
సాక్షి, సూర్యాపేట జిల్లా: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు పట్టు బిగిస్తున్నారు. యూట్యూబర్ సన్నీయాదవ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్‌పై నూతనకల్ పీఎస్‌లో కేసు నమోదైంది. యూట్యూబ్ వీడియోలతో బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్న సన్నీయాదవ్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు.. సన్నీ యాదవ్ కోసం గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, లండన్‌లో ఉన్న అతనిపై సూర్యాపేట జిల్లా సైబర్ క్రైం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment