కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో భాగంగా గ్లామోర్గన్, గ్లోసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌గా నిలిచిపోనుంది. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ గెలుపుకు చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైంది. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. ఇలాంటి ఉత్కంఠ సందర్భంలో వికెట్‌కీపర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
MATCH OF THE COUNTY HISTORY.
- Glamorgan needs 1 run to win.
- One wicket left.
- One ball left.
Then the wicket-keeper took a Blinder without gloves and the match ended in a tie. 🥶🔥 pic.twitter.com/YtKIDsU00F— Johns. (@CricCrazyJohns) July 3, 2024
వివరాల్లోకి వెళితే.. గ్లోసెస్టర్‌షైర్ నిర్ధేశించిన 593 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 592 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా.. అజిత్ డేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమ్స్ బ్రేసీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో జేమీ మెకిల్‌రాయ్ ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లోసెస్టర్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 610 పరుగులు చేయగా.. గ్లామోర్గన్ తొలి ఇన్నింగ్స్‌లో 197, రెండో ఇన్నింగ్స్‌లో 592 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో మార్నస్ లబూషేన్ (119), సామ్ నార్త్‌ఈస్ట్ (187) అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి గ్లామోర్గన్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చారు. అయితే వికెట్‌కీపర్ జేమ్స్ బ్రేసీ నమ్మశక్యం కానీ రీతిలో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని గ్లామోర్గన్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.
ఈ మ్యాచ్‌లో గ్లామోర్గన్ గెలిచి ఉంటే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఛేదనగా రికార్డుల్లోకెక్కేది. ఛేదనలో గ్లామోర్గన్ చేసిన 592 పరుగులు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో అత్యధిక స్కోర్‌గా రికార్డైంది.
Comments
Please login to add a commentAdd a comment