Marnus Labuschagne
-
స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్‌ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్‌ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్‌ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్‌ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్‌తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అలా శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
మెల్బోర్న్ టెస్టు అద్భుతంగా సాగిందని.. ఆఖరికి తామే పైచేయి సాధించడం పట్ల సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ తాను రాణించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ట్రవిస్ హెడ్‌కు బాల్ ఇవ్వడం వెనుక తమ కోచ్ హస్తం ఉందని.. ఈ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇస్తానని కమిన్స్ తెలిపాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియా(India vs Australia)తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్ మ్యాచ్‌లో ఓడిన కంగారూ జట్టు.. అడిలైడ్ టెస్టుతో విజయాన్ని రుచిచూసింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టు వర్షం వల్ల డ్రా కాగా.. ఇరుజట్లు మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టు జరిగింది.340 పరుగుల లక్ష్యంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసిన కంగారూలు.. భారత్‌ను 369 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయిన కమిన్స్ బృందం.. టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని విధించింది.అయితే, సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆసీస్ 184 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 90(49, 41) పరుగులు చేయడంతో పాటు.. కమిన్స్ ఆరు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.మాదే పైచేయిఈ క్రమంలో విజయానంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టెస్టు మ్యాచ్ ఆడాము. ప్రేక్షకులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారి నుంచి అద్భుత స్పందన లభించింది. విజయంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.లబుషేన్(72, 70), స్మిత్(140, 13 ) రాణించడం వల్ల పటిష్ట స్థితిలో నిలిచాం. నిజానికి ఈరోజు తొలి సెషన్లో మాదే పైచేయి. కానీ అనూహ్య రీతిలో వాళ్లు పుంజుకుని.. రెండో సెషన్లో రాణించారు. అయితే, మేము మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నాము.ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక హెడ్‌తో బౌలింగ్ చేయించాలన్నది మా కోచ్ ఆలోచనే. ఆ విషయంలో క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఇదే తరహా ఫలితం పునరావృతం చేస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలమైన ట్రవిస్ హెడ్(0, 1) రిషభ్ పంత్(Rishabh Pant-30) రూపంలో కీలక వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో సహాయం చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ ఇచ్చినా.. అంపైర్లు పట్టించుకోరా?
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ల తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్ మధ్య పరిగెత్తడం సరికాదని చెబుతున్నా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశారని మండిపడ్డారు. అంపైర్లు కూడా ఆసీస్ బ్యాటర్లను చూసీ చూడనట్లు వదిలేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు కంగారూ జట్టు పైచేయి సాధించింది. 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 311 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతోఓపెనర్లలో అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57) అర్ధ శతకాలతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) కూడా రాణించాడు. మిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31) ఫర్వాలేదనిపించగా.. స్టీవ్ స్మిత్ గురువారం ఆట పూర్తయ్యేసరికి 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు.లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా పరుగులు తీసే సమయంలో లబుషేన్(Marnus Labuschagne) పిచ్ మధ్యగా పరిగెత్తగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అతడిని హెచ్చరించాడు. కామెంటేటర్లు సునిల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయం గురించి చర్చిస్తూ ఆసీస్ బ్యాటర్ల తీరును తప్పుబట్టారు.అంపైర్లు ఏం చేస్తున్నారు?‘‘పిచ్ మధ్య పరిగెత్త వద్దని మార్నస్ లబుషేన్‌కు రోహిత్ శర్మ చెప్పాడు. అయినా.. మధ్య స్ట్రిప్ గుండా ఎందుకు పరిగెత్తాలి?’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇందుకు గావస్కర్ స్పందిస్తూ.. ‘‘సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కూడా ఇలాగే చేశాడు. అయినా.. అతడిని ఎవరూ హెచ్చరించలేదు’’ అని అన్నాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి ఇది అంపైర్ల పని’’ అని పేర్కొనగా.. ‘‘అవును అంపైర్లు అలా చూస్తూ ఊరుకున్నారు. రోహిత్- లబుషేన్‌తో మాట్లాడుతుంటే.. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయారంతే.. ఎందుకలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు’’ అని గావస్కర్ అన్నాడు. వీరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టు: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు🗣 #RohitSharma gets disappointed, warns #Labuschagne for running on the pitch during the #BoxingDayTest 🧐#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/iNGMjtGXXQ— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్ ఫైర్
అడిలైడ్ వేదికగా భారత్‌తో మొదలైన పింక్‌బాల్ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతోంది.మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి ఆసీస్ జట్టు 88 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌పై బంతిని విసిరాడు.అసలేం జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో 5వ బంతిని వేసేందుకు సిరాజ్ సిద్దమయ్యాడు. స్ట్రైక్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అయితే సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు బీర్ స్నేక్(ఖాళీ బీర్ ప్లాస్టిక్ కప్పులు) తీసుకుని నడవడంతో ఏకాగ్రత కోల్పోయిన లబుషేన్ ఆఖరి క్షణంలో పక్కకు తప్పుకున్నాడు.దీంతో బంతిని వేసేందుకు రనప్‌తో వేగంగా వచ్చిన సిరాజ్ కూడా మధ్యలో ఆగిపోయాడు. అయితే సిరాజ్ తన బౌలింగ్‌ను ఆఖరి నిమిషంలో అపినప్పటికి.. ప్రత్యర్ధి బ్యాటర్‌పై కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సహానం కోల్పోయిన సిరాజ్ బంతిని లబుషేన్ వైపు త్రో చేశాడు. లబుషేన్ అలా చూస్తూ ఉండిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అతడిని ఆసీస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. భారత అభిమానులు సైతం అతడి చర్యలను తప్పుబడుతున్నారు. సిరాజ్ మియా అంత దూకుడెందుకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ Mohammed Siraj was not too pleased with this 😂#AUSvIND pic.twitter.com/1QQEI5NE2g— cricket.com.au (@cricketcomau) December 6, 2024 -
భారత్‌తో రెండో టెస్టు.. ఆసీస్ తుదిజట్టు ప్రకటన.. డేంజరస్ బౌలర్ వచ్చేశాడు
టీమిండియాతో రెండో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్కు అవకాశం ఇచ్చినట్లు తెలిపింది. ఇక పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన నాథన్ మెక్‌స్వీనీని కొనసాగించింది. ఉస్మాన్ ఖవాజాతో పాటు అతడు మరోసారి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది.అయితే, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఫిట్‌గా ఉండటంతో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కగా.. బ్యూ వెబ్‌స్టర్‌కు మొండిచేయి ఎదురైంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.పింక్ బాల్తోఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత్.. ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ క్రమంలో.. గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియా అడిలైడ్‌లో ఆసీస్‌తో రెండో టెస్టు ఆడేందుకు సన్నద్ధమైంది. పింక్ బాల్‌తో నిర్వహించే ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. శుబ్‌మన్ గిల్ కూడా అందుబాటులోకి వచ్చాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాత్రం జోష్ హాజిల్‌వుడ్ రూపంలో కీలక పేసర్ సేవలు కోల్పోయింది. తొలి టెస్టు అనంతరం అతడికి పక్కటెముకల నొప్పి తీవ్రం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కూడా అందుబాటులో ఉంటారో లేదోనన్న అనుమానాలు నెలకొనగా.. క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం స్పష్టతనిచ్చింది. 68 పరుగులకే టీమ్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్రభారత్తో పింక్ బాల్ టెస్టులో వీరిద్దరు ఆడతారని పేర్కొంది. కాగా హాజిల్‌వుడ్ స్థానంలో ఆడబోయే స్కాట్ బోలాండ్ 2021-22 యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించి 6/7తో రాణించి.. 68 పరుగులకే టీమ్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పటి వరకు ఈ రైటార్మ్ పేసర్ 10 టెస్టులాడి 35 వికెట్లు కూల్చాడు.వారికి సెకండ్ ఛాన్స్ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 35 ఏళ్ల బోలాండ్ భాగమయ్యాడు. మరోవైపు.. టీమిండియాతో తొలి టెస్టులో విఫలమైనప్పటికీ నాథన్ మెక్‌స్వీనీ(10, 0)కి ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. లబుషేన్(2, 3)ను కూడా కొనసాగించింది. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.టీమిండియాతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టుఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్‌తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్‌తో రిలేషన్!.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
భారత్‌తో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్
టీమిండియాతో రెండో టెస్టు నేపథ్యంలో ఆస్ట్రేలియా తుదిజట్టు గురించి మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్‌ను ఆడించవద్దని క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశాడు. అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు విమర్శలు చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆసీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సమిష్టి కృషితో ఆసీస్‌ను సొంతగడ్డపై చిత్తు చేసింది.రెండుసార్లూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేశాడు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన లబుషేన్ ఐదు బంతుల్లో మూడు పరుగులకే వెనుదిరిగాడు. ఈసారి మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా అతడికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడిన లబుషేన్ 245 పరుగులే చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉండగా.. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలతో డీలా పడిన మార్నస్ లబుషేన్‌ను కచ్చితంగా జట్టు నుంచి తప్పించాల్సిందే. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టులో అతడి స్థానంలో వేరొకరిని ఆడించాలి. అతడిపై వేటు వేయండిలేదంటే.. పెర్త్ టెస్టు మాదిరి ఇక్కడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతడు షెఫీల్డ్ షీల్డ్, క్లబ్ క్రికెట్లో తిరిగి ఆడాల్సిన సమయం వచ్చింది. జాతీయ జట్టుకు ఆడినపుడు ఉండేంత ఒత్తిడి అక్కడ ఉండదు. కాస్త స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అది అతడికే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ది నైట్లీకి రాసిన కాలమ్‌లో మిచెల్ జాన్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు! -
'కోహ్లిలా నిన్ను నువ్వు నమ్ముకో'.. ఆసీస్ స్టార్ ప్లేయర్‌కు మెంటార్ సలహా
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో లబుషేన్ తీవ్ర నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే లబుషేన్ చేశాడు.అంతేకాకుండా భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ బౌన్సర్లతో లబుషేన్‌ను బెంబేలెత్తించారు. అయితే తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం మార్నస్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.డిసెంబర్ 6న ఆడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుతో తిరిగి ఫామ్‌లోకి రావాలని అతడు భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌కు తన మెంటార్ నీల్ డి'కోస్టా సపోర్ట్‌గా నిలిచాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిలా తనను తను లబుషేన్ నమ్మాలి అని నీల్ సూచించాడు."లబుషేన్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. అతడు కొంచెం కష్టపడితే తన ఫామ్‌ను తిరిగి పొందుతాడన్న నమ్మకం నాకు ఉంది. నెట్స్‌లో కొంచెం ఎక్కువ సమయం గడపాలి. ఒకనొక దశలో లబుషేన్ వరల్డ్ నెం1గా కొంతకాలం కొనసాగాడు. కానీ ఆతర్వాత అతడు తన రిథమ్‌ను కోల్పోయాడు.ఇప్పటికి అతడు టెస్టుల్లో టాప్ 10 ర్యాంక్స్ లోనే ఉన్నాడు. అదేవిధంగా అతడి బ్యాటింగ్ సగటు కూడా దాదాపు ఏభైకి దగ్గరగా ఉంది. ఇటువంటి ప్లేయర్లకు ఒక్క భారీ ఇన్నింగ్స్‌లో తిరిగి తన రిథమ్‌ను పొందే సత్తాఉంటుంది. ఎంతటి టాప్ క్లాస్ క్రికెటర్లరైనా ఏదో ఒక సమయంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొక తప్పదు. విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్ కూడా ఒకనొక సమయంలో గడ్డు పరిస్థితులును ఎదుర్కొన్నాడు. కానీ తనను తను నమ్ముతూ తిరిగి మళ్లీ అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నీవు కూడా కోహ్లిలా నిన్ను నమ్ముకో, నీ ఆటపై దృష్టి పెట్టూ అంటూ" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీల్ డి'కోస్టా పేర్కొన్నాడు.చదవండి: అతడొక విధ్వంసక బ్యాటర్.. అందుకే భారీ ధర: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ డీకే -
బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్‌కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలుత భారత బ్యాటర్లు నిరాశపరిచినప్పటకి బౌలర్లు మాత్రం అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని భారత ఫాస్ట్ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.టీమిండియా బౌలర్లను ఎదుర్కొనేందుకు కంగారు బ్యాటర్లు విల్లవిల్లాడారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో అత్యధికంగా జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.సిరాజ్-లబుషేన్ డిష్యూం.. డిష్యూంఇక మొదటి రోజు ఆటలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన సిరాజ్ మూడో బంతిని మార్నస్కు షార్ట్ బాల్‌గా సంధించాడు. అయితే ఆ బంతిని లెగ్ సైడ్ షాట్ ఆడటానికి సదరు బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు కాకుండా తొడ ప్యాడ్ తాకి స్టంప్స్ దగ్గరలో పడింది. అయితే లబుషేన్ మాత్రం బంతిని చూడకుండా పరుగుకోసం ప్రయత్నించాడు. వెంటనే బంతి క్రీజు వద్దే ఉందని గమనించిన లబుషేన్ పరుగును ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ఫాల్ త్రూలో వేగంగా క్రీజు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి రనౌట్ చేయాలనకున్నాడు. కానీ లబుషేన్ మాత్రం సిరాజ్ రనౌట్ చేస్తాడనే భయంతో బంతిని తన బ్యాట్‌తో పక్కకు నెట్టాడు. అయితే లబుషేన్ బంతిని పక్కకు నెట్టేటప్పుడు క్రీజులో లేడు. దీంతో సదరు ఆసీస్ బ్యాటర్ అలా చేయడం సిరాజ్‌కు కోపం తెప్పించింది. వెంటనే అతడి వద్దకు వెళ్లి సిరాజ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. అంతలోనే విరాట్ కోహ్లి వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టాడు.కానీ లబుషేన్ అప్పటికే క్రీజులో ఉన్నాడు. కానీ కోహ్లి మాత్రం అతడి ఏకాగ్రతను దెబ్బతీసేందుకు కావాలనే అలా చేశాడు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నది డీఎస్పీ బ్రో.. జాగ్రత్తగా ఉండాలంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024 -
IND Vs AUS: లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసిన కోహ్లి? బుమ్రా షాకింగ్ రియాక్షన్! వీడియో
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్ లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విరాట్ జారవిడిచాడు. దీంతో ఆరంభంలోనే లబుషేన్‌కు కోహ్లి లైఫ్ ఇచ్చేశాడు.అసలేం జరిగిందంటే?ఆసీస్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా తొలి బంతికే మెక్‌స్వీనీ ఔట్ చేసి బిగ్ షాకిచ్చాడు. దీంతో ఫస్ట్ డౌన్లో లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. రెండో బంతిని లబుషేన్ డిఫెన్స్ ఆడాడు. ఆ తర్వాత బంతికే లబుషేన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.మూడో బంతిని మార్నస్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని లబుషేన్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో విరాట్ కోహ్లి చేతిలో పడింది. కానీ విరాట్ మాత్రం అనూహ్య రీతిలో బంతిని జారవిడిచాడు.అయితే కోహ్లి క్యాచ్ క్లీన్ క్యాచ్ అందుకున్నాడని స్లిప్‌లో ఉన్న రాహుల్‌తోపాటు ఇతర ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ కోహ్లి మాత్రం క్యాచ్‌గా క్లీన్‌గా అందుకోలేదని సైగ చేశాడు. దీంతో అందరూ నిరాశచెందారు. కెప్టెన్ బుమ్రా సైతం కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా తర్వాతి ఓవర్లో మాత్రం ఉస్మాన్ ఖావాజా ఇచ్చిన క్యాచ్‌ను అదే స్లిప్స్‌లో కోహ్లి అందుకున్నాడు. కాగా కోహ్లి జారవిడిచిన క్యాచ్ కాస్ట్లీగా మారలేదు. లబుషేన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: నితీశ్ రెడ్డి ‘ధనాధన్’ ఇన్నింగ్స్.. టీమిండియా 150 ఆలౌట్One of the more extraordinary drops you'll see! #AUSvIND pic.twitter.com/LdxmEYeWQx— cricket.com.au (@cricketcomau) November 22, 2024 -
లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.హెడ్ విధ్వంసకర శతకం.. లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (129 బంతుల్లో 154 నాటౌట్) విధ్వంసకర శతకంతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.మూడు వికెట్లు తీసిన లబుషేన్ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగల లబుషేన్ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ రెండు, డ్వార్షుయిస్, మాథ్యూ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్ఇక ఈ మ్యాచ్‌లో బెన్ డకెట్ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్.. జోఫ్రా ఆర్చర్(4) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్, బ్రూక్, జాకబ్ బెతెల్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆదిల్ రషీద్(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.𝐃𝐮𝐜𝐤𝐞𝐭𝐭 𝐦𝐮𝐬𝐭 𝐛𝐞 𝐠𝐮𝐭𝐭𝐞𝐝 😤Catching practice for Labuschagne off his own bowling 😎Watch #ENGvAUS LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/p0IxZKhQZY— Sony LIV (@SonyLIV) September 19, 2024 వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్గాఅలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్ వేదికగా శనివారం జరుగనుంది. చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్ బాల్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
ఆ టీమిండియా బౌలర్‌తో పోటీ అంటే ఇష్టం: ఆసీస్ స్టార్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలర్లలో ఓ స్టార్ పేసర్‌తో తనకు అనుబంధం ఉందని.. అయితే, అదే సమయంలో ప్రత్యర్థిగా అతడితో పోటీ తనకు పూనకాలు తెప్పిస్తుందని తెలిపాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఈ ఏడాది నవంబరులో ఇరు జట్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి.టీమిండియాదే పైచేయిఇందులో భాగంగా ఆసీస్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లనుంది. ఇక ఈ టోర్నీలో గత నాలుగు దఫాలుగా భారత జట్టునే విజయం వరిస్తోంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ ఈవెంట్లో చివరగా రెండుసార్లు ఆసీస్‌లో, రెండుసార్లు సొంతగడ్డపై టీమిండియానే గెలిచింది.ఇప్పటి నుంచే హైప్ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ ఓవరాల్‌గా పదిసార్లు గెలవగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ప్రణాళికల గురించి వెల్లడిస్తున్నారు. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్.. టీమిండియాతో పోటీ గురించి చెబుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లతో తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు.మరోవైపు.. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కామెరాన్‌గ్రీన్ తదితరులు టీమిండియా భవిష్యత్తు సూపర్స్టార్ల గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు రానున్న కాలంలో టీమిండియాకు కీలకం కానున్నారని.. వారిని కట్టడి చేసేందుకు తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సిరాజ్‌తో పోటీ అంటే ఇష్టంతాజాగా ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు. సిరాజ్ కెరీర్ తొలినాళ్ల నుంచి అతడిని చూస్తున్నానని.. ఈ హైదరాబాదీ సరైన దిశలో తన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రశంసించాడు. అక్కడే అరంగేట్రంఏదేమైనా టీమిండియా బౌలర్లలో సిరాజ్‌తో పోటీ అంటేనే తనకు మజా వస్తుందని లబుషేన్ తెలిపాడు. కాగా 2020 నాటి బోర్డర్- గావస్కర్ సందర్భంగానే సిరాజ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడిన సిరాజ్ ఖాతాలో వరుసగా 74, 71, 14 వికెట్లు ఉన్నాయి. మరోవైపు.. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లబుషేన్ 50 టెస్టుల్లో 4114 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. 52 వన్డేలు ఆడి 1656 రన్స్ సాధించడంతో పాటు 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: ఇంగ్లండ్ కూడా అలాగే అనుకుంది: బంగ్లాకు రోహిత్ శర్మ వార్నింగ్ -
64 బంతుల్లోనే 135 రన్స్: 5 వికెట్లతో దుమ్ములేపిన లబుషేన్
Glamorgan vs Somerset: టీ20 బ్లాస్ట్ లీగ్-2024లో భాగంగా సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు దుమ్ములేపింది. సమిష్టి ప్రదర్శనతో ఏకంగా 120 పరుగుల తేడాతో సోమర్సెట్ను చిత్తు చేసింది.ఇంగ్లండ్‌కు చెందిన ఈ టీ20 లీగ్‌లో భాగంగా సౌత్ గ్రూపు జట్లు గ్లామోర్గాన్- సోమర్సెట్ శుక్రవారం రాత్రి తలపడ్డాయి. కార్డిఫ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గ్లామోర్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.64 బంతుల్లోనేఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ కిరాన్ కార్ల్సన్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు.అతడి తోడుగా మరో ఓపెనర్ విలియమ్ స్మాలే(34 బంతుల్లో 59 రన్స్) కూడా దంచికొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఇంగ్రామ్ 21, వికెట్ కీపర్ కూకీ 16 రన్స్‌తో ఫర్వాలేదనిపించగా.. బెన్ కెల్లావే 5 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన గ్లామోర్గాన్ 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్కు గ్లామోర్గాన్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లువీరి దెబ్బకు సోమర్సెట్ కేవలం 123 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. 13.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. గ్లామోర్గాన్ బౌలర్లలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.కేవలం 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి సోమర్సెట్ లోయర్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఇక ఐదు వికెట్ల హాల్లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయడం ద్వారా వచ్చిన వికెట్లే కావడం విశేషం.లబుషేన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ వికెట్లు తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్లో సోమర్సెట్ ఇప్పటి వరకు 8 విజయాలతో సౌత్ గ్రూపులో మూడోస్థానంలో ఉండగా.. గ్లామోర్గాన్ విజయాల సంఖ్య తాజాగా ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ జట్టు పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.2003లో ఈ పొట్టి లీగ్ మొదలుకాగా టీ20 బ్లాస్ట్ లీగ్‌ను ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది. ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. తాజా సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.చదవండి: NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే! View this post on Instagram A post shared by FanCode (@fancode) -
కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్.. ఒక్క బంతి, ఒక్క పరుగు, ఒక్క వికెట్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో భాగంగా గ్లామోర్గన్, గ్లోసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌గా నిలిచిపోనుంది. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ గెలుపుకు చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. ఇలాంటి ఉత్కంఠ సందర్భంలో వికెట్‌కీపర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది.MATCH OF THE COUNTY HISTORY.- Glamorgan needs 1 run to win.- One wicket left. - One ball left. Then the wicket-keeper took a Blinder without gloves and the match ended in a tie. 🥶🔥 pic.twitter.com/YtKIDsU00F— Johns. (@CricCrazyJohns) July 3, 2024వివరాల్లోకి వెళితే.. గ్లోసెస్టర్‌షైర్ నిర్ధేశించిన 593 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 592 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా.. అజిత్ డేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమ్స్ బ్రేసీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేమీ మెకిల్రాయ్ ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లోసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 610 పరుగులు చేయగా.. గ్లామోర్గన్ తొలి ఇన్నింగ్స్‌లో 197, రెండో ఇన్నింగ్స్‌లో 592 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో మార్నస్ లబూషేన్ (119), సామ్ నార్త్ఈస్ట్ (187) అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి గ్లామోర్గన్ను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చారు. అయితే వికెట్‌కీపర్ జేమ్స్ బ్రేసీ నమ్మశక్యం కానీ రీతిలో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని గ్లామోర్గన్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ గెలిచి ఉంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఛేదనగా రికార్డుల్లోకెక్కేది. ఛేదనలో గ్లామోర్గన్ చేసిన 592 పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. -
ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. పొట్టి క్రికెట్లో బెస్ట్ క్యాచ్‌గా జేజేలు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024లో అత్యుత్తమ క్యాచ్‌లు నమోదవుతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే ఐదారు కళ్లు చెదిరే క్యాచ్‌లు ఫ్యాన్స్‌కు మతి పోగొట్టాయి. తాజాగా అలాంటి క్యాచే మరొకటి నమోదైంది. కార్డిఫ్ వేదికగా గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గన్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మెరుపు క్యాచ్ అందుకున్నాడు.మేసన్ క్రేన్ బౌలింగ్‌లో బెన్ ఛార్లెస్వర్త్ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్‌ను లబూషేన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌గా మలిచాడు. ఓ మోస్తరు ఎత్తులో వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ క్యాచ్‌కు చూసిన వారు పొట్టి క్రికెట్లో అత్యుత్తమ క్యాచ్ అని జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను పట్టిన లబూషేన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.MARNUS LABUSCHAGNE WITH A BLINDER. 🤯💯- One of the greatest catches ever! pic.twitter.com/ssDsUdg2aU— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024కాగా, గ్లామోర్గన్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్లోసెస్టర్‌షైర్ గెలుపుకు చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. జోష్ షా ఆండీ గోర్విన్ బౌలింగ్ సిక్సర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగా.. గ్లోసెస్టర్‌షైర్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. గ్లామోర్గన్ ఇన్నింగ్స్‌లో సామ్ నార్త్ఈస్ట్ (46 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కాగా.. గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో జాక్ టేలర్ (70) అత్యధిక పరుగులు సాధించాడు. -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
కాన్బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లాన్స్ మోరిస్ బౌలింగ్‌లో మూడో బంతిని కార్టీ.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే విధంగా ఆసీస్ ఆటగాళ్లందరూ లబుషేన్‌కు వద్దకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు క్లీన్ స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 87 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 6.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చదవండి: IND vs ENG: శ్రీకర్ భరత్‌కు బైబై.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!? MARNUS! Whatta catch - and first international wicket for Lance Morris too!#PlayOfTheDay | #AUSvWI pic.twitter.com/KwZP43hEFd — cricket.com.au (@cricketcomau) February 6, 2024 -
పాక్ బౌలర్లు కమ్‌బ్యాక్.. 318 పరుగులకు ఆసీస్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు మాత్రం పాక్ బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. 187/3 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. అదనంగా 131 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఖావాజా(42), మిచెల్ మార్ష్(41) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా, షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి టెస్టులో పాక్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్‌రత్న... అర్జున’ వెనక్కి -
2023 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్ అతడే.. లిస్ట్‌లో కోహ్లి, జడ్డూ
2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావశీల ఫీల్డర్‌గా ఆసీస్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. లబూషేన్ 82.66 రేటింగ్ పాయింట్లతో ఫీల్డర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో ఆసీస్‌కే చెందిన డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 82.55 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగం టాప్-10లో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. 72.72 రేటింగ్ పాయింట్లతో రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో.. 56.79 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లి ఆరో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్ మూడో స్థానంలో, నెదర్లాండ్స్ ఆటగాడు సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ ఐదులో, ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో నిలిచారు. మైదానంలో కనబర్చిన ప్రతిభ (పరుగుల నియంత్రణ, రనౌట్లు, త్రోలు) ఆధారంగా రేటింగ్ పాయింట్లు కేటాయించబడ్డాయి. ICC named Marnus Labuschagne as the biggest fielding impact in World Cup 2023. - Kohli & Jadeja are the only Indians in Top 10. 🔥🎯 pic.twitter.com/ZtO2kRz7U6 — Johns. (@CricCrazyJohns) November 20, 2023 ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైంది. ఛేదనలో ఆసీస్ ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ అనంతరం అద్భుతంగా పుంజుకుని ఆరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ట్రవిస్ హెడ్ (137).. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్‌వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్‌వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
WC 2023: లబుషేన్‌ను డ్యాన్స్‌తో కవ్వించిన జడేజా! వీడియో వైరల్
అఫ్గనిస్తాన్ మెంటార్, టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ట్రోల్ చేశాడు. తమపై ఫిర్యాదు చేసినందుకు డ్యాన్స్‌తో అతడిని కవ్వించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకు గెలుపు అత్యవసరం. ఇలాంటి కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోరు రాబట్టింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అజేయ శతకం కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, ఆస్ట్రేలియా వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడింది. అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను డకౌట్ చేసి శుభారంభం అందించాడు. ఆరో ఓవర్ నాలుగో బంతికి మిచెల్ మార్ష్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. దీంతో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఇలాంటి తరుణంలో.. క్రీజులోకి వచ్చిన నాలుగో నంబర్ బ్యాటర్ లబుషేన్.. ఎనిమిదో ఓవర్ ఆరంభంలో సైట్స్క్రీన్ డిస్టర్బెన్స్‌గా ఉందంటూ కంప్లైంట్ చేశాడు. అఫ్గనిస్తాన్ డ్రెస్సింగ్‌రూంలో కదలికల కారణంగా ఇబ్బంది కలుగుతోందని అసహనం ప్రదర్శించాడు. ఈ విషయాన్ని గమనించిన అజయ్ జడేజా చిన్నగా డ్యాన్స్ చేస్తూ లబుషేన్‌ను సరదాగా ట్రోల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అఫ్గన్ బౌలర్ల విజృంభణ కారణంగా 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా కష్టాల్లో కూరుకుపోయింది. సెంచరీ పూర్తి చేసుకున్న ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. Lmao not Ajay Jadeja dancing after Labuschagne's complain😭😭😭😭😭 pic.twitter.com/rnWojWgDxM — P.💍 (@PrajaktaSharma8) November 7, 2023 -
'రోహిత్‌ను ఆపడం చాలా కష్టం.. చాలా విషయాలు నేర్చుకుంటున్నా'
వన్డే ప్రపంచకప్-2023కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్ల వామాప్ మ్యాచ్‌ల్లో బీజీబీజీగా ఉన్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబుషేన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ స్కిల్స్‌ను తనను ఎంతగానే ఆకట్టుకున్నాయని లబుషేన్ అన్నాడు. "రోహిత్ శర్మ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా అద్భుతమైన షాట్లు ఆడుతాడు. అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడు. ఒక్కసారి అతడు తన రిథమ్‌ను పొందితే ఆపడం చాలా కష్టం. మేము పెవిలియన్‌కు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు రోహిత్‌తో.. మీరు ఎలా ఆడుతున్నారో అలా ఆడటానికి ప్రయత్నిస్తాననని చెప్పాను. నేను మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాని చెప్పాను. ఇక్కడి పరిస్ధితులు మాకు కొత్త. కానీ మీకు ఇక్కడ ఆడిన అనుభవం చాలా ఉంది. కాబట్టి ప్రత్యర్ధిలుగా ఉండి చాలా విషయాలు నేర్చుకుంటున్నామని రోహిత్ చెప్పా" అని ఫాక్స్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లబుషేన్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: 'అశ్విన్ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు' -
వరల్డ్‌కప్ జట్టును అధికారికంగా ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఒక్క మార్పు
క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ 2023లో పాల్గొనే తమ జట్టును కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో ఊహించిన విధంగానే గాయం నుంచి పూర్తి కోలుకోని ఆస్టన్ అగర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో మార్నస్ లబూషేన్ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న ట్రవిస్ హెడ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మిగతా జట్టంతా ముందుగా ప్రకటించిన విధంగా యథాతథంగా కొనసాగుతుంది. Australia, here's your squad to take on the ODI World Cup in India starting on October 8! Congratulations to all players selected 👏 #CWC23 pic.twitter.com/xZAY8TYmcl — Cricket Australia (@CricketAus) September 28, 2023 కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా కొద్ది రోజుల కిందట తమ వరల్డ్‌కప్ ప్రొవిజనల్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళ (సెప్టెంబర్ 28) ఆఖరి తేదీ కావడంతో సీఏ ఓ మార్పు చేసింది. ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన లబూషేన్ ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, గాయపడిన అగర్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే ఆస్ట్రేలియా జట్టు ఇదే: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాయం కారణంగా ప్రపంచకప్ తొలి భాగానికి దూరమవుతాడనుకున్న ట్రవిస్ హెడ్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. హెడ్ స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వస్తాడనుకున్న మార్నస్ లబూషేన్ ఇతర ఆటగాడి రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక కానున్నట్లు సమాచారం. ఆసీస్ ప్రొవిజనల్ జట్టులో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ కాలి కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో లబూషేన్ ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. తొలుత అగర్‌కు రీప్లేస్‌మెంట్‌గా మాథ్యూ షార్ట్ లేదా తన్వీర్ సంగాను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీమిండియాతో ఆఖరి వన్డేలో మ్యాక్స్‌వెల్ బంతితో రాణించడంతో (4 వికెట్లు) స్పిన్నర్‌కు బదులు ప్రొఫెషనల్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే క్రికెట్ ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని ప్రకటించకపోగా.. లబూషేన్‌ను అగర్ స్థానంలో జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తుంది. అగర్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టులోకి వస్తామని కలలు కన్న మాథ్యూ షార్ట్, తన్వీర్ సంగాకు ఈ ఊహించని పరిణామంతో నిరాశే ఎదురైంది. మ్యాక్స్‌వెల్ స్పిన్నర్‌గా రాణించి ఈ ఇద్దరి ఆశలను అడియాసలు చేశాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ స్థానాన్ని మ్యాక్సీ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా నమ్మకంగా ఉంది. పై పేర్కొన్న మార్పులకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్ 3న పాకిస్తాన్‌తో కమిన్స్ సేన తలపడుతుంది. వరల్డ్‌కప్ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ -
మరీ ఇంత నిర్లక్ష్యమా? కెప్టెన్‌వే ఇలా చేస్తే ఎలా? రాహుల్‌పై ఫైర్
Fans Fires On KL Rahul: టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుతో తలపడతున్నపుడు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించకతప్పదని చురకలు అంటిస్తున్నారు. చేతి దాకా వచ్చిన బంతిని అలా ఎలా వదిలేస్తావంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు సన్నాహకంగా భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈ టీమిండియా... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. బుమ్రా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. స్పిన్ విభాగం నుంచి అశ్విన్, జడేజా చెరో వికెట్ కూల్చారు. రాహుల్ వల్ల రనౌట్ మిస్ కాగా.. 23వ ఓవర్ మొదటి బంతికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చింది టీమిండియాకు! కానీ వికెట్ కీపింగ్ చేస్తున్న రాహుల్ నిర్లక్ష్యం కారణంగా అతడు బతికిపోయాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకునే క్రమంలో లబుషేన్, కామెరాన్ గ్రీన్ కన్ఫ్యూజన్కు లోనయ్యారు. లబుషేన్ పిచ్ మధ్యలో ఉన్న సమయంలో సూర్య బంతిని రాహుల్ వైపునకు విసిరాడు. కానీ క్యాచ్ పట్టడంలో అతడు విఫలం కావడంతో ఆసీస్ బ్యాటర్‌కు లైఫ్ వచ్చింది. సూర్య చాకచక్యం వల్ల ఆ రనౌట్ ఇదిలా ఉంటే.. 40వ ఓవర్లో వికెట్ కీపర్ రాహుల్ కారణంగా సువర్ణావకాశం టీమిండియా చేజారేదే! 39.3వ ఓవర్.. షమీ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్ బ్యాట్ తాకిన బంతిని ఆపే అవకాశాన్ని మిస్ చేశాడు రాహుల్. ఆ తర్వాత కూడా దానిని ఆపేందుకు పెద్దగా ప్రయత్నం చేయలేదు. రనౌట్‌కు ఆస్కారం ఉన్న తరుణంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే అనిపించింది. థర్డ్ మ్యాన్ దిశగా బంతి దూసుకుపోతున్న తరుణంలో.. దీనిని అలుసుగా తీసుకున్న ఆసీస్ బ్యాటర్లు మరో రన్ కోసం పరుగు తీయడానికి సిద్ధమయ్యారు. అయితే ఫీల్డర్ రుతురాజ్ విసిరిన బాల్‌ను.. సూర్య తన చేతుల్లోకి తీసుకుని.. చాకచక్యంగా వికెట్లకు గిరాటేయడంతో గ్రీన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ రెండు సందర్భాల్లో కేఎల్ రాహల్ వైఖరిని ఉద్దేశించి ఫ్యాన్స్ ఈ మేరకు ఫైర్ అవుతున్నారు. బద్ధుండాలి.. కెప్టెన్‌వే ఇలా చేస్తే ఎలా అని చురకలు అంటిస్తున్నారు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్? ICYMI Direct-Hit Alert! Confusion in the middle & @surya_14kumar gets the throw right to dismiss Cameron Green.#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/Alg6Avxyif — BCCI (@BCCI) September 22, 2023 -
భారత్‌లో అడుగుపెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. వార్నర్ పోస్ట్ వైరల్
Ind Vs Aus: David Warner Thrilled To Be Back In India: సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా టీమిండియాతో సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. వన్డే సిరీస్‌ను మాత్రం 3-2తో చేజార్చుకున్నారు. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్-2023కి ముందు చివరిసారిగా రోహిత్ సేనతో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు భారత్‌కు చేరుకున్నారు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ తదితరులు ఇండియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వార్నర్ భాయ్ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. జాగ్రత్తగా చూసుకుంటారు ‘‘ఇండియాలో మళ్లీ అడుగుపెట్టడం.. ఎల్లప్పుడూ గొప్పగానే అనిపిస్తుంది. ఇక్కడ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు’’ అంటూ భద్రతా సిబ్బందితో దిగిన ఫొటోను పంచుకున్నాడు. మరోవైపు.. తాము హోటల్ గదిలో సేద తీరుతున్న ఫొటోలను అలెక్స్ క్యారీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా ప్రొటిస్‌తో తొలి రెండు వన్డేల్లో వరుసగా 106, 78 పరుగులు సాధించిన 36 ఏళ్ల వార్నర్.. మలి మూడు మ్యాచ్‌లలో కనీసం 20 పరుగులు మార్కును కూడా దాటలేక విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఈ వెటరన్ బ్యాటర్.. టీమిండియాతో సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది. స్టార్లు తిరిగి వచ్చారు భారత్‌తో వన్డే సిరీస్‌లో ఈ లెఫ్టాండర్.. మిచెల్ మార్ష్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గాయాల కారణంగా ఇన్నాళ్లు జట్టుకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ తిరిగి రావడం ఆసీస్‌కు ఉత్సాహాన్నిస్తోంది. ఇక సెప్టెంబరు 22-27 వరకు మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్‌లలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌లు జరుగునున్నాయి. అదే విధంగా ఇరు జట్లు అక్టోబరు 8న తమ వరల్డ్‌కప్ ప్రయాణం ఆరంభించనున్నాయి. చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా.. అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా! ఆసీస్ విజయం
దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(114) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు మార్కో జానెసన్(32) పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లో హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా..స్టోయినిస్ రెండు, అబాట్, అగర్, జంపా, గ్రీన్ తలా వికెట్ సాధించారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. 223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో క్రీజులోకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్ లూబుషేన్(93 బంతుల్లో 80 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. తొలుత తుది జట్టులో లబుషేన్‌కు చోటు దక్కలేదు. కానీ కామెరూన్ గ్రీన్ తలకు గాయం కావడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడే అవకాశం మార్నస్కు వచ్చింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని లబుషేన్ సద్వినియోగపరుచుకున్నాడు. అతడితో పాటు అస్టన్ అగర్(44) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 80 పరుగులతో అదరగొట్టిన లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ప్రోటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ, రబాడ చెరో రెండు వికెట్లు సాధించగా.. ఎంగిడి, మహారాజ్, జానెసన్ తలా వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 9న ఇదే వేదికగా జరగనుంది. చదవండి: WC: ప్రపంచకప్-2023 జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తేజకు చోటు.. కెప్టెన్ ఎవరంటే! -
ప్రపంచకప్ జట్టులో నో ఛాన్స్.. కానీ అక్కడ మాత్రం కెప్టెన్‌గా! అయ్యో పాపం..
వన్డే ప్రపంచకప్- 2023 జట్టులో చోటు కోల్పోయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌కు.. ఆసీస్ సెలక్టర్లు కీలక బాధ్యతలు అప్పగించారు. స్వదేశంలో న్యూజిలాండ్-ఏ జట్టుతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఏ కెప్టెన్‌గా లబుషేన్ వ్యవహరించనున్నాడు. కాగా న్యూజిలాండ్-ఏ జట్టు ఈ నెలఖారులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా కివీస్ ఆస్ట్రేలియాతో రెండు అనాధికర టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మెరకు 18 సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్లలో 10 మందికి పైగా అంతర్జతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. టాడ్ మార్ఫీ, బెన్ మెక్‌డర్మెట్, జోష్ పిలిఫీ వంటి ఆటగాళ్లతో కూడిన జట్టును లబుషేన్ నడిపించనున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య ఆగస్టు 28 నుంచి తొలి అనాధికర టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమిరీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వైట్‌బాల్ క్రికెట్లో అతడి ఫామ్ సరిగ్గా లేకపోవడంతోనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదని ఆసీస్ ఛీప్ సెలక్టరః జార్జ్ బెయిలీ సృష్టం చేశాడు. అదే విధంగా లబుషేన్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడుతాడని బెయిలీ తెలిపాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పగించారు. కివీస్‌తో అనాధికారిక టెస్టులకు ఆసీస్ జట్టు: వెస్ అగర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, జోర్డాన్ బకింగ్‌హామ్, బెన్ ద్వార్షుయిస్, కాలేబ్ జ్యువెల్, క్యాంప్‌బెల్ కెల్లావే, మాథ్యూ కెల్లీ, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ మెక్ఆండ్రూ, నాథన్ మెక్‌స్వీనీ, జోయెల్ ప్యారిస్, జిమ్మీ పెర్రిప్, మిచ్ పెర్రిప్, మిచ్పీర్సన్, మిచ్ స్టెకెటీ, మిచెల్ స్వెప్సన్, టిమ్ వార్డ్ ఆస్ట్రేలియా వన్డే జట్టు: వెస్ అగర్, ఆలీ డేవిస్, బెన్ ద్వార్షుయిస్, లియామ్ హాట్చర్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, బెన్ మెక్‌డెర్మాట్, టాడ్ మర్ఫీ, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, గురిందర్ సంధు, మాథ్యూ షార్ట్ చదవండి: BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేలకోట్లు! ప్రభుత్వానికి చెల్లించేది ఎంతంటే! -
యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్‌లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది. లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్‌రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. రన్‌రేటు 1.61.. ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్నర్షిప్లో రన్‌రేటు 1.61గా నమోదైంది. వారి రికార్డు బద్దలు కొట్టి యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్‌రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్‌రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్‌రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్‌లను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
82 బంతుల్లో 9 పరుగులు.. సూపర్ ఇన్నింగ్స్! మరో పుజారా అంటూ
లండన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఆసీస్‌కు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. లబుషేన్‌పై ట్రోల్స్.. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్లో ఇన్నింగ్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ తన ఆటతీరుతో విసుగు తెప్పించాడు. 82 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్.. ఆఖరికి వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. లుబషేన్ స్లో ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ రెండో రోజు తొలి సెషన్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లుబషేన్ను ఉద్దేశించి మరో ఛతేశ్వర్ పుజారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు వ్యతిరేకంగా లబుషేన్ ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా అంతకముందు నాలుగో టెస్టులో లబుషేన్ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 162 పరుగులు చేశాడు. చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్ -
బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!
లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేసిన పని క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఐదోరోజు ఆటలో లంచ్ విరామానికి ముందు గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండడంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు చీటర్స్ అంటూ దూషణల పర్వం మొదలుపెట్టారు. అయితే బెయిర్ స్టో ఇదే లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్‌ను ఇలాగే ఔట్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. బంతి మిస్సయ్యి కీపర్ బెయిర్ స్టో చేతుల్లోకి వెళ్లినా లబుషేన్ క్రీజులోనే ఉన్నాడు. త్రో వేయాలన్న ఉద్దేశంతో బెయిర్ స్టో నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే లబుషేన్ క్రీజులోనే ఉండడంతో అది ఔట్‌గా పరిగణించలేదు. ఒకవేళ లబుషేన్ క్రీజు దాటి బయట ఉంటే అప్పుడు బెయిర్ స్టో అప్పీల్‌కు వెళ్లేవాడా లేక క్రీడాస్పూర్తి ప్రదర్శించేవాడా అంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఈ లెక్కన చూస్తే ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టోనే తొలుత ఇది మొదలుపెట్టాడనిపిస్తుంది. ఆ సమయంలో అలెక్స్ క్యారీ గమనించాడేమో తెలియదు కానీ.. తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్రీడాస్పూర్తిని పక్కకుబెట్టి బెయిర్ స్టోను ఔట్ చేశాడు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ఏ జట్టైనా అలాగే చేస్తుందని.. ఆసీస్‌ను చీటర్స్ అని పిలుస్తున్నారు కానీ అదే స్థానంలో ఇంగ్లండ్ ఉండుంటే కూడా బహుశా అదే జరిగేదేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. England’s hypocrisy exposed as Bairstow tries to stump Labuschagne on Day 3… but of course Stokes would’ve called Marnus back (coughs… BS) #Ashes #ashes2023 #ashes23 pic.twitter.com/MwF0T42dWX — Paul Kneeshaw (@Stick_Beetle) July 3, 2023 చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..! -
'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య
ఇటీవలే టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన లబుషేన్ ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడే పనిలో ఉన్నాడు. అయితే లబుషేన్‌కు ఒక అలవాటు ఉంది. ఏ మ్యాచ్ అయినా సరే అతను చూయింగ్ గమ్ లేకుండా గ్రౌండ్లో అడుగుపెట్టడు. ఆరోజు మ్యాచ్ ముగిసేవరకు నోటిలో చూయింగ్ గమ్‌ను నములుతూనే కనిపిస్తుంటాడు. తాజాగా మార్నస్ లబుషేన్ చేసిన ఒక పని ఆలస్యంగా వెలుగు చూసింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో ఆట తొలిరోజు లబుషేన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎప్పటిలానే నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని వచ్చాడు. బ్రేక్ సమయంలో బ్యాటింగ్ సిద్ధమవుతున్న తరుణంలో నోటి నుంచి చూయింగ్ గమ్ కిందపడింది. మట్టిలో పడినప్పటికి దానిని తీసి మళ్లీ నోట్లోనే పెట్టుకున్నాడు. అంపైర్ అనుమతి తీసుకొని మట్టిపాలైన చూయింగ్ గమ్‌ను కింద పడేయకుండా నోటిలో పెట్టుకోవడం ఏంటో అర్థం కాలేదు. అయితే లబుషేన్ మాత్రం చూయింగ్ గమ్‌కు మట్టి అంటినా కూడా పట్టించుకోకుండా తన స్టైల్లో నమలడం ఆరంభించాడు. ఇది కాస్త ఆలస్యంగా వెలుగుచూసినప్పటికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 47 పరుగులు చేశాడు. Marnus dropping his gum on the pitch and then putting it back in his mouth????pic.twitter.com/tGdYqM3w72 — 🌈Stu 🇦🇺 (@stuwhy) June 29, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే స్టీవ్ స్మిత్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులతో పటిష్టంగా నిలిచింది. ఇక నాథన్ లియోన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడడం ఆసీస్‌కు ఇబ్బంది కలిగించే అంశం. తీవ్ర గాయం కావడం.. స్రెచర్ సాయంతో నడుస్తున దృశ్యాలు బయటికి రావడంతో లియోన్ మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. దీంతో ఆసీస్ నలుగురు బౌలర్లతోనే ఆడాల్సి వస్తుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 138 పరుగులు వెనుకబడి ఉంది. Marnus Labuschagne was sleeping and then suddenly realised his turn had arrived. pic.twitter.com/pw1xOk9IeI — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: Ashes 2023: నాథన్ లియోన్‌కు గాయం.. ఆసీస్‌కు ఊహించని షాక్! -
లబుషేన్‌కు ఊహించని షాక్.. ప్రపంచ నంబర్ 1 అతడే! వారెవ్వా పంత్..
ICC Test Batting Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సత్తా చాటాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో గత ఆరు నెలలుగా నంబర్ 1 హోదాలో కొనసాగుతున్న లబుషేన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రూట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అజేయ సెంచరీతో కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో రూట్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో రాణించాడు. అదే సమయంలో లబుషేన్ వరుసగా 0, 13 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు. వారెవ్వా పంత్ ఈ నేపథ్యంలో 887 రేటింగ్ పాయింట్లు సాధించిన జో రూట్‌కు అగ్రపీఠం దక్కింది. ఇక టీమిండియా నుంచి యువ వికెట్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఆటకు దూరంగా ఉన్నప్పటికీ పంత్ ఈ మేరకు పదో ర్యాంకు(758 పాయింట్లు)లో కొనసాగడం విశేషం. ఒక స్థానం దిగజారిన కోహ్లి మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో నిరాశపరిచిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక స్థానం కోల్పోయి 14వ ర్యాంకుకు పడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం ఐదో ర్యాంకును నిలుపుకొన్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జో రూట్- ఇంగ్లండ్- 887 పాయింట్లు 2. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు 3. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 877 పాయింట్లు 4. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 873 పాయింట్లు 5. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు. చదవండి: IND vs WI: కిషన్, భరత్‌కు నో ఛాన్స్.. భారత జట్టులోకి యువ వికెట్ కీపర్! -
లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ తొండాట ఆడాడు. నాలుగో రోజు ఆటలో షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతను.. క్యాచ్ పట్టలేదని తెలిసినా సంబరాలు చేసుకుని ఇంగ్లండ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 55వ ఓవర్లో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. Whi this Not out . The way labuschagne was celebrating, it shows the great sportsmanship of Aussies 😂. @ShubmanGill pic.twitter.com/PgYdwIyase — niraj kumar (@nirajku1234) June 19, 2023 రాబిన్సన్ రివ్యూకి వెళ్లగా బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వడంతో ఫ్యాన్స్ లబూషేన్‌ను ఏకిపారేస్తున్నారు. ఇలా ప్రవర్తించడం క్రీడా స్పూర్తికి వ్యతిరేకమని చురకలంటిస్తున్నారు. తొండాటకు ఆసీస్ ఆటగాళ్లు కేరాఫ్ అడ్రస్ అని విరుచుకుపడుతున్నారు. Marnus Labuschagne really grassed the ball and dragged it on the ground before picking it up and throwing it in the air to celebrate a catch. Whatever happened to shame, Labushame?#ENGvsAUS #Ashes2023 — AJ (@UtdBrunoJr) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. Im afraid I've got no choice but to respect Marnus Labuschagne blatantly cheating in front of a stadium full of cameras and expecting to get away with it. — Jack (@JackInPogForm) June 19, 2023 ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్
యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు ఏడో ఓవర్లో వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్ (9), మార్నస్ లబూషేన్ (0) వికెట్లు పడగొట్టిన బ్రాడ్.. ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలుత వార్నర్‌ను అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన అతను.. ఆతర్వాతి బంతికే లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 వికెట్ల వెనుక బెయిర్‌స్టో సూపర్ క్యాచ్‌తో లబూషేన్ ఖేల్ ఖతం చేశాడు. ఫలితంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యాషెస్‌లో బ్రాడ్.. వార్నర్‌ను ఔట్ చేయడం ఇది 15వసారి కాగా.. టెస్ట్‌ల్లో లబూషేన్ గోల్డన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. First-ever golden duck for @marnus3cricket in Tests.pic.twitter.com/ROSAxQf7Da — CricTracker (@Cricketracker) June 17, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి (393/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (24), స్టీవ్ స్మిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన 2 వికెట్లు స్టువర్ట్ బ్రాడ్ ఖాతాలోకి వెళ్లాయి. చదవండి: తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్ -
ఉమేశ్ యాదవ్ వైల్డ్ రియాక్షన్ వెనుక కారణం అదేనా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్ ఇప్పటికే 330 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకు ఓటమి ముప్పు పొంచే ఉంది. మరో గంటలో ముగిసే తొలి సెషన్లోపూ ఆసీస్‌ను ఆలౌట్ చేయకుంటే టీమిండియాకు పెను ప్రమాదం ఉంది. 400 పరుగులకు పైగా టార్గెట్‌ను నిర్దేశించే పనిలో ఉన్న ఆసీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గ్రీన్ 25, అలెక్స్ కేరీ 22 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్‌ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఇన్సైడ్ ఎడ్జ్ అయిన బంతి లబుషేన్ బ్యాట్‌కు తగులుతూ నేరుగా పుజారా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అయితే లబుషేన్ ఔట్ చేసిన ఆనందంలో ఉమేశ్ యాదవ్ గట్టిగా అరుస్తూ కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. అయితే ఉమేశ్ ఇలా చేయడం వెనుక ఒక కారణముందని అభిమానులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఉమేశ్ ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న ఉమేశ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియారిటీ ఎప్పటికైనా పనికొచ్చేది కాని వ్యర్థం కాదు అని నిరూపించాడు. అందుకే లబుషేన్ వికెట్ తీయగానే అంత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం' -
'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే పాపం పొద్దున నుంచి ఫీల్డింగ్ చేసి అలిసిపోయాడేమో తెలియదు కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో లబుషేన్ రిలాక్స్ అయ్యాడు. కుర్చూన్న కుర్చీలోనే రిలాక్స్ అయ్యాడు. కళ్లు మూసుకుపోతుండడంతో చిన్న కునుకు తీయాలనకున్నాడు. కానీ సిరాజ్ లబుషేన్న్కు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. లబుషేన్ అలా కునుకు తీస్తున్నాడో లేదో.. ఇక్కడ సిరాజ్ వార్నర్‌ను ఔట్ చేసేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని వార్నర్ ఫ్లిక్ చేసే క్రమంలో బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ భరత్ చేతుల్లో పడింది. నిద్ర కళ్లతోనే చూసిన లబుషేన్ వార్నర్ ఔట్ అయ్యాడని తెలియగానే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. పాపం మంచిగా రెస్ట్ తీసుకుందామనుకున్నాడు..కానీ సిరాజ్ ఆ అవకాశం కూడా ఇవ్వలేదుగా అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిరాజ్ దెబ్బకు నిద్రమత్తు పూర్తిగా పాయే.. ఇక వార్నర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్ నిద్రమత్తును సిరాజ్ తన బౌలింగ్‌తో పూర్తిగా తొలగించాడు. అదే ఓవర్లో ఐదో బంతిని సిరాజ్ బౌన్సర్ వేశాడు. లబుషేన్ ఫ్రంట్‌ఫుట్ వచ్చి షాట్ ఆడే యత్నంలో విఫలమయ్యాడు. అంతే బంతి వేగంగా వచ్చి వేలుకు బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్ వదిలేసి నొప్పితో అల్లాడిపోయాడు. ఈ దెబ్బతో కొన్ని సెకన్ల ముందు ఉన్న నిద్రమత్తు పూర్తిగా తొలిగిపోయి ఉండొచ్చు అని అభిమానులు పేర్కొన్నారు. Marnus labuschagne was sleeping. Siraj took a wicket and man had to wake up immediately 😭#WTCFinal2023 #WTC23 pic.twitter.com/s239Ijt3Fz — Cricket With Abdullah 🏏 (@Abdullah__Neaz) June 9, 2023 Mohammed Siraj gatecrashes Marnus Labuschagne's sleep 🤣😂 📸: Disney + Hotstar pic.twitter.com/f2InAuplFW — 𝚂𝚘𝚕𝚘_𝚙𝚞𝚛𝚞𝚜𝚑𝚘𝚝𝚑𝚊𝚖_7 (@lpurushothamre1) June 9, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే -
సిరాజ్ దెబ్బకు అల్లాడిపోయిన లబుషేన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అంతకముందు ఓవర్లోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్ మంచి జోరు మీద ఉన్నాడు. ఖవాజా ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన లబుషేన్ కుదురుకునే ప్రయత్నం చేశాడు. కాగా 8వ ఓవర్ తొలి బంతిని సిరాజ్ 143 కిమీ వేగంతో విసిరాడు. బంతి నేరుగా వచ్చి లబుషేన్ ఎడమ బొటనవేలిని తాకుతూ వెళ్లింది. దీంతో బ్యాట్‌ను కిందపడేసిన లబుషేన్ నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి పరిశీలించిన అనంతరం లబుషేన్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/Rc6A4QjtPg — Raju88 (@Raju88784482906) June 7, 2023 చదవండి: WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు? -
IPL 2023: నా ఫేవరెట్ జట్టు అదే! అతడు చుక్కలు చూపించాడు..
India Vs Australia 2023: అవకాశం వస్తే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నాడు. కోహ్లితో కలిసి వికెట్ల మధ్య పరిగెత్తడం బాగుంటుందంటూ తమ మనసులో మాట బయటపెట్టాడు. ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో లబుషేన్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 244 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడీ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఇక వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్వదేశానికి పయనమైన లబుషేన్.. భారత్‌కు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ట్విటర్లో కాసేపు అభిమానులతో ముచ్చటించాడు. క్వశ్చన్ & ఆన్సర్స్ సెషన్లో భాగంగా అరగంట పాటు వారికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన వివిధ ప్రశ్నలకు లబుషేన్ జవాబులు చెప్పాడు. స్టీవ్ స్మిత్‌తో కాకుండా వేరెవరితో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతావని అడుగగా.. విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. ఇక ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరని ప్రశ్నించగా.. రవిచంద్రన్ అశ్విన్ అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. ఇటీవల ముగిసిన బీజీటీ-2023 సిరీస్‌లో తనకు ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ చుక్కలు చూపించాడని ఈ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తానన్న మార్నస్ లబుషేన్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ఫేవరెట్ టీమ్ అని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఈసారి తన పేరును మినీ వేలంలో నమోదు చేసుకోలేదు. చదవండి: Sanju Samson: టీమిండియాలో చోటు దక్కకపోతేనేం.. బంపర్ ఆఫర్ కొట్టేశాడుగా..! Steve Smith- IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో.. -
ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా
ICC Test Rankings- Ravichandran Ashwin- Virat Kohli: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. తద్వారా 13వ ర్యాంకు సాధించాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో సత్తా చాటి ఈ మేరకు టీమిండియా ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ర్యాంకులు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్ సొంతగడ్డపై ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 25 వికెట్లు కూల్చి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించిన అశూ.. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(22 వికెట్లు, 135 పరుగులు)తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డు పంచుకున్నాడు. కాగా బీజీటీ-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్1గా అవతరించిన అశ్విన్.. మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్‌తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 1205 రోజుల నిరీక్షణకు తెరదించి కోహ్లి టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. ఆసీస్‌తో ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్లో 75, టెస్టుల్లో 28వ శతకం సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్న రిషభ్ పంత్ 9, రోహిత్ శర్మ 10వ ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. చదవండి: Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్ WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! -
Ind Vs Aus: తొలి ఓవర్లో చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో!
India vs Australia, 4th Test: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి మొదటి ఓవర్లోనే చేదు అనుభవం ఎదురైంది. వైడ్‌తో బౌలింగ్ అటాక్ ఆరంభించిన షమీ.. తొలి ఓవర్లో మొత్తం 10 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక తన రెండో ఓవర్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడో ఓవర్లో ఓ నోబాల్! ఈ క్రమంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ ఉమేశ్ యాదవ్ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. వికెట్ తీయడానికి వీళ్లిద్దరు కూడా విఫలయత్నం చేశారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత.. 15.3 ఓవర్లో అశ్విన్ ఎట్టకేలకు ట్రవిస్ హెడ్‌ను అవుట్ చేయగలిగాడు. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత చాలా సేపటికి షమీకి మరోసారి బౌలింగ్ చేసే అవకాశం లభించింది. ఈ క్రమంలో 23వ ఓవర్లో అద్భుత డెలివరీతో మార్నస్ లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లబుషేన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. షమీ దెబ్బకు వికెట్ ఎగిరిపడింది. దీంతో మైదానంలో ఒక్కసారిగా కేరింతలు వినిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అశూ, షమీ తీసిన వికెట్లు మినహా మరెవరూ ప్రభావం చూపలేకపోయారు. దీంతో టీ బ్రేక్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో గురువారం ఆరంభమైంది. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు బ్యాడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ దూరం! సారథిగా భువీ PSL 2023: బాబర్ ఆజం విధ్వంసకర శతకం.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో! వార్నర్ రికార్డు సమం 𝐓.𝐈.𝐌.𝐁.𝐄.𝐑 🔥@MdShami11 sends back Labuschagne to scalp the second wicket for #TeamIndia 👌 Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/LT3ao2kFBk — BCCI (@BCCI) March 9, 2023 -
చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్
ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు ఆటలో టీమిండియా స్పిన్నర్లు ఏమైనా ప్రభావం చూపిస్తారేమోనని భావించినప్పటికి ఆసీస్ బ్యాటర్లు ఆ చాన్స్ ఇవ్వలేదు. 76 పరుగుల టార్గెట్ 18.5 ఓవర్లలో చేధించిన ఆసీస్ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. కాగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో లబుషేన్ తన మైండ్‌గేమ్‌తో అశ్విన్‌కు చిరాకు తెప్పించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో లబుషేన్ ఉన్నాడు. అయితే అశ్విన్ తన రనప్ తగ్గించుకొని బంతిని వేయడానికి సిద్ధమయ్యాడు. ఇది గమనించిన లబుషేన్ పొజిషన్ తీసుకోకుండా సైడ్లైన్స్పై నిలబడ్డాడు. కావాలనే మైండ్‌గేమ్ ఆడడం అశ్విన్‌కు నచ్చలేదు. కాసేపటికి లబుషేన్ స్ట్రైక్ తీసుకోవడానికి పొజిషన్‌కు రాగా.. అశ్విన్ తన చర్యతో లబుషేన్ మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాడు. రనప్ తగ్గించుకుందామని చూసిన అశ్విన్ మళ్లీ తన ఒరిజినల్ రనప్ పొజిషన్‌కే వెళ్లిపోయాడు. ఆ తర్వాత ట్రెవిస్ హెడ్ అశ్విన్‌తో మాట్లాడడం కనిపించింది. ఈ క్రమంలో లబుషేన్, కెప్టెన్ రోహిత్ శర్మతో కాసేపు మాట్లాడి పరిస్థితి వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Ashwin Anna pic.twitter.com/AZZ0ewlSzU — Nitin Kumar (@NitinKu29561598) March 3, 2023 చదవండి: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ -
లబూషేన్ క్లీన్ బౌల్డ్.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక చతికిలపడింది. కంగారూ స్పిన్నర్ల ధాటికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ పరుగు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉస్మాన్ ఖ్వాజా (53) అజేయమైన హాఫ్‌సెంచరీతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తుండగా.. స్టీవ్ స్మిత్ ఇప్పుడే క్రీజ్‌లోకి వచ్చాడు. ఆసీస్ కోల్పోయిన రెండు వికెట్లు రవీంద్ర జడేజా ఖాతాలోకే వెళ్లాయి. జడ్డూ.. ట్రవిస్ హెడ్ (9)ను ఎల్బీగా, లబూషేన్ (31)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలిసారి తప్పించుకున్నా, రెండోసారి అదే తరహాలో.. లబూషేన్‌ను జడేజా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ చేసినప్పటికీ.. ఆ బంతిని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించడంతో లబూషేన్ బ్రతికిపోయాడు. అయితే ఇన్నింగ్స్ 35వ ఓవర్లో మాత్రం లబూషేన్‌ను ఏ తప్పిదం కాపాడలేకపోయింది. నో బాల్ బంతికి ఎలా క్లీన్‌బౌల్డ్ అయ్యాడో ఈసారి కూడా అదే రీతిలో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 8 సార్లు లైన్ దాటిన జడేజా.. సాధారణంగా స్పిన్నర్లు క్రీజ్ బయటకు వచ్చి నో బాల్స్ వేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ఈ సిరీస్ జడ్డూ ఇప్పటివరకు ఏకంగా 8 నో బాల్స్ సంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇందులో జడ్డూ రెండుసార్లు వికెట్ పడగొట్టినా, నో బాల్ పుణ్యమా అని ప్రత్యిర్ధికి లైఫ్ లభించింది. ఈ మ్యాచ్‌లో లబూషేన్ జడ్డూ తప్పిదం కారణంగా తప్పించుకోగా, తొలి టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ జడ్డూ చేసిన ఇదే తప్పిదం కారణంగా బతికిపోయాడు. -
కలిసి ప్రాక్టీస్ చేశారు.. కలిసే ఔటయ్యారు
ఢిల్లీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు, పీటర్ హ్యాండ్స్కోబ్ 72 నాటౌట్ మాత్రమే రాణించారు. అయితే ప్రభావం చూపిస్తారనుకున్న స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా.. మార్నస్ లబుషేన్ 18 పరుగులకు వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు స్పిన్నర్ అశ్విన్ ఖాతాలోకి వెళ్లాయి. అది కూడా మూడు బంతుల వ్యవధిలోనే ఇద్దరిని పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక స్మిత్‌ను రెండుసార్లు డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఈ విషయం పక్కనబెడితే.. స్మిత్, లబుషేన్‌లను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెట్స్‌లో ఇద్దరు కలిసే ప్రాక్టీస్ చేశారని.. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసే ఔటయ్యారంటూ వాళ్ల ప్రాక్టీస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అశ్విన్ ను సమర్థంగా ఎదుర్కోవడానికే ఆస్ట్రేలియా టీమ్ బెంగళూరులో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ లు ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేసింది. అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితియాను రప్పించింది. ముఖ్యంగా అతని బౌలింగ్ లో స్మిత్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. అయినా అశ్విన్ ను ఎదుర్కోవడంలో అతడు ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. స్మిత్ తోపాటు లబుషేన్ లపైనే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఓపెనర్లు వార్నర్, ఖవాజాలు కూడా మంచి బ్యాటర్లే అయినా.. ఇండియాలోని స్పిన్ పిచ్ లపై వీళ్లే సమర్థంగా ఆడతారని అంచనా వేశారు. కానీ తొలి రెండు టెస్టుల్లో ఈ ఇద్దరూ నిరాశ పరిచారు. దీంతో వాళ్లను ఉద్దేశించి జాఫర్ ఇలా కౌంటర్ వేయడం విశేషం. Marnus Labuschagne ✅ Steve Smith ✅@ashwinravi99 gets 2⃣ big wickets in one over 💪💥#TeamIndia #INDvAUS pic.twitter.com/UwSIxep8q2 — BCCI (@BCCI) February 17, 2023 View this post on Instagram A post shared by Wasim Jaffer (@wasimjaffer14) చదవండి: కోహ్లి.. ఎందుకిలా? గుడ్డిలో మెల్ల.. తొలి టెస్టు కంటే మెరుగ్గానే -
'చేసేయాల్సింది ఒక పనైపోయేది..'
క్రికెట్లో మన్కడింగ్ అనగానే గుర్తుకు వచ్చే క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఐపీఎల్లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేసి అశ్విన్ చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత మరోసారి కూడా మన్కడింగ్ చేశాడు. అశ్విన్ చర్యపై అభిమానులు రెండుగా చీలిపోయారు. మన్కడింగ్ అంశంపై చాలా వివాదాలు జరిగాయి. అయితే చివరకు మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ చట్టబద్ధం చేసింది మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ). అప్పటినుంచి మన్కడింగ్‌ను రనౌట్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఈ నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచి నాన్‌స్ట్రైక్ ఎండ్ రనౌట్స్ తగ్గిపోయాయి. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని తెలిసి కొంతమంది బౌలర్లు నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్లను హెచ్చరిస్తున్నారే తప్ప రనౌట్ చేయడం లేదు. తాజాగా అశ్విన్ మరోసారి నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాటర్‌కు హెచ్చరికలు పంపాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇది చోటుచేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో మార్నస్ లబుషేన్ ఉన్నాడు. అశ్విన్ బంతి విడవడానికి ముందే లబుషేన్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ చేతిలో నుంచి బంతిని విడవలేదు. అశ్విన్ చర్యతో వెంటనే అలర్ట్ అయిన లబుషేన్ తన బ్యాట్‌ను తిరిగి క్రీజులో పెట్టాడు. ఆ తర్వాత అశ్విన్ చిరునవ్వుతో లబుషేన్వైపు చూస్తూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం అశ్విన్ చేసేయాల్సింది ఒక పని అయిపోయేది.. అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లోనే మార్నస్ లబుషేన్ వెనుదిరిగాడు. 90 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఆసీస్ అశ్విన్ దెబ్బకు వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పీటర్ హ్యాండ్స్కోబ్ 54 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. జడేజా, షమీ చెరొక రెండు వికెట్లు పడగొట్టారు. Ash is setting the tone of the Legendary #BorderGavaskarTrophy #Ashwin pic.twitter.com/E2B1fMds3p — Mohammed MD (@iammohammed2022) February 17, 2023 -
ఆసీస్ స్టార్‌తో అశ్విన్ కవ్వింపు చర్య.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
భారత్-ఆస్ట్రేలియా జట్లు ఏ ఫార్మాట్లో తలపడినా అభిమానులు అసలు సిసలు క్రికెట్ మజా ఆస్వాదిస్తారు. అందులోనూ ఇరు జట్ల మధ్య టెస్టు క్రికెట్ అంటే ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ వంటి ట్రోఫీలో ఇరు జట్ల ఆటగాళ్ల స్లేడ్జింగ్లు, మైండ్‌గేమ్‌లు అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఇక తాజాగా నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు నుంచే ఆటగాళ్ల కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. తొలుత భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి మాటలు యుద్దం జరగగా.. అనంతరం అశ్విన్, లబుషేన్ మధ్య కూడా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి లబుషేన్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇదే ఓవర్లో అశ్విన్ వేసిన ఆఖరి బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి బౌన్స్ అయ్యింది. అంతేకాకుండా బంతి లబుషేన్ సైడ్‌కు తాకింది. దీంతో లబుషేన్ వైపు సీరియస్‌గా చూసిన అశ్విన్.. బంతి టర్న్ అవ్వడమే కాదు బౌన్స్ కూడా అవుతోంది అన్నట్లు చేతితో సైగలు చేశాడు. దానికి ప్రతిస్పందనగా లాబుషేన్ కూడా అవును టర్న్ అవుతోంది అని బదులిచ్చాడు. ఆ కొద్దిసేపటికే 49 పరుగులు చేసిన లబుషేన్ జడేజా బౌలింగ్‌లో స్టంఫౌట్గా వెనుదిరిగాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 177 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ ఇక భారత స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్ 37, అలెక్స్ కేరీ 36 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో కంగరూల పతనాన్ని శాసించగా.. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. సిరాజ్, షమీ చెరొక వికెట్ తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. IND vs AUS: జడేజా దెబ్బకు స్మిత్ మైండ్ బ్లాంక్.. వీడియో చూసి తీరాల్సిందే? pic.twitter.com/ew9tpm77Mm — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 9, 2023 -
కాఫీ బ్యాగులతో ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా?
టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్ భారత్‌కు కాఫీ ప్యాకెట్లను తీసుకొచ్చాడు. ఒక బ్యాగు నిండా కాఫీ ప్యాకెట్లు ఉండడం చూసి ఎయిర్‌పోర్టు అధికారులు కూడా షాక్ అయ్యారట. వాస్తవానికి లబుషేన్‌కు కాఫీ అంటే విపరీతంగా ఇష్టమట. రోజుకు పది కప్పులకు పైగా కాఫీ తాగుతాడంట. ఈ విషయాన్ని లబుషేన్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లబుషేన్ పోస్టును చూసిన పలువురు క్రికెటర్లు ఆసక్తిరంగా స్పందించారు. డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. కాఫీ ప్యాకెట్లకు దిగుమతి సుంకం చెల్లిస్తున్నావా?.. అయినా అన్ని కాఫీ బ్యాగులెందుకు.. తాగడానికా లేక అమ్మడానికా..'' అంటూఅని ప్రశ్నించాడు. ఇక మరో క్రికెటర్ దినేశ్ కార్తిక్.. ''అక్కడి నుంచి కాఫీ బ్యాగులెందుకు.. భారత్‌లో కూడా మీకు మంచి కాఫీ దొరుకుతుంది.'' అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. Just a few KG of coffee on its way to 🇮🇳☕️🏏 Guess how many bags? https://t.co/jH5IY3bqhj pic.twitter.com/bmkVrbxWjE — Marnus Labuschagne (@marnus3cricket) January 29, 2023 చదవండి: సచిన్ చేతుల మీదుగా సన్మానం -
మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ కావాలన్న లబూషేన్
AUS VS SA 3rd Test Day 1: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ సిగరెట్ లైటర్ కావాలంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మైదానంలో ఉన్న వారితో సహా కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. లబూషేన్ ఎందుకు లైటర్ అడుతున్నాడో తెలియక ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారు కూడా కాసేపు తలలు గీకున్నారు. కామెంటేటర్ ఇష గుహ అయితే లబూషేన్ సిగరెట్ కాల్చాలని అనుకుంటున్నాడేమో అంటూ సహచరులతో డిస్కస్ చేశారు. మొత్తానికి లబూషేన్ చేసిన ఈ సంజ్ఞ తొలి రోజు ఆటకు హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో షికార్లు చేస్తుంది. అసలు లబూషేన్ సిగరెట్ లైటర్ ఎందుకు అడిగాడంటే..? అప్పటికే చాలాసేపుగా హెల్మెట్‌తో సమస్యను ఎదుర్కొంటూ పలుసార్లు తీస్తూ, వేసుకున్న లబూషేన్.. దాన్ని రిపేర్ చేసేందుకు గాను సిగరెట్ లైటర్ తేవాలని డ్రెస్సింగ్ రూమ్‌కు మెసేజ్ చేశాడు. లబూషేన్ సైగ చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి కూడా అతనెందుకు లైటర్ అడుతున్నాడో అర్ధం కాలేదు. అయితే కాసేపటి తర్వాత విషయాన్ని గ్రహించి వారు లైటర్‌ను తీసుకెళ్లి లబూషేన్ సమస్యను పరిష్కరించారు. సిబ్బంది లైటర్‌తో లబూషేన్ హెల్మెట్ లోపలి భాగంలో కాలుస్తూ రిపేర్ చేశారు. Running repairs for Marnus Labuschagne! 🚬#AUSvSA pic.twitter.com/IdSl0PqicV — cricket.com.au (@cricketcomau) January 4, 2023 ఇదిలా ఉంటే, వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ ఔట్ కాగా.. ఉస్మాన్ ఖ్వాజా, స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్, లబూషేన్‌ల వికెట్లు అన్రిచ్ నోర్జే ఖాతాలో పడ్డాయి. కాగా, 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సీజన్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. -
రాణించిన లబూషేన్, ఖ్వాజా.. నిప్పులు చెరిగిన నోర్జే
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల పాటు సాగిన ఈ రోజు ఆటలో ఆస్ట్రేలియా పాక్షికంగా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనను సఫారీ పేసర్ అన్రిచ్ నోర్జే ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ 4 బంతికి వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అద్భుతమైన బంతితో దొరకబుచ్చుకున్నాడు. 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో కేవలం 10 పరుగులు చేసిన వార్నర్.. మార్కో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా సాయంతో ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించిన అనంతరం.. నోర్జే వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. తొలి రోజు ఆఖరి బంతికి నోర్జే బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి లబూషేన్ (151 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఔటయ్యాడు. వెలుతురు లేమి కారణంగా లబూషేన్ ఔట్ అవ్వగానే అంపైర్లు మ్యాచ్‌ను ముగించారు. ఈ సమయానికి ఉస్మాన్ ఖ్వాజా (121 బంతుల్లో 54; 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లలో ఆతిధ్య ఆసీస్ భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
77 పరుగులకే కుప్పకూలిన విండీస్.. 419 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం
ఆడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 419 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆసీస్ జట్టు 2-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 497 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. మిచిల్ స్టార్క్, నీసర్, బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో లాబుషేన్(163), హెడ్(175) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. అనంతరం విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. 297 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 6 వికెట్లకు 199 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 497 పరుగుల భారీ లక్ష్యం విండీస్ ముందు ఆసీస్ ఉంచింది. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా హెడ్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా లాబుషేన్ నిలిచాడు. చదవండి: Karun Nair: తొలి సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ.. 5 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్! డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ -
Aus Vs WI: విండీస్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా భారీ స్కోరు! ఫైనల్ చేరే క్రమంలో..
Australia vs West Indies, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 409 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో భాగంగా ఆస్ట్రేలియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో విండీస్‌ను 164 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన కంగారూ బృందం.. రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. అద్భుత సెంచరీలు అడిలైడ్ వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య ఆరంభమైన రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 21 పరుగులకే పరిమితం కాగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అర్ధ శతకం(63) సాధించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 305 బంతులు ఎదుర్కొని 163 పరుగులు(14 ఫోర్లు) చేశాడు. తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్.. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆకాశమే హద్దు అయితే, నాలుగో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలిగింది. 219 బంతుల్లో హెడ్.. 20 ఫోర్ల సాయంతో 175 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో అలెక్స్ క్యారీ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారీ ఆధిక్యంలో ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆటలో భాగంగా 137 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 511 పరుగులు స్కోరు చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ 102 పరుగులు చేయగలిగింది. ఫైనల్ చేరే క్రమంలో మున్ముందుకు టగ్‌నరైన్ చందర్‌పాల్ 47, ఆండర్సన్ ఫిలిప్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. విండీస్ 409 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో మైకేల్ నసర్‌కు రెండు, నాథన్ లియాన్‌కు ఒకటి, కామెరూన్ గ్రీన్‌కు ఒక వికెట్ లభించాయి. ఇక వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆసీస్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలుగుతుంది. విండీస్ ఓడితే.. డబ్ల్యూటీసీ అవకాశాలు దాదాపు గల్లంతైనట్లే! చదవండి: Abrar Ahmed: ఇదేం బౌలింగ్రా బాబూ! మొదటి 7 వికెట్లు.. ఆ గూగ్లీ స్పెషల్.. స్టోక్స్ మతిపోయింది! ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా -
ఆస్ట్రేలియా బ్యాటర్ అరుదైన ఘనత.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా లాబుషేన్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో లాబుషేన్ వెస్టిండీస్ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ సరసన నిలిచాడు. లాబుషేన్ 51 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. ఎవర్టన్ వీక్స్ కూడా ఈ మైల్‌స్టోన్‌ను 51 ఇన్నింగ్స్‌లోనే నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన లాబుషేన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ రికార్డు సాధించిన జాబితాలో తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్ ఉన్నాడు. బ్రాడ్‌మాన్ కేవలం 33 ఇన్నింగ్స్‌లోనే 3 వేల పరుగుల రాయిని అందుకున్నాడు. లాబుషేన్ సెంచరీల మోత లాబుషేన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ శతకం నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో లబుషేన్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. లబుషేన్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా తరఫున 30 టెస్టులు ఆడి 3010 రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు.. -
AUS VS WI: లబుషేన్ హ్యాట్రిక్ సెంచరీ.. ట్రెవిస్ హెడ్ సెంచరీ
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఆట తొలిరోజునే విండీస్ బౌలర్లను ఉతికారేస్తూ ఇద్దరు ఆసీస్ బ్యాటర్లు సెంచరీలతో అజేయంగా నిలిచారు. తొలిరోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(120 బ్యాటింగ్), ట్రెవిస్ హెడ్(114 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకముందు ఉస్మాన్ ఖవాజా 62 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో డెవన్ థామస్, అల్జారీ జోసెఫ్, జాసన్ హోల్డర్ తలా ఒక వికెట్ తీశారు. ఇక మార్నస్ లబుషేన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో లబుషేన్‌కు ఇది మూడో సెంచరీ. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. -
ICC Test Rankings: నెం1 ర్యాంక్‌కు చేరుకున్న ఆసీస్ ఆటగాడు
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషేన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన లాబుషేన్.. 935 పాయింట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్న జో రూట్ నాలుగో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ సాధించిన స్మిత్ రెండో ర్యాంక్‌కు, ఇంగ్లండ్‌పై సెంచరీతో రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో ర్యాంక్‌కు చేరుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ టాప్ 20లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బ్రాత్‌వైట్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 174 పరుగులు సాధించాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయాన్ ఒక స్థానం ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించిన నసీం షా ఐదు స్థానాలు ఎగబాకి 54 వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చదవండి: IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్ -
'ఆరే'సిన నాథన్ లియోన్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం
ఆస్ట్రేలియా పర్యటనను వెస్టిండీస్ ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 497 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 333 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి మిగతావాళ్లు విఫలమయ్యారు. టగ్ నరైన్ చందర్‌పాల్ 45 పరుగులు చేశాడు. చివర్లో రోస్టన్ చేజ్ 55 పరుగులు, అల్జారీ జోసెఫ్ 43 పరుగులు.. కాస్త ప్రతిఘటించినప్పటికి ఆస్ట్రేలియా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ట్రెవిస్ హెడ్ 2, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు చెరొక వికెట్ తీశారు. లియోన్ టెస్టు కెరీర్లో ఐదు వికెట్లు తీయడం ఇది 21వ సారి కాగా.. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లు డబుల్ సెంచరీలతో చెలరేగడంతో 598 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 283 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ తన ఇన్నింగ్స్‌ను 182 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన లబుషేన్ మరోసారి సెంచరీతో చెలరేగడం విశేషం. మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన లబుషేన్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 8 నుంచి 12వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది. Nathan Lyon seals it in Perth! Be sure to join the Australian Men's Cricket Team in Adelaide on Thursday and keep the momentum going for this summer of cricket! pic.twitter.com/oveeRTbwm0 — Cricket Australia (@CricketAus) December 4, 2022 చదవండి: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. రిషబ్ పంత్ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా? మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ద్యుతీచంద్! -
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా యువ కెరటం మార్నస్ లబూషేన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన లబూషేన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ కొట్టి, టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా, మూడో ఆసీస్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దిగ్గజ క్రికెటర్లు డౌగ్ వాల్టర్స్, గ్రెగ్ ఛాపెల్ (ఆస్ట్రేలియా), లారెన్స్ రోవ్, బ్రియాన్ లారా (వెస్టిండీస్), సునీల్ గవాస్కర్ (ఇండియా), గ్రహం గూచ్ (ఇంగ్లండ్), కుమార సంగక్కర (శ్రీలంక) ఈ ఫీట్‌ను సాధించగా.. తాజాగా లబూషేన్ వీరి సరసన చేరాడు. లబూషేన్ తొలి ఇన్నింగ్స్‌లో 350 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్ సాయంతో 204 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ప్రత్యర్ధి ముందు 498 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (166 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది. బ్రాత్‌వైట్ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 598/4 డిక్లేర్ (లబూషేన్ 204, స్టీవ్ స్మిత్ 200 నాటౌట్) వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 283 ఆలౌట్ (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 64, టగెనరైన్ చంద్రపాల్ 51) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 182/2 డిక్లేర్ (లబూషేన్ 104 నాటౌట్) వెస్టిండీస్: 192/3 (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 101 నాటౌట్) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. విండీస్ కెప్టెన్ వీరోచిత పోరాటం
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు ఓటమి నుంచి గట్టెక్కేందుకు అష్టకష్టాలు పడుతుంది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 498 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (166 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) వీరోచితంగా పోరడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది. బ్రాత్‌వైట్ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. యువ ఓపెనర్, విండీస్ దిగ్గజ బ్యాటర్ తనయుడు టగెనరైన్ చంద్రపాల్ (45) ఒక్కడు కాసేపు నిలకడగా ఆడగా.. షమ్రా బ్రూక్స్ (11), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (24) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బ్రాత్వైట్కు జతగా కైల్ మేయర్స్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు 306 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదే ఆసీస్ గెలవాలంటే.. ఏడుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేస్తే సరిపోతుంది. అంతకుముందు మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 182/2 (37 ఓవర్లు) స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (6) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా, వార్నర్ (48) పర్వాలేదనిపించాడు. స్టీవ్ స్మిత్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో.. ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (64), టగెనరైన్ చంద్రపాల్ (51) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌటైంది. స్టార్క్ (3/51), కమిన్స్ (3/34) విండీస్ పతనాన్ని శాసించారు. -
లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలు.. పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న హెడ్
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో, ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్.. తన కెరీర్లో నాలుగో సారి ఈ ఫీట్‌ను నమోదు చేయగా, లబూషేన్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. మరోవైపు ట్రవిస్ హెడ్.. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన హెడ్.. పరుగు తేడాతో తన 5వ టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. హెడ్ ఔట్ కావడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ద్వారా విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన టగెనరైన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. -
లబూషేన్ ద్విశతకం.. బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన స్టీవ్ స్మిత్
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌కు ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ చుక్కలు చూపించారు. పెర్త్ వేదికగా నిన్న (నవంబర్ 30) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో లబూషేన్ ద్విశతకంతో (204), స్మిత్ అజేయమైన భారీ శతకంతో (189*) చెలరేగి విండీస్ బౌలర్లతో ఆటాడుకున్నారు. మ్యాచ్ తొలి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న లబూషేన్ రెండో రోజు (డిసెంబర్ 1) మరింత జోరు పెంచి కెరీర్లో రెండో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88 టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. 29 x 💯 Steve Smith showing no signs of slowing down! #MilestoneMoments#AUSvWI | @nrmainsurance pic.twitter.com/ebkgO2j8n5 — cricket.com.au (@cricketcomau) December 1, 2022 ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉండగా, సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. లబూషేన్ ద్విశతకానికి తోడు స్మిత్ అజేయమైన భారీ శతకం, ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (65), ట్రవిస్ హెడ్ (80 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో 148 ఓవర్లలో 568/3 స్కోర్ వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. -
లబుషేన్, స్మిత్ సెంచరీలు
గాలె: శ్రీలంకతో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. మార్నస్ లబుషేన్ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (212 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. లబుషేన్ వ్యక్తిగత స్కోరు 28 వద్ద శ్రీలంక కీపర్ డిక్వెల్లా స్టంపింగ్ అవకాశాన్ని వదిలేశాడు. ఉస్మాన్ ఖాజా (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... వార్నర్ (5), ట్రావిస్ హెడ్ (12), కామెరాన్ గ్రీన్ (4) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ప్రస్తుతం స్మిత్‌తో కలిసి అలెక్స్ క్యారీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు తీయగా, కాసున్ రజిత, రమేశ్ మెండిస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో కామిందు మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య టెస్టుల్లో అరంగేట్రం చేశారు. -
ఆ క్రికెటర్‌ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..!
క్రికెట్ ఆస్ట్రేలియా రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను కోల్పోయింది. ఇదే ఏడాది మార్చి 4న షేన్ వార్న్ (52) గుండెపోటుతో మరణించగా.. తాజాగా (మే 14) ఆండ్రూ సైమండ్స్(46) కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఇద్దరూ ఈ శతాబ్దపు ఆరంభంలో ఆస్ట్రేలియాను తిరుగులేని జట్టుగా నిలబెట్టారు. ఆటలోనే కాకుండా వివాదాల విషయంలో ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు పోటీ పడి మరీ అపవాదు తెచ్చారు. సైమండ్స్ అకాల మరణ వార్త తెలియగానే వీరిద్దరికి సంబంధించిన ఓ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా వార్న్, సైమోలిద్దరూ మోడ్రన్ స్మిత్‌గా పిలువబడే ఆసీస్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్‌కు కామెంటేటర్లు వ్యవహారించిన వార్న్, సైమండ్స్‌లు లబుషేన్‌ను బండ బూతులు తిడుతూ అడ్డంగా దొరికిపోయారు. లబూషేన్ విషయంలో వారి సంభాషణను ఫాక్స్ స్పోర్ట్స్ లైవ్‌లో ప్రసారం చేయడంతో విషయం బయటపడింది. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్ 91 పరుగుల వద్ద ఔట్ కావడంతో తొలుత వార్న్ లబూషేన్‌ను విమర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సైమండ్స్ అందుకుని.. లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు (హాగ్ పైల్) ఇవ్వాలంటూ బూతు పురాణం మొదలుపెట్టాడు. దీన్ని వార్న్ కొనసాగించాడు. ఈ తతంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారం కావడంతో వార్న్-సైమోలిద్దరూ మరోసారి విమర్శలపాలయ్యారు. కాగా, రెండు నెలల వ్యవధిలో వార్న్-సైమోలిద్దరు హఠాణ్మరణం చెందడంతో లబూషేన్ విషయం నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ యువ క్రికెటర్‌ను అనరాని మాటలు అన్నారు.. అనుభవించారు అంటూ కొందరు ఆకతాయిలు పోస్ట్‌లు పెడుతున్నారు. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. -
వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య
ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వోర్సెస్టర్షైర్తో మ్యాచ్‌లో డుర్హమ్ తరపున 88 బంతుల్లోనే 161 పరుగుల ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టోక్స్ 110 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక రకంగా స్టోక్స్‌కు మంచి ప్రాక్టీస్ లభించినట్లే. ఇక విషయంలోకి వెళితే.. గ్లామోర్గాన్స్ బౌలర్ మార్నస్ లబుషేన్ వేసిన ఒక బంతి స్టోక్స్ నడుము కింది భాగంలో తగిలింది. దీంతో స్టోక్స్ క్రీజులోనే కిందపడిపోయాడు. అయితే ఇదంతా ఫన్నీగా మాత్రమే. వాస్తవానికి స్టోక్స్‌కు పెద్దగా దెబ్బలు తగల్లేదు. తన కాలును స్ట్రెచ్ చేసుకోవడానికే స్టోక్స్ క్రీజులో పడిపోయాడు. అయితే స్టోక్స్‌కు దెబ్బ తగిలిందేమోనని పరిగెత్తుకొచ్చిన లబుషేన్ అసలు విషయం తెలుసుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పైకి లేచిన స్టోక్స్ తన బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోక్స్ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇంగ్లండ్ కొత్త కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ కలయికలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ సరికొత్తగా సిద్ధమవనుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన డుర్హమ్ 311 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ 2, కీగన్ పీటర్సన్ 7, లీస్ 44 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన గ్లామోర్గాన్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. చదవండి: Harpreet Bhatia Forgery Case: అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు Man down 😬 Ben Stokes is floored after inside edging a Labuschagne short ball into the unmentionables#LVCountyChamp pic.twitter.com/0y3bAxCIBo — LV= Insurance County Championship (@CountyChamp) May 12, 2022 -
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా..
పాకిస్తాన్‌తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. ఆసీస్ బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మోట్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. మెక్‌డెర్మోట్ 108 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. కాగా వన్డేల్లో అతడికి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక అతడితో పాటు ట్రావిస్ హెడ్ మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. 70 బంతుల్లో 89 పరుగులు సాధించి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే కెప్టెన్ పింఛ్ వికెట్ కోల్పోయింది. షాహిన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో ఫించ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మెక్‌డెర్మోట్, హెడ్ ఆస్ట్రేలియాను అదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్‌డెర్మోట్(108),హెడ్(89), లబుషేన్(59), స్టోయినిష్(49) పరుగులతో రాణించారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిది నాలుగు వికెట్ల పడగొట్టగా, మహ్మద్ వసీం రెండు, జహీద్ మహ్మద్, కుషీదల్ షా చెరో వికెట్ సాధించారు. చదవండి: Ruturaj Gaikwad: ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు హవా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ ఆటగాళ్లు అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్‌లో లబూషేన్ (892), స్టీవ్ స్మిత్ (845) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా, పాక్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (757) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఖ్వాజా ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 7వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (754), విరాట్ కోహ్లి (742)లు తలో ర్యాంక్ కోల్పోయి 8, 10 స్థానాలకు పడిపోయారు. Major changes in the latest @MRFWorldwide ICC Men’s Player Rankings for Tests and ODIs 👀 More ➡️ https://t.co/MsmAFEH2gG pic.twitter.com/5Cr3GbWccp — ICC (@ICC) March 30, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓ ర్యాంకును మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్, టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్, సఫారీ స్పీడ్‌స్టర్ రబాడ, భారత పేసు గుర్రం బుమ్రా, పాక్ నయా సంచలనం షాహీన్ అఫ్రిది వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ కేటగిరీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (385), రవిచంద్రన్ అశ్విన్ (341)తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. మరోవైపు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో (బ్యాటింగ్ విభాగంలో) పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ ఆటగాడు రాస్ టేలర్ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం ఎగబాకి ఫోర్త్ ప్లేస్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పాక్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌లు చెరో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6, 10 స్థానాలకు ఎగబాకారు. బౌలింగ్‌లో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి, బంగ్లా వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, న్యూజిలాండ్ స్టార్ పేసర్ బౌల్ట్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్‌ను ఆర్సీబీ నిలువరించేనా..? -
వైరల్‌గా మారిన పాక్ క్రికెటర్ చర్య.. ఏం జరిగింది
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఆదివారం మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో పాక్ స్పిన్నర్ నుమాన్ అలీ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న లబుషేన్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో నుమాన్ అలీ బంతిని అంచనా వేయడంలో పొరబడ్డాడు. దీంతో మిస్ అయిన బంతి లబుషేన్ మోచేతిని తాకుతూ పక్కకు వెళ్లింది. ఇది గమనించిన కీపర్ రిజ్వాన్ లబుషేన్ వద్దకు వచ్చి దెబ్బ ఏమన్న తగిలిందేమో చూసి అతని మోచేతిని గట్టిగా రుద్దాడు. ఏం పర్లేదు.. బాగానే ఉంది అని చెప్పగానే రిజ్వాన్ నవ్వుతూ అతని చేతిని వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''బంతిని అందుకోవడం అంటే సాయపడడంలోనే రిజ్వాన్ ఎక్కువ సంతోషం ఉందని గ్రహించాడు'' అంటూ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా మ్యాచ్ నాలుగోరోజు వర్షం అడ్డుపడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇక మూడోరోజు ఆటలో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ధీటుగా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ చేజార్చుకున్నాడు. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 1 పరుగులు చేసింది. లబుషేన్ 61, స్టీవ్ స్మిత్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చదవండి: Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం Shane Warne Death: వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది Rizwan is more than happy to help😄#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/yV9H595UAo — Pakistan Cricket (@TheRealPCB) March 6, 2022 -
Aus Vs Eng: 134.1 స్పీడ్.. బొక్కబోర్లా పడ్డాడు.. ఇంత వరకు ఇలా అవుటవడం చూడలే!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు విఫలమైన వేళ మార్నస్ లబుషేన్ కంగారూల పాలిట ఆశాదీపంగా నిలిచాడు. వార్నర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగగా... ‘సెంచరీల’ వీరుడు ఉస్మాన్ ఖవాజా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ట్రవిస్ హెడ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు లబుషేన్. 53 బంతులు ఎదుర్కొన్న అతడు 44 పరుగులు చేశాడు. అయితే, 9 ఫోర్లు బాది జోరు మీదున్న లబుషేన్ విచిత్రకర రీతిలో అవుట్ కావడం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 23వ ఓవర్లో 134.1 స్పీడ్‌తో బంతిని సంధించాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన లబుషేన్... ఒక్కసారిగా బొక్కబోర్లాపడిపోయాడు. ఇంకేముంది.. బంతి వికెట్లను గిరాటేయడం.. బెయిల్స్ కిందపడటం చకచకా జరిగిపోయాయి. పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న లబుషేన్‌ను బౌల్డ్ చేసిన ఆనందంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆసీస్ బ్యాటర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఆసీస్ ఇప్పటికే 3-0 తేడాతో ఆసీస్ సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు డ్రాకాగా... ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. One of the weirdest dismissals we've ever seen! 😱#Ashes pic.twitter.com/8Qp5rKprn8 — cricket.com.au (@cricketcomau) January 14, 2022