టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా.. స్టీవ్ స్మిత్ 95 పరుగులు బ్యాటింగ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. రోజంతా కష్టపడి బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. మొత్తం మీద తొలిరోజు ఆస్ట్రేలియా టీమిండియాపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.
సెంచరీ దిశగా స్మిత్.. 300 దాటిన ఆసీస్ స్కోరు
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి రోజే స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. 82 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 129, స్టీవ్ స్మిత్ 91 పరుగులతో ఆడుతున్నారు.
ట్రెవిస్ హెడ్ సెంచరీ.. పట్టు బిగిస్తోన్న ఆసీస్
టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్ 106 బంతుల్లో శతకం మార్క్ అందుకోవడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ట్రెవిస్ హెడ్ చరిత్రకెక్కాడు. ఆట తొలిరోజే ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. స్మిత్ 53 పరుగులతో హెడ్‌కు సహకరిస్తున్నాడు.
సెంచరీ దిశగా ట్రెవిస్ హెడ్.. ఆసీస్ 60 ఓవర్లలో 221/3
ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రెవిస్ హెడ్ సెంచరీకి దగ్గరయ్యాడు. అతనికి తోడుగా స్మిత్ కూడా నిలకడగా ఆడుతుండడంతో ఆస్ట్రేలియా తొలిరోజే పట్టు బిగిస్తోంది. 60 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. హెడ్ 93, స్మిత్ 49 పరుగులతో ఆడుతున్నారు.
టీ విరామం.. ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీ.. ఆసీస్ 170/3
ట్రెవిస్ హెడ్ అర్థసెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిలకడగా సాగుతుంది. టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 51 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 60, స్టీవ్ స్మిత్ 33 పరుగులతో ఆడుతున్నారు.
38 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 141/3
టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 38 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 37, స్మిత్ 28 పరుగులతో ఆడుతున్నారు.
32 ఓవర్లలో ఆసీస్ స్కోరు 116/3
32 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 29, స్టీవ్ స్మిత్ 13 పరుగులతో ఆడుతున్నారు.
షమీ బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్‌బౌల్డ్.. మూడో వికెట్ డౌన్
లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ తొలి బంతికే లబుషేన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉంది.
లంచ్ విరామం.. ఆసీస్ 23 ఓవర్లలో 73/2
లంచ్ విరామం సమయానికి ఆస్ట్రేలియా 23 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. లబుషేన్ 26, స్మిత్ రెండు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వార్నర్ 43 పరుగులు చేసి ఔటవ్వగా.. ఉస్మాన్ ఖవాజా డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్‌లు చెరొక వికెట్ పడగొట్టారు.
డేవిడ్ వార్నర్(43) ఔట్.. రెండో వికెట్ డౌన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన వార్నర్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆసీస్ 22 ఓవరల్లో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. లబుషేన్ 26 పరుగులతో ఆడుతున్నాడు.
15 ఓవర్లలో ఆసీస్ స్కోరు 54/1
15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. వార్నర్ 37, లబుషేన్ 16 పరుగులతో ఆడుతున్నారు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వార్నర్ నాలుగు ఫోర్లు బాదడంతో ఆసీస్ స్కోరు 50 దాటింది.
10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 22/1
10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వార్నర్ 13, లబుషేన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఖవాజా డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
టీమిండియాతో ఆడుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సిరాజ్ బౌలింగ్‌లో కేఎస్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందా.. లేదంటే తొలిసారి ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా టైటిల్ దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment