Big Bash League
-
బిగ్‌బాష్ లీగ్ విజేత మెల్బోర్న్ రెనెగేడ్స్
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను మెల్బోర్న్ రెనెగేడ్స్ గెలుచుకుంది . ఇవాళ (డిసెంబర్ 1) జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ చేసే సమయానికి వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 12 ఓవర్లలో 98 పరుగులకు కుదించారు. ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన బ్రిస్బేన్ హీట్ లక్ష్యానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది. నికోలా హ్యాంకాక్ చివరి బంతికి సిక్సర్ బాదినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.రాణించిన హేలీ మాథ్యూస్తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్.. హేలీ మాథ్యూస్ అర్ద సెంచరీతో (61 బంతుల్లో 69) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జార్జియా వేర్హమ్ (21), నయోమీ స్టాలెన్‌బర్గ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో చార్లీ నాట్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ పార్సన్స్ 2, నికోలా హ్యాంకాక్, లూసీ హ్మామిల్టన్, జొనాసెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.జొనాసెన్ పోరాటం వృధా98 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ తడబడింది. ఆ జట్టులో జెస్ జోనాసెన్ (44 నాటౌట్), నికోలా హ్యాంకాక్ (13 నాటౌట్) ఎవ్వరూ రాణించలేదు. వీరిద్దరు కాక జార్జియా రెడ్మేన్ (16) రెండంకెల స్కోర్ చేసింది. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 2, చారిస్ బెక్కర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, సోఫీ మోలినెక్స్, డియాండ్ర డాటిన్ తలో వికెట్ పడగొట్టారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ఇది తొలి టైటిల్. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న మంధన
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో మంధన అమండ జేడ్ బౌలింగ్‌లో కార్లీ లీసన్ క్యాచ్‌ను పట్టుకుంది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరవతువుంది.WHAT A STUNNING CATCH BY SMRITI MANDHANA IN WBBL 🤯🔥 pic.twitter.com/byoJRzx69i— Johns. (@CricCrazyJohns) November 19, 2024మూడు క్యాచ్‌లు పట్టుకున్న మంధన ఈ మ్యాచ్‌లో మంధన మొత్తం మూడు క్యాచ్‌లు పట్టుకుంది. ఈ మూడు అద్భుతమైన క్యాచ్‌లే. మైదానంలో పాదరసంలా కదిలిన మంధన బ్యాట్‌తోనూ రాణించింది. 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. మంధన బ్యాట్‌తో, ఫీల్డ్‌లో రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. మంధన (41), కేటీ మ్యాక్(41), లారా వోల్వార్డ్ట్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. స్కార్చర్స్ బౌలర్లలో అలానా కింగ్ 3, కెప్టెన్ సోఫీ డివైన్ 2, క్లో ఐన్స్‌వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కార్చర్స్.. మెగాన్ షట్ (3/19), ముషాంగ్వే (2/35), అమండ జేడ్ వెల్లింగ్టన్ (2/26), తహిల మెక్‌గ్రాత్ (1/27) ధాటికి నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ హ్యాలీడే (47), సోఫీ డివైన్ (35), అలానా కింగ్ (29 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో అరివీర భయంకమైన ఫామ్‌లో ఉన్న లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసకర సెంచరీలు చేసింది. తొలుత పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 బంతుల్లో అజేయమైన 150 పరుగులు (12 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసిన లీ.. తాజాగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు సెంచరీతో (59 బంతుల్లో 103; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించింది. తద్వారా మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.కొడితే బ్యాట్ విరిగిపోయింది..!ఈ మ్యాచ్‌లో లిజెల్ కొట్టిన ఓ షాట్‌కు బ్యాట్ విరిగిపోయింది. ఓర్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి లిజెల్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడింది. ఈ షాట్‌కు బ్యాట్ విరిగిపోయినప్పటికీ బంతి బౌండరీని క్లియర్ చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్.. లిజెల్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిజెల్కు నికోలా క్యారీ (46 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సహకరించింది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో వ్యాట్ హాడ్జ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఎలైస్ విల్లాని 14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అడిలైడ్ బౌలర్లలో మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో లిజెల్ రనౌటయ్యింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రయికర్స్ 15 ఓవర్ల అనంతరం మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధన (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో కదంతొక్కగా.. కేటీ మ్యాక్ 14, తహిళ మెక్‌గ్రాత్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. లారా వోల్వార్డ్ట్ (25), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (11) క్రీజ్‌లో ఉన్నారు. హరికేన్స్ బౌలర్లలో మోల్లీ స్ట్రానో, లారెన్ స్మిత్, యామీ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ గెలవాలంటే 30 బంతుల్లో మరో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. -
బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన
మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. రెనెగేడ్స్ 17.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గతంలో కూడా ఈ రికార్డు రెనెగేడ్స్ పేరిటే ఉండేది. 2019-20 సీజన్లో బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెనెగేడ్స్ 184 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక లక్ష్య ఛేదనలు..186- మెల్బోర్న్ రెనెగేడ్స్184- మెల్బోర్న్ రెనెగేడ్స్180- పెర్త్ స్కార్చర్స్179- సిడ్నీ సిక్సర్స్ (2020-21)179- సిడ్నీ సిక్సర్స్ (2024-25)కాగా, హేలీ మాథ్యూస్ (54 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డియాండ్రా డొట్టిన్ (18 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని మెల్బోర్న్ రెనెగేడ్స్ సునాయాసంగా ఊదేసింది. మాథ్యూస్, డొట్టిన్ రెండో వికెట్‌కు కేవలం 33 బంతుల్లో 85 పరుగులు జోడించి రెనెగేడ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.అడిలైడ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (49), స్మృతి మంధన (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. లారా వోల్వార్డ్ట్ (27), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (24) పర్వాలేదనిపించారు. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇల్లింగ్‌వర్త్, అలైస్ క్యాప్సీ, డియాండ్రా డొట్టిన్, సారా తలో వికెట్ దక్కించుకున్నారు.రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో హేలీ మాథ్యూస్, డొట్టిన్తో పాటు కోట్నీ వెబ్ (37 రిటైర్డ్ హర్ట్) కూడా రాణించింది. అలైస్ క్యాప్సీ ఒక్కరే తక్కువ స్కోర్‌కు (4) నిష్క్రమించారు. క్యాప్సీ వికెట్ డార్సీ బ్రౌన్కు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టికలో సీడ్నీ థండర్ టాప్‌లో ఉండగా..మెల్బోర్న్ రెనెగేడ్స్ రెండో స్థానంలో నిలిచింది. -
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ విధ్వంసం.. 12 ఫోర్లు, 12 సిక్స్‌లతో ఊచకోత
మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీ విధ్వంసకర సెంచరీతో మెరిసింది.సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్ధి బౌలర్లను ఈ దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఊచకోత కోసింది. ఆమెను ఆపడం పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు వంతు కాలేదు. ఆమె బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.ఓవరాల్‌గా 75 బంతులు ఎదుర్కొన్న లీ..12 ఫోర్లు, 12 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీథర్ గ్రహమ్(23) రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో పెర్త్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. హోబర్ట్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్మిత్, స్ట్రానో తలా రెండు వికెట్లు సాధించారు. పెర్త్ బ్యాటర్లలో అనిస్వర్త్(41) ఒంటరి పోరాటం చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా లీ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రేస్ హ్యారీస్(136 నాటౌట్) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యారీస్ అల్‌టైమ్ రికార్డును లీ బ్రేక్ చేసింది.చదవండి: BAN vs AFG 2nd Odi: మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం -
టీమిండియా కెప్టెన్‌కు అవమానం
మహిళల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అవమానం జరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 1) జరిగిన డ్రాఫ్ట్‌లో హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. బిగ్‌బాష్ లీగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన హర్మన్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హర్మన్ బీబీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడి 117.16 స్ట్రయిక్‌రేట్‌తో 1440 పరుగులు చేసింది. 35 ఏళ్ల హర్మన్ మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్ తరఫున ఐదు సీజన్ల పాటు బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంది. హర్మన్ 2023 మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టింది. గత సీజన్లోనూ ముంబై ఇండియన్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు (153 మ్యాచ్‌ల్లో 3426 పరుగులు) కలిగిన హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకోకపోవడం విచారకరం.కాగా, మహిళల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో మొత్తం 19 మంది భారత ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకోగా.. కేవలం ఆరుగురు మాత్రమే వివిధ ఫ్రాంచైజీల చేత ఎంపిక చేసుకోబడ్డారు. స్మృతి మంధనను అడిలైడ్ స్ట్రయికర్స్ ముందస్తుగా (ప్రీ సైన్డ్) సొంతం చేసుకోగా.. దయాలన్ హేమలతను పెర్త్ స్కార్టర్స్, శిఖా పాండేను బ్రిస్బేన్ హీట్, యస్తికా భాటియాను మెల్బోర్న్ స్టార్స్, దీప్తి శర్మను మెల్బోర్న్ స్టార్స్, జెమీమా రోడ్రిగెజ్‌ను బ్రిస్బేన్ హీట్ డ్రాఫ్ట్‌లో ఎంపిక చేసుకున్నాయి. మహిళల బిగ్‌బాష్ లీగ్ అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు సాగనుంది.డ్రాఫ్ట్ రిజల్ట్స్..సోఫీ ఎక్లెస్టోన్ (సిడ్నీ సిక్సర్లు,రిటెన్షన్ పిక్)హీథర్ నైట్ (సిడ్నీ థండర్, రిటెన్షన్ పిక్)లారా వోల్వార్డ్ట్ (అడిలైడ్ స్ట్రైకర్స్, రిటెన్షన్ పిక్)డాని వ్యాట్ (హోబర్ట్ హరికేన్స్)డియాండ్రా డాటిన్ (మెల్బోర్న్ రెనెగేడ్స్)దీప్తి శర్మ (మెల్బోర్న్ స్టార్స్)జెమిమా రోడ్రిగ్స్ (బ్రిస్బేన్ హీట్)సోఫీ డివైన్ (పెర్త్ స్కార్చర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)క్లో ట్రయాన్ (హోబర్ట్ హరికేన్స్)అమేలియా కెర్ (సిడ్నీ సిక్సర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)హేలీ మాథ్యూస్ (మెల్బోర్న్ రెనెగేడ్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)మారిజానే కాప్ (మెల్బోర్న్ స్టార్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)షబ్నిమ్ ఇస్మాయిల్ (సిడ్నీ థండర్)శిఖా పాండే (బ్రిస్బేన్ హీట్)అమీ జోన్స్ (పెర్త్ స్కార్చర్స్)హేమలత దయాళన్ (పెర్త్ స్కార్చర్స్)ఆలిస్ క్యాప్సే (మెల్బోర్న్ రెనెగేడ్స్)చమారి అతపత్తు (సిడ్నీ థండర్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)యాస్తిక భాటియా (మెల్బోర్న్ స్టార్స్)స్మృతి మంధాన (అడిలైడ్ స్ట్రైకర్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)లిజెల్ లీ (హోబర్ట్ హరికేన్స్, ప్రీ-సైన్డ్ ప్లేయర్)హోలీ ఆర్మిటేజ్ (సిడ్నీ సిక్సర్లు)ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (అడిలైడ్ స్ట్రైకర్స్)జార్జియా ఆడమ్స్ (సిడ్నీ థండర్)నదీన్ డి క్లెర్క్ (బ్రిస్బేన్ హీట్, ప్రీ-సైన్డ్ ప్లేయర్) -
బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లకు మాంచి గిరాకీ
ఇవాళ (సెప్టెంబర్ 1) జరిగిన పురుషుల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లకు మాంచి గిరాకీ ఉండింది. డ్రాఫ్ట్‌లో మొత్తం 14 మంది ఇంగ్లండ్ ప్లేయర్లను వివిధ ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. నాలుగు రౌండ్ల పాటు సాగిన డ్రాఫ్ట్‌లో ఇంగ్లండ్ (14), న్యూజిలాండ్ (4), వెస్టిండీస్ (4), బంగ్లాదేశ్ (1), పాకిస్తాన్ (1) దేశాలకు చెందిన 24 మంది ప్లేయర్లు ఎంపిక చేయబడ్డారు. ఆసియా దేశాల నుంచి పాక్‌కు చెందిన ఉసామా మిర్, బంగ్లాదేశ్‌కు చెందిన రిషద్ హొస్సేన్ మాత్రమే ఎంపిక చేయబడ్డారు.రౌండ్ల వారీగా వివిధ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు..తొలి రౌండ్:బెన్ డకెట్- మెల్బోర్న్ స్టార్స్జేమ్స్ విన్స్-సిడ్నీ సిక్సర్స్ (రిటెన్షన్)లారీ ఈవాన్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్లోకీ ఫెర్గూసన్- సీడ్నీ థండర్షాయ్ హోప్- హోబర్ట్ హరికేన్స్జేమీ ఓవర్టన్- అడిలైడ్ స్ట్రయికర్స్ (రిటెన్షన్)కొలిన్ మున్రో- బ్రిస్బేన్ హీట్ (ప్రీ సైన్డ్)ఫిన్ అలెన్- పెర్త్ స్కార్చర్స్ (ప్రీ సైన్డ్)రెండో రౌండ్:టామ్ కర్రన్ మెల్బోర్న్ స్టార్స్ (ప్రీ సైన్డ్) జాకబ్ బెతెల్ - మెల్బోర్న్ రెనెగేడ్స్ ఒల్లీ పోప్ - అడిలైడ్ స్ట్రైకర్స్ (ప్రీ సైన్డ్ ప్లేయర్) హోబర్ట్ హరికేన్స్ - క్రిస్ జోర్డన్ (ప్రీ-సైన్డ్ ప్లేయర్)సామ్ బిల్లింగ్స్ - సిడ్నీ థండర్ (ప్రీ-సైన్డ్ ప్లేయర్) పాల్ వాల్టర్ - బ్రిస్బేన్ హీట్ అకీల్ హోసేన్ - సిడ్నీ సిక్సర్స్ (ప్రీ సైన్డ్)మూడో రౌండ్:మాథ్యూ హర్స్ట్ - పెర్త్ స్కార్చర్స్ ఫాబియన్ అలెన్ - అడిలైడ్ స్ట్రైకర్స్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ - సిడ్నీ థండర్ టిమ్ సీఫెర్ట్ - మెల్బోర్న్ రెనిగేడ్స్ (ప్రీ సైన్డ్)ఉసామా మీర్ - మెల్బోర్న్ స్టార్స్నాలుగో రౌండ్:రిషద్ హుస్సేన్-హోబర్ట్ హరికేన్స్బ్రిస్బేన్ హీట్ - టామ్ అల్సోప్ కీటన్ జెన్నింగ్స్ - పెర్త్ స్కార్చర్స్జాఫర్ చోహన్-సిడ్నీ సిక్సర్స్ -
ఓ జట్టు నుంచి నాకు ఆఫర్ వచ్చింది.. నా పార్టీ బిల్ కంటే: సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన కెరీర్లో సెహ్వాగ్ ఎన్నో అద్భుత మైలురాయిలను అందుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచూరియాన్గా వీరేంద్రుడు కొనసాగుతున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20ల్లొ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ ఐపీఎల్లో కూడా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సెహ్వాగ్ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.గతంలో బిగ్ బాష్ లీగ్ నుంచి తనకు వచ్చిన గొప్ప ఆఫర్‌ను తిరస్కరించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో భారత ఆటగాళ్లు ఆడే అవకాశముందా అన్న ప్రశ్న సందర్భంగా సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గిల్‌క్రిస్ట్, సెహ్వాగ్ మధ్య జరిగిన చిట్‌చాట్‌పై ఓ లుక్కేద్దాం.ఆడమ్ గిల్‌క్రిస్ట్: భవిష్యత్తులో భారత ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడే ఛాన్స్ ఉందా?వీరేంద్ర సెహ్వాగ్: "లేదు , మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా రిచ్. పేద దేశాలకు వెళ్లి ఆడము (నవ్వుతూ). నేను భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్‌లో ఆడమని ఓ ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చింది. ఎంత మొత్తం ఇస్తారని నేను ఆడిగాను. అందుకు వారి నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను.వారు నాకు లక్ష డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.84 లక్షలు) ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నవ్వుకుని అంతకంటే ఎక్కువ డబ్బులను నా సెలవుల్లో ఖర్చుచేస్తానని, గత రాత్రి పార్టీ బిల్లు కూడా లక్ష డాలర్లు దాటిందని వారికి చెప్పానని" సెహ్వాగ్ తెలిపాడు. -
నిప్పులు చేరిన గుజరాత్ బౌలర్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్
బిగ్ బాష్ లీగ్ 2023-24 సీజన్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్ నిలిచింది. సిడ్నీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ సిక్సర్స్‌ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రిస్బేన్ హీట్.. రెండో సారి టైటిల్‌ను ముద్దాడింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. బ్రిస్బేన్ బౌలర్ల దాటికి కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. బ్రిస్బేన్ బౌలర్లలో ఎక్స్‌ప్రెస్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన 4 ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా ఐపీఎల్-2024 వేలంలో జాన్సన్‌ను రూ. 10 కోట్లకు గుజరాత్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌తో పాటు బ్రాట్‌లెట్,స్వీప్సన్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. సిడ్నీ బ్యాటర్లలో హెన్రిక్స్(25) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ బాదిన జోష్ బ్రౌన్.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రౌన్‌తో పాటు రెన్షా(40) పరుగులతో రాణించాడు. సిడ్నీ బౌలర్లలో అబాట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: టీమిండియాతో మ్యాచ్‌లో ఓవరాక్షన్.. స్టార్ క్రికెటర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ Spencer 👑 Your Player of The Final. #BBL13 pic.twitter.com/saEDxVXG0q — KFC Big Bash League (@BBL) January 24, 2024 -
ఫ్రీ హిట్‌కు క్యాచ్ పట్టి సెలబ్రేషన్స్.. పాక్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్-2023లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న పాకిస్తాన్ ఆటగాడు ఉసామా మీర్ గ్రౌండ్లో నవ్వులు పూయించాడు. ఏం జరిగిందంటే? మెల్బోర్న్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతి వేసే క్రమంలో బౌలర్ స్టిక్టీ ఓవర్ స్టాప్ చేశాడు. దీంతో మెల్బోర్న్ బ్యాటర్ బెన్క్రాప్ట్కు ఫ్రీహిట్ లభించింది. ఫ్రీహిట్ బంతిని బెన్‌క్రాప్ట్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని థర్డ్‌మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఉసామా మీర్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్‌ను పట్టిన అది ఫ్రీహిట్ అని మర్చిపోయిన ఉస్మామీర్ బంతిని త్రో చేయకుండా సంబరాల్లో మునిగితేలిపోయాడు. వెంటనే మరో సిడ్నీ ఆటగాడు బాల్ త్రో చేయమని సైగ చేస్తే.. అప్పుడు మీర్ వికెట్ కీపర్ వైపు త్రో చేశాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను మీర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. The old catch off a free hit! Unlucky, Usama 😅 #BBL13 pic.twitter.com/eOnQC7v8p9 — KFC Big Bash League (@BBL) December 23, 2023 చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! ఓపెనర్లు ఎవరంటే? -
కొలిన్ మున్రో ఊచకోత.. తృటిలో సెంచరీ మిస్.. ఎందుకంటే?
బిగ్ బాష్ లీగ్ 2023 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గురువారం (డిసెంబర్ 7) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ 103 పరుగుల భారీ విజయం సాధించింది. బ్రిస్బేన్ గెలుపులో కొలిన్ మున్రో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న మున్రో.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 99 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మున్రోకు సెంచరీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. మ్యాక్స్ బ్రయాంట్ (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) కారణంగా ఆ అవకాశం చేజారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాక మున్రో స్కోర్ 99కి చేరింది. అయితే ఆతర్వాత మూడు బంతులను బ్రయాంట్ బౌండరీలుగా తరలించడంతో మున్రోకు సెంచరీ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్.. మున్రో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (28), లబూషేన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మెల్బోర్న్ బౌలర్లు జోయెల్ పారిస్, మ్యాక్స్‌వెల్, కౌల్డర్‌నైల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ను బ్రిస్బేన్ బౌలర్లు 111 పరుగులకే (15.1 ఓవర్లలో) కుప్పకూల్చారు. మిచెల్ స్వెప్సన్ 3, మైఖేల్ నెసర్, జేవియర్ బార్ట్లెట్ చెరో 2 వికెట్లు, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కున్హేమన్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో హిల్టన్ కార్ట్‌వైట్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు కీలక నిర్ణయం..
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 సీజన్ నుంచి బ్రూక్ వైదొలిగాడు. తన జాతీయ జట్టు విధుల కారణంగా బ్రూక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు బ్రూక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఇంగ్లండ్ జట్టు ఈ ఏడాది డిసెంబర్లో వైట్‌బాల్ సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ కరేబియన్ టూర్లో భాగంగా ఆతిథ్య విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వెర్వేరు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. అయితే ఈ రెండు జట్లలోను హ్యారీ బ్రూక్ సభ్యునిగా ఉన్నాడు. ఈ క్రమంలో రాబోయే బిగ్ బాష్ లీగ్ సీజన్‌కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అదే విధంగా ఇంగ్లండ్ కరేబియన్ టూర్ డిసెంబర్ 3న మొదలు కానుంది. వెస్టిండీస్ పర్యటన ముగిసినంతరం ఇంగ్లీష్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ జరగనుంది. చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్ -
భారత్ నుంచి హర్మన్‌ప్రీత్ మాత్రమే...
ఆ్రస్టేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీకి సంబంధించి ఆదివారం విదేశీ క్రికెటర్ల డ్రాఫ్ట్ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 116 మంది విదేశీ క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా... ఎనిమిది ఫ్రాంచైజీలు 17 మందిని ఎంపిక చేసుకున్నాయి. భారత్ నుంచి 18 మంది క్రికెటర్లు తుది జాబితాలో ఉండగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మాత్రమే అవకాశం దక్కింది. మెల్బోర్న్ రెనెగెడ్స్ జట్టు హర్మన్‌ప్రీత్‌ను ఎంపిక చేసుకుంది. 2021–2022 సీజన్లో హర్మన్‌ప్రీత్ మెల్బోర్న్ తరఫున ఆడి 406 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా తీసింది. -
బిగ్‌బాష్ లీగ్‌కు స్మృతి మంధాన దూరం!
భారత్‌లో మహిళల ప్రీమియర్ లీగ్ కంటే ఎంతో ముందుగా ఆ్రస్టేలియాలో ప్రారంభమై ఆలరిస్తోన్న మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ప్లేయర్ల తుది జాబితా (డ్రాఫ్ట్) సిద్ధమైంది. 2023–24 కొత్త సీజన్ కోసం సెప్టెంబర్ 3న లీగ్ ఫ్రాంచైజీలు ఈ జాబితాలో ఉన్న క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుంటాయి. భారత్ నుంచి 18 మంది క్రికెటర్లు ఈ డ్రాఫ్ట్‌లో ఉన్నారు. అయితే భారత స్టార్ ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన తన పేరును ఇందులో నమోదు చేసుకోలేదు. గతంలో డబ్ల్యూబీబీఎల్‌లో స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్ జట్లకు ఆడింది. -
జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా?
బిగ్‌బాష్ లీగ్-2022లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెనిగేడ్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్ జంపా నాన్-స్ట్రైకర్ టామ్ రోజర్స్‌ను రనౌట్(మన్కడింగ్) చేయడానికి ప్రయత్నించాడు. జంపా బంతి వేయకముందే రోజర్స్ క్రీజును వదిలి బయటకు వెళ్లగా.. అది గమనించిన అతడు వెంటనే వికెట్లను గిరాటేశాడు. దీంతో రనౌట్‌కు అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. కాగా పలు మార్లు రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కాగా కొత్త రూల్స్ ప్రకారం మన్కడింగ్‌ను సాధారణ రనౌట్‌గానే పరిగిణిస్తారు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ మాత్రం ఎందుకు నాటౌట్‌గా ప్రకటించాడన్నది ప్రేక్షకులకు ఆర్ధం కాలేదు. థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే? మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ జంపా మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై రెనెగేడ్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. Spicy, spicy scenes at the MCG. Not out is the call...debate away, friends! #BBL12 pic.twitter.com/N6FAjNwDO7 — KFC Big Bash League (@BBL) January 3, 2023 చదవండి: IND vs SL: దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు -
మ్యాక్స్‌వెల్ ఊచకోత .. 41 బంతుల్లో సెంచరీ.. ఏకంగా 24 ఫోర్లు, 4 సిక్స్‌లు!
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విద్వంసం సృష్టించాడు. బుధవారం హాబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో అతడు సెంచరీ సాధించాడు. హరికేన్స్ బౌలర్లను మ్యాక్సీ ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. కాగా మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌కు స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్ తోడు అవడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్బోర్న్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కాగా ఇప్పటి వరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ 154 పరుగులు సాధించగా, స్టోయినిస్ 75 పరుగులుతో రాణించాడు. హరికేన్స్ బౌలర్లలో జోష్ ఖాన్, థాంమ్సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక 274 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హరికేన్స్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. చదవండి: షేన్ వార్న్ ఫిక్సింగ్ ఆరోపణలకు పాక్ మాజీ కెప్టెన్ కౌంటర్ -
BBL 2021-22: బిగ్ బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టించనున్న రస్సెల్..
Melbourne Stars sign Andre Russell for Big Bash league 2021: వెస్టిండీస్ విద్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి బిగ్ బాష్ లీగ్‌లో అడుగు పెట్టనునన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న11వ ఎడిషన్ కోసం మెల్బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం రస్సెల్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని మెల్బోర్న్ స్టార్స్ కోచ్ డేవిడ్ హస్సీ సృష్టం చేశాడు. రస్సెల్ లాంటి స్టార్ ఆటగాడు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషకరమని హస్సీ తెలిపాడు. రస్సెల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని హస్సీ చెప్పాడు. డిసెంబర్10న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్‌లో రస్సెల్ ఆడనున్నాడని హస్సీ పేర్కొన్నాడు. కాగా రస్సెల్‌కు బిగ్ బాష్ లీగ్‌లో ఆడడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు రస్సెల్ ఈ లీగ్‌లో 2014 నుంచి 2017 వరకు సిడ్నీ థండర్స్ తరుపున ఆడాడు. కాగా ఐపీఎల్-14 సీజన్లో రస్సెల్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇటీవల ముగిసిన అబుదాబి టీ10 లీగ్‌లో రస్సెల్ అద్బుతంగా రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. మరి ఈ ఆస్ట్రేలియాన్ లీగ్‌లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 5న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. చదవండి: Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ -
WBBL: ఇటు జెమీమా.. అటు స్మృతి మంధాన.. అదరగొట్టేశారు..
Jemimah Rodrigues Smriti Mandhana Hit Fifties: మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన అదరగొట్టారు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున జెమీమా... సిడ్నీ థండర్ జట్టు తరఫున స్మృతి మంధాన బరిలోకి దిగారు. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు తొమ్మిది పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత మెల్బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది. ఓపెనర్ జెమీమా 56 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మెల్బోర్న్ జట్టుకే ఆడుతున్న భారత వన్డే జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు పరుగులు చేసి అవుటైంది. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ స్మృతి మంధాన 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 64 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్ బౌలింగ్‌లో బౌల్డయి పెవిలియన్ చేరింది. చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్! -
రెండు వైపులా రనౌటయ్యాడు..
సిడ్నీ: బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రీకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో థండర్స్ బౌలర్ క్రిస్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్ కొట్టిన బంతి గ్రీన్ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో జేక్ వెథరాల్డ్ క్రీజ్ బయట ఉన్నాడు. దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్.. సాల్ట్ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్ క్రీజ్‌కు చేరుకునే లోపే వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్ చేయడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్ రెండు వైపులా రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్‌మెన్ రెండు ఎండ్స్లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
యువరాజ్ ‘బిగ్‌బాష్’ ఆడతాడా?
మెల్బోర్న్: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. గత ఏడాది అతను రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎక్కడైనా లీగ్‌లు ఆడేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక ‘బిగ్ బాష్’ లీగ్‌లో ఆడేందుకు యువీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. యువరాజ్ మేనేజ్మెంట్ వ్యవహారాలు చూసే కంపెనీ ఈ విషయాన్ని చెప్పినట్లు స్థానిక పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వెల్లడించింది. ‘యువరాజ్ ఏదైనా జట్టుతో జత కట్టేందుకు ఉన్న అవకాశాలను మేం క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చిస్తున్నాం’ అని అతని మేనేజర్ జేసన్ వార్న్ పేర్కొన్నారు. అయితే యువీ కోసం బీబీఎల్ జట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంతర్గత సమాచారం. గతంలోనూ భారత క్రికెటర్లు కూడా బీబీఎల్‌లో ఆడితే బాగుంటుందని పలు సూచనలు వచ్చినా బీసీసీఐ వాటిని అంగీకరించలేదు. (నాదల్ వస్తున్నాడు ) -
మ్యాక్స్‌వెల్ బాదేశాడు..
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. శుక్రవారం మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెనిగేడ్స్ నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను మెల్బోర్న్ స్టార్స్ ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ స్టోయినిస్ డకౌట్ నిష్ర్కమించగా, మరో ఓపెనర్ హిల్టన్ కార్ట్‌రైట్(35) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బెన్ డంక్(14) విఫలమయ్యాడు. ఆ తరుణంలో నిక్ లార్కిన్‌కు జత కలిసిన కెప్టెన్ మ్యాక్స్‌వెల్ పరుగుల మోత మోగించాడు. భారీ హిట్లు సాధిస్తూ రెనిగేడ్స్ బౌలర్లను చిత్తు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాదిన మ్యాక్స్‌వెల్.. ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.19 ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి మెల్బోర్న్ స్టార్స్‌కు మరో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు షాన్ మార్ష్(63), మార్కస్ హారిస్(42)లు శుభారంభాన్ని అందించారు. ఆపై వెబ్‌స్టెర్(25) ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు. దాంతో రెనిగేడ్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. -
అవుటా... నాటౌటా!
బ్రిస్బేన్: సిక్సర్‌గా మారబోతున్న బంతిని బౌండరీ ఇవతలినుంచే గాల్లోకి ఎగిరి ఆపడం, ఆపై అవసరమైతే బంతిని లోపలికి తోసిన తర్వాత లైన్ దాటి వెళ్లి వచ్చి కూడా క్యాచ్ అందుకోవడం లేదా మరో ఫీల్డర్‌కు అందించడం ఇటీవల తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి కొనసాగింపుగానా అన్నట్లు జరిగిన ఘటన వివాదం రేపింది. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా వేడ్ కొట్టిన బంతిని ఫీల్డర్ రెన్షా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. (ఇక్కడ చదవండి: క్రికెట్లో అదొక వేస్ట్ రూల్.. దాన్ని తీసేయండి!) ఈ క్రమంలో గీత దాటిన అతను అక్కడినుంచే బంతిని లోపల ఉన్న ఫీల్డర్ బాంటన్ వైపు తోశాడు! ముందుగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ తర్వాత అదే పనిగా ఎన్నో రీప్లేలు చూశాక అవుటిచ్చాడు. బంతిని నెట్టే సమయంలో అతని కాళ్లు గాల్లో ఉన్నాయి కాబట్టి నిబంధనల ప్రకారమే సరైనదేనంటూ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఫీల్డర్ లైన్ దాటి ఇలా చేయడం పెద్ద తప్పంటూ మాజీలు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు. -
స్టోయినిస్ అనుచిత ప్రవర్తన.. భారీ జరిమానా
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో దూకుడుగా ప్రవర్తించిన ఆసీస్ క్రికెటర్ మార్కస్ స్టోయినిస్‌పై భారీ జరిమానా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. శనివారం మెల్బోర్న్ స్టార్స్-మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ అయిన స్టోయినిస్.. మెల్బోర్న్ రెనిగేడ్స్ ఆటగాడే కేన్ రిచర్డ్సన్ను దూషించాడు. రిచర్డ్సన్పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ కావడంతో తన తప్పును స్టోయినిస్ ఒప్పుకున్నాడు. ఆ క్రమంలోనే అతనికి 7,500 డాలర్ల జరిమానా విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. తన ప్రవర్తనపై ఎటువంటి చాలెంజ్‌కు వెళ్లకుండా ఒప్పుకోవడంతో స్టోయినిస్‌కు జరిమానాతో సరిపెట్టారు. దీనిలో భాగంగా రిచర్డ్సన్కు అంపైర్లకు స్టోయినిస్ క్షమాపణలు చెప్పాడు. ‘ ఆ క్షణంలో ఏమైందో నాకు తెలీదు. నేను దూషించిన మాట వాస్తవం. నేను తప్పు చేసాను అనే సంగతిని వెంటనే తెలుసుకున్నా. ఇది నిజంగా పెద్ద తప్పిదమే. కేన్‌కు, అంపైర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని స్టోయినిస్ పేర్కొన్నాడు.ఆ మ్యాచ్‌లో స్టోయినిస్ జట్టు మెల్బోర్న్ స్టార్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెనిగేడ్స్ 143 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని స్టార్స్ 18.5 ఓవర్లలో ఛేదించింది. స్టోయినిస్(68 నాటౌట్), గ్లెన్ మ్యాక్స్‌వెల్(40)లు విజయంలో కీలక పాత్ర పోషించారు. -
మళ్లీ లిన్ మోత మోగించాడు..
హోబార్ట్: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్న ఆసీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న లిన్.. శుక్రవారం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 88 పరుగులు సాధించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన లిన్ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు మోత మోగించాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ మ్యాక్స్ బ్రయాంట్(65)తో కలిసి 95 పరుగుల్ని జోడించాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో బ్రిస్బేన్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఆపై మ్యాట్ రెన్షాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన లిన్ జట్టు స్కోరును రెండొందల దాటించాడు. రెన్ షా 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయడంతో బ్రిస్బేన్ మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇక లిన్ నాటౌట్‌గా మిగిలాడు. ఆపై టార్గెట్‌ను ఛేదించే క్రమంలో హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దాంతో బ్రిస్బేన్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో బ్రిస్బేన్‌కు ఇది రెండో విజయం. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కూడా లిన్ దూకుడుగా ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో 94 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిడ్నీ సిక్సర్స్‌పై బ్రిస్బేన్ హీట్ 48 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.(ఇక్కడ చదవండి:‘ప్రతీ సిక్స్‌ను డొనేట్ చేస్తా’) -
క్రికెట్లో అదొక వేస్ట్ రూల్.. దాన్ని తీసేయండి!
సిడ్నీ: గడిచిన కొన్నేళ్లలో ప్రపంచ క్రికెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఫార్మాట్లను పరిచయం చేయడం దగ్గర్నుంచీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ వరకూ పలు మార్పులు చేసింది ఐసీసీ. అయితే క్రికెట్లో లెగ్ బైస్ నిబంధనను తొలగించాలని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు మార్క్ వా. క్రికెట్లో అదొక వేస్ట్ రూల్ అని పేర్కొన్న వా.. దాన్ని మార్చాలంటూ ఐసీసీకి విన్నవించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా గురువారం మెల్బోర్న్ స్టార్స్ -సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మార్క్ వా బ్యాట్స్‌మెన్ తీసే లెగ్ బైస్‌పై విమర్శలు చేశాడు. ప్రధానంగా సిడ్నీ థండర్స్ బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ పదే పదే లెగ్ బై రూపంలో పరుగులు సాధించడంతో వా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో అదొక అనవసరపు రూల్ అంటూ పేర్కొన్నాడు. ‘ మనకు తెలుసు.. క్రికెట్లో లెగ్ బైస్ రూల్ ఎప్పుడ్నుంచో అమలవుతుంది. ఇది అవసరమా. ఈ రూల్ మొత్తం క్రికెట్లో లేకుండా మార్చేయండి. నువ్వు బంతిని టచ్ చేయలేనప్పుడు పరుగులు ఎందుకు ఇవ్వాలి. శరీరానికి కానీ, ప్యాడ్లకు కానీ బంతి తగిలితే లెగ్ బైస్‌గా పరుగులు తీస్తున్నారు. దీనివల్ల క్రికెట్లో పారదర్శకత లోపించినట్లే కనబడుతోంది’ అని వా తెలిపాడు. అయితే ఆ కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం వాతో విభేదించాడు. ఇది గేమ్‌లో ఒక భాగమని పేర్కొన్నాడు. కాకపోతే దీనిపై మొండిగా ఉన్నావంటూ మార్క్ వాను చమత్కరించాడు. దీనికి వా సమాధానమిస్తూ.. ఈ పద్ధతిని తాను మారుస్తానంటూ చెప్పుకొచ్చాడు. దానికి మైకేల్ వాన్ మరోసారి స్పందిస్తూ..‘ నువ్వు క్రికెట్ లా మేకర్ ఎంసీసీలో సభ్యుడిగా ఉండాలి. నువ్వు అందులో ఉంటే కొత్త విధానాలను తీసుకొస్తావు. అదే సమయంలో లండన్ కూడా తరచు రావొచ్చు. లార్డ్స్‌లో ఉన్న ఎంసీసీలోని ఒక చక్కటి రూమ్‌లో కూర్చొని మార్పులు చేయొచ్చు’ అని వాన్ పేర్కొనగా, దానికి సమాధానంగా వా మాట్లాడుతూ..‘ ఈ రూల్‌ను మార్చాలనే ఆలోచన మా సోదరుడు స్టీవ్ వాది కూడా. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి. కనీసం వన్డే క్రికెట్లోనైనా తొలగించాలి’ అని తెలిపాడు.