విధ్వంసం సృష్టించిన విండీస్‌ బ్యాటర్‌.. 44 బంతుల్లో శతకం | Legends Cricket Trophy 2024: Chadwick Walton Smashes 44-Ball Hundred | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన విండీస్‌ బ్యాటర్‌.. 44 బంతుల్లో శతకం

Published Mon, Mar 18 2024 9:17 PM | Last Updated on Tue, Mar 19 2024 10:51 AM

Legends Cricket Trophy 2024: Chadwick Walton Smashes 44 Ball Hundred - Sakshi

లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో విండీస్‌ ఆటగాడు చాడ్విక్‌ వాల్టన్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ లీగ్‌లో న్యూయార్క్‌ సూపర్‌స్టార్‌ స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాడ్విక్‌.. కొలొంబో లయన్స్‌తో ఇవాళ (మార్చి 18) జరుగుతున్న మ్యాచ్‌లో 44 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న చాడ్విక్‌.. 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు.

చాడ్విక్‌తో పాటు అల్విరో పీటర్సన్‌ (49) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూయార్క్‌ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో కపూగెదెర (17 నాటౌట్‌) రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో న్యూయార్క్‌ 200 పరుగుల మార్కును క్రాస్‌ చేసింది. కొలొంబో లయన్స్‌ బౌలర్లలో రాణా నయీమ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సిరివర్దన ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో లయన్స్‌... 8.1 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. దమ్మిక ప్రసాద్‌ (1-0-6-2), రాహుల్‌ శర్మ (2.1-0-10-2) అసేల గుణరత్నే (2-0-6-1), జేరోమ్‌ టేలర్‌ (2-0-18-1) కొలొంబో లయన్స్‌ పతనాన్ని శాశిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో విజేత రేపు జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ డెవిల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ డెవిల్స్‌కు సురేశ్‌ రైనా సారథ్యం వహిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement