బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ల తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్ మధ్య పరిగెత్తడం సరికాదని చెబుతున్నా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశారని మండిపడ్డారు. అంపైర్లు కూడా ఆసీస్ బ్యాటర్లను చూసీ చూడనట్లు వదిలేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు కంగారూ జట్టు పైచేయి సాధించింది. 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 311 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతో
ఓపెనర్లలో అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57) అర్ధ శతకాలతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) కూడా రాణించాడు. మిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31) ఫర్వాలేదనిపించగా.. స్టీవ్ స్మిత్ గురువారం ఆట పూర్తయ్యేసరికి 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్
ఇక భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా పరుగులు తీసే సమయంలో లబుషేన్(Marnus Labuschagne) పిచ్ మధ్యగా పరిగెత్తగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అతడిని హెచ్చరించాడు. కామెంటేటర్లు సునిల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయం గురించి చర్చిస్తూ ఆసీస్ బ్యాటర్ల తీరును తప్పుబట్టారు.
అంపైర్లు ఏం చేస్తున్నారు?
‘‘పిచ్ మధ్య పరిగెత్త వద్దని మార్నస్ లబుషేన్‌కు రోహిత్ శర్మ చెప్పాడు. అయినా.. మధ్య స్ట్రిప్ గుండా ఎందుకు పరిగెత్తాలి?’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇందుకు గావస్కర్ స్పందిస్తూ.. ‘‘సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కూడా ఇలాగే చేశాడు. అయినా.. అతడిని ఎవరూ హెచ్చరించలేదు’’ అని అన్నాడు.
ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి ఇది అంపైర్ల పని’’ అని పేర్కొనగా.. ‘‘అవును అంపైర్లు అలా చూస్తూ ఊరుకున్నారు. రోహిత్- లబుషేన్‌తో మాట్లాడుతుంటే.. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయారంతే.. ఎందుకలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు’’ అని గావస్కర్ అన్నాడు. వీరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టు: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు
🗣 #RohitSharma gets disappointed, warns #Labuschagne for running on the pitch during the #BoxingDayTest 🧐#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/iNGMjtGXXQ
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment