జన్వాడ ఫామ్‌ హౌస్‌ ఘటన : బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఫైర్‌ | Jagadish Reddy criticized government over the Janwada farmhouse incident | Sakshi
Sakshi News home page

జన్వాడ ఫామ్‌ హౌస్‌ ఘటన : మీకెందుకో అంత అత్యుత్సాహం.. బీజేపీ నేతలపై జగదీష్ రెడ్డి ఫైర్‌

Published Sun, Oct 27 2024 4:49 PM | Last Updated on Sun, Oct 27 2024 8:34 PM

Jagadish Reddy criticized government over the Janwada farmhouse incident

సూర్యాపేట: సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు కూడా భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎందుకు స్పందించ‌డం లేద‌ని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డి. జ‌న్వాడ్ ఫామ్ హౌస్ ఘ‌ట‌న‌పై ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్ ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. వారెంట్ లేకుండా ఎలా‌ వస్తారు ఎక్కడో ఏదో జరిగిందని సాకుతో రావడం ఏంటి. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లు కూడా భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎందుకు స్పందిచ‌డం లేదు.

పోలీస్ వ్యవస్థ దిగజారుతోంది. నిజాం కాలంలో కూడా ఇంతదారుణంగా లేదు. చిల్లర దాడులు మమ్మల్ని బెదిరిస్తాయని అనుకోవద్దు. కేటీఆర్ ప్రజల తరపున కొట్లాడుతోండనే ఈ‌ దాడులు. తప్పుడు కేసులు పెట్టినా మా గొంతును మూయలేరు. గతంలో స్వ‌యంగా పోలీసులు ఇళ్ల‌ల్లో ఆయుధాలు పెట్టి కేసులు న‌మోదు చేశారు. రాజ్ పాకాల విష‌యంలో అలాంటిదే జరిగి ఉండొచ్చు.  పోలీసులే జేబుల్లో ఏదన్నా పెట్టుకుని‌ వచ్చి ఇంట్లో పెట్టి ఉండేవారేమో.

బీజేపీ నేత‌లు బండి సంజయ్, రఘునంధన్ రావుకు ఎందుకంత‌ అత్యుత్సాహం.బండి‌ సంజయ్ కి సమాచారం ఎవరిచ్చారు. ఇంట్లో దావత్ చేసుకుంటే బాటిల్స్ ఉన్నాయట.  తెలంగాణలో ఉదయమే మంత్రులు తాగుతున్నారు.పరీక్ష చేద్దామా.  తెలంగాణలో గృహప్రవేశం చేసుకుంటే దావత్ చేసుకుంటారా లేదా?.ఎలాంటి కేసులనైనా ఎదుర్కోవడానికి సిద్ధం. పోలీసులు తగిన మూల్యం చెల్లిస్తారు’ అని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement