సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైనటీమిండియా ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమవుతోంది. మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.
గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టు ప్రదర్శను చూస్తుంటే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే భారత్‌కు బీజీటీ ట్రోఫీ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆప వ్యాఖ్యలు చేశాడు.
"భారత్ డబ్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై టీమిండియా 4-0తో ఓడించలేదు. ఒకవేళ ఆసీస్‌ను భారత్ ఓడిస్తే మాత్రం నేను గాల్లో తేలుతాను. అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ గురించే నేను మాట్లాడుకోవడం లేదు.
ఇప్పుడు కేవలం ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపైనే దృష్టిపెట్టిండి. 1-0, 2-0, 3-1, 2-1 తేడాతో సిరీస్ గెలిచినా పర్వాలేదు. సిరీస్ గెలవడం ముఖ్యం. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులందరూ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారు. మీరు గెలిచి మళ్లీ ఫ్యాన్స్‌లో జోష్ నింపండి" అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.
చదవండి: PAK Vs AUS 1st ODI: అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment