ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5 | WTC Final 2023: India Vs Australia Match Day-2 Live Updates-Highlights | Sakshi
Sakshi News home page

WTC Final Day-2: ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5

Published Thu, Jun 8 2023 3:12 PM | Last Updated on Fri, Jun 9 2023 8:31 AM

WTC Final 2023: India Vs Australia Match Day-2 Live Updates-Highlights - Sakshi

ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా స్కోరు 151/5
రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అజింక్యా రహానే 29, శ్రీకర్‌ భరత్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌, బోలాండ్‌, లియోన్‌, కామెరాన్‌ గ్రీన్‌ తలా ఒక వికెట్‌ తీశారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు వెనుకబడి ఉంది.

► 31 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. జడేజా 31, రహానే 22 పరుగులతో ఆడుతున్నారు.

కోహ్లి ఔట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కోహ్లి మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

పుజారా(14)ఔట్‌.. 50కే మూడు వికెట్లు డౌన్‌
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన చతేశ్వర్‌ పుజారా కామెరాన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.. దీంతో టీమిండియా 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

టీ విరామం.. 37 పరుగులకే రెండు వికెట్లు డౌన్‌
టీ విరామ సమయానికి టీమిండియా 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. పుజారా 3, కోహ్లి 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్లు రోహిత్‌ శర్మ(15), శుబ్‌మన్‌ గిల్‌(13) పరుగులు స్వల్ప వ్యవధి తేడాతో ఔటయ్యారు.

రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు షాక్‌ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరు వెనుదిరిగారు. పాట్‌ కమిన్స్‌ రోహిత్‌ను వెనక్కి పంపిస్తే.. స్కాట్‌ బోలాండ్‌ గిల్‌ 13 పరుగుల వద్ద పెవిలియన్‌ పంపాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా.. 4 ఓవర్లలో 23/0
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా పాజిటివ్‌గా ఆరంభించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రోహిత్‌, గిల్‌ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్‌ 15, శుబ్‌మన్‌ గిల్‌ ఆరు పరుగులతో ఆడుతున్నారు.

నాలుగేసిన సిరాజ్‌.. ఆస్ట్రేలియా 469 ఆలౌట్‌
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్‌ అయింది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ మరో 182 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ట్రెవిస్‌ హెడ్‌ 163 పరుగులు, స్మిత్‌ 121, అలెక్స్‌ కేరీ 48, డేవిడ్‌ వార్నర్‌ 43 పరుగులుతో రాణించారు. టీమిండియా బౌలర్లో సిరాజ్‌ నాలుగు వికెట్లు తీయగా.. షమీ, శార్దూల్‌లు రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఒక వికెట్‌ తీశాడు.

ఆస్ట్రేలియా ఆలౌట్‌కు మరొక్క వికెట్‌..
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో నాథన్‌ లయాన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది.

ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
అలెక్స్‌ కేరీ(48) రూపంలో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కేరీ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 454 పరుగులు చేసింది.

113 ఓవర్లలో ఆస్ట్రేలియా 443/7
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో 113 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ 40, పాట్‌ కమిన్స్‌ ఐదు పరుగులతో ఆడుతున్నారు.

లంచ్‌ విరామం.. ఆస్ట్రేలియా 109 ఓవర్లలో 422/7
రెండోరోజు ఆటలో భాగంగా లంచ్‌ విరామం సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ 22, పాట్‌ కమిన్స్‌ రెండు పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్‌లో టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు తీసి కాస్త ఆధిపత్యం ప్రదర్శించారు.

అక్షర్‌ పటేల్‌ మెరుపు ఫీల్డింగ్‌.. మిచెల్‌ స్టార్క్‌ రనౌట్‌
టీమిండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్టన్నింగ్‌ రనౌట్‌తో మెరిశాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా బంతిని పుష్‌ చేశాడు. సింగిల్‌ రిస్క్‌ అని తెలిసినప్పటికి క్రీజు దాటాడు. అయితే బంతిని అందుకున్న అక్షర్‌ పటేల్‌ బంతిని డైరెక్ట్‌ హిట్‌ చేశాడు. దీంతో స్టార్క్‌ రనౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది.

400 పరుగుల మార్క్‌ దాటిన ఆసీస్‌
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా 400 మార్క్‌ను దాటింది. 103 ఓవర్లలో 3.89 రన్‌రేట్‌తో 400 స్కోరును అందుకుంది. అలెక్స్‌ కేరీ 13, మిచెల్‌ స్టార్క్‌ 5 పరుగులతో ఆడుతున్నారు.

శార్దూల్‌ బౌలింగ్‌లో స్మిత్‌ క్లీన్‌బౌల్డ్‌
టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 121  పరుగులు చేసిన స్మిత్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.

కామెరాన్‌ గ్రీన్‌(6) ఔట్‌.. ఐదో వికెట్‌ డౌన్‌
రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. తాజాగా ఆరు పరుగులు చేసిన కామెరాన్‌ గ్రీన్‌ షమీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చిన సిరాజ్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాకు సిరాజ్‌ బ్రేక్‌ అందించాడు. 285 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారిన స్మిత్‌, ట్రెవిస్‌ హెడ్‌ జంటను సిరాజ్‌ విడదీశాడు. రెండోరోజు ఆట మొదలైన కాసేపటికి సిరాజ్‌ బౌలింగ్‌లో హెడ్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో 163 పరుగుల హెడ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది.

రెండోరోజు మొదలైన ఆట.. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట మొదలైంది. మూడు వికెట్ల నష్టానికి 327 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించింది. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా స్మిత్‌ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.

తొలిరోజు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా పూర్తి ఆదిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్‌ హెడ్‌ 146 పరుగులు బ్యాటింగ్‌ అజేయ సెంచరీ చేయగా.. స్టీవ్‌ స్మిత్‌ 95 పరుగులు బ్యాటింగ్‌ ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఇ‍ప్పటికే నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. వీలైనంత తొందరగా ఈ జోడిని విడదీయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పేలా లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement