Lookout Notice
-
సుశాంత్ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. -
పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని కొద్దిరోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. దీంతో గత కొద్దిరోజులుగా హర్షసాయి పరారీలో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.యువతి ఫిర్యాదుతో హర్షసాయిని అరెస్ట్ చేసేందుకు నార్సింగ్ పోలీసులు పలుచోట్ల గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి నటిస్తున్న 'మెగా' సినిమా కాపీ రైట్స్ కోసమే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్షసాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ గతంలోనే పోలీసులకు బాధితురాలు తెలిపింది. -
Maharashtra: శివాజీ విగ్రహ కాంట్రాక్టర్‌పై లుక్అవుట్ నోటీసులు
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఇక.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. -
Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
శివాజీనగర/ యశవంతపుర: ఇంట్లో పని మనిషులపై లైంగిక దాడులు, అశ్లీల వీడియోల కేసులో నిందితుడైన ఎంపీ ప్రజ్వల్ మే 10లోగా సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. గత నెల 27 నుంచి విదేశాలలో మకాం వేసిన ఆయన విచారణకు రావాలని సిట్ రెండుసార్లు నోటీస్‌లు ఇచ్చింది. ఫలితం లేకపోవడంతో లుకౌట్ నోటీస్‌ను జారీ చేసింది. వీటి గురించి విదేశాల్లో ఉంటూనే బెంగళూరులోని తన న్యాయవాదులతో ఆయన చర్చల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే హాజరు కావడానికి ముందే, దేశంలో ఏ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను సిట్ అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. హాసన్ ఆర్సీ రోడ్డులోని ఎంపీ ప్రజ్వల్ ఆఫీసులో తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం సిట్ అధికారులు ఆఫీసు తాళాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక బాధిత మహిళను శనివారం హోళెనరసిపురలోని మాజీ మంత్రి రేవణ్ణ ఇంటికి తీసుకెళ్లి స్థల పరిశీలన చేశారు. ఆ ఇంట్లోనే వంట, బెడ్ రూం, స్టోర్ రూంను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏయే గదిలో ఏం జరిగింది?, ఎక్కడెక్కడ లైంగిక దాడికి పాల్పడిందీ బాధితురాలిని అడిగి నమోదు చేశారు. ఈ సోదాలను వీడియో రికార్డ్ చేశారు. ఈ సమయంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటైంది.రేవణ్ణ భార్యకు నోటీసులుసిట్ విచారణకు రేవణ్ణ హాజరు కావడం లేదు. ఆయన భార్య భవానీకి నోటీసులు పంపగా, ఆమె సైతం విచారణకు రాలేదు. పెన్‌డ్రైవ్‌ను బహిరంగపరచిన స్థానిక బీజేపీ నాయకుడు దేవరాజేగౌడ శుక్రవారం సిట్ ముందు హాజరై వాంగ్మూలమిచ్చారు. సిట్ అధికారులు ఆయనను అనేక విధాలుగా ప్రశ్నించారు. తండ్రి రేవణ్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సతీశ్ బాబణ్ణ అనే వ్యక్తిని సిట్ ఈ కేసులో అరెస్టు చేసింది. రేవణ్ణ, ప్రజ్వల్‌కు సంబంధించిన 40 చోట్ల సిట్ పోలీసులు సోదాలు నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. సిట్ చీఫ్ బీకే సింగ్ కేసును పర్యవేక్షిస్తున్నారు.మానసిక ఒత్తిడిలో దేవెగౌడజేడీఎస్ అధినేత, రేవణ్ణ తండ్రి దేవెగౌడ ఈ వ్యవహారాలతో మానసిక ఒత్తిడితో ఉన్నట్లు తెలిసింది. ఆయనకు ఈ విషయాలను చెప్పరాదని, టీవీ చూడకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహానిచ్చారు.సీఎం సమీక్షఎంపీ ప్రజ్వల్ కేసులో పురోగతిపై సీఎం సిద్దరామయ్య సిట్ అధికారులతో సమావేశమయ్యారు. నిందితున్ని త్వరగా అరెస్టు చేయాలి, కేసుతో ప్రమేయమున్నవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో అలసత్వాన్ని సహించేది లేదు అని అధికారులకు సీఎం చెప్పినట్లు తెలిసింది. మరోవైపు ఆప్ సహా పలు మహిళా సంఘాలు బెంగళూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించాయి. -
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌లపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణనకు వేగవంతం చేసింది. గురువారం ప్రజ్వల్‌పై సిట్ బృందం.. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్ చేసే విధంగా సిట్ వారెంట్ జారీ చేసింది. దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ విమానాశ్రయం, ఓడరేవు, సరిహద్దు చెక్‌పోస్ట్ కనిపిస్తే.. నిర్బంధించాలని తెలిపింది. కాగా హసన్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ సంబంధించినవిగా కొన్ని అసభ్యకర వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులపై పలువురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ప్రజ్వల్‌ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు
కొవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ రంగంలో బైజూస్ ఓ వెలుగు వెలిగింది. భారీగా నియామకాలు చేపట్టింది. క్రమంగా కరోనా భయాలు తొలగడంతో కార్యకలాపాలు భారంగా మారి అప్పుల్లోకి వెళ్లినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దాంతో ఆ కంపెనీ లావాదేవీలతో సంబంధం ఉన్న కొన్ని ఇతర సంస్థలు నోటీసులు సైతం పంపిచాయి. తాజాగా ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదు. మరోవైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్(ఈజీఎం)కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్త బోర్డును ఎన్నుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. దానికోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు. అయితే వాటాదారుల కోరికను సవాలు చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టులో సంప్రదించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈజీఎం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని చెప్పింది. ఇదీ చదవండి: కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే.. ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నుంచి నోటీసులు అందుకుంది. ఇదిలా ఉండగా, వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉందని తెలిసింది. -
Enforcement Directorate: టీఎంసీ నేత కోసం లుకౌట్ నోటీస్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఆచూకీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలిలో షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ బృందంపై అతడి అనుచరులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి జాడ తెలియకుండా పోయిన షాజహాన్ షేక్ బహుశా దేశం విడిచి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అతడి గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు సమాచారం ఇచ్చినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. -
బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు
బోధన్: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహైల్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి సోహైల్ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ని లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపించాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం చేసిన సోహెల్ నేరుగా ముంబకి వెళ్లిపోయాడు. అటునుంచి దుబాయ్ కి పారిపోయాడు. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ -
భారత్‌పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్ నోటీసు జారీ.. ఎందుకంటే..
భారత్‌పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లను గురువారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌కు వెళ్లే విమానం ఎక్కకుండా చర్యలు తీసుకున్నారు. అయితే భారత్‌పేలో జరిగిన మోసంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల లుకౌట్ సర్క్యులర్‌ను జారీ చేసింది. దాంతో వారిని దిల్లీలోని విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్‌లో విహారయాత్రకు బయలుదేరిన అష్నీర్ దంపతులను విమానాశ్రయంలో భద్రతా తనిఖీకి ముందే ఆపివేసినట్లు ఈఓడబ్ల్యూ జాయింట్ కమిషనర్ సింధు పిళ్లై చెప్పారు. దిల్లీలోని వారి నివాసానికి తిరిగి రావాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే వారం మందిర్ మార్గ్‌లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారిని కోరారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని నిలిపేసేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, వారిని అధికారికంగా అరెస్టు చేయలేదని పిళ్లై స్పష్టం చేశారు. పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అష్నీర్ గ్రోవర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురువారం రోజే తమను అదుపులోకి తీసుకున్నారని, కానీ శుక్రవారం రోజున వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విమానం ఎక్కకుండా తమను ఆపిన ఏడు గంటల తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి నోటీసు అందిందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: అమెజాన్ అలెక్సా.. వందల ఉద్యోగులపై వేటు భారత్‌పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబ సభ్యులు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. గతంలో వారు అందించని ఫిన్‌టెక్ సేవల కోసం బ్యాక్‌డేటెడ్ ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను గుర్తించడంలో ఈఓడబ్యూ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ 2022లో భారత్‌పే అష్నీర్ గ్రోవర్, తన భార్య, కుటుంబ సభ్యుల ద్వారా రూ.81.28 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రిమినల్ కేసు దాఖలయింది. Hello ! Hello ! Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab. So facts: 1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport). 2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F — Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023 -
బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు
చంఢీగర్: పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బటిండా ఆస్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మన్‌ప్రీత్ దేశం వీడి వెళ్లొచ్చని భావించారు అధికారులు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద అలర్ట్ జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం బాదల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. బాదల్‌తో పాటు, భటిండా డెవలప్మెంట్ అథారిటీ (బిడిఎ) మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్‌జిత్ షెర్గిల్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్‌లు కూడా ఈ కేసులో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. భటిండాలోని ఆస్తి కొనుగోలులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో చేసిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ బ్యూరో విచారణ ప్రారంభించింది. గతంలో శిరోమణి అకాలీదళ్‌లో ఉన్న సింగ్లా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బాదల్ తన పదవిని దుర్వినియోగం చేసి రెండు కమర్షియల్ ప్లాట్లను రెసిడెన్షియల్ ప్లాట్‌గా మార్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే.. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: Rahul Gandhi Train Journey Video: రాహుల్ గాంధీ జన్‌కీ బాత్.. ఈసారి రైలులో.. -
సీనియర్ నటి అభినయపై లుకౌట్ నోటీసులు జారీ
కన్నడ నటి అభినయనను అరెస్ట్ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె తల్లితో పాటు సోదరుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వరకట్న వేధింపుల కేసులో ఈ ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు శాండల్‌వుడ్ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వీరిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా గత నెల రోజులుగా ఈ ముగ్గురు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. దీంతో దోషులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా నటి అభినయ సోదరుడు శ్రీనివాస్‌కు 1998లో లక్ష్మీదేవి అనే మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన ఆరు నెలల నుంచే అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని లక్ష్మీదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఎన్నో మలుపుల అనంతరం 2012లో వీరిని దోషులుగా తీర్పునిచ్చిన న్యాయస్థానం అభినయకు రెండేళ్లు, ఆమె సోదరుడికి రెండేళ్లు, తల్లికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
కేజ్రీవాల్‌కు సంకెళ్లే
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కీలక సూత్రధారి అని బీజేపీ ఆరోపించింది. అతి త్వరలో ఆయనకు సంకెళ్లు తప్పవని జోస్యం చెప్పింది. కరోనా ఉధృతి సమయంలో ప్రజలంతా సాయం కోసం అల్లాడిపోతుంటే కేజ్రీవాల్ మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం ఆరోపించారు. ఆయన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ‘‘ఎక్సైజ్ విధానం కుంభకోణంలో మూలాలు కేజ్రీవాల్ ఇంటికే దారి తీస్తున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందే’’ అన్నారు. మరోవైపు తనపై సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసిందని ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్ సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నా సీబీఐ ఇలా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మోదీజీ! నేనెక్కడున్నానో తెలియడం లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా’’ అటూ ట్వీట్ చేశారు. తన ఇంట్లో సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తి ఒక్క రూపాయి కూడా సీబీఐకి దొరకలేదన్నారు. సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఇప్పటిదాకా నిందితులెవరికీ లుకౌట్ నోటీసులివ్వలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు అనుమతి లేకుండా దేశం దాటలేరు. కాబట్టి వారికి ఆ నోటీసులు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ కేసులో 8 మంది ప్రైవేటు వ్యక్తులకు లుకౌట్ నోటీసులిచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మాత్రం, కుంభకోణాలకు పాల్పడితే లుకౌట్ నోటీసులొస్తాయి తప్ప గ్రీటింగ్ కార్డులు కాదనడం విశేషం. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కరడుగట్టిన అవినీతిపరులని ఆరోపించారు. సిసోడియా తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి డిమాండ్ చేశారు. ఇక మోదీ వర్సెస్ కేజ్రీ: సిసోడియా కేజ్రీవాల్ ప్రధాని అవుతారని సిసోడియా జోస్యం చెప్పారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు అవకాశమిచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌గా జరగడం ఖాయం’’ అన్నారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం రోజూ ఉదయమే సీబీఐ–ఈడీ అంటూ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. మరిన్ని హైదరాబాద్ లింకులు? ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన పలు హోల్‌సేల్, రిటైల్ మద్యం వర్తకుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మద్యం లైసెన్సులను దక్కించుకున్న పలువురు వ్యక్తులు, కంపెనీలకు హైదరాబాద్ మూలాలున్నాయి. ఇక్కడి అడ్రస్లతోనే వారు టెండర్లు దాఖలు చేశారు. ఈ పాలసీకి పాపులారిటీ పెంచేందుకు 50 మంది దాకా స్టాండప్ కమేడియన్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లు తదితరులను పనిముట్లుగా వాడుకున్నట్టు తేలింది. వీరి విదేశీ యాత్రలు, విదేశాల నుంచి అందిన నిధులపై విచారణ సాగుతోంది’’ అని వివరించారు. -
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆకార్ పటేల్ అడ్డగింత
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు, ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఆకార్ పటేల్‌కు బుధవారం బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికా పయనమైన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. విదేశాలకు వెళుతున్న తనను అడ్డుకోవడంపై ట్విటర్లో ఆకార్ పటేల్ స్పందించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై మోదీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు కారణంగా తాను లుక్ అవుట్ సర్క్యులర్‌లో ఉన్నట్టు సీబీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. అమెరికా పర్యటన కోసం గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందానని, కోర్టు ఆర్డర్‌తో తన పాస్‌పోర్ట్‌ను కూడా తిరిగి తీసుకున్నానని తెలిపారు. అయితే ఆకార్ పటేల్‌పై లుక్అవుట్ నోటీసు ఉందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రూ. 36 కోట్ల విదేశీ నిధులకు సంబంధించి.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు ఉల్లంఘించారన్న నేపథ్యంలో ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా, ఇతరులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసు జారీ అయింది. అయితే గతేడాది గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆకార్ పటేల్.. అమెరికా వెళ్లేందుకు సూరత్ కోర్టు అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని సీబీఐ కోర్టును ఆకార్ పటేల్ ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆకార్ పటేల్ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరిగే అవకాశముంది. -
ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ
న్యూఢిల్లీ: భార్యలను వదిలేసిన, కట్నం కోసం వేధించిన ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధిత మహిళల తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వెజ్ సోమవారం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎస్.రామసుబ్రమణియన్ల ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై తాము వేరుగా పిటిషన్ వేశామనీ, దీనిపై న్యాయస్థానానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవాసీ లీగల్ సెల్ తరఫున సంజయ్ హెగ్డే పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..ఈ పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం బదులిచ్చినట్లు కూడా ధర్మాసనం తెలిపింది. కట్నం కోసం వేధించిన, భార్యలను వదిలివెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేరుగా ఉంటున్న తమ భర్తలను అరెస్టు చేయాలనీ, ఈ విషయంలో విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా తమకు సాయం అందించాలని వారు తమ పిటిషన్లలో అభ్యర్థించారు. ఇటువంటి కేసుల్లో సదరు భర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయాలంటూ వారి తరఫు న్యాయవాది సత్య మిత్ర కోరారు. ‘ఇటువంటి కేసుల్లో సదరు ఎన్నారై భర్తలు, న్యాయస్థానానికి హాజరు కాకుండా తప్పించుకోవడం, భారత్‌కు తిరిగి రాకపోవడం జరుగుతున్నాయి. ఈ విషయంలో వారి పాస్‌పోర్టు లను స్వాధీనం చేసుకుని, స్వదేశానికి రప్పించేం దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లలో కోరారు. ఇందుకోసం బాధితుల పక్షాన మానవీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. -
హెచ్1వీసాల పేరుతో మోసం
-
తెలుగు విద్యార్ధులను నట్టేట ముంచిన జంట..
సాక్షి, హైదరాబాద్: ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ ఓ జంట అమెరికాలోని తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది. స్టూడెంట్స్ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. పరారయ్యింది ఈ జంట. వివరాలు.. నిందితులు ముత్యాల సునీల్, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్1 వీసా పేరిట మోసం చేశారు. ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్‌పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. (చదవండి: అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) ఇక, విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘యస్’ సంక్షోభం: రాణా కపూర్ ఇంట్లో సోదాలు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మాజీ సీఎండీ రాణా కపూర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ముంబై వర్లిలోని ఆయన ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. రాణాకపూర్ దేశం విడిచిపోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. కాగా 2015లో 80 నకిలీ సంస్థలకు రూ. 12,733 కోట్లు నిధులను మళ్లించినట్టు ఆరోపణలు వెలువెత్తాయి. అలాగే దివాలా కంపెనీ డీహెచ్ఎఫ్ఎల్ (దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) కు భారీ ఎత్తున నిధులను మళ్లించబడినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. దీనికి బదులుగా భారీ ఎత్తున నగదు రాణా కపూర్ భార్య ఖాతాలో జమ అయ్యాయి. ఈ రుణాల స్వభావాన్ని, వాటి మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారిస్తున్నట్టు చెప్పారు. యస్ బ్యాంకు సంక్షోభంపై ఆర్బీఐ రంగంలోకి దిగిన అనంతరం ఈడీ విచారణను వేగంతం చేసింది. మరోవైపు యస్‌బ్యాంకును స్వాధీనంలోకి చేసుకున్న ఆర్బీఐ 30 రోజులపాటు మారటోరియం విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అలాగే పునర్మిర్మాణ ప్రణాళికలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భార్యను చంపిన భర్తపై లుకౌట్ నోటీసులు జారీ
చండీఘడ్ : ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న భార్యను స్కూల్ ఆవరణ బయట హత్య చేసిన కేసులో భర్తపై చండీఘడ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సరబ్జీత్ కౌర్, హర్విందర్ సింగ్‌లు భార్యాభర్తలు. హర్విందర్ ఏపనీ చేయకుండా తిరుగుతుండడంతో దంపతుల మధ్య విభేదాలొచ్చాయి. ఈ నేపథ్యంలో భార్య సరబ్జీత్ ప్రైవేటు టీచర్‌గా పనిచేసుకుంటూ భర్త నుంచి విడిగా ఉంటోంది. దీంతో కక్ష పెంచుకున్న హర్వీందర్ ఆమెను స్కూల్ ఆవరణ బయట దారుణంగా చంపేశాడు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని సరబ్జీత్ ఫిర్యాదు చేసి ఉండడంతో ఆ దిశగా విచారించిన పోలీసులు భర్త హర్వీందర్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా భావించి అతని కోసం వెతకటం ప్రారంభించారు. అతను ఆజ్ఞాతంలో ఉన్నట్టు తేలడడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, సరబ్జీత్ ఫోన్లో భర్త హర్వీందర్ సింగ్ ఫోన్ నెంబరు కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. దంపతులిద్దరూ విడిగా ఉంటున్నప్పటి నుంచీ కనీసం మాట్లాడుకోలేదని దంపతుల ఉమ్మడి స్నేహితుడొకరు పోలీసులకు తెలిపాడు. మరోవైపు హత్య చేయబడ్డ సరబ్జీత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె బంధువులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం!
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరంకు అరెస్ట్ నుంచి ఊరట లభించేలా లేదు. ముందస్తు బెయిలు పిటిషన్ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. మంగళవారం సాయంత్రమే దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చిదంబరం తరపున లాయర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాడీవేడి చర్చ జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్ నిరాకరించింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ నిరాకరించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌ను సీజేఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చిదంబరం తరఫున లాయర్లు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్, దీనిపై తదుపరి ఆదేశాలిచ్చేందుకు నిరాకరించారు. ఈ పిటషన్‌ను లంచ్ తరువాత సీజే రంజన్ గొగోయ్ దీనిపై విచారణ జరుతారని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీజే తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు చిదంబరంపై ఈడీ లుక్ అవుట్ నోటీసులను జారీచేసింది. దీంతో చిదంబరం అరెస్ట్‌కు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన అజ్ఞాతంలోకి పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఎన్నారై భర్తలూ.. మీ ఆగడాలకు ఇక చెక్!
‘నాకు అమెరికాలో వర్క్ వీసా వచ్చింది.. నువ్వు నాతో అక్కడికి రావాలంటే అదనపు కట్నం తీసుకురా.. లేదంటే నా దగ్గరికి ఎప్పటికీ రాలేవు’అంటూ తన భార్యకు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భర్త తెగేసి చెప్పాడు. ‘నేను ఇక్కడ మరో పెళ్లి చేసుకున్నా.. భవిష్యత్తులో ఇండియాకు రాలేను.. బై’అంటూ మరో భర్త తెగదెంపులు చేసున్నాడు. ‘మన పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది, నువ్విపుడు ఇండియాలో ఉన్నావు. నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేవు’అంటూ వెటకారంగా మాట్లాడాడు మరో ఎన్నారై భర్త. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎన్నారై భర్తల కేసుల్లో ఇలాంటి వేధింపులు వింటూ ఉంటాం. ఇకపై ఇలాంటి ఆటలు సాగవు. భార్యలను ఇండియాలోనే వదిలేసి, అదనపు కట్నం లేదా ఇతర కారణాలను సాకుగా చూపి వేధింపులకు పాల్పడే వారి ఆగడాలకు పోలీసులు చెక్ చెప్పనున్నారు. తాజాగా భార్యలపై వేధింపులకు దిగుతున్న 45 మంది భర్తల పాస్‌పోర్టులను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి భార్యలను వేధించడం ఇకపై కుదరదంటూ గట్టి సంకేతాలు పంపింది. ఈ తరహా బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టిన కేంద్రం లోక్‌సభలో దాన్ని ఆమోదింపజేసుకుంది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బిల్లులో ఏముంది? విదేశాల్లో ఉంటూ భారతదేశంలో ఉన్న భార్యలను వేధించే భర్తల ఆటకట్టించాలన్న కేంద్రం ఈ మేరకు ఓ చట్టం తెచ్చేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మహిళా–శిశు సంక్షేమ, విదేశాంగ, హోం, న్యాయశాఖలు సంయుక్తంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశాయి. దీని ప్రకారం వివాహం భారత్‌లో జరిగినా, విదేశాల్లో జరిగినా వేధింపులకు పాల్పడే ఎన్నారై భర్తలు ఇకపై తప్పించుకోలేరు. భారతీయ మహిళకు చట్టపరంగా మరింత రక్షణ కల్పించాలన్నదే ఈ బిల్లు ధ్యేయం. ఇందుకోసం పాస్‌పోర్ట్ యాక్ట్ 1967, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లకు పలు మార్పులు చేసి బలోపేతం చేశారు. వివాహం జరిగిన 30 రోజుల్లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని ద్వారా చట్టపరమైన పలు రక్షణలు మహిళలకు చేకూరతాయి. బలోపేతం చేసిన పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం.. విచారణకు హాజరుకాని ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్ సీజ్ చేయడానికి, సీఆర్పీసీ 1973 ద్వారా కోర్టుకు హాజరుకాని వారి ఆస్తులను సీజ్ చేసే వీలు కల్పిస్తాయి. మన రాష్ట్రంలో పరిస్థితి ఇదీ.. తెలంగాణలోనూ ఎన్నారై భర్తలపై 498–ఎ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో విచారణకు హాజరుకాకపోయినా, సహకరించకపోయినా.. వారిపై పోలీసులు లుక్అవుట్ (ఎల్ఓసీ) నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో 232 మంది ఎన్నారై భర్తలపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఏటేటా ఈ నోటీసుల సంఖ్య పెరుగుతుండటం కాస్త ఆందోళన లిగిస్తున్నా.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో బాధితుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నోటీసులు జారీ చేశాక, ఇక ఆ వ్యక్తి ఏ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయాల ద్వారా ప్రయాణం చేయలేరు. ఫలితంగా వారు పోలీసులకు చిక్కడమే కాకుండా తరువాత ఇంటర్‌పోల్ సాయంతో వారిని తిరిగి మన దేశానికి తీసుకువచ్చే వీలుంటుంది. బాధితులు ముందుకు రావాలి.. ఎన్నారై భర్తల విషయంలో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వివాహం విదేశాల్లో జరిగినా, ఇండియాలో జరిగినా.. ఇక్కడ కేసు నమోదు చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళలు తమకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు పోలీసులను ఆశ్రయించవచ్చు. కేసు తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయి. – స్వాతి లక్రా, ఐజీపీ (లా అండ్ ఆర్డర్) విమెన్ సేప్టీ -
ఠాణాలో ప్రత్యక్షమైన చంద్రముఖి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జండర్ చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఆమె ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం చంద్రముఖి కనిపించకుండా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రాన్స్‌జండర్లు ఓ వైపు ఆందోళనకు దిగగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. గురువారంలోగా చంద్రముఖిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించడంతో బంజారాహిల్స్ పోలీసులు హుటాహుటిన లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇది జరిగిన 12 గంటల వ్యవధిలోనే చంద్రముఖి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఆమె నోరు విప్పితేగానీ అసలు ఏం జరిగిందన్న విషయం తెలియదు. -
మాల్యా లుకౌట్ నోటీసుపై స్పందించిన సీబీఐ
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాపై లుకౌట్ నోటీసు తీవ్రతను మార్చాలన్న నిర్ణయం తగు స్థాయిలో తీసుకున్నదే తప్ప, జేడీ ఏకే శర్మ ఒక్కరిది మాత్రం కాదని సీబీఐ పేర్కొంది. పీఎన్బీని రూ.12వేల కోట్ల మేరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి వెళ్లడంలోనూ తమ అధికారుల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. మాల్యాపై లుకౌట్ నోటీసును బలహీన పర్చడం వెనుక ప్రధాని మోదీకి సన్నిహితుడైన గుజరాత్ కేడర్ సీబీఐ జేడీ ఏకే శర్మ హస్తముందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈయన కారణంగానే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కూడా పారిపోయారని శనివారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
గుర్మీత్ కూతురిపై లుక్ఔట్ నోటీసు
-
గుర్మీత్ కూతురిపై లుక్ఔట్ నోటీసు
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు పాలైన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, ఆయన కీలక అనుచరులపై హరియాణా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వారు దేశం విడిచిపోయే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, బస్సులు, రైల్వే స్టేషన్లను అలర్ట్ చేశారు. గుర్మీత్ జైలు నుంచి తప్పించుకొని పోయేందుకు కుట్ర పన్ని అరెస్టయిన డేరా సచ్చాకు చెందిన ఓ ముఖ్యమైన వ్యక్తిని విచారించిన అనంతరం ఈ నోటీసు లిచ్చారు. గుర్మీత్‌కు సంబంధించి కొన్ని అంశాల విషయంలో హనీప్రీత్‌ను, డేరా అధికార ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పంచకుల పోలీస్ కమిషనర్ ఏఎస్ చావ్లా పేర్కొన్నారు. ‘అరెస్టయిన సురీందర్ ధిహమ్ ఇన్సాన్‌ను ప్రశ్నించగా.. హనీప్రీత్, ఆదిత్య దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నాయని చెప్పాడు. అందుకే వారిపై నోటీసులు జారీ చేశాం’అని చావ్లా తెలిపారు. గుర్మీత్ తప్పించుకొని పోయేందుకు చేసిన కుట్రలో పోలీసుల హస్తంపై పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. కాగా, గుర్మీత్‌కు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల కారణంగా మృతుల సంఖ్య 41కి చేరింది. గుర్మీత్‌కు సెక్యూరిటీగా ఉన్న ఐదుగురు హరియాణా పోలీసులపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి వారిని సర్వీసు నుంచి తొలగించారు. -
సుప్రీం ముంగిట కార్తీ లుక్అవుట్ వ్యవహారం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు జారీ చేసిన లుక్అవుట్ నోటీసుపై మద్రాస్ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడాన్నిసవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనను విదేశాలకు వెళ్లకుండా నిరోధించేలా సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ కార్తీ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ వేశారు. అవినీతి, ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి కార్తీకి సీబీఐ ఈ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ ఈ అంశాన్ని విచారణ చేపట్టింది. కార్తీ చిదంబరం సహా నిందితులు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించిన కోర్టు, ముగ్గురు నిందితులు దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల చట్టం ఉల్లంఘనలకు పాల్పడేలా సహకరించినందుకు కార్తీ చిదంబరంకు రూ 3.5 కోట్ల ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే తనపై ఆరోపణలు నిరాధారమని, రాజకీయ కక్షసాధింపులో భాగమని కార్తీ చిదంబరం చెబుతున్నారు.