ్‌వీర్ రాసుకొచ్చాడు.
చదవండి: జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్
Comments
Please login to add a commentAdd a comment