బిగ్‌బాష్ లీగ్ 2024-25లో ఇవాళ (జనవరి 6) సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. డేనియల్ క్రిస్టియన్ (Daniel Christian) (15 బంతుల్లో 23 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.
41 Year Old Dan Christian who was the coach before, now becomes part of the BBL - smashed a 92M six. 🤯pic.twitter.com/zXGCj3wwtS
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2025
ఒలివర్ డేవిస్ 12 బంతుల్లో 10 (ఫోర్), మాథ్యూ గిల్కెస్ 10 బంతుల్లో 20 (4 ఫోర్లు), సామ్ బిల్లంగ్స్ 9 బంతుల్లో 10 (ఫోర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 9 బంతుల్లో 11 (సిక్స్), హగ్ వెబ్జెన్ 8 బంతుల్లో 11 (సిక్స్), క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 5, టామ్ ఆండ్రూస్ 6 బంతుల్లో 13 (ఫోర్, సిక్స్), లోకీ ఫెర్గూసన్ 9 బంతుల్లో 7 నాటౌట్ (ఫోర్) పరుగులు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు పడగొట్టగా.. నెసర్, కున్నేమన్ తలో 2, జేవియర్ బార్ట్‌లెట్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
మ్యాక్స్ బ్రయాంట్ సునామీ ఇన్నింగ్స్
174 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ సఫలమయ్యింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్ బ్రాయాంట్ (35 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్ ఆడి బ్రిస్బేన్‌ను గెలిపించారు. మ్యాట్ రెన్షా (33 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్రిస్బేన్‌ను విజయతీరాలకు చేర్చాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో జాక్ వుడ్ 2, కొలిన్ మున్రో 23, నాథన్ మెక్‌స్వీని 7, టామ్ అల్సోప్ 9, మైఖేల్ నెసర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. సిడ్నీ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. వెస్ అగర్, డేనియల్ క్రిస్టియన్, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
41 years & still got it...pic.twitter.com/W7P5yoCTVq
— CricTracker (@Cricketracker) January 6, 2025
నాలుగో స్థానానికి ఎగబాకిన బ్రిస్బేన్
ఈ గెలుపుతో బ్రిస్బేన్ హీట్ (7 పాయింట్లు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టేబుల్‌లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు) టాప్‌లో ఉండగా.. సిడ్నీ థండర్ (8), హోబర్ట్ హరికేన్స్ (8) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పెర్త్ స్కార్చర్స్ (6), మెల్‌బోర్న్ రెనెగేడ్స్ (4), అడిలైడ్ స్ట్రయికర్స్ (4), మెల్‌బోర్న్ స్టార్స్ (4) ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్రిస్టియన్
సిడ్నీ థండర్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ క్రిస్టియన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. క్రిస్టియన్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటడు. తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన క్రిస్టియన్ అనంతరం బంతితో రాణించాడు. బ్యాటింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న క్రిస్టియన్ 2 భారీ సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం బౌలింగ్‌లో క్రిస్టియన్ కీలకమైన నాథన్ మెక్‌స్వీని వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసిన క్రిస్టియన్ 6.20 సగటున 25 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. 41 ఏళ్ల క్రిస్టియన్ సిడ్నీ థండర్‌కు చెందిన కీలక ఆటగాళ్లు గాయపడటంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి బరిలోకి దిగాడు. క్రిస్టియన్ చివరిగా 2022-23 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలో నిలిచాడు.
గాయాలపాలైన సామ్స్, బాన్‌క్రాఫ్ట్
థండర్ ఆటగాళ్లు డేనియల్ సామ్స్, కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ కొద్ది రోజుల కిందట మైదానంలో తీవ్రంగా గాయపడ్డారు. క్యాచ్ పట్టబోయి సామ్స్, బాన్‌క్రాఫ్ట్ ఒకరినొకరు ప్రమాదకర రీతిలో గుద్దుకున్నాడు. సామ్స్‌ను మైదానం నుంచి స్ట్రెచర్‌పై మోసుకుపోయి ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. బాన్‌క్రాఫ్ట్ ముక్కు పగిలి రక్త కారడంతో పాటు భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment