భారత్‌కు ఎప్పుడు వస్తారు..? | Vijay Mallya Was Asked When He Will Return To India | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఎప్పుడు వస్తారు..?

Published Sat, Sep 8 2018 4:32 PM | Last Updated on Sat, Sep 8 2018 8:19 PM

Vijay Mallya Was Asked When He Will Return To India - Sakshi

ఇంగ్లాండ్‌ : బ్యాంక్‌లకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా, ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ క్రికెట్‌ మైదానంలో దర్శనమిచ్చారు. భారత్‌కు, ఇంగ్లాండ్‌కు జరుగుతున్న 5వ టెస్ట్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు ఈ మైదానానికి వచ్చారు. మైదానానికి వచ్చిన విజయ్‌ మాల్యాను మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారంటూ ఓ రిపోర్టరు అడిగారు. దీనికి.. జడ్జినే అది నిర్ణయిస్తారంటూ చెప్పేసి మాల్యా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

క్రికెట్‌ స్టేడియం వెలుపల తానెలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పారు. మాల్యాను ఉద్దేశ్యపూర్వక ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో మాల్యాకు చెందిన రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయొచ్చని పేర్కొంది. మాల్యా దీనిపై సెప్టెంబర్‌ 24న తన స్పందన తెలియజేయనున్నారు. ప్రస్తుతం మాల్యాపై మనీ లాండరింగ్‌ ఛార్జీలున్నాయి. అప్పగింత ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత అతన్ని భారత్‌కు తీసుకురానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement