Oval cricket stadium
-
మూడోరోజు ముగిసిన ఆట.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
మూడోరోజు ముగిసిన ఆట.. 296 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. లబుషేన్ 41, కామెరాన్ గ్రీన్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ 296 పరుగులు లీడ్‌లో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌లోపే ఆసీస్‌ను ఆలౌట్ చేయడానికి టీమిండియా ప్రయత్నించాలి. ఒకవేళ ఆసీస్ 350 కంటే ఎక్కువ ఆధిక్యం సాధిస్తే మాత్రం భారత్‌కు ఓటమి తప్పకపోవచ్చు. అందుకే నాలుగో రోజు ఆటలో టీమిండియాకు తొలి సెషన్ చాలా కీలకం. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రెవిస్ హెడ్(18)ఔట్.. రెండో వికెట్ ఖాతాలో వేసుకున్న జడ్డూ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో టీమిండియాకు చుక్కలు చూపించిన ట్రెవిస్ హెడ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ చెక్ పెట్టాడు. 18 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్‌ను జడ్డూ కాట్ అండ్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఇద్దరి(స్మిత్, హెడ్) వికెట్లను జడేజానే తీయడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఆసీస్ 285 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 104/3 తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూకు చిక్కాడు. 34 పరుగులు చేసిన స్మిత్ జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతున్న ఆసీస్ 277 పరుగుల ఆధిక్యంలో ఉంది. నిలకడగా ఆడుతున్న స్మిత్, లబుషేన్.. ఆసీస్ 83/2 తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్‌తో పాటు లబుషేన్ నిలకడగా ఆడుతున్నారు. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. లబుషేన్ 34, స్మిత్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 256 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఎట్టకేలకు వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్.. ఖవాజా(13) ఔట్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌లెస్‌గా మిగిలపోయిన ఉమేశ్‌యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వికెట్ తీశాడు. 13 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. టీ విరామం.. ఆస్ట్రేలియా 23/1 టీ విరామ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 13, లబుషేన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వార్నర్ ఒక్క పరుగు చేసి సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్.. తొలి వికెట్ డౌన్ టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భాగంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన డేవిడ్ వార్నర్ సిరాజ్ బౌలింగ్‌లో భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి రెండు పరుగులు చేసింది. టీమిండియా 296 ఆలౌట్.. ఆసీస్‌కు 173 పరుగుల ఆధిక్యం ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అజింక్యా రహానే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శార్దూల్‌ఠాకూర్ 51, జడేజా 48 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు, స్టార్క్, బోలాండ్, గ్రీన్ తలా రెండు వికెట్లు తీయగా.. లియోన్ ఒక వికెట్ పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ ఫిఫ్టీ.. టీమిండియా 292/8 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్టార్ బ్యాటర్లంతా విఫలమైన చోట తాను మాత్రం అద్బుత ఇన్నింగ్స్ ఆడి 108 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ కెరీర్లో ఇది నాలుగో టెస్టు హాఫ్ సెంచరీ. ప్రస్తుతం టీమిండియా 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. రహానే(89) ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 261 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిది. లంచ్ విరామం అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కాసేపటికే 89 పరుగులు చేసిన రహానే కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఏడో వికెట్‌కు శార్దూల్-రహానేల 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. లంచ్ విరామం.. టీమిండియాను నిలబెట్టిన రహానే, శార్దూల్ లంచ్ విరామ సమయానికి టీమిండియా 60 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అజింక్యా రహానే 89 పరుగులు బ్యాటింగ్‌కు తోడుగా. శార్ధూల్ ఠాకూర్ 36 బ్యాటింగ్ క్రీజులో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించడంతో టీమిండియా కాస్త కోలుకుంది. అంతకముందు 151/5 క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కేఎస్ భరత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్.. రహానేతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియాను నిలబెడుతున్న రహానే, శార్దూల్ ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తన పోరాటం కొనసాగిస్తుంది. అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్లు టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 59 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. రహానే 89, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు వెనుకబడి ఉంది. అజింక్యా రహానే ఫిఫ్టీ.. 200 దాటిన టీమిండియా ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో కష్టాల్లో ఉన్న టీమిండియాను అజింక్యా రహానే గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓపికగా బ్యాటింగ్ చేస్తున్న రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. శార్దూల్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మూడోరోజు మొదలైన ఆట.. శ్రీకర్ భరత్ ఔట్ మూడోరోజు ఆట ప్రారంభమైన మొదటి ఓవర్లోనే టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. ఐదు పరుగులు చేసిన శ్రీకర్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 152 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ప్రస్తుతం అజింక్య రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), భరత్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కంగారూ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి కట్టుదిట్టమైన బంతులతో భారత బ్యాటర్లను కట్టి పడేశారు. జడేజా, రహానే కీలక భాగస్వామ్యంతో ఆదుకోకపోయుంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. సగం బ్యాటర్లు ఇప్పటికే పెవిలియన్ చేరగా, మరో 318 పరుగులు వెనుకబడి ఉన్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఎంత వరకు పోరాడుతుందనే దానిపైనే టెస్టు ఫలితం ఆధారపడి ఉంది. -
ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5
ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5 రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అజింక్యా రహానే 29, శ్రీకర్ భరత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, బోలాండ్, లియోన్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు వెనుకబడి ఉంది. ► 31 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. జడేజా 31, రహానే 22 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి ఔట్.. నాలుగో వికెట్ డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కోహ్లి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. పుజారా(14)ఔట్.. 50కే మూడు వికెట్లు డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన చతేశ్వర్ పుజారా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. దీంతో టీమిండియా 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ విరామం.. 37 పరుగులకే రెండు వికెట్లు డౌన్ టీ విరామ సమయానికి టీమిండియా 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. పుజారా 3, కోహ్లి 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(15), శుబ్‌మన్ గిల్(13) పరుగులు స్వల్ప వ్యవధి తేడాతో ఔటయ్యారు. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరు వెనుదిరిగారు. పాట్ కమిన్స్ రోహిత్‌ను వెనక్కి పంపిస్తే.. స్కాట్ బోలాండ్ గిల్ 13 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. 4 ఓవర్లలో 23/0 ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా పాజిటివ్‌గా ఆరంభించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రోహిత్, గిల్ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ 15, శుబ్‌మన్ గిల్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. నాలుగేసిన సిరాజ్.. ఆస్ట్రేలియా 469 ఆలౌట్ టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 182 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ట్రెవిస్ హెడ్ 163 పరుగులు, స్మిత్ 121, అలెక్స్ కేరీ 48, డేవిడ్ వార్నర్ 43 పరుగులుతో రాణించారు. టీమిండియా బౌలర్లో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. షమీ, శార్దూల్‌లు రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఒక వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా ఆలౌట్‌కు మరొక్క వికెట్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో నాథన్ లయాన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. ఎనిమిదో వికెట్ డౌన్.. అలెక్స్ కేరీ(48) రూపంలో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కేరీ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది. 113 ఓవర్లలో ఆస్ట్రేలియా 443/7 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో 113 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 40, పాట్ కమిన్స్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. లంచ్ విరామం.. ఆస్ట్రేలియా 109 ఓవర్లలో 422/7 రెండోరోజు ఆటలో భాగంగా లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 22, పాట్ కమిన్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు తీసి కాస్త ఆధిపత్యం ప్రదర్శించారు. అక్షర్ పటేల్ మెరుపు ఫీల్డింగ్.. మిచెల్ స్టార్క్ రనౌట్ టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ స్టన్నింగ్ రనౌట్‌తో మెరిశాడు. సిరాజ్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా బంతిని పుష్ చేశాడు. సింగిల్ రిస్క్ అని తెలిసినప్పటికి క్రీజు దాటాడు. అయితే బంతిని అందుకున్న అక్షర్ పటేల్ బంతిని డైరెక్ట్ హిట్ చేశాడు. దీంతో స్టార్క్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది. 400 పరుగుల మార్క్ దాటిన ఆసీస్ టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 400 మార్క్‌ను దాటింది. 103 ఓవర్లలో 3.89 రన్‌రేట్‌తో 400 స్కోరును అందుకుంది. అలెక్స్ కేరీ 13, మిచెల్ స్టార్క్ 5 పరుగులతో ఆడుతున్నారు. శార్దూల్ బౌలింగ్‌లో స్మిత్ క్లీన్‌బౌల్డ్ టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 121 పరుగులు చేసిన స్మిత్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్(6) ఔట్.. ఐదో వికెట్ డౌన్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. తాజాగా ఆరు పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన సిరాజ్.. నాలుగో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాకు సిరాజ్ బ్రేక్ అందించాడు. 285 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారిన స్మిత్, ట్రెవిస్ హెడ్ జంటను సిరాజ్ విడదీశాడు. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికి సిరాజ్ బౌలింగ్‌లో హెడ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో 163 పరుగుల హెడ్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. రెండోరోజు మొదలైన ఆట.. స్టీవ్ స్మిత్ సెంచరీ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట మొదలైంది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించింది. స్టీవ్ స్మిత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా స్మిత్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలిరోజు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా పూర్తి ఆదిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 146 పరుగులు బ్యాటింగ్ అజేయ సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్ 95 పరుగులు బ్యాటింగ్ ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. వీలైనంత తొందరగా ఈ జోడిని విడదీయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పేలా లేవు. -
తొలిరోజు ఆసీస్‌దే.. పూర్తిగా తేలిపోయిన టీమిండియా బౌలర్లు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(95 పరుగులు బ్యాటింగ్) టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. మలి రెండు సెషన్లు కలిపి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రెవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కొనసాగించారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోజు ముగిసే సరికి 150 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే రెండోరోజు ఆటలో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు తన మార్క్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మిత్ 95 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కే పనిలో ఉన్నాడు. రెండో రోజు ఆటలో స్మిత్ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా -
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియాపై ఆసీస్ ఆధిపత్యం
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా.. స్టీవ్ స్మిత్ 95 పరుగులు బ్యాటింగ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. రోజంతా కష్టపడి బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. మొత్తం మీద తొలిరోజు ఆస్ట్రేలియా టీమిండియాపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. సెంచరీ దిశగా స్మిత్.. 300 దాటిన ఆసీస్ స్కోరు టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి రోజే స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. 82 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 129, స్టీవ్ స్మిత్ 91 పరుగులతో ఆడుతున్నారు. ట్రెవిస్ హెడ్ సెంచరీ.. పట్టు బిగిస్తోన్న ఆసీస్ టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్ 106 బంతుల్లో శతకం మార్క్ అందుకోవడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ట్రెవిస్ హెడ్ చరిత్రకెక్కాడు. ఆట తొలిరోజే ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. స్మిత్ 53 పరుగులతో హెడ్‌కు సహకరిస్తున్నాడు. సెంచరీ దిశగా ట్రెవిస్ హెడ్.. ఆసీస్ 60 ఓవర్లలో 221/3 ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రెవిస్ హెడ్ సెంచరీకి దగ్గరయ్యాడు. అతనికి తోడుగా స్మిత్ కూడా నిలకడగా ఆడుతుండడంతో ఆస్ట్రేలియా తొలిరోజే పట్టు బిగిస్తోంది. 60 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. హెడ్ 93, స్మిత్ 49 పరుగులతో ఆడుతున్నారు. టీ విరామం.. ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీ.. ఆసీస్ 170/3 ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిలకడగా సాగుతుంది. టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 51 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 60, స్టీవ్ స్మిత్ 33 పరుగులతో ఆడుతున్నారు. 38 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 141/3 టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 38 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 37, స్మిత్ 28 పరుగులతో ఆడుతున్నారు. 32 ఓవర్లలో ఆసీస్ స్కోరు 116/3 32 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 29, స్టీవ్ స్మిత్ 13 పరుగులతో ఆడుతున్నారు. షమీ బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్‌బౌల్డ్.. మూడో వికెట్ డౌన్ లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ తొలి బంతికే లబుషేన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉంది. లంచ్ విరామం.. ఆసీస్ 23 ఓవర్లలో 73/2 లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లబుషేన్ 26, స్మిత్ రెండు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వార్నర్ 43 పరుగులు చేసి ఔటవ్వగా.. ఉస్మాన్ ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్‌లు చెరొక వికెట్ పడగొట్టారు. డేవిడ్ వార్నర్(43) ఔట్.. రెండో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన వార్నర్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆసీస్ 22 ఓవరల్లో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. లబుషేన్ 26 పరుగులతో ఆడుతున్నాడు. 15 ఓవర్లలో ఆసీస్ స్కోరు 54/1 15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. వార్నర్ 37, లబుషేన్ 16 పరుగులతో ఆడుతున్నారు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వార్నర్ నాలుగు ఫోర్లు బాదడంతో ఆసీస్ స్కోరు 50 దాటింది. 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 22/1 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వార్నర్ 13, లబుషేన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఖవాజా డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ టీమిండియాతో ఆడుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్‌లో కేఎస్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందా.. లేదంటే తొలిసారి ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా టైటిల్ దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. తుది జట్లు.. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆందోళనకారుల ముప్పు.. ఐసీసీ కీలక నిర్ణయం
లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ బుధవారం(జూన్7) నుంచి ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్‌లో ప్రస్తుతం ఇంధన సంస్ధలకు వ్యతిరేకంగా నిరసనలు జరగుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఓవల్ పిచ్ ను ధ్వంసం చేస్తామని కూడా ఆందోళనకారులు హెచ్చరించారు. దీంతో ఐసీసీ ముందస్తు జాగ్రత్తగా ఓవల్‌లో రెండు మ్యాచ్‌లు తయారు చేసింది. ఈ ప్రత్నమాయ పిచ్‌లను తయారు చేయించడానికి ఐసీసీ తమ ప్లేయింగ్ కండిషన్స్ లోని సెక్షన్ 6.4ను 6.4ని కూడా సవరించింది. ఒకవేళ మ్యాచ్ జరిగే పిచ్ దెబ్బతింటే అప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత మరో పిచ్‌ను వాడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా టీమిండియా, ఆస్ట్రేలియా కెప్టెన్లు పాట్ కమిన్స్, రోహిత్ శర్మల అనుమతి కూడా తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు కెప్టెన్లు రెండో పిచ్‌పై ఆడేందుకు అంగీకరిస్తే అప్పుడు మ్యాచ్ కొనసాగుతుంది, లేదంటే రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నిరసనకారులు నుంచి ఈ మ్యాచ్‌కు ముప్పు పొంచి ఉండడంతో స్టేడియం వద్ద భారీ భద్రతను ఐసీసీ ఏర్పాటు చేసింది. చదవండి: WTC Final 2023: హాజల్‌వుడ్ స్థానంలో బోలండ్.. ఆసీస్ తుది జట్టు ఇదే! -
WTC Final 2023: ‘ఓవల్’ను ఓ లుక్కేద్దామా!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానం వేదిక కానున్న సంగతి తెలిసిందే. జూన్ 7న ఇరు జట్ల మధ్య ఈ మెగా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఓవల్ స్టేడియం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఇంగ్లండ్‌లో అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ క్రికెట్ మైదానాలలో ఓవల్ ఒకటి. 1845లో ఈ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియం కెపాసీటీ 27,500. ఇంగ్లండ్‌లో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన తొలి మైదానం కూడా ఓవలే కావడం గమనార్హం. 1880 సెప్టెంబరులో ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. అదే విధంగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ సీజన్ చివరి మ్యాచ్ కూడా అనవాయితీగా ఇదే మైదానంలో జరుగుతుంది. ఇక ఇదే స్టేడియంలో 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక క్రికెట్ మాత్రమే కాకుండా ఫిపా ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా ఓవల్ ఆతిథ్యం ఇచ్చింది. హాకీ, రగ్బీ వంటి ఇతర క్రీడలకు సంబంధించిన మ్యాచ్‌లు కూడా ఈ స్టేడియంలో జరిగాయి. ఇది సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌కు హోం గ్రౌండ్. యాషెస్ పుట్టుకకు కారణం.. 1882లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. అయితే ఇంగ్లండ్ ఓటమిని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు ప్రచురించాయి. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది" అంటూ స్పోర్టింగ్ టైమ్స్ రాసుకొచ్చింది. ఈ తరువాత ఏడాది ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు, ఆంగ్ల మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ వార్తలు ప్రచురించాయి. ఆతర్వాత ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. ఓవల్ టెస్టు రికార్డులు ఎలా ఉన్నాయంటే? అత్యధిక స్కోర్: 1938లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 7 వికెట్ల నష్టానికి 903 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ లియోనార్డ్ హట్టన్ 364 పరుగులతో చెలరేగాడు. ఇప్పటివరకు ఓవల్ ఇదే అత్యధిక స్కోర్. అత్యల్ప స్కోర్: ఈ వేదికపై 1896లో ఆస్ట్రేలియా అత్యల్ప జట్టు స్కోరు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగరూ జట్టు కేవలం 44 పరుగులకే ఆలౌటైంది. అత్యధిక పరుగులు: ఓవల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లియోనార్డ్ హట్టన్ పేరిట ఉంది. ది ఓవల్‌లో అతడు 1,521 పరుగులు చేశాడు. ఈ మైదానంలో అతడు నాలుగు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు చేశాడు. అత్యధిక వికెట్లు: ఈ మైదానంలో టెస్టుల్లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అతడు 11 మ్యాచ్‌లలో 26.51 సగటుతో మరియు 3.61 ఎకానమీతో 52 టెస్ట్ వికెట్లు తీశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు: ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిస్కోర్ సాధించిన రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లియోనార్డ్ హట్టన్ పేరిటే ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో లియోనార్డ్ హట్టన్ 364 చేశాడు. ఓవల్‌లో భారత రికార్డు ఎలా ఉందంటే? భారత జట్టు 1936 నుండి ఓవల్‌లో ఆడుతోంది. అయితే ఈ వేదికపై మొదటి విజయాన్ని సాధించేందుకు భారత్‌కు 35 ఏళ్లు పట్టింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో ఇంగ్లండ్‌పై తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకూ ఈ వేదికపై 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్.. కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలవ్వగా.. ఏడు డ్రాగా ముగిశాయి. చదవండి: WTC Final 2023: రంగు రంగుల రబ్బరు బంతులతో టీమిండియా ప్రాక్టీస్.. రియాక్షన్ బాల్స్ అంటే ఏంటి? -
డబ్ల్యూటీసీ ఫైనల్ డ్రా అయితే.. విజేత ఎవరంటే?
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి భారత జట్టు సిద్దమైంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్ సేన.. వరుస ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. పటిష్ట ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కూడా తమ సన్నహాకాలను ప్రారంభించింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఓ సారి తెలుసుకుందాం. WTC Final poster by Hotstar. pic.twitter.com/yps91HHJsO — Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? డబ్ల్యూటీసీ ఫైనల్ లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు జరగనుంది. ఇండియాలో ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే? డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే ఐదో రోజుల్లో వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఆ రోజు ఆటను రిజర్వ్ డే రోజు కొనసాగిస్తారు. జూన్12ను రిజర్వ్ డేగా ఐసీసీ నిర్ణయించింది. డ్రాగా ముగిస్తే విజేత ఎవరంటే? ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే భారత్-ఆస్ట్రేలియా జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది. ఇరు జట్లకు ట్రోఫీని అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఎంతంటే? డబ్ల్యూటీసీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు 13.22 కోట్లు ప్రైజ్‌మనీని అందజేస్తున్నారు. రన్నరప్‌కు 6.61 కోట్లు దక్కనుంది. Indian bowling unit is ready for WTC final. pic.twitter.com/g1hsfEIL9E — Johns. (@CricCrazyJohns) June 2, 2023 చదవండి: Womens Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే? -
WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021-23 ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు సౌత్ లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఇతర రికార్డుల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఆసీస్‌ను తెగ కలవరపెడుతుంది. అదేంటంటే.. ఇంగ్లండ్‌లోని మొత్తం వేదికల్లో ఓవల్ మైదానంలోనే ఆస్ట్రేలియాకు అతి తక్కువ సక్సెస్‌రేట్ ఉండటం. 1880లో జరిగిన ఇనాగురల్ టెస్ట్ మ్యాచ్ నుంచి ఈ వేదికపై ఆసీస్ ఆడిన 38 మ్యాచ్‌ల్లో కేవలం ఏడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు విన్నింగ్ రేటియో ఈ మైదానంలో 18.42గా ఉంది. ఇంగ్లండ్ మొత్తంలో ఆసీస్ ఈ మైదానంలోనే అతి స్వల్ప సక్సెస్ రేట్ కలిగి ఉంది. గడిచిన 50 ఏళ్లలో ఓవల్‌లో ఆస్ట్రేలియా కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆసీస్‌కు ఇంగ్లండ్‌లో అత్యధికంగా లార్డ్స్‌లో అత్యధిక సక్సెస్ రేట్ (39.72) ఉంది. మరోవైపు టీమిండియాకు సైతం ఓవల్‌లో పెద్ద మెరుగైన రికార్డు ఏమీ లేదు. భారత జట్టు ఇక్కడ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే విజయం సాధించింది. భారత్.. చివరిసారిగా ఇక్కడ 2021లో గెలుపొందింది. నాటి మ్యాచ్‌లో భారత్.. 157 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. రికార్డుల విషయం పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత్, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు ఇదివరకే లండన్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నప్పటికీ.. ఆసీస్‌తో పోలిస్తే టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. గిల్, కోహ్లి, షమీ సూపర్ ఫామ్‌లో ఉండటం టీమిండియా అదనంగా కలిసొచ్చే అంశం. చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..? -
ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు
అజింక్యా రహానే కొన్నేళ్లుగా టీమిండియా తరపున టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతూ వచ్చాడు. గతేడాది సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో దారుణ వైఫల్యం తర్వాత రహానే జట్టులో చోటు కోల్పోయాడు. అయితే రహానే పెద్దగా ఏం బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం తనను వెతుక్కుంటూ వస్తుందని భావించాడు. అయితే ఐపీఎల్‌ను అందుకు మూలంగా మార్చుకున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున ఆడిన రహానే ఎవరు ఊహించని రీతిలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రహానే.. ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లాడి 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు సాధించాడు.ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శన రహానేను తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తుది జట్టులో చోటు సంపాదించాడు. ఒకప్పుడు రెగ్యులర్ టెస్టు బ్యాటర్ అయిన రహానే శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీతో మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నాడు. ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ ఏడు నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. రహానేను ఊరిస్తున్న రికార్డులు.. ఈ నేపథ్యంలోనే రహానే ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రహానే ఈ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 82 టెస్టులాడిన రహానే 4931 పరుగులు చేశాడు. మరో 69 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల మార్క్ అందుకుంటాడు. రహానే ఖాతాలో టెస్టుల్లో 12 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రహానే.. ఇప్పటి వరకు ఆడిన 82 మ్యాచ్‌ల్లో 99 క్యాచ్‌లు పట్టాడు. మరొకటి పడితే వంద క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. ఇక రహానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12,865 పరుగులు చేశాడు. మరో 135 పరుగులు చేస్తే 13వేల పరుగులు సాధించినట్లవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్ ఇప్పుడు మళ్లీ ఆసీస్‌తోనే ఫైనల్ ఆడనుంది. ఈ ఫైనల్ కోసం టీమిండియా మూడు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకుంది. చివరి బ్యాచ్‌లో అజింక్యా రహానేతో పాటు కేఎస్ భరత్, శుభ్‌మాన్ గిల్, షమీ, రవీంద్ర జడేజాలు వచ్చారు. వీరంతా ఐపీఎల్ ఫైనల్ ఆడిన సీఎస్కే, గుజరాత్ టైటాన్స్‌లో సభ్యులు. మరోవైపు ఐపీఎల్ తర్వాత.. యువ ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ లో చోటు దక్కింది. తాజా రిపోర్టుల ప్రకారం రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ను రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంచుకున్నారు. ఎందుకంటే గైక్వాడ్‌కు జూన్ 3న వివాహం జరగబోతుంది. ఈ కారణంగా అతడు భారత జట్టుతో జూన్ 5 తర్వాతే కలవనున్నాడు. దీంతో అతడి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వికి అవకాశం కల్పించారు సెలక్టర్లు. స్టాండ్ బై ప్లేయర్స్ లిస్టులో జైస్వాల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నాడు. చదవండి: రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. మళ్లీ విజృంభించేనా? -
రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. మళ్లీ విజృంభించేనా?
మరో వారం రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది కీలకంగా మారింది. టీమిండియా తరపున డబ్ల్యూటీసీస టైటిల్ సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలుస్తాడా లేదా అనేది ఒక వారంలో తేలుతుంది. గతంలో కోహ్లికి ఆ అవకాశం వచ్చినప్పటికి 2021 డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌తో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ గెలిచి గదను(డబ్ల్యూటీసీ టైటిల్) అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టీమిండియా కూడా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానం కెప్టెన్ రోహిత్‌కు అచ్చొచ్చింది. ఓవల్ వేదికగా 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ శతకంతో మెరిశాడు. హిట్‌మ్యాన్‌కు విదేశాల్లో ఇదే తొలి శతకం కావడం విశేషం. మరి రోహిత్‌కు అచ్చొచ్చిన ఓవల్‌లో మరోసారి సెంచరీతో చెలరేగి టీమిండియాను గెలిపించి టైటిల్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 2021లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కావడంతో వంద పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127 పరుగులు) సెంచరీకి తోడుగా పుజారా 61, రిషబ్ పంత్ 50, శార్దూల్ ఠాకూర్ 60, కోహ్లి 44, రాహుల్ 46 పరుగులతో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌట్ అయింది. 365 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. Oval was the ground that saw Rohit Sharma score his first-ever century outside India. Replicate it skipper! 🇮🇳 #WTCFinal2023 | @ImRo45 pic.twitter.com/Y3u5GH9L8Z — Vicky Singh (@VickyxCricket) June 1, 2023 చదవండి: #SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా! సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్ -
అతడు అత్యుత్తమ బౌలర్.. డబ్ల్యూటీసీ ట్రోఫీ గెలిచేది వాళ్లే: ఆసీస్ మాజీ కెప్టెన్
World Test Championship 2023 FInal Ind Vs Aus: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జూన్ 7- 11 వరకు మ్యాచ్ జరుగనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో రోహిత్ సేన.. కమిన్స్ బృందాన్ని ఢీకొట్టనుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ 2019-21 సీజన్లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఫైనల్ చేరగా.. కంగారూలు తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించారు. ఇక ఇందుకు సన్నాహకంగా అన్నట్లు ఇరు జట్ల మధ్య భారత్ వేదికగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఫేవరెట్ టీమిండియా ఇందులో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే న్యూజిలాండ్- శ్రీలంక మధ్య తొలి టెస్టు.. ఫైనల్లో ఆసీస్‌కు ప్రత్యర్థిగా టీమిండియాను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ సారథి ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని వ్యాఖ్యానించాడు. ట్రోఫీ గెలిచే అవకాశాలు రోహిత్ సేనకే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. సిరాజ్ ఉన్నాడు కదా! ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్‌లు ఆడే విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. అయితే.. షమీ, ఉమేశ్, సిరాజ్.. ఈ ముగ్గురు మంచి ఫాస్ట్ బౌలర్లు. ముఖ్యంగా సిరాజ్.. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలుపెట్టగలడు. గతంలో టీమిండియా ఇంగ్లండ్‌ను ఇంగ్లండ్‌లోనే ఓడించి సత్తా చాటింది. కాబట్టి ఈసారి ఫైనల్లో వాళ్లకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు’’ అని ఫించ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌తో బిజీగా ఉన్న అతడు హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన పేసర్ బుమ్రా లేకుండానే ఈసారి భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఫించ్ సిరాజ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం. చదవండి: Ind Vs Aus: గిల్‌కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించేది అతడే: హార్దిక్‌పాండ్యా Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు! నంబర్ 1 బౌలర్ అశూ.. నంబర్ 1 ఆల్‌రౌండర్ జడ్డూ.. ఫైనల్లో ఆడేది ఎవరో ఒక్కరే! -
WTC Final: ఏ లెక్కన ఆసీస్‌ను ఓడించదో చెప్పండి?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసినప్పటికి తొలి రెండు టెస్టుల్లో టీమిండియానే విజయం వరించింది. ఇక మూడో టెస్టులో ఆసీస్ విజయాన్ని అందుకుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే నాలుగో టెస్టులో టీమిండియా గెలవాల్సిన అవసరం ఉన్నప్పటికి.. న్యూజిలాండ్ చేతిలో లంక పరాజయం పాలవ్వడంతో మనకు లైన్ క్లియర్ అయింది. దీంతో వరుసగా రెండోసారి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. జూన్ 9న ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచేది టీమిండియానే అని భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఏ లెక్కన టీమిండియా ఆసీస్‌ను ఓడించదో చెప్పండంటూ పేర్కొన్నాడు. రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో గంగూలీ మాట్లాడుతూ.. ''మొదట ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్. అయితే ఇంగ్లండ్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియాను ఎందుకు ఓడించదో ఒక్క కారణం చెప్పండి. ఎందుకంటే 2020-21లో ఆసీస్‌ను వారిగడ్డపైనే ఓడించింది.. మరోసారి స్వదేశంలో వారిని మట్టికరిపించింది. ఇంగ్లండ్ గడ్డపై జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియాకు బ్యాటింగ్ కీలకం కానుంది. తొలి ఇన్నింగ్స్‌లో 350 నుంచి 400 పరుగులు చేస్తే కచ్చితంగా టీమిండియాదే గెలుపు. ఇక శుబ్‌మన్ గిల్ లాంటి ప్లేయర్ టెస్టులకు దొరకడం టీమిండియా అదృష్టం. చంఢీఘర్‌లో పుట్టి పెరిగిన గిల్ తొలి టెస్టు సెంచరీని అందుకున్నాడు. 235 బంతుల్లో 128 పరుగులు చేసిన గిల్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. గత ఆరు, ఏడు నెలలుగా గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ తన ప్రదర్శనతో టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. BREAKING 🚨 🗣️ "India have beaten Australia in Australia, they have beaten them here. No reason why they will not beat them again"- Sourav Ganguly on India’s chances in #WTCFinal Stay tuned for the full interview of @SGanguly99 by @debasissen#INDvAUS #INDvsAUS pic.twitter.com/6OcVwRcmmd — RevSportz (@RevSportz) March 14, 2023 చదవండి: 'ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం' -
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
ICC World Test Championship 2021 - 2023: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021- 23 సీజన్ ఫైనల్ తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7న ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుందని పేర్కొంది. జూన్ 12ను రిజర్వుడేగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. కివీస్‌దే తొలి ట్రోఫీ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియాను ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక తాజా సీజన్లో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో ఆస్ట్రేలియా, టీమిండియా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు టాప్-2లో ఉన్న ఈ రెండు పటిష్ట జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కీలకం కానుంది. టీమిండియా- ఆసీస్ పోటాపోటీ అయితే, ఆస్ట్రేలియా 136 పాయింట్ల(75.56 పర్సంటైల్)తో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ 99 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏకపక్షంగా సిరీస్ గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అలా అయితే కంగారూలకు కష్టాలు తప్పవు. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా ఆసీస్ దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లనిపిస్తున్నా.. శ్రీలంక, సౌతాఫ్రికా జట్లకు మిగిలి ఉన్న సిరీస్‌ల ఫలితాలు తేలే వరకు వేచి చూడాల్సిందే. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక, సౌతాఫ్రికా మిగిలిన సిరీస్‌లు ఆడిన తర్వాతే ఫైనలిస్టులకు సంబంధించి స్పష్టత వస్తుంది. ది ఓవల్ క్రికెట్ స్టేడియం ఇక క్రికెట్ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ గతంలో ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఓవల్‌కు వేదికను మార్చింది. కాగా ఓవల్ స్టేడియం దక్షిణ లండన్‌లోని కెన్నింగ్టన్లో ఉంది. 1845లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి అంతర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఇక్కడే ఆడటం ఆనవాయితీగా కొనసాగుతోంది. చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి' Rishabh Pant: 'స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే హాయిగా ఉంది' -
మంచు దుప్పటిలో ప్రసిద్ధ స్టేడియం! ఇంగ్లండ్ జట్టుకు సెంటిమెంట్.. గుర్తుపట్టారా?!
Snowfall In London: యునైటెడ్ కింగ్డంలో చలి పులి పంజా విసురుతోంది. వాతావరణంలో భారీ మార్పుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మైనస్ 10- 12 డిగ్రీలకు పడిపోతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో ఎటు చూసినా మంచుతో కప్పబడిన ప్రదేశాలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ వాతావరణ పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ ఓవల్ క్రికెట్ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గ్రౌండ్ మొత్తం పూర్తిగా ‘మంచు దుప్పటి’తో కప్పబడి ఉంది. మైదానంలో ఎటు చూసినా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు. ప్రకృతితో ఆటలాడితే మనుషుల గతి అధోగతే! ఏదేమైనా.. ఓవల్ మైదానం సూపర్‌గా కనిపిస్తోంది. క్రికెట్‌కు బదులు ఇక్కడ ఐస్ హాకీ ఆడుకోవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పడిపోతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రజలు చలికి వణికిపోతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ది ఓవల్ క్రికెట్ స్టేడియం దక్షిణ లండన్‌లోని కెన్నింగ్టన్లో ఉందీ స్టేడియం. 1845లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి అంతర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. కాగా ప్రతి సీజన్లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఇక్కడే ఆడటం ఆనవాయితీగా కొనసాగుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్! ఆల్‌రౌండర్ అరంగేట్రం -
భారత్‌కు ఎప్పుడు వస్తారు..?
ఇంగ్లాండ్ : బ్యాంక్‌లకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, ఇంగ్లాండ్‌లోని ఓవల్ క్రికెట్ మైదానంలో దర్శనమిచ్చారు. భారత్‌కు, ఇంగ్లాండ్‌కు జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌ను తిలకించేందుకు ఈ మైదానానికి వచ్చారు. మైదానానికి వచ్చిన విజయ్ మాల్యాను మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారంటూ ఓ రిపోర్టరు అడిగారు. దీనికి.. జడ్జినే అది నిర్ణయిస్తారంటూ చెప్పేసి మాల్యా అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్రికెట్ స్టేడియం వెలుపల తానెలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వనని చెప్పారు. మాల్యాను ఉద్దేశ్యపూర్వక ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో మాల్యాకు చెందిన రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయొచ్చని పేర్కొంది. మాల్యా దీనిపై సెప్టెంబర్ 24న తన స్పందన తెలియజేయనున్నారు. ప్రస్తుతం మాల్యాపై మనీ లాండరింగ్ ఛార్జీలున్నాయి. అప్పగింత ప్రక్రియలన్నీ అయిపోయిన తర్వాత అతన్ని భారత్‌కు తీసుకురానున్నారు. #WATCH: Vijay Mallya seen entering The Oval cricket ground in London's Kenington. The 5th test match between India and England is being played at the cricket ground. #England pic.twitter.com/NA3RQOKkRJ — ANI (@ANI) September 7, 2018 #WATCH: Vijay Mallya when asked if he will go back to India says, "judge will decide," outside The Oval in London's Kennington. pic.twitter.com/CmJY6YU9Um — ANI (@ANI) September 8, 2018 -
భారత్ ‘ఎ’ మరో విజయం
డార్విన్: కేదార్ జాదవ్ (53 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శామ్సన్ (80 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) చెలరేగడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గార్డెన్స్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఎన్పీఎస్ (నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్)పై గెలిచింది. టాస్ గెలిచి భారత్-ఎ ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఎన్పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 234 పరుగులు చేసింది. టర్నర్ (89 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్సర్), సిల్క్ (87 బంతుల్లో 67; 5 ఫోర్లు) అబాట్ (39 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించారు. శుక్లా, రిషీ ధావన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ 39.5 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జాదవ్, శామ్సన్ ఆరో వికెట్‌కు 112 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. మురిహెడ్ 4, అబాట్ 2 వికెట్లు పడగొట్టారు. -
కారు ప్రమాదంలో గాయపడిన వెస్టిండీస్ క్రికెటర్!
బ్రిడ్జ్ టౌన్: వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కేమర్ రోచ్ కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. రోచ్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ వాహనం అదుపుతప్పడంతో బ్రిడ్జ్ టౌన్ నగర శివారులోని వన్స్టీడ్ డ్రైవ్ సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది. ఓవల్ క్రికెట్ స్టేడియానికి సమీపాన జరిగిన ఈ ప్రమాదంలో కారు పలుమార్లు పల్టీలు కొట్టిందని బార్బోడోస్ చెందిన వెబ్ సైట్ తెలిపింది. ఈ ప్రమాదంలో రోచ్ తలకు గాయమైందని... ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. వెస్టిండీస్ తరపున 23 టెస్టులు, 61 వన్డేలు ఆడిన రోచ్ గాయం కారణంగా ఏడాది కాలంగా జట్టుకు దూరమయ్యాడు.