మాల్యా లుకౌట్‌ నోటీసుపై స్పందించిన సీబీఐ | CBI responds to Rahul Gandhi's charges against its officer in Vijay Mallya case | Sakshi
Sakshi News home page

మాల్యా లుకౌట్‌ నోటీసుపై స్పందించిన సీబీఐ

Published Sun, Sep 16 2018 3:31 AM | Last Updated on Sun, Sep 16 2018 3:31 AM

CBI responds to Rahul Gandhi's charges against its officer in Vijay Mallya case - Sakshi

న్యూఢిల్లీ: విజయ్‌ మాల్యాపై లుకౌట్‌ నోటీసు తీవ్రతను మార్చాలన్న నిర్ణయం తగు స్థాయిలో తీసుకున్నదే తప్ప, జేడీ ఏకే శర్మ ఒక్కరిది మాత్రం కాదని సీబీఐ పేర్కొంది. పీఎన్‌బీని రూ.12వేల కోట్ల మేరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ దేశం విడిచి వెళ్లడంలోనూ తమ అధికారుల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. మాల్యాపై  లుకౌట్‌ నోటీసును బలహీన పర్చడం వెనుక ప్రధాని మోదీకి సన్నిహితుడైన గుజరాత్‌ కేడర్‌ సీబీఐ జేడీ ఏకే శర్మ హస్తముందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈయన కారణంగానే నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ కూడా పారిపోయారని శనివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement