వన్డే ప్రపంచకప్- 2023 జట్టులో చోటు కోల్పోయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌కు.. ఆసీస్ సెలక్టర్లు కీలక బాధ్యతలు అప్పగించారు. స్వదేశంలో న్యూజిలాండ్-ఏ జట్టుతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఏ కెప్టెన్‌గా లబుషేన్ వ్యవహరించనున్నాడు. కాగా న్యూజిలాండ్-ఏ జట్టు ఈ నెలఖారులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఈ టూర్‌లో భాగంగా కివీస్ ఆస్ట్రేలియాతో రెండు అనాధికర టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మెరకు 18 సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్లలో 10 మందికి పైగా అంతర్జతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. టాడ్ మార్ఫీ, బెన్ మెక్‌డర్మెట్, జోష్ పిలిఫీ వంటి ఆటగాళ్లతో కూడిన జట్టును లబుషేన్ నడిపించనున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య ఆగస్టు 28 నుంచి తొలి అనాధికర టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇక ఇది ఇలా ఉండగా.. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమిరీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో అతడి ఫామ్ సరిగ్గా లేకపోవడంతోనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదని ఆసీస్ ఛీప్ సెలక్టరః జార్జ్ బెయిలీ సృష్టం చేశాడు. అదే విధంగా లబుషేన్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడుతాడని బెయిలీ తెలిపాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పగించారు.
కివీస్‌తో అనాధికారిక టెస్టులకు ఆసీస్ జట్టు: వెస్ అగర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, జోర్డాన్ బకింగ్‌హామ్, బెన్ ద్వార్షుయిస్, కాలేబ్ జ్యువెల్, క్యాంప్‌బెల్ కెల్లావే, మాథ్యూ కెల్లీ, మాథ్యూ కుహ్నెమాన్, నాథన్ మెక్‌ఆండ్రూ, నాథన్ మెక్‌స్వీనీ, జోయెల్ ప్యారిస్, జిమ్మీ పెర్రిప్, మిచ్ పెర్రిప్, మిచ్‌పీర్సన్, మిచ్ స్టెకెటీ, మిచెల్ స్వెప్సన్, టిమ్ వార్డ్
ఆస్ట్రేలియా వన్డే జట్టు: వెస్ అగర్, ఆలీ డేవిస్, బెన్ ద్వార్షుయిస్, లియామ్ హాట్చర్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, బెన్ మెక్‌డెర్మాట్, టాడ్ మర్ఫీ, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, గురిందర్ సంధు, మాథ్యూ షార్ట్
చదవండి: BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేలకోట్లు! ప్రభుత్వానికి చెల్లించేది ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment