ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟
The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025
మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.
కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.
బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..
87(50) vs హోబర్ట్ హరికేన్స్
1(8) vs మెల్బోర్న్ స్టార్స్
2(9) vs పెర్త్ స్కార్చర్స్
49(36) vs మెల్బోర్న్ స్టార్స్
21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్
2(4) vs సిడ్నీ థండర్
30(22) vs పెర్త్ స్కార్చర్స్
3(6) vs హోబర్ట్ హరికేన్స్
Comments
Please login to add a commentAdd a comment