పెద్దపల్లి, సాక్షి: వాడలో మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. హైవే మీదకు చేరి ఆందోళన చేపట్టే దాకా పోయింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఆ పంచాయితీ.. పోలీస్ స్టేషన్‌కు చేరింది.
పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేటకు చెందిన ఓ రైతు తన ఎడ్లబండిని రోడ్డుపై ఉంచాడు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈలోపు స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్ ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. సదరు రైతును దుర్భాషలాడుతూ కొట్టాడు. అది భరించలేకపోయిన ఆ రైతు.. ఆ ఎడ్ల బండితో రాజీవ్ రహదారిపై చేరి ఆందోళన చేపట్టాడు. ఈ క్రమంలో అక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. రైతుతో పాటు సదరు యూట్యూబర్‌ను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించి పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వివాదం ఎలా ముగిసిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment