ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్ చేసింది.
మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.
పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.
మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.
హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.
తుది జట్లు (అంచనా)..
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్‌కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లోనే ఇది బిగ్ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్‌కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.
హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే 14, సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు (అంచనా)..
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్]
Comments
Please login to add a commentAdd a comment