Photo Courtesy: RCB's Twitter
న్యూఢిల్లీ: గత కొన్నిరోజులుగా తన ఆటకన్నా ఒక వీడియో ద్వారా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు ఆసీస్‌కు చెందిన ఆర్సీబీ ప్లేయర్ డానియల్ క్రిస్టియన్. ‘ ద గ్రేడ్ క్రికెటర్’ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగింది. తమ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఐపీఎల్ కంటే డబ్యూటీసీ(వరల్డ్ టెస్టు చాంపియన్) ఫైనల్ ముఖ్యమని ఇప్పుడు దానిపైనే కన్నేశాడన్నాడు. ఆ క్రమంలోనే న్యూజిలాండ్ క్రికెటర్ జెమీసన్ వద్ద ఉన్న డ్యూక్ బాల్స్‌ను వేయమని కోరినట్లు తెలిపాడు. అదే సమయంలో దానికి జెమీసన్ నిరాకరించాడన్నాడు.
మరొకవైపు ఆర్సీబీ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరుకావడం లేదని, ఏదో కొన్నింటికి మాత్రమే వస్తున్నాడని ఆ ఇంటర్య్యూలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఒక జట్టు కెప్టెన్‌ను అవమానపరిచేలా ఉన్న ఆ వీడియోపై ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టియన్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆ వీడియోను యూట్యూబ్ చానల్ నుంచి డిలీట్ చేయమని క్రిస్టియన్ స్వయంగా ‘ద గ్రేడ్ క్రికెటర్’కు విన్నవించుకున్నాడు. ఆ చానల్ హోస్ట్ అయిన సామ్ పెర్రీని ఆ వీడియోను తీసేయమని క్రిస్టియన్ అభ్యర్థించాడట.
ఈ విషయాన్ని సామ్ పెర్రీ తెలుపుతూ.. ‘ మాకు క్రిస్టియన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తీసేయమని కోరాడు. ఇది ఐపీఎల్ నిబంధనల కాంట్రాక్ట్ ఉల్లంఘనలో భాగమట. అందుకు ఆ వీడియోను యూట్యూబ్ చానెల్‌లో వద్దన్నాడు. డానియల్‌పై గౌరవంతో దాన్ని తీసేశాం’ అని పెర్రీ తెలిపారు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్-న్యూజిలాండ్ జట్లు మాంచెస్టర్ వేదికగా డబ్యూటీసీ ఫైనల్లోతలపడనున్నాయి. జెమీసన్ న్యూజిలాండ్ క్రికెటర్ కావడంతో పాటు అక్కడ డ్యూక్ బాల్స్‌ను వినియోగించనున్నారు.
ఇక్కడ చదవండి: అదీ కెప్టెన్ అంటే: కోహ్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
IPL 2021: షర్ట్‌లు విప్పేసి మరీ హంగామా చేశారు!
'జాగ్రత్త.. సెహ్వాగ్‌కు తెలిసిందో ఇక అంతే'
Comments
Please login to add a commentAdd a comment