Daniel Christian
-
రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్నాడు.. ఇరగదీశాడు..!
బిగ్‌బాష్ లీగ్ 2024-25లో ఇవాళ (జనవరి 6) సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. డేనియల్ క్రిస్టియన్ (Daniel Christian) (15 బంతుల్లో 23 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 41 Year Old Dan Christian who was the coach before, now becomes part of the BBL - smashed a 92M six. 🤯pic.twitter.com/zXGCj3wwtS— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2025ఒలివర్ డేవిస్ 12 బంతుల్లో 10 (ఫోర్), మాథ్యూ గిల్కెస్ 10 బంతుల్లో 20 (4 ఫోర్లు), సామ్ బిల్లంగ్స్ 9 బంతుల్లో 10 (ఫోర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 9 బంతుల్లో 11 (సిక్స్), హగ్ వెబ్జెన్ 8 బంతుల్లో 11 (సిక్స్), క్రిస్ గ్రీన్ 7 బంతుల్లో 5, టామ్ ఆండ్రూస్ 6 బంతుల్లో 13 (ఫోర్, సిక్స్), లోకీ ఫెర్గూసన్ 9 బంతుల్లో 7 నాటౌట్ (ఫోర్) పరుగులు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు పడగొట్టగా.. నెసర్, కున్నేమన్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నారు.మ్యాక్స్ బ్రయాంట్ సునామీ ఇన్నింగ్స్174 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ సఫలమయ్యింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్ బ్రాయాంట్ (35 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్ ఆడి బ్రిస్బేన్‌ను గెలిపించారు. మ్యాట్ రెన్షా (33 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్రిస్బేన్‌ను విజయతీరాలకు చేర్చాడు. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో జాక్ వుడ్ 2, కొలిన్ మున్రో 23, నాథన్ మెక్‌స్వీని 7, టామ్ అల్సోప్ 9, మైఖేల్ నెసర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. సిడ్నీ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. వెస్ అగర్, డేనియల్ క్రిస్టియన్, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ దక్కించుకున్నారు.41 years & still got it...pic.twitter.com/W7P5yoCTVq— CricTracker (@Cricketracker) January 6, 2025నాలుగో స్థానానికి ఎగబాకిన బ్రిస్బేన్ఈ గెలుపుతో బ్రిస్బేన్ హీట్ (7 పాయింట్లు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టేబుల్లో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు) టాప్‌లో ఉండగా.. సిడ్నీ థండర్ (8), హోబర్ట్ హరికేన్స్ (8) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (4), అడిలైడ్ స్ట్రయికర్స్ (4), మెల్బోర్న్ స్టార్స్ (4) ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్రిస్టియన్సిడ్నీ థండర్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ క్రిస్టియన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. క్రిస్టియన్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో, బంతితో సత్తా చాటడు. తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన క్రిస్టియన్ అనంతరం బంతితో రాణించాడు. బ్యాటింగ్‌లో 15 బంతులు ఎదుర్కొన్న క్రిస్టియన్ 2 భారీ సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం బౌలింగ్‌లో క్రిస్టియన్ కీలకమైన నాథన్ మెక్‌స్వీని వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసిన క్రిస్టియన్ 6.20 సగటున 25 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. 41 ఏళ్ల క్రిస్టియన్ సిడ్నీ థండర్‌కు చెందిన కీలక ఆటగాళ్లు గాయపడటంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి బరిలోకి దిగాడు. క్రిస్టియన్ చివరిగా 2022-23 సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలో నిలిచాడు.గాయాలపాలైన సామ్స్, బాన్క్రాఫ్ట్థండర్ ఆటగాళ్లు డేనియల్ సామ్స్, కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ కొద్ది రోజుల కిందట మైదానంలో తీవ్రంగా గాయపడ్డారు. క్యాచ్ పట్టబోయి సామ్స్, బాన్‌క్రాఫ్ట్ ఒకరినొకరు ప్రమాదకర రీతిలో గుద్దుకున్నాడు. సామ్స్‌ను మైదానం నుంచి స్ట్రెచర్‌పై మోసుకుపోయి ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా.. బాన్‌క్రాఫ్ట్ ముక్కు పగిలి రక్త కారడంతో పాటు భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది. -
రిటైర్మెంట్ను వెనక్కు తీసుకున్న ఆసీస్ ఆల్‌రౌండర్.. 41 ఏళ్ల వయసులో రీఎంట్రీ
ఆసీస్ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్టియన్ సిడ్నీ థండర్ తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం క్రిస్టియన్ థండర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయాలతో సతమతమవుతున్న థండర్‌ను ఆదుకునేందుకు క్రిస్టియన్ బరిలోకి దిగనున్నాడు. థండర్ ఆటగాళ్లు డేనియల్ సామ్స్, కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ కొద్ది రోజుల కిందట మైదానంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.క్యాచ్ పట్టబోయి సామ్స్, బాన్‌క్రాఫ్ట్ ఒకరినొకరు ప్రమాదకర రీతిలో గుద్దుకున్నాడు. సామ్స్‌ను మైదానం నుంచి స్ట్రెచర్‌పై మోసుకుపోయి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. బాన్‌క్రాఫ్ట్ ముక్కు పగిలి రక్త కారడంతో పాటు భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది. అప్పటికే థండర్ గాయాల సమస్యతో బాధపడుతుంది. జేసన్ సంఘా, తన్వీర్ సంఘా, నిక్ మాడిసన్ గాయాల కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యారు.ఇలాంటి పరిస్థితుల్లో థండర్‌కు వేరే అప్షన్ లేక క్రిస్టియన్‌ను బరిలోకి దిగమని కోరింది. థండర్ యాజమాన్యం కోరిక మేరకు క్రిస్టియన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. థండర్ జట్టుకు ఆటగాళ్ల కొరత ఉంది. సామ్ కొన్‌స్టాస్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు వెళ్లాడు. త్వరలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, లోకీ ఫెర్గూసన్ కూడా జట్టును వీడనున్నారు. వీరిద్దరూ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడేందుకు వెళ్తారు. ఎనిమిది మంది ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో క్రిస్టియన్ బరిలోకి దిగాల్సి వస్తుంది.41 ఏళ్ల క్రిస్టియన్ రెండేళ్ల కిందట రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రిస్టియన్ చివరిగా సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రిటైర్మెంట్ అనంతరం క్రిస్టియన్ సిడ్నీ థండర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరున్న క్రిస్టియన్ ఓవరాల్‌గా 409 టీ20లు ఆడాడు. క్రిస్టియన్ ఆసీస్ తరఫున 43 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన క్రిస్టియన్ బీబీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున మూడు టైటిల్స్ (బ్రిస్బేన్ హీట్, మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ సిక్సర్స్) సాధించాడు. క్రిస్టియన్ బిగ్‌బాష్ లీగ్‌లో 121 మ్యాచ్‌లు ఆడి 2009 పరుగులు.. 89 వికెట్లు తీశాడు.క్రిస్టియన్ ఇవాళ జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. సిడ్నీ థండర్ ఇవాళ బ్రిస్బేన్ హీట్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో థండర్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు 13 ఓవర్లలో 115 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ (44), క్రిస్ గ్రీన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో మైఖేల్ నెసర్, మాథ్యూ కున్నేమన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
శివాలెత్తిన గప్తిల్.. ఒకే ఓవర్లో..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. గప్తిల్ శివాలెత్తిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ సూపర్ స్టార్స్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు) 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. సథరన్ సూపర్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో గోస్వామి 18, మసకద్జ 1, చతురంగ డిసిల్వ 26, చిరాగ్ గాంధీ 36, పవన్ నేగి 8, జెసల్ కరియా 1, చిగుంబర 20 (నాటౌట్), సుబోత్ భాటి 1 (నాటౌట్) పరుగు చేశారు. మణిపాల్ టైగర్స్ బౌలర్లలో హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనురీత్ సింగ్, పియెనార్, రాహుల్ శుక్లా, ఏంజెలో పెరీరా తలో వికెట్ దక్కించుకున్నారు.195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. హమీద్ హసన్ (3/20), అబ్దుర్ రజాక్ (2/30), మోను కుమార్ (2/44), జెసల్ కరియా (2/29), పవన్ నేగి (1/0) ధాటికి 13.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో ఉతప్ప 17, అసేల గుణరత్నే 22, తిసార పెరీరా 37, అనురీత్ సింగ్ 10, హర్భజన్ సింగ్ 11, ఏంజెలో పెరీరా 5 పరుగులు చేయగా.. సౌరభ్ తివారి, అమిత్ వర్మ, పియెనార్ డకౌట్లు అయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సథరన్ సూపర్ స్టార్స్ ప్రస్తుత ఎల్ఎల్సీ ఎడిషన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది.టైగర్స్ ఇంకా బోణి కొట్టాల్సి ఉంది. చదవండి: భారత్‌కు బిగ్ షాక్.. ఆసీస్ సిరీస్‌కూ స్టార్ ప్లేయర్ దూరం! -
టీ20ల్లో ఆస్ట్రేలియా విధ్వంసం.. ఏకంగా 274 పరుగులు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా వెస్టిండీస్‌తో ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో బెన్ డంక్, క్రిస్టియన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు.డంక్ కేవలం 35 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో సెంచరీ మార్క్‌ను అందుకోగా.. క్రిస్టియన్ 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆసీస్ సాధించినదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక విండీస్ బౌలర్లలో ఎమిరిట్ 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 275 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సైతం ధీటుగా బదులిచ్చింది. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని విండీస్ చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేయగల్గింది. విండీస్ బ్యాటర్లలో డ్వేన్ స్మిత్(64), నర్స్(70) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీసీ బౌలర్లలో కెప్టెన్ బ్రెట్‌లీ రెండు, సిడిల్, దోహర్టీ, కౌల్టర్ నైల్,క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో జూలై 12న ఇండియా ఛాంపియన్స్‌తో ఆసీస్ తలపడనుంది. -
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్.. 44 బంతుల్లో శతకం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాడ్విక్.. కొలొంబో లయన్స్‌తో ఇవాళ (మార్చి 18) జరుగుతున్న మ్యాచ్‌లో 44 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న చాడ్విక్.. 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. చాడ్విక్తో పాటు అల్విరో పీటర్సన్ (49) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో కపూగెదెర (17 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో న్యూయార్క్ 200 పరుగుల మార్కును క్రాస్ చేసింది. కొలొంబో లయన్స్ బౌలర్లలో రాణా నయీమ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరివర్దన ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో లయన్స్... 8.1 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. దమ్మిక ప్రసాద్ (1-0-6-2), రాహుల్ శర్మ (2.1-0-10-2) అసేల గుణరత్నే (2-0-6-1), జేరోమ్ టేలర్ (2-0-18-1) కొలొంబో లయన్స్ పతనాన్ని శాశిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో విజేత రేపు జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ డెవిల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ డెవిల్స్‌కు సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్నాడు. -
'ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11వ సీజన్) చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సిడ్నీ సిక్సర్స్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ జట్టులోని ఆటగాళ్లు వరుసగా కోవిడ్ బారిన పడడంతో.. ఫైనల్ మ్యాచ్‌కు నిఖార్సైన 11 మంది ఆటగాళ్లు కరువయ్యారు. బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన ప్లేఆఫ్‌కు ఒక ఆటగాడు తక్కువ కావడంతో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జే లెంటెన్ను తుది జట్టులో ఆడించింది. అయితే మొయిసిస్ హెన్రిక్స్ సారధ్యంలోని సిడ్నీ సిక్సర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. పెర్త్ స్కార్చర్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. చదవండి: BBL 2021-22: మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?! ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు డేనియల్ క్రిస్టియన్ ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు.'' పెర్త్ స్కార్చర్స్‌తో శుక్రవారం బీబీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. మా జట్టులో కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌కు సరైన ఆటగాళ్లు లేరు.. మాకు కరోనా లేని ఆటగాళ్లు ఫైనల్ ఆడేందుకు కావాలి.. వస్తే వారికి ఫ్రీగా బీర్ కొనిపెడతా. మార్వెల్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు మా వార్మప్ ప్రారంభమవుతుంది. ఈలోపు వస్తే జట్టులో చోటుతో పాటు కప్ గెలిచిన తర్వాత ఫ్రీ బీర్ తాగొచ్చు. కానీ ఒక కండీషన్.. టెస్టు క్రికెటర్లకు మాత్రం చాన్స్ లేదు'' అంటూ ట్వీట్ చేశాడు. డేనియల్ క్రిస్టియన్ ఫన్నీ ట్వీట్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లు స్పందించారు. ''ఫైనల్ ఆడేందుకు నేను సిద్ధం.. కానీ బౌలింగ్‌లో 4 ఓవర్ల కోటా బౌలింగ్‌కు గ్యారంటీ ఇస్తానంటేనే..'' అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు. '' సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడేందుకు కూడా రెడీ.. కానీ మీకు ఆల్రేడీ ఉన్న సబ్‌స్టిట్యూట్‌లకు డబ్బులు చెల్లించాలేమో'' అంటూ ఆర్చర్ రీట్వీట్ చేశాడు. చదవండి: Racial Discrimination: ఆ క్లబ్లో నల్లజాతి క్రికెటర్లకు చోటు లేదా? ఇదేం వివక్ష ఇక డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగపెట్టింది. ఇప్పటికే మూడుసార్లు బీబీఎల్ టైటిల్(2011, 2020,2021) దక్కించుకున్న సిడ్నీ సిక్సర్స్.. తాజాగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. Shout out to anyone* in Melbourne that wants a game of cricket tomorrow night. My team is struggling to get 11 covid free, fit players on the park. Warm up starts at 6.30pm at Marvel Stadium. Free beer afterwards, potentially out of a large cup. DM if keen *no test cricketers — Dan Christian (@danchristian54) January 27, 2022 -
Daniel Christian: ఆర్సీబీని ముంచేశారు కదరా; ప్లీజ్.. నా భార్యను వదిలేయండి!
Daniel Christian and his partner face flak on social media: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు డేనియల్ క్రిస్టియాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్యను వేధించవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఆమెను వదిలేయమంటూ అర్థించాడు. ‘‘నా భాగస్వామి ఇన్స్టాగ్రామ్ పోస్టుకు సంబంధించిన ఆ కామెంట్లు చూడండి. నిన్నటి మ్యాచ్‌లో నేను బాగా ఆడలేదు. కానీ ఆటను ఆటలాగే చూడండి. దయచేసి తనను వదిలేయండి’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రిస్టియాన్ వేసిన 12వ ఓవర్లో 3 సిక్స్‌లతో కేకేఆర్ ఆటగాడు నరైన్ 22 పరుగులతో చెలరేగడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఫలితంగా కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయం పాలైంది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు క్రిస్టియాన్, అతడి భార్య డియానా అట్సలాస్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డియానా డాన్ క్రిస్టియాన్కే.. అసలు ఏం చేశావమ్మా... ఆర్సీబీని పుట్టిముంచేశారు’’ అంటూ అభ్యంతరకర పదజాలంతో దూషించారు. అంతేగాకుండా.. ‘‘ఈ సీజన్లో మొదటిసారి క్రిస్టియన్ స్కోరు.. ఒకటి దాటిందిరోయ్. గ్రేట్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘క్రిస్టియాన్ భార్యతో ఈ మ్యాచ్‌కు సంబంధమే లేదు. అలాంటప్పుడు ఆమెను ఎందుకు విమర్శిస్తున్నారు. తను ప్రస్తుతం గర్భవతి అనుకుంటా. పాపం వాళ్లను మానసికంగా వేధించకండి’’అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా సోమవారం నాటి మ్యాచ్‌లో క్రిస్టియన్ 8 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేశాడు. 1.4 ఓవర్లలో.. 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక క్రిస్టియాన్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఆర్సీబీ మరో ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: రషీద్ ఖాన్ టాప్-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే! And The Player Of The Match Award Goes To De Dana Dan Christian ;#RCBvsKKR pic.twitter.com/y2HO3whDOW — Akhandbarbaadi (@akhandbarbaadi) October 11, 2021 Low life people abusing Dan Christian's wife on her insta page !! (She is pregnant too) She is no where related to her man's performance ! For this sick attitude only their favourites are being lost Everytime !! Shovel up low life #RCB-ians👎 — Karthick Shivaraman (STAY SAFE😷) (@iskarthi_) October 11, 2021 -
డానియల్‌కు ఆర్సీబీ వార్నింగ్.. ఆ వీడియో తీసేశారు!
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా తన ఆటకన్నా ఒక వీడియో ద్వారా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు ఆసీస్‌కు చెందిన ఆర్సీబీ ప్లేయర్ డానియల్ క్రిస్టియన్. ‘ ద గ్రేడ్ క్రికెటర్’ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తమ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ కంటే డబ్యూటీసీ(వరల్డ్ టెస్టు చాంపియన్) ఫైనల్ ముఖ్యమని ఇప్పుడు దానిపైనే కన్నేశాడన్నాడు. ఆ క్రమంలోనే న్యూజిలాండ్ క్రికెటర్ జెమీసన్ వద్ద ఉన్న డ్యూక్ బాల్స్‌ను వేయమని కోరినట్లు తెలిపాడు. అదే సమయంలో దానికి జెమీసన్ నిరాకరించాడన్నాడు. మరొకవైపు ఆర్సీబీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరుకావడం లేదని, ఏదో కొన్నింటికి మాత్రమే వస్తున్నాడని ఆ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఒక జట్టు కెప్టెన్‌ను అవమానపరిచేలా ఉన్న ఆ వీడియోపై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టియన్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వీడియోను యూట్యూబ్ చానల్ నుంచి డిలీట్ చేయమని క్రిస్టియన్ స్వయంగా ‘ద గ్రేడ్ క్రికెటర్’కు విన్నవించుకున్నాడు. ఆ చానల్ హోస్ట్ అయిన సామ్ పెర్రీని ఆ వీడియోను తీసేయమని క్రిస్టియన్ అభ్యర్థించాడట. ఈ విషయాన్ని సామ్ పెర్రీ తెలుపుతూ.. ‘ మాకు క్రిస్టియన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తీసేయమని కోరాడు. ఇది ఐపీఎల్ నిబంధనల కాంట్రాక్ట్ ఉల్లంఘనలో భాగమట. అందుకు ఆ వీడియోను యూట్యూబ్ చానెల్లో వద్దన్నాడు. డానియల్‌పై గౌరవంతో దాన్ని తీసేశాం’ అని పెర్రీ తెలిపారు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్-న్యూజిలాండ్ జట్లు మాంచెస్టర్ వేదికగా డబ్యూటీసీ ఫైనల్లోతలపడనున్నాయి. జెమీసన్ న్యూజిలాండ్ క్రికెటర్ కావడంతో పాటు అక్కడ డ్యూక్ బాల్స్‌ను వినియోగించనున్నారు. ఇక్కడ చదవండి: అదీ కెప్టెన్ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా! IPL 2021: షర్ట్లు విప్పేసి మరీ హంగామా చేశారు! 'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే'