Vijay Mallya
-
మరీ ఇంత అన్యాయమా?.. కోర్టు మెట్లెక్కిన విజయ్ మాల్యా!
బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. తాను వ్యాపార నిమిత్తం భారత్‌లోని పలు బ్యాంకుల్లో చేసిన అప్పు కంటే.. అవి తన వద్ద నుంచి వసూలు చేసిన మొత్తం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని ఆరోపించారు. కాబట్టి రికవరీ చేసిన మొత్తానికి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ను అందించేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని మాల్యా తన పిటిషన్లో కోరారు.బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా తరుపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య తన వాదనల్ని కోర్టుకు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.6,200 కోట్ల అప్పు చేసిందని.. అందుకు బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని అన్నారు. ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. మాల్యాకు చెందిన రూ.14, 131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని, ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10, 200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. కాబట్టి బ్యాంకులు తీసుకునే తదుపరి రికవరీ చర్యలపై తాత్కాలిక స్టే విధించాలని, అన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లు అందించాలని మాల్యా కోరారు.వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది. -
అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్
నేను చెల్లించాల్సిన మొత్తం కంటే.. బ్యాంకులు రెండింతలు ఎక్కువ రికవరీ చేశాయని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.డెట్ రికవరీ ట్రిబ్యునల్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాన్ని రూ. 1200 కోట్ల వడ్డీతో సహా రూ. 6203 కోట్లుగా నిర్ణయించింది. అయితే బ్యాంకులు నా నుంచి ఏకంగా రూ. 14131.60 కోట్లు రికవరీ చేశాయని.. విజయ్ మాల్యా తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. ఈడీతో పాటు బ్యాంకులు తాను చెల్లించాల్సిన అప్పుల కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ చేసుకున్నాయని వెల్లడించారు. అప్పులు రికవరీ అయ్యాక కూడా నేను ఆర్ధిక నేరస్తుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు.The Debt Recovery Tribunal adjudged the KFA debt at Rs 6203 crores including Rs 1200 crores of interest. The FM announced in Parliament that through the ED,Banks have recovered Rs 14,131.60 crores from me against the judgement debt of Rs 6203 crores and I am still an economic…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024లోక్‌సభలో గ్రాంట్లకు సంబంధించిన సప్లమెంటరీ డిమాండ్లపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ.. మాల్యాకు చెందిన రూ. 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై మాల్యా స్పందిస్తూ.. ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 9వ తరగతి స్టూడెంట్ ఖాతాలో రూ.87.63 కోట్లునాపైన సీబీఐ క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం, కొంతమంది విమర్శకులు చెబుతున్నారు. సీబీఐ ఏ క్రిమినల్ కేసులు పెట్టింది?. నేను ఒక్క రూపాయి కూడా లోన్ తీసుకోలేదు. దొంగిలించలేదు. కానీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి గ్యారెంటర్‌గా.. ఐడీబీఐ బ్యాంక్ అధికారులతో సహా అనేక మంది ఇతర వ్యక్తులతో కలిసి ఐడీబీఐ బ్యాంక్ నుంచి.. వారి క్రెడిట్ కమిటీ, బోర్డు ఆమోదం పొందిన రూ.900 కోట్ల లోన్ మోసపూరితంగా పొందినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే లోన్, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించాను. 9 సంవత్సరాల తర్వాత మోస, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఎందుకు లేవు? అని కూడా మాల్యా ప్రశ్నించారు.Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 -
‘మిత్రమా.. మనకు అన్యాయం జరిగింది!’
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా.. లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్ మాల్యాకు ఇవాళ లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో చర్చ తాజా పరిణామాలపైకి దారి మళ్లింది.‘‘నా ప్రియమైన మిత్రుడు విజయ్‌మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనిద్దరమూ అది చూశాం. అయ్యిందేదో అయ్యింది.. రాబోయే సంవత్సరం నీదే మిత్రమా. ప్రేమ.. చిరునవ్వులతో సంతోషంగా ఉండూ.. అంటూ పోస్ట్ చేశారు. దానికి విజయ్ మాల్యాస్పందిస్తూ.. థ్యాంక్యూ మై డియరెస్ట్ ఫ్రెండ్. దేశానికి మనం ఎంతో చేశాం.. అయినా మనకు అన్యాయమే జరిగింది అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు.Wishing you my friend #vijaymallya a very #happybirthday - life sure has its ups and downs we have both seen it. This too shall pass. May the year ahead be your year. And you are surrounded by love and laughter. Big big hug 🤗🥰🙏🏽@TheVijayMallya pic.twitter.com/ca5FyMFnqr— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024ఇదిలా ఉంటే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఎగవేతదారుల నుంచి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఈ ఏడాది రూ.22,280 కోట్లు రాబట్టామని.. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపైనా విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. అలాగే సీబీఐ తన మీద పెట్టిన కేసు గురించి.. జప్తు గురించి మరో ట్వీట్ చేశారు. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి కూడా లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు జోకులేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ మాల్యా తీరుపై మండిపడుతున్నారు.This too shall pass my friend @TheVijayMallya and wish a very happy birthday today my friend https://t.co/HYJYKe1mcx— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024 Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024Whatever I have stated about my liabilities as guarantor of KFA loans is legally verifiable. Yet more than Rs 8000 crores have been recovered from me over and above the judgement debt. Will anyone, including those who freely abuse me, stand up and question this blatant injustice…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ వెల్లడించారు. ఇక.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వివిధ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోవడంతో నష్టపోయిన బ్యాంకులు కొంత ఉపశమనం పొందాయన్నారామె. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను విక్రయించి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి మరో రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి వేలం వేయబోతున్నట్లు ప్రకటించారామె. -
రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణ
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆస్తులు పోగేసి వివిధ బ్యాంకులను మోసం చేసిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్థంగా చర్యలు తీసుకుంటోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు రుణాలను ఎగవేసి పరారీలో ఉన్న విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతోపాటు వివిధ మోసాలకు పాల్పడిన వారికి చెందిన రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.సంపద రాబట్టేందుకు ఈడీ ప్రయత్నంనిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్లపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మంత్రి మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులు బ్యాంకులను మోసం చేసి అక్రమంగా సంపాదించిన సంపదను తిరిగి రాబట్టేందుకు ఈడీ చాలా ప్రయత్నిస్తోంది. ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ రికవరీ చేసింది. వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుద్ధరించాం. నీరవ్ మోదీ నుంచి రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఈడీ అధికారులు తిరిగి అప్పగించారు. మెహుల్ చోక్సీకు చెందిన రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వేలం వేయడానికి సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.ఎన్ఎస్ఈఎల్.. రూ.17.47 కోట్లు రికవరీవ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ సృష్టించే లక్ష్యంతో 2005లో ఏర్పాటు చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) కుంభకోణంకు సంబంధించి రూ.17.47 కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి ఈ డబ్బును ఇచ్చినట్లు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ఆధ్వర్యంలోని ప్రధాన కేసుల నుంచి కనీసం రూ.22,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ విజయవంతంగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..బ్లాక్ మనీ చట్టంతో పెరిగిన సంఖ్య2015లో రూపొందించిన బ్లాక్ మనీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను స్వచ్ఛందంగా బహిర్గతం చేస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఆస్తులను ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2021-22లో 60,467 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు పెరిగిందన్నారు. జూన్ 2024 నాటికి బ్లాక్ మనీ చట్టం కింద మొత్తం రూ.17,520 కోట్లకు సంబంధించి 697 కేసుల విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 163 ప్రాసిక్యూషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పనామా పేపర్లు, పండోర పేపర్లు, హెచ్ఎస్బీసీ, ఐసీఐజే లీక్‌ల వంటి హైప్రొఫైల్ అంశాలకు సంబంధించి విచారణ సాగుతున్నట్లు స్పష్టం చేశారు. -
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్‌లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్‌తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్ కింగ్‌గా పేరొందిన విజయ్ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్‌ఫిషర్ టవర్స్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్ బ్లాక్‌ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఒక్క రోజు కూడా ఉండలేదుఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్‌ఫిషర్ టవర్స్ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్ ఉండే టవర్స్ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్‌లో విజయ్ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు. -
మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్ను పెళ్లి చేసుకున్నాడు.లండన్‌లో జూన్ 22న సిద్ధార్థ-జాస్మిన్ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సందడిలో వడ్డించిన వంటలు, ఇతర పదార్థాలపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది.ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంట్రస్టింగ్ సంగతులను షేర్ చేశాడు. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బీర్ ఇమేజ్ను షేర్ చేయడంతో ఇది ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. లండన్‌లో కింగ్ పిషర్కు మించింది ఏముంటుంది అనే క్యాప్షన్‌తో ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఇంకా కడీపట్టా బుర్రట్టా, పాన్-ఫ్రైడ్ అట్లాంటిక్ సీ బాస్ లాంటి వాటితో పాటు ఇతర వంటకాలున్నాయని తన స్టోరీలో తెలిపాడు. మరోవైపు సిద్ధార్థ-జాస్మిన్ పెళ్లి సంబరాలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా పెళ్లి కళ ఉట్టిపడుతున్న తమ రెండు ఫోటోలను సిద్ధార్థ మాల్యా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అంతకుముందు తన కాబోయే భార్యతో పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేసి, తన ఫ్యాన్స్‌కు పెళ్లికబురు అందించిన సంగతి తెలిసిందే. -
Vijay Mallya Son Wedding: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కొడుకు (ఫోటోలు)
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విజయ్ మాల్యా కొడుకు పెళ్ళిలో లలిత్ మోదీ
మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చీఫ్, పరారీలో ఉన్న లలిత్ మోదీ.. ఇటీవల విజయ్ మాల్యాకు కొడుకు 'సిద్ధార్థ మాల్యా' వివాహంలో కనిపించారు. లండన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్‌లో మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈయన పెళ్ళిలో కాకుండా.. సన్నిహితులు & కుటుంబ సభ్యులు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కనిపించారు.సిద్ధార్థ మాల్యా పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.సిద్ధార్థ్ మాల్యా & జాస్మిన్లు భార్యాభర్తలుగా ఉన్న మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ ఆకుపచ్చ రంగు టక్సేడోలో ఉండగా, జాస్మిన్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో వీల్‌తో మరియు ఆమె చేతిలో బొకేతో కనిపించారు. ఈ ఫోటోకు 'మిస్టర్ అండ్ మిసెస్ ముప్పెట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.Siddharth Mallya gets married in London.Indian middle class : “Yeh taufa humne tumko diya hai”pic.twitter.com/VYapa1ZoMe— Doctor (@DipshikhaGhosh) June 23, 2024 -
పెళ్లికి సిద్ధమవుతున్న విజయ్‌మాల్యా కుమారుడు (ఫొటోలు)
-
విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల ప్రేయసి జాస్మిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ ఫొటో షూట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వివాహ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? లేదంటే కొద్ది మంది సమక్షంలోనే జరపనున్నారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వీళ్లిద్దరూ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. కిందటి ఏడాది హలోవీన్ సందర్భంలో రింగ్ తొడిగి తన ప్రేమను ప్రపోజ్ చేశాడు సిద్ధార్థ్. అలా ఆ ప్రపోజల్‌తో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. జాస్మిన్ ఇన్‌స్టా బయోలో యూఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్‌ను బట్టి మాజీ మోడల్‌గా తెలుస్తోంది. ఇంతకి మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె కుటుంబ నేపథ్యం తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధార్థ్ నటుడిగా, మోడల్‌గా పరిచయస్థుడే. విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతులకు సిద్ధార్థ్ జన్మించాడు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు సిద్ధార్థ్. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్బీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్‌ఫిషర్ మోడల్స్ జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్‌గా మారాడు. నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే.. ఆ తర్వాతే సిద్ధార్థ్ కెరీర్లో మార్పు కనిపించింది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వైపు మళ్లిన సిద్ధార్థ్.. యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు. View this post on Instagram A post shared by Sid (@sidmallya)ఇక.. సిద్ధార్థ్ తండ్రి విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. ఆయన భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్మో హోల్డింగ్ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది. -
విలాసవంతమైన ఆకాశహర్మ్యం: ఎవరిదో? ఎక్కడుందో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మాల్యాకు చెందిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక కింగ్ ఫిషర్ టవర్స్‌పై నిర్మించిన ఇంద్రభవనం లాంటి పెంట్‌హౌస్ గురించి ఎపుడైనా విన్నారా? దాదాపు 400 అడుగుల ఎత్తులో బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పైభాగంలోమాన్షన్ స్టైల్ పెంట్ హౌస్‌ను నిర్మించారు. ఒకపుడు అతని పూర్వీకులకు చెందిన 4.5 ఎకరాల భూమిపై టవర్, దానిపై పెంట్‌హౌస్‌ను రూపుదిద్దుకుంది. హెలీప్యాడ్, ఇన్ఫినిటీ పూల్ ఇలాంటి మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలు దీని సొంతం. హెలిప్యాడ్‌తో రెండు స్థాయిలలో (34- 35వ ఫోర్లు) 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ 20 వేల డాలర్లకు పైమాటే. This 20 million dollar mansion was built on top of Kingfisher Towers in Bengaluru, India pic.twitter.com/Zce8Kk6Lx4 — Historic Vids (@historyinmemes) March 19, 2024 మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL),ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా ఇది నిర్మితమైంది. ఇందులో యూబీహెచ్ఎల్కు 55 శాతం, ప్రెస్టీజ్ డెవలపర్‌కు 45 శాతం వాటా ఉంది. కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఫ్లాట్లను కూడా ఏడింటిని రూ.150 కోట్లకు విక్రయించిదంటే దీని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. మొత్తం అమ్మకాలు 2013లోనే పూర్తి అయినట్టు భావిస్తున్నారు. అయితే మాల్యాపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో 2014లో UBHL ఫ్లాట్లను పెంట్ హౌస్‌ను విక్రయించకుండా దర్యాప్తు సంస్థలు నిషేధించాయి. దేశంనుంచి పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో ఉంది కేంద్రం. -
మాల్యా దగ్గర లోన్లు చెల్లించేంత డబ్బుంది, కానీ..
ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా వ్యవహారానికి సంబంధించి.. సీబీఐ తాజాగా ముంబై కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో విస్తుపోయే విషయాలను పేర్కొంది దర్యాప్తు సంస్థ. విజయ్ మాల్యా దగ్గర ఆ సమయానికి రుణం తిరిగి చెల్లించడానికి తగినంత డబ్బు ఉనప్పటికీ.. ఆ పని చేయలేదని, బదులుగా ఆయన దేశం విడిచి పారిపోయే ముందు విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అదే సమయంలో బ్యాంకులు సైతం ఆయన నుంచి లోన్లు రికవరీ చేయడంలో విఫలం అయ్యాయంటూ తెలిపింది. 2008-17 మధ్య మాల్యా దగ్గర బ్యాంకు లోన్లు చెల్లించడానికి తగినంత డబ్బు ఉంది. ఆ సమయంలోనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ కోసం అతను లోన్లు తీసుకున్నాడు అని సీబీఐ పేర్కొంది. అయితే.. తన దగ్గర ఉన్న సొమ్ముతో లోన్లు చెల్లించకపోగా.. యూరప్ వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు తన పిల్లలకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో ఉన్న ట్రస్టులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడని గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు చెల్లించి రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశాడు. తన కంపెనీలలో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుండి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ పేర్కొంది. అలాగే ఇంగ్లండ్‌లోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. ఐడీబీఐ-కింగ్‌పిషర్ ఎయిర్‌లైన్స్ 900 కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నాడు. విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయి.. యూకేలో తలదాచుకున్నాడు. ఈ మేరకు అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కూడా. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2019, జనవరి 5వ తేదీన ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను fugitive(పరారీలో) ఉన్నట్లుగా ప్రకటించింది. ఇక.. గత ఛార్జ్‌షీట్‌లో 11 మంది నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ, తాజా ఛార్జ్‌షీట్‌లో ఐడీబీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా పేరును చేర్చింది. మొత్తంగా రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయాడు మాల్యా. ఇదీ చదవండి: ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. వణికిపోయేలా చేసింది! -
విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు మరోమారు చుక్కెదురైంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరస్థుడుగా ప్రకటించిన మాల్యా పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు అందడం లేదని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. తనను పరారీలో ఉన్నఆర్థిక నేరగాడిగా ప్రకటించి, తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ మాల్యా సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం నాన్ ప్రాసిక్యూషన్ కారణంగా పిటిషన్ కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 9 వేల కోట్లకు పైగా ఎగవేసిన మాల్యా 2016లో లండన్‌కు చెక్కేశాడు. దీనిపై సీబీఐ , ఈడీ సులు నమోదు చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 5, 2019న ముంబై ప్రత్యేక న్యాయస్థానం చట్టం ప్రకారం మాల్యాను ‘పరారీదారు’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి వేగంగా రప్పించడం, ఆస్తుల రికవరీనిపై ద్వైపాక్షిక సమన్వయం కాకుండా బహుపాక్షిక చర్యలపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. అటు గురుగ్రామ్‌లో జరిగిన జీ20 దేశాల అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు తమ అవినీతి సొమ్మును డబ్బును టెర్రర్ ఫండింగ్ , యువతను నాశనం చేస్తున్న అక్రమ మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల అమ్మకం లాంటి అనేక విధ్వంసక సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విజయ్ మాల్యాతో సహా పీఎన్బీ స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను రప్పించేందుకు దేశం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
రామోజీ రావు మరో విజయ్ మాల్యా ..?
-
అబ్బే! శిక్ష 9000 కోట్లు ఎగ్గొట్టినందుకు కాదు!
అబ్బే! శిక్ష 9000 కోట్లు ఎగ్గొట్టినందుకు కాదు! -
విజయ్ మాల్యాకు 2 వేల జరిమానా! మీమ్స్ వైరల్!
బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ మాల్యాకు కోర్టు 2వేల జరిమానా విధించిడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రూ.9వేల కోట్లకు పైగా రుణాల్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాకు కోర్టు విధించిన ఈ జరిమానా సరిపోదని అంటున్నారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరుతూ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటే చూసేద్దాం. Vijay Mallya gets 4-month jail sentence, Rs 2000 fine in contempt case of bank default case of over Rs 9,000 crore. Very very strict punishment. 🤣 pic.twitter.com/cLOiMySxsx — Tushar Kant Naik ॐ♫₹ (@Tushar_KN) July 11, 2022 కోర్టు దిక్కారం కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం..కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశించింది. #SupremeCourt #VijayMallya SC awards 4-month jail sentence and imposes Rs 2000 fine. Vijay Mallya : pic.twitter.com/wEP9TKVRNb — g0v!ñD $#@®mA (@rishu_1809) July 11, 2022] #VijayMallya's feelings after #SupremeCourt imposed fine of RS 2000 👇 सुप्रीम कोर्ट विजय माल्या pic.twitter.com/oX3UTIjo7M — Ashutosh Sharma (@AshutosSharma25) July 11, 2022 -
మాల్యాకు 4 నెలల జైలు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా కట్టకుంటే మరో 2 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. మాల్యా తీరును ఖండిస్తూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘మాల్యా తన ప్రవర్తన పట్ల ఎన్నడూ పశ్చాత్తాపం వెలిబుచ్చలేదు. క్షమాపణలూ చెప్పలేదు. కాబట్టి కోర్టు గౌరవాన్ని కాపాడేందుకు ఆయనకు ఈ శిక్ష విధించడ తప్పనిసరి’’ అని న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. శిక్ష అనుభవించేందుకు వీలుగా మాల్యాను తక్షణం భారత్ రప్పించాలని కేంద్ర హోం శాఖకు సూచించింది. మాల్యాపై రూ.9,000 కోట్లకు పైగా రుణాల ఎగవేత కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 4 కోట్ల డాలర్లను ఆయన తన పిల్లలకు బదిలీ చేశారు. ఇది కోర్టు ధిక్కరణేనంటూ 2017 మేలో కోర్టు తీర్పు ఇచ్చింది. 4 కోట్ల డాలర్లను 8 శాతం వార్షిక వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ ఆఫీసర్ వద్ద జమ చేయాలని మాల్యాను, ఆయన పిల్లలను ఆదేశించింది. లేదంటే రికవరీకి ఆఫీసర్ చర్యలు చేపడతారని పేర్కొంది. -
విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష
-
విజయ్ మాల్యాకు భారీ షాక్, మొత్తం చెల్లించకపోతే: సుప్రీం కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు కోర్టు నుంచి సమాచారాన్ని దాచిపెట్టినందుకు దోషిగా తేలడంతో సుప్రీం తాజా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలకు భిన్నంగా 40 మిలియన్ డాలర్లను కుటుంబానికి బదిలీ నేరం కింద మాల్యాకు "ఈ శిక్ష తప్పదు. మాల్యా ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదు" అని సుప్రీం పేర్కొంది. జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని, లేని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా పిటిషన్‌ను 2020లో అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా 9వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం కేంద్రం దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవాలను దాచిపెట్టి, డియాజియో నిధులను తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు డబ్బును మళ్లించారని, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను 'ద్వేషపూరితంగా ఉల్లంఘించారని' బ్యాంకులు ఆరోపించాయి. 2016 మార్చిలో యూకేకు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18, 2017న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. -
'మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు'! రేపే శిక్ష ఖరారు చేయనున్న సుప్రీం కోర్టు!
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సోమవారం భారత అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరపనుంది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. 2017లో విజయ్ మాల్యా సుప్రీం కోర్ట్ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమాచారాన్ని కోర్ట్‌కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది. ఇప్పటికే కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు మాల్యా కోర్ట్‌కు హాజరు కావాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కానీ మాల్యా సుప్రీం కోర్టు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్ ధిక్కారం కేసుకు సంబంధించి ఏప్రిల్11న సుప్రీం కోర్ట్ తుది తీర్పు ఇవ్వనుంది. మాల్యాకు వ్యతిరేకంగా శిక్ష ఖరారు కానుంది. -
మరోసారి వార్తల్లోకి విజయ్ మాల్యా, ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ‘‘సూపర్ ఫ్రెండ్షిప్, బెస్ట్ అక్విజిషన్" అంటూ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో ఉన్న ఫోటోను తాజాగా ట్వీట్ చేయడం విశేషంగా నిలిచింది. ‘‘క్రిస్టోఫర్ హెన్రీ గేల్ @హెన్రీగేల్, ‘యూనివర్స్ బాస్’ను కలుసుకోవడం అదృష్టం. ఆర్సీబీకి తీసుకున్నప్పటినుంచి మంచి స్నేహితుడు" అని మాజీ ఆర్సీబీ యజమాని మాల్యా పేర్కొన్నాడు. ఆర్సీబీకి గేల్‌ను కొనుగోలు చేయడం ఎప్పటికీ బెస్టే అంటూ రాసుకొచ్చాడు. ఈ పిక్ ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ కావడం మాత్రమే కాదు చర్చనీయాంశంగా మారింది. Great to catch up with my good friend Christopher Henry Gayle @henrygayle , the Universe Boss. Super friendship since I recruited him for RCB. Best acquisition of a player ever. pic.twitter.com/X5Ny9d6n6t — Vijay Mallya (@TheVijayMallya) June 22, 2022 దీంతో ‘లిక్కర్ కింగ్ విత్ యూనివర్స్ బాస్’ అంటూ కమెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఆర్సీబీకి 2011-2017 వరకు ఆడాడు క్రిస్ గేల్. ఈ సందర్భంగా గేల్ పరుగుల సునామీ గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా కేవలం 30 బాల్స్‌లోనే సెంచరీ బాదిన మెమరబుల్ ఇన్నింగ్స్‌ను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు గేల్ 2011లో రీప్లేస్మెంట్ ప్లేయర్‌గా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి, అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా మారాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. 2009, 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించిన గేల్ పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. అయితే, ఐపీఎల్ 2022 మెగా వేలానికి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 4965 పరుగులు చేశాడు. 148.96 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో లీగ్‌లో 39.72 సగటుతో ఉన్నాడు. 2013లో ఇప్పుడు ఆగిపోయిన పూణే వారియర్స్‌పై అజేయంగా 175 పరుగులతో సహా ఆరు సెంచరీలను నమోదు చేశాడు. టీ20లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. -
బ్యాంకులంటే విజయ్ మాల్యా గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి!
బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్‌బ్యారన్ విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ కింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ కంపెనీ నుంచి ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ దాకా..ఐపీఎల్ నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దాకా..విజయ్ మాల్యా చేసిన ప్రతీ బిజినెస్‌లోనూ నష్టాలే స్వాగతం పలికాయి. ముఖ్యంగా 2005లో ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం అప్పుల భారాన్ని మరింత పెంచేశాయి. ఇతర వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయి. పైలట్లు, ఇంజనీర్లకు నెలల తరబడి జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారు. అందుకే 2012లో నాటి భారత కేంద్ర ప్రభుత్వం మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్ లైసెన్స్‌ను రద్దు చేసింది. వెరసీ బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి బ్యాంకులకు చెల్లించలేక 2016లో భారత్ నుంచి పారిపోయాడు. అందుకే బ్యాంక్‌లు విజయ్ మాల్యాకు ఇచ్చిన రుణాల్ని ముక్కుపిండి వసూలు చేస్తుంటే..ఇటు కేంద్రం సైతం యూకే నుంచి భారత్‌కు తెప్పించే ప్రయత్నాల్ని కొనసాగిస్తుంది. He tweets only when the banks are closed. 😂😂😂😂😂😂 pic.twitter.com/7I1lMDrqke — Vithoba Corleone (@DonJuannabe) May 5, 2022 ఈ క్రమంలో విజయ్ మాల్యా ట్విట్లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే? విజయ్ మాల్యా నిత్యం ట్విటర్లో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సమయం, సందర్భాన్ని బట్టి ఏదో ఒక ట్విట్ చేస్తుంటారు. ఇంతకీ ఆ ట్విట్లు ఎప్పుడు వేస్తుంటారో తెలుసా? బ్యాంక్‌లకు హాలిడేస్‌లో ఉన్నప్పుడు లేదంటే రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే. కావాలంటే మీరే చూడండి అంటూ నెటిజన్లు విజయ్ మాల్యా చేసిన ట్విట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు విజయ్ మాల్యా సంక్రాంతి,హోలీ, ఉగాది, విషు, ఈస్టర్,ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశారు. గతేడాది డిసెంబర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేశాడని, అందుకు సంబంధించిన ట్విట్లను వైరల్ చేస్తున్నారు. He tweets on second and fourth Saturdays also. — TrOLL PLAZA (@1passdaily) May 5, 2022 దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. బ్యాంకులంటే చిన్న చిన్న రుణాలు తీసుకున్న వారికే కాదండోయ్..వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా లాంటి వాళ్లకు కూడా భయమేనని కామెంట్ చేస్తున్నారు. అతను మంచి రుణగ్రహీత. హాలిడేస్‌లో తప్పా..వర్కింగ్ డేస్‌లో బ్యాంకర్లను అస్సలు డిస్ట్రబ్ చేయడు అని ఒక నెటిజన్ అంటుంటే ..రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే ట్విట్ చేస్తాడు"అని చమత్కరించాడు. చదవండి👉అమ్మకానికి విజయ్‌మాల్యా ఇల్లు.. చివరి నిమిషంలో ట్విస్ట్ -
ఆర్థిక నేరగాళ్లను అప్పగించాలి
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్థులను రప్పించి చట్టం ముందు నిలబెట్టడం తమకు అత్యంత ప్రాధాన్యాంశమని ఇంగ్లండ్‌కు భారత్ స్పష్టం చేసింది. దీన్ని తాను అర్థం చేసుకున్నానని భారత పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు తమ న్యాయవ్యవస్థను వాడుకోవాలనుకునే నేరగాళ్లను ఎన్నటికీ స్వాగతించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని చాలారోజులుగా భారత్ ఒత్తిడి తెస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో జాన్సన్ మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. న్యాయపరమైన కారణాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని వివరించారు. మోదీ, జాన్సన్ చర్చల్లో ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ప్రస్తావనకు వచ్చిందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ఈ విషయంలో భారత్ వైఖరిని జాన్సన్‌కు మోదీ వివరించారని చెప్పారు. దీనిపై జాన్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉగ్ర మూకలను సహించం ఇంగ్లండ్ వేదికగా ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునే ఉగ్ర మూకలను సహించబోమని బోరిస్ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం ప్రధానుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని ష్రింగ్లా చెప్పారు. దీనిపై భారత్ ఆందోళనను బోరిస్ అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి గ్రూపులను ఎదుర్కొనేందుకు సంయుక్త ంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై నేతలు చర్చించారన్నారు. అక్కడ సత్వరమే శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారని చెప్పారు. రష్యాపై ఆంక్షల విషయంలో భారత్‌పై యూకే ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కీవ్‌లో వచ్చేవారం తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తామని బోరిస్ వెల్లడించారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్–ఇంగ్లండ్ బంధం.. అత్యంత పటిష్టం భారత్, ఇంగ్లండ్ మధ్య అన్ని విషయాల్లోనూ బంధం ముందెన్నడూ లేనంత బలోపేతంగా మారిందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు. దీపావళి నాటికి రెండుదేశాల మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. 2030 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపవుతుందని, వినిమయ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఎఫ్‌టీఏలోని 26 అంశాల్లో నాలుగింటిపై గతంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరిందని, మిగతా వాటిపై పురోగతి కనిపించిందని అధికారులు తెలిపారు. ఇండియాకు ఒజీఈఎల్ (ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్) ఇస్తామని, దాంతో రక్షణ రంగ వాణిజ్యానికి అడ్డంకులు తొలగుతాయని జాన్సన్ చెప్పారు. భూ, జల, వాయు, సైబర్ మార్గాల్లో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించామన్నారు. నూతన ఫైటర్ జెట్ టెక్నాలజీని భారత్‌తో పంచుకుంటామన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపించిందని మోదీ చెప్పారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి యూకే సాయం చేస్తుందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛపై యూకే ఆరంభించిన ఐపీఓఐని స్వాగతించారు. విద్య, వైద్యం, పునర్వినియోగ ఇంధనం తదితర అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సచిన్, అమితాబ్‌లా ఫీలవుతున్నా: జాన్సన్ భారత్‌లో తనకు అత్యంత ఆదరణపూర్వక స్వాగతం లభించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతోషం వ్యక్తం చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఖాస్ దోస్త్ (బెస్ట్ ఫ్రెండ్)గా అభివర్ణించారు. పలుమార్లు నరేంద్ర అని ప్రస్తావిస్తూ తమ సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. బ్రిటీష్ ఇండియన్లలో దాదాపు సగంమందికి పుట్టిల్లైన గుజరాత్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ తనకు లభించిన ఆదరణ చూస్తే సచిన్ టెండూల్కర్‌లాగా ఫీలవుతున్నానని, ఎక్కడచూసినా అమితాబ్ బచ్చన్ లాగా తన పోస్టర్లే కనిపిస్తున్నా యని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య బంధం ఎంతో కీలకమన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద జాన్సన్‌కు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ స్వాగతం లభించింది. నా భుజానికున్నది భారతీయ టీకానే! తనతో సహా వందకోట్లమందికి పైగా ప్రజలకు భారత్ కోవిడ్ టీకా అందించిందని బోరిస్ ప్రశంసించారు. ‘ నా భుజానికున్నది ఇండియన్ టీకా, అది నాకు ఎంతో మేలు చేసింది. భారత్‌కు కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. మోదీ ఆశించినట్లు ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ మారిందని కొనియాడారు. ఆస్ట్రాజెనెకా, సీరమ్ సహకారంతో కోవిడ్ టీకా రూపొందించడాన్ని ప్రస్తావించారు. -
అమ్మకానికి విజయ్‌మాల్యా ఇల్లు.. చివరి నిమిషంలో ట్విస్ట్
లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకి లండన్ కోర్టులో ఊరట లభించింది. బ్యాంకు లోన్లు చెల్లించని కారణంగా ఇంటిని జప్తు చేయోచ్చుంటూ గతంలో వచ్చిన తీర్పుపై ఆయనకు ఊపశమనం లభించింది. విజయ్ మాల్యా కుటుంబానికి లండన్‌లోని కార్న్‌వాల్‌లో విలాసవంతమైన భవనం ఉంది. విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యాతో పాటు కొడుకు సిద్ధార్థ్ మాల్యా అక్కడ నివసిస్తున్నారు. గతంలో స్విస్ బ్యాంక్, రోజ్ క్యాపిటల్ వెంచర్స్‌ల నుంచి తీసుకున్న రుణాన్ని విజయ్ మాల్యా సకాలంలో చెల్లించలేదు. దీంతో అప్పు కింద మాల్యా కుటుంబం నివిస్తున్న ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ అప్పిచ్చిన సంస్థలు కోర్టును ఆశ్రయయించాయి. అనేక వాయిదాల్లో విచారణ జరిగిన తర్వాత ‘ విజయ్ మాల్యా తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని.. అప్పిచ్చిన సంస్థలు ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చంటూ ’ కోర్టు తీర్పు ఇచ్చింది. స్విస్ బ్యాంక్, రోజ్ క్యాపిటల్ వెంచర్స్‌ల దగ్గర తీసుకున్న అప్పులను మాల్యా ఫ్యామిలీ ట్రస్టు నిధుల నుంచి చెల్లిస్తానని, తన ఇంటి జప్తును ఆపాలంటూ తిరిగి కోర్టును ఆశ్రయించాడు విజయ్‌మాల్యా. అయితే గతంలో ఈ తరహాలోనే అనేక హామీలు ఇచ్చి వాటిని నేరవేర్చలేదని. కాబట్టి తన అప్పులను ట్రస్టు ద్వారా తీరుస్తానంటూ ఇచ్చే హామీని తోసిపుచ్చాలంటూ అప్పులు ఇచ్చిన సంస్థలు న్యాయస్థానం ముందు వాదించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ట్రస్ ద్వారా అప్పులు చెల్లించడం చట్ట విరుద్ధమైమీ కాదంటూ 2022 మార్చి 4న తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు లండన్ ఇంటిని బ్యాంకులు స్వాధీనం చేసుకునే పని ఆగి పోయింది. వృద్ధురాలైన తల్లితో లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న మాల్యాకు తాజా తీర్పు గొప్ప ఉపశమనం కలిగించింది. చదవండి: విజయ్‌మాల్యాకు భారీ షాక్! లండన్ నివాసం నుంచి గెట్ అవుట్ ? -
ఆ ముగ్గురి 19వేల కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేశాం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.19వేల కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రూ.22,500 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన ఈ ముగ్గురు నేరగాళ్లపై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. మనీ ల్యాండరింగ్ చట్టంలోని కొన్ని నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సకాలంలో తీసుకున్న చట్టపరమైన చర్యల ఫలితంగా ఈ ముగ్గురికి చెందిన రూ.15,113 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు చెప్పారు. ఈ కేసుపై వాదనలు వచ్చే వారం కూడా కొనసాగనున్నాయి. -
విజయ్‌మాల్యా, తదితరుల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు రికవరీ: కేంద్రం
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల వంటి కుబేరుల నుంచి దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్రం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి ఇచ్చిన విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకి బుధవారం కేంద్రం వెల్లడించింది. అంతేకాదు విదేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే భారతదేశంలో పీఎంఎల్ఏ కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్నామని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం సుప్రీం కోర్టులో యూకేని ఉదహరించింది, ఇక్కడ మనీలాండరింగ్ చట్టం కింద ఒక ఏడాదిలో 7,900 కేసులు నమోదయ్యాయని, యూఎస్ (1,532), చైనా (4,691), ఆస్ట్రియా (1,036), హాంకాంగ్ (1,823), బెల్జియం (1,862), రష్యా (2,764) నమోదవుతున్నాయని వివరించింది. భారత్‌లో 4 వేల పీఎంఎల్ఏ కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేరాల మొత్తం ఆదాయం రూ. 67,000 కోట్లు అని పేర్కొంది. గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది విచారణకు తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల ఉండగా.. 2020-21 నాటికి 981గా మారుతుందని కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇటువంటి నేరాలకు సంబంధించి 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, కానీ 2 వేల కేసులను మాత్రమే విచారణకు స్వీకరించినట్లు కేంద్రం వెల్లడించింది. (చదవండి: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!) -
విజయ్‌మాల్యా.. నీకిదే లాస్ట్ ఛాన్స్.. సుప్రీం వార్నింగ్
సుమారు 9 వేల కోట్లను బ్యాంకులకు ఎగొట్టి బ్రిటన్‌కు పారిపోయినా కింగ్‌ఫిషర్ అధినేత విజయ మాల్యాపై సుప్రీంకోర్డు మండిపడింది. ఇదే లాస్ట్ చాన్స్ అంటూ అపెక్స్ కోర్టు విజయ్ మాల్యాను హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కేసులో..! విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో హాజరు అయ్యేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. కాగా కోర్టు నిర్ణయాన్ని పట్టించుకొని విజయ్ మాల్యా ఇప్పటి వరకు కోర్టు ముందుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మాల్యాకు ఇదే చివరి అవకాశం అంటూ స్పష్టం చేసింది. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ కేసు విచారణను కూడా ఈనెల 24కు వాయిదా వేసింది. 24 లోగా వ్యక్తిగతంగా లేదా ఆయన తరపున న్యాయవాది కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది అపెక్స్ కోర్టు. హాజరుకాకపోతే ఈ కేసు ముగింపునకు సంబంధించి తామే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తూ..! కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. 2017లో కోర్టును ధిక్కరించారని కోర్టు గుర్తించింది. ధిక్కరణలో భాగంగా గత నాలుగు నెలల నుంచి శిక్ష ఖరారు మాత్రమే పెండింగ్‌లో ఉంది. యూకే నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే అంశం తుది అంకానికి చేరుకుందని కేంద్రం కోర్టుకు తెలపగా, విజయ మాల్యా ఇండియాకు వచ్చే విషయంపై ఇంకా స్పష్టత లేదు. చదవండి: విజయ మాల్యా కేసులో కీలక మలుపు..! -
రోడ్డున పడ్డ విజయ్‌మాల్యా.. ఉన్న ఇళ్లు కూడా పాయే!
London High Court Verdict Vijay Mallya: ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్‌గా వార్తల్లో నిలుస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో లండన్‌లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్లు ఖాళీ చేయండి స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్‌కు 20.4 మిలియన్ బ్రిటన్ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్ హై కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఈ కేసు వాయిదాలు పడుతూ వస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్‌లోని రిజెంట్ పార్క్‌లో ఉన్న కార్న్‌వాల్ టెర్రస్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్ హై కోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్‌మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది. అప్పీల్‌కి అవకాశం లేదు లండన్ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు. వేరే బెంచ్‌కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్‌ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు. చివరి ప్రయత్నం లండన్‌లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్మెంట్లో అతని కొడుకు సిద్ధార్థ్మాల్యా (34)తో పాటు విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పుడు 95 ఏళ్లు. ఈ వయస్సులో ఇప్పటికిప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని... కనీసం మానవతా దృక్పథంతో విజయ్‌మాల్యా తల్లి వయస్సుని పరిగణలోకి తీసుకునైనా తీర్పు ఇవ్వాలంటూ మాల్యా తరఫున న్యాయవాదులు కోరారు. కానీ విజయ్ మాల్యాకి ఊరట లభించలేదు. వాళ్లు ఊరుకోలేదు భారత్ బ్యాంకులను కోట్లాది రూపాయల మేర మోసం చేసి, బ్రిటన్‌కు విజయ్‌మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్బీఐ నేతృత్వంలో న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్‌హౌస్‌లు, లగ్జరీ యాచ్‌లే ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్‌మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది. చదవండి: అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ అక్కడే ఉంటారేమో విజయ్‌మాల్యా హవా నడిచినప్పుడు అందమైన మోడళ్లతో బీచ్‌లలో లగ్జరీ యాచ్‌లలో గడిపేవారు, వేలం పాటలో ఖరీదైన, యాంటిక్ వస్తువులను దక్కించుకున్నారు. ఫార్ములా వన్ టీమ్‌ని కొనుగోలు చేశారు. తన ఫార్ములా వన్ టీమ్ ఏస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కుటుంబానికి సంబంధించిన రెండు ఇళ్లను విజయ్‌మాల్యా ఆ రోజుల్లో కొనుగోలు చేశారు. అవి ఇంగ్లండ్‌లోని టెవిన్, హెర్డ్ఫోర్షైర్లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్‌మాల్యా తన మకాం ఇక్కడికే మార్చే అవకాశం ఉంది. చేతులెత్తిసినట్టేనా ? వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా గడిచిన ఐదేళ్లుగా అనేక కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. కేవలం లాయర్ల ఫీజులు చెల్లించేందుకు ఆయన ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీడియా కంట పడిన ఆయన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. కాగా లండన్ ఇంటిని కాపాడుకోలేకపోవడం విజయ్‌మాల్యాకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ముందు ముందు న్యాయస్థానాల్లో ఆయన పోరాటం ఎంత వరకు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు ! -
Fact Check : విమానం విడిచి రైలులో ప్రయాణించిన విజయ్‌మాల్యా?
కింగ్ ఆఫ్ గుడ్ టైంగా పేరొందిన లిక్కర్ విజయమాల్యా ప్రస్తుతం గడ్డు రోజులు ఎదుర్కొంటున్నాడు. కింగ్ ఫిషర్ క్యాలెండర్‌తో దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానిన ఆయన చివరకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం చేసిన అప్పులతో దివాలా తీశారు. చివరకు బ్యాంకులకు అప్పులు చెల్లించలేక లండన్‌లో తలదాచుకుంటున్నారు. అయితే మాల్యా ఎలా ఉన్నా ? ఎక్కడ ఉన్నా ఆయనకు సంబంధించిన విషయాలపై ఇండియన్లు మక్కువ చూపిస్తున్నారు. #LifeLessons #VijayMallya https://t.co/61ZTENBISI — RK (@mkheatsinks) December 27, 2021 క్రిస్మస్ పండగ హడావుడి ముగిసింది మొదలు ట్విట్టర్ ఇండియాలో విజయ్‌మాల్యా ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు అందమైన మోడల్స్‌తో కింగ్ ఫిషర్ విమానాల్లో, విలాసంతమైన యాచ్‌లలో గడిచిన మాల్యా ఓ సాధారణ ప్రయాణికుడిలా చిన్న బ్రీఫ్‌కేస్‌తో రైలుతో ప్రయాణిస్తున్న ఫోటో ట్విటర్లో వైరల్‌గా మారింది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఓనర్ టూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటూ రకరకాల కామెంట్లతో అనేక ట్వీట్లు వస్తున్నాయి ఈ ఫోటోతో. #VijayMallya from luxury private jets with super models serving premium whiskey to common man's no frills public transport.#Permanent doesn't exist in anybody's life. It is bound to change for good or bad.🤔@TheLeon48 @vijayshekhar @prettypadmaja#mondaythoughts pic.twitter.com/98x8tWdX25 — SunilKapoor 4free #Hospital,#Bed, #Appointment. (@sunilkapoor8) December 27, 2021 వాస్తవానికి ఈ ఫోటో 2017 లేదా అంతకంటే ముందు కాలానికి సంబంధించింది. లండన్ నుంచి మాంఛెస్టర్కి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టమైన రైలులో మాల్యా ప్రయాణం చేశారు. ఈ ఫోటో ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కాగా డిసెంబరు 18 విజయ్‌మాల్యా పుట్టినరోజు.. దీంతో ఆయనపై ఆసక్తి ఉన్న కొందరు మరోసారి లండన్ ట్రైన్ ఫోటోలను నెట్టింట్లో పోస్ట చేయడంతో అవి వైరల్‌గా మారాయి. Journey from Private Jet To Public Transport ..Nothing is permanent..Stay Grounded pic.twitter.com/28utEvZES0 — Harsha 🇮🇳 (@harshasherni) December 26, 2021 చదవండి: విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు -
ఎగవేతదారుల నుంచి రికవరీ చేసింది ఎంతంటే..
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకింగ్‌ను కోట్లాది రూపాయలు మోసం చేసి, దేశం నుంచి పారిపోయిన వాళ్ల నుంచి వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంతత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీసహా ఈ తరహా వ్యక్తుల ఆస్తుల అమ్మకం ద్వారా బ్యాంకులు రూ.13,100 కోట్ల రికవరీ చేసినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. జులై 2021 నాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అందించిన సమాచారం మేరకు ఈ వివరాల్ని వెల్లడించారు ఆర్థిక మంత్రి. కాగా, గడచిన ఏడు సంవత్సరాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యతల (సీఎస్ఆర్) కింద కంపెనీలు రూ.1.09 లక్షల కోట్లు వెచ్చించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బొగ్గు గణనీయమైన నిల్వలతో సరసమైన ఇంధన వనరుగా ఉన్నందున భవిష్యత్‌లో బొగ్గు ప్రధాన ఇంధన వనరుగా నిలవనుందని బొగ్గు వ్యవహారాల శాఖ ప్రహ్లాద్ జోషి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు
న్యూఢిల్లీ: బ్యాంకులను రూ.9,000 కోట్ల మేర మోసగించి, విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా భాగస్వామిగా ఉన్న కోర్టు ధిక్కరణ కేసులో వచ్చే ఏడాది జనవరి 18న తుది తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. మాల్యా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆయనను 2017లో దోషిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. చదవండి: (‘370’ రద్దు తర్వాత స్వస్థలాలకు 1,678 మంది కశ్మీరీలు) ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటికే తగినంత సమయం వేచి చూశామని, ఇంకా వేచి ఉండలేమని జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. యూకేలో ఉంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. చదవండి: (చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్) -
విజయ మాల్యా కేసులో కీలక మలుపు..!
సుమారు 9 వేల కోట్లను బ్యాంకులకు ఎగొట్టి బ్రిటన్‌కు పారిపోయినా కింగ్‌ఫిషర్ అధినేత విజయ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించేందుకు ఇక వేచి ఉండలేమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. మాల్యాకు విధించే శిక్షను వచ్చే ఏడాది జనవరి 18న ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. 2017లో కోర్టును ధిక్కరించారని కోర్టు గుర్తించింది. ధిక్కరణలో భాగంగా గత నాలుగు నెలల నుంచి శిక్ష ఖరారు మాత్రమే పెండింగ్‌లో ఉంది. యూకే నుంచి మాల్యాను భారత్‌కు రప్పించే అంశం తుది అంకానికి చేరుకుందని కేంద్రం కోర్టుకు తెలిపింది . కాగా విజయ మాల్యా ఇండియాకు వచ్చే విషయంపై స్పష్టత లేదు. దీంతో విజయ మాల్యా కోర్టు ధిక్కార కేసును జనవరి 18న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం మాల్యా వ్యక్తిగతంగా హాజరుకావాలని లేదా అతని న్యాయవాది ద్వారా వాదనలను వినిపించాలని కోరింది. ధిక్కార నేరంపై సమీక్ష..! కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు ధిక్కార నేరం కింద 2017 మేలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటషన్ వేశాడు. కాగా పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. అంతేకాకుండా కోర్టు ధిక్కారణ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. చదవండి: ఇది మరో ప్యాండెమిక్.. ఇండియన్ సీఈవో వైరస్.. వ్యాక్సిన్ కూడా లేదు -
ఆర్థిక నేరస్థులను భారత్‌కు తీసుకొస్తాం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు దౌత్యపరమైన, అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో భారత్‌కు తిరిగి రావడం మినహా వారికి మరో మార్గం అంటూ ఉండదన్నారు. రుణ వితరణ, ఆర్థిక వృద్ధిపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ‘ఆర్థిక నేరస్థులను తీసుకొచ్చే విషయంలో విధానాలు, చట్టపరంగా నడుచుకుంటున్నాం. మేమిచ్చే సందేశం సుస్పష్టం. మీ దేశానికి తిరిగి రండి. ఇందుకోసం మా చర్యలు కొనసాగుతూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రధాని ప్రస్తావించలేదు. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవలి కాలంలో చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు వినూత్నంగా పనిచేయాలి.. దేశంలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపడినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి తమ సర్కారు గడిచిన ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలను అమలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు గత ఐదేళ్లలోనే కనిష్ట స్థాయిలకు చేరినట్టు చెప్పారు. చురుకైన చర్యల ద్వారా రూ.5 లక్షల కోట్ల మొండి రుణాలను వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ‘‘సంపద సృష్టి కర్తలకు, ఉపాధి కల్పించే వారికి మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది. వారికి రుణ వితరణ అందేలా చూడాలి. నిజాయితీ నిర్ణయాల్లో మీకు రక్షణగా నేను ఉంటాను’ అంటూ బ్యాంకులకు మార్గదర్శనం చేశారు. 2022 ఆగస్ట్ 15 నాటికి ప్రతీ బ్యాంకు శాఖ.. పూర్తి డిజిటల్‌గా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కనీసం 100 క్లయింట్లను అయినా కలిగి ఉండాలన్న లక్ష్యాన్ని ప్రధాని నిర్ధేశించారు. సొంతంగా 5జీ, 6జీ సామర్థ్యాలు టెలికం రంగానికి సంబంధించి 5జీ, 6జీ టెక్నాలజీల్లో స్వీయ సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికితోడు సెమీ కండక్టర్ల తయారీపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. గురువారం ‘సిడ్నీ డైలాగ్’ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని వర్చువల్(ఆన్లైన్ మాధ్యమంలో)గా మాట్లాడారు. నూతన తరం టెలికం టెక్నాలజీల అభివృద్ధిలో జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలతో కలసి భారత్ పనిచేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి గొప్ప ఉత్పత్తి డేటాయేనన్నారు. డేటాను కాపాడడం, గోప్యత, భద్రతకు సంబంధించి పటిష్ట కార్యాచరణను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజా సార్వభౌమాధికారం కోసం డేటాను ఉపయోగించుకుంటామన్నారు. డిజిటల్ డొమైన్లో భారత్ సాధించిన ఘతనను ప్రస్తావించారు. ‘‘క్లౌడ్ ప్లాట్ఫామ్లో సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాం. డిజిటల్ సార్వభౌమాధికారానికి ఇది కీలకం. క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లకు సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు, సేవలను అందించడంలో భారత్ ఇప్పటికే ప్రముఖ కేంద్రంగా ఉంది. సైబర్ సెక్యూరిటీకి సైతం భారత్‌ను కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమతో కలసి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. సెమీ కండక్టర్ల తయారీకి ప్రోత్సాహకాల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రధాని వివరించారు. -
ఆకాశం హద్దులు దాటించిన వ్యక్తి.. ఇప్పుడెక్కడ?
Deccan Aviations GR Gopinath దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఆ మాటల స్ఫూర్తికి వాస్తవ రూపం ఇచ్చినవారిలో జీఆర్ గోపినాథ్ ఒకరు. విమాన ప్రయాణం చేసే హక్కు సంపన్నులకే కాదు. ఈ దేశంలో ఉన్న సామాన్యులకు కూడా ఉందని చాటి చెప్పారు. ఒక్క రూపాయికే ఆకాశయానం కలిగించిన గొప్ప ఎంట్రప్యూనర్ గోపినాథ్. ఆకాశం నీ హద్దురా డైనమిక్ ఎంట్రప్యూనర్, సోషల్ రీఫార్మర్, దేశభక్తుడైన గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పుడా గోపినాథ్ ఏం చేస్తున్నారు. తన దక్కన్ ఏవియేషన్ సంస్థ గురించి ఏం చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన కంటున్న కలలు ఏంటీ ? ఇటీవల మనీ కంట్రోల్ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం.. మిస్ అవుతున్నా దక్కన్ ఏవియేషన్స్ సీఈఓగా ఉన్నప్పుడు సామాన్యులను విమానంలోకి ఎక్కించడం, టైర్ టూ సిటీల మద్య ఎయిర్ కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టినప్పుడు ఒంట్లో కొత్త శక్తి ప్రవహించేది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడది మిస్ అవుతున్నాను. ఆ తప్పు చేయను పునర్జన్మలపై నాకు నమ్మకం లేదు, కానీ మళ్లీ జన్మంటూ ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెక్కన్ ఏవియేషన్‌ను విజయ్‌మాల్యాకు అమ్మను గాక అమ్మను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడం పొరపాటు. నేను నా మనసు మాట విని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా డెక్కన్ ఏవియేషన్‌లో పెట్టుబడిదారుల అభిప్రాయం వైపుకే మొగ్గు చూపాను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయడం వల్ల మాకు లాభాలు వచ్చాయనే మాట నిజమే. కానీ సామాన్యులకు విమానయానం దగ్గర చేయాలనే నా కల. కానీ అలా జరగలేదు. అయితే జరిగినదాని గురించి జరగబోయేదాని గురించి నాకు పెద్దగా బాధ అయితే లేదు. రాజకీయాల్లో... కింగ్‌ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యాకు ఎయిర్ దక్కన్ని అమ్మేసిన తర్వాత ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో బెంగళూరు సౌత్ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే నా ప్రయాణం అపకుండా అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను. ఆప్ పార్టీ పెట్టగానే దానిలో చేరాను. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత్రృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాను. కానీ పార్టీ పెట్టిన తీరు, ఎన్నికల్లో గెలిపించిన వైనం, పరిపాలన చేస్తున్న విధానాల పరంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇప్పటికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ప్రారంభించారనే నమ్ముతాను. అలాంటి నేతలు కావాలి బడా కార్పోరేట్ కంపెనీలు అన్ని కూడా పాలసీ తయారీలో కీలకంగా ఉండే వారితో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నాయి. కార్పోరేట్ శక్తులకు మంచి నాయకులు కాదు మనకు కావాల్సింది. సామాజికంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే సృజనాత్మక ఐడియాలు కలిగిన ఎంట్రప్యూనర్లు ప్రోత్సహించేవారు కావాలి. అప్పుడే మన సమాజం వేగంగా మార్పులు వస్తాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. వారిపైనే ఆశలు ఇప్పుడున్న ఎంట్రప్యూనర్లలో ఓలా భవీష్ అగర్వాల్, పేటీఎం విజయ్ శేఖర్ శర్మలు ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నారు. ఇలా వ్యక్తులు మనకు వేలమంది కావాలి. వారంత విభిన్న రంగాల్లోకి చొచ్చుకుపోవాలి. తమకున్న ఐడియాలను ఆచరణలోకి తెచ్చి దేశ గతిని మార్చేయాలి. నా దృష్టిలో ఈ రోజుల్లో ఫ్రీడం ఫైటర్లు అంటే ఎంట్రప్యూనర్లే. వారే ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు. అలా జరగడం లేదు నరేంద్రమోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెడ్టేపిజంలో మార్పులు వస్తాయని ఆశించాను. కానీ అలా ఏం జరగడం లేదు. రెట్రోట్యాక్స్ను రద్దు చేయడానికే ఏడేళ్లు సమయం తీసుకున్నారు. కొత్త ఎంట్రప్యూనర్లకు క్షేత్రస్థాయిలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగించాలి. ఐడియాలో సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి వచ్చే వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఉండాలి. అప్పుడే మనం చైనాను దాటి అభివృద్ధిలో ముందుకు పోగలం. రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు. దక్కన్ ఏవియేషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిజిగానే ఉంటున్నాను. కర్నాటకలోని మా సొంతూరిలో వ్యవసాయం క్షేత్రంలో ఎక్కువ సేపు గడుపుతుంటా. దీంతోపాటు డెక్కన్ ఛార్టర్స్ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాను. ఈ సంస్థ ఆధీనంలో యాభై వరకు హెలికాప్టర్లు, జెట్ విమానాలు ఉన్నాయి. వీటి నిర్వాహణకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అవినీతి తదితర అంశాలపై గంటల తరబడి జరిగే చర్చాగోష్టీల్లో భాగమవుతాను. వర్తమాన అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటాను. ఇప్పటికే సింపుల్ ఫ్లై, వన్ కనాట్ మిస్ ద ఫ్లైట్ అనే పుస్తకాలు అచ్చయ్యాయి. - సాక్షి , వెబ్‌డెస్క్ చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం -
అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ
Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్ ఆఫ్ గుడ్టైమ్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది. వేలానికి ఆస్తులు విజయ్‌మాల్యా... బిజినెస్ రంగానికి గ్లాబర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి. రూ. 52 కోట్లు ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 నుంచి ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. -
లండన్ కోర్టు సంచలన తీర్పు: మాల్యాకు భారీ షాక్!
లండన్: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. మాల్యా అప్పగింత కేసును సోమవారం విచారించిన లండన్ హైకోర్టు విజయ్ మాల్యా దివాలా తీసినట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వుతో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు లండన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశంలో మాల్యా ఆస్తులపై సెక్యూరిటీని వదులుకునేందుకు అనుకూలంగా వారి దివాలా పిటిషన్‌ను సవరించాలని ఎస్బిఐ నేతృత్వంలోని రుణదాత కన్సార్టియం ఇచ్చిన దరఖాస్తును యుకే కోర్టు సమర్థించింది. ఈ మేరకు లండన్ హైకోర్టు చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసిసి) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో గతకొన్నాళ్లుగా మ్యాలాపై సుదీర్ఘం పోరాటం చేస్తున్న భారత బ్యాంకులకు భారీ విజయం లభించినట్టైంది. అయితే దీనిపై మాల్యా అప్పీల్‌కు వెళ్లే అవకాశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. దివాలా ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి బ్రిగ్స్ నిరాకరించారు. ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా తీర్పునిచ్చిన లండన్ హైకోర్టు తాజాగా మాల్యా దివాలా తీసినట్టుగా ప్రకటించడం గమనార్హం. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మంజూరు చేసిన 9వేల కోట్ల రూపాయల రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు 13 భారతీయ బ్యాంకుల కన్సార్టియం ఆయనపై ఆరోపణలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు ఈడీ షాక్, రూ.792 కోట్ల ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి బ్యాంకులకు మరో రూ. 792 కోట్లు వసూలయ్యాయి. మనీ–ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకి చెందిన జప్తు చేసిన షేర్లలో కొన్నింటిని విక్రయించడంతో ఈ నిధులు వచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. దీనితో దేశీయంగా రెండు అతి పెద్ద బ్యాంకు రుణాల మోసాల కేసుల్లో సుమారు 58 శాతం మొత్తాన్ని బ్యాంకులు, ప్రభుత్వం రికవర్ చేసుకున్నట్లవుతుందని పేర్కొంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి రూ. 9,000 కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేశారన్న ఆరోపణలతో మాల్యాపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ. 13,500 కోట్ల మేర మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలు కూడా ప్రస్తుతం విదేశాల్లోనే ఉన్నారు. చదవండి: BGMI : పబ్జీ గేమింగ్ లవర్స్‌కు బంపర్ ఆఫర్ -
మాల్యాకు మరోషాక్, యూబీఎల్ నుంచి ఔట్?
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. యూబీఎల్(యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్) కంపెనీ నుంచి మాల్యాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. యూబీఎల్ కంపెనీలోఇటీవల తన వాటాను భారీగా పెంచుకున్న డచ్ బ్రూవర్ హైనెకెన్, యూబీఎల్ చైర్మన్‌గా మాల్యాను తొలగించేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు కంపెనీ నిబంధనలను మార్చడానికి కూడా ప్రయత్నిస్తోంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుండి యూబీఎల్‌లో మాల్యా షేర్లను హైనెకెన్ కొనుగోలు చేసింది. తద్వారా తన వాటాను 46.5 శాతం నుంచి 61.5 శాతానికి పెంచుకుంది. ఇపుడిక మాల్యాకు ఉద్వాసన పలికేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు రానున్న ఏజీఎంలో హైనెకెన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఒఏ) మార్చడానికి వాటాదారుల అనుమతి కోరుతోంది. జూలై 29 న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో హీనెకెన్ అనుమతి పొందవలసి ఉంది. ఎందుకంటే యూబీఎల్‌కు లైఫ్ టైం ఛైర్మన్‌గా ఉన్న మాల్యాకు మాత్రమే తదుపరి ఛైర్మన్‌ను నామినేట్ చేసే అధికారం ఉంది. అయితే ప్రతిపాదిక ఏజీఎం కంటే ముందే స్వచ్ఛందంగా తప్పుకునేందుకు మాల్యా అంగీకరిస్తే, ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవచ్చని దిఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. సంస్థలో హైనెకెన్ మెజారిటీ వాటాదారే అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఏఓఏ మార్పుకు 75 శాతం వాటా తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతో ఈ వ్యవహారంలో పలు ఆర్థికసంస్థలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. కాగా 2008లో హైనెకెన్ కొనుగోలుకు మాల్యా చేసుకున్న ఒప్పందం ఇంకా మార్చలేదు. అయితే లిస్టెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉండకూడదంటూ సెబీ అనర్హత వేటు వేయడంతో 2017లో యుబీఎల్ బోర్డు నుండి మాల్యా వైదొలగాల్సి వచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలకింద లండన్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్న మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
మాల్యా షేర్లతో స్టేట్ బ్యాంక్ కన్సార్టియంకు రూ. 5824 కోట్లు
ముంబై: లిక్కర్ కింగ్, రుణ ఎగవేత దారుడు విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రేవరీస్ షేర్లను ఎస్బీఐ నేతృత్వంలో గల బ్యాంకుల కన్సార్షియం జూన్ 23న విక్రయించింది. ఈ విక్రయం ద్వారా రూ. 5,824.5 కోట్లు వచ్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలియజేసింది. భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులకు మొత్తం రూ. 22,583.83 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ తెలిపింది. ఈడి ప్రకారం.. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు చేసిన మోసాలలో బ్యాంకులు నష్టపోయిన మొత్తంలో 40 శాతం (రూ.9,041.5 కోట్లు) ఇప్పటివరకు రికవరీ చేశారు. ముంబైలోని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీ కలిసి రూ.13,000 కోట్లు మోసం చేశారని, అలాగే విజయ్ మాల్య సుమారు రూ.9,000 కోట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో మోసం చేసినట్లు ఈడీ తెలిపింది. మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కేసులో ఇదే విధమైన వాటాల అమ్మకాల ద్వారా బ్యాంకులు ఇంతకు ముందు రూ.1,357 కోట్లు పొందినట్లు ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ కేసులో మరో రూ.1,060 కోట్ల విలువైన ఆస్తులు బ్యాంకులకు జప్తు చేసినట్లు పేర్కొంది. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
రూ. 9 వేల కోట్ల రికవరీ..ఇలా రాబట్టారు!
న్యూఢిల్లీ: రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి యునైటెడ్ బ్రూవరీస్ (యూబీఎల్)లో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని బ్యాంకుల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) బుధవారం విక్రయించింది. వీటి విలువ సుమారు రూ. 5,824 కోట్లు. దీనితో భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులు ఇప్పటిదాకా సుమారు రూ. 9,041 కోట్లు దాకా రికవర్ చేసుకున్నట్లయింది. వారు ముగ్గురూ ఎగవేసిన మొత్తంలో (దాదాపు రూ. 22,000 కోట్లు) ఇది సుమారు 40 శాతం. ఈ కేసుల్లో వారి ఆస్తులను జప్తు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 25న మాల్యా షేర్లు మరిన్ని.. ‘మాల్యా, చోక్సీ, మోదీల వల్ల బ్యాంకులకు సుమారు రూ. 22,585 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కేసులకు సంబంధించి అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో దాదాపు 80 శాతం (రూ. 18,170 కోట్లు) ఉంటుంది‘ అని ఈడీ పేర్కొంది. మాల్యా కేసుల విచారణ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు (పీఎంఎల్ఏ) ఆదేశాల మేరకు తాము జప్తు చేసిన సుమారు రూ. 6,624 కోట్ల విలువ చేసే యూబీఎల్ షేర్లను ఎస్బీఐ కన్సార్షియంకు ఈడీ బదలాయించింది. ఇందులో నుంచి రూ. 5,824 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకుల తరఫున బుధవారం డీఆర్టీ విక్రయించింది. జూన్ 25న మరో రూ. 800 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. ఇక పరారైనవారు, ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటనపై స్పందిస్తూ, ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు రావాల్సిన బాకీలకన్నా ఎక్కువే ఉంటుందని చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఇలా రాబట్టారు.. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 13,000 కోట్లు మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ, బ్యాంకుల కన్సార్షియంకు సుమారు రూ. 9,000 కోట్లు ఎగవేశారని మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. మాల్యాకి చెందిన షేర్లను గతంలో కూడా విక్రయించిన బ్యాంకులు సుమారు రూ. 1,357 కోట్లు రాబట్టుకోగలిగాయి. నీరవ్ మోదీ కేసులో రూ. 1,060 కోట్ల విలువ చేసే అసెట్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మాల్యాకు చెందిన మరిన్ని షేర్లను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రాబట్టుకోగలిగినట్లయింది. ఈ ముగ్గురు బోగస్ సంస్థలను ఉపయోగించి, బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మళ్లించారని తమ విచారణతో స్పష్టంగా రుజువు చేయగలిగినట్లు ఈడీ తెలిపింది. వీరిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. -
ఆర్థిక నేరగాళ్ల రూ. 18,170 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
పరారీలో ఉన్న ఆర్ధిక నెరగాళ్లు విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులలో 80 శాతం రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. కేవలం ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఈడీ తెలిపింది. విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ బ్యాంకులను మోసం చేసిన మొత్తం రూ.22,585.83 కోట్లు, వీటిలో రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటి వరకు రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు బదిలీ చేయగా, కోర్టు ఆదేశాల ప్రకారం జూన్ 25న మరో రూ.800 కోట్లు బదిలీ చేయాల్సి ఉంది. ముంబైలోని పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు ఈడీ తన వద్ద ఉన్న రూ.6,600 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది. వీటిలో రూ.5,824.50 కోట్లు విలువ చేసే షేర్లను కన్సార్టియం తరఫున ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)’ విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ముగ్గురు వ్యాపారవేత్తల దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలను పరిశీలించగా.. విదేశాల్లోనూ వీరు ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందని వెల్లడించింది. అలాగే డొల్ల కంపెనీల పేరిట బ్యాంకుల నుంచి నిధులను సమీకరించినట్లు పేర్కొంది. ఈ అంశాలపై మనీలాండరింగ్ చట్టం కింద విచారణ పూర్తయిన తర్వాత కేసులు నమోదు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ తెలిపింది. ఈడీ తన దర్యాప్తులో రూ.18,170.02 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో విదేశాలలో ఉన్న రూ.969 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. బ్యాంకులు నష్టపోయిన రూ.22,585.83 కోట్లలో దర్యాప్తు సంస్థ స్వాధీనంచేసుకున్న మొత్తం నష్టంలో 80.45%(రూ.18,170 కోట్లు). ఇదేగాక, ఈడీ సహాయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఇంతకు ముందు వాటాలను విక్రయించడం ద్వారా రూ.1,357 కోట్ల నష్టాలను తిరిగి పొందాయి. చదవండి: విమాన ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్ -
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తర్వులపై యుకె హోంశాఖ కార్యదర్శి ఈ రోజు సంతకం చేశారు. 50 ఏళ్ల నీరవ్ మోడీకి చివరగా యుకె హైకోర్టు ముందు 28 రోజుల్లోగా చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్ మాల్యా 2019 ఫిబ్రవరిలో బ్రిటన్ ప్రభుత్వం తన అప్పగించే ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత కోర్టుకు వెళ్లారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం, మనీలాండరింగ్ కోసం నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో కరోనా మహమ్మారితో నీరవ్ మోదీ మానసిక ఆరోగ్యం బాగాలేదని, భారత్ లో మానవ హక్కల ఉల్లంఘనను సాకుగా చూపిన ఆయన తరపు అడ్వకేట్ల వాదననూ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక నీరవ్ కు ఆర్ధర్ రోడ్డు జైలులో బ్యారక్ నెంబర్ 12లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని జడ్జ్ గూజీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదముద్ర వేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్‌కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్‌కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్‌లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్‌కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
మాల్యా, మోదీ, మెహుల్‌కు నిర్మలాజీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల బ్యాంకింగ్ కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనడానికి భారత్‌కు రప్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గురువారం స్పష్టం చేశారు. బీమా సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ఒక ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి బ్యాంకింగ్‌ను దాదాపు రూ.9000 కోట్ల మేర మోసం చేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌మాల్యాను ఆ దేశం నుంచి రప్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 2016 నుంచీ ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో దాదాపు రూ.14,500 కోట్లకుపైగా రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడైన 49 సంవత్సరాల నీరవ్ మోదీ లండన్ పారిపోయారు. అయితే ఈడీ, సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను 2019లో అక్కడి అధికారులు తమ అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ, నీరవ్ మోదీకి మేనమామ. చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వా అండ్ బార్బుడాలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే మోదీ, చోక్సీలకు చెందిన దాదాపు రూ.2,600 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి విదితమే. బీమాలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి: రాజ్యసభలో బిల్లు ఆమోదం కాగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పరిమితి 49 శాతంగా ఉంది. బీమా (సవరణ) బిల్లు, 2021పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి సమాధానం ఇస్తూ, దేశంలోకి బీమా రంగం సేవలు మారుమూలకు విస్తరించడానికి ఈ చొరవ దోహదపడుతుందని తెలిపారు. సంబంధిత వర్గాలతో బీమా రంగం రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సమగ్ర చర్చల అనంతరమే ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2015లో అప్పటికి 26 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడం జరిగింది. జీవిత బీమా సేవలు దేశంలో మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవిత బీమా ప్రీమియం ప్రస్తుతం 3.6 శాతంగా ఉంది. అంతర్జాతీయగా చూస్తే దీని సగటు 7.13 శాతం. ఇక జనరల్ ఇన్సూరెన్స్ చూస్తే, ప్రపంచ సగటు 2.88 శాతంకాగా, భారత్ జీడీపీలో కేవలం 0.94 శాతం. 2015లో 49 శాతానికి పరిమితులు పెంచిన తర్వాత దేశీయ బీమా రంగంలోకి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ.26,000 కోట్లని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీమా కంపెనీలు ద్రవ్యపరమైన (లిక్విడిటీ) ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి తాజా నిర్ణయం దోహదపడుతుందన్నారు. -
మాల్యాకు మరో షాక్
సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థికనేరగాడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్‌లో 1.6 మిలియన్ యూరోల (రూ.14.35 కోట్లు) ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడీ అభ్యర్థన మేరకు ఫ్రెంచ్ అథారిటీ వీటిని స్వాధీనం చేసుకుంది. 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న మాల్యా ఆస్తిని ఫ్రెంచ్ అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంఎల్ఏ ఆరోపణలపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంక్ ఖాతా నుండి పెద్ద మొత్తంలో నిధులను విదేశాలకు పంపినట్లు తేలిందని ఈడీ వెల్లడించింది. 2016 జనవరిలో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఎటాచ్ చేసిన మాల్యా మొత్తం ఆస్తుల విలువ రూ .11,231.70 కోట్లకు చేరిందని పేర్కొంది. (మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి?) కాగా వేల కోట్ల రూపాయల రుణాలను భారతీయ ప్రభుత్వ బ్యాంకులను ఎగవేసి లండన్‌లో చెక్కేసిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే లండన్ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, యుకె హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మధ్య గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా లిక్కర్ బారన్ అప్పగింత విషయాన్ని ప్రస్తావించింది. అలాగే 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ మధ్య ఈ విషయం ప్రముఖంగాప్రస్తావనకు రానుందని భావిస్తున్నారు. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం యుకెలో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని నవంబర్ 2 న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. -
మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి?
న్యూఢిల్లీ: బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించడంలో అడ్డంకులు ఏమిటని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. అలాగే ఇందుకు సంబంధించి కేంద్రం పేర్కొంటున్న ‘పెండింగు లో ఉన్న రహస్య న్యాయ ప్రక్రియ’ అంశాలను తెలియజేయాలనీ ఆదేశించింది. ఆయా అంశాల యథాతథ పరిస్థితిపై ఒక నివేదికను సమర్పి ంచాలని కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. ఇందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్‌భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్రానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. మాల్యా అప్పగింతకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళితే... ► విజయమాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు పారిపోయారు ► 2017లో ఏప్రిల్ 18న అప్పగింత వారెంట్‌పై ఆయనను అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ► 2018 డిసెంబర్లో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్ హైకోర్టు సమర్థించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకూ అనుమతి ఇవ్వలేదు. అప్పీల్‌కు అనుమతించాలన్న మాల్యా పిటిషన్‌ను మే 14వ తేదీన కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్లు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం తేదీన స్పష్టం చేసింది. యూకే ఎక్సŠట్రాడిషన్ యాక్ట్ 2003 చట్టంలోని సెక్షన్ 36, సెక్షన్ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్దేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ► అయితే ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. మరిన్ని వివరాలు వెల్లడించలేమనీ ప్రతినిధి చెప్పారు. ► మరోవైపు, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ, మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయించడం ధిక్కరణ కిందకే వస్తుందని 2017లో వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను ఆగస్టు 31న కొట్టివేసింది. -
రహస్యంగా మాల్యా అప్పగింత ప్రక్రియ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మాజీ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ అంశంలో తాజా పరిస్థితి గురించి తెలియదని.. ఇందులో తాము ఒక పక్షంగా లేమని స్పష్టం చేసింది. అప్పగించే విషయంలో రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియలు ఏంటనేవి తమకు తెలియజేయాలని మాల్యా తరఫు న్యాయవాది అంకుర్సైగల్ను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్‌భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. మాల్యా న్యాయవాది సైతం ఈప్రక్రియలపై తనకు అవగాహన లేదని చెప్పారు. అప్పగింతకు వ్యతిరేకంగా చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించిన విషయమే తనకు తెలుసన్నారు. దీంతో మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేయగా.. దీన్ని నేరంగా కోర్టు గతంలో ప్రకటించింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్ 5న తమ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న రూ.9,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి మాల్యా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో తలదాచుకున్నారు. -
మాల్యాకు భారీ షాక్ : అక్టోబర్ 5న కోర్టుకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేత దారుడు విజయ్ మాల్యాకు (64) భారీ షాక్ తగిలింది. అక్టోబర్ 5 న మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 31) ఆదేశించింది. ఆ రోజు కోర్టు గదిలో మాల్యా ఉనికిని నిర్ధారించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు కోర్టు ధిక్కారం కేసులో దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరిన మాల్యా పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను బదిలీ చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో, మే 9, 2017 ఆయనను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని మాల్యా కోరారు. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం మాల్యా పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు సమీక్ష చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 2020 అక్టోబర్ 5న మాల్యా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతేకాదు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మాల్యా హాజరుకు బాధ్యత వహించాలని తెలిపింది. కాగా 9,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడైన మాల్యా బెయిల్ మీద లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యాకు షాకిచ్చిన సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసి.. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడంటూ 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ యూయూ లలిత్, అశోక్ భుషణ్లతో కూడిన ధర్మాసనం మల్యాకు వ్యతిరేకంగా డబ్బు కొల్లగొట్టడం, ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడనే ఆరోపణలు ఉన్నట్లు అభిప్రాయపడింది. అంతేకాక మూడేళ్లుగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్‌ను సంబంధిత కోర్టులో ఎందుకు లిస్టు చేయలేదో వివరించాల్సిందిగా రిజిస్ట్రీని ధర్మాసనం ఈ ఏడాది జూన్‌లోనే ఆదేశించింది. అంతేకాక ఈ రివ్యూ పిటిషన్‌కు సంబంధించిన ఫైల్‌ను ఏ ఏ అధికారులు డీల్ చేశారో అందరి వివరాలను అందించాలని ధర్మాసనం ఆదేశించింది. (చదవండి: మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!) ప్రభుత్వ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగవేసి లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా తన పిల్లల పేరిట 40 మిలియన్ డాలర్లను బదలాయించారని, ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపు వ్యవహారంలో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. -
‘మాల్యా అప్పగింతకు నో టైమ్‌లైన్’
లండన్ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం నిర్దిష్ట గడువును నిర్ణయించడం సాధ్యం కాదని బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బార్టన్ గురువారం చెప్పారు. విజయ్ మాల్యాను భారత దేశానికి ఎప్పుడు అప్పగిస్తారు? అని అడిగిన ప్రశ్నపై బార్టన్ స్పందిస్తూ, ఇటువంటి అంశాలపై తమ ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేయబోదని చెప్పారు. అయితే బ్రిటన్ కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయన్నారు. నేరస్థులు వేరొక దేశానికి వెళ్ళడం ద్వారా చట్టం నుంచి తప్పించుకుపోవడాన్ని నిరోధించడంలో పోషించవలసిన పాత్ర గురించి బ్రిటన్ ప్రభుత్వం, న్యాయస్థానాలకు తెలుసునని చెప్పారు. ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఫిలిప్ బార్టన్.. నేరస్థులు సరిహద్దులు దాటి వెళ్లినంతమాత్రాన తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. అయితే మాల్యాను ఫిబ్రవరిలోనే భారత్‌కు అప్పగించాల్సి ఉండగా, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. దీంతో ఇటీవలె ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దానికి ఆమోదముద్ర వేయవద్దని భారత్ ఇటీవలె బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. తాజాగా శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ ) -
ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. అయితే మాల్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. బ్యాంకుల కన్సార్షియం మునుపటి ఆఫర్లను ఇప్పటికే తిరస్కరించింది. మరి తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో చూడాలి. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు మాల్యా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పరిష్కారం మొత్తం ఎంత ప్రతిపాదించారు అనేదానిపై స్పష్టత లేదు. అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన వడ్డీతో కలిపి 13,960 కోట్లు రూపాయలను చెల్లిస్తామంటూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (మాల్యా అప్పగింతపై సందేహాలు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. మరోవైపు శరణార్ధిగా దేశంలో ఉండేందుకు అంగీకరించాలంటూ బిట్రన్ ప్రభుత్వాన్ని మాల్యా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే!
లండన్: తమను కోట్లాది రూపాయలమేర మోసగించి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్‌మాల్యాను భారత్ బ్యాంకులు వదలడంలేదు. ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని మరోసారి ఇంగ్లాండ్‌లోని హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వం లోని 13 బ్యాంకుల కన్సార్షియం పటిష్టమైన వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్ చేసుకున్నారు. మాల్యాను దివాలాకోరుగా ప్రకటిస్తే... రుణాలు రాబట్టుకునే విషయంలో భారత్ బ్యాంకింగ్ తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది. కేసు వివరాలు క్లుప్తంగా... ► భారత్ నుంచి బ్రిటన్ పారిపోయిన మాల్యా నుంచి 114.5 కోట్ల పౌండ్ల (రూ.10 వేల కోట్లపైన) వసూలు చేసుకునే క్రమంలో బ్యాంకింగ్ కన్సార్షియం 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మాల్యా తన వాదనలు వినిపిస్తూ... భారత్‌లోని పలు కోర్టుల్లో తనపై కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆ కేసుల్లో తాను విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయన్నారు. పైగా తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాం కులకు పూర్తి గ్యారంటీ (సెక్యూర్డ్ క్రెడిటార్స్) ఉందన్నారు. రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడంలేదని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 10న కొట్టివేశారు. ► అయితే ఈ తీర్పుపై భారత్ బ్యాంకింగ్ కన్సార్షియం ఇటీవలే తాజాగా అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్లో వివరించింది. మాల్యా ప్రతిపాదించిన సెటిల్మెంట్ ఆఫర్ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్) ఆస్తులను బ్యాంకులు హైకోర్టులో ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ కింద ఉన్నాయి. మాల్యాకుగానీ లేదా ఒకప్పటి యూబీహెచ్ఎల్ యాజమాన్యానికి ఇవి అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సెటిల్మెంట్ ఆఫర్‌కు మాల్యా ఆయా ఆస్తులపై ఆధారపడజాలరు. ఆయన సెటిల్మెంట్ ఆఫర్ అమలుకు సాధ్యం కాదు. మాల్యా పేర్కొన్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ కాదు’’ అని మంగళవారంనాటి తన వాదనల్లో బ్యాంకింగ్ కన్సార్షియం తరఫు బారిష్టర్ షేక్‌డీమియన్ పేర్కొన్నారు. భారత్‌కు తనను అప్పగించరాదంటూ మాల్యా చేసిన వాదనలూ బ్రిటన్ న్యాయస్థానాల్లో వీగిపోయిన విషయాలను బ్యాంకింగ్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ► బారిష్టర్ ఫిలిప్ మార్షల్ నేతృత్వంలోని మాల్యా తరఫు లీగల్ టీమ్ మాత్రం బ్యాంకులు ‘సెక్యూర్ట్ క్రెడిటార్స్’ అనీ, బ్యాంకింగ్ తాజా పిటిషన్‌నూ కొట్టేయాలని తన వాదనల్లో వినిపించింది. -
మాల్యా పిటిషన్ మూడేళ్లుగా రాలేదెందుకు?
న్యూఢిల్లీ: తనపై ఉన్న ఓ కోర్టు ధిక్కారం కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యా పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను ఎందుకు గత మూడేళ్లుగా సంబంధిత కోర్టు బెంచ్ ముందుకు తీసుకురాలేదని సుప్రీంకోర్టు.. తన రిజిస్ట్రీని ప్రశ్నించింది. దీనితో సంబంధమున్న అధికారుల పేర్లను పేర్కొంటూ, ఆలస్యానికి కారణాలను రెండు వారాల్లోగా తెలపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2017లో విజయ్‌మాల్యా తన సంతానానికి 4కోట్ల డాలర్లను బదిలీచేయడాన్ని కోర్టు ధిక్కారంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు అదే ఏడాది తీర్పు చెప్పింది. -
మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్ మాల్యాను దేశానికి రప్పించే దిశలో కేంద్రం కీలక చర్య తీసుకుంది. ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా అభ్యర్థిస్తే, దానికి ఆమోదముద్ర వేయవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నిజానికి తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. అయితే ఆయనను తక్షణం భారత్‌కు పంపడం జరిగే పనికాదనీ, ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు వీడాల్సి ఉందని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు తాజా విజ్ఞప్తి చేసినట్లు గురువారంనాటి ఆన్లైన్ మీడియా బ్రీఫింగ్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. -
మాల్యా అప్పగింతలో మరింత జాప్యం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు బ్రిటన్ అప్పగించే ప్రక్రియకు మరింత సమయం పట్టేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. ‘అప్పగింతను వ్యతిరేకిస్తూ విజయ్ మాల్యా పెట్టుకున్న అప్పీళ్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ ఆయనను అప్పగించేందుకు ముందుగా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన అంశం ఒకటి ఉంది‘ అని వివరించారు. అది పూర్తయ్యే దాకా బ్రిటన్ చట్టం ప్రకారం అప్పగింత కుదరదని, ఇంతకు మించి వివరాలు వెల్లడించడానికి లేదని ప్రతినిధి చెప్పారు. దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ మాల్యా దేశీ బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లు ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి ఆయన బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. -
మాల్యా అప్పగింతపై సందేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న భారీ ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పట్లో జరిగే పనికాదని తాజా నివేదికల సారాంశం. చట్ట ప్రకారం మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడం సమీప కాలంలో కష్టమే అనే సందేహం వ్యక్తమవుతోంది. (త్వరలోనే భారత్‌కు విజయ్ మాల్యా..) చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది. చట్ట సమస్యలను పరిష్కరించిన తరవాత మాత్రమే మాల్యాను పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. ఇది చాలా గోప్యమైన వ్యవహారమంటూ ఇంతకుమించి వివరాలను అందించేందుకు నిరాకరించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయలేమనీ, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా చట్టపరమైన కారణాల వల్ల మాల్యాను అప్పగింత ఆదేశాలపై యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సంతకం చేయకపోవడమే ఆలస్యానికి కారణమనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మాల్యా న్యాయవాది ఆనంద్ దూబే కూడా మాల్యాను వెనక్కి రప్పించే వ్యవహారం తమ దృష్టిలో లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా పరారీలో ఉన్న మాల్యాను ముంబైకి తరలించనున్నారని, ఆయనతో పాటు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఉంటారంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యా కథ క్లైమాక్స్‌కు..
న్యూఢిల్లీ: లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా బ్రిటన్‌లో న్యాయపరమైన అన్ని అవకాశాలను కోల్పోయారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే మే 14న విజయ్ మాల్యా దాఖలు చేసిన అన్ని పిటిషన్లను యూకే సుప్రీం కోర్టు కొట్టేసిందని అధికారులు తెలిపారు. మాల్యా దేశంలోకి రావడానికి 28 రోజులు పట్టవచ్చని.. మొదటగా అతడిని కస్టడిలోకి తీసుకొని విచారిస్తామని సీబీఐకి చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మాల్యా భారత్‌లోకి ప్రవేశించగానే ఏ విధంగా విచారించాలో వ్యూహాలు రచిస్తున్నట్లు సీబీఐ, ఈడీ అధికారులు తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం, ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాల్యా భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి అన్ని అవకాశాలను కోల్పోయారని యూకే న్యాయ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: డబ్బులు తిరిగిస్తా.. తీసుకోండి! -
విజయ్ మాల్యా చివరి అస్త్రం ఇదే..
లండన్: బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాల ఎగవేత కేసులో లీగల్‌గా అన్ని దారులు మూసుకుపోవడంతో లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా చివరిసారిగా బ్రహ్మాస్త్రం వాడనున్నారు. భారత్‌లో 9వేల కోట్ల ఫ్రాడ్, మానీ లాండరింగ్‌కు పాల్పడి విదేశాలకు మాల్యా పారిపోయిన విషయం తెలిసిందే. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను ఇటీవలే యూకే హై కోర్టు వేసింది. న్యాయపరంగా అన్ని లోసుగులను వాడుకోవడంతో మాల్యా సరికొత్త అస్త్రాన్ని వాడనున్నారని యూకే న్యాయ వర్గాలు తెలిపాయి. తాజాగా మాల్యా పొలిటికల్ అసిలమ్(నిర్వాసితులు) అనే అస్త్రాన్ని వాడనున్నారు. ఏదయినా వ్యక్తి యూకేలో నిర్వాసితులుగా అర్హత పొందాలంటే వ్యక్తి సొంత దేశంలో కేసులతో గానీ, రాజకీయంగా, సామాజికంగా వేధించే అవకాశాల ఉన్న స్థితిలో నిర్వాసితులుగా తమ దేశంలో భద్రత కల్పిస్తారు. అయితే, వ్య్తక్తులు నిర్వాసితులుగా అర్హత పొందడానికి కోర్టు సుదీర్ఘంగా విచారిస్తుందని.. దాదాపు రెండు సంవత్సరాలు సమయం పట్టవచ్చని యూకేకు చెందిన సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిర్వాసితునిగా కూడా అర్హత సాధించకుంటే ట్రిబ్యూనల్‌లో కూడా అప్పీలు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి మాల్యా సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు న్యాయ నిపుణలు విశ్లేషిస్తున్నారు. చదవండి: భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో -
విజయ్ మాల్యా (లండన్) రాయని డైరీ
నాలుగేళ్లు అయింది నేను లండన్ వచ్చి. వచ్చిన రోజు నుంచి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నా మీద బెంగ పెట్టేసుకున్నాయి. ఇండియా రమ్మంటాయి! ‘నాతో ఏం పని.. డబ్బులు తీసుకెళ్లండి’ అంటాను. ‘డబ్బుల్తో ఏం పని.. నువ్వొస్తే బాగుంటుంది’ అంటాయి! ‘అసలు నువ్వెందుకొచ్చావ్ చెప్పూ..’ అన్నాను.. మూడేళ్ల క్రితం లండన్ కోర్టు బయట సుమన్ కుమార్ కనిపిస్తే ! ‘ఎక్కడికి రావడం? లండన్‌కా, లండన్ కోర్టుకా?’’ అన్నాడు! సీబీఐ ఆఫీసర్ అతను. ఇండియాలో వేరే ఫ్రాడ్లు ఏమీ లేనట్లు నన్ను వెతుక్కుంటూ బ్రిటన్ అంతా ఏడాది పాటు తిరిగి, చివరికి కోర్టు బయట నన్ను పట్టుకున్నాడు. ‘టీ తాగుతూ మాట్లాడుకుందాం వస్తావా విజయ్’ అన్నాడు. ‘మాల్యా అను. విజయ్ అంటే నేను నేను కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాను. ‘విజయ్ అని అనకుంటే నేను సుమన్ కానట్లుగా ఉంటుంది నాకు’ అన్నాడు! ‘సరే చెప్పు, టీ తాగడం కోసం మాట్లాడ్డమా, మాట్లాడ్డం కోసం టీ తాగడమా? ఏదైనా మాట్లాడ్డమంత ఈజీ కాదు నాకు టీ తాగడం’ అన్నాను. ‘టీ తప్ప నాకు ఇంకేదీ తాగడం రాదు’ అన్నాడు. ‘అయితే ఇక్కడ మాట్లాడేందుకేం లేదు. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో.. నేను వెళ్తున్నా’ అన్నాను. ఆగమన్నాడు. ఆగాను. ‘ఐడీబీఐకి నువ్వు తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి. ఎస్బీఐకి తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి. నేను డబ్బు మనిషిని కాదు. వాటిని అడగడానికి రాలేదు. నిన్ను తీసుకెళదామని వచ్చాను’ అన్నాడు. ‘డబ్బులు కావాలంటే బ్యాగులో పెట్టిస్తా తీసుకెళ్లు. భుజానికి బ్యాగేసుకుని ఇండియా వచ్చేయమంటే నీ వెనకే వచ్చేవాళ్లు ఎవరూ లేరిక్కడ’ అని చెప్పాను. ‘నా వయసు యాభై రెండేళ్లు. ఇరవై మూడేళ్ల వయసులో ఫీల్డులోకి వచ్చాను. తెల్ల కాలర్ల మీద నల్ల మరకల్ని వెతికే డ్యూటీ నాది. బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా మన్మోహన్సింగ్ నాకు మెడల్ ఇచ్చారు. పోలీస్ మెడల్ వచ్చింది. రాష్ట్రపతి పోలీసు మెడల్ వచ్చింది. ఇన్ని వచ్చిన నాకు నీ కేసు అప్పగించారంటే నాకు కాదు గొప్ప. నీకు. వచ్చేయ్.. వెళ్లిపోదాం’ అన్నాడు! ‘డబ్బొక్కటే నా చేతుల్లో ఉంది. నేను నా చేతుల్లో లేను. డబ్బు కావాలంటే తీసుకెళ్లు. నేను కావాలంటే కోర్టు లోపల వాదించుకుని వెళ్లు..’ అని చెప్పాను. అప్పుడు వెళ్లినవాడు మళ్లీ కనిపించలేదు. సుమన్–2 ఎవరో కోర్టుకు వచ్చేవాడు ఫైళ్లు పట్టుకుని. ఫైల్ చూసుకుంటూ ఉండేవాడే కానీ పాపం నన్ను చూసేవాడు కాదు. మాల్యాను ఇరవై ఎనిమిది రోజుల్లో ఇండియా పంపిస్తాం అని కోర్టు చెప్పినప్పుడు కూడా తలెత్తి చూడలేదు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే బయటికి వస్తుంటే సుమన్ ఫోన్ చేశాడు. ‘‘ఎక్కడా?’’ అన్నాను. ‘‘ఇండియాలో’’ అన్నాడు. ‘‘ఏంటి చెప్పు’’ అన్నాను. ‘‘సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడానికి లేదని కోర్టు తీర్పు చెప్పిందటగా. ముందే నాతో ఇండియా వచ్చి వుంటే.. ఇప్పుడిలా తీర్పు వచ్చేదే కాదు’’ అన్నాడు! ‘‘క్యాష్ ఇస్తా. డౌన్ పేమెంట్. మోయగలిగితే వచ్చి తీసుకెళ్లు. కొత్త నోట్లు. వాసన చూసి తీసుకో. మోదీజీలా ఇరవై లక్షల కోట్లు ఇస్తున్నానని చెప్పి పప్పులు ఉప్పులు ప్యాక్ చేసి ఇవ్వడం కాదు. ఫెళపెళలాడే కరెన్సీ’’ అన్నాను. ‘‘కరెన్సీ వద్దు. విజయ్ కావాలి నాకు’’ అన్నాడు! ‘‘విజయ్ కూడా కాదు, మెడల్స్ కావాలి నీకు. íపీఎం మెడలు, ప్రెసిడెంట్ మెడలు.. ఇస్తే ఐడీబీఐ మెడలు, ఎస్బీఐ మెడలు కూడా వేసుకుంటావ్ నువ్వు’’ అని ఫోన్ పెట్టేశాను. సుప్రీంకోర్టు కాకపోతే, మానవ హక్కుల కోర్టు. ఫ్రాన్స్‌కు వెళ్లకుండా ఇండియా వస్తానని ఆశిస్తున్నందుకు కూడా సుమన్‌కి ఒక మెడల్ ఏదైనా చేయించి ఇవ్వాలి. -
భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో
లండన్: వ్యాపార వేత్త, బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగించడం దాదాపుగా ఖరారైపోయినట్టే. ఈ ప్రక్రియ గరిష్టంగా 28–30 రోజుల్లోపు పూర్తికానుంది. బ్రిటన్ హోంమంత్రి ఆమోదం తర్వాత మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం, ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) బ్రిటన్‌లో న్యాయపరమైన చర్యలను చేపట్టాయి. ‘బ్రిటన్–భారత్ మధ్య అప్పగింత ఒప్పందం’ కింద మాల్యాను తమకు అప్పగించాలని కోరాయి. ఇందుకు అనుకూలంగా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2018 డిసెంబర్లోనే ఆదేశాలు వెలువరించింది. ఈ ఆదేశాలను బ్రిటన్ హైకోర్టు సమర్థించగా.. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల గడువు ఉంది. అయితే, సుప్రీంకోర్టులో అప్పీల్ కోసం అనుమతించాలన్న ఆయన దరఖాస్తును తాజాగా లండన్ హైకోర్టు కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్టు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. యూకే ఎక్స్ట్రాడిషన్ యాక్ట్ 2003 చట్టంలోని సెక్షన్ 36, సెక్షన్ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్ధేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసిన వ్యాపారవేత్తలను విదేశాలకు పారిపోనిచ్చారంటూ మోదీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక్క చాన్స్! అయితే, ఒక్క అవకాశం మాత్రం మాల్యాకు మిగిలి ఉంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ çహ్యూమన్‌రైట్స్ (ఈసీహెచ్ఆర్)ను ఆశ్రయించొచ్చు. పారదర్శక విచారణ లభించలేదంటూ యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లోని ఆర్టికల్ 3 కింద అప్పగింతను నిరోధించాలంటూ కోరొచ్చు. అయితే, ఈసీహెచ్ఆర్లో అప్పీల్ కు అవకాశాలు చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఇవే అంశాల ఆధారంగా ఇప్పటికే కోర్టుల్లో వాదనలు వీగిపోవడాన్ని పేర్కొంటున్నారు. రుణాలు చెల్లించేస్తా.. వదిలిపెట్టండి ఓటమిని గుర్తించిన మాల్యా మరోసారి రుణాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని, వాటిని తీసుకుని తనపై ఉన్న కేసును మూసేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా ప్యాకేజీ కోసం భారత ప్రభుత్వం నచ్చినంత నగదును ముద్రించుకోగలరు. కానీ, ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించాల్సిన నూరు శాతాన్ని తిరిగి చెల్లించేస్తానంటున్న నా విన్నపాన్ని అదే పనిగా విస్మరిస్తున్నారు. ఎటువంటి షరతుల్లేకుండా నా నుంచి డబ్బులు తీసుకోండి. కేసును క్లోజ్ చేయండి’’ అంటూ విజయ్‌మాల్యా ట్వీట్ చేశారు. తదుపరి ఏమిటి..? ► విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఆయన్ను ఇక్కడి కోర్టుల్లో ప్రవేశపెట్టి విచారణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ► ముంబైలోని ఆర్ధర్‌రోడ్డు జైలులో బరాక్ 12లో ఆయన్ను పూర్తి స్థాయి వైద్య సదుపాయాలతో ఉంచుతామని దర్యాప్తు సంస్థలు లోగడే బ్రిటన్ కోర్టులకు తెలియజేశాయి. ► విజయ్‌మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను పారిపోయినట్టు భారత్ ప్రకటించింది. ► 2017లో ఏప్రిల్ 18న అప్పగింత వారెంట్‌పై ఆయన్ను అరెస్ట్ చేయగా, బెయిల్‌పై బయట ఉన్నారు. ► 2018 డిసెంబర్లో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. ► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్ హైకోర్టు సమర్థించింది. దీనిపై అప్పీల్ చేసుకునేందుకు తాజాగా అనుమతించలేదు. -
విజయ్ మాల్యాకు భారీ షాక్..
లండన్\న్యూఢిల్లీ : బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించాలని 2018లో దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించడాన్ని సవాల్ చేస్తూ యూకే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు. ఈ నిర్ణయంతో తన అప్పగింతను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేసేందుకు మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో భారత్-బ్రిటన్ ఒప్పందం ప్రకారం 28 రోజుల్లో మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కోర్టు ఉత్తర్వులను బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ధ్రువీకరిస్తారని భావిస్తున్నారు. బ్రిటిష్ చట్టాల ప్రకారం 28 రోజుల వ్యవధి తక్షణమే కౌంట్‌డౌన్ ప్రారంభవుతుందని, నెలరోజుల లోపే మాల్యా భారత్‌లో ఉంటారని భారత దర్యాప్తు సంస్ధల వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరపున రూ 9000 కోట్లు రుణాలు పొందిన విజయ్ మాల్యాకు వాటిని తిరిగి చెల్లించే ఉద్దేశం లేదని బ్యాంకులు ఆరోపిస్తుండగా, రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెబుతున్నారు. రుణ ఎగవేత కేసులో అరెస్టయిన మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై బ్రిటన్ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. మాల్యాపై అభియోగాలకు ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా రుణ ఎగవేత కేసుల్లో నిందితులు విచారణను తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో మాల్యా అప్పగింత మోదీ ప్రభుత్వానికి సానుకూల పరిణామంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి : కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన -
కరోనా ప్యాకేజీ : మాల్యా స్పందన
సాక్షి, ముంబై : వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా, లాక్డౌన్ కరోనావైరస్ సంక్షోభంలో కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థికప్యాకేజీ పై స్పందించారు. తన రుణాలను 100 శాతం చెల్లిస్తాను అని చెప్పేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునే మాల్యా ఈసారీ అదే చేశారు. కోవిడ్-19 ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన మాల్యా తన దైన శైలిలో ట్వీట్ చేశారు. ఇక ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చు. కానీ తనలాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడం న్యాయమా అని వాపోయారు. వరుసగా తన అభ్యర్థనను తోసిపుచ్చుతున్నారని విమర్శించారు. దయచేసి ఆ నగదును తీసుకొని తన కేసును క్లోజ్ చేయాలని మాల్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (వలస కార్మికుల కేటాయింపులపై చిదబరం వ్యాఖ్యలు) కాగా ఎస్బీఐ నేతృతంలోని బ్యాంకుల సముదాయానికి వేలకోట్ల రుణాలు ఎగవేసిన విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మనీలాండరింగ్ ఆరోపణల కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మాల్యాపై కేసులు నమోదు , ఆస్తుల స్వాధీనం లాంటి చర్యల్ని చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఈడీ చార్జిషీట్లను దాఖలు చేశాయి. అలాగే మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించిన కేంద్రం అతడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో లండన్ కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న మాల్యా తన రుణాలను మొత్తం చెల్లిస్తానని, తన అభ్యర్థనను మన్నించాలని పలుసార్లు వేడుకుంటున్న సంగతి తెలిసిందే. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక) Congratulations to the Government for a Covid 19 relief package. They can print as much currency as they want BUT should a small contributor like me who offers 100% payback of State owned Bank loans be constantly ignored ? Please take my money unconditionally and close. — Vijay Mallya (@TheVijayMallya) May 14, 2020 -
లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా (64) కు భారీ షాక్ తగిలింది. మాల్యాను భారత్ కు అప్పగించేందుకు 2018 లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసుకున్న పిటిషన్ ను లండన్ కోర్టు సోమవారం కొట్టివేసింది. లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఇద్దరు సభ్యుల ధర్మాసనం లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లాంగ్ మాల్యా అభ్యర్థనను తిరస్కరించింది. భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఎగవేసిన, మాల్యా 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే ఎటాచ్ చేశాయి. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం. విచారణనిమిత్తం అతణ్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌లో మాల్యాను లండన్‌లో భారత అధికారులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే 2018 డిసెంబర్లోనే విజయ్ మాల్యాను అప్పగించాలని యుకె కోర్టు ఆదేశించింది. (విజయ్ మాల్యాకు భారీ ఊరట) కాగా తాను రుణాలను ఎగవేయలేదని పదే పదే వాదించే మాల్యా వంద శాతం అప్పులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. తాజాగా (మార్చి, 31) కరోనా సంక్షోభంలో నైనా తన కోరిక మన్నించాలని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
డబ్బులు తిరిగిస్తా.. తీసుకోండి!
లండన్: నాలుగేళ్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తనతో అసంబద్ధంగా వ్యవహరిస్తున్నాయని పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఆరోపించారు. భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టారన్న ఆరోపణలకు సంబంధించి మాల్యాను భారత్‌కు అప్పగించడంపై గురువారం లండన్‌లోని హైకోర్టులో వాదనలు జరిగాయి. విమానయాన రంగం లో చోటు చేసుకున్న ప్రతికూల పరిణామాలకు తాను బలయ్యానని, అంతేతప్ప బ్యాంకు రుణాలు తీసుకోవడంలో దురుద్దేశాలేవీ లేవని మాల్యా కోర్టుకు తెలిపారు. మాల్యాను విచారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలున్నాయని భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదించింది. అనంతరం కోర్టు వెలుపల మాల్యా మీడియాతో మాట్లాడారు. ‘మీ డబ్బులు మీరు తీసుకోండి అని ఒకవైపు బ్యాంకులను కోరుతున్నా. అలా కుదరదు.. మాల్యా ఆస్తులపై మాకు అధికారం ఉంది అని ఈడీ చెప్తోంది. అంటే, ఒకే ఆస్తులకు సంబంధించి ఒకవైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే తీరు’ అని మండిపడ్డారు. ‘చేతులు జోడించి బ్యాంకులను వేడుకుంటున్నా. మీరు ఇచ్చిన రుణం మొత్తం మీరు తీసుకోండి. నిజానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరఫున తీసుకున్న రుణం అది. అయినా కూడా బాధ్యతగా భావించి చెల్లిస్తానంటున్నా’ అని అన్నారు. -
విజయ్ మాల్యాకు మరో షాక్
సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా(63)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు పీఎంఎల్ఏ ముంబై కోర్టు అనుమతినిచ్చింది. రూ.13వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయనుంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ ఆస్తులను వేలం వేయనుంది. అయితే జనవరి 18 తరువాత మాత్రమే ఈ ఆదేశాలను పాటించాలని కూడా కోర్టు వెల్లడించింది. దీనిపై సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై బొంబాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది. సీజ్ చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా 2016 మార్చిలో లండన్‌కు పారిపోయాడు. 2017లో అరెస్ట్ అయిన ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్నాడు. మాల్యాను భారత్‌కు రప్పించేదుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్ట ప్రకారం మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్ఏ కోర్టు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నీరవ్ మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా నీరవ్‌ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో అరెస్టైన నీరవ్.. బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్ కోర్టులో సవాల్ చేశారు. ఇక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్ నిలిచాడు. -
‘మాల్యా, నీరవ్ బాటలో చిదంబరం’
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం గాంధీ కుటుంబానికి సహకరించారని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు.దర్యాప్తు సంస్థలకు సహకరించని చిదంబరం దేశం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీల తరహాలో వ్యవహరిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ మోదీ ప్రభుత్వం విడిచిపెట్టదని హెచ్చరించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన నేపథ్యంలో జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాన న్యాయమూర్తి ఎదుట పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు చిదంబరం న్యాయవాదులకు సూచించింది. -
సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..
న్యూఢిల్లీ : ఆర్ధిక సమస్యలతో కేఫ్ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్ కింగ్, రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్ ఎంట్రపెన్యూర్ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానని మాల్యా పోల్చుకున్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేనని వ్యాఖ్యానించారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలను పూర్తిగా చెల్లిస్తానని తాను ముందుకొచ్చినా వేధిస్తున్నారని మాల్యా ట్వీట్ చేశారు. కాగా ఆర్థిక సమస్యలతో అదృశ్యమైన పారిశ్రామికవేత్త వీజీ సిద్ధార్ధ మృతదేహం మంగుళూర్ సమీపంలోని నేత్రావతి నది వద్ద బయటపడిన సంగతి తెలిసిందే. -
వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్ కంపెనీలను(యునైటెడ్ బ్రాండింగ్ వరల్డ్‌వైడ్ ఇతరత్రా) గుర్తించింది. దీని ఆధారంగా బెంగళూరుకు చెందిన వి.శశికాంత్, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ గతవారం సోదాలు నిర్వహించింది. శశికాంత్ అనే వ్యక్తి మాల్యాకు అత్యంత ఆప్తుడని ఈడీ వర్గాలు తెలిపాయి. తాజాగా అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్(ఎఫ్ఈఓ) చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో దాదాపు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన మల్యాపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటన్ పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
మీ బ్యాంకులను అడగండయ్యా..!
బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత నెటిజన్లపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ క్రికెటర్, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్.. విజయ్‌మాల్యాతో కలిసిన ఓ ఫొటోను ట్విటర్లో పంచుకోగా నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ‘బిగ్‌బాస్‌ను కలుసుకోవడం బాగుంది’అని గేల్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అయితే భారతీయ బ్యాంకులకు మాల్యా ఎగొట్టిన రూ.9వేల కోట్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ ఫొటోపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మాల్యా గొప్ప దేశభక్తుడు.. అతను కేవలం భారతీయులనే దోచుకుంటాడు.’ అని ఒకరు.. ‘ తనకు ఇష్టమైన బీటీడబ్ల్యూ లాకెట్ కోసం.. ఆఖరికి క్రిస్‌గేల్ కూడా మాల్యా కోసం ఎదురుచూస్తున్నాడు.’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌పై స్పందించిన మాల్యా ట్విటర్ వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ప్రియమిత్రుడైన యూనివర్సల్ బాస్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ‘చోర్’ అని పిలుస్తున్నందరూ.. గతేడాది నుంచి డబ్బులు మొత్తం చెల్లిస్తానని చెబుతున్నా.. తీసుకోని మీ బ్యాంకులను అడగండి. అప్పుడు దొంగెవడో తేల్చండి.’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. ‘యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్‌తో ఉన్న నా ఫొటోను చూసి కామెంట్ చేశారో.. వారు దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. మాల్యా ఇస్తానన్న 100శాతం డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదో మీ బ్యాంకులను ప్రశ్నించండి’ అని మరో ట్వీట్లో మండిపడ్డాడు. ఇక ప్రపంచకప్ సందర్భంగా భారత మ్యాచ్‌కు హాజరైన మాల్యాను చూసి భారత అభిమానులు చోర్‌చోర్ అని పెద్ద ఎత్తున్న అరిచిన విషయం తెలిసిందే. బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్-2019 సందర్భంగా గేల్, విజయ్‌మాల్యాలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా తీయించుకున్న ఫొటోనే గేల్ ట్వీట్ చేశాడు. ఇక ఐపీఎల్ జట్టైన రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మాల్యా మాజీ యజమాననే సంగతి తెలిసిందే. చదవండి: మాల్యాకు ఊహించని పరిణామం Great to catch up with the Universe Boss and my dear friend. For all those of you losers who call me CHOR, ask your own Banks to take their full money that I am offering for the past one year. Then decide on who is CHOR. — Vijay Mallya (@TheVijayMallya) July 13, 2019 For all those who saw my photo with the universe boss and my dear friend @henrygayle and commented, please pause and get your facts right about my being your CHOR. Ask your Banks why they are not taking 100 percent of the money I have been offering. — Vijay Mallya (@TheVijayMallya) July 13, 2019 -
దయచేసి డబ్బు తీస్కోండి.. నన్నొదిలిపెట్టండి!
లండన్ : వేలకోట్లకు ఎగనామం పెట్టి.. బ్యాంకులను మోసం చేసిన ప్రముఖ లిక్కర్ వ్యాపారీ విజయ్ మాల్యా మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై విరుచుకుపడ్డాడు. సీబీఐ తనకు వ్యతిరేకంగా క్షుద్రవేట సాగిస్తోందని మండిపడ్డాడు. భారత్‌కు అప్పగింత విషయమై అప్పీల్ చేసుకునేందుకు బ్రిటన్ హైకోర్టు విజయ్ మాల్యాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాల్యా ట్విటర్లో వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు గొప్పవాడు. న్యాయం ఇంకా మిగిలి ఉందిఒ. సీబీఐ నాపై మోపిన ప్రాథమిక అభియోగాలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఇంగ్లిష్ హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్‌కు అవకాశమిచ్చింది. సీబీఐ అభియోగాలు తప్పు అని నేను చెప్తూ వస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా తిరిగి చెల్లిస్తానని, దయచేసి డబ్బు తీసుకొని.. తనను వదిలిపెట్టాలంటూ మరోసారి విజయ్ మాల్యా వేడుకున్నాడు. ‘కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినప్పటికీ.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా చెల్లిస్తానని మరోసారి ఆఫర్ ఇస్తున్నాను. దయచేసి డబ్బు తీసుకోండి. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు కూడా డబ్బు చెల్లించి.. జీవితంలో ముందుకు సాగుతాను’ అని మాల్యా పేర్కొన్నాడు. సీబీఐ తనపై మోపిన ప్రాథమిక అభియోగాలను సవాల్ చేసేందుకు బ్రిటన్ హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని, తనను హేళన చేస్తున్న వాళ్లంతా ఈ విషయాన్ని అందరూ గమనించాలని మాల్యా కోరాడు. -
మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు లండన్ హైకోర్టులో విచారణ
-
మాల్యాకు ఊహించని పరిణామం..ఎవరితో వచ్చాడు?
లండన్ : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఫ్యుజిటివ్ నేరగాడు విజయ్ మాల్యాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఆదివారం ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్‌ను చూడ్డానికి వచ్చిన మాల్యాకు ఒక్కసారిగా షాక్తగిలింది. అక్కడున్నజనం చోర్..చోర్ (దొంగ..దొంగ) అని అరవడం మొదలుపెట్టారు. దేశానికి క్షమాపణ చెప్పు అంటూ నినాదాలు కూడా వినిపించాయి. వారికి ఏదో సమాధానం ఇచ్చినప్పటి కంగుతినడం మాత్రం మాల్యా వంతైంది. క్రికెట్ మ్యాచ్‌లను తరచుగా వీక్షించే మాల్యాకు అంతకుముందెప్పుడూ ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు. ఈ పరిణామంపై విలేకరులు ప్రశ్నించినపుడు తాను మ్యాచ్ చూడ్డానికి వచ్చానని, జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు. అలాగే తన తల్లి (దేశం) బాధపడకుండా చూడాలనేది తన ప్రయత్నం అని చెప్పి వెళ్లిపోయాడు. మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మాల్యా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి వచ్చాడు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించిన మ్యాచ్‌ను తన కొడుకుతో కలిసి చూడటం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టీమ్‌కు అభినందనలు తెలిపాడు. Great to watch cricket with my son and even sweeter to see India’s emphatic victory over Australia. Congratulations to @imVkohli and his team pic.twitter.com/R01aB1WbSA — Vijay Mallya (@TheVijayMallya) June 9, 2019 కాగా రూ. 9వేల కోట్లకు పైగా బకాయిపడి లండన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాని తిరిగి భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అటు మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. #WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i — ANI (@ANI) June 9, 2019 -
విజయ్ మాల్యా మస్త్ మస్త్‌గా..
లండన్: వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఇంగ్లండ్‌లో జరగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగుతున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చి మీడియా కంటికి చిక్కాడు. దీంతో మాల్యాను ఎగవేత, అప్పగింతపై మీడియా ప్రశ్నించగా తాను మ్యాచ్ చూసేందుకు వచ్చానని చెప్పి స్టేడియం లోపలకు వెళ్లిపోయాడు. ఇక విజయ్ మాల్యా అప్పగింత వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. విజయ్ మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. లండన్ హై కోర్టులో జూలై 2న విచారణ ఉంది. భారతీయ జైళ్లు సురక్షితం కావన్న వాదనతో కోర్టులో పోరాడుతున్నాడు. విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలుకు పారిపోయిన విషయం తెలిసిందే. చదవండి: నాకే ఎందుకిలా..? మాల్యా నా ఆస్తుల జప్తు అమానుషం: మాల్యా -
ఏడాదిలో రూ.71వేల కోట్ల మాయం!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 6,801 కేసులు నమోదు కాగా.. విలువపరంగా ఇవి రూ. 71,500 కోట్లు ఉండొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. 2017–18లో రూ. 41,167 కోట్లకు సంబంధించి 5,916 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలిస్తే 2018–19లో పరిమాణం ఏకంగా 73 శాతం పెరిగిందని సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఆర్బీఐ వివరణ ఇచ్చింది. గడిచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో 53,334 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా, రూ.2.05 లక్షల కోట్ల మేర మోసాలు జరిగాయి. ఆర్బీఐకి నివేదించిన ఫ్రాడ్ కేసులకు సంబంధించి ఆయా బ్యాంకులు క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఈ కేసుల్లో తీసుకున్న చర్యల గురించి పూర్తి సమాచారం సిద్ధంగా లేదని పేర్కొంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వ్యాపారవేత్తలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో తాజా గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కుంభకోణాలపై దృష్టి సారించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ప్రత్యేకంగా అధ్యయనం చేసి, టాప్ 100 ఫ్రాడ్లపై నివేదిక కూడా రూపొందించింది. మోసాలకు పాల్పడిన తీరు, నగదు పరిమాణం, రుణ లావాదేవీల తీరుతెన్నులు, విధానపరమైన లొసుగులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. ప్రధానంగా 13 రంగాల్లో చోటు చేసుకున్న ఫ్రాడ్స్‌ను పరిశీలించింది. తయారీ, వజ్రాభరణాలు, వ్యవసాయం, మీడియా, ఏవియేషన్, ట్రేడింగ్, ఐటీ తదితర రంగాలు వీటిలో ఉన్నాయి. అటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర ఏజెన్సీలు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నాయి. -
ఆర్సీబీపై మాల్యా వ్యంగ్యాస్త్రాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా స్పందించారు. ఆర్సీబీ జట్టు ఎప్పుడూ బలంగానే ఉంటుందని కానీ అది పేపర్‌పై మాత్రమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్సీబీ మాజీ సహయజమాని అయిన మాల్యా బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 2008లో బెంగళూరు సిటీలో నిర్వహించిన వేలంలో విజయ్ మాల్యా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఐపీఎల్ కమిటీ ముందుకొచ్చాడు. అయితే, ఆరంభ సీజన్లో ఆర్సీబీ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఆ జట్టు కేవలం రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తాజా ఐపీఎల్ సీజన్లోనూ కోహ్లి సేన చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం తన ట్విట్టర్లో ‘మాపై చూపించిన ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. మొత్తం జట్టుతో పాటు అభిమానులు, గ్రౌండ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్‌గా వస్తాం’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ పోస్ట్‌పై విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించాడు. ‘ఆర్సీబీ ఎప్పుడూ గ్రేట్ లైనప్‌ని కలిగి ఉంది. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏంటంటే అది పేపర్‌పైనే’ అంటూ ఆర్సీబీ జట్టుకు చురకలు అంటించారు. -
నాకే ఎందుకిలా..? మాల్యా
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ ట్విటర్ అందుకున్నారు. బ్యాంకులకు 100 శాతం తిరిగి చెల్లిస్తానంటూ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కోసం తీసుకున్నమొత్తం రుణాన్ని చెల్లించడం కోసం తాను సిద్దంగా ఉన్నా.. బ్యాంకులు ఎందుకు అంగీకరిచడంలేదంటూ మరోసారి వాపోయారు. జెట్ ఎయిర్వేస్ దుస్థితిపై టీవీల్లో చర్చల్ని చూశాను. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కష్టాలు బాధాకరమని మాల్యా పేర్కొన్నారు. కొన్ని వ్యాపార తప్పిదాల వల్ల కింగ్ ఫిషర్‌తోపాటు భారతీయ విమానయాన సంస్థలు కుప్పకూలడం విచారకరం. ఇపుడు అనూహ్యంగా జెట్ పతనం. 100శాతం రుణాలు చెల్లిస్తానని చెబుతున్నా..కానీ సీబీఐ, ఈడీ తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాకే ఎందుకు ఇలా అంటూ మాల్యా అసహనం వ్యక్తం చేశారు. Watched TV debate on the sad collapse of Jet which included unpaid employees and Industry veterans. Important issues on unemployment and suffering, security available to Banks, prospects of revival etc. Here I am offering 100 % payback of KFA loans which Banks wont take. Why ? — Vijay Mallya (@TheVijayMallya) April 28, 2019 Several Indian airlines collapsed sadly including KFA. Now the previously unthinkable has happened with the collapse of Jet. Genuine business failures. But I am criminally charged by CBI/ED despite offering 100% payback. Wonder why only me ? — Vijay Mallya (@TheVijayMallya) April 28, 2019 -
జెట్ పరిస్థితికి కారణం కేంద్రమే అంటున్న మాల్యా
-
ఇది ఎయిర్‌లైన్ కర్మ
లండన్: ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త, విజయ్ మాల్యా(63) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభానికి కేంద్రమే కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూసివేత దిశగా పయనిస్తున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పట్ల తన విచారం వ్యక్తంచేశారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, నీతా గోయల్‌కు తన సానుభూతిని ప్రకటించారు. ఒకప్పుడు కింగ్ఫిషర్కు జెట్ ఎయిర్వేస్ గట్టి పోటీ ఇచ్చింది. అంత పెద్ద ప్రయివేటు ఎయిర్‌లైన్‌ను ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరమంటూ విజయ్ మల్యా బుధవారం ట్వీట్ చేశారు. జెట్ పరిస్థితికి రప్రభుత్వమే కారణమంటూ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఒక పక్క ఎయిరిండియాను భారీ ప్యాకేజీ (రూ.35వేల కోట్లు)తో ఆదుకున్న ప్రభుత్వం ప్రయివేటు సంస్థలపై మాత్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వ్యాపార పరంగా తాము ప్రత్యర్థులమే అయినప్పటికీ జెట్ ఎయిర్వేస్ కోసం ఎంతో కష్టపడ్డ గోయల్ దంపతులకు సానుభూతి. వారి సేవలకు నిజంగా దేశం గర్వపడాలి. కానీ దురదృష్టవశాత్తూ దేశీయంగా చాలా ఎయిర్‌లైన్స్ దెబ్బతింటున్నాయి. ఎందుకు అని మాల్యా ప్రశ్నించారు. అలాగే తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నానని, కానీ బ్యాంకులే తీసుకోవడం లేదంటూ మాల్యా మరోసారి ట్విటర్ వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు. 100శాతం చెల్లిస్తానన్నా నాపై నేర అభియోగాలు వేస్తున్నారు. ఇది ఎయిర్‌లైన్ కర్ మఅన్నారు. దీంతోపాటు లండన్‌లో ఉన్నా జైల్లో బ్యాంకులను బకాయిలు చెల్లిస్తానని మరోసారి హామీ ఇచ్చారు. Even though we were fierce competitors, my sympathies go out to Naresh and Neeta Goyal who built Jet Airways that India should be extremely proud of. Fine Airline providing vital connectivity and class service. Sad that so many Airlines have bitten the dust in India. Why ? — Vijay Mallya (@TheVijayMallya) April 16, 2019 I invested hugely into Kingfisher which rapidly grew to become India’s largest and most awarded airline. True, Kingfisher borrowed from PSU Banks as well. I have offered to pay back 100 percent but am being criminally charged instead. Airline Karma ? — Vijay Mallya (@TheVijayMallya) April 16, 2019 -
విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ
లండన్: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా(63)కు బ్రిటన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించాలంటూ యూకే హోం శాఖ తీసుకున్న నిర్ణయంపై విచారణకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న అర్జీని యూకే హైకోర్టు తిరస్కరించింది. అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తన వాదనలకు అనుమతించాలంటూ మాల్యా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈనెల 5వ తేదీన జస్టిస్ విలియం డేవిస్ ఈ అప్పీలును తిరస్కరించారని న్యాయ విభాగం ప్రతినిధి తెలిపారు. మాల్యాకు వచ్చే శుక్రవారంలోగా మౌఖికంగా విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. విజ్ఞప్తి విన్నాక మాల్యా అప్పీలును పూర్తిస్థాయి విచారణకు అనుమతించాలా వద్దా అనేది జడ్జి నిర్ణయిస్తారని తెలిపారు. -
విజయ్ మాల్యా జల్సాలకు చెక్
లండన్ : బ్యాంకులకు రూ వేల కోట్లు రుణాల ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పటికీ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడని బ్రిటన్ కోర్టుకు ఎస్బీఐ నివేదించింది. మాల్యాకు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ యూకే పీఎల్సీ ఖాతా నుంచి 2,58,000 పౌండ్లను సీజ్ చేసే ప్రక్రియలో లండన్ కోర్టును ఎస్బీఐ అనుమతి కోరింది. మరోవైపు తమ క్లైంట్ ప్రస్తుతం వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తుండగా, ఖర్చును నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని మాల్యా న్యాయవాది ఎస్బీఐకి తెలపడంతో ఎస్బీఐ ఈ అంశాన్ని బ్రిటన్ కోర్టుకు తెలిపింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాలను చెల్లించేందుకు మాల్యా ఉద్దేశపూర్వకంగానే నిరాకరిస్తున్నాడని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. కాగా లగ్జరీ లైఫ్‌ను అనుభవించే విజయ్ మాల్యా ఇప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఎస్బీఐ న్యాయవాదులు కోర్టుకు సమర్పించిన అప్లికేషన్లో పేర్కొన్నారు. మాల్యాను చూస్తుంటే ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తెలుస్తోందన్నారు. మాల్యాకు కింగ్‌ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్ నుంచి ప్రతినెలా 7500 పౌండ్ల ఆదాయం సహా ట్రస్టుల ద్వారా నడుస్తున్న కుటుంబ ఆస్తుల నుంచి కూడా ఆయనకు భారీగా ఆదాయం సమకూరుతోందని దరఖాస్తులో ఎస్బీఐ న్యాయవాదులు పేర్కొన్నారు. -
నా ఆస్తుల జప్తు అమానుషం: మాల్యా
ముంబై: ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారికి సంబంధించిన చట్టం (ఎఫ్ఈఓఏ), 2018 కింద తన ఆస్తుల జప్తు అమానుషమని బ్యాంకులకు వేలాదికోట్ల రూపాయలు ఎగొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న విజయ్‌మాల్యా పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన ఆస్తుల జప్తు చేయాలనుకోవడం బ్యాంకులు, రుణదాతలకు ఎటువంటి ప్రయోజనం నెరవేర్చదని కూడా ఆయన బొంబై హైకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో పేర్కొన్నారు. జస్టిస్ ఐఏ మహంతీ, జస్టిస్ ఏఎం బాదర్‌లతో కూడిన ధర్మాసనం ముందు మాల్యా తరఫున ఆయన న్యాయవాది అమిత్ దేశాయ్ తన వాదనలు వినిపిస్తూ, ‘‘ఆస్తుల జప్తు చర్యలు అమానుషం. బ్యాంకులు, రుణ గ్రహీతలతో ప్రస్తుతం ఒక అవగాహన కుదుర్చుకోవడం అవసరం. మాల్యా ఆస్తులను తిరిగి కోరుకోవడం లేదు. ఆస్తుల జప్తు చేయడం వల్ల బ్యాంకులు, రుణ దాతలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదని మాత్రం ఆయన చెప్పదలచుకున్నారు’’ అని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా తప్పుపట్టింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా పడింది. ఎఫ్ఈఓఏ, 2018 సెక్షన్ 12 కింద మాల్యాను ‘‘పారిపోయిన’’ నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్ కోర్ట్ ప్రకటించింది. ఇదే చట్టం కింద మాల్యా ఆస్తుల జప్తునకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను ఈ నెల 8వ తేదీన ప్రత్యేక ఎంఎంఎల్‌ఏ (అక్రమ ధనార్జన) కోర్టు విననుంది. గత ఏడాది జూన్ 22న ఆమోదం పొందిన కొత్త చట్టం కింద ఈ తరహా కేసు విచారణ ఇదే మొదటిసారి. ఈడీ పిటిషన్ ఆమోదం పొందితే, మాల్యాకు చెందిన రూ.12,000 కోట్ల ఆస్తుల జప్తునకు వాటిని విక్రయించి రుణ దాతల బకాయిల చెల్లింపునకు ఈడీకి మార్గం సుగమం అవుతోంది. అయితే తనను ‘‘పారిపోయిన’’ నేరస్తునిగా జనవరి 5వ తేదీన ముంబై స్పెషల్ కోర్ట్ ప్రకటించడాన్ని మాల్యా ముంబై హైకోర్టులో సవాలు చేశారు. -
బీజేపీకి పోస్టర్‌బాయ్‌గా మారా: మాల్యా
లండన్: బీజేపీ ప్రభుత్వం తనను పోస్టర్ బాయ్‌గా ఉపయోగించుకుంటోందని వివాదాస్పద లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. భారత్‌లోని బ్యాంకులను తాను రూ.9 వేల కోట్ల మేర మోసం చేశానంటున్న ప్రభుత్వం.. రూ.14 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు చెబుతోంది. ప్రధాని మోదీ ప్రకటనే ఇందుకు రుజువంటూ ఆదివారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘బీజేపీ ప్రభుత్వం నన్ను పోస్టర్ బాయ్‌గా వాడుకుంటోంది. నేను బ్యాంకులను మోసం చేసినట్లు చెబుతున్న మొత్తం కంటే స్వాధీనం చేసుకుంటామని చేసిన మొత్తం చాలా ఎక్కువ. ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు. ‘అయితే, 1992 నుంచే నేను బ్రిటన్ పౌరుడిగా ఉన్న విషయం మరిచి, దేశం విడిచి పారిపోయినట్లు నాపై ఆరోపణలు చేస్తోంది’ అని తెలిపారు. కాగా, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు మాల్యాను వెనక్కి పంపించాలంటూ గత నెల బ్రిటన్ హోం మంత్రి తీసుకున్న నిర్ణయంపై ఆయన అక్కడి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానుందని సమాచారం. -
మాల్యాకు డీఆర్టీ మరో షాక్...
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ (యూబీహెచ్ఎల్)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్ఎల్కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది. ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్బీఐ కన్సార్టియంకు విజయ్ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్టీ అధికారులు తెలిపారు. -
మాల్యాకు డీఆర్టీ మరో షాక్...
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ (యూబీహెచ్ఎల్)కు చెందిన 74 లక్షల షేర్లను రూ. 1,008 కోట్లకు ఈడీ విక్రయించింది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మీడియాకు వెల్లడించింది. విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ ఈ షేర్లను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ అటాచ్‌లో ఉన్న ఈ షేర్లు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)కు వెళ్లాయి. ఈ నెల తొలి వారంలోనే డీఆర్టీ ఆదేశించిన మేరకు యూబీహెచ్ఎల్కు చెందిన 74,04,932 షేర్లను విక్రయించింది. ఈడీ సమర్పించిన పత్రాలు, తీసుకున్న చర్యల ఆధారంగాను, ఎస్బీఐ కన్సార్టియంకు విజయ్ మాల్యా భారీమొత్తంలో రుణాలు బాకీ ఉన్న కారణంగాను ఈ షేర్లను అమ్మేందుకు అక్రమ నగదు రవాణా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు ఈనెల 26న అనుమతినిచ్చింది. దీంతో బుధవారం డీఆర్టీకి చెందిన రికవరీ అధికారి ఈ షేర్లను రూ. 1008 కోట్లకు విక్రయించారు. విజయ్ మాల్యా రుణాల రికవరీ ప్రక్రియలో ఇది తొలి ఘట్టమేనని, మరికొద్ది రోజుల్లో మిగిలినవి కూడా విక్రయిస్తామని డీఆర్టీ అధికారులు తెలిపారు. -
మాల్యా కేసు: రూ 1008 కోట్లు రికవరీ
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్ల రుణ ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకున్న లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా కంపెనీ యూబీఎల్ నుంచి ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం రూ 1008 కోట్లు రాబట్టగలిగింది. విజయ్ మాల్యాకు చెందిన యూబీఎల్ షేర్ల విక్రయంతో ఈ మొత్తాన్ని రికవరీ అధికారి వసూలు చేశారు. యస్ బ్యాంక్ వద్ద యూబీ షేర్లు పెద్దమొత్తంలో తనఖా కింద ఉన్నాయని విజయ్ మాల్యా కేసును విచారిస్తున్న ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, యస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి చెల్లించిందని, రుణ మొత్తంలో కొద్ది భాగమే పెండింగ్‌లో ఉందని తదుపరి దర్యాప్తులో ఈడీ తేల్చింది. దీంతో యస్ బ్యాంక్ వద్ద కుదువ పెట్టిన షేర్లపై బ్యాంకుకు నియంత్రణ ఉండే అవకాశం పెద్దగా ఉండబోదని దర్యాప్తు ఏజెన్సీ భావించి ఆ దిశగా పావులు కదిపింది. వీటి స్వాధీనం కోసం ఈడీ దరఖాస్తు మేరకు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్ఏ కోర్టు ప్రకటించింది. ఈడీ వినతితో తనఖాతో కూడిన, తనఖా లేని 74,04,932 యూబీఎల్ షేర్లను కోర్టు అటాచ్ చేసింది. అయితే ఈ షేర్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి తనఖాగా యస్ బ్యాంక్ వద్ద ఉన్నాయి. పీఎంఎల్ఏ కోర్టు నిర్ణయం మేరకు యూబీఎల్ షేర్లను డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన రికవరీ అధికారికి బదలాయించాలని యస్ బ్యాంక్‌కు గత ఏడాది జులై 9న నోటీసులు జారీ అయ్యాయి. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ యస్ బ్యాంక్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా వాదప్రతివాదనలు పూర్తయిన మీదట యూబీఎల్ షేర్లను రికవరీ అధికారికి మూడు వారాల్లోగా బదలాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న యస్ బ్యాంక్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్ధానం నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో రికవరీ అధికారి బుధవారం షేర్లను విక్రయించడంతో రూ 1008 కోట్లు రికవరీ అయ్యాయి. -
కింగ్‌ఫిషర్‌ను కూల్చారు.. జెట్‌ను గట్టెక్కిస్తున్నారు
న్యూఢిల్లీ: మాజీ లిక్కర్ కింగ్, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా బ్యాంకుల ద్వంద్వ ప్రమాణాలపై మండిపడ్డారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నిర్దాక్షిణ్యంగా విఫలమయ్యేందుకు కారణమైన బ్యాంకులు... ఇప్పుడు అదే విధమైన పరిస్థితిలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను మాత్రం ఒడ్డెక్కిస్తున్నాయని ఎత్తిచూపారు. సమస్యల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ను ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ తన నియంత్రణలోకి తీసుకోవడంపై వరుస ట్వీట్లతో మాల్యా తన స్పందన తెలియజేశారు. కింగ్‌ఫిషర్ విషయంలోనూ ఇదే జరగాల్సి ఉందన్నారు. ‘‘పీఎస్‌యూ బ్యాంకులు జెట్ఎయిర్వేస్కు బెయిలవుట్ కల్పించడం, ఉద్యోగాలను, సేవల కనెక్టివిటీని కాపాడడం చూడ్డానికి ఆనందంగా ఉంది. ఇవే పీఎస్‌యూ బ్యాంకులు భారత్‌లోనే అత్యుత్తమమైన ఎయిర్‌లైన్ (కింగ్‌ఫిషర్), మెరుగైన ఉద్యోగులు, అనుసంధానత ఉన్న దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశాయి’’ అని మాల్యా ట్వీట్ చేశారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నిలబెట్టేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించలేదని, బదులుగా అన్ని ద్వారాలను మూసేశారని ఆక్షేపించారు. కంపెనీని, ఉద్యోగులను కాపాడేందుకు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో తాను రూ.4,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసినట్టు మాల్యా చెప్పారు. జెట్‌ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో భిన్న విధానాన్ని అనుసరించడం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారును విమర్శించారు. ‘‘నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నేను రాసిన లేఖలను బీజేపీ అధికార ప్రతినిధి అనర్గళంగా చదువుతారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో పీఎస్ యూ బ్యాంకులు అక్రమంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సహకరించాయని చెబుతారు. మరి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఏం మారిపోయిందన్నది ఆసక్తి కలిగిస్తోంది’’ అని మాల్యా విమర్శించారు. నా డబ్బులు తీసుకోండి... ‘‘పీఎస్‌యూ బ్యాంకులు, ఇతర రుణదాతలకు చెల్లించేందుకు గాను కర్ణాటక హైకోర్టు ముందు నా లిక్విడ్ ఆస్తులను (వెంటనే నగదుగా మార్చుకునేవి) ఉంచాను. వాటిని తీసుకోవాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను. బ్యాంకులు నా డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదు? జెట్ఎయిర్వేస్ను కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి’’ అని తన ట్వీట్లో మాల్యా పేర్కొన్నారు. బ్యాంకులకు మాల్యా రూ.9,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించలేక, అదే సమయంలో కార్యకాలాపాల నిర్వహణకు నిధుల్లేక మునిగిపోయే పరిస్థితికి చేరిన జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ ఓ పరిష్కార ప్రణాళికను రూపొందించిన విషయం గమనార్హం. బ్యాంకులు తమ రుణాలను జెట్‌ఎయిర్‌వేస్‌లో వాటాల కింద మార్చుకుని తమ అధీనంలోకి తీసుకునేందుకు నిర్ణయించాయి. -
బ్యాంకులకు మాల్యా బంపర్ ఆఫర్
ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా జెట్ ఎయిర్వేస్ వివాదంపై స్పందించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను, ఉద్యోగులను కాపాడేందుకు తన డబ్బులను తీసుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికైనా దీనిపై బ్యాంకులు పునరాలోచించాలని కోరాడు. దీంతోపాటు సంక్షోభంలో ఉన్న తన పట్ల డబుల్ స్టాండర్డ్స్‌ని అవలంబిస్తోందంటూ మంగళవారం ట్విటర్లో వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాడు. అలాగే సంస్థను ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను రక్షించేందుకు ప్రభుత్వం రంగ బ్యాంకులు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించడంపై మాల్యా సంతోషం వ్యక్తం చేశాడు. కానీ ఇదే తన విషయంలో కూడా జరిగి వుంటే బావుండేదంటూ వాపోయాడు. బీజేపీ ప్రభుత్వం లోని ప్రభుత్వ బ్యాంకులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆరోపిస్తూ మాల్యా వరుస ట్వీట్లు చేశాడు. దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ కింగ్ ఫిషర్, దాని ఉద్యోగులు, వ్యాపారం నిర్దాక్షిణ్యంగా కూలిపోతోంటే ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని ట్వీట్ చేశాడు. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ సంస్థను, సంస్థ ఉద్యోగులను కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టానని మాల్యా చెప్పుకొచ్చాడు. దీన్ని గుర్తించకుండా తనను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నాడు. అలాగే తన లిక్విడ్ ఆస్తులను తీసుకోవాలని గౌరవనీయమైన కర్నాటక హైకోర్టు ముందు ఇప్పటికే తన ప్రతిపాదనను ఉంచానని కానీ ప్రభుత్వ బ్యాంకులు, ఇతర రుణ దాతలు ఎందుకు సమ్మతించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు. జెట్ ఎయిర్వేస్ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. దివాలా కారణంగా కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది. దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో కేసు విచారణను ఎదుర్కొంటుండగా గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని మాల్యా ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జులై 10న జరగనున్నాయి. కాగా జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు ఛైర్మన్ నరేష్ గోయల్ ఎట్టకేలకు సోమవారం (మార్చి 25) న దిగి వచ్చారు. ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో రుణదాతలు 1500 కోట్ల రూపాయల బెయిల్ అవుట్ ప్యాకేజీకి అంగీకరించిన సంగతి తెలిసిందే. (చదవండి : గోయల్.. ‘జెట్’ దిగెన్!) Happy to see that PSU Banks have bailed out Jet Airways saving jobs, connectivity and enterprise. Only wish the same was done for Kingfisher. — Vijay Mallya (@TheVijayMallya) March 25, 2019 And I repeat once again that I have placed liquid assets before the Hon’ble Karnataka High Court to pay off the PSU Banks and all other creditors. Why do the Banks not take my money. It will help them to save Jet Airways if nothing else. — Vijay Mallya (@TheVijayMallya) March 26, 2019 -
విజయ్ మాల్యాకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోయిన ప్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో షాక్ తగిలింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఢిల్లీ హైకోర్టు శనివారం ఆదేశించింది. తదుపరి విచారణకు జూలై 10 వ తేదీనికి వాయిదా వేసింది. జూలై 10వ తేదీ నాటికి ఆస్తులను అటాచ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ బెంగళూరు పోలీసులు ఆదేశించారు.ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి ఇప్పటికే అధికారులు తెలియజేశారు. గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే. కాగా రూ.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయాడు. అయితే ఈ కేసులో మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నిస్తున్నాయి -
కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు : రాహుల్
జగదల్పూర్: అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం..రైతులకు మాత్రం రోజుకు రూ.3.50 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ధురగాన్ గ్రామంలో జరిగిన గిరిజనుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దోచి పెడుతోంది. కానీ రైతులకు మాత్రం రోజుకు రూ.3.50 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది’అని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు కనీస ఆదాయం హామీ కింద వారి ఖాతా ల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేయడం, 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రజా ధనాన్ని పన్నుల రూపంలో వసూలు చేసిన మోదీ ప్రభుత్వం..బడా వ్యాపార వేత్తలకు భారీ రాయితీలు ఇస్తోందని రాహుల్ ఆరోపించారు. ‘నోట్ల రద్దు తర్వా త అర్ధరాత్రి తీసుకొచ్చిన గబ్బర్‌సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రం గా నష్టపోయాయి. మేం అధికారంలోకి వస్తే జీఎస్టీని ‘సచ్చా’జీఎస్టీగా మారుస్తాం’అని పేర్కొన్నారు. టాటా స్టీల్ భూముల పత్రాల అందజేత బస్తర్ ప్రాంతంలోని లోహండిగూడలో టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు పదేళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో 2008లో ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు సంబంధించిన పత్రాలను, అటవీ హక్కుల ధ్రువపత్రాలు, రైతు రుణమాఫీ పత్రాలను ఆయన చేతుల మీదుగా రైతులకు అందజేశారు. -
త్వరలో భారత్‌కు విజయ్ మాల్యా!
లండన్: బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావీద్ ఆదివారమే సంబంధింత పత్రాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు టైముంది. హైకోర్టు మాల్యా అప్పీల్‌ను తిరస్కరిస్తే ఆయన వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. విచారణకు స్వీకరిస్తే హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిస్థితులుంటాయి. మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గతేడాది డిసెంబర్ 10న తీర్పు చెప్పింది. ఆ తీర్పు హోం శాఖకు చేరింది. కాగా, పాక్ సంతతికి చెందిన మంత్రుల్లో అత్యంత సీనియర్ అయిన జావీద్.. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదివారం సంతకం చేశారు. కేసులోని అంశాలు, పరిస్థితులను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు సైతం మాల్యాకు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు రావడం వల్లే తాను అప్పులు తీర్చలేక పోయానని మాల్యా గతంలో లండన్ కోర్టులో వాదించగా, అప్పు రూపంలో లభించిన డబ్బును మాల్యా అసలైన అవసరానికి వాడకుండా, పక్కదారి పట్టించాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గతంలో గుర్తించింది. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయంపై భారతసర్కారు హర్షం వ్యక్తం చేసింది. అప్పీల్ చేసే పని ప్రారంభిస్తా: మాల్యా విజయ్ మాల్యా ఓ ట్వీట్ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే పనిని మొదలుపెడతానన్నాడు. ‘వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు డిసెంబర్ 10న తీర్పు వచ్చినప్పుడే, అప్పీల్‌కు వెళ్తానని నేను గతంలోనే చెప్పా. హోం మంత్రి దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండటంతో, ఇన్నాళ్లూ అప్పీల్ చేయలేకపోయా. ఇప్పుడు ఆ పని మొదలుపెడతా’ అని మాల్యా పేర్కొన్నాడు. మాట నిలుపుకుంటాం మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. మాల్యాను రప్పించడం ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని రాబట్టి, దోషులను చట్టం ముందు నిలబెడతామంటూ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చనున్నామని తెలిపింది. ‘బ్యాంకులను మోసగించి పరారైన విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వ అధికారులు చేసిన నిర్విరామ కృషి ఫలితమిది. ఈ పరిణామం మోదీ ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం’ అని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కుంభకోణాలు, మోసాలకు చట్టబద్ధమైన ముగింపు తెచ్చేలా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు అవకాశం కల్పించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు తీసుకువచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసిందని మంత్రి జైట్లీ అన్నారు. -
‘చంద్రబాబు స్టేల సీఎం’
-
‘చంద్రబాబు స్టేల సీఎం’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలేవి రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఎన్ఐఏని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రతి కేసులోనూ స్టే తెచ్చుకుంటుండగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన మీద పెట్టిన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్టేల సీఎంగా బాబు పేరు మారుమోగి పోతుందంటూ ఎద్దేవా చేశారు. బాబు పాలనలో రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. టీడీపీ మంత్రులు, నాయకుల అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు వస్తే సహకరించరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోచుకున్న లక్షల కోట్ల అవినీతి సొమ్మును దాచుకునేందుకు బాబు కూడా విజయ్ మాల్యాలా దేశం విడిచి పారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అడ్రస్ లేని గంటా ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిలో గంటాకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలన్నారు. సహచర మంత్రి అయ్యన్న ఆరోపణలకు గంటా ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై కాక దోచుకున్న ఆస్తులు దాచుకోవడానికి సీఎం పర్యటనలు చేస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. -
మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన ముంబై కోర్టు
-
విలాసాలకు మారుపేరు
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది. ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది. కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్‌ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది. మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్లో ఫామ్ హౌస్‌లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే. తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది. ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్‌ఎల్‌లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్ఎల్ రూ.27 కోట్లు, మెక్‌డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది. ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్‌లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్‌లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్‌ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం. సొంత పనులకు 4 విమానాలు కింగ్‌ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్‌తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ -
విజయ్ మాల్యా.. పరారైన నేరగాడే
ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్.సింగ్ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్‌మాల్యా మాత్రం భారత్‌కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్ ఇండియా జట్టు డైరెక్టర్ హోదాలో వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్ఈవో చట్టంలోని సెక్షన్ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్‌ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు. మా చొరవ వల్లే..: బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్‌ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు. అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్యాన్, పోఖ్రాన్–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్ తన ఐదో బర్త్‌డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వినోదాల కోసం రెండు నౌకలు మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్ కార్లను కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్ షిప్‌యార్డ్‌కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్ రిచర్డ్ బర్టన్, ఎలిజబెత్ టేలర్ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు. -
విజయ్ మాల్యాకు గట్టి షాక్..!
-
విజయ్ మాల్యాకు గట్టి షాక్..!
ముంబై: తొమ్మిది వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి.. లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటింటిస్తూ.. ముంబై కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు.. పరారైన ఆర్థిక నేరస్థుల చట్టం-2018లోని సెక్షన్ 2ఎఫ్ ప్రకారం అతడిని ఆర్థిక నేరస్థుడిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద.. గుర్తించబడిన మొదటి నిందితుడిగా మల్యా నిలిచారు. మాల్యా ఆస్తుల జప్తుపై ఫిబ్రవరి 5న కోర్టు వాదనలు విననుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు ముంబై కోర్టు మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగే వారిని కోర్టు ఆర్థిక నేరస్తులుగా గుర్తిస్తుంది. భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి మాల్యా 9వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. కాగా కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత రుణాల ఎగవేతదారుగా ప్రకటించబడిన మొదటి వ్యక్తి మాల్యానే కావడం విశేషం. -
2018 బిజినెస్ రౌండప్
-
2018 బిజినెస్ రౌండప్ : స్కాంల హోరు, వివాదాల జోరు
పెరిగిన డాలర్ - తగ్గిన రూపాయి, మండిన పెట్రోలు - భగ్గుమన్న ధరలు, హెచ్చుతగ్గుల మార్కెట్, మైమరింపించిన పెట్టుబడులు, భారీ రుణాలు - బ్యాంకుల కుంభకోణాలు, బంగారం ధరల దోబూచులాట... లాంటివి అనేకం 2018లో మరిచిపోలేని వాణిజ్య వ్యాపార రంగాల్లో ప్రభావం చూపిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో సాగిన బిజినెస్ పై సాక్షి రౌండప్...!!! వణికించిన చమురు : మండిన పెట్రోలు ఆకాశాన్నంటిన చమురు ధరలు ప్రపంచదేశాలను వణికించాయి. బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ 86.74 డాలర్లు వద్ద ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దేశీయంగా పెట్రో ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. పెట్రోలు, డీజిల్ ధరలు అక్టోబరులో చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. పెట్రోలు లీటరు ధర ముంబైలో ఏకంగా రూ.90స్థాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వచ్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబరు 22 నాటికి బ్రెంట్ ఆయిల్ 53.50 డాలర్లకు చేరింది. 2018 స్టాక్‌మార్కెట్లు : 2017 ఏడాదిలో కీలక సూచీలు బీఎస్సీ సెన్సెక్స్ 26,494 వద్ద ఉండగా, 2018 జనవరిలో 36, 957 స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 11వేల రికార్డ్ స్థాయిని తాకింది. అయితే ఈ ఏడాది మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఏడాదంతా ఒడిదుడుకులను చవి చూసాయి. ఆగస్టులో 38,800 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 11,760 కి ఎగువన నిఫ్టీ చారిత్రక గరిష్టాలను తాకియి. అయితే ఏడాది చివరికి 2018 జనవరి నాటి స్థాయిలోనే కొనసాగుతుండటం విశేషం. ఉసూరుమనిపించిన రూపాయి : ఈ ఏడాది జనవరిలో డాలరు మారకంలో రూపాయి 63.8 వద్ద నిలిచింది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు ప్రభావంతో 74. 49 వద్ద ఆల్‌టైం కనిష్టానికి చేరింది. ఒకదశలో 75 రూపాయల స్థాయిని దాటి పతనంకానుందని ఆందోళన కూడా నెలకొంది. అయితే మళ్లీ చమురు ధరలు కాస్త చల్లబడటంతో రూపాయికి బలమొచ్చింది. అయినా గత ఏడాదితో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ దిగజారింది. ప్రస్తుతం 70రూపాయల స్థాయి వద్ద కొనసాగుతోంది. స్మార్ట్ఫోన్ల హవా : స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లలో హల్చల్ చేశాయి. ప్రధానంగా భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. అందులోనూ షావోమీ డివైస్లవైపే యూజర్లు మొగ్గు చూపారు. దీంతో షావోమి నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. అలాగే ఒప్పో, వివో లెనోవా, వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు భారీ విక్రయాలను నమోదు చేశాయి. భారీ స్ర్కీన్లు, అతిపెద్ద స్టోరేజ్ కెపాసిటీ, భారీ, డ్యుయల్ రియర్, సెల్ఫీ కెమెరా ఈ ఏడాదిలో ప్రముఖంగా నిలిచాయి. ఫోల్డబుల్ ఫోన్ : ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు శాంసంగ్, యాపిల్, ఎల్జీ, హువావే లాంటి దిగ్గజాలకు షాకిస్తూ చైనాకంపెనీయే ముందుగా ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాయ్లీ కార్పొరేషన్ అనే సంస్థ విడుదల చేసింది. పడిలేచిన పసిడి : బంగారానికి డిమాండ్ బాగా తగ్గింది. 2018 ఏడాదంతా బులియన్ మార్కెట్లో విలువైన లోహాలు వెండి, బంగారం ధరలు అక్కడక్కడే కదలాడాయి. 25 జనవరి 2018న 24 కారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.30,454 గా ఉంది. డిసెంబరు 22 నాటికి స్వల్పంగా పుంజుకుని పది గ్రాముల పుత్తడి రూ.31,197 గా నిలిచింది. వెండి ధర మాత్రం బాగా పడిపోయింది. ఏడాది ఆరంభంలో 42 వేలు పలికిన వెండి కిలో ధర డిసెంబరు 22 నాటికి రూ. 37,276 స్థాయికి చేరింది. కుంభకోణంలో చిక్కిన పీఎన్బీ : ఏడాది ఆరంభంలోనే దేశంలో నేషనల్ బ్యాంకు కుంభకోణం ప్రకంపనలు రేపింది. బ్యాంకులోని సీనియర్ అధికారులు, ఉద్యోగులతో కుమ్మక్కైన డైమండ్ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చెక్సీ (గీతాంజలి గ్రూప్) 13వేల 600 కోట్ల రూపాయలకు బ్యాంకు ముంచేసి విదేశాలు చెక్కేసారు. ఈ కేసులో కేసులు నమోదు, చార్జిషీట్లు, ఆస్తులు స్వాధీనంలాంటి చర్యల్లో సీబీఐ, ఐడీ బిజీగా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ రంగంలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ సెగ అది పెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐని కూడా తాకింది. గీతాంజలి గ్రూపునకు వేలకోట్ల రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహించిన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వివాదంలో ఇరుక్కుంది ఐసీఐసీఐ వీడియోకాన్ కుంభకోణం : పీఎన్బీ కుంభకోణానికి తోడుగా ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ రుణ కుంభకోణం బ్యాంకింగ్ రంగ నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఈ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్ సాయం చేశారని ఆరోపణలు చెలరేగాయి. నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు కొచర్ రుణాలిచ్చారని, తద్వారా భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి లబ్ది చేకూరిందనేది ప్రధాన ఆరోపణ. బోర్డు పదేపదే చందా కొచర్ అండగా నిలిచినప్పటికీ, తుదకు చందాకొచర్ పదవిని వీడక తప్పలేదు. భారీ డీల్స్ : దేశీయ ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ ఆన్లైన్ దిగ్గజం వాల్‌మార్ట్‌ల మెగా డీల్ ఇ-కామర్స్ రంగంలో ప్రముఖంగా నిలిచింది. 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు ఇద్దరూ అనూహ్యంగా కంపెనీని వీడడం విశేషం. డీల్ ముగిసిన వెంటనే సచిన్ బన్సల్ తన వాటాను అమ్ముకొని కంపెనీ నుంచి నిష్ర్కమించారు. అటు మరో ఫౌండర్ బిన్సీ బన్సల్ కూడా అనివార్య పరిస్థితుల్లో సంస్థకు రాజీనామా చేయాల్సి వచ్చింది. వోడాఫోన్, ఐడియా డీల్ టెలికాం రంగంలో మెగా డీల్‌కు సాక్ష్యంగా నిలిచింది. వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు విలీనమై వోడాఫోన్ ఐడియా పేరుతో దేశీయంగా అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించాయి. తద్వారా టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన జియో దెబ్బతో కుదేలైన దేశీయ అతిపెద్ద టెల్కో ఎయిర్‌టెల్‌ను మరింత వెనక్కి నెట్టేసింది. కీలక నిష్క్రమణ : శిఖా శర్మ - భారీ నష్టాలు, నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణలు రావడం లాంటి పరిణామాలతో యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖాశర్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2018మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీకాలం ముగియనుండగా, నాలుగవసారి ఆమెను ఎండీగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. అయితే దీనిపై ఆర్బీఐ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 31, 2018నుంచి బాధ్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్‌లో శిఖా శర్మ ప్రకటించారు. ఉషా అనంత సుబ్రమణియన్ : పీఎన్బీ స్కాంకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో అలాహాబాద్ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ పేరు చేర్చడంతో ఆమె పదవిని కోల్పోయారు. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం 2016లో గీతాంజలి గ్రూప్‌నకు అనుమానాస్పద ఈ రుణాల కేటాయింపులపై (రూ.5,280 కోట్లు) సీబీఐ అధికారులు ఆమెను చార్జ్‌షీట్‌లో చేర్చారు. అరుంధతి భట్టాచార్య : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తొలి మహిళా ఛైర్మన్‌గా విజయవంతంగా బాధ్యతలను నిర్వహించిన అరుంధతి భట్టాచార్య అక్టోబర్‌లో 2018లో రిటైర్ అయ్యారు. ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసరుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె నాలుగు దశాబ్దాలు పాటు బ్యాంకుకు విశేష సేవలందించారు. 2018 బిజినెస్ రౌండప్ : బ్యాంకుల విలీనం : గత ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకుతోపాటు అయిదు బ్యాంకులను విలీనంచేసిన కేంద్రం, రుణవితరణ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు బ్యాంకులను బలోపేతం చేయడాని కంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రూ.14.82 లక్షల కోట్లతో దేశంలో మూడవ అతిపెద్ద సంస్థగా అవతరించ నుంది. అయితే ఈ మెర్జర్‌ను బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి. పరారైన కార్పొరేట్ నేరస్తులు : విజయ్ మాల్యా : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా వ్యవహారం 2018లో బ్రిటన్ కోర్టుకు చేరింది. 2016, మార్చిలో మాల్యా లండన్‌కు పారిపోయిన మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్, బినామీ లావాదేవీల చట్టం ప్రకారం దేశం వదిలి పారిపోయిన మాల్యాను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు నానా తంటాలు పడుతోంది. అయితే తాను బ్యాంకుల వద్ద తీసుకున్న మొత్తం రుణాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాననీ, మీడియానే తన మీద తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాల్యా పాత పాటే పాడుతున్నాడు. మరోవైపు బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య 58కి చేరింది. విజయ్ మాల్యాతో పాటు వివిధ స్కాంలలో నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోదీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్అవుట్ సర్క్యులర్స్ (ఎల్ఒసీ), ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు జారీ చేశామని కేంద్రం ప్రకటించడం గమనార్హం. అయితే అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దేశానికి రప్పించడంలో కేంద్రం విజయం సాధించింది. వివాదాల చట్రంలో ఆర్బీఐ : దేశ ఆర్థికరంగానికి ఆయువు పట్టులాంటి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది కూడా తీవ్ర చర్చల్లో నానింది. ముఖ్యంగా కేంద్రం, ఆర్బీఐ మధ్య వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. అప్పటివరకు గుంభనంగా ఉన్న విభేదాలు డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య బహిరంగంగా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై వ్యాఖ్యలు చేయడంతో ఈ ప్రచ్ఛన్న యుద్ధం మరింత రాజుకుంది. చివరకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన గవర్నర్‌గా మాజీ ఆర్థికమండలి సలహా సభ్యుడు శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించింది. హెచ్చు తగ్గుల మధ్య జీఎస్టీ : ఒకే దేశం ఒకే పన్ను పేరుతో గత ఏడాది తీసుకొచ్చిన పన్ను సంస్కరణల చట్టం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం రేట్ల శ్లాబులలో మార్పులను ప్రకటించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ పన్ను రేటును తగ్గించినట్టు ప్రకటించింది. 33 వస్తువులను 12, 5 శాతం శ్లాబుల్లోకి, 28 రకాల విలాస వస్తువులపై 28 శాతం జీఎస్టీ రేటుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ఆదాయంపై 55 వేల కోట్ల భారం పడనుందని ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ట్రాయ్ కొత్త నిబంధనలు : వినియోగదారులపై రెట్టింపు భారం సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కొత్త కేబుల్ టారిఫ్ అమలు కానుందని, డిసెంబర్ 29 తర్వాత వివిధ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయనే వార్తలు కేబుల్ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. తాజా ఆర్డర్‌తో ఛానల్‌కు 19 రూపాయిలు చొప్పున గరిష్టంగా పెంచుకునే అవకాశం ఇచ్చింది ట్రాయ్. 20నెలల ముందే అంటే 2017 మార్చిలోనే ఈ చట్టం వచ్చినప్పటికీ 2018, జులై 3న వాటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది. ఈ నెల 29 తర్వాత కొత్త కేబుల్ నిబంధనల వల్ల టీవీ ఛానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని, కొంత సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఈ నిబంధనలను కేబుల్ ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. -
మాల్యా.. నీరవ్.. చోక్సీ..!
బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య యాభై ఎనిమిదికి చేరింది. ఈ వైట్‌కాలర్ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్ మాల్యా మాత్రమే కాదు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోదీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్అవుట్ సర్క్యులర్స్ (ఎల్ఓసీ), ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని కేంద్రం పేర్కొంది. బ్రిటన్, యూఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, అంటిగా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలకు అప్పగింత అభ్యర్థనలను సమర్పించింది. ఇప్పటిదాకా చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంతవరకు పురోగతి సాధించాయో అని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిపెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. వీవీఐపీ హెలికాప్టర్ల స్కామ్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్, కార్లో గెరోసాల అప్పగింత అభ్యర్థన, సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్‌సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్‌లో, గ్యూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది. రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మెహుల్ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఆశిష్ జోబన్‌పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్ సర్కార్‌కు భారత్ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపక తల్వార్‌ను యూఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటం చేస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ ద్వారా బ్యాంకు లకు 5వేల కోట్లు ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేసర, హితేష్‌కుమార్ పటేల్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను వెనక్కి తీసుకురావడంలో సక్సెస్ సాధించిన బీజేపీ సర్కారు మిగిలిన వారినీ తీసుకువస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. 41 గంటలు ప్రయాణించి భారత్‌కు రాలేను: మెహుల్ చోక్సీ ఆరోగ్యం సహకరించని కారణంగా 41 గంటలు విమానంలో ప్రయాణించి తాను భారత్‌కు రాలేనని బ్యాంకులను మోసగించి పారిపోయిన మెహుల్ చోక్సీ తాజాగా ముంబైలోని ఓ కోర్టుకు తన న్యాయవాది ద్వారా తెలిపారు. చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్నారు. ఆయనకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. అయితే అతణ్ని భారత్‌కు తిరిగి రప్పించి విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చోక్సీ ముంబైలోని కోర్టుకు తన పరిస్థితి వివరిస్తూ, ఆరోగ్యం బాగా లేనందున 41 గంటలపాటు తాను ప్రయాణించలేనని చెప్పారు. -
పరారీలో 58 మంది ఆర్థిక నేరగాళ్లు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య యాభై ఎనిమిదికి చేరింది. ఈ వైట్‌కాలర్ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్ మాల్యా మాత్రమే కాదు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోదీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్అవుట్ సర్క్యులర్స్ (ఎల్ఒసీ), ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని కేంద్రం పేర్కొంది. బ్రిటన్, యూఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, అంటిగా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలకు అప్పగింత అభ్యర్థనలను సమర్పించింది. ఇప్పటిదాకా చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంతవరకు పురోగతి సాధించాయో అని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డీఆర్ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిపెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. వీవీఐపీ హెలికాప్టర్ల స్కామ్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్, కార్లో గెరోసాల అప్పగింత అభ్యర్థన, సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్‌సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్‌లో, గ్యూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది. రూ.13 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మొహుల్ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్‌కు చెందిన వ్యాపారి ఆశిష్ జోబన్‌పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్ సర్కార్‌కు భారత్ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపక తల్వార్‌ను యూఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయపోరాటం చేస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ ద్వారా బ్యాంకులకు 5వేల కోట్లు ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేసర, హితేష్‌కుమార్ పటేల్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను వెనక్కి తీసుకురావడంలో సక్సెస్ సాధించిన బీజేపీ సర్కారు మిగిలిన వారినీ తీసుకువస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. -
‘విజయ్ మాల్యాను దొంగ అనకూడదు’
న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్‌బ్యారన్ విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించడం కోసం మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. మరో పక్క కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయ్ మాల్యా గురించి సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘మాల్యా దాదాపు నలభై ఏళ్ల పాటు ఈ దేశంలో పన్నులు కడుతూ వస్తున్నారు. కేవలం ఒక్కసారి లోన్ కట్టనంత మాత్రాన ఆయనను దొంగ అనడం సరికాదు’ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. ‘విజయ్ మాల్యాకు, నాకు మధ్య ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ వ్యక్తి 50 ఏళ్ల పాటు వడ్డీ చెల్లిస్తున్నాడు. కేవలం ఒకసారి ఇంట్రెస్ట్ చెల్లించనంత మాత్రాన అతన్ని ఎగవేతదారుడు అనలేము కదా. విజయ్ మాల్యా విషయంలో కూడా అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సికోమ్ మాల్యాకు రుణం ఇచ్చింది. టైమ్‌కు డబ్బు కట్టేవారు.. ఒక్కసారి కూడా వాయిదా పడలేదు. కానీ విమానయాన రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారింది. దాంతో డబ్బు చెల్లించలేకపోయారు. అంత మాత్రం చేత ఆయనను దొంగ అనడం సరి కాదు. ఈ మైండ్‌సెట్‌ని మార్చుకోవాలం’టూ వ్యాఖ్యానించారు. అంతేకాక వ్యాపారం అన్నాక ఎత్తు, పల్లాలుంటాయి. ఆర్థిక మాంద్యం వల్లనో.. అంతర్గత కారణాల వల్లనో ఇబ్బందులు వస్తాయి. అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి బాసటగా నిలవాలి తప్ప ఇలా గేలి చేయకూడదన్నారు. రాజకీయాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఓడిపోతే.. అక్కడితో వారి జీవితం ముగిసినట్లు కాదని పేర్కొన్నారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తుల ఆర్థిక మోసాలు నిజమైతే వారిని జైలుకు పంపాలి.. అంతేకాని వారిని దొంగ అనే హక్కు మనకు లేదని తెలిపారు. కేవలం వీరి వల్లనే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడలేదంటూ నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. -
‘బ్యాంక్లున్నది విజయ్ మాల్యా లాంటి వారి కోసం కాదు’
ముంబై : మోదీ నాయకత్వం మీద, విధానాల గురించి జనాలకు ఎటువంటి అనుమానం లేదని అంటున్నారు ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ అందరిలాంటి వారు కాదు. ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలకు విరుద్ధం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారా’ అని అడగ్గా.. ఇలాంటి రాజకీయ ప్రశ్నలకు సమాధనం ఇచ్చి సమస్యలను కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నారు రామ్‌దేవ్. అయన మాట్లాడుతూ.. ఒక విషయం అయితే చెప్పగలను.. మోదీ నాయకత్వం, విధానల పట్ల జనాలకు ఇంకా నమ్మకం ఉంది. మోదీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయరు అంటూ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమీ మాత్రమే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగల్గుతుందని పేర్కొన్న రాందేవ్.. ఈ సందర్భ్ంగా నల్లధనం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల ధనం సమానంగా ఉంది. అయితే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బును ఏం చేయాలి అని. ఈ మొత్తాన్ని వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి ఉత్పత్తి రంగాలకు కేటాయిస్తే మంచిదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారిందని తెలిపారు. అయితే మరిన్ని సంస్థలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు కూడా ఇందుకు సహాకారం తెలపాలని కోరారు. సాయం కావాలని బ్యాంకుకు వచ్చిన వారిలో విజయ్ మాల్యా ఎవరో.. నిజాయతి పరుడు ఎవరో గుర్తించగలగే సామార్థ్యం బ్యాంక్‌లకు ఉండాలని తెలిపారు. ఎందుకంటే బ్యాంకులున్నది నిజాయతిపరుల కోసం కానీ విజయ్ మాల్లా లాంటి వారి కోసం కాదని వ్యాఖ్యానించారు. -
మాల్యా వచ్చేదెపుడు?
బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి రెండేళ్లక్రితం దేశం విడిచి పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను తిరిగి రప్పించే ప్రయత్నంలో తొలి విజయం లభించింది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయన్ను తిరిగి భారత్‌కు అప్ప గించడం సబబేనని సోమవారం తీర్పునిచ్చింది. విజయ్ మాల్యా దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలతో, బడా నాయకులతో ఎలా చెట్టపట్టాలేసుకుని తిరిగేవాడో అందరికీ తెలుసు. అందుకే ఆయనకు సులభంగా అప్పు దొరికేది. ఒక్క మాల్యాకు మాత్రమే కాదు... దేశంలోని బడా పారి శ్రామికవేత్తలందరికీ బ్యాంకులు ఎప్పుడూ ఎర్ర తివాచీలు పరుస్తూనే ఉన్నాయి. వారిలో చాలా మంది ఎగ్గొట్టే అవకాశం ఉన్నదని తెలిసినా ఇదే వరస. రైతులకు బ్యాంకుల్లో అప్పు దొరకడమే అరుదు. దొరికినా వారు విధించే సవాలక్ష నిబంధనలు అందుకు ఆటంకంగా నిలుస్తాయి. పర్యవసానంగా వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటారు. కష్టాల సాగుతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు విజయ్ మాల్యా కేసును విచారించిన సందర్భంలో అక్కడి న్యాయస్థానం మన బ్యాంకులపై చేసిన వ్యాఖ్యలు గమనిం చదగ్గవి. రుణాలివ్వడానికి ముందు, తర్వాత కూడా భారతీయ బ్యాంకులు ఆయన మోసాన్ని గ్రహించడంలో విఫలమయ్యాయని న్యాయమూర్తి ఎమ్మా అర్బుత్నాట్ విమర్శించారు. ఇది ఉద్దేశ పూర్వకమైన వైఫల్యమా, అమాయకత్వం వల్ల జరిగిందా అన్నది తేల్చడానికి అవసరమైన సాక్ష్యా ధారాలు తన ముందు లేవని వ్యాఖ్యానించారు. ఆమెకు మాల్యా కేసు ఒక్కటే రావడంవల్ల స్పష్టత వచ్చి ఉండదుగానీ... ఎగవేతదార్ల వివరాలు, వారికి సంబంధించిన పత్రాలన్నీ ఇస్తే మన దేశం లోని బ్యాంకింగ్ వ్యవస్థను చూసి ఎమ్మాకు కళ్లు తిరిగేవి. ఒకసారి ఒకరి దగ్గర మోసపోతే అమాయకులుగా జమకట్టొచ్చు. కానీ అది రివాజుగా మారినప్పుడు దాన్ని అమాయకత్వం అనరు. కుమ్మక్కు అంటారు. మన దేశంలో జరుగుతున్నది అదే. బ్యాంకుల్ని మోసగించే ప్రక్రియ భారీ యంత్రపరికరాలు దిగుమతి చేసుకోవడం దగ్గరనుంచి మొదలవుతుంది. వాటి వ్యయాన్ని అధికంగా చూపి, ఆ మేరకు అప్పు చేయడంతో మొదలై వివిధ దశల్లో కోట్లాది రూపాయల రుణం తీసుకుంటారు. ఇవన్నీ నిర్దిష్ట కాల వ్యవధిలో చెల్లిస్తుంటే పేచీ ఉండదు. కానీ వారి ఉద్దేశాలే వేరు. అప్పు తీసుకునేది తీర్చడానికి కాదు...ఎగ్గొట్టడానికి. తాము తీర్చకపోయినా ఎవరూ చడీ చప్పుడూ చేయరని, ఏళ్లూ పూళ్లూ గడిచాక వన్ టైమ్ సెటిల్మెంట్ కింద, వడ్డీ మాఫీ కింద స్వల్ప మొత్తాలు కట్టించుకుని తమను సులభంగా వదిలేస్తారన్నది వారి భరోసా. ఇలా ఉద్దేశపూర్వకంగా అప్పులు తీర్చకుండా మొహం చాటేస్తున్నవారి వివరాలు వెల్ల డించాలని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని నాలుగు నెలలక్రితం కేంద్ర సమాచార హక్కు కమిషన్(సీఐసీ) కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు, రిజర్వ్‌బ్యాంకును ఆదేశించింది. రూ. 50 కోట్లకు మించి బకాయిపడ్డవారందరి వివరాలూ అందులో ఉండాలని స్పష్టం చేసింది. ఇందులో వైపరీత్యమేమీ లేదు. రైతులు బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైతే వారు తనఖా పెట్టిన ఆస్తుల్ని వేలం వేస్తామని బ్యాంకు సిబ్బంది వారి ఇళ్లకెళ్లి బెదిరిస్తారు. నోటీసులు పంపుతారు. కొన్ని సందర్భాల్లో అలాంటి రైతుల ఫొటోలు ఆ బ్యాంకు శాఖల్లో ప్రదర్శిస్తారు. బకాయిలు చెల్లించని వారి చరాస్తుల స్వాధీనం ప్రక్రియలో ఆల స్యమేమీ ఉండదు. రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) చట్టం కింద చరాస్తులు స్వాధీనం చేసుకోవడం అత్యంత సులభం. దీన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారుల విషయంలో కూడా ఇలాగే చేయాలని ఎవరూ పట్టుబట్టడం లేదు. కనీసం వారి పేర్లు బహిరంగపరచమని అడుగుతున్నారు. సీఐసీ కోరింది కూడా అదే. కానీ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పినా కదలని కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌బ్యాంకు సీఐసీ ఆదేశిస్తే కదులుతాయా? వరసగా మూడు నెలలపాటు వడ్డీ చెల్లించని రుణాలుంటే వాటిని మొండి బకాయిలుగా పరిగణిస్తారు. వాటిని వసూలు చేసుకోవడం ఎలా అన్న ఆత్రుత అప్పటినుంచి మొదలవుతుంది. కానీ ఇలాంటి బకాయిల సంగతి బయటపెడితే ఖాతాదారుల్లో తమ విశ్వసనీయత దెబ్బ తింటుందన్న కారణంతో బ్యాంకులు ఏం జరగనట్టు ఉండిపోతాయి. అలాగని మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా చూడవు. ఎటూ మొండి బకాయిల సంగతి వెల్లడికాదన్న ధీమాతో, తమకేమీ జరగదన్న భరోసాతో ఇష్టానుసారం రుణాలివ్వడం కొనసాగిస్తున్నారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ లాంటివారు ఈ ధోరణిని ఆసరాగా తీసుకునే వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు. ఇలాంటివారు దేశం విడిచిపారిపోతుంటే అన్ని వ్యవస్థలూ సహకరిస్తున్నాయి. ఇప్పుడు బ్రిటన్ కోర్టు ఇచ్చిన అప్పగింత ఆదేశాలు తమ విజయమని కేంద్రం చెప్పుకుంటోంది. అయితే వీటివల్ల వల్ల ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ ఉండదు. ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాలు చేస్తాడు. అక్కడ తీర్పు వెలువడటానికి మరికొంతకాలం పడుతుంది. ఆ తీర్పు తనకు అను కూలంగా లేకపోతే విజయ్‌మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు. అక్కడ సైతం మాల్యాకు భంగపాటు ఎదురయ్యాక కాస్త ఆశ పెట్టుకోవచ్చు. అది కూడా గ్యారెంటీ లేదు. దావూద్ ఇబ్రహీం అనుచరుడు టైగర్ హనీఫ్ కేసులో అన్ని అవరోధాలూ అధిగమించి అయిదేళ్లు కావస్తున్నాఇంకా అతన్ని ఇక్కడకు రప్పించడం సాధ్యపడటం లేదు. విజయ్ మాల్యా వ్యవహారం సాధ్య మైనంత త్వరగా ముగిసేలా చూడటంతోపాటు ఎగవేతదార్ల జాబితా ప్రకటించటం, బకాయిల వసూళ్లకు గట్టిగా ప్రయత్నించటం, రుణాల మంజూరుకు పకడ్బందీ నిబంధనలు రూపొందించటం అత్యవసరం. -
మాల్యా నుంచి ఆఫర్ రాలేదు
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి సెటిల్మెంట్కు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి ఆఫర్ రాలేదని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టంచేశారు. ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్బీఐ సారథ్యం వహిస్తోంది. మాల్యా భారత్‌కు తిరిగి వస్తే రుణాల రికవరీ ప్రక్రియ వేగం కాగలదని చెప్పారాయన. తీసుకున్న రుణాల్లో అసలును తిరిగి ఇచ్చేస్తానని తాను ఆఫర్ చేస్తున్నా బ్యాంకులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల్యా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీష్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ.9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ అక్కడి కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. రుణాలు ఎగ్గొట్టిన వారు ఎక్కడికి పారిపోయినా తప్పించుకోలేరనడానికి మాల్యా ఉదంతం నిదర్శనం కాగలదని కుమార్ చెప్పారు. ‘రుణాల రికవరీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. రుణాలు ఎగ్గొట్టేసి, దేశం నుంచి పారిపోయినా తప్పించుకోలేరన్నది మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు తీర్పు ద్వారా స్పష్టమవుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. నీరవ్‌ను కూడా తెప్పించే అవకాశాలు.. మాల్యా ఉదంతం నేపథ్యంలో రూ.13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను రప్పించే ప్రక్రియ కూడా వేగవంతం కాగలదని రజనీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మాల్యా అప్పగింతతో మొత్తం రుణదాతలు, రుణగ్రహీతల మధ్య సంబంధాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారాయన. ‘దేశానికి పెట్టుబడులు అవసరం. ఇటు రుణదాతలకు, అటు గ్రహీతలకు రుణ లావాదేవీలు ముఖ్యం. కానీ ఇవి పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉండాలి. బ్యాంకులు కూడా దేనికోసం రుణాలిస్తున్నాయో ఒకటికి రెండు సార్లు చూసుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని రజనీష్ చెప్పారు. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాపై తాను స్పందించబోనని ఆయన చెప్పారు. పటేల్ తప్పుకున్న దరిమిలా.. ఒక్క రోజు డిఫాల్ట్ అయినా మొండిబాకీగా పరిగణించాలంటూ ఆర్బీఐ విధించిన నిబంధనల్లో మార్పులుంటాయా లేదా అన్నది అంచనా వేయడం కష్టమన్నారు. మొండిబాకీలు పేరుకుపోయిన విద్యుత్ కంపెనీలకు సంబంధించి.. ఆరు లేదా ఏడు సంస్థల కేసులు త్వరలో పరిష్కారం కాగలవని రజనీష్ తెలియజేశారు. -
మాల్యాను భారత్‌కు అప్పగించండి
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగవేసి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను స్వదేశం తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు మంగళవారం అంగీకరించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ పరిణామం ఎన్డీయే ప్రభుత్వానికి గొప్ప విజయమని భావిస్తున్నారు. మాల్యాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టిన ఆనవాళ్లు కనిపించడం లేదని ఈ తీర్పును వెలువరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు చీఫ్ జడ్జి ఎమ్మా అర్బుత్నాట్ తెలిపారు. భారత్ సమర్పించిన ఆధారాల్ని పరిశీలించిన మీదట కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించినంత మాత్రాన ఆయన మానవ హక్కులకు భంగం వాటిల్లదని పేర్కొన్నారు. మాల్యా తన కంపెనీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపి బ్యాంకులను మోసిగించారని ఆరోపించారు. విలాసాలకు అలవాటుపడిన ఈ వ్యాపారవేత్త తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందారని పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ సాజిద్ జావిద్.. మాల్యా అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయనున్నారు. ఈ కేసును సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు అప్పగించడాన్ని మాల్యా లాయర్ల బృందం యూకే హైకోర్టు అనుమతితో 14 రోజుల్లోగా సవాలు చేయొచ్చు. ఒకవేళ మాల్యా లాయర్ల బృందం కోర్టు తీర్పును సవాలుచేయకుంటే జావిద్ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి 28 రోజుల్లోగా ఆయన్ని భారత్‌కు అప్పగిస్తారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ కోర్టు ఆదేశాల్ని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ స్వాగతించాయి. యూపీఏ హయాంలో లబ్ధిపొందిన మాల్యాకు శిక్ష విధించడానికి ఎన్డీయే భారత్‌కు తీసుకొస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఆ ఆఫర్ బూటకం కాదు: మాల్యా అంతకుముందు, మాల్యా కోర్టు ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడుతూ...బ్యాంకులకు అసలు మొత్తాన్ని చెల్లిస్తానని గతంలో చేసిన ప్రకటన బూటకం కాదని అన్నారు. బ్యాంకుల డబ్బును దొంగిలించానని తనపై వస్తున్న కథనాల్ని తోసిపుచ్చారు. ‘రుణాల్ని తిరిగి చెల్లిస్తానని కర్ణాటక హైకోర్టుకు తెలిపాను. ఈ ఆఫర్‌కు అప్పగింత కేసు విచారణకు సంబంధం లేదు. చెల్లించాల్సిన రుణాల కన్నా నా ఆస్తుల విలువే ఎక్కువ’ అని తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి వచ్చాక తొలుత కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తానని వెల్లడించారు. జైలు సిద్ధం.. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఓ గదిని అధికారులు సిద్ధం చేశారు. జైలు ప్రాంగణంలో రెండంతస్తుల భవనంలో పటిష్ట భద్రత, నిరంతర నిఘా ఉండే చెరసాలలో ఆయన్ని ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జైలులో అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలు అమలుచేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ముంబై దాడులకు పాల్పడి సజీవంగా చిక్కిన ఏకైక ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైలులోనే నిర్బంధించారు. ప్లేబాయ్ మాయలో బ్యాంకులు! సీబీఐ, ఈడీలు మోపిన నేరాభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందేనని జడ్జి ఎమ్మా అర్బుత్నాట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న బెయిల్ షరుతులే ఇకపైనా వర్తిస్తాయని తెలిపారు. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబై జైలులోని పరిస్థితులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మధుమేహం, హృద్రోగ సమస్యలు తలెత్తితే మాల్యాకు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారని, జైలులో ఆయనకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. మాల్యాకు బ్యాంకులు అంత భారీ మొత్తంలో రుణాలు మంజూరుచేసిన విధానాన్ని తప్పుపట్టారు. ‘మాల్యాకు రుణాలు మంజూరు చేసిన విషయంలో వ్యవస్థాగతంగా కొన్ని లోపాలతో పాటు ఆర్థికపర దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ సమర్పించిన ఆధారాలతో ఏదీ స్పష్టంగా తెలియట్లేదు. లేదంటే, విలాస పురుషుడు, ప్రముఖుడు, ఎప్పుడూ చుట్టూ బాడీగార్డులను ఉంచుకునే, ఆభరణాలు ధరించే ఆ ప్లేబాయ్ మాయలో బ్యాంకులు పడిపోయి ఉంటాయి. బ్యాంకులు తమ నిబంధనల్ని సైతం పక్కన పెట్టేలా ఆయన ఏదో మంత్రం వేసి ఉంటారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. రూ.9 వేల కోట్ల మేర మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాల్యా గతేడాది ఏప్రిల్‌లో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. మాల్యాను భారత్ ఇది వరకే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మాల్యా కేసు పూర్వాపరాలు 2005 మే 9: ‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్’ పేరిట వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించిన విజయ్‌మాల్యా 2013: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తమవద్ద తీసుకున్న రూ.6,494 కోట్లు తిరిగి చెల్లించాలని మాల్యాను కోరిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 2016 మార్చి3: భారత్ నుంచి పారిపోయి ఆశ్రయం కోసం లండన్ చేరిన మాల్యా 2017 ఫిబ్రవరి: మాల్యాను అప్పగించాలని బ్రిటన్ను కోరిన భారత్ 2017, ఏప్రిల్ 18: మాల్యాను అరెస్టుచేసి సెంట్రల్ లండన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన స్కాట్లాండ్ పోలీసులు. వెనువెంటనే దాదాపు రూ.6కోట్ల విలువైన షూరిటీ పత్రాలు సమర్పించి బెయిలుపై బయటికొచ్చిన మాల్యా. 2017, డిసెంబర్ 4: భారత్‌కు మాల్యా అప్పగింత కేసు విచారణ మొదలు. 2017, డిసెంబర్ 14: భారత్ తరఫు నుంచి, మాల్యా తరఫు నుంచి వారి వాదనలను బలపరిచే పూర్తిస్థాయి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. 2018 ఏప్రిల్ 27: మాల్యాపై అభియోగాలను రుజువుచేస్తూ కోర్టుకు భారత్ సమర్పించిన నివేదికలను సాక్ష్యాలుగా స్వీకరించేందుకు అంగీకరించిన కోర్టు. 2018 జూలై 31: భారత్‌కు అప్పగిస్తే ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో మాల్యాను నిర్భంధించే గది వీడియోను కోరిన కోర్టు. 2018 సెప్టెంబర్ 12: భారత్ వీడి లండన్‌కు వచ్చే ముందు ఆర్థికమంత్రి జైట్లీని కలిసే వచ్చానని ప్రకటించిన మాల్యా. అబద్ధమని కొట్టిపారేసిన జైట్లీ డిసెంబర్ 10: మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు మహిళా జడ్జి ఎమ్మా అర్బుత్నాట్. -
బ్రిటన్ కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ
లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బ్రిటన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంలో సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. భారత ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించారు. మరోవైపు తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని మాల్యా వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం భారత ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ.. నేడు తీర్పు వెలువరించింది. కాగా, మాల్యాకు ఈ తీర్పుపై 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. -
మరికాసేపట్లో మాల్యా అప్పగింతపై నిర్ణయం
లండన్ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ బ్రిటన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామికవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడంపై బ్రిటన్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులు ఉంటాయని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. బ్యాంకులకు రుణ బకాయిల్లో అసలు మొత్తాన్ని చెల్లిస్తానని, తన ఆఫర్‌ను స్వీకరించాలని విజయ్ మాల్యా పదేపదే బ్యాంకులను కోరుతున్నారు. కాగా, సెటిల్మెంట్కు అంగీకరించాలని బ్యాంకులను కోరుతూ తనపై చర్యల తీవ్రతను తగ్గించడంతో పాటు ఆస్తుల స్వాధీన ప్రక్రియను అడ్డుకునేందుకు మాల్యా ప్రయత్నిస్తున్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీలు బ్రిటన్ కోర్టులో బలంగా వాదించాయి. మాల్యా అప్పగింతపై కీలక నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు లండన్‌కు తరలివెళ్లారు. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడితే దాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని మాల్యా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మాల్యా అప్పగింతకు కోర్టు నిరాకరిస్తే నిర్ధిష్ట గడువులోగా సీబీఐ హైకోర్టులో వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పును సవాల్ చేసే అవకాశం ఉంటుంది. -
మాల్యా అప్పగింతపై నేడు బ్రిటన్ కోర్టు తీర్పు
లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అప్పగింతకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం భావించిన పక్షంలో తుదినిర్ణయం తీసుకునేందుకు ఈ కేసును బ్రిటన్ హోంశాఖకు పంపవచ్చని న్యాయనిపుణులు జైవాలా అండ్ కో మేనేజింగ్ పార్ట్నర్ పావని రెడ్డి తెలిపారు. ప్రతికూల ఉత్తర్వులు వచ్చిన పక్షంలో ఇరు వర్గాలు (మాల్యా, భారత ప్రభుత్వం) 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అప్పీలు చేసుకోకపోతే 28 రోజుల్లోగా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు అమల్లోకి (ప్రభుత్వం కూడా ఏకీభవిస్తే) వస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న దాదాపు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా .. బ్రిటన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఆయన్ను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
మాల్యాకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతకేసులో తనను పరారీలో ఉన్న నేరస్ధుడిగా ఈడీ ప్రకటించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాలను చెల్లించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని, తనపై విచారణను నిలిపివేయాలని విజయ్ మాల్యా ఈ ఏడాది నవంబర్ 22న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని కాదని సెప్టెంబర్‌లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్ట (పీఎంఎల్ఏ) న్యాయస్ధానానికి నివేదించారు. మనీల్యాండరింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. రూ 9000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు మాల్యాపై అభియోగాలు నమోదు చేశాయి. న్యాయస్ధానాలు ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించడంతో లండన్‌లో తలదాచుకున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. మాల్యా అప్పగింతపై వచ్చేవారం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తాను బ్యాంకు రుణాల అసలు మొత్తం చెల్లించేందుకు సిద్ధమని, తన ప్రతిపాదనను బ్యాంకులు అంగీకరించాలని రెండు రోజుల కిందట మాల్యా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. -
ఆ పదం తొలగించాలని సుప్రీం ముందుకు మాల్యా
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు రూ 9000 కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడైన లిక్కర్ కింగ్, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తనను పరారీలో ఉన్నట్టు ఈడీ పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన పేరుకు ముందు పరారీ పదాన్ని తొలగించాలని ఆయన కోరారు. బ్యాంకులకు వేల కోట్ల రుణ బకాయిల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016, మార్చి 2న భారత్‌ను విడిచివెళ్లి బ్రిటన్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థల చార్జ్షీట్ల ఆధారంగా న్యాయస్ధానం ఆయనను ఉద్దేశపూరిత ఎగవేతదారుగా ప్రకటించగా, పరారీలో ఉన్న ఎగవేతదారుగా ఈడీ నిర్ధారించింది. కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ భారత్ దాఖలు చేసిన పిటిషన్ వచ్చే వారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణకు రానున్న క్రమంలో తాను గతంలో కర్నాటక హైకోర్టు ముందుంచిన సెటిల్మెంట్ ప్రతిపాదనకు అంగీకరించాలని బ్యాంకులను కోరారు. రుణంలో అసలు మొత్తం చెల్లించేందుకు ఇటీవల మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న రుణాల్లో అత్యధిక మొత్తం నష్టాల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు మళ్లించామని, యునైటెడ్ బ్రూవరీస్ వంటి లిక్కర్ వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఖజానాకు తమ సంస్ధలు అత్యధిక రాబడిని సమకూర్చాయని మాల్యా గుర్తు చేశారు. -
జాదూగర్ మాల్యా
-
రుణాల్లో అసలు తీర్చేస్తా..
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా అప్పుల్లో అసలు భాగం మొత్తాన్ని తీర్చేసేందుకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని నూటికి నూరు శాతం చెల్లించేస్తానని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘ఈ అంశం ముఖ్యంగా ప్రజాధనంతో ముడిపడి ఉంది. (పెరిగిపోతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్) నష్టాలను తట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కుమ్మరించాల్సి వచ్చింది. అక్కడికీ రుణంలో అసలు భాగాన్ని 100 శాతం తిరిగి చెల్లించేస్తానని బ్యాంకులు, ప్రభుత్వానికి ఆఫర్ చేస్తున్నాను. దయచేసి తీసుకోవాలని కోరుతున్నాను. దీనికి నిరాకరిస్తే.. ఎందుకు నిరాకరిస్తున్నారన్నదైనా తెలపాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పక్షాలు, మీడియా తనపై కావాలనే ‘డిఫాల్టర్’ అనే తప్పుడు ముద్ర వేశాయని మాల్యా ఆక్రోశం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల సొమ్ముతో పరారయ్యానని, డిఫాల్టర్ అని రాజకీయ పక్షాలు, మీడియా ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా అబద్ధం. రుణాల వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటానంటూ కర్ణాటక హైకోర్టుకు నేను సమర్పించిన సమగ్ర ఆఫర్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. ఇది బాధాకరం‘ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, బ్రిటన్ తనను భారత్‌కు అప్పగించే విషయంలో మీడియా ఏవేవో రాస్తోందని, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాల్యా తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న రూ. 9,000 కోట్ల రుణాన్ని ఎగవేసిన మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు పరారైన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యా ట్వీట్ల సంచలనం
ఆర్థిక నేరస్తుడు, లిక్కర్‌బ్యారన్ విజయ్ మాల్యా (62) మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. రూ. 9వేలకోట్లకు పైగా రుణాలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్‌కు చెక్కేసిన మాల్యా ట్వీట్లు ఇపుడు సంచలనంగా మారాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద తీసుక్ను రుణాలు మొత్తం (100 శాతం) ఆయా బ్యాంకులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బుధవారం ట్వీట్ చేశాడు. మొత్తం రుణాలను తిరిగి చెల్లించాలనే తన ప్రతిపాదనను అంగీకరించాలంటూ వరుస ట్వీట్లలో బ్యాంకులను అభ్యర్థించాడు. అదీ అగస్టా వెండ్ల్యాండ్ కేసులో మాకెల్ను స్వదేశానికి రప్పించిన కేవలం కొన్ని గంటల్లోనే మాల్యా స్పందించడం విశేషం. అధిక ఇంధన ధరలతో విమానయాన సంస్థలు పాక్షికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ధరాభారంతో నష్టాలెదుర్కొంటున్న తన సంస్థ కింగ్‌ఫిషర్ కోసం బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలను తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. బారెల్ చమురు140 బిలియన్ డాలర్ల గరిష్ఠ ధరకు చేరడంతో బంగారంలాంటి తన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మరింత నష్టాల్లోకి కూరుకుపోయిందనీ, అయితే ప్రధాన మూలధనాన్ని 100శాతం తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసిన అంగీకరించాలంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు రాజకీయ నాయకులు, మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మరోసారి పాత పల్లవినే ఎత్తుకున్నాడు. కాగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్(57)ను దుబాయ్ నుంచి ఇండియాకు రప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించే కేసులో మరో 5రోజుల్లో(డిసెంబరు 10) లండన్ కోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే రుణాలు మొత్తం చెల్లిస్తానని మాల్యా ప్రకటించడం ఇదే మొదటిసారికాదు...అలాగే బ్యాంకులు ఈ ప్రతిపాదనను నిరాకరించాయి కూడా. వేలకోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి తేవడానికి కేంద్రం చర్యల్ని వేగవంతం చేయడంతో మాల్యా గుండెల్లో గుబులు మొదలైనట్టుందని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. Airlines struggling financially partly becoz of high ATF prices. Kingfisher was a fab airline that faced the highest ever crude prices of $ 140/barrel. Losses mounted and that’s where Banks money went.I have offered to repay 100 % of the Principal amount to them. Please take it. — Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018 For three decades running India’s largest alcoholic beverage group, we contributed thousands of crores to the State exchequers. Kingfisher Airlines also contributed handsomely to the States. Sad loss of the finest Airline but still I offer to pay Banks so no loss. Please take it. — Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018 -
మాల్యాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. లండన్ హౌస్ తనఖా పెట్టి తీసుకున్నరుణాలను యూబీఎస్‌కు తిరిగి చెల్లించాలంటూ బుధవారం యూకే కోర్టు మాల్యా షాక్ ఇచ్చింది. మరోవైపు ఫ్యుజిటివ్ ఆర్థిక నేరస్థుల చట్టం కింద చర్యలపై బోంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుల చట్టం 2018 కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను నిలిపివేయాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం తోసి పుచ్చింది. కోట్ల రూపాయలను స్వదేశీ బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టాలనే లక్ష్యంగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టమే ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్ళ చట్టం -2018. ఈ చట్టం ప్రకారం విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ఈడీ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని నిలిపివేయాలంటూ మాల్యా పెట్టుకున్న పిటిషన్ తాజాగా కోర్టు తిరస్కరించింది. బంగారు టాయిలెట్ పాయే? స్విస్‌బ్యాంకు యూబీఎస్‌కు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని యూకే బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గడువు లోపు ఈ డబ్బును చెల్లించకపోతే.. లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూబీఎస్‌కు గ్రీన్ సిగ్నల్‌వచ్చినట్టేనని, దీంతో మాల్యా బంగారు టాయెలెట్ పోయినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నాయకత్వంలోని 13బ్యాంకుల కన్సార్షియానికి రూ.9వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల జప్తుపై ఎస్బీఐ కన్సార్షియానికి అనుకూలంగా యుకె హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనకు దాదాపు రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం. -
మాల్యాకు యూకే కోర్టు భారీ షాక్
భారత్‌లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.9వేల వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా(62)కు యూకేకోర్టు షాక్ ఇచ్చింది. మాల్యా లండన్ హౌస్‌కు సంబంధించి యూబీఎస్(యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్) వద్ద తీసుకున్నరుణాలపై కోర్టు కీలక తీర్పు చెప్పింది. స్విస్‌బ్యాంకు యూబీఎస్‌కు సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా నిర్ధారించిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందకు భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే లండన్‌లో పలు కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్నాడు. తాజా తీర్పు మాల్యాకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. యుబిఎస్ బ్యాంకు తనకు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూకే హైకోర్టును ఆశ్రయించింది. మాల్యా కుటుంబానికి చెందిన రోజ్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ విలాసవంతమైన నివాస సముదాయం నిర్మాణం కోసం రీజెంట్స్ పార్క్ ఇంటిని యుబిఎస్ గ్రూప్ దగ్గర తనఖా పెట్టి రుణం తీసుకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మాల్యా సుమారుగా 1 బిలియన్ పౌండ్ల రుణాలకు (దాదాపు రూ.10,000 కోట్లు) సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు భారత్, యుకెలలో సివిల్ దావాలు, క్రిమినల్ మోసం ఆరోపణలు ఉన్నాయి. కాగా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్‌కు చెక్కేసిన కేసులో గత ఏడాది డిసెంబరు 4న లండన్ కోర్టులో విచారణ మొదలైన సంగతి తెలిసిందే. -
మాల్యా ఫోర్స్ ఇండియా వేలంలో గోల్మాల్!
లండన్: లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టుకోలేక తంటాలు పడుతున్న భారతీయ బ్యాంకులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మాల్యాకు చెందిన ఫార్ములా వన్ రేసింగ్ టీమ్ ఫోర్స్ ఇండియా విక్రయంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రధాన బిడ్డర్లలో ఒకటైన రష్యా ఫెర్టిలైజర్ గ్రూప్ యురాల్కలి ఆరోపించింది. గతవారంలో ఈ వేలం ప్రక్రియ పూర్తయింది. అయితే, వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనివల్ల మాల్యాకు రుణమిచ్చిన 13 భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు దాదాపు 4 కోట్ల పౌండ్ల (దాదాపు రూ. 375 కోట్లు)మేర నష్టం వాటిల్లినట్లు యురాల్కలి పేర్కొంది. ఫోర్స్ ఇండియాలో మాల్యాకు చెందిన ఆరంజ్ ఇండియా హోల్డింగ్స్‌కు 42.2 శాతం వాటా ఉంది. యూకే హైకోర్టు భారతీయ బ్యాంకులకు అనుకూలంగా మాల్యా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఫోర్స్ ఇండియా మొత్తం వ్యాపారం, ఆస్తులు, గుడ్‌విల్‌తో కలిపి తాము 10.15–12.2 కోట్ల పౌండ్ల మధ్యలో నగదు రూపంలో చెల్లించేందుకు బిడ్ వేశామని.. కానీ, వేలం నిర్వాహకులు మాత్రం తమ బిడ్‌ను నిరాకరించి ఇంకా తక్కువ బిడ్ వేసిన వారికి కట్టబెట్టారని యురాల్కలి వివరించింది. బిడ్డింగ్ ప్రక్రియలో అక్రమాలు, తమకు జరిగిన అన్యాయానికిగాను భారీ నష్టపరిహారం(కొన్ని కోట్ల డాలర్ల మేర) కోరుతూ లండన్ హైకోర్టులో యురాల్కలి వేలం నిర్వాహకులు ఎప్ఆర్పీ అడ్వయిజరీపై పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలకు లోబడి... వేలంలో ఫోర్స్ ఇడియాను కెనడా బిలియనీర్ లారెన్స్ స్ట్రాల్కు చెందిన రేసింగ్ పాయింట్ కన్సార్షియం దక్కించుకుంది. కాగా, బిడ్డింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సజావుగా పూర్తయిందని ఎఫ్ఆర్పీ అడ్వయిజరీ స్పష్టం చేసింది. భారతీయ బ్యాంకులకు దాదాపు రూ.9,000 కోట్ల మేర రుణాలను ఎగవేసిన మాల్యా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
కాపలాదారుడే దొంగయ్యాడు
డూంగర్పూర్: ప్రధానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దేశమంతటా వీధుల్లో ఒకే మాట వినిపిస్తోందనీ, దేశ కాపలాదారుడు (మోదీ) దొంగగా మారాడని వారంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానిలా కాకుండా కాపలదారుడిలా తాను పనిచేస్తానని గతంలో పలుమార్లు మోదీ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో రాహుల్ గురువారం పర్యటించారు. డూంగర్పూర్ జిల్లాలో ఓ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోదీ మౌనంగా ఉన్నారనీ, బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యాను వెనక్కు రప్పించడంలోనూ విఫలమయ్యారని అన్నారు. ఈ అంశాలపై తాను పార్లమెంటులో ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదనీ, ఈ కారణాల వల్లే ప్రధానిని అంతా దొంగ అంటున్నారని పేర్కొన్నారు. 15 మంది పారిశ్రామిక వేత్తలు తీసుకున్న 2.3 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించి, కష్టపడి పనిచేస్తున్న నాయకులకే ఈసారి టికెట్లు ఇస్తామన్నారు. హాస్య యువరాజు రాహుల్: జైట్లీ, స్మృతి మోదీని రాహుల్ దొంగ అనడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనకు ప్రధాని పదవి అంటే గౌరవం లేకుండా పోయిందని వారు విమర్శించారు. రాహుల్ హాస్య యువరాజుగా మారారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. రాహుల్‌పై ఎదురుదాడి చేస్తూ ఫేస్బుక్లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. రాహులే అన్ని విషయాల్లోనూ తన ప్రభుత్వం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జైట్లీ ఆరోపించారు. జైట్లీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా స్పందించింది. జైట్లీ విదూషకుడిలా వ్యవహరిస్తున్నారంది. -
మాల్యా హెలికాప్టర్లు అమ్మేసారు..
-
మాల్యా చాపర్స్ రూ.8 కోట్లకు పైననే పలికాయి
బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హెలికాప్టర్లను వేలం వేశారు. బెంగళూరులోని డెట్ రికవరీ ట్రైబ్యునల్(డీఆర్టీ-1) ఈ-ఆక్షన్‌ను నిర్వహించి, బిజినెస్ టైకూన్ మాల్యాకు చెందిన రెండు హెలికాప్టర్లను ఢిల్లీకి చెందిన చౌదరి ఏవియేషన్‌కు అమ్మేసింది. ‘మాల్యాకు చెందిన రెండు వ్యక్తిగత హెలికాప్లర్లను తమ కంపెనీ రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఒక్కోటి రూ.4.37 కోట్లు’ అని చౌదరీ ఏవియేషన్ డైరెక్టర్ సత్యేంద్ర సెహ్రావత్ ప్రకటించారు. 17 బ్యాంకుల కన్సోర్టియం తరుఫున రికవరీ కోర్టు ఈ ఈ-ఆక్షన్‌ను నిర్వహించింది. 2007-2012 మధ్య తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా రుణాలను మాల్యా, ఆయనకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ చెల్లించకుండా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం 2016లో మాల్యా దేశం విడిచిపారిపోయారు. తాము కొనుగోలు చేసిన 5 సీటర్ ఎయిర్‌బస్ యూరోకాప్టర్ బీ155 చాపర్స్ 10 ఏళ్ల కాలం నాటివని, ఇవి మంచి డ్యూయల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయని సత్యేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇవి ముంబైలోని జుహు ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ ఈ-ఆక్షన్‌లో మొత్తం మూడు కంపెనీలే పాల్గొన్నాయి. 2008 మోడల్‌కు చెందిన ఒక్కో హెలికాప్టర్ కనీస బిడ్ ధరగా రూ.1.75 కోట్లను నిర్ణయించింది రికవరీ కోర్టు. ఈ చాపర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోనున్నామని సత్యేంద్ర తెలిపారు. చౌదరి ఏవియేషన్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్లను నిర్వహించడమే కాకుండా.. దేశ రాజధాని పరిధిలోని ఆసుపత్రులకు ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను అందజేస్తుంది. ఈ-ఆక్షన్ నిర్వహిస్తున్న విషయాన్ని రికవరీ కోర్టు అసలు మీడియాకు వెల్లడించలేదు. -
మాల్యా పరారీలో ఎవరి పాపం ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశం విడిచి లండన్ పారిపోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సీబీఐ, ఆఖరికి అత్యధికంగా ఆయనకు అప్పు ఇచ్చిన భారతీయ స్టేట్ బ్యాంక్ కారణమయ్యాయి. తాను దేశం విడిచి రావడానికి ముందు అరుణ్ జైట్లీని కలుసుకున్నానని విజయ్ మాల్యా ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. అరుణ్ జైట్లీ, విజయ్ మాల్యా కలుసుకొని ఏం మాట్లాడుకున్నారో ఇటు పార్లమెంట్తోని, అటు ప్రజలతో పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. పైగా తాను లండన్‌ను వెళుతున్నట్లు అరుణ్ జైట్లీకి చెప్పానని విజయ్ మాల్యా చెప్పడం మరింత తీవ్రమైన అంశం. అదే నిజమైతే విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్లకుండా ఆపాల్సిన పూర్తి బాధ్యత దేశ ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీపై ఉంది. ఆ దిశగా ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది కోటి రూకల ప్రశ్న. లండన్ వెళతానన్న విషయం తనకు చెప్పారా, లేదా? అన్న అంశాన్ని ఇప్పటి వరకు జైట్లీ ఖండించక పోవడం గమనార్హం. జైట్లీ, తనను కలసుకున్నానని విజయ్ మాల్యా ప్రకటించిన వెంటనే స్పందిస్తూ తన అప్పాయింట్మెంట్ కోరిన మాట వాస్తవమేగానీ, అయితే ఆయనకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని ముందుగా చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి మాల్యా తన రాజ్యసభ హోదాను దుర్వినియోగం చేసి పార్లమెంట్ ఆవరణలో తనను కలుసుకున్నారని, రుణాల చెల్లింపుల గురించి తనతో మాట్లాడుతానంటే తాను నేరుగా బ్యాంకులతో మాట్లాడాల్సిందిగా సూచించానని చెప్పారు. బ్యాంకుల అలసత్వం 2016, ఫిబ్రవరి 28వ తేదీన సుప్రీం కోర్టు న్యాయవాది దుశ్వంత్ దేవ్ ఇంట్లో విజయ్ మాల్యాకు రుణాలిచ్చిన బ్యాంకర్లంతా సమావేశమయ్యారు. విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని బ్యాంకర్లు అనుమానం వ్యక్తం చేయగా, ఆయన్ని ఆపడం కోసం మరుసటి రోజు అంటే, ఫిబ్రవరి 29న సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా ఎస్బీఐ అధికారులకు దుశ్వంత్ దేవ్ సూచించగా వారు అందుకు అంగీకరించారు. ఆ మరుసటి రోజు దుశ్వంత్ సుప్రీం కోర్టుకు ఇదే విషయమై వెళ్లినా ఎస్బీఐ అధికారులు రాలేదు. ‘నేను సలహా ఇచ్చిన తర్వాత ఏదో జరిగింది’ అని దుశ్వంద్ దేవ్ ఇప్పుడు మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం. మాల్యా మార్చి 2వ తేదీన దేశం విడిచి లండన్ వెళ్లాక, మార్చి ఐదోతేదీన ఎస్బీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అదే ఏడాది మార్చి 10వ తేదీన పార్లమెంట్లో అరుణ్ జైట్లీని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ ఇదే విషయమై ప్రశ్నించారు. అప్పుడు కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. అంతటితో మాల్యా పరారీ విషయాన్ని పాలకపక్షంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మరచిపోయింది. ఇప్పుడు మాల్యా స్వయంగా చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. సీబీఐ చేసిన సాయం ఎక్కువ విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోకుండా ‘ఇమ్మిగ్రేషన్ బ్యూరో’కు జారీ చేసిన ‘లుకౌట్ నోటీసు’ మాల్యాపై ఆర్థిక నేరాల కేసులను విచారిస్తున్న సీబీఐ సడలించిన కారణంగా మాల్యా దర్జాగా దేశం విడిచి లండన్ వెళ్లగలిగారన్నది నిర్వివాద అంశం. మాల్యా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు నిర్బంధంలోకి తీసుకొని తమకు అప్పగించాల్సిందిగా మొదట సీబీఐ ‘లుకౌట్’ నోటీసు జారీ చేయగా, ఆ తర్వాత దాన్ని మాల్యా దేశం విడిచి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తమకు సమాచారం ఇస్తే చాలునని ఆ నోటీసును సడలించింది. ఈ విషయం సీబీఐ డైరెక్టర్‌కు తెలియకుండా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సవరించడం అసాధారణ విషయం. గుజరాత్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన ఏకే శర్మ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు సన్నిహితుడనే విషయం తెల్సిందే. గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రిగా అమిత్ షా ఉన్నప్పుడు వారికి బాగా పరిచయం. అమిత్ షా కారణంగానే సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా శర్మ ఐదేళ్ల కాలానికి నియమితులయ్యారనే ప్రచారం కూడా ఉంది. -
నిందితులుగా బ్యాంకు అధికారులు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రూపాయల అప్పు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాపై అభియోగ పత్రాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో నెలలో దాఖలు చేసే అవకాశం ఉంది. మాల్యాకు చెందిన విమానయాన సంస్థ కింగ్ఫిషర్కు రుణాలు మంజూరు చేయడంలో పాత్ర వహించిన బ్యాంకు అధికారులు, కింగ్‌ఫిషర్ ఉన్నతస్థాయి అధికారులను అభియోగపత్రంలో నిందితులుగా పేర్కొననున్నారని తెలుస్తోంది. కింగ్ఫిషర్కు ఆరువేల కోట్ల రూపాయల రుణాల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ మొత్తాన్ని ఎస్బీఐ నేతృత్వంలో మొత్తం 17 బ్యాంకులు కలిసి మంజూరు చేశాయి. -
మాల్యా లుకౌట్ నోటీసుపై స్పందించిన సీబీఐ
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాపై లుకౌట్ నోటీసు తీవ్రతను మార్చాలన్న నిర్ణయం తగు స్థాయిలో తీసుకున్నదే తప్ప, జేడీ ఏకే శర్మ ఒక్కరిది మాత్రం కాదని సీబీఐ పేర్కొంది. పీఎన్బీని రూ.12వేల కోట్ల మేరకు మోసం చేసిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి వెళ్లడంలోనూ తమ అధికారుల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. మాల్యాపై లుకౌట్ నోటీసును బలహీన పర్చడం వెనుక ప్రధాని మోదీకి సన్నిహితుడైన గుజరాత్ కేడర్ సీబీఐ జేడీ ఏకే శర్మ హస్తముందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈయన కారణంగానే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కూడా పారిపోయారని శనివారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
బాకీ ‘కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో’
లండన్‌లో ఊరికే తిరగడం బాగుంది కానీ, మరీ అదే పనిగా బాగుండబట్టో ఏమో.. ఎప్పుడైనా అలా ఇండియా వెళ్లి, ఎక్కడికీ తిరక్కుండా కొన్నాళ్లు అక్కడే ఉండి రావాలని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తిని కనుక నాక్కొన్ని తప్పవు. ఇండియా రమ్మంటే వెళ్లకపోయినా నష్టం లేదు. ఇంగ్లండ్ వెళ్లమనకుండా వెళితేనే.. వీళ్ల చట్టాన్ని అగౌరవపరిచినట్లవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించినా ఇంగ్లండ్ ‘సర్లే’ అంటుంది కానీ, అగౌరవపరిస్తే మాత్రం.. ‘ఇదేనా నీ దేశం నీకు నేర్పిన సంస్కారం?’ అని ప్రశ్నిస్తుంది. ‘‘ఇండియాలో ఇలాక్కాదు’’ అన్నాను మా ఇంగ్లండ్ లాయర్‌తో.. కోర్టు మెట్లు ఎక్కుతూ. ‘‘ఎలాక్కాదూ?’’ అన్నాడు ఇంగ్లండ్ లాయర్. ‘‘ఇండియాలో చట్టాన్ని గౌరవించక పోయినా ఏం కాదు. ఉల్లంఘిస్తేనే అవుతుంది’’ అన్నాను. ‘‘ఏమౌతుంది?’’ అన్నాడు. ‘‘చాలానే అవుతుంది. మనమేదో తప్పుచేసినట్లు అంతా మనల్ని చూసి తప్పుకుని పోతారు. ఆర్థికమంత్రి తప్పుకుని పోతాడు. అపోజిషన్ లీడర్ తప్పుకుని పోతాడు. సీబీఐ డైరెక్టర్ తప్పుకుని పోతాడు. అప్పులిచ్చిన బ్యాంకు చైర్మన్లు కూడా తప్పుకుని పోతారు’’ అని చెప్పాను. ‘‘అంత స్ట్రిక్టుగా ఉంటుందా?’’ అని ఆశ్చర్యపోయాడు ఇంగ్లండ్ లాయర్. ‘‘అవును. అంత స్ట్రిక్టుగా ఉంటారు. ‘కనీసం హాయ్ చెప్పినా, హాయ్ చెప్పరు. చూసీ చూడనట్లు తలతిప్పేసుకుంటారు’’ అన్నాను. ‘‘బార్బేరియస్. పౌరుల్ని ఇంత అంటరానివారిగా చూసే దేశంలో మీరెందుకుండాలి! ఇక్కడే ఉండిపోండి మిస్టర్ మాల్యా’’ అన్నాడు.. నన్ను దగ్గరికి లాక్కుంటూ! ‘‘ఏంటి లాక్కుంటున్నారు?’’ అన్నాను. ‘‘నీ పక్కన నేనున్నాను. ఇంగ్లండ్ ఉంది’’ అన్నాడు. అతడివైపు కృతజ్ఞతగా చూశాను. ‘నీ పక్కన నేనున్నాను’.. ఎంత గొప్ప మాట! ఈ మాట రాహుల్ గాంధీ అనలేకపోయాడు. మోదీ అనలేకపోయాడు. జైట్లీ అనలేకపోయాడు. రాజ్యసభలో ఉన్నప్పుడు ఆ కాంపౌండ్‌లో ఓ రోజు జైట్లీ పక్కనే కాసేపు నడిచాను. అయినా ఆయన ఆ మాట అనలేకపోయాడు. నడిచి, నడిచి నేనే అన్నాను.. ‘జైట్లీజీ.. మీ పక్కన నేనున్నాను’ అని. ఆగాడు. ‘‘జైట్లీజీ.. మీ బాల్‌పెన్ ఒకసారి ఇవ్వండి’’ అన్నాను. ఆయన ఇవ్వబోయేలోపే.. ‘‘నా దగ్గరుంది తీస్కోండి’’ అనే మాట వినిపించింది. పక్కకు తిరిగాను. ‘‘వావ్! మీరు మాల్యా కదా. హెయిర్‌స్టెయిల్ మార్చినట్లున్నారు’’ అని బాల్‌పెన్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఏ పార్టీ సభ్యుడో గుర్తుకు రాలేదు. బాల్‌పెన్‌తో నా అరిచేతిలో పద్నాలుగు వేలు మైనెస్ తొమ్మిది వేలు ఈజ్ ఈక్వల్ టు ఐదు వేలు అని రాసి, జైట్లీజీకి చూపించాను. ‘‘ఏంటది?’’ అన్నాడు. ‘‘నా ఆస్తులన్నీ అమ్మితే పద్నాలుగు వేల కోట్లొస్తాయి జైట్లీజీ. నాకున్న తొమ్మిదివేల కోట్ల బ్యాంకు అప్పులు కట్టేస్తే.. నా దగ్గరే ఇంకా ఐదు వేల కోట్లు మిగిలుంటాయి’’ అని చెప్పాను. ‘‘నీ ఇష్టం నీ కోట్లు. కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో. నాకెందుకు చెబుతున్నావ్?’’ అని, చెబుతున్నది వినకుండా వెళ్లిపోయాడు జైట్లీ. ఆలోచిస్తుంటే.. ఇప్పుడనిపిస్తోంది! ‘నీ పక్కన నేనున్నాను’ అని మా ఇంగ్లండ్ లాయర్ అన్న మాటలాగే.. ‘కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో’ అనే మాట.. ఎంత గొప్ప మాటో కదా అనిపిస్తోంది! -
మాల్యా కేసు : టాప్ సీబీఐ ఆఫీసర్‌పై ఆరోపణలు
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంలో ఒక్కొక్కరూ బుక్కవుతున్నారు. తాను దేశం విడిచి పారిపోవడం అరుణ్ జైట్లీకి తెలుసని మూడు రోజుల క్రితం విజయ్ మాల్యా వెల్లడించగా.. సీబీఐ అధికారుల అలసత్వం ప్రదర్శించడంతోనే మాల్యా పరారైనట్టు నిన్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే ఆరోపించారు. తాజాగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ వల్లే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోగలిగాడని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. మాల్యా కోసం ఇచ్చిన లుక్ ఔట్ నోటీసులను ఆయన బలహీనపరిచే పారిపోయేందుకు కారణమయ్యారని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.ఇదే అధికారి నీరవ్ మోదీ, మెహుల్ చోస్కీల పరారీ ప్రణాళికల కోసం పని చేశారని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకంగా చూసే శర్మ గుజరాత్ కేడర్ అధికారని విపక్ష నేత విమర్శించారు. వూప్సూ... ఇన్వెస్టిగేషన్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. CBI Jt. Director, A K Sharma, weakened Mallya’s “Look Out” notice, allowing Mallya to escape. Mr Sharma, a Gujarat cadre officer, is the PM’s blue-eyed-boy in the CBI. The same officer was in charge of Nirav Modi & Mehul Choksi’s escape plans. Ooops... investigation! — Rahul Gandhi (@RahulGandhi) September 15, 2018 అయితే ఈ ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారమని పేర్కొంది. ‘సీబీఐ సీనియర్ అధికారులపై కొంతమంది వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి లేదా అదుపులోకి తీసుకోవడానికి అప్పటికీ సీబీఐ వద్ద అవసరమైన ఆధారాలు లేవు. ఆ కారణంతోనే మాల్యాకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును మార్చాలని నిర్ణయం తీసుకున్నాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలపై సీబీఐ అధికారి ఈ విధంగా స్పందించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి వ్యవహారంపై కూడా స్పందించిన సీబీఐ అధికార ప్రతినిధి... ‘వారు దేశం విడిచి పారిపోయిన నెల తర్వాత సీబీఐకు నీరవ్, చోక్సిల విషయంపై పీఎన్బీ నుంచి ఫిర్యాదు పొందింది. వారు దేశం విడిచి పారిపోవడానికి సీబీఐ అధికారి కారణం అనడానికి ఎలాంటి ఆధారం లేదు. బ్యాంక్ నుంచి ఫిర్యాదు పొందిన వెంటనే, సీబీఐ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది’ అని తెలిపారు. ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ విభాగం, అవినీతి నిరోధక యూనిట్లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. శర్మ, గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. -
మాల్యా పలాయనం ప్రధానికీ తెలుసు: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియకుండానే లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా దేశం నుంచి పారిపోయాడనడం నమ్మశక్యంగా లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్ వదిలి బ్రిటన్‌కు వెళ్లేముందు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో తాను సమావేశమయ్యానన్న మాల్యా వ్యాఖ్యపై రాహుల్ స్పందించారు. ‘ప్రధానికే సీబీఐ జవాబుదారీగా ఉంటుంది. అలాంటప్పుడు మాల్యాపై జారీ చేసిన లుకౌట్ నోటీసుల్లో ‘నిర్బంధించు’ బదులు ‘తెలియపరుచు’ అని మార్చడం ద్వారా లిక్కర్ కింగ్ దేశం నుంచి పలాయనం అయ్యేందుకు సీబీఐ సహకరించిందనడం నమ్మశక్యంగా లేదు’ అని అన్నారు. -
మాల్యా కేసులో మెతగ్గా వ్యవహరించలేదు: ఎస్బీఐ
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణ ఎగవేత ఖాతా వ్యవహారంలో మెతగ్గా వ్యవహరించలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్‌మాల్యా 2016 మార్చి 2న భారత్ నుంచి వెళ్లిపోయారు. అయితే, అతన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని 2016 ఫిబ్రవరిలోనే లీడ్ బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ సూచించినప్పటికీ... ఆయన పరారైన నాలుగు రోజుల తర్వాత 13 బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టును ఆశ్రయించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ స్పందిస్తూ... ‘‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సహా రుణ ఎగవేత కేసుల వ్యవహారాల్లో ఎస్బీఐ తరఫున, అధికారుల వైపు ఎటువంటి అలక్ష్యం లేదు. ఎగవేతల మొత్తాన్ని రాబట్టుకునేందుకు చురుకైన, బలమైన చర్యలను బ్యాంకు తీసుకుంటోంది’’ అని ఎస్బీఐ తెలిపింది. బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిలు చెల్లించాల్సిన విజయ్‌మాల్యా ఈ విషయంలో పలు కేసులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విజయ్ మాల్యా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. తన కంపెనీ (కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్) ఆర్థిక పరిస్థితులు తెలిసీ ఎస్బీఐ, ఇతర బ్యాంకులు తనకు అప్పిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకుల వైపు తప్పిదం ఉన్నా... తనను రుణాల ఎగవేతలకు పోస్టర్బోయ్గా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయ్ మాల్యాకు ఎవరి సహకారం ?
సాక్షి, న్యూఢిల్లీ : తాను దేశం విడిచేముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుసుకున్నానని, బ్యాంకు రుణాలు తీర్చే విషయంలో ఓ ఒప్పందానికి వద్దామని కూడా ప్రతిపాదన తీసుకొచ్చానని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా బుధవారం ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు సష్టిస్తోంది. ఆయన పారిపోవడానికి బాధ్యత వహిస్తూ అరుణ్ జైట్లీని రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ బ్యాంకులకు దాదాపు 9.000 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే. భారతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను విజయ మాల్యా కేసు సూచిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అలసత్వం వల్లనే విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన సమీప బంధువు మెహుల్ చోక్సీలు పారిపోయారన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టం అవుతోంది. మనీ లాండరింగ్ కేసులో దేశం దాటి ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీకి ‘మానవతా దక్సథం’తోనే ట్రావెల్ డాక్యుమెంట్లు ఇచ్చానని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా ఒప్పుకోవడం తెల్సిందే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ అధికారి చలువ వల్లనే విజయ్ మాల్యా పారిపోయారని, ప్రముఖ ఆయుధాల డీలరు సంజయ్ భండారీ పలు దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి పారిపోయారంటే ప్రభుత్వం చలువ వల్లనేనంటూ వస్తున్న వార్తలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని ఏమనాలి? అధికార రహస్యాల చట్టం కింద 2016, అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేసినా, ఆయన పాస్‌పోర్టును ఆదాయం పన్ను శాఖ స్వాధీనం చేసుకున్నా సంజయ్ భండారి దేశం విడిచి లండన్ పారిపోయారంటే అందుకు ఎవరు బాధ్యులు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే నిరర్థక ఆస్తులు వసూలవుతాయని, కచ్చితంగా ఒకరిద్దరు పెద్ద చేపలను కటాకటాలకు పంపించడం అవసరమంటూ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ ర ఘురామ్ రాజన్ సూచించినప్పటికీ ప్రధాని కార్యాలయం నుంచి కూడా స్పందన లేదంటే ఏమనుకోవాలి? ఇలా ప్రధాని కార్యాలయానికి సూచించిన విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీకి తాజాగా రాసిన 17 పేజీల లేఖలో రాజన్ స్పష్టంగా పేర్కొన్నారు. తన హయంలో నిరర్థక ఆస్తుల వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాల్సిందిగా మురళీ మనోహర్ జోషి జారీ చేసిన నోటీసుకు సమాధానంగా ఆయన ఈ సుదీర్ఘ లేఖను రాశారు. ఆయన ఏయే సంవత్సరంలో బడా బాబులకు బ్యాంకులు ఎంతెంత సొమ్మును రుణాలుగా ఇచ్చారో కూడా పేర్కొన్నారు. అందులో 2007–2008 సంవత్సరంలో పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు తేలడంతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ నిరర్థక ఆస్తులకు పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దంటూ బీజేపీ సభ్యులు గోల చేస్తున్నారు. మరి 2015లో పీఎంవోకు రఘురామ్ రాజన్ లేఖ రాసినప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించ లేదంటూ పార్లమెంటరీ కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు నిలదీయడంతో కమిటీ ముందుకు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నపేంద్ర ముశ్రా, పీఎం ఆర్థిక కార్యదర్శి హాష్ముక్ అధియాను పిలిపించి విచారించాలని నిర్ణయించింది. రుణ బకాయిల వసూళ్లకు ఉద్దేశించిన ‘రికవరీ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్స్ యాక్ట్–1993, సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటి ఇంటరెస్ట్ యాక్ట్–2002’ చట్టాల్లోని లొసుగును బడా బాబులు ఉపయోగించుకుంటున్నారని తెలిసి, వాటిని సవరించాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ‘ఇన్సాల్వేన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్’ను తీసుకొచ్చిందని రాజన్ తన లేఖలో పేర్కొన్నారు. వేల కోట్ల రుణాలకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న బడాబాబులను పట్టుకోవడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలిగానీ చట్టాలను సవరించినంత మాత్రాన సరిపోదు. -
మాల్యా కేసు : సంచలన విషయాలు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, విదేశాల పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారంలో రోజుకో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కాక మొన్న తాను దేశం విడిచి వెళ్లిపోవడానికి కంటే ముందు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్టు మాల్యానే సంచలన విషయం వెల్లడించగా... నేడు టాప్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే కూడా కీలక విషయాలను తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఫిర్యాదు ఫైల్ చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోనే, మాల్యా దేశం విడిచిపోయినట్టు పేర్కొన్నారు. అసలేం జరిగింది...? విజయ్ మాల్యా భారత్ విడిచి పారిపోవడానికి కంటే సుమారు ఒక నెల ఉమందు, ఈ లిక్కర్ టైకూర్ రూ.2000 కోట్లకు పైగా రుణాలను తమకు చెల్లించాల్సి ఉందని ఎస్బీఐ ప్రకటించింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు సమర్పించే క్రమంలో ఈ విషయాలను వెల్లడించింది. విజయ్ మాల్యా, ఆయన కంపెనీల రుణాల ఎగవేతను ఈ ట్రిబ్యునల్ విచారిస్తోంది. 14 బ్యాంక్‌లను నిర్వహించే కన్సోర్టియం ఎస్బీఐ ట్రిబ్యునల్‌కు ఈ వివరాలను సమర్పించింది. 2016 జనవరి 31 వరకు మాల్యా ఎస్బీఐకు రూ.2,043 కోట్ల రుణాలు బాకీ ఉన్నారని, మొత్తంగా బ్యాంకులకు రూ.6,963 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. కొన్ని వారాల తర్వాత అంటే ఫిబ్రవరి 28న టాప్ సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దావే, సీనియర్ ఎస్బీఐ అధికారులతో భేటీ అయ్యారు. మాల్యా, ఆయన కంపెనీల రుణాల వ్యవహారంలో వెంటనే సమావేశం కావాలని ఎస్బీఐ అధికారులు కోరడంతో, ఈ భేటీ నిర్వహించారు. ఆ మీటింగ్ న్యూఢిల్లీలోని దావే ఇంట్లో జరిగింది. గంట పాటు జరిగిన సమావేశంలో మాల్యా భారత్ విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఎస్బీఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మాల్యా పారిపోకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టులో అతను భారత్‌ను వీడకుండా ఉండేందుకు ఓ ఫిర్యాదు దాఖలు చేయాలని దవే సూచించారు. అప్పటి ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య కూడా తన సూచనకు అంగీకారం తెలిపినట్లు దావే వెల్లడించారు. అయితే ఆమె ఈ సమావేశంలో పాల్గొన్నారో.. లేదో దుష్యంత్ స్పష్టం చేయలేదు. ఆ తర్వాత రోజు దవే సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడి టాప్ ఎస్బీఐ అధికారులెవరూ రాలేదు. మాల్యా భారత్ వీడకుండా ఉండేందుకు పిల్‌నూ దాఖలు చేయలేదు. రెండు రోజుల అనంతరం అంటే మార్చి 2న విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాల్యా భారత్‌కు రాలేదు. ప్రస్తుతం లండన్‌లో లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. ‘నేను ఎస్బీఐ అధికారులకు సూచించిన తర్వాత ఏదో జరిగింది, దానిలో ఏం అనుమానం లేదు’ అని దవే ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దవే స్టేట్మెంట్లపై ఎస్బీఐ మాజీ చీఫ్ అరుంధతీ భట్టాచార్యా స్పందించారు. దీనిపై ఎస్బీఐ అధికార ప్రతినిధి స్పందిస్తారు.తాను స్పందించదలుచుకోలేదని.. ప్రస్తుత యాజమాన్యాన్ని సంప్రదించాలని భట్టాచార్య సూచించారు. మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసుల విషయంలో తమ అధికారులు అలసత్వం ప్రదర్శించారని వస్తున్న ఆరోపణలను ఎస్బీఐ ఖండించింది. ఎగవేత మొత్తాలను రికవరీ చేసుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పింది. టైమ్ లైన్.... 2016 జనవరి 31 : రూ.2000 కోట్లకు పైగా రుణాలను విజయ్ మాల్యా కలిగి ఉన్నట్టు ఎస్బీఐ ప్రకటన 2016 ఫిబ్రవరి 28 : మాల్యా రుణాల విషయంపై న్యాయవాది దుశ్యంత్ దవేతో టాప్ ఎస్బీఐ అధికారుల భేటీ 2016 ఫిబ్రవరి 28 : మాల్యా భారత్‌ను వీడి వెళ్లకుండా ఉండేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించమని సూచన 2016 ఫిబ్రవరి 29 : దవే సుప్రీంకోర్టుకు హాజరు, కానీ ఎస్బీఐ అధికారులు మాత్రం రాలేదు 2016 మార్చి 2 : విజయ్ మాల్యా భారత్‌ను వీడారు. -
‘ఈ ప్రశ్న విలువ రూ. 9 వేల కోట్లు’
న్యూఢిల్లీ : వేల కోట్ల రూపాయల ఎగవేతదారు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తాను భారత్ నుంచి వెళ్లడానికంటే ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపూ ప్రతిపక్షాలన్ని ఈ విషయం గురించి తీవ్రంగా విమర్శిస్తుండగా మరోవైపూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన పజిల్ హల్చల్ చేస్తోంది. పాపులర్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో గురించి తెలియని భారతీయుడు ఉండడు. ఇప్పటికే పలు భారతీయ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ కార్యక్రమంలో ఈసారి ఎదురయ్యే ప్రశ్న అంటూ ఓ వెరైటీ ప్రశ్నను, దానికి సంబంధించిన ఆప్షన్స్‌ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఆ ప్రశ్న దేనికి సంబంధించిందో ఈ పాటికే అర్థమయ్యి ఉంటుంది కదా.. అవును విజయ్ మాల్యా, అరుణ్ జైట్లీల గురించి. ఇంతకు ప్రశ్న ఏంటంటే ‘విజయ్ మాల్యా భారత్ నుంచి తప్పించుకోవడానికి ఎవరూ సాయం చేశారు’ అనేది ప్రశ్న.. దానికి సమాధానాలుగా అరుణ్, జైట్లీ, అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ మంత్రి అనేవి ఆప్షన్స్‌గా ఇచ్చారు. అంతేకాక ‘ఇది చాలా కఠినమైన ప్రశ్న.. దీని విలువ 9000 కోట్ల రూపాయలు.. అందుకే మేము ఆడియన్స్ పోల్కి వెళ్తున్నాం’.. అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఇలా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే దీన్ని వేల మంది వీక్షించడమే కాక రకారకాల కామెంట్స్ కూడా చేశారు. అయితే కాంగ్రెస్ షేర్ చేసిన పజిల్‌కు పోటీగా అమిత్ అనే బీజేపీ అభిమాని ఒకరు మరో ప్రశ్నను పోస్ట్ చేశారు. అమిత్ పోస్ట్ చేసిన ఫోటోలో ‘దేశాన్ని దోచుకుంది ఎవరూ..?’ అనే ప్రశ్న ఇచ్చి దానికి ఆప్షన్స్‌గా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబ పార్టీ, నెహ్రూ పార్టీ, పైవన్ని అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పొలిటికల్ పజిల్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా దేశం విడిచి వెళ్లిపోయే ముందు తాను అరుణ్ జైట్లీని కలిసినట్లు విజయ్‌మాల్యా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. అంతేకాక ‘జైట్లీపై ప్రధాని వెంటనే విచారణకు ఆదేశించాలి. తనపై విచారణ కొనసాగుతున్నంత కాలం ఆయన తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
మాల్యా వివాదం : జైట్లీ రాజీనామాకు పట్టు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం రాజకీయ మలుపు తిరిగేసింది. భారత్ వీడటానికి కంటే ముందు తాను ఆర్థిక మంత్రిని కలిసినట్టు విజయ్ మాల్యా నిన్న సంచలన విషయాలు వెల్లడించాడు. విజయ్ మాల్యా చేసిన ఈ కామెంట్లపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఈ విషయంపైస్వతంత్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘విజయ్ మాల్యా నేడు లండన్‌లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధాని వెంటనే ఈ విషయంపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. ఆర్థిక మంత్రి తన పదవి నుంచి దిగిపోవాలి’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మాల్యా భారత్ వదిలి వెళ్లేలా ఎప్పుడు, ఎలా అనుమతి ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. వెస్ట్‌మినిస్టర్ కోర్టులో జరుగుతున్న అప్పగింత కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన మాల్యా, కోర్టు వెలుపల ఈ కామెంట్లు చేశారు. అయితే అది అధికారిక సమావేశం కాదంటూ తర్వాత మాట మార్చారు. మాల్యా కామెంట్లు చాలా చెత్తగా ఉన్నాయని, అసలు మాల్యా తనను కలిసేందుకు 2014 నుంచి అపాయింట్మెంటే ఇవ్వలేదని జైట్లీ కొట్టిపారేశారు. కాగా, నిన్నటితో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణ పూర్తయింది. దీనిపై డిసెంబర్ 10న లండన్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. చదవండి.. (జైట్లీని కలిశాకే.. భారత్ వీడాను) -
జైట్లీని కలిశాకే.. భారత్ వీడాను
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. భారత్ వదిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని ఆయన బుధవారం లండన్‌లో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. మాల్యా వ్యాఖ్యలను జైట్లీ తోసిపుచ్చారు. అసలు తనని కలిసేందుకు మాల్యాకు ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. మాల్యా భారత్ వదిలి వెళ్లేలా ఎప్పుడు, ఎలా అనుమతి ఇచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జైట్లీని కలిశానని మాల్యా చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌కు గురిచేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణను లండన్ కోర్టు ముగించింది. తీర్పును డిసెంబర్ 10న ప్రకటించనుంది. బలిపశువును చేశారు.. రూ. 9 వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాల ఎగవేత, మోసం, మనీ లాండరింగ్ తదితర కేసుల్లో నిందితుడైన మాల్యాను తిరిగి అప్పగించాలని భారత్ వేసిన పిటిషన్ విచారణ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతోంది. బుధవారం విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన మాల్యా అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారత్ వదిలి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్లు చెప్పారు. భారత్ విడిచి వెళ్లాలని ముందస్తుగా ఏమైనా సమాచారం వచ్చిందా? అని పాత్రికేయులు ప్రశ్నించగా..‘జెనీవాలో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున భారత్ వదిలి వచ్చాను. అంతకుముందు, ఆర్థిక మంత్రిని కలిసి బ్యాంకు రుణాలు చెల్లించేందుకు సిద్ధమని చెప్పాను. రాజకీయ పార్టీలు నన్ను బలిపశువును చేశాయి. రుణాల చెల్లింపు కోసం కర్ణాటక హైకోర్టుకు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాను. రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను కోర్టు ముందుంచాను’ అని బదులిచ్చారు. రుణాల చెల్లింపులో బ్యాంకులే సహకరించడం లేదని ఆరోపించారు. భారత్ పంపిన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు వీడియో ‘చాలా బాగుంది’ అని సిగరెట్ తాగుతూ ఎగతాళి చేశారు. ఆ సాక్ష్యాలు నిరాధారం: భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదిస్తూ.. మొదటి నుంచీ రుణాలు చెల్లించకూడదనే ఉద్దేశంతో మాల్యా ఉన్నారని, అందుకే తన కంపెనీ కింగ్‌ఫిషర్ ఆర్థిక ఫలితాలను ఏమార్చారని ఆరోపించింది. భారత్ సమర్పించిన సాక్ష్యాలు నిరాధారమని మాల్యా తరఫు లాయర్ కొట్టిపారేశారు. బ్యాంకులతోనే మాట్లాడుకోమన్నా: జైట్లీ మాల్యా వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదని జైట్లీ కొట్టిపారేశారు. 2014 నుంచి మాల్యాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఆయన తనని కలిసేందుకు అవకాశమే లేదని పేర్కొన్నారు. ‘ రాజ్యసభ సభ్యుడి హోదాలో ఓసారి మాల్యా పార్లమెంట్ ప్రాంగణంలో నా వెంట నడుస్తూ బ్యాంకు రుణాలు చెల్లించేందుకు ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన నకిలీ ఆఫర్ల గురించి ముందే విన్నా కాబట్టి, ఇక ఆయనతో సంభాషణను కొనసాగించడం ఇష్టం లేక ఆ విషయాన్ని బ్యాంకులతోనే మాట్లాడుకోవాలని సూచించా’ అని జైట్లీ వివరణ ఇచ్చారు. మాల్యా, జైట్లీ ఏం మాట్లాడుకున్నారో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెనక్కి తగ్గిన మాల్యా: జైట్లీ తన వ్యాఖ్యలను ఖండించిన తరువాత మాల్యా వెనక్కితగ్గారు. ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. తాను జైట్లీతో అధికారికంగా సమావేశం కాలేదని, యాదృచ్ఛికంగా కలిశానని చెప్పారు. ‘భార త్లో మీడియా ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం సరికాదు. లంచ్ విరామంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు నేను దేశం విడిచి రావడానికి దారితీసిన పరిస్థితులేంటో వివరించాను. లండన్ వెళ్తున్నానని మాత్రమే జైట్లీ తో చెప్పాను. అంతేకానీ ఆయనతో అధికారికంగా సమావేశం కాలేదు’ అని అన్నారు. -
మాల్యా కేసు : ముంబై జైలు ఓకేనా? కాదా?
లండన్ : బ్యాంక్‌లకు వేలకోట్లు కొల్లగట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, భారత్‌కు అప్పగింత కేసు నేడు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా విజయ్ మాల్యా మధ్యాహ్నం వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యాను ఉంచేందుకు భారత అథారిటీలు సమర్పించిన ముంబై జైలు సెల్ వీడియోను జడ్జి సమీక్షించారు. విజయ్ మాల్యాను ఉంచే ముంబై ఆర్థూర్ రోడ్డు జైలు బ్యారెక్ 12కు సంబంధించి ప్రతీది స్టెప్-బై-స్టెప్ వీడియో తీసి తమకు సమర్పించాలని గత విచారణ సందర్భంగా జూలైలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు జడ్జి ఎమ్మా అర్బుత్నోట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోతో అన్ని అనుమానాలను నివృతి చేయాలని పేర్కొంది. భారత్‌లో జైళ్లు దారుణంగా ఉన్నాయంటూ విజయ్ మాల్యా ఆరోపించారు. సరైన సదుపాయాలు ఉండవని, గాలి, వెలుతురు సైతం సరిగ్గా ఉండవని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీంతో మాల్యాను ఉంచే జైలుకు సంబంధించిన 10 నిమిషాల నిడివి గల వీడియోను తీసి భారత అధికారులు లండన్ కోర్టుకు సమర్పించారు. బ్యారెక్-12లో మాల్యా కోసం ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని, ఆ సెల్లో మాల్యా కోసం ప్రత్యేకంగా ఎల్సీడీ టీవీ, కొత్త పరుపులు, తల్లగడ్లు, దుప్పట్లు, వాష్ ఏరియా, వెస్ట్రన్ స్టయిల్లో టాయిలెట్, లైబ్రరీ, మంచి వెలుతురు వచ్చేలా తూర్పు వైపు గది కల్పిస్తామని చెప్పారు. ఈ వీడియోను నేడు లండన్ కోర్టు పరిశీలిస్తోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు, భారత ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారు. అప్పగింత ప్రొసీడింగ్స్‌కు సంబంధించి యూకే మానవ హక్కుల బాధ్యతల్లో భాగంగా సెల్‌ను తనిఖీ చేయాలని విజయ్ మాల్యా డిఫెన్స్ టీమ్ వాదిస్తోంది. విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన విజయ్ మాల్యాను మీడియా పలు ప్రశ్నలు వేసింది. ‘ముందు నుంచి నేను చెబుతున్న మాదిరి, కర్నాటక హైకోర్టు ముందు నేను సమగ్ర పరిష్కార ఆఫర్‌ను ఉంచాను. గౌరవనీయులైన జడ్జీలను దీనిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని మాల్యా అన్నారు. కాగా, దేశీయ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా, ఆ రుణాలను కట్టలేక చేతులెత్తేసి, చెప్పాపెట్టకుండా విదేశాలకు పారిపోయారు. -
భారత్‌కు ఎప్పుడు వస్తారు..?
ఇంగ్లాండ్ : బ్యాంక్‌లకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, ఇంగ్లాండ్‌లోని ఓవల్ క్రికెట్ మైదానంలో దర్శనమిచ్చారు. భారత్‌కు, ఇంగ్లాండ్‌కు జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌ను తిలకించేందుకు ఈ మైదానానికి వచ్చారు. మైదానానికి వచ్చిన విజయ్ మాల్యాను మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారంటూ ఓ రిపోర్టరు అడిగారు. దీనికి.. జడ్జినే అది నిర్ణయిస్తారంటూ చెప్పేసి మాల్యా అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్రికెట్ స్టేడియం వెలుపల తానెలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పారు. మాల్యాను ఉద్దేశ్యపూర్వక ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో మాల్యాకు చెందిన రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయొచ్చని పేర్కొంది. మాల్యా దీనిపై సెప్టెంబర్ 24న తన స్పందన తెలియజేయనున్నారు. ప్రస్తుతం మాల్యాపై మనీ లాండరింగ్ ఛార్జీలున్నాయి. అప్పగింత ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత అతన్ని భారత్‌కు తీసుకురానున్నారు. #WATCH: Vijay Mallya seen entering The Oval cricket ground in London's Kenington. The 5th test match between India and England is being played at the cricket ground. #England pic.twitter.com/NA3RQOKkRJ — ANI (@ANI) September 7, 2018 #WATCH: Vijay Mallya when asked if he will go back to India says, "judge will decide," outside The Oval in London's Kennington. pic.twitter.com/CmJY6YU9Um — ANI (@ANI) September 8, 2018 -
టెస్టు మ్యాచ్‌కు హాజరైన మాల్యా
లండన్: భారత్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో ఉంటున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా శుక్రవారం భారత్-ఇంగ్లండ్ టెస్టుకు హాజరయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య లండన్ వేదికగా చివరి టెస్టు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు విజయ్ మాల్యా నేరుగా స్టేడియానికి వచ్చారు. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సమయంలోనూ భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌కు మాల్యా హాజరయ్యారు. ప్రస్తుతం కోహ్లి సేన ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆగస్టు 1న తొలి టెస్టు ప్రారంభమయ్యే ముందు టీమిండియాను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరగా వారు తిరస్కరించారు. దీంతో మాల్యాకు కోహ్లి సేనను కలిసే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో మాల్యా లండన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది సమయం ముందు మాల్యా స్టేడియం లోపలికి వెళ్లాడు. దీనికి సంబంధించిన దశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చివర్లో చమక్... -
మాల్యాను ఉంచబోయే జైలు గదిలో సకల సదుపాయాలు
-
ఆస్తులకు ఎసరు : మారిన మాల్యా స్వరం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్‌కు తిరిగివచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. భారత్‌లో రూ 13,500 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో ఇవి తన చేతులు దాటి పోకుండా చూసుకునేందుకే దేశానికి తిరిగివచ్చేందుకు ఆయన మొగ్గుచూపుతున్నారు. లండన్‌లో తలదాచుకున్న మాల్యాను తమకు అప్పగించాలంటూ భారత్ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించిన లిక్కర్ కింగ్ తాజాగా తన ఆస్తులు ప్రభుత్వపరమవుతాయనే ఆందోళనతో దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని, భారత్ తిరిగివచ్చేందుకు సిద్ధమేననే సంకేతాలు పంపుతున్నారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత భారత జైళ్లలో సౌకర్యాలు ఉండవని, తగినంత గాలి, వెలుతురు ఉండదని బ్రిటన్ కోర్టులో వాదించారు. ఇటీవల చేపట్టిన పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీన చట్టం మాల్యాలో వణుకుపుట్టిస్తోంది. ఈ చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు సీజ్ చేసిన ఆస్తులు ప్రభుత్వ పరమవుతాయి. ఈ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బాధితులకు పంచుతుందని, ఒక్కసారి ప్రభుత్వ పరమైన ఆస్తులను తిరిగి విడిపించే అవకాశం ఉండదని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు సీజ్ చేసిన తన ఆస్తులను కాపాడుకునేందుకే మాల్యా భారత్ తిరిగివస్తానని అదే పనిగా సంకేతాలు పంపుతున్నారని అధికారులు చెబుతున్నారు. -
మాల్యా బాటలోనే మెహుల్ చోక్సీ..
న్యూఢిల్లీ : లండన్ కోర్టులో తన అప్పగింత పిటిషన్‌పై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వినిపించిన వాదనలనే రూ 13,578 కోట్ల పీఎన్బీ స్కాం కేసులో నిందితుడు, ప్రముఖ జ్యూవెలర్ మెహుల్ చోక్సీ ముందుకుతెచ్చారు. భారత్ జైళ్లలో పరిస్థితులు సరిగ్గా ఉండవనే కారణం చూపి ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయాలని సీబీఐ ఇంటర్‌పోల్‌ను కోరడాన్ని వ్యతిరేకించారు. భారత్‌లో జైళ్లు మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉంటాయని, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న మీడియా విచారణ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఇంటర్‌పోల్‌కు దాఖలు చేసిన అప్పీల్లో పేర్కొన్నారు. పీఎన్బీ స్కామ్‌లో కీలక నిందితుడైన చోక్సీ కరేబియన్ జంట ద్వీవులు అంటిగ్వా, బార్బుడాల్లో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. కేసు చుట్టూ మీడియా హడావిడి అధికంగా ఉండటంతో ఆరోపణల్లో ఉన్న నిజాయితీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీతో కలిపి ఈ కేసులో తనను పేర్కొంటున్నారని, భారత్‌లో నిందితులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదని వాపోయారు. తన ఉద్యోగులు, ఫ్రాంచైజీల నుంచి తనకు ప్రాణహాని ఉందని చోక్సీ ఇంటర్‌పోల్‌కు మొరపెట్టుకున్నారు. -
మాల్యా కోసం సకల సౌకర్యాలతో జైలు గది
-
ఆ జైలు గదిలో సకల సౌకర్యాలు
ముంబై: గోడకు 40 అంగుళాల ఎల్సీడీ టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్ కోసం ఆవరణ, సెల్ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తరువాత ఆయన్ని ఉంచే జైలును సీబీఐ సిద్ధం చేసి, దాని వీడియోను బ్రిటన్ కోర్టుకు పంపింది. భారత్‌లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్లనంటూ మాల్యా ఆరోపించడం తెల్సిందే. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ నంబర్ బ్యారెక్‌ను ముస్తాబు చేశారు. గదిలో ప్రతీది తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల, మరాఠీ చానెల్స్ వచ్చే ఏర్పాట్లు చేశారు. మాల్యాను ఉంచబోయే బ్యారెక్ లోపల, బయట రేయింబవళ్లు గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహానీ ఉన్న వారిని ఉంచుతారు. -
మాల్యా జైలు, ఎన్ని సౌకర్యాలో చూడండి..
న్యూఢిల్లీ : టీవీ, పర్సనల్ టాయిలెట్, బెడ్, వాష్ చేసుకునే ఏరియా, ఎల్లప్పుడూ సూర్యుని కాంతి పడేలా వెంటిలేషన్.. ఇదిగో చూడండి.. జైలు ఎంత బాగా రూపుదిద్దుకుందో... ఇంతకుమించిన సౌకర్యాలు కావాలా? అంటూ సీబీఐ, యూకే కోర్టుకు ఓ వీడియో డాక్యుమెంటరీ సమర్పించింది. ఇంతకీ ఈ వీడియో ఏంటి, దీని కథేంటి, అనుకుంటున్నారా? విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలనే కేసుపై యూకే కోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే భారత్‌లో జైళ్లు బాగుండవని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో నక్కిన విజయ్ మాల్యా, యూకే కోర్టులో వాదించారు. మాల్యా వాదనల మేరకు ఆయన్ను భారత్‌కు అప్పగిస్తే, ఆయనను ఎక్కడ ఉంచుతారు? జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? నిందితుడి సెల్ ఏ విధంగా ఉంటుందో చూపుతూ ముంబై జైలు వీడియోను తమకు సమర్పించాలని సీబీఐను యూకే కోర్టు ఆదేశించింది. యూకే కోర్టు ఆదేశాల మేరకు మాల్యాను ఉంచే ముంబై ఆర్థుర్ రోడ్ జైలులోని బరాక్ నెంబర్ 12ను, అక్కడ ఉండే సౌకర్యాలను చూపిస్తూ.. 6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియోను తీసిన సీబీఐ డాక్యుమెంటరీ రూపంలో యూకే కోర్టుకు సమర్పించింది. ఇదే మాల్యా నివాసం అని పేర్కొంది. కాగ, భారత జైళ్లలో తాజా గాలి, సహజ సిద్ధమైన కాంతి ఉండవని విజయ్‌మాల్యా ఆరోపించారు. మాల్యాను ఉంచబోయే సెల్ ముఖద్వారం తూర్పువైపు ఉంటుంది. అంటే సూర్యకాంతి మంచిగా పడుతుంది అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. కిటికి తలుపులు, ఇరువైపుల బార్లతో మాల్యాను ఉంచబోయే సెల్ మంచి వెంటిలేషన్‌ను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. విజయ్‌మాల్యాకు లైబ్రరీ యాక్సస్ కూడా కల్పిస్తామని ఈ వీడియో తీసిన సీనియర్ అధికారి చెప్పారు. ఇక భద్రతాపరంగా చూసుకుంటే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల భద్రతాపరమైన వసతులున్నాయని తెలిపారు. విచారణ సమయాల్లో పలుసార్లు ఇదే విషయాన్ని తాము కోర్టుకు వెల్లడించామని కూడా చెప్పారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో ఎలాంటి లోపాలు లేవని, హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపై సెక్యురిటీ ఆడిట్ చేపట్టిందని తెలిపారు. జైలులోని సెల్లన్నింటినీ సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంటాయని, బరాక్ వెలుపల, లోపల అదనపు గార్డులు ఉంటారని, వారు 24 గంటల పాటు బరాక్కు కాపాలాగా ఉంటారని అధికారులు చెప్పారు. రోజులో నాలుగు సార్లు భోజనం అందిస్తామని, ఆర్థూర్ రోడ్డు జైలులోని బరాక్ 12 ఎక్కువగా హై-ప్రొఫైల్ ఖైదీలకు మాత్రమే వాడనున్నట్టు తెలిపారు. ఎవరికైతే భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉంటుందో, వారు ఎవరికైనా ముప్పు కలిగిస్తారని అనుమానం ఉన్నా.. వారిని బరాక్‌లోనే ఉంచనున్నట్టు చెప్పారు. బ్యాంక్‌లకు దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన మాల్యాను కూడా భారత్‌కు రప్పిస్తే ఇక్కడే ఉంచనున్నారు. ఆయన్ను భారత్‌కు అప్పగించే వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 12న జరుగనుంది. -
విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ
లండన్ : భారత్, యూకేలో పలు న్యాయ కేసులను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ బ్యాంకుల కన్సోర్టియంకు లీగల్ ఫీజుల కింద రూ.1.5 కోట్లను చెల్లించాలని లండన్ హైకోర్టు విజయ్ మాల్యాను ఆదేశించింది. బ్యాంకులకు వ్యతిరేకంగా అతను నమోదు చేసిన కేసు కొట్టివేసిన అనంతరం వారి లీగల్ ఫీజులు వారికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్యాను ప్రస్తుతం భారత్‌కు అప్పగించే ప్రక్రియపై లండన్ కోర్టులో విచారణ జరుగుతుంది. మాల్యా ఇప్పటికే లీగల్ ఫీజుల కింద రూ.1.8 కోట్లను చెల్లించారు. తాజాగా మరో రూ.1.5 కోట్లను చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా ఈ కేసులో బ్యాంకులకు రూ.3.3 కోట్లను మాల్యా చెల్లిస్తున్నారు. బ్యాంకుల న్యాయ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని, మొదటి ప్రతివాది (మాల్యా) 2,00,000 పౌండ్లు(రూ.1.8కోట్లు) చెల్లింపులు చేశారు. 60 రోజుల లోపు మరో 1,75,000 పౌండ్లను చెల్లించి, తుది పరిష్కారం పొందుతారు అని జడ్జి వాక్స్‌మ్యాన్ క్యూసీ చెప్పారు. ప్రస్తుతం అతను బ్యాంక్‌లతో రాజీకి వస్తున్నారని తెలిసింది. కాగ గత నెల చివరిన మాల్యాను భారత్‌కు అప్పగింతపై తుది విచారణ జరిగింది. బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ మాల్యా చెప్పారు. తనపై వస్తున్న మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. -
టాయిలెట్ కూడా గోల్డే!
ముంబై : దేశీయ బ్యాంకులకు ఎన్నికోట్లు ఎగ్గొడితే ఏమిటి.. లగ్జరీ లైఫ్ అంటే అతనిదే అని చెప్పుకోవచ్చు. ఫార్ములా వన్, క్రికెట్, ఫుట్‌బాల్ టీమ్ వంటి అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లలో అతను చేసే హడావుడి అంతాఇంతా కాదు. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువులుగా చెప్పుకునే మహాత్మాగాంధీ గ్లాసెస్, టిప్పు సుల్తాన్ కత్తిలను తన వశం చేసుకున్నాడు. అతనెవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. అతని లగ్జరీ లైఫ్ ఇంతే అనుకున్నారా? వింటే మీరే షాకైపోతారట. లండన్‌లో మాల్యాకు ఓ లగ్జరీ ఇల్లు ఉండిందని తెలిసింది. ఆ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్‌ను మాల్యా కలిగి ఉన్నారని రిపోర్టులు వెలువడుతున్నాయి. ఓ వైపు మాల్యా వ్యాపారాలు కుదేలు అవుతున్నా.. మరోవైపు భారతీయ అథారిటీలు అతన్ని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చి జైలులో పెట్టాలని ప్రయత్నిస్తున్నా.. తాను మాత్రం లండన్ ఇంటిలో లగ్జరీ లైఫ్‌తో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులున్నట్టు రిపోర్టు తెలిపింది. రచయిత జేమ్స్ క్రాబ్ట్రీకి ఒకసారి విజయ్‌మాల్యా ఇంటిని సందర్శించే అవకాశం వచ్చినప్పుడు, మాల్యా ఇంట్లో ఉన్న గోల్డెన్ టాయిలెట్‌ను చూశారని తాజా రిపోర్టు పేర్కొంది. జేమ్స్, లీ కౌన్ యూ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈ విషయాన్ని జేమ్స్ ఈ వారంలో ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో కూడా చెప్పారని రిపోర్టు వెల్లడించింది. లండన్‌లోని రీజెంట్స్ పార్క్‌లో ఉన్న మాల్యా భవంతిని తాను సందర్శించానని, ఆ భవంతిని, దానిలో ఉన్న లగ్జరీ వస్తువులను చూసిన తర్వాత తాను ఒక్కసారిగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు జేమ్స్ చెప్పారు. అక్కడే గోల్డెన్ రిమ్‌తో ఉన్న గోల్డెన్ టాయిలెట్ కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఆ భవంతిలో గోల్డెన్ టాయిలెట్ ఉన్నప్పటికీ, గోల్డెన్ టాయిలెట్ పేపర్ లేదన్నారు. ఇలా విజయ్ మాల్యా గోల్డెన్ టాయిలెట్ విషయం బయటకి వచ్చింది. -
గవర్నమెంటు అల్లుళ్లు
ఆ మధ్య మా అబ్బాయి ఒకానొక బ్యాంకుకి ‘అప్పు’కి దరఖాస్తు పెట్టు కున్నాడు. ఏకంగా ఆరు గురు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వచ్చారు. ఎవరీ ఆరుగురు? బ్యాంకు మేనేజరు, అకౌం టెంట్, క్రెడిట్ మేనేజరు, రీజనల్ మేనేజర్, అసలు ఈ అప్పు తీసుకోవడానికి ఇతనికి అర్హత ఉన్నదో లేదో నిర్ణయించే ఉద్యోగి (అదేమిటి? ఈ నలుగురూ నిర్ణయించరా)– వీరంతా కాక– చర్చల్లో పాల్గొనకుండా– కాస్త దూరంగా కూర్చున్న మరొక ఉద్యోగి. ఈయనెవరు? మా అబ్బాయి చెప్తున్న సమాధానాలను బట్టి, వారి ప్రశ్నలకు మా అబ్బాయి స్పందనను బట్టి – ఇతను ‘అప్పు తీసుకోవడానికి నిజమైన యోగ్యుడా కాడా అని ‘బాడీ లాంగ్వేజ్’ని కనిపెట్టే ఓ ఉద్యోగి. చాలా ముచ్చటైన, ఏ లోపమూలేని బృందమిది. నాకు ఆ క్షణంలో రెండే రెండు పేర్లు గుర్తుకు వచ్చాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. మాల్యా బ్యాంకుల నుంచి కేవలం 9,000 కోట్లు మాత్రమే అప్పు చేశాడు. మరి ఆయన చుట్టూ ఇలాంటి నిఘా వర్గం పనిచెయ్యదా? చెయ్యదు బాబూ చెయ్యదు. మాల్యా గారిని పలకరించే దమ్ము ఏ బ్యాంకు మేనే జర్కి ఉంటుంది? ఏ రాత్రో, పనివేళో ఢిల్లీలో పే...ద్ద వర్గాల నుంచి – బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు గారి ఫోన్ మోగుతుంది. రాత్రిళ్లు సీసాలు చప్పుడవు తాయి, కొండొకచో గాజుల చప్పుళ్లూ అవుతాయి. కోట్ల రూపాయలు అడ్రసు మార్చుకుంటాయి. తర్వాత– ఆ గొంతు ఎవరిదో ఈ ఎమ్డీ గారు చచ్చినా ఎవరిముందూ చెప్పలేరు. చెప్పరు. సరే. మాల్యాగారు ఓ మంచి రోజు ఇంగ్లండులో ప్రత్యక్షమయ్యారు. వారిని మన దేశం తీసుకు రావ డానికి కేసు అక్కడ జరుగుతోంది. కేసు ఓ దారికి వచ్చింది. ఏతావాతా, ఇంగ్లండు జడ్జిగారు మాల్యా గారు ఇండియా వెళ్లాల్సిందే అంటే? ఇప్పుడు వ్యవ హారం జపం విడిచి లొట్టల్లో పడింది. ‘తీరా వెళ్లవలసి వస్తే నేను వెళ్తాను. కానీ నన్ను అరెస్టు చేసి ఉంచే ముంబై ఆర్దర్ జైల్లో ఏ గదిలోనూ సరైన సూర్యరశ్మి రాద’ని మాల్యాగారు వాపోయారు. జడ్జిగారికీ ఈ మాట నచ్చింది. నేరస్తులు ఉండే జైలు గదుల్లో చక్కగా సూర్యరశ్మి అయినా ఉండకపోతే ఎలాగ? అక్కడ మన తరఫున వాదించే లాయరు గారిని అడిగారు. ‘అయ్యో, ఆర్దర్ జైలు నిండా బోలెడంత వెలుగు ఉన్నదండీ’ అన్నారాయన. ఆ ‘వెలుగు’ సూర్యరశ్మి కాదని పట్టుబట్టారు మాల్యాగారి లాయర్లు. అక్కడికీ గవర్నమెంటు తరఫు లాయరు గారు చాలా హామీలు ఇచ్చారు. ‘అయ్యా, మాల్యా గారికి మంచి దుప్పట్లు, పరుపులు, తలగడలు, రంగుల రంగుల గలీబులూ ఏర్పాట్లు చేస్తామండీ. వారికి ఏ లోపమూ రానివ్వం’ అని మొర పెట్టుకు న్నారు. ఇదంతా మన దేశంలో ప్రజల సొమ్ముని దోచుకున్న ఓ నేరస్తుడికిచ్చే సుఖాలు. ఇంగ్లండు కోర్టు తప్పనిసరిగా ఏర్పాటు చెయ్యాలని నిర్దేశించే ‘లొట్టలు’. ఆర్దర్ జైలు ఫొటోలు జడ్జిగారికి తృప్తినివ్వలేదు. జైలు అంతా స్టీలు బోనులాగా కనిపిస్తోందని జడ్జి గారు బాధపడ్డారు. 12 బారక్స్‌లో కేవలం ఆరుగురు పెద్ద మనుషులు (నేరస్తులు) మాత్రం ఉండే ఏర్పాటు ఉన్నదనీ, ఇక్కడ ఎక్కువ మందిని ఉంచే అవకాశం లేదని మన లాయరు గారు– నేరస్తుడి జైలు సౌకర్యాల గురించి కోర్టుకి విన్నవించుకున్నారు. అయినా జడ్జిగారికి నమ్మకం కుదరలేదు. మాల్యా గారికి ఈ జైలు నచ్చలేదు. ఈ బారక్స్‌లో ఎక్కడ కిటికీలు ఉన్నాయి? రోజులో ఏయే సమయాల్లో ఎంతెంత సూర్యరశ్మి వస్తుంది? ఆర్దర్ జైలు వీడియో తీసి మూడు వారాల్లోగా పట్టుకురండి– అని ఆదేశిం చారు జడ్జిగారు. అలాగే మాల్యాగారి అవసరాలకు సరిపోయే నీటి సౌకర్యం, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నదా? ఇవన్నీ తెలియాలి– అన్నారు. మన జైళ్లలో– నిజంగా నేరం చెయ్యనివారూ, చేశారో లేదో నిర్ధారణ కాని వారిని కూరేస్తున్నారని మనం వింటుంటాం. కానీ అలాంటి అసౌకర్యం 9 వేల కోట్లు స్వాహా చేసిన మాల్యా గారికి కానీ, నీరవ్ మోదీ గారికి కానీ ఉండదు. వారి సౌకర్యాలను– వారు పారిపోయి తలదాచుకున్న దేశాల న్యాయస్థా నాలే సాధికారికంగా ఏర్పాటయేటట్టు చూస్తాయి. ఏతావాతా, ఈ దేశంలో బ్యాంకు మర్యాదలు– నువ్వు వెయ్యి రూపాయలు అప్పు చేసి తీర్చలేక పోతే జైలుకి వెళ్తావు. 10 వేల కోట్లు అప్పు చేసి తీర్చలేకపోతే లండన్‌లో ప్రత్యక్షమవుతావు. పెళ్లికొడుకులాగా అప్పుడప్పుడూ టీవీల్లో కనిపిస్తున్నా– నిన్ను గవ ర్నమెంటు, బ్యాంకులేమీ చెయ్యలేవు. నువ్వు 9 వేల కోట్లు అప్పు చేసి పరారీ అయితే– జైలు గదిలో సూర్యరశ్మి ఉండాలా, పావురాలు ఎగ రాలా? చిలకలు పలకరించాలా? గళ్ల దుప్పట్లు, ముఖమల్ పరుపులు ఉండాలా– నువ్వే నిర్ణయి స్తావు. ఇండియా అధికారులు చచ్చినట్టు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంతకీ 9 వేల కోట్లు? ఎవడడిగాడు? వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
విదేశాలకు ఎగిరి పోకుండా ఆంక్షలు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని, విదేశాలకు వెళ్తున్న ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోంది. ఇక మీదట ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా కఠిన వైఖరి అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం పైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ పలు సూచనలను కేంద్రం ముందు ఉంచింది. వాటిలో ఒకటి దేశీయ పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 10లో సవరణ. ఈ చట్టం పాస్‌పోర్ట్‌ల రద్దుకు సంబంధించింది. అంతేకాక రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకునే వారి పాస్‌పోర్టు వివరాలను కూడా తప్పనిసరిగా బ్యాంక్‌లు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ వీరు ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవాలనుకుంటే, ఎయిర్‌పోర్టుల వద్దనే వారికి చెక్ పెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్బీఐ ప్రతినిధులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పీఎన్బీలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీతో పాటు, విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకునేందుకు, వారు అసలు భారత్‌కు రావడం లేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్పీఏ అకౌంట్లు ఏమేమీ ఉన్నాయో విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదేశించింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే రూ.100 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులను జప్తు చేయడానికి కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ఇంగ్లండ్‌లో టీమిండియా: మల్యాకు ఝలక్
బర్మింగ్‌హామ్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. అయితే తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు భారత జట్టును కలిసేందుకు అనుమతి కావాలని వ్యాపారవేత్త విజయ్ మాల్యా కోరాడట. దానికి ససేమిరా వీలు కాదంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి.. పలు కేసులు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లితో పాటు భారత జట్టును కలిసేందుకు అవకాశం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని మాల్యా కోరాడట. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లను కలిసేందుకు వీల్లేదని, వారిని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని తెలుపుతూ ప్రభుత్వం మాల్యాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాల్యా నిరుత్సాహానికి గురయ్యాడు. -
లండన్ కోర్టుకు హాజరైన మాల్యా
-
ఆ జైలుగది వీడియో పంపండి
లండన్: లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను ఉంచాలనుకుంటున్న ముంబైలోని జైలు గదిని పూర్తిగా వీడియో తీసి తమకు సమర్పించాలని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సెప్టెంబర్ 12న వాదనలు ముగియనున్నాయి. మంగళవారం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యా కేసు విచారణకు వచ్చింది. భారత్‌లోని జైళ్ల్లలో మౌలిక సదుపాయాలు సరిగా ఉండవని, సహజసిద్ధమైన వెలుతురు, పరిశుభ్రమైన గాలి ఉండదని మాల్యా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ముంబై సెంట్రల్ జైలులోని 12వ గదికి సంబంధించిన ఫొటోలను భారత్ అధికారులు కోర్టుకు సమర్పించారు. కాగా, ఈ ఫొటోలను ఆధారంగా చేసుకుని విచారణ జరపలేనని వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బర్నాట్ పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఆ 12వ గదిలోని అణువణువునూ వీడియో తీసి సమర్పించాల్సిందిగా ఆమె భారత అధికారులను ఆదేశించారు. ఎవరైనా వ్యక్తి ఫొటోలో ఉన్న తలుపు ద్వారా జైలులోకి వెళుతుండగా వీడియో తీయాలని జడ్జి చెప్పారు. అది కూడా మధ్యాహ్నం సమయంలో తీయాలని, దీంతో సూర్యకిరణాలు ఆ గదిలో పడుతున్నాయా లేదా అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. జైలు పరిస్థితులు మానవ హక్కుల కమిషన్ నిబంధనల మేరకే ఉన్నాయని భారత్ వాదించింది. అలాగే మాల్యాబెయిల్ను సెప్టెంబర్ 12 వరకు కోర్టు పొడిగించింది. మాల్యా బ్యాంకులకు 9వేల కోట్లు ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు ఊరట, జైలు వీడియో కోరిన కోర్టు
లండన్: వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఊరట లభించింది. భారత్‌కు మాల్యా అప్పగింత కేసును మంగళవారం విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు మాల్యా బెయిల్‌ను మరికొంత కాలం పొడిగించింది. మాల్యాకు బెయిల్ ఇవ్వొద్దన్న భారత ప్రభుత్వం అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అంతేకాదు మాల్యాను అప్పగిస్తే ఆయనను ఉంచబోయే ముంబై ఆర్దర్ రోడ్డులోని జైలు వీడియోను కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. 13 భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల మేర ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడు మాల్యాను భారత్‌కు అప్పగింత విషయమై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ఈ రోజు జరిగాయి. ఈ విచారణ నిమిత్తం కోర్టుకు మాల్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్యా మీడియాతో మాట్లాడారు. అక్రమంగా డబ్బులను విదేశాలకు తరలించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అలాగే భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకున్న రూ.14వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానన్నారు. అలాగే 2015నుంచి ఈ కేసును పరిష్కరించుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఆస్తులను ఎటాచ్ చేసిన తరువాత తాను చేయగలిగింది ఏముందన్న మాల్యా, తుది నిర్ణయాన్ని కోర్టు నిర్ణయిస్తుందన్నారు.