Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను.
గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం.
రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్‌లో దాదాపు ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.
కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్‌లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది.
సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు.
కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్‌గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
వరుస వైఫల్యాలు
కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్‌మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు సాధించగలిగాడు.
ఇక కీలక మ్యాచ్‌లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్‌గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment