Youtuber
-
యూట్యూబర్స్@ జైల్!
బంజారాహిల్స్/ఘట్కేసర్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసులు... రాచకొండ కమిషనరేట్‌లోని ఘట్కేసర్ అధికారులు.. బుధవారం ఇద్దరు యూట్యూబర్స్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో ఒకరు సినీ నటితో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల్లోకి చేరగా... మరొకరు ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్ఆర్) న్యూసెన్స్ క్రియేట్ చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇతడి అరెస్టు ద్వారా పోలీసులు రీల్స్, మీమ్స్ పేరుతో ఓవర్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. Irresponsible Instagram Content Creator ArrestedRecently a viral video surfaced showing an individual throwing ₹20,000 bundle on the roadside of ORR and challenging viewers to a #MoneyHunt. This irresponsible act caused chaos, inconvenience, and posed a significant threat… pic.twitter.com/tpypMB6lnQ— Rachakonda Police (@RachakondaCop) December 18, 2024 మారానంటూ మళ్లీ మొదటికి... మణికొండ పంచవటి కాలనీలో నివసించే సినీ నటికి ఏడాదిన్నరగా యూట్యూబర్ ప్రసాద్ బెహరాతో పరిచయం ఉంది. ఇతడు యూట్యూబ్, కొన్ని చిత్రాల ద్వారా ప్రాచుర్యం పొందాడు. సదరు నటి ‘పెళ్లివారమండీ’ వెబ్ సిరీస్‌లో ప్రసాద్‌తో జత కట్టారు. షూటింగ్ సమయంలో ప్రసాద్ ప్రవర్తన, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తట్టుకోలేక వెబ్ సిరీస్ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆపై ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. నిజమని నమ్మిన ఆమె ఏడాది తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా నటిస్తోంది. తన ప్రవర్తన మార్చుకోని అతగాడు అసభ్యంగా మాట్లాడటం, తాకడం చేశాడు. ఆమె అడ్డు చెప్పగా... షూటింగ్స్‌లో ఇవన్నీ సహజమని, కాదంటే నీకే నష్టమని హెచ్చరించాడు. అతడి ప్రవర్తన, మాటలు, చేష్టలతో విసిగిపోయిన పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. దుర్భాషలాడాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా... ప్రసాద్‌పై బీఎన్ఎస్లోని 75 (2), 79, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కట్ట విసిరి కట్టలు సంపాదించాలని... మనీ హంట్ చాలెంజ్ పేరుతో ఓఆర్ఆర్పై ఓ నోట్ల కట్ట విసిరి, ఆ రీల్‌ను సోషల్ మీడియాలో పెట్టి, సబ్స్క్రైబర్లను పెంచుకోవడం ద్వారా యూట్యూబ్ నుంచి భారీ ఆదాయం పొందాలని ప్రయతి్నంచిన మరో యూట్యూబర్ రాయలపురం భానుచందర్ జైలుకు వెళ్లాడు. బాలానగర్‌కు చెందిన ఇతగాడు ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 సమీపంలో ఓ రీల్ చేశాడు. రూ.20 వేల కట్టను చెట్ల పొదల్లో పడేసి ఎవరైన వచ్చి తీసుకోవచ్చంటూ దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ఇది వైరల్ కావడంతో ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. ఇలా చేయడం న్యూసెన్స్ కిందికి వస్తుందని, ప్రయాణికులకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించడమే అని ఘట్కేసర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతడిపై బీఎన్ఎస్లోని 125, 272, ఐటీ యాక్ట్‌లోని 66 సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయడంతో పాటు అతడి దగ్గర ఉన్న ఐ ఫోన్ 13 ప్రో సీజ్ చేశారు. ఓఆర్ఆర్, జాతీయ రహదారులపై రీల్స్ చేస్తే ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని, ఇలా చేస్తే జైలుకు పంపుతామని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి హెచ్చరించారు. -
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.కాగా.. ప్రసాద్ బెహరా యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.అసభ్యంగా తాకుతూ..ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలాసార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరిముందే సెట్లో తన బ్యాక్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరిముందు తనను అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. -
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం యువకుడి వికృత చేష్టలు
-
విద్యార్థిపై అక్రమ కేసులో సీఐడీకి ఎదురుదెబ్బ
గుంటూరు/అమరావతి/వీరఘట్టం/కడప అర్బన్/నర్సీపట్నం: రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన ఓ డిగ్రీ విద్యార్థిని అకారణంగా తీసుకువచ్చిన గుంటూరు సీఐడీ పోలీసులకు చుక్కెదురైంది. అతన్ని రిమాండ్‌కు తరలించేందుకు చేసిన విశ్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అతన్ని సెల్ఫ్బాండ్పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం దశుమంతపురం గ్రామానికి చెందిన అలజంగి యగ్నేష్ భాస్కర్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూటమి పార్టీటలు ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోలేదని బదులిచ్చాడు. అంతటితో ముగిసిందని భావించి కళాశాలకు వెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక కార్యకర్తలను ఏరివేతకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2 రోజుల క్రితం గుంటూరు సీఐడీ పోలీసులు అతని స్వగ్రామానికి వెళ్లారు. నిద్రిస్తున్న అతన్ని గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చి రోజంతా విచారించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్‌ను రద్దు చేశారు. సెల్ఫ్బాండ్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు పొలూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, అజీజ్, షేక్.అజీబుల్లా, రమణారెడ్డి యగ్నేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు. అండగా నిలవాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం కాగా..యగ్నేష్ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. యగ్నేష్ కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజుకు సూచించారు. సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న అక్రమ కేసులతో యువత భవిష్యత్ నాశనం అవుతుందని, అటువంటి వారికి అండగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌పై కేసు నమోదు పల్నాడు జిల్లా అమరావతి రాజీవ్‌కాలనీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కంభంపాటి దినేష్ పై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాసరావు అందించిన వివరాల మేరకు.. దినేష్ ఈ ఏడాది జూలైలో ప్రభుత్వ పెద్దల ఫొటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనిపై రాజీవ్ కాలనీకి చెందిన వంశీ ఇచి్చన ఫిర్యాదు మేరకు దినేష్ పై కేసు నమోదు చేశారు.వర్రా కస్టడీపై విచారణ వాయిదా..మరో కేసు నమోదు సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని కస్టడికి ఇవ్వాలని కడప జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై గురువారం (5వ తేదీ) విచారణ చేయాల్సి ఉండగా..దాన్ని ఈ నెల 9కి వాయిదా వేశారు. కాగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిపై అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు మారి్ఫంగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని నాతవరం మండలం, లింగంపేట టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవాడ అప్పలనాయుడు గత నెల 10న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్, ఐటి చట్టాలను అనుసరించి 192, 196, 61(2), 336(4), 340(4), 353(2) సెక్షన్ల కింద వర్రాపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన నాతవరం పోలీసులు గురువారం నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో వర్రాను విశాఖ సెంట్రల్ జైల్‌కు తరలించారు. ఇదే రోజు న్యాయవాది మాకిరెడ్డి బుల్లిదొర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
యూట్యూబర్ ఇంట్లో శుభకార్యం.. నిహారిక, ప్రదీప్‌తో పాటు వాళ్లంతా (ఫొటోలు)
-
యూట్యూబర్‌గా సక్సెస్ అయ్యి..ఏకంగా బాలీవుడ్ మూవీ..!
పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్‌గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్‌లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్‌లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.స్వేచ్ఛ ఉంటుంది‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.రీల్స్‌తో మొదలుపెట్టి...వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్‌తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్‌గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల. అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!
ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్ ఫుడ్‌ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్. అందుకోసం అతడు ఏం చేశాడంటే..ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిన 30 ఏళ్ల కెనడియన్ టెన్నిసన్ ఓ విచిత్రమైన ఫుడ్ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్ ఫుడ్ మారథాన్ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్‌తో సహా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఐటెమ్స్ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. తొలిరోజు అలాంటి ఫుడ్ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు. ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్‌కు బదులుగా తాను 4 వేల స్టెప్స్ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్ తదనంతరం మూడో రోజు జిమ్సెషన్ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్‌ని స్వీకరించానని యూట్యూబర్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్‌గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!) -
హర్ష సాయి కేసులో బిగ్ ట్విస్ట్..
-
హర్ష సాయి సంచలన ఆడియో లీక్
-
యూట్యూబర్ హర్ష అరెస్ట్
-
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
నడిరోడ్డుపై చీప్ ట్రిక్స్.. పట్టించుకోని పోలీసులు
-
Deepthi Sunaina: సాగర్ ఒడ్డున దీప్తి సునైన.. ముద్దొచ్చేంత అందంగా! (ఫొటోలు)
-
రోడ్డు ప్రమాదంలో యూ ట్యూబర్ మృతి
తొండంగి: బైక్ రైడర్‌గా, యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో పేరొందిన పొగాకు సోంబాబు (క్రేజీ సొంబాబు) బైక్‌పై వెళ్తుండగా కాకినాడ జిల్లా బెండపూడి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. నెల్లూరుకు చెందిన పొగాకు సోంబాబు (35) వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రకృతి అందాలను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరంలో స్నేహితుల వివాహానికి తోటి బైక్రైడర్స్తో కలిసి హాజరయ్యారు. అనంతరం బైక్‌లపై దునపాటి రాజేష్ , వెంకట్‌లతో కలసి ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగి, అరకు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం విశాఖ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. సోంబాబు బైక్‌ను జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్ వద్ద భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలైన సోంబాబును 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యూస్ కోసం నెమలి కూర!
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్‌లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్‌కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూట్యూబ్‌లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
30 కోట్ల సబ్బర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే..!
-
టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో.. 'శ్రుతి అర్జున్ ఆనంద్'!
