Legends T20
-
వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాకిస్తాన్
పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 12) సాయంత్రం జరిగిన తొలి సెమీస్‌లో పాక్ టీమ్.. వెస్టిండీస్ ఛాంపియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యూనిస్ ఖాన్ (65), కమ్రాన్ అక్మల్ (46), ఆమెర్ యామిన్ (40 నాటౌట్), సోహైల్ తన్వీర్ (33) సత్తా చాటగా.. షాహిద్ అఫ్రిది (1), షోయబ్ మాలిక్ (0), మిస్బా ఉల్ హక్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్ 3, సులేమాన్ బెన్ 2, జెరోమ్ టేలర్, డ్వేన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఆష్లే నర్స్ (36) టాప్ స్కోరర్‌గా కాగా.. డ్వేన్ స్మిత్ (26), క్రిస్ గేల్ (22), రయాద్ ఎమ్రిట్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సోహైల్ ఖాన్ 4, వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. -
సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్, వెస్టిండీస్.. రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ రెండు మ్యాచ్‌లు రేపు నార్తంప్టన్ వేదికగా జరుగనున్నాయి. భారతకాలమానం ప్రకారం తొలి సెమీస్ సాయంత్రం 5 గంటలకు.. రెండో సెమీస్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి.కాగా, దిగ్గజ క్రికెటర్లతో కూడిన ఆరు దేశాలు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాల్గొన్నాయి. వీటిలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, భారత్ సెమీస్‌కు చేరగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇంటిబాట పట్టాయి. నిన్న సౌతాఫ్రికా ఛాంపియన్స్, భారత ఛాంపియన్స్ మ్యాచ్‌తో తొలి దశ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడినా సెమీస్‌కు చేరింది (మెరుగైన రన్‌రేట్ కారణంగా).దీనికి ముందు జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా రికార్డు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 20 ఓవర్లలో 274 పరుగులు చేయగా.. విండీస్ సైతం గట్టిగానే పోరాడి 219 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్ ఇంటిబాట పట్టింది. -
అన్నపై అసహనం వ్యక్తం చేసిన ఇర్ఫాన్ పఠాన్
రామ లక్షణుల్లా కలిసి మెలిసి ఉండే పఠాన్ సోదరులు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సందర్భంగా మాటా మాటా అనుకున్నారు. రనౌట్ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొద్ది సేపటికే అది సమసిపోయింది. అన్మదమ్ములిద్దరు మ్యాచ్ అనంతరం మైదానంలో కలియతిరిగారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ గెలిచే స్థితిలో ఉండింది. భారత్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి ఉండింది. క్రీజ్‌లో ఇర్ఫాన్ పఠాన్ (34), యూసఫ్ పఠాన్ (36) ఉన్నారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉండగా.. భారత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. A heated moment between Pathan brothers at WCL.India Champions needed 21 runs in the last 12 balls to qualify for Semi Finals. pic.twitter.com/hgIbhCtGFq— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024అయితే 18వ ఓవర్ చివరి బంతికి ఇర్ఫాన్ భారీ షాట్‌కు ప్రయత్నించి, అది విఫలం కావడంతో రెండు పరుగులు తీయాలని ప్రయత్నించాడు. రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో పఠాన్ సోదరుల మధ్య సమన్వయం లోపించడంతో ఇర్ఫాన్ రనౌటయ్యాడు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఇర్ఫాన్.. అన్న యూసఫ్ పఠాన్‌పై అసహనం వ్యక్తం చేసి గట్టిగా అరిచాడు. ఇందుకు యూసఫ్‌కు కూడా ప్రతిగా స్పందించాడు. అన్నదమ్ముల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. స్నైమ్యాన్ (73), రిచర్డ్ లెవి (60) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్బజన్ సింగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. సౌతాఫ్రికా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూసఫ్ పఠాన్ (54 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (35) భారత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచినా సెమీస్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ సెమీస్‌కు చేరింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, భారత్ సెమీస్‌కు చేరగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇంటిబాట పట్టాయి. -
చెలరేగిన బ్యాటర్లు.. విండీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా ఇవాళ (జులై 9) వెస్టిండీస్ ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఇయాన్ బెల్ (64 బంతుల్లో 97; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రవి బొపారా (30 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెవిన్ పీటర్సన్ (19 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యుల్ బద్రీ, జేరోమ్ టేలర్, ఆష్లే నర్స్, డారెన్ స్యామీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. చాడ్విక్ వాల్టన్ (42 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో 19.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో సమిత్ పటేల్ 2, రవి బొపారా, ఉస్మాన్ అఫ్జల్, సైడ్ బాటమ్ తలో వికెట్ పడగొట్టారు.మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడుతున్నాయి. -
క్రిస్ గేల్ ఊచకోత..వయసు మీద పడినా అదే జోరు
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ ఉన్నతిలో ఎలా విధ్వంసం సృష్టించాడో, లేటు వయసులోనే అదే తరహాలో రెచ్చిపోతున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ది బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.THE CHRIS GAYLE SHOW IN WCL. 🐐70 (40) with 4 fours and 6 sixes - the vintage Universe Boss at the Edgbaston Stadium, he's hitting them cleanly. 🌟 pic.twitter.com/jM5O2Lt7uo— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్), డేన్ విలాస్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి 20, నీల్ మెక్కెంజీ 0, జాక్ కలిస్ 18, జస్టిన్ ఓంటాంగ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జేసన్ మొహమ్మద్ 2, శామ్యూల్ బద్రీ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. క్రిస్ గేల్, చాడ్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డ్వేన్ స్మిత్ 22, జోనాథన్ కార్టర్ 6, ఆష్లే నర్స్ 0 పరుగులకు ఔట్ కాగా..వెర్నన్ ఫిలాండర్ 2, లాంగ్వెల్డ్త్, మెక్ కెంజీ తలో వికెట్ పడగొట్టారు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆరు జట్లు (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) పాల్గొంటున్న విషయం తెలిసిందే. జులై 3న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగాయి. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆతర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. అన్ని జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 35 బంతుల్లో..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంప్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రవి బొపారా (3/9), ఓవైస్ షా (3/23), అజ్మల్ షహజాద్ (2/17), ర్యాన్ సైడ్‌బాటమ్ (1/16), స్కోఫీల్డ్ (1/22) ధాటికి 19.2 ఓవర్లలో 137 పరుగలకే కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెర్షల్ గిబ్స్ (26), మెక్లారెన్ (22), క్లెయిన్వెల్డ్ట్ (21) మాత్రమే 20 పరుగుల స్కోర్‌ను దాటగలిగారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు కెవిన్ పీటర్సన్ (11 బంతుల్లో 28; ఫోర్, 4 సిక్సర్లు), ఫిల్ మస్టర్డ్ (35 బంతుల్లో 84 నాటౌట్; 35 బంతుల్లో 84; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోవడంతో 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఇంగ్లండ్ కోల్పోయిన ఏకైక వికెట్ క్లెయిన్వెల్డ్ట్కు (పీటర్సన్) దక్కింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా రెండో విజయం.ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా ఇవాళ (జులై 5) మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు జరుగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ఐసీసీ సభ్య దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్.. ఈసారి విండీస్‌పై విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన పాక్.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది. బర్మింగ్హమ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్ 29 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన విండీస్ 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమతమై ఓటమిపాలైంది.రాణించిన షోయబ్ మాలిక్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ షోయబ్ మాలిక్ (41 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్), షర్జీల్ ఖాన్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆమిర్ యామిన్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్ 2, శామ్యుల్ బద్రీ, జేరోమ్ టేలర్, సులేమాన్ బెన్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన సోహైల్ తన్వీర్.. సత్తా చాటిన అఫ్రిది195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. సోహైల్ తన్వీర్ (4-0-14-4), షాహిద్ అఫ్రిది (3/31), వాహబ్ రియాజ్ (2/18) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (46 బంతుల్లో 65;8 ఫోర్లు, 2 సిక్సర్లు), జోనాథన్ కార్టర్ (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా ఉపయోగం లేకుండా పోయింది. -
రాణించిన యూనిస్ ఖాన్, మిస్బా.. ఆసీస్‌పై పాక్ విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 2024లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రాణించిన ఫించ్టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కౌల్టర్ నైల్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. బెన్ డంక్ (27), ఫెర్గూసన్ (26 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సోహైల్ తన్వీర్, వాహబ్ రియాజ్, సయీద్ అజ్మల్ తలో వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన మిస్బా, యూనిస్190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కెప్టెన్ యూనిస్ ఖాన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిస్బా ఉల్ హక్ (30 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో షోయబ్ మక్సూద్ (21), షోయబ్ మాలిక్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ, కౌల్టర్ నైల్ చెరో 2 వికెట్లు.. జేవియర్ దోహర్తి ఓ వికెట్ పడగొట్టారు. -
యువరాజ్ సింగ్ పోరాటం వృధా.. లెజెండ్స్ టైటిల్ నెగ్గిన ఉతప్ప జట్టు
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్‌ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు. -
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్.. 44 బంతుల్లో శతకం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ లీగ్‌లో న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చాడ్విక్.. కొలొంబో లయన్స్‌తో ఇవాళ (మార్చి 18) జరుగుతున్న మ్యాచ్‌లో 44 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 46 బంతులు ఎదుర్కొన్న చాడ్విక్.. 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. చాడ్విక్తో పాటు అల్విరో పీటర్సన్ (49) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో కపూగెదెర (17 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో న్యూయార్క్ 200 పరుగుల మార్కును క్రాస్ చేసింది. కొలొంబో లయన్స్ బౌలర్లలో రాణా నయీమ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరివర్దన ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కొలొంబో లయన్స్... 8.1 ఓవర్లలో 54 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. దమ్మిక ప్రసాద్ (1-0-6-2), రాహుల్ శర్మ (2.1-0-10-2) అసేల గుణరత్నే (2-0-6-1), జేరోమ్ టేలర్ (2-0-18-1) కొలొంబో లయన్స్ పతనాన్ని శాశిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో విజేత రేపు జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ డెవిల్స్‌తో తలపడనుంది. ఢిల్లీ డెవిల్స్‌కు సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్నాడు. -
సిక్సర్ల మోత మోగించిన రాబిన్ ఉతప్ప.. కేవలం 34 బంతుల్లోనే..!
శ్రీలంకలో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024లో భాగంగా దుబాయ్ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ కింగ్స్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఉతప్ప సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఉతప్పతో పాటు హమిల్టన్ మసకద్జ (19 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతురంగ డిసిల్వ (19 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో పెరీరా (16 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కింగ్స్ నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. దుబాయ్ బౌలర్లలో పవన్ సుయాల్,సెక్కుగే ప్రసన్న, సచిత్ పతిరణ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో రాబిన్ ఉతప్ప భీకర ఫామ్‌లో ఉన్నాడు. 6 మ్యాచ్‌ల్లో నాలుగు అర్దసెంచరీలు సాధించాడు. -
26 బంతుల్లో బౌండరీ, 10 సిక్సర్లతో వీరవిహారం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా పట్నా వారియర్స్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాంప్స్.. పునీత్ కుమార్ (26 బంతుల్లో 78 నాటౌట్; ఫోర్, 10 సిక్సర్లు), భాను సేథ్ (21 బంతుల్లో 43; 6 సిక్సర్లు), గౌరవ్ తోమర్ (43 బంతుల్లో 86; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. ఛాంప్స్ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఛాంప్స్ బౌలర్లు పర్వీన్ థాపర్ 3, గౌరవ్ తోమర్, రమన్ దత్తా, తిలకరత్నే దిల్షన్ తలో 2 వికెట్లు, ముకేశ్ సైనీ ఓ వికెట్ పడగొట్టారు. వారియర్స్ ఇన్నింగ్స్ 9వ నంబర్ ఆటగాడు ప్రవీణ్ గుప్తా (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, మొత్తం 6 జట్టు పాల్గొంటున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో చండీఘడ్ ఛాంప్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఛాంప్స్ తర్వాత ఇండోర్ నైట్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) రెండులో, వైజాగ్ టైటాన్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు), గౌహతి అవెంజర్స్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), పట్నా వారియర్స్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), నాగ్‌పూర్ నింజాస్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
రిచర్డ్ లెవి విధ్వంసం వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలకరత్నే దిల్షన్
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ నింజాస్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో చండీఘడ్ ఛాంప్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నింజాస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛాంప్స్ మరో 9 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నింజాస్ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (29 బంతుల్లో 71; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలకరత్నే దిల్షన్ (46 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఛాంప్స్ను విజయతీరాలకు చేర్చాడు. దిల్షన్‌కు మరో ఎండ్‌లో గౌరవ్ తోమర్ (50) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో సహకరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతిలోనూ (2/40) చెలరేగిన దిల్షన్.. కీలకమైన రిచర్డ్ లెవి, అభిమన్యు వికెట్లు పడగొట్టాడు. నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో గౌహతి అవెంజర్స్- వైజాగ్ టైటాన్స్.. పట్నా వారియర్స్-ఇండోర్ కింగ్స్ తలపడగా అవెంజర్స్, ఇండోర్ నైట్స్ జట్లు విజయం సాధించాయి. అవెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 78 పరుగులకే చాపచుట్టేయగా.. అవెంజర్స్ 7.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేయగా.. ఇండోర్ నైట్స్ మరో ఓవర్ మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. సురేశ్ రైనా సారధ్యం వహిస్తున్న ఇండోర్ నైట్స్ టీమ్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లు కాగా.. దిల్షన్ మునవీర (53), పర్విందర్ సింగ్ (31) పోరాడి గెలిపించారు. -
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023.. ఇండియా, ఆసియా కెప్టెన్లుగా బద్ద శత్రువులు
మార్చి 10 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్‌లో పాల్గొనబోయే ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ జట్లు తమ కెప్టెన్ల పేర్లను నిన్న (మార్చి 1) ప్రకటించాయి. ఆసియా లయన్స్‌కు షాహిద్ అఫ్రిది, వరల్డ్ జెయింట్స్‌కు ఆరోన్ ఫించ్, ఇండియా మహారాజాస్‌కు గౌతమ్ గంభీర్‌ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జట్లు అనౌన్స్ చేశాయి. ఈ లీగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్, తిలకరత్నే దిల్షాన్, క్రిస్ గేల్, బ్రెట్ లీ తదితర లెజెండ్స్ ఆడనున్నారు. ఆసియా లయన్స్‌కు సారధ్యం వహించనున్న షాహిద్ అఫ్రిది.. ఎల్ఎల్సీలో తొలిసారి ఆడుతుండగా.. ఇండియా మహారాజాస్ సారధి గౌతమ్ గంభీర్ 2022 ఎల్ఎల్సీ సీజన్లో ఇండియా క్యాపిటల్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అఫ్రిది-గంభీర్.. వారు క్రికెట్ ఆడుతున్న జమానా నుంచి ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బద్ద శత్రువులుగా ఉన్నారు. కాగా, ఎల్ఎల్సీ 2023 సీజన్ మ్యాచ్‌లు మార్చి 10 నుంచి 20 వరకు ఖతార్‌లోని దోహాలో ఉన్న ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఎల్ఎల్సీ 2022 సీజన్ విజేతగా ఇండియా క్యాపిటల్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో క్యాపిటల్స్.. బిల్వారా కింగ్స్‌పై 104 పరుగుల తేడాతో విజయం సాధంచి, టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియా క్యాపిటల్స్ ఆటగాడు రాస్ టేలర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. టేలర్‌కు జతగా.. మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (19 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరంలో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ జట్టు.. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయంపాలైంది. -
ఇండియా లెజెండ్స్‌తో సౌతాఫ్రికా దిగ్గజాల 'ఢీ'
బీసీసీఐ సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2 ఇవాల్టి (సెప్టెంబర్ 10) నుంచి ప్రారంభంకానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నేటి నుంచి ఆక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రడూన్ వేదికలుగా జరుగనుంది. ఈ సీజన్ ఆరంభం మ్యాచ్‌లో ఇవాళ ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ తలపడనున్నాయి. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా లెజెండ్స్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సారధ్యంలో మరోసారి బరిలోకి దిగనుండగా.. సౌతాఫ్రికా లెజెండ్స్ దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ నేతృత్వంలో పోటీపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ సినీప్లెక్స్ హెచ్డీ, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్, స్పోర్ట్స్18 ఖేల్ ఛానల్లు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో జరిగే 23 మ్యాచ్‌లు పై పేర్కొన్న ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వీటితో ఈ సిరీస్‌లోని మొత్తం మ్యాచ్‌లను వూట్ యాప్, వెబ్సైట్లో కూడా చూడవచ్చు. దిగ్గజాల పోరును ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ సిరీస్‌లో ఇండియా, సౌతాఫ్రికా లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి. రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తొలి ఎడిషన్‌లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. జట్ల వివరాలు.. ఇండియా లెజెండ్స్: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన్ ఓజా (వికెట్‌కీపర్), యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, మన్‌ప్రీత్ గోని, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, ప్రగ్యాన్ ఓజా, బాలసుబ్రమన్యమ్, రాహుల్ శర్మ, రాజేశ్ పవార్ సౌతాఫ్రికా లెజెండ్స్: జాంటీ రోడ్స్ (కెప్టెన్), మోర్నీ వాన్ విక్ (వికెట్‌కీపర్), అల్విరో పీటర్సన్, జాక్ రుడాల్ఫ్, హెన్రీ డేవిడ్స్, వెర్నాన్ ఫిలాండర్, జోహాన్ బోథా, లాన్స్ క్లూసనర్, జాండర్ డి బ్రూన్, మఖాయ ఎన్తిని, గార్నెట్ క్రుగర్, ఆండ్రూ పుట్టిక్, జోహాన్ వాండర్ వాత్, థండి షబలాల, ఎడ్డీ లీ, ల్యాడ్ నోరిస్ జోన్స్ చదవండి: సెంచరీ చేయకుండా మూడేళ్లు కొనసాగడం కోహ్లికే సాధ్యమైంది..! -
టీమిండియాను మరోసారి ముందుండి నడిపించనున్న సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం, భారత లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మరోసారి భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. సెప్టెంబర్ 10 నుంచి ఆక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రడూన్ వేదికలుగా జరిగే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2 కోసం ఇండియన్ లెజెండ్స్ జట్టుకు సచిన్ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దిగ్గజ జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎడిషన్‌లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ కూడా యాడ్ కావడంతో మొత్తం జట్ల సంఖ్య 8కి చేరింది. రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్లో సచిన్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2లో పాల్గొనే భారత జట్టు ఇదే.. సచిన్ టెండూల్కర్ (కెప్టెన్) రాజేశ్ పవార్ వినయ్ కుమార్ యూసఫ్ పఠాన్ నమన్ ఓజా సుబ్రమణ్యం బద్రీనాథ్ నోయల్ డేవిడ్ మన్‌ప్రీత్ గోని మునాఫ్ పటేల్ ప్రగ్యాన్ ఓజా ఇర్ఫాన్ పఠాన్ మహ్మద్ కైఫ్ యువరాజ్ సింగ్ చదవండి: టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే! -
సచిన్ టెండూల్కర్ కఠిన నిర్ణయం.. హర్ట్ అయిన అభిమానులు
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు షాకిచ్చాడు. త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా సచిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్ బరిలోకి దిగాల్సి ఉండింది. అయితే, ప్రస్తుతం లీగ్‌లో ఆడేందుకు సచిన్ నో చెప్పడంతో అభిమానలు హర్ట్ అయ్యారు. ఈ లీగ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు, డాషింగ్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు మరోసారి కలిసి బరిలోకి దిగబోతున్నారు. ఇండియా మహరాజాస్‌తో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు లీగ్‌లో పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు( ఆఫ్రిది, జయసూర్య, అక్తర్, మురళీధరన్ తదితరులు), వరల్డ్ జెయింట్స్ తరఫున ఆసియా ఏతర క్రికెటర్లు( జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పొలాక్, లారా తదితరులు) రంగంలోకి దిగనున్నారు. T 4152 - CORRECTION : Legends League Cricket T20 , FINAL promo .. apologies .. and regrets for any inconvenience caused .. the error was inadvertent .. 🙏🙏🙏#legendsleaguecricket #bosslogonkagame pic.twitter.com/Zo33KqZxKU — Amitabh Bachchan (@SrBachchan) January 8, 2022 ఈ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, గత రెండు సీజన్ల నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో యువీ, సచిన్, పఠాన్ సోదరులు మెరుపుల్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే లీగ్ ముగిసిన వెంటనే ఇండియా లెజెండ్స్‌లో చాలా మందికి కరోనా వైరస్ సోకింది. మొదట సచిన్, ఆ తర్వాత పఠాన్ సోదరులు, యువీ మహమ్మారి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సచిన్ ఈ ఏడాది లీగ్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్.. పది వికెట్ల కివీస్ బౌలర్ కూడా.. -
మరోసారి కలిసి బరిలోకి దిగనున్న సెహ్వాగ్, యువీ, భజ్జీ..
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు, డాషింగ్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు మరోసారి కలిసి బరిలోకి దిగబోతున్నారు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టుకు వీరంతా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియా మహరాజాస్‌తో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు( ఆఫ్రిది, జయసూర్య, అక్తర్, మురళీధరన్ తదితరులు), వరల్డ్ జెయింట్స్ తరఫున ఆసియా ఏతర క్రికెటర్లు( జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పొలాక్, లారా తదితరులు) రంగంలోకి దిగనున్నారు. ఈ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్..! -
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్..
Amitabh Bachchan: దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ క్రికెట్ లీగ్‌కు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బిగ్ బీనే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ లీగ్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. మైదానంలో దిగ్గజాల పోరాటాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఉన్నారని తెలిపాడు. కాగా, లెజెండ్స్ క్రికెట్ లీగ్‌ను 2022 జనవరిలో ఓమన్‌లోని అల్ అమీరట్ స్టేడియం వేదికగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. భారత్, ఆసియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్ల తరఫున భారత్, శ్రీలంక, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌కు చెందిన దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లు తెలియాల్సి ఉంది. చదవండి: Ashes 1st Test: ట్రావిస్ హెడ్ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్ -
వయసు పైబడినా వన్నె తగ్గలేదు..
రాయ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడిచినా.. దిగ్గజ ఆటగాళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మొన్న బంగ్లా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. నిన్న విండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రియాన్ లారా (49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఉపుల్ తరంగ(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్)లు సత్తా చాటాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్.. విండీస్ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా(53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరో వికెట్ తీశారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(53 నాటౌట్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తరంగాకు తోడుగా తిలకరత్నే దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ అడిన తరంగాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆదివారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్‌తో, బంగ్లా దిగ్గజాలు తలపడనున్నారు. -
లెజెండ్స్ లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధం
దుబాయ్: క్రికెట్ దిగ్గజాలు సచిన్, షేన్‌వార్న్ కలిసి ఏర్పాటు చేయబోతున్న లెజెండ్స్ టి20కి సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమైంది. ఈ ఇద్దరూ కలిసి దీనిని ఐసీసీ ముందు ఉంచారు. ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ను కలిసిన సచిన్, వార్న్ లీగ్ విధివిధానాలను వివరించారు. అమెరికాలో ఆగస్టు, సెప్టెంబర్లలో తొలి సిరీస్ జరగనుంది. న్యూయార్క్, లాస్ఏంజెల్స్, చికాగో నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫ్లింటాఫ్, బ్రెట్‌లీ, గంగూలీ, గిల్‌క్రిస్ట్, కలిస్, జయవర్ధనే, మెక్‌గ్రాత్ ఇప్పటికే ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. మూడున్నరేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే ఈ టోర్నీకి తమ అనుమతి అవసరం లేదని ఐసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మ్యాచ్‌లు ఏ దేశంలో నిర్వహిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి ఉంటే చాలని ప్రకటించారు. టోర్నీని ఐసీసీ దృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో సచిన్, వార్న్ తమ ప్రణాళికలను రిచర్డ్సన్కు వివరించినట్లు సమాచారం.