శ్రుతి.. ఉత్తరప్రదేశ్, ఝాన్సీలో పుట్టిపెరిగింది. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. మేకప్, ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. అందుకే తన తొలి వీడియోను వాటి మీదే అంటే.. హెయిర్ స్టయిల్స్ మీదే తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. అప్పుడు ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది.ఆ వీడియోకు ఆమె ఊహించని రీతిలో వ్యూస్, షేర్స్ వచ్చాయి. ఆ ప్రోత్సాహం, ఉత్సాహంతో ‘ShrutiArjunAnand’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. 2013లో ఆమె ఇండియా వచ్చేవరకు ఆ చానెల్లో ఎక్కువగా ఫ్యాషన్ కంటెంట్ వీడియోలే అప్లోడ్ అయ్యేవి. ఇండియా వచ్చేశాక యూట్యూబ్ చానెల్ మీద ఫుల్ టైమ్ వర్క్ చేయడం మొదలుపెట్టింది.డే టు డే లైఫ్‌లోని పరిస్థితులు, కుటుంబ విషయాలను కథానాంశాలుగా తీసుకుని కామెడీ టచ్‌తో వీడియోలుగా తీసి తన చానెల్లో అప్లోడ్ చేస్తోంది. తన చానెల్కున్న లక్షల వ్యూస్, మిలియన్ల సబ్స్క్రైబర్స్తో ఆమె 2016లోనే టాప్ 10 ఇండియన్ యూట్యూబర్స్ లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు శ్రుతి.. దేశంలోకెల్లా రిచెస్ట్ యూట్యూబర్స్లో ఒకరు.ఒక్క శ్రుతే కాదు ఆమె భర్త అర్జున్, కూతురు కూడా టాప్ యూట్యూబర్సే. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబమంతా యూట్యూబర్సే. ‘ShrutiArjunAnand Digital Media’ ప్రైవేట్ లిమిటెడ్, ‘Shruti Makeup & Beauty’ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్థాపించి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలసి పనిచేస్తూ సోషల్ మీడియా వ్యూయర్స్ నచ్చే.. మెచ్చే కంటెంట్‌ని క్రియేట్ చేస్తోంది శుత్రి అర్జున్ ఆనంద్. -
శ్రీవారి భక్తులపై ప్రాంక్ వీడియో..
-
ప్రణీత్ హనుమంతు పై పోక్సో చట్టం
-
రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్ అభిరుచి!
రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్‌కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్‌కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్‌కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్‌సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!
ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నిఖిల్‌కు ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజూ 50 నుంచి 100 కిలోమీటర్లు ఎక్కడో ఒకచోటుకి వెళ్లిరావాల్సిందే. అయితే ఒకానొక రోజు మాత్రం... ‘ఎప్పుడూ ముంబై మాత్రమేనా.. ఔట్‌సైడ్ ముంబై కూడా వెళ్లాలి’ అనుకున్నాడు.అలా బైక్‌పై ఆజ్మీర్, బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఔట్‌సైడ్ ముంబై ప్రయాణాలు ఆగలేదు. ఈ ప్రయాణాల పుణ్యమా అని మన దేశంలోని ‘మోటో వ్లాగింగ్’ ప్రఖ్యాత యూట్యూబర్లలో ఒకరిగా నిఖిల్ శర్మ పేరు తెచ్చుకున్నాడు.నిఖిల్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే..యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలలో ఉంది. తాను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు మన దేశంలో వ్లాగింగ్‌కు పెద్దగా ్రపాచుర్యం లేదు. డైలీ వ్లాగింగ్ చేయడం ద్వారా ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మన దేశంలో ఏ మూలన ఉన్న ఆడియెన్స్ అయిన నిఖిల్ చెబుతున్న కబుర్లు విని ఊహాల్లోనే తాను ఉన్న చోటుకి వెళ్లేవారు.వ్లాగింగ్‌కు ఆవలి ప్రపంచంలోకి వెళితే..నిఖిల్‌కు నటన అంటే ఇష్టం. బాలీవుడ్ సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఫ్లైట్ అటెండెంట్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం మానేసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. ‘వ్లాగింగ్ వదలేయ్. డబ్బు సంపాదనపై దృష్టి పెట్టు’ అని కొద్దిమంది సలహా ఇచ్చారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ప్యాషన్‌కు ఎప్పుడూ దూరం కాలేదు.ఆ ప్యాషనే తనను ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేలా చేసింది. ఔట్‌సైడ్ ముంబై యాత్రలు చేస్తే చాలు అనుకున్న అతడిని అమెరికా, కెనడా, ఇండోనేషియ, సౌత్ కొరియా, జపాన్... మొదలైన దేశాలకు వెళ్లేలా చేసింది. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–ఇండియా’ జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. క్లాతింగ్ బ్రాండ్ లేబుల్ ఎంఎన్తో డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న నిఖిల్... ‘ఎన్ని చేసినా వ్లాగింగ్ అనేది నా ప్యాషన్’ అంటున్నాడు.ప్రతిభతో పాటు..మన ప్యాషన్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. రాజీ పడి వేరే దారి చూసుకోవడం సులభం. రాజీ పడకుండా నచ్చిన దారిలోనే వెళ్లడం కష్టం. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా పోదు. తప్పకుండా ఫలితం ఇస్తుంది. ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు వల్ల నష్టపోయిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. – నిఖిల్ శర్మఇవి చదవండి: